జనాంతికం లేబుల్‌తో ఉన్న పోస్ట్‌లను చూపుతోంది. అన్ని పోస్ట్‌లు చూపించు

31, మే 2023, బుధవారం
ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది . ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ... జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37
ఒక్క చెంప దెబ్బ తో అతని దశ తిరిగింది .
ఇద్దరి సీఎం ల అభిమానం పొందారు ...
జర్నలిస్ట్ జ్ఞాపకాలు -37
------------------//////-----------
జాతి రత్నాలు అంటూ ఎన్టీఆర్ ఫోటో చూపించి రెండవ స్థానం లో పరిటాల రవి ఫోటో చూపిస్తారు కొందరు . వన భోజనాలు , సమావేశాలుల్లో ఎన్టీఆర్ కటౌట్ తరువాత పరిటాల కటౌట్ కు అంతటి ప్రాధాన్యత ఉంటుంది .
అలాంటి పరిటాలను ఒక అధికారి చెంపదెబ్బ కొడితే ఎలా ఉంటుంది ?
ఏం మాట్లాడుతున్నావు ? పరిటాలను అధికారి చెంపదెబ్బ కొట్టడమా ?
ఔను చెంపదెబ్బ కొట్టడం ... అందులోనూ టీడీపీ అధికారం లో ఉన్నప్పుడు ...
ఇద్దరు సీఎంలు ఆదరించారా ?
ఔను చంద్రబాబు ,వై యస్ జగన్ మోహన్ రెడ్డి ... ఒకే సారి కాదు ఒకరి తరువాత ఒకరు అభిమానం చూపించారు .
95 ఆగస్టులో ఎన్టీఆర్ చైతన్య రథం పై పార్వతి తో కలిసి వైస్రాయ్ హోటల్ కు వచ్చారు . లోపలి వెళ్లి తమ్ముళ్ళతో మాట్లాడాలి అనుకున్నారు . కనిపిస్తే చాలు కాళ్ల మీద పడి పోతారు . ఉపన్యాసం ఇస్తే కాళ్ల మీద పడి కన్నీళ్లతో కాళ్ళు కడుగుతారు అనుకోని ఉండ వచ్చు . కానీ వాళ్ళు రాజకీయ నాయకులు ఎన్టీఆర్ లా కళాకారులు కాదు .
ఎన్టీఆర్ తన వాహనం తో పాటు వైస్రాయ్ లోకి రావడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకున్నారు . ఇంద్రారెడ్డి లోనికి వెళ్ళడానికి ప్రయత్నిస్తే పోలీసులు అడ్డుకొని తోసేశారు . నేను ఇంకా హోం మంత్రినే అని ఇంద్రారెడ్డి పోలీసులకు చెబుతున్నాడు . అక్కడ ముఖ్యమంత్రినే ఆపేశారు , హోం మంత్రి ఓ లెక్కనా అని అంత ఉద్రిక్త పరిస్థితి లోనూ నవ్వు వచ్చింది .
అప్పుడు కార్మిక శాఖ మంత్రిగా ఉన్న పరిటాల రవి గేటు తోసుకొని లోనికి వెళ్ళడానికి ప్రయత్నించారు . అక్కడ ఉన్న పోలీసు అధికారి ఇక్భా ల్ పరిటాల రవిని చెంప దెబ్బ కొట్టి లోనికి వెళ్లకుండా అడ్డుకున్నారు . ప్రభుత్వం పడి పోయిన కీలక సంఘటన లో ఇది భాగమే కానీ ప్రత్యేక వార్తగా నిలువ లేదు . మొత్తం వార్తలో ఓ వ్యాఖ గానే కవర్ అయింది .
*****
అనంతరం చంద్రబాబు సీఎం గా కుదురుకున్న తరువాత ఇక్బల్ ను తన సెక్యూరిటీ అధికారిగా నియమించారు . చెంపదెబ్బ కొట్టినప్పటి నుంచి ఇక్బల్ దశ తిరిగింది . బాబు ది యూస్ అండ్ త్రో పాలసీ వాడుకుని వదిలేస్తారు అంటారు కానీ కీలక సమయం లో తనకు అండగా నిలిచిన అధికారులు , మీడియా వామ పక్షాల నాయకుల సహాయం ఉంచుకోలేదు . సహాయానికి మించిన మేలు చేశారు .
ఇక్బల్ కు ప్రమోషన్ కూడా వచ్చింది . బాబు సీఎంగా ఉన్నప్పుడు ఓ వెలుగు వెలిగారు ...
ఆ తరువాత పరిణామాలు , లోపలి వ్యవహారాలు తెలియవు కానీ రాష్ట్ర విభజన తరువాత ఇక్బల్ హఠాత్తుగా ysr కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు . జగన్ అతనికి శాసన మండలి సభ్యత్వం కల్పించారు .
***
ఒక గృహిణిగా ఉన్న రేణుకా చౌదరి నాదెండ్ల పై చెప్పు విసిరి రాజకీయాల్లో అత్యున్నత స్థాయికి వెళ్లారు .చెప్పు తో కార్పొరేటర్ టికెట్ వచ్చింది .ప్రచారం లో అప్పటి కాంగ్రెస్ మాస్ లీడర్ పి జె ఆర్ ముందు కారు బానెట్ ఎక్కి తొడ కొడుతూ రారా దమ్ముంటే అని సవాల్ చేసి రాజకీయాల్లో ఎక్కడికో వెళ్లారు .
ఈ స్ఫూర్తి తో గత ఏడాది మహానాడులో ఒకరిద్దరు మహిళలు మైకు ముందు తొడగొట్టి సవాల్ చేస్తూ ప్రసంగాలు చేసినా పెద్దగా గుర్తింపు రాలేదు . ఒక్కో సీజన్ లో ఒక్క చర్య తో పాపులర్ అవుతారు . తొడ గొట్టే టెక్నీక్ అన్ని సార్లు ఫలితం చూప దేమో ...
ఇక ఇక్బల్ కు చెంప దెబ్బతో దశ తిరిగింది .
ఆ రోజు ఆలా చేసి ఉండక పోతే అందరు పోలీసుల్లా వయసు రాగానే రిటైర్ అయి పెన్షన్ తో కాలక్షేపం చేసే వారు . దెబ్బ తో బాబు దృష్టిలో తరువాత కాలం కలిసొచ్చి జగన్ దృష్టిలో పడ్డారు . ఏమో ఏదో ఓ రోజు మంత్రి కూడా కావచ్చు .
***
పరిటాలను తొలిసారి హిమాయత్ నగర్ లో ని టీడీపీ కార్యాలయం లో చూశా . నలుగురైదుగురు రిపోర్ట్రర్ లం ఆయనతో మాట్లాడు తుంటే రెండంచెలుగా మా చుట్టూ లుంగీ బ్యాచ్ ఉంది . ఏదో రాజకీయాలు మాట్లాడుకుంటాం మీరేంటి అంటుకొని నిలబడతారు చిరాగ్గా అని ముందు అన్నా తరువాత తెలిసింది . లుంగీ బ్యాచ్ పరిటాల ప్రైవేటు సెక్యూరిటీ అని ...
చివరి వరకు ఎన్టీఆర్ తో ఉన్నారు . ఎన్టీఆర్ ను దించేశాక ఓ రోజు బంజారాహిల్స్ లోని ఎన్టీఆర్ నివాసం లో అరుగు మీద మాటా ముచ్చట . ఈనాడు రిపోర్టర్ కనిపించగానే మీ రామోజీ సంగతి , ఈనాడు సంగతి చెబుతా అని పరిటాల సీరియస్ గా వార్నింగ్ ఇచ్చారు . నేనూ విన్నాను ..ఓ చిన్న పత్రికలో ఈ వార్త వచ్చింది .
2004 లో టీడీపీ ఓడిపోయి కాంగ్రెస్ అధికారం లోకి వచ్చాక . ఓ సారి అసెంబ్లీ ఆవరణ లో పరిటాల కనిపిస్తే ఇది బై ఎలక్షన్ కేసే అని గుంపులో ఒకరు అనడం వినిపించింది . తన ప్రాణాలకు ముప్పు ఉందని పరిటాల కూడా గ్రహించారు . అనంత పూర్పా లో ర్టీ సమావేశం లోనే మొద్దు శీను హతమార్చారు .!బావ కళ్ళల్లో ఆనందం చూడాలి అని టీవీ 9 ఇంటర్వ్యూ లో మొద్దు శీను చెప్పిన డైలాగు ఆ రోజుల్లో పూరి జగన్నాద్ పోకిరి సినిమా డైలాగును మించి పాపులర్ అయింది . కొన్ని సినిమాల్లో మొద్దు శీను డైలాగులను కూడా ఉపయోగించు కున్నారు .
16, డిసెంబర్ 2019, సోమవారం
ఔను.. రోజులు మారాయి
కాగ్నిజెంట్ ఐటి కంపెనీలు ఒకేసారి పదమూడు వేల మంది ఉద్యోగులను తొలగించారు. ఆర్థిక మాంధ్యం ప్రభావం అని కొందరి వాదన. కాదు కింద స్థాయిలో ఉద్యోగుల పనితీరు బాగాలేకపోయినా, ఆర్డర్స్ లేకపోయినా ఐటి కంపెనీలు తరుచుగా ఇలా తొలగించడం మామూలే అని కొందరు వాదిస్తున్నారు. ఈ ఒక్క కంపెనీయే కాదు చాలా ఐటి కంపెనీల్లో ఇలా పెద్ద సంఖ్యలో తరుచుగా ఉద్యోగులను తొలగించడం మామూలే అంటున్నారు. ఐబిఎం లాంటి కంపెనీలో సైతం భారీ ఎత్తున ఉద్యోగులను తొలగించారు. కారణాలు ఏదైనా కావచ్చు హఠాత్తుగా ఉద్యోగాలు పోతున్నాయి.
***
కుటుంబంలో ఎంత మందైనా సంపాదిస్తూ ఉండొచ్చు, భార్యాభర్త ఇద్దరూ ఉద్యోగాలు చేస్తూ ఉండవచ్చు. కానీ మారిన ఈ పరిస్థితుల్లో ఒకే ఆదాయం సరిపోదు. కాగ్నిజెంట్ లాంటి పెద్ద సంస్థలోనే ఉద్యోగాలు ఎప్పుడు పోతాయో తెలియని పరిస్థితి ఉన్నప్పుడు ఇక చిన్న కంపెనీల్లో ఉద్యోగం అంటే కేవలం ఒక జీతం మీదనే ఆధారపడి జీవిస్తే భవిష్యత్తును తలుచుకుంటే ఏమనిపిస్తుంది. చేస్తున్న ఉద్యోగానికి ఏమన్నా ఐతే ఏమిటి? అనే ప్రశ్న మీకు మీరు వేసుకుంటే మీకేమనిపిస్తుంది. ఒకసారి అలాంటి ప్రశ్న వేసుకుని చూడండి.
***
డి మార్ట్ రమేష్ దమానీ చాలా సరదాఐన మనిషి. లక్ష కోట్ల రూపాయల ఆస్తిపరుడు. దేశంలోని టాప్ టెన్ సంపన్నుల్లో తన స్థానాన్ని సుస్థిరం చేసుకున్నాడు. యువత స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేసేందుకు ప్రోత్సహించేందుకు జరిగే సెమినార్లలో ఆయన చేసే ప్రసంగాలను చూస్తుంటే అంత ఆస్తిపరుడైనా ఇంత సింపుల్‌గా ఎలా ఉంటారు? ఎలా మాట్లాడుతారు అనిపిస్తుంది.
ఒక సదస్సులో ఆయన తన ప్రసంగాన్ని కొనసాగిస్తూ హాజరైన యువతను ప్రశ్నించారు. మీ మొదటి నెల జీతంతో ఏం చేశారు అని.. సాధారణంగా ఎక్కువ మంది మొదటి నెల జీతంతో హోటల్‌లో పెద్ద పార్టీ ఇస్తారు. కారు కొంటారు. ఎంతో కాలం నుంచి ఇష్టమైన స్మార్ట్ఫోన్ కొంటారు. ఒక యువకుడు లేచి తాను మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టాను ఆనగానే అంత పెద్ద మనిషి కూడా ఉత్సాహాన్ని ఆపుకోలేక పోయారు. నాకే గనుకు ఓ అమ్మాయి ఉంటే నిన్ను అల్లుడిగా చేసుకునే వాడిని అని కితాబు ఇచ్చారు.
ఏదో సరదాగా అన్న మాట కాదు. మొదటి నెల జీతాన్ని మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడం అంటే భవిష్యత్తు పట్ల ఎంత ప్రణాళిక ఉందో స్పష్టం అవుతోంది.
