25, నవంబర్ 2016, శుక్రవారం

లోబడ్జెట్ పెళ్లి..!‘‘కెవ్వు.. ఎవడ్రా నువ్వు.. నా చెయ్యి పట్టుకున్నావ్.. ‘షీ టీమ్’ను పిలిచానంటే నీ తాట తీస్తారు.. పిచ్చి సన్నాసీ’’
‘‘చెంప ఛెల్లుమనిపించావేంటి డార్లింగ్? పెళ్లయ్యాక ఎలాగూ తప్పదు. నేను విఘ్నేష్‌ను.. ఇదిగో నా ఐడెండిటీ కార్డు. బ్యాంకులో టోకెన్ సంపాదించే సరికి ఇలా మారిపోయాను. మన పెళ్లికి విఘ్నాలన్నీ తొలగిపోయినట్టే. ఒకే కానె్వంట్, ఒకే కాలేజీ, ఒకే కంపెనీలో ఉద్యోగం, ఇప్పుడు ఒకే ఇంటి వారమవుతున్నాం. ఎన్ని ఇబ్బందులు ఉన్నా మనం ఒకటవుతున్నందుకు చాలా థ్రిల్లింగ్‌గా ఉంది డార్లింగ్’’
‘‘సారీ డియర్.. చెరిగిపోయిన జుట్టు, చిరిగి పోయిన షర్టు చూసి ఎవడో ఏబ్రాసి వెధవ చేయి పట్టుకున్నాడనుకున్నాను.’’
‘‘పర్లేదు... ఇక ఆ బ్యాంక్ మేనేజర్‌ని ఒప్పించామంటే మన పెళ్లికి గండాలన్నీ తీరినట్టే’’
‘‘డియర్.. అతివిశ్వాసం మంచిది కాదు. బాగా ప్రిపేర్ కా, ఇక్కడ పరీక్ష తప్పావంటే.. మన పని గోవిందా’’
‘‘ఎంసెట్‌లో టాప్ 100లో నిలిచాను.. నాకు ఈ ఇంటర్వ్యూ ఓ లెక్కనా డియర్’’
‘‘టోకెన్ నంబర్ 205’’
‘‘ ఆధార్ కార్డులో ముఖానికి, బ్యాంకు అకౌంట్‌లో ఉన్న ఫొటోకు, ఇపుడు మాకు ఎదురుగా కనిపిస్తున్న నీకు.. అస్సలు సంబంధం కనిపించడం లేదు. నువ్వేనా..? నిజం చెప్పు’’
‘‘దేశంలో 120 కోట్ల మందిలో ఏ ఒక్కరికీ ఆధార్‌కు, అసలు ముఖానికి సంబంధం ఉండదు సార్! తొక్కిసలాటలో ముఖం ఇలా అయింది’’
‘‘సర్లే.. చూస్తుంటే పనీ పాటా లేకుండా తిరిగే పోకిరిలా ఉన్నావ్! నీకు పిల్లనిచ్చే వాళ్లు కూడా ఉన్నారా? ’’
‘‘ఇన్ఫోసిస్‌లో పని చేస్తున్నాను సార్! రాణీ ఒకసారి ఇటురా! ఇదిగో సార్ అమ్మాయి. రాణి కూడా ఇన్ఫోసిస్‌లోనే పని చేస్తోంది..’’
‘‘ఏమ్మా.. ఇంత చక్కగా ఉన్నావ్! మీ వాళ్లకు ఇంతకు మించి మంచి సంబంధం కనిపించలేదా? ’’
‘‘మాది లౌ కమ్ అరేంజ్‌డ్ మ్యారేజీ సార్’’
‘‘సర్లే.. నువ్వు ఎలా చస్తే నాకేంటి కానీ.. నీ పెళ్లికి రెండున్నల లక్షల బ్యాంకు రిలీజ్ చేయాలంటే నేనడిగే ప్రశ్నలకు సూటిగా సమాధానం చెప్పాలి’’
‘‘అడగండి సార్.. పూర్తిగా ప్రిపేర్ అయ్యాను.’’
