18, మే 2012, శుక్రవారం

మీరు రంగనాయకమ్మ అభిమానులా ? వ్యతిరేకులా ?మీరు ఏదయినా కావచ్చు .. బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు . నేను రంగనాయకమ్మ అభిమానిని కాదు, వ్యతిరేకిని కాదు .  నవ్యలో ఆమె తన పాటకుల ముచ్చట్లు రాస్తున్నారు . వ్యక్తుల మనస్తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారు చదవాల్సిన ముచ్చట్లు . చదువుకునే రోజుల్లో రంగనాయకమ్మ రామాయణ విష వృక్షం చదివాను .( రంగనాయకమ్మ రచనల్లో విష వృక్షం, మాట్లాడే తెలుగులోనే రాస్తున్నామా మాత్రమే చదివాను )  విష వృక్షం లోని వ్యంగ్యం అప్పుడు బాగా నచ్చింది . కానీ ఇప్పటి అభిప్రాయం వేరు. హిందూ దేవుళ్ళ గురించి ఇలా రాసే వారు ఇతర మతాలలోని తప్పులపై ఇలా రాయగలరా ? రాయలేనప్పుడు ఒక్క హిందూ మతం పైనే ఎందుకు రాస్తారు? 
ఇక రంగనాయకమ్మ  తన పాటకుల చిత్ర మైన వైకరి  గురించి రాశారు . నాకయితే రంగా నాయకమ్మ వైకరే కొంత చిత్రంగా అనిపించింది . గొప్ప తెలివైన అభిమాని అని ఒకరి గురించి రాశారు . ఆతను నాస్తికుడు , భార్య భక్తురాలు. తన భార్య గురించి పరాయి వ్యక్తి ముందు అంతా చులకనగా మాట్లాడే వ్యక్తి నాకయితే దిగజారిన వ్యక్తిగా అనిపించాడు. అతన్ని రంగనాయకమ్మ మాత్రం గొప్ప వ్యక్తిగా పరిచయం చేశారు .ఎవరి నమ్మకాలూ వారివి భార్య నమ్మకాన్ని ఇతరుల వద్ద గేలి చేసే వ్యక్తినీ ఏమనాలి. ...
సాధారణంగా సినిమా నటులు తమ అభిమానుల గురించి బహిరంగంగా పొగుడు తారు కానీ వారితో విడిగా మాట్లాడితే అభిమానులను యెంత చులకనగా చూస్తారో తెలుస్తుంది . మల్లాది వెంకట కృష్ణ మూర్తి తనకు పరిచయం ఉన్న సంపాదకుల గురించి కౌముదిలో రాస్తున్నారు.. ఒక రచయిత తన అభిమానుల గురించి ( పాటకుల గురించి ) రాసే శీర్షిక బహుశా ఇదే మొదటిదేమో . విభిన్న మనస్తత్వాలు గల వ్యక్తుల గురించి తెలుసుకోవాలనే ఆసక్తి ఉన్న వారు చదవదగిన శీర్షిక 

76 కామెంట్‌లు:

 1. బహుశా రష్దీ గురించికూడా ముస్లిములు, డాను బ్రౌను గురించి క్రిస్టియనులూ కూడా ఇలాగే ఆలోచించుంటారండీ. "వాళ్ళనంటే ఊరుకుంటారా?" అని. విమర్శను ఎదుర్కోవడానికి ద్వేషమే సరైనమార్గమంటారా? అశ్లీలమైనది కానంతవరకూ విమర్శమంచిదే. ఒక work మంచిదోకాదో తెలవాలంటే విమర్శతప్పనిసరి, ఆవిమర్శ్లమీద చర్చలు జరగడం తప్పనిసరి, ఆ విమర్శలు తట్టుకొని నిలబడగలగడం తప్పనిసరి. విమర్శలులేకపోతే అది ఎంతగొప్ప piece of art అయినా పూర్తిగా ఏకపక్షంగా ఉండిపోతుంది, వేరేదారిలేదుకాబట్టి మెచ్చుకోక తప్పనిసరైన పరిస్థితి వచ్చిపడుతుంది.

  రిప్లయితొలగించండి
 2. ఇండియన్ మినర్వా గారు స్పందిన్చినందులకు ధన్యవాదాలు . విమర్శ వేరు ఒక మతాన్ని మరీ చులకన చేస్తూ వ్యక్యనాలు చేయడం వేరండి . పోనీ అదే పని ఇతర మతాల పై ఎందుకు చేయరు . ఎందుకంటే హిందూ మతం సంస్కరణలకు ఆవ్హనం పలికే మతం . మహాత్మా గాంధీ హిందూ మతం గురించి రాసిన బుక్ లో దీని గురించి చక్కగా రాశారు.( తెలుగు అనువాదం చదివాను ) ఒక దశలో మతం మారాలని అనుకున్నా మహాత్ముడు అన్ని మతాలను అద్యయనం చేశారు . సంస్కరణలకు అవకాశం ఇచ్చే మతం హిందూ మతం మాత్రమే అని పేర్కొన్నారు . అందుకే మతం మారలేదు .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. హిందూ మతంతో ఉన్న సమస్య ఒక్కటే!! ఆ మతం మీద రాసిన పుస్తకాలూ, ఆ మత ప్రామాణిక గ్రంథాలూ, ప్రవచనాలూ అన్నీ ఆదర్శాలతో, త్యాగాలతో, నీతీనియమాలతో నిండిపోయి ఉంటాయి. ఆచరణలో మాత్రం ఇవన్నీ పాటించే హిందువులు దాదాపు శూన్యం!!

   రంగనాయకమ్మ సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా హిందూమతం dominating గా ఉన్న దేశంలో, హిందూమతం పుట్టిన దేశంలోనే పుట్టారు. స్వయంగా హిందూ మతంలోనే పుట్టారు. భారతదేశంలో మతం పేరిట సాగే మోసాలూ, అకృత్యాలూ, మారణకాండల్లో హిందూమతానిదే మెజారిటీ భాగం కాబట్టి హిందూమతం లోని లోపాల గురించి విమర్శించారు. ఏ అరేబియాలోనో, ఇటలీలోనో పుట్టి ఉంటే, విప్లవభావజాలంతోనే పెరిగి ఉంటే ఇస్లాం మీదో, క్రైస్తవం మీదో రాసుండేవారు.

   తస్లీమా నస్రీన్ ఇస్లాం మీదే ఎందుకు పుస్తకాలు రాసింది, హిందూ మతం మీదో, క్రైస్తవం మీదో ఎందుకు రాయలేదు అని అడిగేవాళ్లకు ఏమని జవాబు చెప్పగలం!!

   అంబేడ్కరిస్టులైతే హిందూమతాన్నే ప్రధానాలక్ష్యం చేసుకుని విమర్శించారు, వాళ్ల కారణాలు వాళ్లకున్నాయి. రంగనాయకమ్మ మార్క్సిస్టు కావడం వల్ల దేవుడ్నీ, అన్ని మతాలనీ, మూఢవిశ్వాసాలనీ, అప్పుడప్పుడు గుడ్డి ఆచారాలనీ కూడా విమర్శించారు. హిందూ మతాన్ని విమర్శించింది కాబట్టి రంగనాయకమ్మ ఇస్లాంకో, క్రైస్తవానికో, బౌద్ధానికో సానుభూతిపరురాలు అనో, వాళ్ల ఏజెంటు కాకపోతే వాళ్ళనెందుకు విమర్శించట్లేదు అనో అనుకోవడం మూర్ఖత్వం!! మీ సమస్య రంగనాయకమ్మ హిందూత్వాన్ని విమర్శించడమా, లేక మిగతా మతాలను విమర్శించకపోవడమా?? రేపు రంగనాయకమ్మ ఇతర మతాలను కూడా విమర్శిస్తే, ఆవిడను సమర్థిస్తారా??

   హిందూమతం సంస్కరణలకు పుస్తకాలల్లో మాత్రమే ఆహ్వానం పలుకుతుంది. ఆచరణలో మాత్రం సంస్కరించడానికి ప్రయత్నాలు చేసినవాళ్ల మీద భౌతిక దాడులు జరుపుతుంది. ఒకవైపు బుద్ధున్ని దశావతారాల్లో ఒకడిగా పేర్కొంటూనే, మరోవైపు క్రీస్తుపూర్వమే హిందూమతంలోని అసమానతలను ఎత్తిచూపిన బౌద్ధులపై దాడులు చేసి, ఎందరినో హతమార్చి, వాళ్ల గ్రంధాలనూ, ఆలయాలనూ మట్టిపాలు చేసిన హిందూ మతం సంస్కరణలకు ఆహ్వానం పలుకుతున్నట్టా??

   మొన్నటికి మొన్న ఒడిసాలో వేరే మతంలోకి మారిన గిరిజనులపై, దళితులపై దాడులు, అత్యాచారాలు, సజీవదహనాలూ చేసింది ఆధునిక యుగంలోని హిందూ మతం!!

   దళితులూ హిందువులే అంటారు, కానీ హిందూ దేవాలయాల్లోకి ప్రవేశముండదు. కనీసం హిందూ శ్మశానవాటికల్లోకి కూడా ప్రవేశముండదు. సాటి హిందువుల సరసన కూర్చుని చదవలేరు, తిండీ తినలేరు!!