తన కుమారుడు అమెరికాలో చదువు కోసం వెళ్లినప్పుడు స్మార్ట్ ఫోన్ కోసం 40వేల రూపాయలు అడిగాడట! దానికి దమానీ నీకు 40వేలు ఇవ్వడానికి అభ్యంతరం ఏమీ లేదు. ఆ 40వేల రూపాయలను నీ పేరుతో స్టాక్ మార్కెట్‌లో ఇనె్వస్ట్ చేస్తాను. మనం చేసిన 40వేల ఇనె్వస్ట్‌మెంట్ నష్టం రావచ్చు, లాభం రావచ్చు రెండింటికీ అవకాశం ఉంది. స్మార్ట్ఫోన్ కొంటే కాలం గడిచిన తరువాత కచ్చితంగా ధర తగ్గుతుంది. రెండింటిలో ఏది ఎంచుకుంటావు అని అడిగితే స్మార్ట్ఫోనే కావాలన్నాడట! ఆ వయసు అలాంటిది కాబట్టి విలువ తగ్గే వాటిపైనే ఆసక్తి చూపించాడని, కానీ కాలం గడిచిన కొద్ది అతనికి మనం సంపాదించిన డబ్బు విలువ తగ్గే వాటిపై ఖర్చు చేయాలా? విలువ పెరిగే వాటిపై ఇనె్వస్ట్‌మెంట్ చేయాలా? అనేది బాగా అర్థమైందని దమానీ చెప్పుకొచ్చారు.
***
కాగ్నిజెంట్ వంటి కంపెనీల్లో ఉద్యోగాలు పోవడం, ఒకే ఆదాయంపై ఆధారపడితే కలిగే ప్రమాదం, మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ మెంట్ ఇవన్నీ ఒకదానికి ఒకటి సంబంధం లేనివి అనుకోవద్దు.
సంబంధం ఉంది. ఎంత పెద్ద కంపెనీ కావచు, ఎంత పెద్ద జీతం అయినా కావచ్చు ఒకే ఆదాయం పై ఆధారపడడం ఈ కాలంలో చాలా ప్రమాదం. అనుకోనిది ఏమైనా జరిగితే ? ఉద్యోగం పోతే....
ఒకే ఆదాయంపై ఆధారపడడం ఈ రోజుల్లో ప్రమాదకరం. దీని వల్లనే చాలా మంది ఉద్యోగులు తెలియని స్ట్రైస్‌తో అనారోగ్యం పాలవుతున్నారు. ఒక ఆదాయం ఆగిపోయినా కుటుంబం గడపడానికి మరో ఆదాయం ఉంది అనే ధైర్యం వేరుగా ఉంటుంది.
మొదటి నెల జీతం నుంచే సాధ్యమైనంత పొదుపు చేసి ఇనె్వస్ట్ చేయడం ద్వారా కొంత కాలానికి జీతంలా ఆదాయం వస్తుంది. జీతంతో కుటుంబం గడిచిపోయినా భవిష్యత్తుకు ఉపయోగపడే విధంగా ఇనె్వస్ట్‌మెంట్ ఆదాయం ఉపయోగపడుతుంది.
జీతం వల్ల ఇల్లు గడిచిపోతుంది కానీ సంపన్నులు కాలేరు. కానీ అదే ఇనె్వస్ట్‌మెంట్ ద్వారా వచ్చే రెండవ ఆదాయం మిమ్ములను సంపన్నులుగా మారుస్తుంది.
ఉద్యోగం, జీతం చిన్నదా? పెద్దదా ? ఏదైనా కావచ్చు, ఎంత సాథ్యం ఐతే అంత పొదుపు చేయాలి, ఇనె్వస్ట్ చేయాలి. ఉద్యోగం ఉంటుందా? పోతుందా? అనే భయం నుంచి కాపాడేది ఆ ఇనె్వస్ట్‌మెంట్‌నే.
టాటా చైర్మన్ ఉద్యోగం కూడా పర్మనెంట్ కాదు. ఆ మధ్య టాటా చైర్మన్‌ను తొలగించిన విషయం తెలిసిందే! టాటా లాంటి కంపెనీకి చైర్మన్‌గా ఉన్న రతన్ టాటా కూడా ఇతర కంపెనీల్లో ఇనె్వస్ట్ చేస్తారు. ఆయన కూడా ఒకే ఆదాయంపై ఆధారపడి లేరు. మరి సామాన్య ఉద్యోగులు ఒకే ఆదాయంపై ఆధారపడి ఉండడం ఎంత ప్రమాదకరం.
జీతానికి తోడు పార్ట్‌టైంగా మరో పని చేస్తారా? చిన్న వ్యాపారం చేస్తారా? మీకు ఏది సాధ్యం ఐతే అది చేయవచ్చు. అవేవీ చేయడానికి సమయం లేదు అనుకుంటే స్టాక్ మార్కెట్‌లో, మ్యూచువల్ ఫండ్స్‌లో ఇనె్వస్ట్ చేయడానికి సమయంతో పని లేదు. ఎలా అవకాశం ఉంటే అలా రెండవ ఆదాయాన్ని సమకూర్చుకోవాలి. అది ఎంత త్వరగా ప్రారంభం అయితే మీ ఆర్థిక భవిష్యత్తు అంత బాగుంటుంది.

13, డిసెంబర్ 2019, శుక్రవారం
నవలోకం మేధావి!
‘‘ఏంటోయ్..! మేధావిలా దీర్ఘంగా ఆలోచిస్తున్నావ్?’’
‘‘ఆరోజులే వేరు. పెన్ను పట్టుకొని ఆలోచిస్తున్నట్టు ఫొటో దిగితే చాలు మేధావిలా గుర్తింపు వచ్చేది. బోనస్ డబ్బులతో కవితా సంకలనం ప్రచురించి, అట్టచివర ఆ ఫొటో ముద్రిస్తే నాసామిరంగ.. నోబెల్ బహుమతి వచ్చినంత సంబరంగా ఉండేది. ఇపుడు కవితా సంకలనాలు ఉచితంగా పంచిపెట్టినా తీసుకోనేవారు లేరు. మేధావిగా గుర్తింపు మాట దేవుడెరుగు.. డబ్బులు ఎందుకిలా వృథా చేస్తావు? నీ కవిత్వం చదివేదెవడు? చచ్చేదెవడు? అని దెప్పిపొడుస్తున్నారు. చెప్పుకొంటే సిగ్గుచేటు.. మన కొలీగ్ షేర్‌మార్కెట్ కోటీశ్వరరావుకు మొన్న క్యాంటీన్‌లో నా కొత్త కవితా సంకలనం ఇచ్చాను. అందరిముందు వాడు నా పరువు తీశాడు.’’
‘‘ఏమన్నాడేం? ఒక్కో కవిత చదివి పీకిపాకం పట్టాడా?’’
‘‘చదివి విమర్శిస్తే సంతోషించేవాడిని, పుస్తకం అట్ట కూడా చూడలేదు.’’
‘‘కవి అనే ముద్రపడ్డాక ఇలాంటి అవమానాలు మామూలే. పుస్తకం తెరవలేదని బాధపడితే ఎలా? ఇప్పటికి పాతిక కవితా సంకలనాలు వేసి ఉంటావు. అదేదో తొలిసారి అన్నట్టుగా బాధపడితే ఎలా?’’
‘‘వాడు కూడా సరిగ్గా పాతిక అనే నా పరువుతీశాడు.’’
‘‘ఏం పరువుతీశాడో చెప్పవేం?’’
‘‘పాతికేళ్ల క్రితం బోనస్ డబ్బులు వచ్చినప్పుడు తొలిసారిగా కొత్త ప్రపంచం అనే కవితా సంకలనం ముద్రించా.. ఆ సంగతి షేర్‌మార్కెట్ కోటేశ్వరరావుకు ఇప్పటికీ గుర్తుంది..’’
‘‘పాతికేళ్ళ తరువాత చదివి, ఇప్పుడు సమీక్ష చేశాడా?’’
‘‘కాదు- తిట్టిపోశాడు’’
‘‘ఇద్దరిదీ ఒకే జీతం, ఒకే ఉద్యోగం. పాతకేళ్ళ క్రితం తొలిసారి బోనస్ వచ్చినప్పుడు ఆ డబ్బులతో నేను హెచ్‌డీఎఫ్‌సీ షేర్లు కొన్నాను. నువ్వేమో కొత్త ప్రపంచం కవితా సంకలనం ముద్రించావు. కొత్త ప్రపంచం వచ్చింది లేదు, చచ్చింది లేదు. నేను కొన్న షేర్ల పుణ్యమాని నాకు నిజంగానే కొత్త ప్రపంచం వచ్చింది. రిటైర్‌మెంట్ తరువాత పెన్షన్ సరిపోదనే భయం లేదు. పిల్లలు చూస్తారా? లేదా? అనే దిగులు లేదు. ఆరోజు నేను కొన్న షేర్లు బంగారు బాతుగుడ్లు అయ్యాయి. మరి నువ్వు ప్రచురించిన కొత్తలోకం పుస్తకం ఒక్కడన్నా చదివాడా? ఎందుకురా? ఈ పనికిమాలిన పని.. రిటైర్‌మెంట్ దగ్గరగా వచ్చావు, ఐనా నీకా పిచ్చి పోలేదా? అని తిట్టాడు.’’
‘‘అతనన్న దాంట్లోనూ నిజం ఉంది. చేతిచమురు వదిలే వ్యాపకాలు ఎందుకోయ్! మనం ఎంత ప్రయత్నించినా ఈ ప్రపంచం మారదు’’.
‘‘నీతో దాపరికం ఏముంది కానీ, ప్రపంచాన్ని మార్చాలనే పిచ్చి నాకు పాతికేళ్ళ క్రితం లేదు, ఇప్పుడూ లేదు’’
‘‘మరి ఈ ప్రయత్నం అంతా..?’’
‘‘ఏదో నలుగురిలో మేధావిగా గుర్తింపు పొందాలనే దుగ్ధ. కడుపు చించుకొంటే కాళ్ళమీద పడుతుంది. కలం పట్టుకొని ఆలోచిస్తున్న ఫొటోల సీజన్ తరువాత బాగా ఆలోచించి గడ్డం పెంచాను. అందరూ తిట్టేవారే కానీ మేధావిలా కనిపిస్తున్నావని మెచ్చుకున్నవాళ్ళు లేరు.’’
‘‘నీ బాధ అర్థమైంది. మేధావిగా గుర్తింపుపొందాలనే తపన అన్నింటికన్నా ఇబ్బందికరమైంది. లక్ష్యం నెరవేరే మార్గం కనిపించదు. లక్ష్యం చేరేంతవరకు నిద్రపట్టదు. పిచ్చి కుదిరితే కానీ పెళ్ళి కాదు. పెళ్ళయితే కానీ పిచ్చి కుదరదు లాంటిదన్నమాట ఈ సమస్య.’’
‘‘నువ్వొక్కడివైనా నా సమస్య గుర్తించావు. మార్గం కూడా చూపించు.’’
‘‘పాత టెక్నిక్‌లు పనిచేయవు, తాజా ట్రెండ్‌ను ఫాలో కావాలి!’’
‘‘అవుతూనే ఉన్నాను. కశ్మీర్‌లో 371 రద్దుచేసినా, పాలస్తీనాలో బాంబులు పేలినా క్యాండిల్స్ పట్టుకొని రోడ్డుమీదకు వెళ్ళి నినాదాలు చేశాను. అందరూ అదోలా చూసి నవ్వుకున్నారు. ఇంకా ఏ కాలంలో ఉన్నారు అంకుల్.. అని జోకులేస్తున్నారు. ఇంకా ఐదేళ్ళ సర్వీసు ఉన్నా, ఉద్యోగం మానేసి ఢిల్లీ వెళ్ళి...’’
‘‘ఢిల్లీ వెళ్ళి ఏం చేస్తావ్? రాజకీయాల్లో చేరతావా?’’
‘‘లేదు. జెఎన్‌యూలో చేరి ఆందోళనల్లో పాల్గొని, అలాగైనా మేధావిగా గుర్తింపు పొందాలని..’’
‘‘మరేమైంది?’’
‘‘జెఎన్‌యూలో ఇప్పుడున్న మేధావులకే దిక్కులేదు. నువ్వొచ్చి చేసేదేముంది? అని ఢిల్లీ తెలుగు సంఘం మిత్రుడు కృష్ణారావు వద్దన్నాడు.’’
‘‘ఎంతైనా తెలుగు మేధావులకన్నా జెఎన్‌యూ మేధావులు ముదుర్లు..!’’
‘‘నా కోరిక తీరే మార్గం లేదా?’’
‘‘మేధావివి. నీకే ఆలోచన తట్టనప్పుడు, సామాన్యులం మేమెంత? ఏదో ఆలోచన మెరుపు నీ ముఖంలో కనిపిస్తుంది.’’
‘‘ఔను! యూరేకా.. ఐడియా?’’
‘‘ఏంటో చెప్పు?’’