‘‘ఎలా.. అబద్ధం చెప్పాలనా? నిజం చెప్పాలంటే ప్రిపేర్ అవసరం లేదు. అబద్ధాలకే ప్రీపేర్ కావాలి’’
‘‘కాదు సార్.. పెళ్లికి సంబంధించి మంత్రాలతో సహా ప్రతి ఒక్కటీ ప్రిపేర్ అయ్యాను. నారాయణ కార్పొరేట్ కాలేజీలో ఇంటర్ చదివాను. ఏదైనా బట్టీ పట్టడం బాగా అలవాటైంది.’’
‘‘ ఏడ్చినట్టే ఉంది. నీ తెలివి. సర్లే కానీ ఈ రెండున్నర లక్షలతో ఏమేం చేస్తావో లెక్క చెప్పు’’
‘‘మంగళసూత్రానికి 15వేలు.. పూలదండలు, విస్తరాకులకు రెండువేలు.. పప్పుచారు, పెరుగు, బుడమకాయ తొక్కు..ఇది సార్ లెక్క’’
‘‘ఏడ్చి తుడుచుకున్నట్టు ఉంది నీ లెక్క. ఇదేం పెళ్లి బోడి పెళ్లి.. వంకాయ, ఆలుగడ్డ కూర లేని పెళ్లి కూడా ఒక పెళ్లేనా? నేనే అమ్మాయి తండ్రినైతే పెళ్లిలో వడ్డించే కూరగాయల జాబితా చూశాక చచ్చినా ఈపెళ్లికి ఒప్పుకోను’’
‘‘ సారీ సార్.. రెండున్నర లక్షల్లోనే ముగించాలి . ఇది లోబడ్జెట్ పెళ్లి సార్. ఇద్దరికీ మంచి సంపాదన. మామూలుగా అయితే బాహుబలి రేంజ్‌లో ఉండేది. నోట్ల రద్దు-50 రోజుల బంద్‌లో పెళ్లి కాబట్టి లోబడ్జెట్‌కు అడ్జస్ట్ కావలసి వస్తోంది’’
‘‘సరే.. నువ్వు కాసేపు పక్క గదిలో ఉండు. అమ్మాయితో నేను విడిగా మాట్లాడాలి’’
‘‘ఏమ్మా.. వీడు తప్ప నీకు ఇంకో శాల్తీ దొరక లేదా? ’’
‘‘మేం చిన్నప్పటి నుంచి ప్రేమించుకున్నాం సార్...తూనీగా తూనీగా పాట టైప్ ప్రేమకథ సార్ మాది. చిన్నప్పటి నుండి ‘బంగారం’ అంటూ వాడు ఎంతో ముద్దుగా పిలిచేవాడు. ఆ మాటకే పడిపోయాను.’’
‘‘వాడే కాదమ్మా.. ప్రతి అడ్డమైన వాడు ‘బంగారం’ అనే పిలుస్తాడు. అదేదో దిక్కుమాలిన సినిమాతో అందరికీ ఆ పదం అలవాటైంది’’
‘‘ఎవరేమన్నా విఘ్నేష్‌నే చేసుకుంటాను’’
‘‘మంచి కోరి పెద్దవాడిని చెబుతుంటే.. కాదు గొయ్యిలో పడతాను అంటే ఏం చెప్పగలను? కుందనపు బొమ్మలా చక్కగా ఉన్నావు. నాకు ఆడ పిల్ల ఉంటే అచ్చం ఇలానే ఉండేది. మీ తండ్రే నీ మంచి కోరి కాస్త కఠినంగా చెబితే వినవా? ’’
‘‘సార్.. మీకు ఆడపిల్లలు లేరా? ’’
‘‘లేరు.. ఒకడే మగ పిల్లవాడు. వాడి జీవితం అడవి కాచిన వెనె్నల అవుతుందేమో అని నా భయమమ్మా.. పెళ్లి చేసుకోరా! అంటే చదువు
పూర్తి కావాలన్నాడు. పాతికేళ్లు గడిచిపోయాయి. తర్వాత ఉద్యోగం అన్నాడు. సరే అన్నాను. రెండేళ్లకే మొదటి ఉద్యోగం ఊడింది. ఐటి కంపెనీలో ఉద్యోగం ఏ రోజు ఊడుతుందో? ఏ రోజు ఉంటుందో తెలియదు. కాస్త కుదురుకుని ఒక పొజీషన్‌కు వచ్చే సరికి వాడి వయసు 35కు వచ్చి కూర్చుంది. ‘నాన్నా.. పెళ్లి..’- అని ఇంటికి వెళ్లగానే వాడు అడుగుతుంటే ఈ తండ్రి హృదయం ఎంత విలవిల లాడుతుందో ఆలోచించు తల్లీ.. ఈ రోజుల్లో కనె్న పిల్లగాడు తల్లిదండ్రుల గుండెలమీద కుంపటిలా మారుతున్నాడు. ఇది నా ఒక్కడి బాధ కాదు తల్లీ.. నాలాంటి లక్షలాది మంది తండ్రుల ఆవేదన..’’