   హిందూ పుస్తకాలు చెప్పే పరమత సహనాలూ, సంస్కరణవాదాలూ అంతా వొట్టి బోగస్, వొట్టి hypocrisy!! ఆచరణలో మాత్రం పరమత ద్వేషాన్ని దాటి హిందూ ఐకమత్యం ఎదగదు. కులాలు, ఉపకులాలు, గోత్రాలు, అంటరానివాళ్లు అంటూ పరస్పరం కొట్టుకుచచ్చే హిందువులు ఐకమత్యంతో చేసేది ఒక్కటే, ఇతర మతాల మీద దాడి!!

   హిందూ మతం మీద విమర్శలు వచ్చినప్పుడు (సంస్కరణవాదం నిజమైతే) ఆ విమర్శల్లో ఎంతో కొంత నిజముంది కాబట్టి, మారడానికి ప్రయత్నించాలి, ఆ లోపాలను అధిగమించాలి. అంతే కానీ, ఇస్లాంనెందుకు విమర్శించలేదు అని అడ్డంగా వాదించకూడదు. అది సంస్కరణవాదం అవ్వదు, పిడివాదం అవుతుంది!!

   తొలగించండి
 3. బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు Good Nature!

  :)

  ?!

  రిప్లయితొలగించండి
 4. హిందూమతం సంస్కరణలను ఆహ్వానిస్తుంది అని మీరుచెప్పిన విషయాలతో ఏకీభవిస్తున్నానండీ.

  ఏమతమైనా అది విమర్శలనికూడా అంగీకరించగలిగే స్థాయికి ఎదగాలి అంటున్నాను. అయినా నేను సమర్ధించింది విమర్శించడాన్నే, ఈ చులకన చెయ్యడాన్నికాదు. అలాగని విమర్శించడాన్నే చులకనచెయ్యడంగా పరిగణించకూడదు. ఈరెంటికీ తేడామాత్రం ప్రస్తుతానికి నాకే clearగా లేదు :)

  రిప్లయితొలగించండి
 5. తెలుగు సాహితీవనంలో ఉన్న ఒకానొక చీడపురుగు ఈ రంగనాయకమ్మ. తన జీవితం ఏదో అయిందని చెత్త రచనలు చేసి యువతకు, ముఖ్యంగా యువతులకు, విషపూరిత ఆలోచనలు ఎక్కించే ఓ అంటువ్యాధి అని నా own, personal స్వాభిప్రాయము.

  రిప్లయితొలగించండి
 6. ranganayakamma gari konni pusthakalu chadivanu,
  endokanno ame purthi reverse lo vasthaaru.
  different shade of thinking.

  రిప్లయితొలగించండి
 7. ఆమే హిందువుల గురించే కాదు, బ్రాహ్మణుల గురించి కూడా నోరుపారేసుకొనింది. ఇక బలిపీఠం కథ లో హీరో పాత్ర గారు నిజజీవితం లో నాలుగు పెళ్లిళు చేసుకొన్నాడని,దాసరి నారాయణ రావుని తన కథ సినేమా తీస్తున్నందుకు డబ్బులు డిమాండ్ చేశాడని ఆమే తరువాత రాశారు. అటువంటి వ్యక్తిత్వంలేని వ్యక్తి వచ్చి తన జీవితంలో జరిగిన సంఘటనలను ఆధరంగా కథ రాయమంటే, ఈమే ముందు వెనుక ఆలోచించకుండా అతని మాటలు నమ్మి బాగా మసాల జోడించి కథ రాశారు. దోపిడి సమాజంగురించి విస్తారమైన అవగాహన కలిగిన రంగనాయకమ్మ, తనదైన కోణంలో బ్రాహ్మణుల దోపిడిని ఎండగట్టాలనుకొంటే వారి దగ్గర ఎమీ చిక్కలేదు. పేదరికం తప్ప. అందువల్ల సదరు రంగనాయకి ఆసినేమా నిండా బ్రాహ్మణులు ( వీళ్ళు పేద వారు), డబ్బుగల సమాజాన్ని దోచుకొని (సినేమాలో శారదా)వారోక్కరే అనుభవించిన సుఖాలు లిస్ట్ చాలా చూపుతారు. వంకాయ పచ్చడి, పండు గుమ్మడికాయ పులుసు చేసుకొని తినటానికి వారు చేసే మొసాలు,కుట్రలు కుతంత్రాలు అబ్బో చెప్పాలంటే చాంతాడంత లిస్ట్ వస్తుంది. కథలో హీరోయిన్ మీద, దళితుల మీద సానుభూతి పెంచటానికి ఆమే బ్రాహ్మణుల దోపిడిని (నెయ్యి వేసుకొని నచ్చిన తిండి తినటం)చాలా బాగా ఎండగడతారు. గత 30సం|| రాష్ట్రంలో జరిగే దోపిడి ని చూసి, చేసే వర్గాలను చూసి ఆమే ఎక్కడైనా కథల నవల రూపంలో నోరు విప్పారా? మీకెవరికైనా తెలిసితే పుస్తకాల పేర్లు రాయండి.

  రిప్లయితొలగించండి
 8. చలం పుస్తకాలు చదివి, ప్రభావితుడైన గాంధి (ఆమే రెండో భర్త)ఆమేకి మొగుడుగా అన్నా దొరికాడు. ఈవిడ పుస్తకాలు చదివి మంచి మనిషిగా మారిన వారెవరు కనపడరూ, బ్లాగులో మార్థాండ (ప్రవీణ్ శర్మ ) లాంటివారు తప్ప. ఈ మధ్య ఇద్దరు ముగ్గురు దారి తప్పిన నడివయస్కులు అంతర్జాతీయ వార్తల బ్లాగులో కనపడటం మొదలు పెట్టారు. ఆమే పుస్తకాలు చదివి మధ్యతరగతి వారు ,చిరుద్యోగులకు,నిరుద్యోగులు ఇతరదేశాలను తిట్టిపోస్తుండటం తప్ప, ఆమే సాధించింది ఎమీ లేదు.

  రిప్లయితొలగించండి
 9. ఇప్పటి వరకు రంగనాయకమ్మ రచనలు నేను చూడలేదు కాబట్టి అభిమానిని ,వ్యతిరేకిని కాదు. కాకపొతే మీ వ్యాఖ్య

  " హిందూ దేవుళ్ళ గురించి ఇలా రాసే వారు ఇతర మతాలలోని తప్పులపై ఇలా రాయగలరా ? రాయలేనప్పుడు ఒక్క హిందూ మతం పైనే ఎందుకు రాస్తారు? "

  ఈ విమర్శ ఇతరమతాలలో పుట్టి పెరిగిన వారికి సంబంధించినది. రంగనాయకమ్మ బాధ్యురాలు కాదు. అలాగే రంగనాయకమ్మ ని చూపించి ఇతరమతాలవారిని అడిగేరు పొరపాటున :)

  ముస్లిం లు, క్రిస్టియన్స్ లో కూడా బోలెడు మంది నాస్తికులు ఉన్నారు(కనీసం నాకు తెలిసినవారు ).కాని ఈ విధమైన రచనలు రాకపోవడానికి కారణం తెలియాలంటే వాళ్ళ మతగ్రంధాలకు , హిందూ మతగ్రంధాలకు మధ్య బేధం ఏమిటో చర్చించాలి, కాదంటారా ?

  రిప్లయితొలగించండి
 10. @అతన్ని రంగనాయకమ్మ మాత్రం గొప్ప వ్యక్తిగా పరిచయం చేశారు .ఎవరి నమ్మకాలూ వారివి భార్య నమ్మకాన్ని ఇతరుల వద్ద గేలి చేసే వ్యక్తినీ ఏమనాలి. ...


  భార్యను గేలి చేసినట్లు గా అనిపించడం లేదండీ , కనీసం ఆమె వ్రాసిన సంభాషణలో ఆ భావం అసలు లేదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. నువ్వు మీ అప్పాఇప్పుడే ముసిలాళ్ళు . మీకు చిన్న తనం లేదు . పడుచుదనం లేదు . సొంత బుర్ర లేదు మీరు ఇప్పటి నుంచే ముసిలాళ్ళు .............
   --------------------
   మౌళి గారు
   ఈ మాటలు ఆ వ్యక్తి తన భార్య గురించి రంగనాయకమ్మ , ఆమె భర్త పిల్లలా ముందు అన్నారట
   భార్యకు బుర్ర లేదు అని ఆమె లేనప్పుడు పరాయి వ్యక్తుల ముందు అనడం అవమానించడమే . ఆమె అక్కడ ఉంటే ఆ మాటలకు సమాధానం చెప్పి ఉండే వారేమో
   ౧.. ఎవరి నమ్మకాలూ వారివి అని భార్య నమ్మకాలను గౌరవించడం భర్త విధీ ఆ మధ్య అక్కినేని నాగేశ్వర్ రావు గారు నాకు దేవుడి పై విశ్వాసం లేదు కానీ నా బార్య, పిల్లలా సంతోషం కోసం వారితో పాటు పూజ చేస్తానని చెప్పారు
   అతని వయసు ౪౦ అని చెప్పారు అంటే పెళ్లి అయి దాదాపు ౧౫ ఏళ్ళు అయి ఉంటుంది. అంత కాలం లో భార్యకు తన సిద్ధాంతం చెప్పి ఒప్పించలేక పోయారు
   నా దృష్టిలో మాత్రం ఆతను నాస్తికుడిగా విఫలం అయ్యాడు, బార్యను గౌరవించడం లో ఒక భర్తగా విఫలం అయ్యాడు

   తొలగించండి
  2. లేదండి, అది వారిని అవమానించడం కాదు. ఇలా అయితే లాయర్ దగ్గరా, డాక్టర్ దగ్గరా నిజాలు చెప్పడం కూడా సంబంధిత వ్యక్తుల్ని అవమానించడమే అవుతుందా ? నమ్మిన రచయిత తో కూడా అంతే.