‘‘దిశ’’
‘‘ఇది కూడా పాతపడిపోయింది. ‘దిశ’ ఉదంతంపై రాష్టప్రతి పాలన విధించాలని, ఎన్‌కౌంటర్ చేయాలని, చేయొద్దు అని, రోడ్డుమీదనే ఉరి తీయాలని, ఎన్‌కౌంటర్ అలా ఎలా చేస్తారని కొందరు.. ఎందుకు చేయరని ఇంకొందరు ఎవరి స్థాయిలో వారు మేధో చర్చ సాగించారులే.’’
‘‘వారెవ్వరికీ రాని ఆలోచన నాది..’’
‘‘ఎన్‌కౌంటర్ అప్రజాస్వామికం, నిందితులకూ హక్కులున్నాయని చాలామంది నీకన్నాముందే ఆందోళనలు చేసి మేధావులుగా గుర్తింపు పొందారులే.’’
‘‘అది కామన్. ప్రతి ఒక్కరికీ హక్కులుంటాయి. రేప్‌లు చేసిన వారికీ ఉంటాయి.. కానీ నా డిమాండ్ అది కాదు.’’
‘‘మరి?’’
‘‘అత్యాచారం మా జన్మహక్కు.. అత్యాచారాలకు అనువుగా కనీస సౌకర్యాలు కల్పించాలని డిమాండ్ చేస్తా.. రేప్ చేయాలనే కోరిక మనిషి సహజ లక్షణం. రేపిస్టులను రక్షించండి. రేప్‌ల సంస్కృతిని కాపాడండి.. ఎలా ఉంది నా నినాదం.’’
‘‘???’’
‘‘ఇంకో పాయింట్ మరిచిపోయాను. రేపిస్టులూ సమాజంలో భాగమే.. వారికి స్వయం ఉపాధి కల్పించాలి. ఎలా ఉంది?’’
‘‘నువ్వు బాగా ముదిరిపోయిన మేధావివి. నిన్ను జనం అర్థం చేసుకోవడం కష్టం. నీ అద్భుత ఆలోచన ఎవరికీ చెప్పకు. మీ ఇంట్లోవారికి కూడా.’’
‘‘నిజమే! మేధావులను అర్థం చేసుకోరు.. ఎవరికీ చెప్పను.’’*బుద్దా మురళి (జనాంతికం 13-12-2019)

7, సెప్టెంబర్ 2019, శనివారం
అమెరికా కా? నేపాల్ కా ?
‘‘చెప్పినా వినకుండా... సర్వనాశనం చేస్తున్నారు...’’
‘‘ఏం జరిగిందోయ్...?’’
‘‘మన జీడీపీ ఎంతో తెలుసా? టాటా కార్ల ఫ్యాక్టరీలను రెండు రోజులు మూసేశారన్న సంగతైనా తెలుసా? పార్లే-జీ బిస్కట్లు తింటున్నావా? ఆ ఫాక్టరీలో పదివేల మంది ఉద్యోగులను తొలగించారన్నది తెలుసా?’’
‘‘చూడోయ్.. నాకు ఏ నెల జీతం ఆ నెలకే సరిపోవడం లేదు. మా అ బ్బాయి కారు కొందామని చాలా రోజుల నుంచి అడుగుతున్నాడు. ఈ మహానగరంలో కారైనా, సైకిలైనా ఒకటే స్పీడ్.. హాయిగా మెట్రోరైలెక్కి పోకుండా కారెందుకు రా.. అని నచ్చజెప్పా. కారు తీసుకొని మోండా మార్కెట్‌కు వెళ్లినా, మహంకాళి గుడికెళ్లినా నరకమే! ఎక్కడా పార్కింగ్‌కు అవకాశం లేదు. నడుచుకుంటూ వెళ్లడమే నయం. నామాట విను.. నువ్వు కూడా కారు కొనకు.. హాయిగా బస్సులోనో, మెట్రోలోనో వెళ్లు. మరీ అంతగా కారెక్కాలని అనిపిస్తే ఊబర్ టాక్సీ బుక్ చెయ్’’
‘‘నేనేం చెబుతున్నాను.. నువ్వేం మాట్లాడుతున్నావ్?’’
‘‘అదే లేవోయ్.. టాటా కార్ల ఫ్యాక్టరీని రెండు రోజులు మూసేశారన్నావ్.. అదే కదా? ఈరోజు కొనాలనుకున్నది మరో రెండు రోజుల తరువాత కొంటావేమో? అంతోటి దానికి ఇంత ఆవేశం, ముఖంలో ఇన్ని రూపాలు మార్చడం అవసరమా?’’
‘‘ఏం మాట్లాడుతున్నావ్?’’
‘‘ఆ.. పార్లే బిస్కట్ల గురించే కదా? ఈ కాలం పిల్లలంతా పిజ్జాలు, బర్గర్‌లు అంటూ జపిస్తుంటే నువ్వేమో ఇంకా పాతకాలం వాడిలా పార్లే బిస్కట్ల కోసం ఇంతగా తపిస్తున్నావంటే.. నువ్వు గ్రేట్‌రా!’’
‘‘ఎహే ఆగు.. ఇంత అజ్ఞానంతో మనుషులు ఎలా ఉంటారో అర్థం కావడం లేదు. నేను పడిపోయిన జీడీపీ గురించి, తగ్గిపోయిన గ్రోత్ రేట్ గురించి, ఆగిపోయిన పరిశ్రమల గురించి.. ప్రపంచ ఆర్థిక సంక్షోభం గురించి మాట్లాడుతుంటే- నువ్వేంటి.. సిల్లీగా బిస్కట్లు, చాక్లెట్లు అంటూ చిన్నపిల్లాడిలా మాట్లాడుతున్నావ్!’’
‘‘చెప్పుకుంటే సిగ్గుచే టు కానీ, ఆర్థిక సంక్షోభం అంటే ఏంటి? అంతా దా నిపై తెగ మాట్లాడేస్తున్నా రు. మన చిన్నప్పుడు స్కై లాబ్ పడిపోయి ప్రపం చం అంతా భస్మీపటలం అవుతుందని తెగ భయపడేవారు. ఇప్పుడలాంటిదేమన్నా భూగోళానికి ముప్పుగా మారిందా?’’
‘‘అంతకన్నా పెద్ద ముప్పు! ప్రపంచానే్న గడగడలాడిస్తోంది..’’
‘‘ఫేస్‌బుక్‌లో చూశా.. ఆంధ్రపదేశ్‌లో బాబు ఓడిపోయి జగన్ గెలవడం వల్ల, బాబుకు మద్దతు ఇచ్చే మీడియాను కాదని, జగన్‌కు మద్దతు ఇచ్చే మీడియా వల్లనే ప్రపంచానికి ఈ ప్రమాదం ముంచుకొచ్చిందని కొందరు రాశారు. అస్సలు అర్థం కాలేదు. మరీ బడాయి కాకపోతే జగన్‌కు ఆంధ్రలో బలం ఉంది నిజమే, ప్రపంచాన్ని గజగజలాడించేంత బలం ఉందంటావా?’’
‘‘ఎహే.. జగన్ ముఖ్యమంత్రి కాకముందు నుంచి ప్రపంచం ఆర్థిక సంక్షోభం బాట పట్టింది’’
‘‘అంటే- బాబు వల్లనే ప్రపంచానికి ఆర్థిక సంక్షోభం అంటావా?’’
‘‘అబ్బా- నీ తెలివి తెల్లారినట్టే ఉంది. ప్రపంచంలో ఏం జరిగినా ఐతే బాబు లేదంటే జగన్.. ఆ ఇద్దరి వల్లనే అంటావా? నీకు వీళ్లే ప్రపంచంలా కనిపిస్తున్నారా? ప్రపంచం వీరిద్దరి కార్యక్షేత్రాల కన్నా పెద్దగా ఉంటుంది.’’
‘‘ఔను.. మోదీ వల్లనే అని బాగా ప్రచారం జరుగుతోంది. మోదీ వల్ల ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడుతుందా? ఆయనెవరో- శివసేన నాయకుడు ఇప్పటికైనా మన్మోహన్ సింగ్‌ను పిలవండి, ఆయన సలహాలు తీసుకుని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడండని సలహా ఇచ్చినట్టు ఉన్నాడు. ప్రపంచాన్ని రక్షించేంత సత్తా మన దేశానికి చెందిన నాయకుడికి ఉండడం గర్వకారణం. ఆయన ఏ పార్టీ ఐనా కానీ, ప్రపంచాన్ని ఆర్థిక సంక్షోభం నుంచి బయటపడేసింది మా సింగ్ గారే అని చెప్పుకోవడం మనకెంత గర్వకారణంగా ఉంటుంది?’’
‘‘నీకు ఆర్థిక అంశాల గురించి ఏమీ తెలియదని నాకు అర్థమైంది’’
‘‘చిన్నప్పుడు జేమ్స్‌బాండ్ సినిమాలు చాలా చూశా. ప్రపంచం సంక్షోభంలో పడిపోయినప్పుడు జేమ్స్‌బాండ్ అందమైన అమ్మాయితో కలిసి సాహసాలు చేసి ప్రపంచాన్ని రక్షిస్తాడు. హాలివుడ్ వాళ్లు సినిమాల్లో మాత్రమే ప్రపంచాన్ని రక్షించారు. కానీ మా సర్దార్జీ నిజంగా ప్రపంచాన్ని రక్షించాడని చెప్పుకోవడం ఎంత గర్వంగా ఉంటుంది’’
‘‘నీకు విషయం అర్థం కావడం లేదు. ప్రపంచం ఆర్థిక సంక్షోభంలో పడిపోతుంది. అంటే డబ్బులకు కటకట అన్నమాట’’
‘‘వావ్- ఎంత మంచి మాట చెప్పావురా! నెలాఖరులో మనం డబ్బులకు కటకటలాడుతాం. చివరి మూడు రోజులు టీ, టిఫిన్‌లకు కూడా డబ్బులుండవు. అంటే దేశాలు కూడా మనలాంటి వేతన జీవులే అన్నమాట. ఖర్చుకు డబ్బు లేక కటకటలాడుతున్నాయి.’’
‘‘అది కాదు.. జీడీపీ అని ఒకటుంటుంది లే! మన జీడీపీ గ్రోత్ రేట్ పాకిస్తాన్ కన్నా తక్కువ. బంగ్లాదేశ్ జీడీపీ గ్రోత్ రేట్ 8 శాతం, నేపాల్ 7.9, భూటాన్ 7.4 పాకిస్తాన్ 5.4 కానీ- ఇండియా జీడీపీ గ్రోత్ రేట్ 5 శాతమని తెలుసా?’’
‘‘వాట్సాప్‌లో ఈ ప్రచారం చూశాను. నీకో మంచి ఐడియా ఇవ్వా లా?’’
‘‘ఇవ్వు.. ’’
‘‘మీ అబ్బాయిని అమెరికా కా ? కెనడా కా ? ఎటు పంపాలి అని తెగ ఆలోచిస్తున్నావు కదా ? అప్పు కోసం బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నావు కదా? ఆ ప్రయత్నాలన్నీ మానేయ్’’
‘‘ఎందుకు?’’
‘‘అమెరికా వెళ్లాలంటే అరకోటి ఖర్చు. ట్రంప్ అక్కడ ఉండనిస్తాడో వెనక్కి పంపుతాడో తెలియక రోజూ టెన్షన్‌తో చావాలి. పైగా అమెరికా జీడీపీ గ్రోత్ రేట్ 50 ఏళ్ళ నుంచి 3శాతమే. అదే నేపాల్‌కో, పాకిస్తాన్‌కో పంపించావనుకో ఎనిమిది శాతం జీడీపీ గ్రోత్ రేట్ . మన రూపాయికి అక్కడ రెండు రూపాయిలిస్తారు. రైలులో వెళ్లి పోవచ్చు. ఏమంటావ్?’’
‘‘ఏం చెప్పదలుచుకున్నావ్..’’
‘‘ప్రతి విషయం మీద మనం మాట్లాడొద్దు. సాహో సినిమా గురించి మాట్లాడడం వేరు. ఆర్థిక సంక్షోభం, జీడీపీ వంటి విషయాలు వేరు. ఇదేమీ రెండు గంటల సినిమా కాదు. ఆ రంగంలో నిపుణులు చెప్పింది విందాం. తెలియని దాని గురించి ఏదో అయిపోతుందని ప్రచారం చేయకు. ఈ దేశానికి సంక్షోభాలు కొత్త కాదు. ఎదిరించి నిలబడింది. నిలబడుతుంది. భవిష్యత్తు మనదే.