‘‘అంకుల్ ... . మీరు పెద్దవారు అలా ఏడవకండి.. గంతకు తగ్గ బొంత ఎక్కడో దొరక్కపోదు’’
‘‘ఆ బొంతవు నువ్వే ఎందుకు కాకూడదు తల్లీ.. సొంత ఇల్లుంది. ఊర్లో పొలం. మా వాడికి మంచి ఉద్యోగం.’’
‘‘సారీ .. నేను విఘ్నేష్‌కు మనసిచ్చాను. ఈ మనసులో ఇంకొకరికి స్థానం లేదు’’
‘‘ అంకుల్ అన్నావంటే ఆ మాట చాలు .. బ్యాంకులో దాచుకున్న ఫిక్స్‌డ్ డిపాజిట్‌కే దిక్కు లేదు. కనిపించని మనసుదేముందమ్మా..? వెనక్కి తీసుకో.. సరే ఎవరికీ చెప్పవద్దు.. నీకో గోల్డెన్ ఛాన్స్. వందనోట్ల కట్టలు మూడు ఇస్తాను. అంటే వంద రూపాయల నోట్లు మూడు వందలు ఇస్తాను. ఒక్క వందనోటు కోసమే జనం తపిస్తున్నారు. అలాంటిది మూడు వందల నోట్లు నీ వద్ద ఉంటే సమాజం నీకు ఇచ్చే గౌరవం ఎలా ఉంటుందో ఒక్కసారి ఆలోచించు’’
‘‘ అంకుల్ . మీరు నన్ను టెమ్ట్ చేస్తున్నారు. ఆలోచించుకొని చెబుతాను’’
‘‘విఘ్నేష్.. ఈ పెళ్లి సంబంధం మా బ్యాంక్‌కు నచ్చలేదు. నీ అప్లికేషన్ రిజెక్ట్ చేస్తున్నాను.’’
‘‘సార్ ఇది అన్యాయం ’’
‘‘ఎక్కువగా మాట్లాడితే రాజా ద్రోహం కేసు పెడతాను .. నేను ఒక సారి రిజెక్ట్ అంటే అంతే ప్రధాన మంత్రి , ఆర్థిక మంత్రి , ఆర్ బి ఐ గవర్నర్ ఈ ముగ్గురి కమిటీకి అప్పీల్ చేసుకో పో’’ 
***
విఘ్నేష్ పెళ్లికి విఘ్నం తొలగుతుందా?  ప్రధాని బృందం అతని అప్పీలును పట్టించు కొంటుందా ? ఆ అమ్మాయి  రాణి మనసు మారుతుందా? నవాబుల కాలంలో శుభకార్యాల ఖర్చులకు ప్రభుత్వ అనుమతి అవసరం ఉండేది. ఈ నిబంధనలను ఆర్‌బిఐ రద్దు చేసుకుంటుందా? ఎవరికీ ఏమీ తెలియదు. కాలమే చెబుతుంది. * 

- బుద్దా మురళి(జనాంతికం - 25. 11. 2016)

11, నవంబర్ 2016, శుక్రవారం

జంబలకిడి పంబ మంచిదే.’’