   అక్కినేని నాగేశ్వరరావు నమ్మకాలతో మనకేం పని అండీ. కడుపున పుట్టిన వాళ్ళే, పెద్దవాళ్ళ పూనకం ,చేతబడి జ్యోతిష్యం మొదలైన నమ్మకాలను ఎగతాళి చేస్తారు , అంటే తమ తల్లి దండ్రులను చులకన చేసినట్లవుతుందా ? ఎలా అవుతుంది ?

   అతని భార్య అతని సిద్దాంతం కొంతవరకు ఒప్పుకొన్నట్లే కనిపిస్తుంది. పూర్తిగా ఎవరు మారిపోరు, వారికే సంబంధించిన అనుభవాలు ఎదురయ్యేవరకు (ఆస్తికులైనా, నాస్తికులైనా )

   ఆ వ్యక్తి విఫలం అయ్యారో లేదా అని వదిలేస్తే విస్లేశాకుడి గా మీరు విఫలం అయ్యారు :)

   (రంగనాయకమ్మ పేరు ని పక్కన పెట్టినా, మీ టపా కి మరియు ఆ చర్చకి సంబంధించి నా వ్యాఖ్యానం ఇలానే ఉంటుంది )

   తొలగించండి
 11. తనకు నచ్చని పుస్తకాలని, మనుషులని చీల్చి చెండాడటమే విమర్శ ఆమె ద్రుస్టిలో. అదో విమర్శ అనుకోవటం లోనే మన తెలుగు సాహిత్య స్థాయి తెల్సిపోతోంది.

  రిప్లయితొలగించండి
 12. మురళి గారు, రంగనాయకమ్మ గారు హిందూ మతాన్ని మాత్రమే ఎందుకు విమర్శించారు అని మీరు అడిగారు కాబట్టి చెపుతున్నాను. ఇబ్న్ వరాక్ ఇస్లామిక్ చాంధసవాదాన్ని మాత్రమే విమర్శిస్తాడు కానీ హిందూ చాంధసవాదాన్ని విమర్శించడు. ఎందుకంటే అతని సొంత దేశం (పాకిస్తాన్)లో ఇస్లాం మతమే బలంగా ఉంది. హిందూ మతాన్ని విమర్శిస్తే అతనికి ఏమీ రాదు. అలాగే ఇండియాలో నాస్తికులు మొదట హిందూ మతాన్నే విమర్శిస్తారు. పాకిస్తాన్‌లోని స్కూల్ పుస్తకాలలో హిందువుల గురించి ఎంత చెత్తగా వ్రాసారో మొబీన్ చుగ్తాయ్ అనే ఒక ముస్లిం చెప్పిన తరువాతే తెలిసింది. ఇస్లామిక్ దేశాలలోని మైనారిటీల జీవితాల గురించి ముస్లింలు నిజాలు మాట్లాడితే తప్పు లేనప్పుడు హిందూ సమాజంలోని సాంఘిక దురాచారాల గురించి హిందువులు మాట్లాడితే తప్పెలా అవుతుంది?

  కొంత మంది రంగనాయకమ్మ గారిని "ఆవిడ కేవలం డబ్బుల కోసం రామాయణ విషవృక్షం వ్రాసింది" అని విమర్శిస్తున్నారు. ఆ విమర్శ ఒక జోక్ మాత్రమే. ఎందుకంటే డబ్బులే కావాలనుకుంటే జ్యోతిష్యం-వాస్తు పుస్తకాల వల్ల డబ్బులు ఎక్కువ వస్తాయి. మార్కెట్‌లో ఆ పుస్తకాలే ఎక్కువగా అమ్ముడుపోతున్నాయని చాలా మందికి తెలిసినదే కదా.

  రిప్లయితొలగించండి
 13. నాకు మార్క్సిజం-లెనినిజం మొదట పరిచయం చేసినది రంగనాయకమ్మ గారు కాదు. కమ్మ కుటుంబం నుంచి వచ్చి తన కులాన్నే ద్వేషించే ఒక కెనడా NRI అమ్మాయి ద్వారా నేను మొదట మార్క్సిజం-లెనినిజం గురించి తెలుసుకున్నాను.

  రిప్లయితొలగించండి
 14. @Mauli@Pavani@జయహొ@the tree@జీడిపప్పు@ఎందుకో ? ఏమో@Indian Minerva
  స్పందించి నందుకు ధన్యవాదాలు సల్మాన్ రష్డి అలా రాసినందుకు చివరకు మతం మార్చుకున్నా అతన్ని వదిలి పెట్టడం లేదు. హిందూ మతం లో ఇలా అయితే లేదు కదండీ .. రంగనాయకమ్మ హిందువు కాబట్టి హిందూ మతం లోని లోపాలే రాశారు అనే మాట సమర్ధనీయం కాదనుకుంటా ...నేను హిందూ మతం లోని చెడును ఎత్తి చుపించావద్దని అనడం లేదు, అలా ఎత్తి చూపిస్తేనే సంస్కరించుకోవడానికి అవకాశం ఏర్పడుతుంది. కానీ ఆన్నీ మతాలలోని చెడును ఎందుకు ప్రస్తావించారు అనేదే నా ప్రశ్న ... హేతువాది, శాస్త్రీయంగా విశ్లేషణ చేసే వారు ఎవరయినా ఒక మతానికే పరిమితం కావడం ఏమిటి ? అన్ని మతాల గురించి తెలుసుకోవాలి కదా ? రంగనాయకమ్మ హిందూ మతానికే పరిమితం అయితే హిందుత్వ వాది అవుతారేమో ( ద. హా ) ఆమె లాంటి వారు అన్ని మతాల గురించి తెలుసుకోవాలి, మన లాంటి వారికి చెప్పాలి . నేనేమి రంగనాయకమ్మ వ్యతిరేకిని కాదు . హేతు వాదం ఆలోచన పరిధిని విస్తరించుకోమని చెబుతుంది . మరి కొందరు హేతువాదులు ఒక మతానికే పరిమితం కావడం ఏమిటి ? క్లాస్స్ లో బెత్తం పట్టుకొని పాటలు చెప్పే పంతులమ్మ క్లాస్స్ లో అందరూ పిల్లలను సమంగా చూస్తే క్లాస్స్ క్రమ శిక్షణతో ఉంటుంది అలా కాకుండా ఒకరినే టార్గెట్ చేసుకొని అల్లరి చేస్తున్నావని కొట్టి మిగిలిన వారిని వదిలేస్తే క్లాస్స్ ఎలా ఉంటుంది. ఓ సారి ఇదే అంశం పై ఒక ముస్లిం మిత్రుడితో చర్చ జరిగింది. ప్రభుత్వం , నాయకులు, లౌకికవాదులం అని చెప్పుకునే వారు ముస్లిం సంతృప్తికర విధానాలు అవలంబిస్తున్నరనే అసంతృప్తి చాలా మంది హిందువుల్లో ఉందని చెబితే ఆతను ఓట్ల కోసం ప్రముఖ నాయకులు కూడా నెత్తిన టోపీలు, వేసుకొని రావడం వల్ల అది చూసి హిందువులకు అసంతృప్తి కలగ వచ్చు కానీ ముస్లిం లకు ఒరిగేదేమీ లేదు అని చెప్పాడు. సచార్ కమిటీ నివేదిక సైతం అదే చెబుతుంది .ముస్లిం లా పరిస్థితి దయనీయంగా ఉందని. తోపిల తమాషాలు కాకుండా వారి మేలు కోసం ఏదయినా చేయాలి. మేధావుల సద్విమర్శలు ఎప్పుడూ మతానికి మంచిదే . ఒకప్పుడు హిందూ మతం లో అంటరాని తనం ఉంది, తప్పని గ్రహించారు. సముద్రయానం చేయకూడదని అన్నారు, తరువాత తప్పని తెలుసుకున్నారు . అయినా ఈ అంశం ఒక కామెంట్ తో చెప్పేంత చిన్నది కాదు .

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. @హేతువాది, శాస్త్రీయంగా విశ్లేషణ చేసే వారు ఎవరయినా ఒక మతానికే పరిమితం కావడం ఏమిటి ? అన్ని మతాల గురించి తెలుసుకోవాలి కదా ?

   మతవాది(కరెక్టేనా) ఎవరయినా, అన్ని మతాలను ప్రేమించాలి, వాళ్ల ఒక్క మతాన్నే కాదు అన్నట్లుంది మీ వ్యాఖ్యానం, కాదా?

   అయితే మీరు మతాన్ని నమ్ము తారు కాబట్టి అన్ని మతాలని నమ్మాలి, అన్ని మతాల్ని పాటించాలి, మీ ఒక్క మతాన్నే కాదు . అంతేనా మీరు చెప్పేది ?