బుద్దా మురళి (జనాంతికం 7-9-2019)
30, ఆగస్టు 2019, శుక్రవారం
బిక్షగాడి యుద్ధ నినాదం
‘‘మనిషన్నాక అనేక పనులుంటాయి. ఏం మీకుండవా? వారం రోజులు సెలవు పెడితే ఇక అంతేనా? ప్రపంచంలో ఎవరూ సెలవు పెట్టరా? ఏం నువ్వు సెలవు పెట్టవా? అంతెందుకు ట్రంప్ భార్యాపిల్లలతో విహారానికి వెళ్లడా? మోదీ మొన్న వెళ్లలేదా? అతనెవరో చానల్ అతనితో కలిసి అడవుల్లో తిరగలేదా? మీ అందరూ సెలవు పెడతారు. నేనెందుకు సెలవు పెట్టోద్దు’’
‘‘మీ బాసే కాదు బాస్ ప్రపంచంలో ఏ బాస్‌కైనా సెలవులంటే పడదు. అంతెందుకు మీ ఇంట్లో పనిమనిషి సెలవు పెడితే మీ ఆవిడ ఊరుకుంటుందా? ఏమైందో చెప్పు?’’
‘‘ఫేస్‌బుక్‌లో స్టేటస్ అప్‌డేట్ చేశాను కూడా సెలవుపై వెళుతున్నాను. వారం రోజులు ఎవరికీ అందుబాటు లో ఉండను అని. ఇన్ని దశాబ్దాల నుంచి లేని తొందర ఈ వారంలోనే వచ్చిందా? నేను సెలవులో ఉన్నది చూసి నిర్ణయం తీసుకుంటారా?’’
‘‘ఔను తప్పే కుటుంబ పెద్దగా చెప్పకుండా కుటుంబం కీలక నిర్ణయం తీసుకోవడం తప్పే. మీ ఇంట్లో వాళ్లు నీ సెలవులో అంత కీలక నిర్ణయం ఏం తీసుకున్నారు?’’
‘‘ఇంటి నిర్ణయం కాదు.’’
‘‘మరి?’’
‘‘నేను సెలవులో ఉన్నది చూసి మోదీ కాశ్మీర్‌పై నిర్ణయం తీసుకున్నారు. దీని వెనుక ఆయనకు ట్రంప్ మద్దతు కూడా ఉన్నట్టుంది. ఇదేం ప్రజాస్వామ్యం ఇదేం దేశం. సెలవులు ముగించుకుని వచ్చాక, నా అభిప్రాయం అడిగి నిర్ణయం తీసుకోవలసింది’’
‘‘ఓరి భడవా! ఇదా విషయం నువ్వు సరదాగా అంటున్నావో సీరియస్‌గా అంటున్నావో తెలియదు కానీ... సామాజిక మాధ్యమాల్లో కొందరి కామెంట్లు చూస్తుంటే నాకూ ఇలానే అనిపించింది. అదేదో ఫేస్‌బుక్‌లో బిజీగా ఉండే వీరితో చర్చించిన తరువాతనే మోదీ నిర్ణయం తీసుకోవాలి అన్నట్టుగా ఉంది. సామాజిక మాధ్యమాలు పుట్టక ముందు ఇలాంటి మాటలు ‘లెఫ్ట్’ వైపు వారి నుంచి వినిపించేవి. వామవాదం వారు చిక్కిశల్యమై అదృశ్యమయ్యారు. కానీ వారి మాటలు వినిపిస్తున్నాయి.’’
‘‘ ఈ రోజు వంట ఏం వండుతున్నావ్! డియర్ అని భార్యను ముద్దుగా అడిగితేనే.. ఫోరా కుయ్యా వండింది ఇష్టం ఉంటే తిను లేకుంటే వెళ్లిపో అని గట్టిగా చెబుతుంది. అలాంటిది కాశ్మీర్ వంటి కీలక విషయంపై కోన్ కిస్కాలతో చర్చించి నిర్ణయం తీసుకుంటారా! మన అమాయకత్వం కానీ... ఏదో ప్రజాస్వామ్యం .. చీకటి రోజు, హక్కులు అనే మాటలు ఉపయోగించేందుకు బాగుంటాయని అంటుంటాం’’
‘‘నీలో నాకు బాగా నచ్చే విషయం ఇదేనోయ్! ఎక్కువ సార్లు సిల్లీగా ఆలోచించినా, తరువాత ప్రాక్టికల్‌గా ఆలోచించి నిన్ను నువ్వే సముదాయించుకుంటావ్’’
‘‘రోజూ చచ్చే వాడి కోసం ఏడిచే వాడెవడు అన్నట్టు రోజూ ఏడవడం కన్నా కాశ్మీర్‌పై ఏదో ఒక నిర్ణయం తీసుకున్నారు. ఏమైతే అది అయింది చూద్దాం ఏమవుతుందో?’’
‘‘ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉంటే నువ్వు అంతగా నవ్వడం ఏమీ బాగోలేదు ’’
‘‘నా నవ్వుకు ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉండడానికి అస్సలు సంబంధం లేదు. ఐనా ప్రపంచం క్లిష్టపరిస్థితిలో ఉందని నీకెవరు చెప్పారు?’’
‘‘మరెందుకు నవ్వుతున్నావ్?’’
‘‘పాకిస్తాన్ కార్టూనిస్ట్ ఎవరైనా తెలిస్తే బాగుండు కార్టూన్‌కు ఓ మంచి ఐడియా వచ్చింది’’
‘‘ఏమా ఐడియా?’’
‘‘అక్టోబర్‌లో భారత్‌తో యుద్ధం చేస్తామని పాక్ మంత్రి ఒకరు ప్రకటించారు కదా? ఒక రూపాయి దానం చేయండి బాబూ! ఇండియాతో యుద్ధం చేస్తాం అని అడుక్కుంటున్నట్టు కార్టూన్ వేస్తే పేలిపోతుంది కదూ’’
‘‘పాకిస్తాన్ మీడియాలో ఇలాంటి కార్టూన్ వేస్తే ఆ పత్రికను పేల్చేస్తారు.’’
‘‘ఇండియాలో వేస్తే...’’
‘‘ఒక్కొక్కరు ఒక్కో విధంగా స్పందిస్తారు. రాజకీయ పక్షాలు, సిద్ధాంతాలు, సామాజిక వర్గాలు, రాష్ట్రాలను బట్టి ఉంటుంది’’
‘‘ఏది ఉదాహరణకు ఒక్కటి చెప్పు?’’
‘‘మోదీ భక్తులు అహంకారంతో వేసిన కార్టూన్ ... అంటారు లిబరల్ వాదులు’’
‘‘ఎప్పటి నుంచో నాకో సందేహం? తమ దేశం ఏం చేసినా తప్పు పట్టే మేధావులు మన దేశంలోనే ఉంటారా? అన్ని దేశాల్లో ఉంటారా? తప్పును తప్పు అని నిలదీయడం అభ్యుదయం అవుతుందా? ఏం చేసినా తప్పు అనడమే అభ్యుదయమా?’’
‘‘మరీ దేశమంతా అలానే ఉన్నారనుకోకు... మొన్న పాక్ దేశీయులు అమెరికాలో భారత జాతీయ పతాకాన్ని కాలుతో తొక్కుతూ నినాదాలు చేస్తుంటే ఓ మహిళా జర్నలిస్టు అడ్డుకుని జాతీయ పతాకాన్ని చేతిలోకి తీసుకుంది. అందరూ ఒకేలా ఉంటారని ఎందుకనుకుంటావు’’
‘‘నువ్వు ఎందుకు నవ్వావో చెప్పనే లేదు’’
‘‘మా వద్ద అణుబాంబులు ఉన్నాయి. ఇండియాపై అణుబాంబులు వేస్తామని పాక్ అధ్యక్షుడు ఇమ్రాన్‌ఖాన్ హెచ్చరించాడు. ఇదెంత సీరియస్ విషయం కదా? దీనిపై ఒక నెట్‌జన్ కామెంట్ చేస్తూ మా వద్ద ఉన్న అణుబాంబులు మేమేమైనా రాహుల్ గాంధీ పెళ్లిలో వేయడానికి ఉపయోగించుకుంటామా? అని ప్రశ్నించాడు. అది గుర్తుకు వచ్చి’’
‘‘అవి రెండూ జరిగే పనులు కావు’’
‘‘ఏ రెండు’’
‘‘రాహుల్ పెళ్లి.. యుద్ధంలో అణుబాంబుల ప్రయోగం’’
‘‘అలా అనుకుంటావు. నీకు గుర్తుందా. తెలంగాణ సమస్య, కాశ్మీర్ వివాదం ఎప్పటికీ పరిష్కారం కావు అని చాలా మంది కొన్ని దశాబ్దాల పాటు జోకులేసుకున్నాం. తెలంగాణకు కెసిఆర్ రూపంలో పరిష్కారం లభిస్తే, మోదీ రూపంలో కాశ్మీర్ సమస్యకు పరిష్కారం లభించింది. ’’
‘‘అంతే అంటావా?’’
‘‘ఈ పరిష్కారాలు కొందరికి నచ్చవచ్చు, కొందరికి నచ్చక పోవచ్చు. పరిష్కార ఫలితాల కాలం చెబుతుంది.’’
‘‘మరి పాక్ యుద్ధం చేస్తే..’’
‘‘వెనకటికొకడు లేస్తే మనిషిని కాను అన్నాడట! నిండా అప్పుల్లో మునిగిపోయి... కాగితం రెండు వైపుల వాడాలని, పెట్రోల్ ఎక్కువగా వాడొద్దు అనేంత వరకు వచ్చిన పాక్ ఆర్థిక పరిస్థితి తెలిసే అడుగుతున్నావా? ఒక దేశం మరో దేశంతో యుద్ధం చేయడం అంటే దొంగ చాటుగా మానవ బాంబులను ప్రయోగించడం కాదు.’’
‘‘ఔను ఈ మధ్య పాక్ మేధావుల ఉపన్యాసాల వీడియోలు కొన్ని చూశాను. మన గ్రామాల్లో ఎవరు కనిపించినా అప్పులు అడిగే వాడ్ని చూస్తే పారిపోతారు. ఇప్పుడు ప్రపంచమనే గ్రామంలో పాక్ పరిస్థితి అలానే ఉందని పాక్ మేధావి ఒకరు చెప్పారు.ఐనా ప్రజలను సంతృప్తి పరిచేందుకు యుద్ధం అంటూ ప్రకటనలు చేయాలి తప్పదు’’
‘‘ఔను బిక్షగాడు యుద్ధం చేయడు.’’
బుద్ధా మురళి (జనాంతికం 30-8-2019)

27, జులై 2019, శనివారం
ప్రజాస్వామిక నల్లి!
‘‘అలా నవ్వుతూనే పోయేట్టుగా ఉన్నావ్? మరీ అంతగా పగలబడి నవ్వకు..’’
‘‘హా..హా..హా...’’
‘అదేంటో మాకూ చెప్పు.. మేమూ నవ్వుతాం’’
‘‘మూడ్ బాగా లేదు. మంచి అడల్ట్ జోక్ చెప్పమన్నాను’’
‘‘ఏం జోక్ చెప్పాడు? నాకూ చెబితే నవ్వుకుంటాను.’’
‘‘విలువలతో కూడిన రాజకీయాలు అని ఏకవాక్య జోకు చెప్పాడు.’’
‘‘జోక్ అంటే సంక్షిప్తంగా ఉండాలి. బోలెడు నవ్వు పుట్టించాలి. ఏక వాక్యజోకు ఇంతకు మించింది ఉండదు.’’
‘‘ఏకవాక్య జోక్‌లు ఇంకా చాలానే ఉన్నాయి. ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనే మాట విన్నావుకదా? ఇదెలా పుట్టిందో నీకు తెలుసా?’’
‘‘ఉమ్మడి రాష్ట్రంలో, విడివిడి రాష్ట్రాల్లో సమావేశాలు జరిగిన ప్రతి సారీ, ప్రతి రోజూ ఎవరో ఒకరు ఈ మాట అంటారు. కానీ నిజంగా ఇది ఎలా పుట్టిందో తెలియదు.’’