‘బ్రేకింగ్ న్యూస్.. నీకే ముందు చెబుతున్నా.. మా ఊరి పంచాయితీ వార్డ్ మెంబర్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ఇప్పుడే ప్రకటించాడు. పద్ధతులు మార్చుకుని అందరితో కలిసి పని చేయాలని, అమెరికా అభివృద్ధికి కృషి చేయాలని సూచించాడు’
‘‘ఏడ్చినట్టే ఉంది నీ బ్రేకింగ్ న్యూస్. పంచాయితీ వార్డు మెంబర్ ట్రంప్ గెలుపును గుర్తిస్తే ఎంత ? గుర్తించక పోతే ఎంత?’’
‘‘ఇదే మాట సిఎం అంటే మొదటి పేజీలో రాశారు. మరి ఆయన గుర్తిస్తే ఎంత? గుర్తించక పోతే ఎంత? సిఎం రాష్ట్రానికా? ప్రపంచానికా? ఇదే మాట నేనడిగితే పెద్దవాళ్ల మాటలు నీకెందుకు అంటావు?’’

‘‘ట్రంప్ ఇలా గెలిచేశాడేంటో? మనం ముందుగానే అనుకున్నట్టే మీడియా ప్రభావం తెలుగునాటనే కాదు అమెరికాలోనూ చాలానే ఉందిరా! మీడియా మొత్తం వ్యతిరేకిస్తే ప్రజలు సరిగ్గా దానికి భిన్నంగా తీర్పు చెబుతున్నారు.’’
‘‘ఏం జరిగినా మనం ఊహించినట్టే జరిగిందని చెప్పడం మామూలే కానీ, మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం , ట్రంప్ విజయం చూస్తే నీకేమనిపిస్తోంది?’’
‘‘నా అభిప్రాయం కన్నా ప్రముఖ జ్యోతిష్యులను, పండితులను అడిగితే బాగుండేది. జయలలిత మంచాన పడ్డా, కెసిఆర్ తుమ్మినా, చంద్రబాబు మనవడి బారసాల అయినా, చివరకు సోవియట్ రష్యా విచ్ఛిన్నం, జపాన్‌లో భూకంపం.. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా- ఇలా జరుగుతుందని మేం ముందే చెప్పాం.. అని చాలా మంది జ్యోతిష్య పండితులు చెప్పుకుంటారు. అలానే తూర్పున సూర్యుడు ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నందుకు, ఏడాదిలో 365 రోజులు ఉన్నందుకు, ఆదివారం ఎప్పుడూ ‘సండే’ నాడే వస్తున్నందుకు, శుక్రవారం నాడే ‘గుడ్ ఫ్రైడే’ వస్తున్నందుకు, ఆ నక్షత్రం అక్కడ, ఈ నక్షత్రం ఇక్కడ ఉన్నందుకు హిల్లరీ గెలుపు ఖాయం అని జ్యోతిష్యం చెప్పారు. తీరా ఇప్పుడు పండితుల జోస్యం, మీడియా జోస్యం తలకిందులై అమెరికా ఓటర్ల జోస్యం ఫలించి ట్రంప్ గెలిచాడు. తప్పిన జోస్యాల మాట ఎత్తకుండా, ఫలించిన జోస్యాల గురించి చెప్పుకుంటూ తమ మాటలకు తిరుగులేదని ప్రచారం చేసుకునే వారికి గడ్డు కాలమే. గ్రహిస్థితిని బట్టి చూస్తే ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు జ్యోతిష్యుల పాలిట గండంగా మారాయని స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లేం చెప్పారు, ఏం జరిగింది అని వీళ్లు అన్నీ తెరపైకి తీసుకు వస్తున్నారు.’’
‘‘ఇంతకూ వీటిపై నీకేమనిపిస్తోందో చెప్పు?’’