   తొలగించండి
  2. మౌళి గారు మీరు ఏమయినా అనుకోవచ్చు అది మీ ఇష్టం . మతం పై అభిమానం ఉన్న వాళ్ళు అన్ని మతాల గురించి తెలుసుకుంటే మంచిదే . నా మతం గురించి తప్ప నాకు మరో మతం తెలియదు అని భక్తుడు అనవచ్చు కానీ , హేతువాది , నాస్తికులు నాకు హిందూ మతం తప్ప మరో మతం తెలియదు అంటే సిల్లీగా ఉంటుంది.

   తొలగించండి
  3. సిల్లీ గా ఉండదు, మీరు ఆశించిన విధం గా ఉంటె నాస్తికులందరూ మహాత్మా గాంధీ లు అయిపొరూ, మీది మరీ అత్యాస సుమండీ .

   మొత్తానికి ఆస్తికుడు ఎంత స్వార్దపరుడైనా పర్లేదు కాని నాస్తికుడు నిస్వార్ధ పరుడై ఉండాలంటారు.

   (మీరన్న దానికి ఈ పోలిక తట్టింది మరి, కరెక్టో కాదో చెప్పండి )

   తొలగించండి
  4. మౌళి గారు సరదాగా అడుగుతున్నాను ...స్కూల్ లో పిల్లలకు టిచర్ పాటలు చెబుతుంది . పిల్లలు వింటారు . మీకెంత తెలుసో నాకు అంతే తెలుసు అని టిచర్ అంటే ఎలా ఉంటుంది .కచ్చితంగా పిల్లల కన్నా టిచర్ ఎక్కువగా తెలిసి ఉండాలి . రంగనాయకమ్మ దృష్టిలో అయినా , నాస్తికుల దృష్టిలో అయినా భక్తులు అంటే ఎమీ తెలియని వాళ్ళు కదా , నాస్తికులంటే అంతా తెలిసిన వాళ్ళు . కాబట్టి కచ్చితంగా నాస్తికు లకు అన్ని మతాల గురించి తెలిసి ఉండాలి .. హనుమంతుడి బొమ్మ కనిపించింది అనుకోండి భక్తుడు భక్తి భావంతో మొక్కుతాడు . అతనికి హనుమంతుని జీవిత చరిత్ర , బలా బలాలు అవన్నీ తెలియాల్సిన అవసరం లేదు హనుమంతుడు దేవుడు అని నమ్ముతున్నాడు , ఆ నమ్మకం తో మొక్కుతున్నాడు . అదే నాస్తికుడయితే దేవుడు లేదు అనే కాదు ఎందుకు లేడో, ఏ మతం వారు ఎవరిని మొక్కుతారో విడమరిచి చెప్పాలి అంతే తప్ప రంగనాయకమ్మ గారు దేవుడు లేడని అన్నారు. నేను ఆమె భక్తుణ్ణి కాబట్టి దేవుడు లేడు అని చెబితే కుదరదు . అందుకే నాస్తికునికి భక్తునితో పోలిక లేదు అన్ని తెలిసి ఉండాలని అన్నాను అంతే తప్ప పక్షపాతం కాదు

   తొలగించండి
  5. దేవుడు కి భక్తుడికి మధ్య సంబంధాన్నే, మీరు నాస్తికుడికి భక్తుడికి మధ్య కూడా పెట్టేసి నన్ను ప్రశ్నిస్తున్నారు :)

   నాస్తికులే అమాయకులండీ బాబు. భక్తులే సాయిబాబా, ఏసునాధుడు , అల్లా ముగ్గురు కూడా విష్ణుమూర్తి అవతారాలే అని బోలెడు ప్రచారం చేసేసారు. ప్రచారం మాత్రమె చేసారు కాని సాయిబాబాతో పాటు మిగతా ఇద్దరినీ పూజించలేదు గా ...మితిమీరిన తెలివి కాదూ ఇది :) )

   నాస్తికులు మిగతా మతాలవారి విష్యం లో కలిపించుకోకపోవడం పై మీరు చెప్పేది ఏంటి అంటే, ఫిజిక్స్ లో రీసెర్చి చేసిన వాడిని బయాలజీ ఎందుకు వదిలేసావు అని పీక్కు తిన్నట్లు ఉంటుంది.

   కనీసం ప్రశ్న అడిగే వాడు జ్ఞానం తో అడిగినా సమస్యలేదు, ఆ భక్తునికి మిగిలిన మతాలపై అభిమానం ప్రేమ ఉండి వాళ్ళ దేవుళ్ళని కూడా సమానం గా పూజించినపు డు నాస్తికుడిని కూడా అలానే ప్రశ్నిం చ వచ్చు .

   తొలగించండి
  6. నాస్తికులే అమాయకులండీ బాబు.
   .......................


   సాధారణ జనం కన్నా కాస్త చదువుకున్న వారు , తెలిసినవారు , తెలివైన వారు నాస్తికత్వం , హేతువాదం గురించి మాట్లాడతారు అనేది సాధారణ అభిప్రాయం . మరి మీరేమో కాదు నాస్తికులు అమాయకులు ( అమాయకులు అంటే ఎమీ తెలియని వారే అని కదా ) అంటున్నారు . మీ మాట మీ ఇష్టం

   తొలగించండి
  7. అవునండీ, వాళ్లకి తెలియంది ఏమిటో పై వ్యాఖ్య లోనే చెప్పాను కదా. సాధారణ జనం అంతా భక్తులు ,నాస్తికులు అంతా చదువుకున్న వారు అనే భ్రమ మీకు ఉందేమో.

   ఆస్తికుల్లో కూడా దేవుడిని, దెయ్యాన్ని ఇద్దర్నీ నమ్మే వాళ్ళు కొందరయితే, మరి సఘం మంది దెయ్యాన్నే నమ్మరు. ఇద్దరిలో ఎవరు సరైన భక్తులు అంటారు?

   తొలగించండి
 15. మురళి గారు, మనిషి యొక్క భవిష్యత్‌ని భౌతిక అవసరాలు నిర్ణయిస్తాయి కానీ మతం నిర్ణయించదు. సముద్ర యానం చెయ్యకూడదు అనే రూల్ ఉన్న రోజులలో కూడా ఆంధ్ర దేశంలో కళింగపట్నం, మోటుపల్లి లాంటి రేవు పట్టణాలు ఉండేవి.

  రిప్లయితొలగించండి
 16. మత సంప్రదాయాలు కేవలం పేక మేడలు లాంటివి. అవేమీ బలమైన పునాదులు ఉన్నవి కాదు. సతీసహగమన దురాచారం ఉన్న రోజులలో కూడా భర్త చనిపోయిన తరువాత రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీలు ఉండేవారు. అప్పట్లో రెండో పెళ్ళి చేసుకున్న స్త్రీకి పుట్టినవాణ్ణి పౌనర్భువుడు అనేవారు. సతీ సహగమనాలు జరిగే రోజులలో కూడా పౌనర్భువులు పుట్టేవాళ్ళు అంటే దాని అర్థం సామాజిక ఆమోదం ఉన్న ఆచారాలని ధిక్కరించేవాళ్ళు అప్పట్లో కూడా ఉండేవాళ్ళు అనే కదా.

  రిప్లయితొలగించండి
 17. మురళి గారు, మీరు చేసే విమర్శల స్టైల్ డిఫరెంట్‌గా ఉంది. కొందరు పాఠకులు అన్నారు "రంగనాయకమ్మ గారు కుటుంబ సంబంధాల గురించి బాగానే వ్రాస్తారు కానీ మార్క్సిజం గురించి వ్రాయడం మాకు నచ్చదు" అని. పెట్టుబడిదారీ సమాజంలో మానవ సంబంధాలు అన్నిటినీ (చివరికి కుటుంబ సంబంధాలని కూడా) డబ్బు ప్రభావితం చేస్తుందనే విషయం ఆ విమర్శకులకి తెలియదు. అయితే ఆవిడని మతం పేరుతో విమర్శించే పాఠకుణ్ణి మిమ్మల్నే చూస్తున్నాను. ఎందుకంటే రంగనాయకమ్మ గారి రచనలు నిజంగా చదివినవాళ్ళకి ఆవిడని మతం పేరుతో విమర్శించాలనిపించదు.

  రిప్లయితొలగించండి
 18. మురళి గారు,
  ప్రవీణ్ గారి వ్యఖ్యలను ప్రచూరించి చర్చలో పాల్గోనే వారిని అవమానిస్తున్నారు. అతని గురించి బ్లాగులోకంలో అందరికి తెలిసిందే. ఆయన చెప్పిన దాని ప్రకారం "హిందూ సమాజంలోని సాంఘిక దురాచారాల గురించి హిందువులు మాట్లాడితే తప్పెలా అవుతుంది?" ఆమే, ఆమేకి మునుపు ఉన్న ఎంతో మంది విమర్శించారు. వారితో పాటుగా భారత దేశంలో వివిధ రాష్ట్రాలలో కొంతమంది బ్రాహ్మణులు కూడా రిఫాంస్ కి చర్యలు చేపట్టారు. మన రాష్ట్రం లో వీరేశలింగం పంతులు మొదలైన వారు ఉన్నారు. రంగనాయకమ్మ పుస్తకాలను హిందూవులను ఉద్దరించటానికి రాయలేదు, హిందూవుల లొని లోపాలను చూపుతూ విదేశి సిద్దాంతం అయిన మార్క్సిజం దాని పరిష్కారమని ప్రచారం చేసింది. ప్రతి సిద్దాంతం వెనుక ఆదేశ చరిత్ర ప్రభావం ఎంతో ఉంట్టుంది. అలాగే మార్క్సిజం వెనుక యురప్ దేశప్రజల సంస్కృతి ప్రభావం ఉంట్టుంది. వాటిని పరిగణలో కి తీసుకోకుండా, ఆసిద్దాంతం లో ని తార్కికతను తీసుకొని వచ్చి భారత దేశ ప్రజలపై రుద్దడానికి ప్రయత్నిస్తారు. ఈవిడే కాదు ఓల్గా అనే రచయిత కూడా అంతే. ఇక ఈమె ఏ హిందూ సాంప్రదాయాన్ని, ఆచారాన్ని పాటించనపుడు ఆమెను మనం హిందూ అనుకోవటం ఒక పొరపాటు. అందువల్ల ఆమే రాసే విమర్శలు హిందువులను ఉద్దరించటానికి కాకుండా తమ సిద్దాంత ప్రచారానికి రాసేది గా చూడాలి. అసలికి ఆమే తనని ఇంకా హిందువనుకొంట్టున్నాదో లేదో తెలుసుకొండి?