‘‘ఈ మాట సమావేశంలోనే పుట్టింది. ఈ మాట పుట్టుక చరిత్ర చాలా ఆసక్తికరంగా ఉంది. అనగనగా అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్న రోజు.. సభలో ఒకాయన లేచి అధ్యక్షా.. ప్రజాస్వామ్యంలో ఇది చీకటి రోజు అని కూర్చున్నాడు. అప్పుడేమో అసెంబ్లీలో సంతాప తీర్మానం సందర్భంగా మరణించిన సభ్యులకు నివాళి అర్పిస్తున్నారు. ఇంత అద్భుతంగా ఏకవాక్య నివాళి ఎవరూ అర్పించలేదని కొందరు సభ్యులు అతడిని అభినందించారు. ఆయన పార్టీ సభ్యులు దగ్గరకు వచ్చి భుజం తట్టారు. మరణించిన సభ్యుల గురించి చాలామంది తమ అనుభవాలను పంచుకుంటున్నారు. అసెంబ్లీలో దివంగత సభ్యుడు ఎలా మాట్లాడేవాడో, నియోజకవర్గం ప్రజలతో అతని సంబంధాల గురించి అంతా మాట్లాడారు. కానీ సభలో ఏనాడూ నోరుమెదపని ఆ ఒక్క సభ్యుడు మాత్రమే ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని అద్భుతంగా నివాళి అర్పించాడని రాజకీయ పక్షాలకు అతీతంగా అంతా అభినందించారు. ఏం జరుగుతోందో అతనికి అర్థం కాలేదు. నిద్రమబ్బుతో ఆయోమయంగా పక్కనున్న సభ్యుడిని అడిగాడు.. ఏం జరిగింది? అంతా నన్ను ఎందుకు అభినందిస్తున్నారు అని. అదేంటి..? ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు అని నివాళి అర్పించి, ఏం జరిగిందని అడుగుతున్నావని పక్క సభ్యుడు సమాధానం ఇచ్చాడు. ‘ఓ అదా- మంచి నిద్రలో ఉన్నాను. నల్లి కుట్టింది. అసెంబ్లీ సీట్లలో కూడా నల్లులా? అని కోపం వచ్చింది. మంచి నిద్ర పాడుచేసిన నల్లిని చంపేసి, అసెంబ్లీలో నల్లులా? ఇదేం అసెంబ్లీ? ఇదేం ప్రజాస్వామ్యం? హాయిగా నిద్ర పోనివ్వరా? అని కోపంతో ప్రజాస్వామ్యానికి ఇది చీకటి రోజు- అన్నానని వివరించాడు. అందుకే సభ జరుగుతున్నప్పుడు ఎవరో ఒకరు ఇది ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అనగానే ఈ సంఘటన గుర్తుకు వస్తుంది. ’’
‘‘ అది సరే.. ఇంతకూ విలువలతో కూడిన రాజకీయాలు అనే ఏకవాక్య జోక్ ఇప్పుడు నీకెందుకు గుర్తుకు వచ్చింది?’’
‘‘కర్నాటక రాజకీయాలు చూసి.. ప్రజాస్వామ్యం గెలించింది అని ఒకరు, ప్రజాస్వామ్యానికి చీకటి రోజు అని ఇంకొకరు, ధర్మమే గెలిచింది అని మరొకరు.. ఇలా ఒకరిని మించిన ప్రకటనలు ఒకరు చేస్తూ కన్నడ నాటకంతో దేశంలో అందరికీ బోలెడు వినోదాన్ని పంచుతున్నారు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు- కర్నాటక రాజకీయంతో దేశానికి గొప్ప సందేశం ఇచ్చినట్టు అయింది?’’
‘‘ఏంటీ? ప్రభుత్వాన్ని ఎలా పడగొట్టవచ్చునో నేర్పడమా?’’
‘‘అదేదో ఎమ్మెల్యేలను దేశంలో మొదటిసారి కొంటున్నట్టు, ప్రభుత్వాలను ఇప్పుడే పడగొడుతున్నట్టు, రాజకీయాలు ఇప్పుడే చెడిపోయినట్టు మాట్లాడకు. ఇప్పుడు జరుగుతున్నవి అన్నీ ఎప్పటి నుంచో ఉన్నవే. అనేక సార్లు జరిగినవే’’
‘‘మరి- దేశానికి ఏం నేర్పినట్టు?’’
‘‘మా ఐదుగురు అన్నదమ్ముల్లో ఆ ‘కర్రోడే’ కాస్త తెలుపు- అని ఏదో సామెత చెప్పినట్టు మార్కెట్‌లో ఇప్పుడున్న రాజకీయ పక్షాల్లో విలువలు పాటించేది తామేనంటూ ఎవరికి వారే చెప్పుకునే వారు. కొందరు మెల్లగా చెప్పుకుంటే, కొందరు సిగ్గుపడుతూ చెప్పుకునే వారు. ఒకరు మాత్రం గోడెక్కి గట్టిగా తామే పవిత్రులం అని చెప్పుకునే వారు. కర్నాటక రాజకీయాలతో ‘కర్రోళ్లు’ అంతా కారునలుపే వారిలో ఏ ఒక్కరూ తెలుపుకాదు అని తేలిపోయింది. దేశానికి ఇంత కన్నా గొప్ప సందేశం ఇంకేం కావాలి?’’
‘‘కర్రోళ్లంతా కారు నలుపు.. వారిలో తెల్లగా ఎవరూ లేరని తేలడం ఇదే మొదటి సారేం కాదుకదా? చిన్నాచితక రాష్ట్రాల్లో రాత్రికి రాత్రే విపక్షం అధికార పక్షంగా మారిపోవడం జరిగింది కదా? ’’
‘‘మండపేటకు చెందిన పిల్లాడిని ఎవరు కిడ్నాప్ చేశారు? తమ టీవీలో వార్తల హోరు చూసే కిడ్నాపర్లు వదిలివేశారని అన్ని టీవీ చానళ్లవారు ఎవరికివారు కథనాలతో హోరెత్తిస్తున్నాయి. పిల్లకాయలను కిడ్నాప్ చేయడం ఇదే మొదటిసారా? వదిలి వేయడం మొదటిసారా? టీవీలో ఆ వార్తలు రావడం మొదటిసారా? కాదు కదా? మరెందుకలా హోరెత్తించారు. ప్రతిరోజూ డజన్ల కొద్దీ పిల్లలు కనిపించకుండా పోతారు. మళ్లీ దొరుకుతారు. కానీ ఇదెందుకు అంత హైలైట్ అయిందంటావ్?’’
‘‘కర్నాటక రాజకీయాలకు, మండపేట కుర్రాడి కిడ్నాప్‌కు సంబంధం ఏమిటి?’’
‘‘అక్కడికే వస్తున్నాను. ప్రతి గల్లీలోనూ కిడ్నాప్‌లు జరగవచ్చు. కానీ మండపేట కుర్రాడు ముద్దుగా ఉన్నాడు. అందంగా ఉన్నాడు. అందమైన ముఖం ఉన్నప్పుడు టీవీలకు చక్కటి వార్త అవుతుంది. ముక్కు చీమిడి కారుతూ చినిగిపోయిన దుస్తులతో పేదరికానికి బ్రాండ్ అంబాసిడర్లుగా ఉన్న పిల్లలు తప్పిపోతే అది టీవీలకు వార్త కాదు. అలాగే చీమిడి ముక్కంత రాష్ట్రాల్లో ఏదో జరిగితే దేశం పెద్దగా పట్టించుకోదు. కానీ కర్నాటక లాంటి పెద్ద రాష్ట్రం ఐటీ రంగానికి పేరు పొందిన రాష్ట్రం కాబట్టి దేశంలోని మీడియా దృష్టి ఉంటుంది. గోవా అనగానే బీచ్‌లు గుర్తుకు వస్తాయి కానీ రాజకీయ పరిణామాలు గుర్తుకు రావు. కర్నాటక అంటేనే రాజకీయ నాటకాలు గుర్తుకు వస్తాయి. ఆ పెద్ద రాష్ట్రంలోని తాజా రాజకీయ పరిణామాల పుణ్యమాని మార్కెట్‌లోని రాజకీయ పక్షాలన్నీ ఒకటే అని అంటే- కర్రోళ్లంతా కర్రోళ్లే.. నల్లటివాళ్లలో తెల్లవాడు ఉండడు అని దేశానికి గొప్ప సందేశం లభించింది.’’*-బుద్దా మురళి (జనాంతికం 26-7-2019)

1, మార్చి 2019, శుక్రవారం
టెర్రరిజంపై కవితా యుద్ధం
‘ఏంటీ అంత సీరియస్‌గా రాసుకుంటున్నావ్’’
‘‘కవిత్వం ’’
‘‘దేనిపై’’
‘‘యుద్ధం పైన’’
‘‘వెరీగుడ్ అలాంటి దుర్మార్గుల పీచమణచాలి. భారత్ సహనాన్ని అలుసుగో తీసుకుని చెలరేగిపోతున్నారు. భారత్ తిరగబడితే, ప్రతీకారం తీర్చుకుంటే ఎలా ఉంటుందో వారికి తెలియాలి. మన వీర సైనికులను ఉత్తేజపరుస్తూ కవిత్వం బాగా రాయి. నిజానికి కవిత్వం కూడా యుద్ధం లాంటిదే. మనసులో ఎంతో మదన పడిన తరువాత కానీ అక్షరాలు పురుడు పోసుకోవు...’’
‘‘ఇక ఆపుతావా? నేను మన సైనికుల సాహసాన్ని కీర్తిస్తూ కవిత్వం రాయడం లేదు. నా కవితా శీర్షిక యుద్ధం వద్దు శాంతి ముద్దు’’
‘‘శీర్షిక బాగుంది. ఐనా దేశాల మధ్య యుద్ధాలు, దేశాల్లో టెర్రరిస్టుల దాడులు ఎప్పుడూ ఉండేవే కానీ... మీ పక్కింటి వాళ్లతో ఎప్పుడూ గొడవలే ఉండేవి కదా? మీ రెండు ఇళ్లమధ్య ఉన్న చింత చెట్టు నుంచి గాలికి వాడిపోయిన చింతచిగురు రాలి పడితే మీ వైపు నుంచి అని వాళ్లు, వాళ్ల వైపు నుంచి వచ్చి పడిందని మీరు భలే కొట్టుకునే వారు. సమస్య చిన్నదే అనిపించినా అనుభవించిన వాడికి తెలుస్తుంది. రెండిళ్ల మధ్య గొడవలు అంత ఈజీగా పరిష్కారం కావు. ఎలా పరిష్కరించుకున్నావోయ్! ’’
‘‘మా దూరపు బంధువు ఆవారా అని ఉన్నాడొకడు. పిచ్చి తిరుగుళ్లలో వాడికి పోలీసులతో మంచి సంబంధాలు ఏర్పడ్డాయి. నా బాధ ఓసారి వాడికి చెప్పుకున్నాను. అంతే హెడ్‌కానిస్టేబుల్ ఓ రోజు మా పక్కింటాయన్ని పోలీస్ స్టేషన్‌కు పిలిచి తమదైన శైలిలో కోటింగ్ ఇచ్చి. మళ్లీ నా తెరువు రావద్దని వార్నింగ్ ఇచ్చాడు. ఇప్పుడు చింత చిగురు కాదు ఏకంగా చింత చెట్టు పడ్డా నా తెరువు రాడు’’
‘‘మాట్లాడుకుని పరిష్కరించుకుంటే పోయేదానికి పోలీసులతో కొట్టించడం అన్యాయం’’
‘‘అన్యాయమా ? ఆవకాయనా? మన పవర్ ఏంటో చూపించాను. ఇప్పుడు నన్ను చూడాలన్నా వాడికి వణుకు’’
‘‘మన సైనికులపై దాడి చేసి చంపిన టెర్రరిస్టులపై కూడా దయ చూపించాలనే మానవతావాదివైన నీలో కనిపించిన ఇంకో మనిషి ఉన్నాడని అస్సలు ఊహించలేదు’’
‘‘ఇది పొరుగింటి సమస్య. అది పొరుగు దేశంతో సమస్య రెండింటికి సంబంధం లేదు. అందుకే అక్కడి విషయంపై నేను గాంధేయవాదిని, నా పొరుగింటి విషయంలో నా అంతటి రాక్షసుడు లేడు.’’
‘‘సర్లే ఇంతకూ నీ కవితలు ఏ పత్రిక కోసం’’
‘‘ఇప్పటికే నా శాంతి కవిత్వంతో సామాజిక మాధ్యమాల్లో మనకు మంచి ఫాలోయింగ్ వచ్చేసింది.’’
‘‘దాడికి ప్రతి దాడి ఉండాల్సిందే అని వాదించే వారిని నువ్వు శాంతి కవిత్వంతో నోరు మూయించడం చూశాను’’
‘‘అంతే కదా? ఇక్కడ కూర్చోని యుద్ధం యుద్ధం దాడికి ప్రతిదాడి అని వాదిస్తున్న వీరిని యుద్ధ రంగానికి తీసుకు వెళ్లాలి అని నేను రాసిన మాట బాగా పాపులర్ అయింది’’
‘‘నాకో ఐడియా వచ్చింది. పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లో టెర్రరిస్టులకు శిక్షణ ఇస్తున్న శిబిరాలపైకి సైన్యం బాంబులు వేయడం కన్నా నీలాంటి మేధావుల బృందాన్ని తీసుకు వెళ్లి అక్కడి వదిలేస్తే’’
‘‘ఆ వదిలేస్తే’’
‘‘మీ శాంతికవితలతో వారి మనసు మారవచ్చు కదా?’’
‘‘మారక పోతే?’’