‘నాకైతే జంబలకిడి పంబ సినిమాలో అడవారు మందుకొట్టి పేకాడుతుంటే మగాళ్లు మంగళసూత్రం ధరించి చీరకట్టి ముగ్గులు వేయడం, వింతంతుడి వింత వేషం గుర్తుందా? ’’
‘‘ దానికి, దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘లోకధర్మానికి విరుద్ధంగా జరిగేదే- జంబలకిడి పంబ. ఎటిఎంలో మనం వందో,రెండు వందలో డ్రా చేసుకోవాలంటే- మనల్ని ఎవరైనా చూస్తున్నారా? అని సిగ్గుపడే వాళ్లం. జేబులో ఐదు వందలో వెయ్యో ఉంటే గర్వంగా ఫీలయ్యే వాళ్లం. ఒక్క దెబ్బతో సీన్ రివర్స్ అయింది. వెయ్యి నోటు పనికి రాదు, చేతిలో వంద నోటు లేదు. దీంతో హోటల్‌లో టిఫిన్ కూడా చేయలేక ఆకలితో గడిచిపోవడం .. డబ్బు లేనోడు రామ్‌రాజ్ లుంగీతో హీరోలా డ్యాన్స్ చేస్తుంటే, డబ్బున్నోడు ఎలా డిపాజిట్ చేయాలో తెలియక బిపి పెరిగి మంచాన పడుతుంటే లైవ్‌లో జంబలకిడి పంబ చూస్తున్నట్టుగా ఉంది. రెండు గంటల సినిమా కన్నా రోజుల తరబడి నడిచే ఈ లైవ్ సినిమా బాగుంది. హిల్లరీ తప్పక గెలుస్తుందని అమెరికా మీడియాను మించిపోయి- తెలుగు మీడియా హడావుడి చేస్తే తీరా ట్రంప్ సూపర్ మ్యాన్‌లా ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటే మీడియా బిక్క చచ్చిపోవడం చూస్తుంటే అంతా రివర్స్‌లో అవుతోందని ఆ సినిమా గుర్తుకొచ్చింది.’’
‘‘ హిల్లరీ ఎందుకు ఓడిపోయిందంటావ్?’’
‘‘ ఇక్కడున్న మనకు మీడియా వార్తలే ఆధారం. బహుశా మనలానే ఆమె కూడా మీడియా మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉంది? ట్రంప్ మీడియాను పట్టించుకోకుండా అమెరికా ప్రజలను నమ్ముకుని గెలిచేశాడు.’’
‘‘ఇప్పుడు ట్రంప్ మీడియా సంగతి చూస్తాడా? ’’
‘‘అమెరికా- ప్రపంచానికి పెద్దన్న, అలాంటి దేశానికి ఎన్నికైన వాడు ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. నా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావద్దు, నీ సంగతి తేలుస్తా.. అంటూ సిల్లీగా మన నేతల్లా ఆలోచించే పదవి కాదు అమెరికా అధ్యక్షుడు అంటే. ’’

‘‘మన వాళ్లను ట్రంప్ అమెరికా నుంచి తిరిగి పంపించేస్తాడేమో! ఐనా మనం లేకపోతే అమెరికా కుప్పకూలిపోతుంది? ఆ సాహసం చేస్తాడా? ’’
‘‘ నా కోడి కూయకపోతే తెల్లవారదని అనుకుందట వెనకటికి నీలాంటి ముసలవ్వ. మనవాళ్లేదో అమెరికాను ఆదుకోవడానికి అక్కడికి వెళ్లలేదు. ఇక్కడి కన్నా అక్కడ బతుకు తెరువు బాగుంటుందని డాలర్ల సంపాదనకు వెళతారు. రైల్వే స్టేషన్‌లో ఒక కూలీ కాక పోతే ఇంకో కూలీని మాట్లాడుకుంటాం.. ఇదే అంతే. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు ఉన్నత స్థాయిలోనే ఆలోచిస్తారు. వాళ్ల సమస్యల పరిష్కారం వాళ్లకు ముఖ్యం కానీ, మన కూలీలను ఉంచాలా? పంపించాలా? అని కాదు.’’