  ఇక కులాల విషయానికి వస్తే బ్రాహ్మణుల మీద మాత్రం నోరు పారేసుకొనే రంగనాయకమ్మ. ఎక్కడా భూస్వామ్య కులాలను పేరు పెట్టి విమర్శించినట్లు చదవలేదు. ఇంత చరిత్ర చదివిన ఆమేకి హిందూ సమాజం లో ఆకులాలు పోషించిన ప్రముఖపాత్ర తెలియదా? ఇక ఈ రచయితల దృష్ట్టిలో సమాజం వెనకబడి పోవటానికి కారణం రాముడు, రామాయణం గురించి ప్రచారం చేసిన బ్రాహ్మణులు. ఇక చరితలో మొదటినుంచి భారతదేశం లో జరిగిన అభివృద్ది అంతా ఇతర శుద్ర కులాల వారి కారణంగా అని అర్థమొచ్చేలా రాస్తారు. ఉత్పత్తి పనులలో మొదటినుంచి పాల్గొంట్టు వస్తూన్న శూద్ర కులాల వారు, ఆంధ్ర ప్రదేశ్ అభివృద్దిని గత మూడు దశాబ్ద్దాలుగా విపరీతంగా పోటిలు పడుతూ చేసి, వేల కోట్ల నుంచి లక్ష్యల కోట్ల వరకు ఎలా డబ్బులు వెనకేస్తున్నారో చూస్తున్నాం. ఇటువంటి అత్యాశ పరులున్న ఆవర్గాల వారిని విశ్లెషించటానికి ఎంచుకొనే మార్గాలు వేరే విధంగా ఉంటాయి. వారి వ్యాసాలలో ఎక్కడా అబ్రాహ్మణుల కులాన్ని మాత్రం ప్రస్తావించ కుండా జాగ్రత్త పడి పడికట్టు పదాలను, అరిగిపోయిన పదాలను వాడుతూ తమ రొడ్డు కొట్టుడు సిద్దాంత కోణంలో నుంచి విశ్లేషిస్తారు.
  ____________________________

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. జయహో గారు ఎవరి అభిప్రాయం వారిది . విమర్శలకు సమాధానం చెప్పలేనంత బలహీనంగా హిందూ మతం లేదని నేను అనుకుంటున్నాను . హేతు వాదం, నాస్తికత్వం అనేది మనకు ఇప్పుడు పాశ్చాత్యులు పరిచయం చేసినవి కాదు .అవి హిందూ మత గ్రందాల్లో కూడా ఉన్నాయి . చార్వాకులు ఎప్పటి వారు . నాస్తికత్వం రంగ నాయకమ్మ తో మొదలు కాలేదు . వాళ్ల ముత్తాత పుట్టక ముందు నుంచి కూడా ఈ దేశం లో నాస్తికత్వం ఉంది

   తొలగించండి
  2. రంగనాయకమ్మ గారు ఇతర కులాలని కూడా విమర్శించారు. CPI, CPM నాయకులని పేరు చివర రెడ్డి, చౌదరి అనే తోకలు తొలిగించుకోవాలని కోరారు. రంగనాయకమ్మ గారు వ్రాసిన ఉభయచర కమ్యూనిస్ట్‌లు వ్యాసం చదవండి. రంగనాయకమ్మ గారు పుట్టినది వెలమ దొరల కులంలో. 1970లలో నక్సలైట్లని క్రూరంగా అణచివేసిన జలగం వెంగళరావు లాంటి పాలక వర్గం నాయకులని తయారు చేసిన కులం అది. ఒకవేళ ఆవిడ కులం పేరుతో ఏడవాలనుకుంటే రిజర్వేషన్‌ల వల్ల మా కులంవాళ్ళకి ఉద్యోగాలు దొరకడం లేదంటూ దళితుల మీద ఏడవగలరు కానీ కేవలం బ్రాహ్మణుల మీద ఏడవాల్సిన అవసరం ఆవిడకి లేదు.

   తొలగించండి
  3. నన్ను బ్రహ్మ ద్వేషి అన్నారు. ఈ పోస్ట్‌ని నేను ఒక బిసి కులంవాళ్ళని ఉద్దేశించి వ్రాసాను. బ్రాహ్మణులని ఉద్దేశించి వ్రాయలేదు.

   తొలగించండి
  4. ఈ పోస్ట్ యొక్క లింక్ ఇదే: http://4proletarianrevolution.mlmedia.net.in/131755187

   తొలగించండి
  5. >> హిందూవుల లొని లోపాలను చూపుతూ విదేశి సిద్దాంతం అయిన మార్క్సిజం దాని పరిష్కారమని ప్రచారం చేసింది.

   కాట్టన్ గోదావరి ఆనకట్ట కట్టాడని, ఆనీళ్ళు వాడటం మానెయ్యాలా? అసలు ప్రపంచంలో మనమే తోపులు అని ఎలా అనుకోగలుగుతావు?   >> ఎక్కడా భూస్వామ్య కులాలను పేరు పెట్టి విమర్శించినట్లు చదవలేదు.

   ఆపార్టీని విమర్సించలెదుకాబట్టి, వాల్లిద్దరూ ఒకటే అనే నవీన రాజకీయ నాయకలక్షణాలు మీలో కనిపిస్థున్నాయి. యేదైనా పార్టీ పెడుతున్నారా?

   తొలగించండి
 19. ప్రవీణ్ గారు ఆమె మత విశ్వాసాలు , ఆమె నాస్తికత్వం , ఆమె గుణ గణాలు నేనేమి ప్రశ్నించడం లేదు . తప్పును వేలెత్తి చూపినప్పుడు , ఏ మతం లో తప్పున్నా ప్రశ్నించాలని నేను కోరుకుంటున్నాను. లేదు మేం హిందూ మతం లోని తప్పును మాత్రమే ఎత్తి చూపిస్తాం అంటే అది వాళ్ళిష్టం . నేను అనుకున్నది నేను చెబుతాను వాళ్ళు అనుకున్నది వాళ్ళు చెబుతారు . మత విశ్వాసాలు మూర్ఖత్వానికి దారి తీయరాదు, అదే సమయం లో హేతువాదం, నాస్తికత్వం మూర్ఖ వాదంగా తయారు కావద్దు .

  రిప్లయితొలగించండి
 20. యురోప్ ను దోచుకొన్న ఏలైట్ క్లాస్ కి చెందినవారి దోపిడి అందరికి తెలిసిందే. దానికి ప్రత్యామ్న్యాం గా వచ్చినది మార్క్సిజం. ఈ విదేశి సిద్దాంతాలు చదివి, చదివి ఆ కోణంలో మనదేశంలో ఏలైట్ క్లాస్ కి చెందిన అగ్రవర్ణమైన బ్రాహ్మణులను విశ్లేషించాలను కొంటె రంగనాయ కమ్మకి, అయ్యలయ్య మొద|| వారికి, బ్రాహ్మణ వర్గాల వద్ద పోగుపడిన ధన రాశులు ఎమీ దొరకలేదు. అప్పటికే వారు ఉన్న డబ్బులను స్వాతంత్ర పోరాటం కాలంలో ఖర్చు పెట్టేశారు. ప్రజలలో అంతో ఇంతో మంచి పేరే ఉండింది. మార్క్స్గారు రాసిన అంత పెద్ద సిద్దంతం ఇండియాలో ఘొరంగా ఫైల్ అవుతుంటే వారు భరించలేక, ఆసిద్దాంతం మీద ప్రేమతో సిద్దాంతాన్ని బ్రాహ్మణుల తినే శాఖాహార తిండిని విశ్లేషించటానికి పుస్తకాలు రాసిన గొప్ప రచయితలు రంగనాయ కమ్మ, అయ్యలయ్య.

  రిప్లయితొలగించండి
 21. రంగనాయకమ్మలో అనేక కోణాలు ఉన్నాయి. ఆమె కేవలం నాస్తిక వాదే కాదు, స్త్రీవాది, కమ్యూనిస్టు కూడా. ఆవిడను ఒకే ఒక్క కోణంలో విశ్లేషించడం పప్పులో కాలేసినట్టే.

  Her views evolved over a long period of time based on her primary influences (Chalam and later Marx). ఆవిడ దృక్పథంలో మార్పులు కొట్టొచ్చినట్టు కనిపిస్తాయి.