‘‘వారి మనసు మారితే మొత్తం ప్రపంచానికే అదో వరం అవుతుంది. ప్రపంచంలో టెర్రరిజానికి పెద్ద ఎగుమతి దారునిగా పాక్ మారింది కదా? మీ కవిత్వంతో వారు మారితే మన దేశానికే కాకుండా మొత్తం ప్రపంచానికి మీరు మేలు చేసిన వారు అవుతారు.’’
‘‘నేనడిగింది మారకపోతే అని?’’
‘‘మేధావుల భారం దేశానికి తగ్గుతుంది’’
‘‘నేను కవిత్వం రాస్తానని నామీద నీకు జెలసీ. అది సరే ఈ దాడులపై నువ్వేమంటావు’’
‘‘వాడొచ్చి బాంబులు వేసి ఇష్టం వచ్చినట్టు చంపుతూ వెళితే చేతులు కట్టుకుని ఉండమని మాత్రం అనను’’
‘‘చర్చలతో పరిష్కారం కాని సమస్య ఉండదు. టెర్రరిస్టులతో చర్చలు జరపాలి. నచ్చజెప్పాలి. ఒప్పించాలి’’
‘‘ఆరేడు దశాబ్దాలైనా చర్చల ద్వారా ప్రభుత్వం సాధించలేక పోయింది. అందుకే మీ శాంతి కవిత్వ బృందమంతా పాక్ ఆక్రమిత కాశ్మీర్‌లోని టెర్రరిస్టుల ట్రైనింగ్ క్యాంపునకు వెళ్లి ప్రయత్నించాలి అంటున్నాను. మీకు యాత్ర చేసినట్టూ ఉంటుంది. టెర్రరిస్టుల వల్ల కొత్త పరిచయాలు ఏర్పడినట్టూ ఉంటుంది.’’
‘‘వాడికి అర్థం కాకుండా మనల్ని లేపేస్తే?’’
‘‘వాడికి అర్థం అయ్యే భాషలో చెప్పాలంటున్నాను. ఓ ఉపన్యాసంలో రజనీష్ ఓ సంఘటన చెప్పారు. విమానంలో ఒక ప్రయాణీకుడు బిజినెస్ క్లాస్ టికెట్‌తో ఎగ్జిక్యూటివ్ క్లాస్‌లో కూర్చున్నాడు. ఎయిర్ హోస్టెస్ ఎంత చెప్పినా ఆ సీటు నుంచి లేవలేదు. ఇది గమనించిన రజనీష్ ఆ ప్రయాణీకుడి వద్దకు వెళ్లి ఏదో చెప్పాడు. అతను చెంగున ఈ సీటు నుంచి లేచి వెనక్కి వెళ్లి కూర్చున్నాడు. అంత సేపు నచ్చజెప్పినా వినని ప్రయాణీకుడు ఒక్క మాటతో అలా లేచి వెళ్లడంతో ఎయిర్ హోస్టేస్ మీరేం చెప్పి అతన్ని పంపించారని రజనీష్‌ను అడుగుతుంది. ఎవరికి ఎలాఎవరికి ఎలా చెబితే అర్థం అవుతుందో అలా చెప్పాలి. నువ్వు ఎక్కడికి వెళ్లాలి అని అడిగాను మద్రాస్ అని చెప్పాడు. మరి ముందు వైపు కూర్చున్నావేం ముందు భాగం ముంబై వెళుతుంది. వెనక భాగం మద్రాస్ వెళుతుంది అని చెప్పాను అంతే ఆ ప్రయాణీకుడు ఎగిరి వెళ్లి వెనక కూర్చున్నాడు. అతనికి అలా చెబితేనే అర్థమవుతుంది అందుకే అలా చెప్పానంటాడు రజనీష్’’
‘‘పొరుగు దేశంలో టెర్రరిజమే రాజ్యం ఏలుతుంది. అది ప్రపంచానికి తెలుసు. టెర్రరిస్టులు చెప్పినట్టు అక్కడి పాలకులు వినాలి కానీ, పాలకులు చెప్పినట్టు టెర్రరిస్టులు వినరు. అందుకే టెర్రరిస్టులకు అర్థమయ్యే భాషలోనే చెప్పాలి.’’

^^ అంటే యుద్ధం చేయాలా ’’
^^ దీని గురించి కూడా రజనీష్ చెప్పారు . దేశాల్లో కూడా స్ర్తీ ,పురుష దేశాలు ఉంటాయి . జర్మనీ పురుష దేశం అలానే యూరప్ లోని చిన్న చిన్న దేశాలు కూడా పురుష దేశాలు . అందుకే అవి యుద్దాలు చేశాయి . భారత్ ది స్త్రీ స్వభావం . అందుకే భారత్ గడచిన ఐదువేల ఏళ్లలో ఏ దేశం పై యుద్ధం చేయలేదు . దాడికి ప్రతి దాడి . చేసింది తప్ప ఆక్రమించుకొందామని దాడులు చేయలేదు .’’
.’’హమ్మయ్య అంటే యుద్ధం జరగదు కదా ?.’’
.’’ఏమో యుద్ధం చేయక పోవచ్చు కానీ .. ఉగ్రవాదుల శిబిరాలను మట్టుపెట్ట వచ్చు.’’
‘‘ అంతేలే ... యుద్ధం వద్దు... యుద్ధం వల్ల అపారనష్టం అని రాయబారంలో చెప్పిన శ్రీకృష్ణుడే అంతిమంగా కురుక్షేత్రంలో యుద్ధం చేయను అన్న అర్జునుడితో యుద్ధం చేయాల్సిన అవసరం ఎందుకో చెప్పారు. ఎప్పుడు ఏది అవసరమో నాయకత్వం వహించే వారు నిర్ణయిస్తారు. మనం నిమిత్తమాత్రులం.’’
^^ అంతేలే రోజులు రోజులు ఒకేలా ఉండవు ..ఒక జిల్లా అంతాకూడా లేని దేశాలు ఒకప్పుడు మన దేశాన్ని జయించాయి . కానీ స్వాతంత్య్రం రాకముందు బలహీన భారత్ కావచ్చు కానీ స్వతంత్ర భారత్ అజేయ భారత్ .’’
-బుద్దా మురళి (జనాంతికం 1-3-2019)
1, ఫిబ్రవరి 2019, శుక్రవారం
దేవుడే దిగిరావాలి..
‘‘ ఛీ.. ఛీ.. మరీ ఇంత అన్యాయమా? ప్రజాస్వామ్యానికి విలువ లేకుండా పోతోంది?’’
‘‘ఏమైందిరా? ఐనా ఈ రోజు కొత్తగా విలువలు పడిపోవడం ఏమిటి? ఎప్పటి నుంచో ఇలా జరుగుతున్నదే కదా? కాలానికి తగ్గట్టు మార్పు తప్పదు. కలి ప్రవేశించినప్పుడే ఆ ప్రభావం మొదలైంది. ఇప్పుడేంది?’’
‘‘ఎంత కలికాలం ఐనా ఎంతో కొంత ధర్మం ఉండాలి...’’
‘‘ఔను.. ఇంతకూ ఏమైంది? ఎన్నికల్లో మద్యం, డబ్బు పంచుతున్నారా? ఓట్లు కొంటున్నారా? ఎన్నికలు మొదలైనప్పటి నుంచే ఏదో ఒక స్థాయిలో ఈ వ్యవహారం సాగుతూనే ఉంది కదా? ఇప్పుడు కొత్తగా ఆశ్చర్యపోవడానికేముంది?’’
‘‘ఎప్పుడైనా విన్నామా? కన్నామా? కలి కూడా సిగ్గుపడేట్టు చేస్తున్నారు’’
‘‘ఎన్నికల గురించే కదా? నువ్వు మాట్లాడేది.’’
‘‘ఔను!’’
‘‘మరీ అంతగా ఆశ్చర్యపోవడం ఏంటి? లగడపాటి ఆవేదన గురించా? ’’
‘‘లగడపాటి ఏంటి?’’
‘‘అందరూ నవ్విన తరువాత తొర్రి పళ్లవాడు నవ్వాడని.. ఫలితాలు వచ్చిన రెండు నెలల తరువాత ఆయన ఆశ్చర్యపోతూ, నేను ప్రకటించిన ఎన్నికల ఫలితాలను అధికారికంగా గుర్తించాలి కానీ ఎన్నికల కమిషన్ ఫలితాలు ప్రకటించడం ఏమిటన్నట్టు ఆశ్చర్యపోతున్నాడు. ఎన్నికల కమిషన్ ఫలితాలను తాను గుర్తించేది లేదంటున్నాడు.’’
‘‘ఔను.. నేనూ చూశాను. బాబుగారిని - ఇంటికి వెళ్లి కలిసి వచ్చిన తరువాత ఢిల్లీలో ఈ ప్రకటన చేశాడని పత్రికలలో చదివాను’’
‘‘నీకంటే పనీపాటా ఉండదు. రోజూ నాలుగైదు పత్రికలు చదువుతుంటావు. టీవీలో వార్తలు చూస్తుంటావు. ఓట్లు లెక్కించగానే ఫలితాలు టీవీలో చూసి ఉంటావు. లగడపాటికి ఒకటా రెండా వేల కోట్ల రూపాయల వ్యాపారాలు ఉన్నాయి. ఎన్నికల ఫలితాలు వెలువడిన రోజు ఆయన చూసి ఉండరు. బాబును కలిశాక- ఆయన ఫలితాలు చెప్పి ఉంటారు. రెండునెలల తరువాత స్పందిస్తే తప్పా? వేల కోట్ల రూపాయల వ్యాపారాన్ని పక్కన పెట్టి ప్రాచీన విద్య చిలక జోస్యాన్ని గౌరవించే ఆయన్ని అభినందించాలి కానీ విమర్శిస్తావేం.’’
‘‘ఇంకెక్కడి వేల కోట్ల రూపాయల వ్యాపారాలు? ఎప్పుడో నిండా మునిగిపోయారు. సైకిల్ నడుపుతున్నట్టు ఆయన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో కనిపిస్తుంటాయి. ఆ సైకిల్ సహా ఆయన్ని అమ్మినా అప్పు తీరదని తెలిసిన వారంటారు.. ’’
‘‘లోకులు కాకులు. ఇలానే అంటారు. వేల కోట్ల రూపాయల వ్యాపారం దివాలా తీస్తే తీసి ఉండొచ్చు. వ్యాపారం పోతే పోనీ చిలక జోస్యాలే నాకు ముఖ్యం అంటూ ఆయన నిలబడ్డాడు చూడు .. నాకది బాగా నచ్చింది. ప్రాచీన కళలు, సంస్కృతిని కాపాడాలని అందరూ ఉపన్యాసాలు ఇచ్చేవారే. కానీ ఇలా ముందుకు వచ్చేవారిని ప్రోత్సహించే వారేరి?’’
‘‘సర్లే .. ఆయనకు లేని బాధ నాకెందుకు? వ్యాపారాలు పోతే చిలక జోస్యం చెప్పుకొని బతుకుతారు. పెప్పర్ స్ప్రే ఏజెన్సీ తీసుకుంటారు... నాకేం?’’
‘‘మనం ఇంత సేపు మాట్లాడుకున్నా... ప్రజాస్వామ్యం విలువలు లేకుండా పోయాయంటూ నీ బాధ ఏంటో ఇప్పటి వరకు చెప్పనే లేదు.’’
‘‘ఓ అదా.. మనం ఎప్పుడైనా విన్నామా? కన్నామా? ’’
‘‘ఏంటో చెప్పి ఏడువ్’’
‘‘ఎన్నికలు పుట్టినప్పటి నుంచి ఎంతో కొంత డబ్బులు ముట్టచెప్పడం మామూలే. ఇవ్వడం, తీసుకోవడం రెండూ మామూలే. కానీ ఇచ్చిన డబ్బులు తిరిగి అడగడం ఎంత అన్యాయం? పంచాయతీ ఎన్నికల్లో ఇంటింటికీ తిరిగి డబ్బులు పంచిన వాళ్లు, ఓడిపోగానే ఇంటింటికీ తిరిగి మా డబ్బు మాకిచ్చేయమని అడుగుతున్నారట! ఇదెంత అన్యాయం?’’
‘‘ఎన్నికలన్నాక ఒకరికన్నా ఎక్కువ మందే పోటీ చేస్తారు. అందరూ పంచుతున్నారు. గెలిచేది ఒకరే కదా? ఈ మాత్రం ప్రజాస్వామ్య తత్త్వం అర్థం కాని వాళ్లు, తెలియని వాళ్లు ఎన్నికల్లో పోటీ చేయడం ఎందుకు? ఇలా ఐతే వచ్చే ఎన్నికల్లో వాళ్లు డబ్బులు పంచితే తీసుకుంటారా? ’’
‘‘ఓడినా గెలిచినా తిరిగి డబ్బులు అడగం అని హామీ పత్రం రాసుకుంటారేమో చూడాలి’’
‘‘ఇది విన్నావా? తెలంగాణలో వరి పండదు అన్నారు కదా?’’