‘‘జేబులో ఏమైనా ఉందా? టిఫిన్ చేసొద్దాం’’
‘‘జేబులో ఏం లేకపోయినా పలుకుబడి ఉంది. మన వీధి టిఫిన్ సెంటర్‌లో అరువు ఉంటుంది లే! వాడి వద్ద ప్లాస్టిక్ కార్డుల సౌకర్యం లేకపోయినా మనిషిని నమ్మే బుద్ధి ఉంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా పెద్ద చెట్లు కూలిపోతాయేమో కానీ చిన్న మొక్కలు తాత్కాలికంగా తల వంచి అలానే నిలుస్తాయి. ‘హెరిటేజ్’ అమ్ముడు పోయింది కానీ ఇంటింటికి తిరిగి పాలు పోసే వాడు, కూరగాయలు అమ్మేవాడు అక్కడే ఉన్నారు. ఫరవాలేదు సార్ డబ్బులు వచ్చాక ఇవ్వండి అని మనం అడగక ముందే కిరాణా షాపు వాడు భరోసా ఇస్తే, వాడి నమ్మకం చూసి జేబులోని వెయ్యి నోటుతో చెంప మీద కొట్టినట్టు అనిపించింది. జీవితంలో అప్పుడప్పుడు ఇలా బలమైన దెబ్బలు తగిలితేనే మనం నేలపై ఉంటాం. జంబలకిడి పంబ కూడా ఒకందుకు మంచిదే.’’

‘రాష్టప్రతి పాలన, రాష్ట్ర విభజన, పెద్దనోట్ల రద్దు ఇవన్నీ చూసిన తరం మాదేనని పిల్లలకు రేపు కథలు కథలుగా చెప్పుకోగలిగిన తరం మనదే అవుతుంది. ఇదీ మంచిదే.. ’’ *

జనాంతికం - బుద్దా మురళి(11.11.2016)

‘జంబలకిడి పంబ’.. మంచిదే!

10, నవంబర్ 2016, గురువారం

పార్టీ మార్చిన ప్రజలు

‘‘ఇలా పార్టీలు మార్చడం అన్యాయం..’’
‘‘ఔను.. సుప్రీం కోర్టు కూడా ఇదే మాట చెప్పింది’’
‘‘నేను చెప్పింది అమెరికా గురించి’’
‘‘అక్కడ ఉన్నవే రెండు పార్టీలు. ఎలా మారుతారు?’’
‘‘ నేను చెప్పింది ప్రజల గురించి ’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్! ప్రజలు పార్టీలు మార్చడం ఏమిటి? ’’
‘‘చూడోయ్.. నిన్నమొన్నటి వరకు అన్ని సర్వేల్లో అమెరికా అధ్యక్ష బరిలో ఉన్న హిల్లరీ క్లింటన్ దూసుకెళ్లారు కదా? తీరా పోలింగ్ సమీపించే సరికి హిల్లరీ కన్నా ట్రంప్ ఒక్క శాతం ఓట్లతో ముందున్నాడని సర్వేలు తేల్చాయి. అంటే హిల్లరీకే ఓటు వేస్తామని నమ్మబలికిన ప్రజలు పార్టీ మార్చినట్టే కదా?’’
‘‘ఒకే పార్టీ శాశ్వతంగా నచ్చాలని లేదు. ప్రజలు పార్టీ మార్చారు అనకూడదు. అధికార పక్షానికి బుద్ధి చెప్పారు అనాలి’’
‘‘మనం ఎలా అన్నా ప్రజలు ఓటు వేసి గెలిపించి, మళ్లీ వాళ్లను ఓడించడం అంటే పార్టీ మారడమే. ఇంతకూ ట్రంప్ అనూహ్యంగా ఎందుకిలా దూసుకువచ్చాడని నువ్వనుకుంటున్నావ్?’’
‘‘అమెరికా రాజకీయాల్లో అనుభవజ్ఞురాలైన హిల్లరీ ముందు ట్రంప్ టుమ్రీలా వెలవెలబోతాడు అనుకుంటే మీడియా తెచ్చిన మార్పుతో మేరుపర్వతంలా హడలుగొట్టేస్తున్నాడు. ’’
‘‘అమెరికా మీడియా మొత్తం ట్రంప్‌ను ఉతికి ఆరేసింది కదా?’’