  రంగనాయకమ్మ గొప్ప రచయిత ("రచయిత్రి" అంటే ఆమె ఒప్పుకోదేమో?) కాదని నా నమ్మకం. అయితే ఆమె రాతలలో చిత్తశుద్ధి ఉందని నాకు అనిపిస్తుంది. నేను ఆమె సిద్దాంతాలతో (కమ్యూనిసం) ఏకీభవించకపోయినా, ఆమె సిన్సియారిటీని ఒప్పుకుంటాను.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. బ్లాగర్లలో చాలా మంది రంగనాయకమ్మ గారిని స్త్రీవాది అంటుంటారు.
   రంగనాయకమ్మ గారు స్త్రీవాది కాదు.తను మార్క్సిస్ట్ నని ఆమె ఎన్నోసార్లు అన్నారు.

   తొలగించండి
  2. ఆవిడ ముందు స్త్రీవాది, ఆ తరువాత మార్క్సిస్టుగా మారిందని గుర్తు. తదుపరి కాలంలో స్త్రీవాదాన్ని కమ్యూనిస్టు దృక్పథంతో నిర్వచించారు.

   She defies cubbyholing.

   తొలగించండి
  3. ఏవ్యక్తి కైనా సమాజం లో ముందు పరిచయం అయ్యేది స్త్రీ వాదం కాదు. కుల వివక్ష ,ఆర్ధిక అసమానత

   తొలగించండి
  4. స్త్రీవాదం గురించి చాలా మందికి తెలియదు కాబట్టి అలా. తెలిసినా స్త్రీ-పురుష సంబంధాలలో ఆ మార్పు ఎప్పుడొస్తుందో తెలియక నోరుమూసుకుంటారు. కానీ కులం పేరుతో తిడితే నోరుమూసుకుని ఊరుకోకుండా పోలీస్ కంప్లెయింట్ ఇస్తారు.

   తొలగించండి
  5. @Mauli:

   "ఏవ్యక్తి కైనా సమాజం లో ముందు పరిచయం అయ్యేది స్త్రీ వాదం కాదు. కుల వివక్ష ,ఆర్ధిక అసమానత"

   ఎవరి జీవిత అనుభవాలను బట్టి వారి దృక్పథంలో మార్పులు వస్తాయి. ఉదాహరణకు అప్పటి దాకా sheltered life బతికి కట్నం లేదా అత్తా మామల వేధింపు చూసిన మధ్య తరగతి మహిళ స్త్రీవాదం పట్ల ఆకర్షితురాలయే అవకాశం ఎక్కువ.

   అందరికీ ముందు "కుల వివక్ష ,ఆర్ధిక అసమానత" పరిచయం అవుతుందనుకోవడం(లేదా కావాలనుకోవడం) సబబు కాదేమో?

   తొలగించండి
  6. @Jai Gottimukkala

   'పరిచయమవ్వడం' అంటే మీకు అలా అనిపించిందా :), వ్యక్తి అంటే స్త్రీ అని మాత్రమె కుడా అనిపించిందా ..

   తొలగించండి
 22. అభిమానినీ కాదు.. వ్యతిరేకినీ కాదు.. సానుభూతిపరుణ్ని. కొంచెం మానసిక వైకల్యం ఉన్నవాళ్లని చూసి బాధపడతాం చూడండీ... అలాగన్నమాట. చిన్నప్పుడు ఎప్పుడో విన్న ఒక జోకు.. దేవుడు ప్రత్యక్షమైతే ఏం కోరుకుంటావని ఇద్దరు స్నేహితులని అడిగితే ఒకడు డబ్బు, రెండోవాడు జ్ఞానం అంటాడు. డబ్బు కోరుకున్నవాడు వెంటనే.. ‘‘ఎవరికి ఏది లేదో అది కోరుకుంటామన్నమాట’’ అని సెటైర్ వేస్తాడు. అలాగే.. రామాయణంలో రంగనాయకమ్మకు తొడలు, చన్నులూ, కుట్రలూ, కుతంత్రాలూ, అబద్ధాలూ తప్ప మరేం కనపడలేదు. యద్భావం తద్భవతి. ఈ దేశంలో నూటికి 90 మంది రామాయణాన్ని శూలశోధన చేయరు. అసలు చదవరు. ఇప్పుడున్న జనరేషన్లో అతికొద్ది మంది తప్ప మెజారిటీ జనం రామాయణాన్ని చదువుతారనుకోవడం కూడా భ్రమే. పెద్దల నుంచి కథ తెలుసుకుంటారు. తండ్రిమాట వినాలి. పెద్దలను గౌరవించాలి లాంటి భావనలకు రాముడు ఒక సింబల్. ఐకన్. నూటికి 90 మంది ఇలాగే భావిస్తారు. మరో తొమ్మిది మంది నాస్తికులుగా ఉంటారు. ఇక మిగిలిన ఆ వన్ అండ ఓన్లీ మాత్రం రంగనాయకమ్మే. ఇక ఆవిడ రచనల గురించి... మొన్న డిసెంబర్లో బుక్ ఎగ్జిబిషన్లో ఆవిడ పుస్తకాలు మొత్తం కొన్నాను. జానకి విముక్తి, స్వీట్ హోం, ప్రేమకన్నా మధురమైనది (5 నవలికల సంపుటి), రామాయణ విషవృక్షం, పిల్లలి కోసం ఆర్థిక శాస్త్రం... చివరి రెండు పుస్తకాలూ పక్కన పెడితే మిగతా మూడూ ఒకటే సొద (సారీ, కథ). ప్రతిదీ తర్కమే. అంత తర్కంతో ఆలోచిస్తే మనిషన్నవాడు బతకడం కష్టం. అమ్మో.. కామెంటు రాయబోయి పెద్ద టపానే రాస్తున్నట్టున్నా. త్వరలోనే నా బ్లాగులో రంగనాయకమ్మ పైత్యం గురించి రాయలనుకుంటున్నా.

  రిప్లయితొలగించండి
 23. "సల్మాన్ రష్డి అలా రాసినందుకు చివరకు మతం మార్చుకున్నా అతన్ని వదిలి పెట్టడం లేదు."

  (చాందసవాద) ముస్లిముల ఈధోరణిని మీరు సమర్ధించడంలేదు కదా! మరి అదే సమర్ధనీయంకాని ధోరణి హిందువుల్లో ఉండాలని అనుకుంటున్నారా?

  "హిందూ మతం లో ఇలా అయితే లేదు కదండీ!"

  కొన్నాళక్రితం అయితే నేను దీనికి "లేదు" అని సమాధానం ఇచ్చుండేవాణ్నండీ. ఇప్పుడు అంత ఖచ్చితంగా ఇవ్వలేను. ఎందుకంటే ముస్లిందేశాల్లో వాళ్లకి కుదురుతుంది కాబట్టి "తలలు తెగనరకండి" అని ఫత్వాలివ్వగలుగుతున్నారు. ఇక్కడదికుదరదుకాబట్టి కేవలం ద్వేషంతో సరిపెడుతున్నారేమో. కుదిరిననాడు ఇక్కడకూడా అంతే అవుతుందేమో ననుకుంటున్నాను. కాబట్టి ప్రస్తుతానికి నా సమాధానం practicalగా "లేదు"; intensionalగా "ఉంది".

  అన్నింటినీ విమర్సించడం గురించి. అన్నికాలాల్లో అన్నిమతాలూ విమర్శకు గురయ్యాయండీ. మీరన్న విమర్శకుల్లాగే మనము మిగతామతాలపైవచ్చిన విమర్శల్ని పట్టించుకోలేదంతే! Dawkins లాంటివాళ్ళూ క్రైస్తవాన్నీ, Ibn Waraq లాంటివాళ్ళూ ఇస్లాంనీ ఏకిపారేశారు. అంతెందుకు మనబ్లాగుల్లోనే కమ్యూనిజాన్ని ఏకిపారేస్తుంటారు. అదే స్పూర్తిని మనం మతాలవిషయంలోనూ మనం అలవర్చుకోవాలి. విమర్సకులూ, సంస్కర్తలూ తమతమ రంగాలకే పరిమితమవుతారు. ఏవిధంగానైతే వీరేశలింగంగారిని కమ్యూనిజాన్ని విమర్శించలేదు కాబట్టి ఆయన నిజాయితీ సరైనదికాదని ఆక్షేపించజాలమో, అదేవిధంగా మతవిమర్శచేసేవారినికూడా మిగతామతాలనుకూడా విమర్శించలేదని ఆక్షేపించజాలము. నావరకు ఒక సిధ్ధాంతం/విషయం పరిచయమయ్యాక దాని విమర్శలనుకూడా తప్పకుండా చదివే అలవాటుంది. రెండింటిలోనూ valid వాదనలను స్వీకరించగలగాలనేది నా అభిప్రాయం.