‘‘వరి పండదు అన్నారు. అంతకు ముందు తినడం నేర్పించాం అన్నారు. సరే ఏమైంది?’’
‘‘ఈసారి దేశంలో అత్యధికంగా వరి తెలంగాణలోనే పండింది. దేవుడి దయ తెలంగాణపై భాగానే ఉంది. దేశానికి ధాన్యాగారంగా మారుతోంది.’’
‘‘అంతగా మురిసిపోకు.. తెలంగాణకు పెద్ద ప్రమాదం తప్పేట్టు లేదు. అది తెలుసుకో ముందు..’’
‘‘ఎలా?’’
‘‘రెండు నెలల తరువాత ఎన్నికలు జరుగుతాయి. మూడు నెలల్లో నేను గెలుస్తాను. నాలుగు నెలల్లో అద్భుతాలు జరుగుతాయి. ఐదు నెలల్లో మాయ మీ కళ్ల ముందు కనిపిస్తుందని కేఏ పాల్ అంత స్పష్టంగా చెప్పిన తరువాత కూడా నీకు అర్థం కాలేదా?’’
‘‘పాల్ సీఎం ఐతే ఏంటి?’’
‘‘ప్రపంచమంతా ఆయన చెప్పినట్టు వింటుంది కదా? ప్రపంచ నాయకులంతా ఆయన కనుసన్నల్లోనే పని చేస్తారు కదా? ప్రపంచంలోని పెట్టుబడులన్నీ ఆంధ్రకే తరలిస్తానంటున్నారు. అప్పుడు తెలంగాణకు ఇక పెట్టుబడులు ఎక్కడి నుంచి వస్తాయి?’’
‘‘అంటే పాల్ సీఎం కావడం ఖాయం అనే నిర్ణయానికి వచ్చావా?’’
‘‘ఆయన మాటలు వింటే అలానే అనిపిస్తోంది. ఎంత ఆత్మవిశ్వాసంతో మాట్లాడుతున్నాడు? అబద్ధాలు చెప్పేవారైతే ముఖంలో తేడా కనిపిస్తుంది’’
‘‘మాటల్లో నిజాయితీ లేదా పిచ్చితనం ఏదో ఒకటి ఉందనిపిస్తోంది’’
‘‘పిచ్చివాళ్లు, నిజాయితీ పరులు ఒకటే అంటావా?’’
‘‘నేనెప్పుడన్నాను? చేతికి ఉంగరం కూడా లేదని చెబుతున్నా- లక్షల కోట్లు తెచ్చేస్తానన్న ఆత్మవిశ్వాసం ముఖంలో కనిపిస్తోంది. పిచ్చితనమో, ఆత్మవిశ్వాసమో తెలియదు’’
‘‘సరే.. ఏపీకి ప్రత్యేక హోదా వస్తుందంటావా?’’
‘‘హోదా సమస్య కన్నా అతిమేధావులే అసలు సమస్య అంటాను. మేధావుల సమస్య నుంచి ఆంధ్రప్రదేశ్ కోలుకోవాలని కోరుకుంటా...’’
‘‘ఒకప్పుడు అధిక జనాభా పెద్ద సమస్య అనుకునేవాళ్లం. చైనా ఆ సమస్యను కూడా అనుకూలంగా మార్చుకున్నాక, ఇప్పుడు జనాభా కాదు అతి మేధావులే అసలు సమస్య అనిపిస్తోంది. సమాజం అతి మేధావుల సమస్య నుంచి ఎప్పుడు విముక్తి చెందుతుందో- ఆ దేవుడికే ఎరుక..’’
‘‘పాల్ దేవుడికా? ’’
‘‘సరే.. ఇక ఉంటాను..’’
*బుద్దా మురళి (1-2-2019 జనాంతికం )

28, జనవరి 2019, సోమవారం
రాజకీయ కామెడీ!
ప్రియాంక రాజకీయాల్లోకి వస్తున్నారట!’’
‘‘చిరంజీవి సినిమాల్లోకి వస్తారట అన్నట్టుగా ఉంది నీ మాట’’
‘‘చాల్లే జోకులు.. ఇప్పటి వరకు అప్పుడప్పుడు ప్రచారం చేసేవారు ఇకపై పూర్తి స్థాయిలో రాజకీయాల్లో ఉంటారన్నమాట’’
‘‘ఎన్నికలు వస్తున్నాయి కదా? ప్రియాంకనే కాదు పవన్ కూడా క్రియాశీలక రాజకీయాల్లోకి వచ్చేస్తాడు’’
‘‘నువ్వు ఏదీ సరిగా మాట్లాడవుకదా?’’
‘‘ఎంత శక్తివంతమైన ఆయుధమైనా సకాలంలో ఉపయోగిస్తేనే ఫలితం..’’
‘‘అంటే అరవై ఏళ్ల వయసు, పాతికేళ్ల కాంగ్రెస్ పాలనపై వ్యతిరేకత, విపరీతమైన సినీగ్లామర్ ఇంతకు మించి కలిసొచ్చే కాలం లేదని ఎన్టీఆర్ రాజకీయ రంగ ప్రవేశం చేశారు చూడు.. అదే సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకోవడం అంటే’’
‘‘సరైన సమయంలో సరైన నిర్ణయానికి ఎన్టీఆర్ పాజిటివ్ ఉదాహరణ ఐతే చిరంజీవి దీనికి సరిగ్గా వ్యతిరేక ఉదాహరణ’’
‘‘అంటే ప్రియాంక చిరంజీవిలా ఫైయిలవుతుందా?’’
‘‘ఇందిరాగాంధీ ఫీచర్స్ ఉండొచ్చు కానీ ఆమెలా విజయవంతమయ్యే పరిస్థితులు కనిపించడం లేదు..’’
‘‘అది నువ్వెలా నిర్ణయిస్తావు. నిర్ణయించాల్సింది ప్రజలు’’
‘‘కాదని ఎవరన్నారు? ప్రజలే నిర్ణేతలు. నేను నా అంచనా చెబుతున్నాను. శంకరాభరణం ఇప్పుడు తీస్తే హిట్టవుతుందా?’’
‘‘కాదు..’’
‘‘ఎందుకు కాదు అది అద్భుతమైన సినిమా కదా? పోనీ మిస్సమ్మ, గుండమ్మ కథ, మాయాబజార్ ఇప్పుడు తీస్తే హిట్టవుతాయా?’’
‘‘ఆ స్థాయిలో తీయలేరు’’
‘‘ఎందుకు తీయలేరు? అప్పుడు లేని టెక్నాలజీ ఇప్పుడు ఉంది. ఇంకా అద్భుతంగా తీయవచ్చు కదా?’’
‘‘నీతో వాదించలేను. ఆ కాలానికి శంకరాభరణం అవసరం కాబట్టి అది హిట్టయింది. టెక్నాలజీ పెరిగింది కానీ కాలం మారింది. ఈ కాలానికి మిస్సమ్మలు, గుండమ్మలు అవసరం లేదు. కొత్తనీరు వస్తున్న దశలో దాన్ని గుర్తించకుండా కాలం తీరిన తరువాత వాణిశ్రీ హీరోయిన్‌గా కాంతారావు సినిమా తీసి నిండా మునిగిపోయారు. 2004లో ఓ చానల్‌ను టాప్‌లో నిలిపిన తింగరి వేషాలిచ్చిన ఫార్ములాతో 2019లో మరో చానల్ వస్తే పట్టించుకున్నవాడే లేడు. అప్పుడు సక్సెస్ ఐన ఫార్ములా ఎల్లకాలం సక్సెస్ కావాలని లేదు. దేనికైనా కాలం ముఖ్యం.’’
‘‘అంటే ప్రియాంక రావడానికి ఇంకా కాలం రాలేదంటావా?’’
‘‘కాలం రాకపోవడం ఏంటి? ఎప్పుడో వచ్చి వెళ్లిపోయింది. ఒకటిన్నర దశాబ్దాల ఆలస్యం అయింది! దేశానికి అవసరమైన కాలానికి ఇందిర నాయకత్వం లభించింది. ఆమెను ప్రధాని పదవి వరించింది. ఎన్టీఆర్ అవసరం అయిన కాలానికి ఆయనను జనం ఆదరించారు. కాలం మారాక అదే ఎన్టీఆర్ తనను వెన్నుపోటు పొడిచారని నల్లదుస్తులు వేసుకుని ఎంత తిరిగినా స్పందన రాలేదు.’’
‘‘అమ్మ ప్రేమకు కాలం చెల్లడం ఉంటుందా?’’
‘‘అమ్మ ప్రేమ, సమాజమే దేవాలయం, ప్రేమికుల ప్రేమ సినిమా డైలాగులు కాదు.. రాజకీయాల గురించి చెబుతున్నా..’’
‘‘వచ్చే ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయంటావు’’
‘‘ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు గెలుస్తారు’’
‘‘అబ్బో.. ఇంతోటి గొప్ప విషయం మీరే చెప్పాలి! మాకు తెలియదు. ఆయనెవరో ఈవీఎంలను ట్యాంపర్ చేశారని విదేశాల్లో విలేఖరుల ముందు చెప్పాడు..’’
‘‘2004లో అధికారంలోకి వచ్చిన కొత్తలో వైఎస్‌పై కేఏ పాల్ ఆరోపణలు చేయడం సంచలనం సృష్టించింది. ఆయన మరింతగా రెచ్చిపోయి వైఎస్‌తో మొదలుపెట్టి సోనియా, అటు నుంచి అమెరికా అధ్యక్షుడు, ప్రపంచ నాయకులందరినీ తాను ఎలా నడుపుతున్నది చెప్పేసరికి వ్యవహారం సీరియస్ నుంచి కామెడీ సీరియల్‌గా మారిపోయింది. మొగలిరేకులు కన్నా కొంచం తక్కువ వయసు, జబర్దస్తీని కన్నా ఎక్కువ కాలం నుంచి సాగుతోంది ఈ కామెడీ సీరియల్. ’’
‘‘నిజమే జబర్దస్త్ ఓ ఎంటర్‌టైన్‌మెంట్ చానల్‌ను బతికిస్తుంటే, కేఏ పాల్ న్యూస్ చానళ్లను బతికిస్తున్నాడు.’’
‘‘పాల్‌కు, ఈవీఎంల ట్యాంపరింగ్‌కు సంబంధం ఏంటి?’’
‘‘ఈవీఎంల ట్యాంపరింగ్ తెలిసిందని 11 మందిని హైదరాబాద్‌లో ఎన్‌కౌంటర్ చేశారని, ఓ కేంద్రమంత్రిని రోడ్డుమీద చంపేశారని, ట్యాంపరింగ్ గురించి తెలిసిందనే జర్నలిస్టు గౌరీ లంకేశ్‌ను చంపేశారని చెబుతుంటే ఎందుకో పాల్ గుర్తుకొచ్చాడు..’’
‘‘నాకూ అలానే అనిపించింది. అద్వానీని పక్కన పెట్టడం, ఆంధ్రకు ప్రత్యేక హోదా ఇవ్వకపోవడం, జగన్‌పై కేసులు.. వీటన్నిటికీ ఈవీఎంల ట్యాంపరింగే కారణమని చెబుతాడేమో అనిపించింది ఆ జాబితా చూశాక’’
‘‘ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి.. ఈ సంగతి తెలిస్తే ఎవరైనా మన్మోహన్ సింగ్ అవుతారు. తెలియకపోతే పాల్ అవుతారు. ’’
‘‘ఇన్ని చెబుతున్నావుకదా? ఎన్నికల ఫలితాలు ఎలా ఉంటాయో చెప్పు’’
‘‘ఆంధ్రలో ముఖ్యమంత్రిని అవుతానని పాల్ అంత ధీమాగా చెప్పిన తరువాత కూడా నీకు అనుమానంగా ఉందా?’’
‘‘నేను సీరియస్‌గా అడుగుతున్నా..?’’
‘‘నేనే కాదు, పాల్ కూడా సీరియస్‌గానే చెబుతున్నాడు. తనకు ఇష్టం లేదని, గత్యంతరం లేకనే ముఖ్యమంత్రి పదవి చేపట్టాల్సి వస్తుందని అంటున్నాడు..’’
‘‘ఔను.. ప్రపంచానికి నాయకత్వం వహించి 200 దేశాల నాయకులను తన చెప్పు చేతుల్లో ఉంచుకునే వాడికి ఒక రాష్ట్రానికే పరిమితం కావాలంటే ఇబ్బందే కదా?’’
‘‘పాల్ రెండు వందల దేశాలు అని చెప్పలేదు’’
‘‘ఏదో అభిమానంతో నేనో పది దేశాలు కలిపాను. ఏం నాకు ఆ మాత్రం స్వేచ్ఛ లేదా? పాల్ అంటే అభిమానం ఉంటే తప్పా?’’
‘‘సీరియస్‌గా అడిగితే జోక్ చేస్తావేం?’’