‘‘అదే ఆయనకు కలిసొచ్చింది. నాలుగైదు దశాబ్దాల క్రితం ఆయన కన్ను గీటాడు.. అని ఏ మహిళ చెప్పినా నానా హడావుడి చేసి ట్రంప్‌ను రావణాసురుడిగా చిత్రించాలని మీడియా చూస్తే- కష్టాల సుడిగుండంలో చిక్కుకున్న అమెరికాను కాపాడే వీరుడిగా ఓటర్లకు కనిపిస్తున్నాడు. తెలంగాణ, ఆంధ్ర, గుజరాత్.. అక్కడా ఇక్కడా అని కాదు ఇండియా, అమెరికా ఎక్కడైనా మీడియా తీవ్రంగా దాడి చేసినప్పుడు మనుషులు ఒకే రీతిన స్పందిస్తున్నారు. మధ్యంతరంగా గుజరాత్‌లో గాలికి ఊగిపోతున్న ప్రభుత్వాన్ని చేపట్టిన మోదీపై మీడియా దాడి మొదలు పెట్టగానే విజయవంతంగా గుజరాత్‌కు రెండోసారి సిఎం అయ్యారు. అంతర్జాతీయ స్థాయిలో మీడియా దాడి చేయగానే మోడీ ఏకంగా గుజరాత్ అసెంబ్లీ నుంచి పార్లమెంటులోకి ఫ్లై ఓటర్‌పై నుంచి ప్రయాణించినట్టు స్పీడ్‌గా వచ్చి ప్రధాన పీఠం చేరుకున్నారు.’’
‘‘మీడియా కావాలనే చేసిందంటావా?’’
‘‘దెబ్బతీయాలనుకుని మేలు చేసింది. అచ్చం తెలంగాణలో వలెనే. తెలంగాణ ఉద్యమం సమసిపోతుందని కెసిఆర్‌ను టార్గెట్ చేస్తే, తెలంగాణ ప్రజల కల నెరవేర్చే నాయకుడు కెసిఆరే అని ప్రజలు నిర్ణయించుకున్నారు. మీడియా ఒకటి చేయాలనుకుంటే ప్రజలు సరిగ్గా దానికి భిన్నంగా చేశారు. అది తెలంగాణలోనైనా, అమెరికాలోనైనా అంతే.’’
‘‘ట్రంప్ గెలుస్తాడంటావా?’’
‘‘పోటీలో లేడు.. ఓడిపోతాడు.. అని అంతా అనుకున్న నేత కాస్తా బస్తీమే సవాల్ అని తొడ కొడుతున్నాడు అని మాత్రం చెప్పగలను’’
‘‘అయ్యో హిల్లరీ ప్రమాణ స్వీకారానికి కాంచీవరం చీరలు కొని పెట్టుకున్న వాళ్లు ఏం కావాలి?’’
‘‘మళ్లీ అదే అమాయకత్వం.. పట్టు చీర ఎప్పుడూ పట్టు చీరే.. హిల్లరీ గెలిస్తే పట్టుచీరగా కనిపించింది- ట్రంప్ గెలిస్తే నార చీర అవుతుందా?’’
‘‘ అమెరికాలో గాడిద గెలిచినా కంచర గాడిద గెలిచినా మనకొచ్చే నష్టం లేదు. లాభం లేదు’’
‘‘ఐనా అమెరికాలో ఓ పార్టీ గుర్తు ‘గాడిద’ కదా.. చిత్రంగా లేదూ..’’
‘‘ఈసారి అమెరికా ఎన్నికల్లో ఇరువురు పోటీ దారులు దూషణలతో ఎన్నికలను, మున్సిపాలిటీ ఎన్నికల్లా మార్చి గాడిద గుర్తుకు సార్థకత చేకూర్చారు. నాయకులు గాడిదల్లా వ్యవహరిస్తుంటే అలవాటు పడ్డాం, పార్టీ గుర్తులో గాడిద ఉంటే చిత్రంగా అనిపించడమే విచిత్రం’’
‘‘పార్టీలు మారిన వారిపై కోర్టు చర్య తీసుకుంటుందా? స్పీకర్ తీసుకుంటారా? ’’
‘‘తప్పకుండా చర్య ఉంటుంది? వారి పదవీ కాలం ముగిసే రెండు మూడు రోజుల ముందు..’’