  ఒకచిన్న గమనిక : నేను విమర్శ లక్షణం ఇలాఉండాలి, దాన్ని ఎదుర్కొనే విధానం ఇలాఉండాలి అని నాకుతోచిన పధ్ధతిలో చెబుతున్నానేగానీ, ఎవరికీ వత్తాసుపలకడంలేదని భావించగలరు. ఎవరైనా బాధపడుంటే క్షమించగలరు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఇండియన్ మినర్వా గారు పాకిస్తాన్ సింద్ లోని హిందువులు, ఇండియా లోని ఉత్తర ప్రదేశ్ లోని ముస్లిములు వీరిద్దరి పరిస్థితి పోలుస్తూ ప్రదానంగా రాజకీయాల్లో వీరి పాత్ర పై ఈ మధ్యనే ఒక నివేదిక చదివాను . వీలుంటే దానిని సంక్షిప్తంగా తెలుగులో అనువాదం చేస్తాను . రెండు దేశాల్లోని మైనారిటీ లా పరిస్థితి పై నివేదిక బాగుంది

   తొలగించండి
  2. *Dawkins లాంటివాళ్ళూ క్రైస్తవాన్నీ, Ibn Waraq లాంటివాళ్ళూ ఇస్లాంనీ ఏకిపారేశారు.*
   మీరు చెప్పిన రచయితలు వారు రాసిన పుస్తకాలు చదివాను. అది ఆదేశాలవారికి సరిపోతుందేమో! అక్కడ వేల సం|| బైబిల్ పుస్తకంతో ప్రజలను చీకట్ళొ ఉంచారు. ఇక్కడ ఆపని ఎవరు చేయలేదు. మనకు ఉన్న మూడూ రామాయణం,భారత,భాగవతాలు అన్ని వర్గాలకు వారి వారి స్థాయిని బట్టితెలుసు(శ్రీ శ్రీ విడియో చూడండి ). మహా పండితులైతే సంస్కృత లో ఎమి రాసుందో తెలుసు, పని చేసుకొనే వారైతే వారి అవగాహనస్థాయికి తగ్గట్టు ఆకథాలలో ని నీతి తెలుసు ప్రాథమిక ఆ మతాలకు, మన మతానికి ఎన్నో తేడాలు ఉన్నాయి. ఆమతాలకు ఉన్న ఒక్క మత గ్రంథం ఎంతో ప్రాముఖ్యతనిస్తారు. అందులో రాసిన లైన్ లైన్ కి ఎక్కడలేని ప్రాముఖ్యతను ఇస్తారు. ఇక హిందువులకు వస్తే ఎన్నోగ్రంథాలు ఉన్నాయి. ఆధ్యాత్మికత వైపు వేళ్లే వారు మన మత గ్రంధాలను నిజాయితితో ప్రశ్నించి, సమాధానల కొరకు ప్రయత్నించి విచక్షణ ద్వారా అర్థం చేసుకోవాలని ప్రతి గురువు చెపుతాడు. మిగతా మతాలలో, వారి గ్రంథాలలో ఉన్న వాటిని ప్రశ్నించటం నిషేధం అని మీకు తెలియదా?

   http://www.youtube.com/watch?feature=player_embedded&v=AeRvDY-18lY

   తొలగించండి
  3. జయహో గారు:

   అక్కడ నిషేధమని తెలుసునండీ. అప్పుడేమోగానీ మనంకూడా అదేపంధాలో వెళ్ళడానికి ఇప్పుడిప్పుడే ప్రయత్నాలుమొదలుపెడుతున్నామేమోనని ఒక చిన్న అనుమానం, కొంత un-ease అంతేనండి. "ఇప్పటికే ప్రశ్సించేశారుకాబట్టి, ఇహమీదట ప్రశ్నించకూడదు" అని నేననుకోవడంలేదండీ.

   ఈ చీకట్లో ఉంచినపని ఇక్కడకూడా జరిగింది కదండీ! కాకుంటే "రామాయణం,భారత,భాగవతాలు" విషయంలో జరగలేదు అంతే.

   ప్రశ్నించడం, విమర్శించడం అనేవి అన్నిదేశాలకూ, అన్నికాలాల్లోనూ అవసరమే కదండీ. ఆనాటివాళ్ళు "మన"గ్రంధాలను విమర్శించారుకాబట్టేకదా మీరు కించిత్ గర్వంగా "మనది సహనశీల ధర్మము" అనగలిగారు! నేను చెబుతున్నదల్లా దాన్ని ఇకమీదటకూడా అడ్డుకోవద్దనేదే.

   తొలగించండి
  4. మనది సహన శీల ధర్మం కాదు. మత గ్రంథాలలో ఏముందో తెలిసినవాళ్ళు మన దేశంలో తక్కువ కాబట్టి మత గ్రంథాలని ఎంత విమర్శించినా మనవాళ్ళు ఏమీ అనరు. నేను రామాయణ విషవృక్షం చదివాను. నేను నాస్తికుణ్ణైనా ఆ పుస్తకం చదివిన తరువాత పెద్దగా ఇన్స్‌పైర్ అవ్వలేదు. ఎందుకంటే మత గ్రంథాలలో ఏముందో తెలియనివాళ్ళు మత గ్రంథాలని విమర్శించినంతమాత్రాన అభిప్రాయం మార్చుకుంటారని అనుకోలేము.

   తొలగించండి
  5. *ఈ చీకట్లో ఉంచినపని ఇక్కడకూడా జరిగింది కదండీ!*

   నా ఉద్దేశం లో ఇదొక పసలేని ఆరోపణ. ఎక్కడ జరిగింది, ఏకాలంలో జరిగింది, ఎంత కాలం జరిగింది, ఎవరు చీకట్లో ఉంచారు, ఏ గ్రంధాలను దాచి పెట్టారు, దాని వలన సామాన్య ప్రజలకు కలిగిన నష్ట్టాలేమిటి? అలా చ్వీకట్లో వాళ్లు ఉంచుతుంటే సామాజం లో ఉన్న ఎన్నో వర్గాలు, ప్రజలు మరి అంత మొద్దు నిద్ర ఎందుకు పోయారు. మీకు తెలిస్తే ఒక పెద్ద టపా రాయండి. చదివి సమాధానలు ఇస్తాను. ఇవ్వలేకపోతే మీకు చరిత్ర తెలిసిన వారి తో సమాధానాలు ఇప్పించగలను.
   నా వాదన ఎమీటంటే చీకట్లొ ఎవరైతే ఉంచారని ప్రచారం మొదలు పెట్టారో, వారెప్పుడు ఆ ప్రచారాన్ని మొదలుపెట్టారు? ఎందుకు మొదలు పెట్టారు? అంత క్రితం వరకు వారు ఎమి చేశారని ప్రశ్నించుకోండి. మీకే అర్థమౌతుంది. చిన్న క్లూ ఎమిటంటే బ్రిటిష్ వాడి దోపిడి గురించి పసిగట్టి, వారికి వ్యతిరేకంగా నోరు ఎత్తి బలంగా వాదన వినిపించిన వారిలో బ్రాహ్మణ, బనియాలు ఉండేవారు. వారేప్పుడైతే తెల్ల వారికి వ్యతిరేకంగా పోరాటం చేయటం మొదలుపెట్టారొ, అప్పటివరకు యుద్దాలు చేయటం మరచిపోయి, కప్పాలు కడుతూ, ఒకరికి మించిన ఎక్కువ మంది స్రీలతో కాలం వేళ్ల బుచ్చటమే హోదా గా భావించే చిన్నా చీతక రాజాలు, ప్రజలను పీక్కతినే జమిందార్లు వీరంతా అటువంటి ప్రచారానికి ఊతమిచ్చారని అనుకొంట్టున్నాను.

   *ప్రశ్నించడం, విమర్శించడం అనేవి అన్నిదేశాలకూ, అన్నికాలాల్లోనూ అవసరమే కదండీ.*

   మీకెప్రశ్న లున్నాయో నాకు తెలీయదుకాని. నేను చెప్పింది ఆధ్యాత్మిక పరమైనది. రమణ మహర్షికి నేను ఎవరు? అనే ఒక ప్రశ్న వేసుకొన్నాడు. అటువంటి ప్రశ్నలు వ్యక్తిగతమైనవి. అటువంటి ప్రశ్నలు వేసుకొన్నవారు, వారికి సంతృప్తి పరచే సమాధానం చిక్కేవరకు ఎన్ని పుస్తాకలు చూపించినా, దేవుడిచ్చిన సమాధానం అని చెప్పినా వినరు. ఇక సామాజంలో జరిగే అన్యాయలపైన వేసుకొనే ప్రశ్నలు వేరే రకం, వాటికి మేధావులు సమాధానాలు చెపుతారు.

   తొలగించండి
  6. జయహో గారు:

   మీరు reasonతో respond అవుతారనుకున్నానుకానీ, అసహనంతోకాదు. మీకు కోపం కలిగించినందుకు క్షమించండి. సెలవు.

   తొలగించండి
  7. ఇండియన్ మినర్వా,
   నేనేమీ అసహనానికి గురికాలేదు. మీమీద కోపం రాలేదు. మీరడిగిన ప్రశ్న ప్రతి ఒక్కరు అడిగేదే. ఇక మీరు "ఈ చీకట్లో ఉంచినపని ఇక్కడకూడా జరిగింది కదండీ" అని ఎలా చెప్పగలిగారు? అది మీరు ఎక్కడైనా చదివి ఉండాలి లేక ఎవరైనా చెప్పితే మీకు తెలియాలి. మరి మీరు ఆ విధంగా ఇతరుల నుంచి గ్రహించినదానిని లో ఎంత నిజాలున్నాయో ఎప్పుడైనా పరిశీలించారా? అలా పరిశీలించాలను కొంటే నేను వేసిన ప్రశ్నల కోణం లో నుంచి చరిత్ర చదువుతూ అర్థంచేసుకోండి. అప్పుడు జవాబులు మీకే తెలుస్తాయి. ఇక మన తెలుగులో పేరున్న కొద్దిమంది ఆంధ్రా రచయితల దగ్గర సబ్జేక్ట్ తక్కువ, ఎమోషన్స్ ఎక్కువ. వారి శైలికి చాలా మంది ఆకర్షితులైవారు చెప్పినవి
   నిజమే అని గుడ్డిగా నమ్మేశారనిపిస్తుంది. ఇప్పటికే ఇక్కడ చాలా రాశాను. ఇంకొకసారి సందర్భం వచ్చినపుడు. వీలుచిక్కితే మళ్లీ రాస్తాను.