‘‘ప్రజలు ఎవరికి ఓటు వేస్తే వారు గెలుస్తారు అంటేనేమో అబ్బో ఈ మాత్రం మాకు తెలియదా? అంటావు. నేనే గెలుస్తానని పాల్ చెప్పిన సంగతి చెబితే సీరియస్‌గా చెప్పమంటావు?’’
‘‘నీకు రాజకీయాలంటే కామెడీగా కనిపిస్తున్నాయా?’’
‘‘కాదు.. బాధను కలిగిస్తున్నాయి. ప్రజలకు వినోదం, విజ్ఞానం పంచాల్సిన ఎంటర్‌టైన్‌మెంట్ చానళ్లు హత్యలు, నేరాలు చేయడం నేర్పించే శిక్షణ సంస్థలుగా మారితే, ప్రజల జీవితాలను శాసించే, ప్రభావం చూపే రాజకీయాలు కామెడీగా మారిపోవడానికి మించిన దురదృష్టం ఏముంటుంది?’’
*బుద్దామురళి ( జనాంతికం 25-1-2019)

18, జనవరి 2019, శుక్రవారం
బయోపిక్‌లు-ఆత్మకథలు
‘‘ఎన్టీఆర్ బయోపిక్‌పై ఏమంటావు?’’
‘‘నేను చూడలేదు.. చూసే ఉద్దేశం కూడా లేదు’’
‘‘ఓహో.. లక్ష్మీస్ ఎన్టీఆర్ చూస్తావన్నమాట’’
‘‘అదీ చూడను..’’
‘‘రెండింటినీ తప్పనిసరిగా చూడాల్సి వస్తే ఏది ముందు చూస్తావ్?’’
‘‘చాలా రోజుల క్రితం తిరుపతి వెళ్లి అటు నుంచి శ్రీకాళహస్తికి బస్సులో వెళుతున్నప్పుడు పక్కనున్న ప్రయాణికుడు నా సామాజిక వర్గం గురించి తెలుసుకోడానికి తెగ తంటాలు పడ్డాడు. చివరకు ఆ సమయంలో వచ్చిన గౌతమీపుత్ర శాతకర్ణి, ఖైదీనంబర్ 150లో ఏది ముందు చూస్తారని అడిగాడు. అలాగైనా కనీసం ఏ వర్గమో తెలుస్తుందని..’’
‘‘మరి నువ్వేమన్నావ్?’’
‘‘రెండింటిలో ఏది ముందుగా టీవీలో వస్తే దాన్ని కొద్దిసేపు చూస్తానన్నా.. ఇప్పుడు నీ ప్రశ్నకూ ఇదే సమాధానం. థియేటర్‌లో మూడు గంటల సమయం వెచ్చించేంత ఓపిక లేదు. మొదటి రోజే చూడాలనుకునే కుర్రతనం లేదు.’’
‘‘నువ్వు చూస్తే ఎంత? చూడకపోతే ఎంత? కానీ- ఎన్టీఆర్ బయోపిక్ ఎలా ఉందంటావు’’
‘‘ఓషో రజనీష్ చెప్పిన ఒక మాటలో జీవిత సారం దాగుంది. ప్రతి ఒక్కరూ మనిషే. మనిషికి ఉండే లక్షణాలన్నీ మనిషికి ఉంటాయి. ఇది అర్థం అయితే ఒక మనిషిని దేవుడు అని మొక్కం, రాక్షసుడు అని విమర్శించం. మనకు అద్భుతంగా అనిపించిన వ్యక్తి ఇతరులకు నచ్చకపోవచ్చు. వారికి నచ్చిన వాళ్లు మనకు సామాన్య వక్తి అనిపించవచ్చు. ’’
‘‘ఔను.. మనం వెంకన్ననను దర్శించుకోవడానికి అష్టకష్టాలు పడి వెళ్లి కొన్ని క్షణాలు ఆయన విగ్రహాన్ని చూసి జీవితం ధన్యం అయిందనుకుంటాం. కానీ, గర్భగుడిలోనే సేవ చేసే పూజారులకు అలాంటి భావనే ఉండాలని లేదు’’
‘‘బాగా చెప్పావ్! ట్రంప్‌ను ప్రపంచం తన్మయంగా చూసినట్టు అతడి సహాయకుడిని చూడాలని లేదు’’
‘‘ఇలాంటి మాటే తనికెళ్ల భరణి ఓసారి చెప్పారు. అమితాబ్‌ను మనం అద్భుతంగా చూస్తాం, ఆయన కారు డ్రైవర్ అంత ఆశ్చర్యంగా ఏమీ చూడడని మహానుభావులను ఎప్పుడో ఒకసారి దూరం నుంచి చూస్తేనే బాగుంటుంది కానీ దగ్గరి నుంచి రోజూ చూస్తే అంత గొప్పగా ఏమీ అనిపించదట!’’
‘‘ఎన్టీఆర్ ఎందరికో దేవుడిలా కనిపించారు. కానీ కుటుంబ సభ్యులకు మాత్రం భరించలేని వ్యక్తిగా అనిపించారేమో అనిపిస్తుంది.. ఆయన జామాతా దశమ గ్రహం సీడీ విన్నాక, చివరి దశ గురించి తెలిశాక’’
‘‘మనం అసలు చర్చను పక్కన పెట్టాం. ఇంతకూ ఎన్టీఆర్ గురించి బాలకృష్ణ తీసిన కథానాయకుడు సినిమాలో నిజం చెప్పారా? లేక వర్మ తీస్తున్న లక్ష్మీస్ ఎన్టీఆర్‌లో నిజం చెబుతారా? ఈ రెండూ కాకుండా నాదెండ్ల భాస్కరరావు యూ ట్యూబ్ చానల్‌లో చెబుతున్నది నిజం అంటావా?’’
‘‘ఆ మూడే ప్రస్తావించా వేం? అప్పటి ఘటనలకు పాత్రధారిగా ఉన్న దగ్గుబాటి వెంకటేశ్వరరావును వదిలేశావేం?’’
‘‘మూడింటిలో నిజమేదో తెలుసుకోలేక చస్తుంటే ఇక నాలుగోదా? ఆయన కూడా సినిమా తీస్తున్నారా?’’
‘‘ఆయనకూ సినిమాలతో సంబంధం ఉంది. భగత్‌సింగ్ సినిమా తీయాలనుకున్నారు. 1995 నాటి వెన్నుపోటుపై సినిమా తీస్తానని ప్రకటన చేసినా ఎందుకో తీయలేదు. కానీ అప్పుడేం జరిగిందో పుస్తకంలో రాశారు, ఇంటర్వ్యూల్లో చెప్పారు. ’’
‘‘సరే.. ఈ నాలుగులో ఇంతకూ ఎవరి మాట నిజమంటావు’’
‘‘నాలుగుకే పరిమితమయ్యావేంటి? ఏది నిజమో ఎన్టీఆర్ చెప్పారు కదా? అది వద్దా? జామాతా దశమ గ్రహం అని ఏం జరిగిందో తనకు ఎలా ద్రోహం చేశారో, వెన్నుపోటుకు తానెలా బలయ్యానో స్వయంగా ఆయనే తన స్వరంతో చెప్పారు. ఆ సీడీకి రచన, దర్శకత్వం, నటన అన్నీ ఆయనే’’
‘‘నిజంగా విచిత్రమేనోయ్! ఏం జరిగిందో ఆయనే తన స్వరంతో తానే చెప్పినా ఏది నిజం? అని మనం ఆలోచిస్తున్నాం. ’’‘‘ అప్పుడు ఏం జరిగిందో పాత్రధారులు , బాధితుడైన ఎన్టీఆర్ , సాక్షులైన పాత్రికేయులు అందరూ చెబుతున్నారు , రాస్తున్నారు కానీ అసలు సూత్రధారి ఐన ఆగస్టు కథానాయకుడు ఏం జరిగింది ?ఎలా జరిగింది? ఎందుకు జరిగింది అనే దానిపై అప్పటి నుంచి ఇప్పటి వరకు ఓపెన్ గా ఏమీ చెప్పలేదు ’’

‘‘ నిజమా ?’’
’’కావాలంటే పాత పత్రికలూ తిరగేయ్ మనోగతం అంటూ మీడియా రాయడమే తప్ప దీని గురించి ఆయన ఎప్పుడూ .. ఎక్కడా ఓపెన్ గా మాట్లాడలేదు ’’
‘‘నమ్మలేక పోతున్నాను ’’
‘‘పోనీ.. నే ను చెప్పనా?’’
‘‘ముందు నిన్నే అడిగాను కదా? ఏది నిజమో చెప్పుమని’’
‘‘అన్నీ నిజాలే.. అన్నీ అబద్ధాలే’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘ప్రతి సంఘటనను ఎవరి కోణంలో వారు చూస్తారు. టీడీపీ ఎన్టీఆర్ రెక్కల కష్టం కదా? 1994లో ప్రతిపక్ష స్థానానికి అవసరమైన సీట్లు కూడా మిగల్చకుండా ఏకపక్షంగా విజయం సాధించి పెడితే, తన నుంచి సీటు లాగేసుకుని అవమానకరంగా దించేయడం ఎన్టీఆర్ కోణంలో జామాతా దశమ గ్రహం సీడీని విడుదల చేయించింది. ఎన్నో ఆశలతో అధికారం కోసం కాచుకుని కూర్చుంటే మధ్యలో లక్ష్మీపార్వతి వచ్చి తన్నుకుపోయేట్టు ఉంది. ఈ అన్యాయాన్ని సహించక ఎన్టీఆర్‌ను దించేయాలనుకోవడం బాబు కోణంలో న్యాయం. సంఘటన ఒకటే- కోణాలు వేరువేరు. ఎవరి కోణంలో వారిదే న్యాయం. ఇతరుల కోణంలో అది అన్యాయం.’’
‘‘ఆ ఒక్క అంశమే కాదు. మిగిలిన విషయాల గురించి?’’
‘‘మన క్లాస్‌మేట్ పాండు వాళ్ల ఆవిడ మా వారు శ్రీరాముడు పరాయి ఆడవారిని కనె్నత్తి చూడడు అనుకుంటుంది కదా? నీ అభిప్రాయం చెప్పు’’
‘‘వాడు కాలేజీలో చదివే రోజుల్లో వాడి షోకిళ్లా రాయుడి జీవితం మనం ఎన్నిసార్లు చూడలేదు. వద్దు రా అని ఎన్నిసార్లు చెప్పాం’’
‘‘అప్పటి సంగతి వదిలేయ్.. ఇప్పుడు..’’
‘‘వాడికా అలవాట్లు ఇప్పటికీ పోలేదు. ఎప్పుడూ క్యాంపులే’’
‘‘పాతికేళ్ల నుంచి కాపురం చేస్తున్నా పాండుగాడి గురించి వాళ్ల ఆవిడకే నిజాలు తెలియదు. ప్రత్యక్షంగా చూసే అవకాశం లేనపుడు- వారి జీవితంలో ఏం జరిగిందో ఎవరికేం తెలుసు? తెరపై కనిపించే నటుడి, నాయకుడి జీవితం గురించి ఎవరికైనా ఎంతవరకు తెలుస్తుంది?’’
‘‘ఎన్టీఆర్ స్వయంగా వచ్చి తన గురించి ఇప్పుడు తాను చెప్పాలంటావా?’’
‘‘అలా చెప్పినా అన్నీ నిజాలే చెప్పారని ఒప్పుకుంటామా?’’
‘‘అంటే...’’
‘‘ఎక్కువగా ఊహించకు. నేనే అభిప్రాయం చెప్పడం లేదు, ఏ అభిప్రాయాన్ని ఖండించడం లేదు..’’
‘‘మరేం చెబుతున్నావ్?’’
‘‘వాళ్ల గురించి, వీళ్ల గురించి ఎందుకు? నీ గురించి నీకు తెలుసా? నా గురించి నాకు తెలుసా?’’
‘‘తెలియదా?’’
‘‘ శ్రీరాముడు వశిష్టుని ఇంటికి వెళ్లి తలుపు తడితే ఎవరు? అని వశిష్టుడు ప్రశ్నిస్తాడు. ‘అది తెలుసు కోవడానికే వచ్చాను’ అని శ్రీరాముడు సమాధానం చెబుతాడు. మహామహా తత్వవేత్తలంతా నిన్ను నువ్వు తెలుసుకో- అన్నారు. మనకు మనమే తెలియనప్పుడు ఇతరుల గురించి అది నిజమా? కాదా? ఏది నిజం? అని ఎలా నిర్థారిస్తాం’’
‘‘ఇప్పుడు నా గురించి నన్ను తెలుసుకోమంటావా?’’ *

-బుద్దామురళి (జనాంతికం 18-1-2019)
దీనికి సబ్స్క్రయిబ్ చేయి:
పోస్ట్‌లు (Atom)