‘‘ఈ అన్యాయం ఇలా కొనసాగాల్సిందేనా?’’
‘‘పార్టీ మారడం ఆది, అంతం లేనిది. ఆది మధ్యాంత రహితం. పార్టీ మారడం ఒక్కోసారి మనకు ఒక్కోలా కనిపిస్తుంది. పశువుల్లా ఎమ్మెల్యేలను కొంటున్నారని తిట్టిన నాయకుడే అధికారంలోకి వచ్చాక అదే పని చేస్తాడు.’’
‘‘చట్టాలను మరింత కఠినం చేస్తే?’’
‘‘ చట్టాలు లేనప్పటి నుంచి ఉన్న ఈ ఆచారం చట్టాలతో మటుమాయం కాదు. పార్టీ మారని కాలం ఏదన్నా ఉందా? చెప్పు. అంత పెద్ద మహాభారత యుద్ధంలో సైతం అడుగడుగునా పార్టీ మార్పిడులే కదా? చివరకు యుద్ధానికి అంతా రెడీ అయ్యాక వంద మంది కౌరవుల్లో ఒకడు అప్పటికప్పుడు పార్టీ ఫిరాయించి పాండవుల పక్షం వెళ్లాడు. ఒక పార్టీలో ఉంటూ మరో పార్టీ కోసం పని చేసేవారు మహాభారతంలో లెక్కలేనంత మంది కనిపిస్తారు. రామాయణం కూడా అంతే కదా? నంబర్-2 గా ఎంత కాలం అని ఉంటాననే కదా? విభీషుణుడు సకాలంలో పార్టీ మారి యుద్ధం తరువాత లంకకు నంబర్ వన్ అయింది. ’’
‘‘ఆలోచిస్తే నాకూ అలానే అనిపిస్తుంది. రావణుడికి పది తలలు కదా? అందులో ఒకటి, రెండు తలలు పార్టీ మారితే ఏమయ్యోదో కదా? ’’
‘‘ఈ కాలంలో ఐతే అదే జరిగేది. ఆ కాలంలో పార్టీ మారడం మరీ అంతగా అభివృద్ధి చెందలేదు.’’
‘‘ పార్టీలు మారితేనే భవిష్యత్తు ఉంటుందా? ’’
‘‘అలా అన్ని సార్లు జరుగుతుందని చెప్పలేం. ఇందిరాకాంగ్రెస్ పుట్టినప్పుడు హేమాహేమీలు ఇందిరకు వ్యతిరేకంగా పార్టీ మారారు. వైఎస్‌ఆర్, చంద్రబాబు లాంటి కొత్తవాళ్లు ఇందిరాకాంగ్రెస్‌లో చేరారు. చివరకు హేమా హేమీలు ఇంటికి పోగా, ఇందిరాకాంగ్రెస్ పేరుతో గెలిచిన కుర్ర బ్యాచ్ ఇప్పటికీ ఉభయ రాష్ట్రాల్లో వెలిగిపోతోంది. మోతీలాల్ నెహ్రూ మొదలుకొని ప్రకాశం పంతులు, రోశయ్య, రంగా, చెన్నారెడ్డి, వారూ వీరు అని లేదు. పార్టీ మారని వారు లేరు. వీరిలో ఎన్టీఆర్‌ది మరీ చిత్రం. ఆయన పెట్టిన పార్టీనే వేరొకరు కొట్టేస్తే ఆయన మరో పార్టీ పెట్టుకోవడం ద్వారా పార్టీ మారారు.’’
‘‘పార్టీలు మారని కాలం అసలు వస్తుందా?’’
‘‘తప్పకుండా వస్తుంది?’’
‘‘ఎప్పుడు?’’
‘‘భూలోకం లో జీవ రాశి పూర్తిగా నశించినప్పుడు ’’