   తొలగించండి
 24. హిందూ మతం అందరికీ తమతమ మతాలను అనుసరించి భగవంతున్ని ఉపాసించ వలసిందని చెబుతుంది . అందు వల్లనే ఇతర మతాలతో దానికి ద్వేషం లేదు . హిందూ మతం యుగ యుగాల పరిణతికి ఫల శ్రుతి . హిందువుల నాగరికత చాలా ప్రాచీన మయినది . అందులో అహింస అంతర్గతం . హిందూ మతం సజీవమయిన మతం . హిందూ మతం జడత్వాన్ని స్పష్టంగా నిరాకరిస్తుంది.
  --- మహాత్మా గాంధీ
  ( హిందూ మతం అంటే ఏమిటి ? మహాత్మా గాంధీ. నేషనల్ బుక్ ట్రస్ట్ , ఇండియా వెల 36 రూపాయలు. పేజీలు 120 )
  బాగుంది ఆసక్తి ఉన్న వారు చదవండి

  రిప్లయితొలగించండి
 25. రంగనాయకమ్మ గారు. మతానికి ఏనాడూ అంత ప్రదాన్యత ఇవ్వలేదు. మతానికి స్వంత అస్తిత్వం లేదు. సమాజంలొ అసమానతలు వున్నతవరకు దానికి వచ్చిన డొకాఎమీలేదు. మీరు అంత భయపడవలసిన అవసరం లేదు.
  ఇక మార్కిజం గురించి ద్వెషం ఈనాటిది కాదు. గత 150 యెళ్ళుగా పెట్టుబడదారీ వర్గం విషం చిమ్ముతునేవున్నారు. కార్మికవర్గం లొకుడా దానిగురించి ఏమీతెలియక నిస్కారణమైన ద్వెషం పెంచుకున్నారు కొంతమంది.
  మార్కిజం అంతర్జాతీయ సిద్దాంతం శ్రమదొపిడీ వున్నతవరకు అది వుంటుంది అది ఒక ప్రాంతానికొ ఒక దేశానికొ చెందినది కాదు. అది కులాలనొ, మతాలనొ, వర్నాలనొ,జాతులనొ ,, లెక్కలొకి తీసుకొదు. శ్రమను. దొచేవాడు, దొపిడీకి గురైయ్యెవాడు . దానిగురించి రొండు ముక్కల్లొ చెపితె అర్దమయ్యె విషయం కాదు.

  రిప్లయితొలగించండి
 26. 1.హిందూమతం చాలా ప్రాచీనమైనదే గాక ఒక మహానది వంటిది.అందులో వివిధకాలాల్లో వివిధప్రాంతాల,జాతులనుంచి ఎన్నో Cults ఉపనదులు, కాలవలు వచ్చి కలిసాయి.ఎన్నో సంస్కరణలు కూడా జరిగాయి.కులాచారాల్లో కూడా తేడాలు ఉన్నాయి.ఉదాహరణకు వితంతువివాహాలు అన్ని కులాల్లోను నిషేధం కాదు. అందుకే పరస్పర వైరుద్ధ్యాలు కనిపిస్తాయి.
  2.దేన్నయినా,ఎవరినైనా విమర్శించవచ్చును.కాని రంగనాయకమ్మగారి వ్రాతల్లో ద్వేషం ,అసహనం,ఎగతాళి ఎక్కువ.అవి సద్విమర్శకు పనికిరావు.
  3.ఆచరణలో రష్యా,చైనా,వియత్నాం ,తూర్పు యూరప్ లో పూర్తిగా విఫలమైన కమ్యూనిజం ని పట్టుకొని,ఆవిడ ఇంకా పాఠాలు చెప్పడానికి ప్రయత్నిస్తూ ఉండడం విడ్డూరం.ప్రజాస్వామ్య పద్ధతిలోనే సమాజంలో ఏ మార్పు ఐనా తీసుకురావాలి.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. ఆవిడ శైలిలో sarcasm ఎక్కువ. అదే చదువరులకు ద్వేషంగా అవహేళనగా కనిపిస్తుంది.

   She compensates for her not so abundant literary skills through loaded language & sarcasm.

   మీ మూడో పాయింటుతో 100% ఏకీభవిస్తాను.

   తొలగించండి
 27. విప్లవాలు లేకుంటె మనం ఈ నాటికీ బానిస సమాజంలొ వుండేవాళ్ళం ఈ రొజు మనం పెట్టుబడిదారీ సమాజంలొ వున్నామంటె దానికివిప్లవాలే కారణం . బానిస సమాజం నుంచి భుస్వామ్య సమాజానికీ, అక్కడనుంచి పెట్టుబడిదారీ సమాజానికి రావడానికి విప్లవాలే కారణం.
  చరిత్రలొ ఒక్క పొరాటానికే విజయం సాదించినట్టు ఇంతవరకు లేదు. అనేక పొరాటాలు అవసరమైనాయి.
  రష్యా, చైనాలొ,అపజంపాలైనాయంటే దానికి కారణం పెట్టుబడిదారీ వర్గం పైచేయి సాధించమే. పెట్టుబడిదారీ వర్గం పైచెయి సాధించటానికి కారణం నాయకుల తప్పిదాలు, కార్మికవర్గంలొ వర్గ చైతన్యం నింపకపొవడం, ఇక ఇండియాలొ కమ్యునిస్టు పార్టీలు బుర్జువా పార్టీలతొ జతకట్టెయి. ఆచరణలొ వాటికీ, విటికీ, తెడా లేదు. ఈ తప్పులని సిద్దాంతానికి ఆపాధించకూడదు.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. రామమోహన్ గారూ, విప్లవాలు అనివార్యమే. అయితే విప్లవం కమ్యూనిస్టుల గుత్తా కాదు. అలాగే కమ్యూనిస్టు సిద్దాంతానికి విప్లవం పునాది కాదు. Revolution is a small part of Communist theory and definitely not their monopoly.

   ఫ్రెంచి, అమెరికన్ తదితర అనేక విప్లవాలు కమ్యూనిస్టు ప్రభావం లేకుండా జరిగాయి. అదే రకంగా రష్యనులు 1991లో ప్రజాస్వామ్యిక విప్లవం ద్వారా బోల్షివిజం నుండి విముక్తి పొందారు.

   తొలగించండి
  2. మీకు చరిత్ర తెలిసినట్టు లేదు జై గారు. గోర్బచేవ్ తాను కేవలం ప్రైవేట్ ఆస్తి కోసం సోవియట్ సమాఖ్యని రద్దు చేశానని బహిరంగంగా చెప్పుకున్నాడు. అతనేమీ ప్రజల ఆమోదంతో రద్దు చెయ్యలేదు. అతని ప్రత్యర్థి అయిన బోరిస్ యెల్సిన్ కూడా ప్రైవేట్ ఆస్తిని కోరుకోవడంతో సోవియట్ సమాఖ్యని రద్దు చెయ్యడమ్ అతనికి సులభమైంది. 1987లోనే గోర్బచేవ్ తన ప్లాన్‌లో భాగంగా కమ్యూనిజంని వ్యతిరేకించే యూనివర్సిటీ ప్రొఫెసర్లకి కమ్యూనిస్ట్ పార్టీలో సభ్యత్వం ఇచ్చాడు. వీళ్ళ సహాయంతో గోర్బచేవ్ తన పనిని సులభంగా చెయ్యగలిగాడు కానీ అదేమీ ప్రజలు చేసిన పని కాదు.

   తొలగించండి
  3. ఓహో నీ నేటివ్ ప్లేస్ రష్యానా ప్రవీణ్. నేనింకా ఆంధ్రప్రదేశే అనుకున్నా

   (నువ్వు చదివిన పుస్తకంలోవే వేదంలా నువ్వు భావిస్తే నేను చదివిన పుస్తకాల ప్రకారం మార్క్సిజం అంత పనికిమాలిన సిద్ధాంతం లేదు మరి)

   తొలగించండి
  4. శంకర్, 1991లో నేను మూడో తరగతి చదివే రోజులలోనే గోర్బచేవ్ గురించి టివి వార్తలలో విన్నాను. అప్పట్లో నాకు మార్క్సిజం అంటే ఏమిటో తెలియదు. గోర్బచేవ్ కావాలని సోవియట్ యూనియన్‌ని రద్దు చెయ్యడం వల్ల పెట్టుబడిదారులు అతన్ని పొగిడారు అనే విషయం మాత్రమే గుర్తుంది. చారిత్రక సత్యాలని కూడా నిజాలుగా అంగీకరించలేకపోతే అది నీ ఇష్టం. కొన్నేళ్ళ క్రితం కూడా మార్క్సిజంని వ్యతిరేకించే ఒక నాస్తిక రచయిత తన పుస్తకంలో గోర్బచేవ్‌ని పొగుడుతూ వ్రాసాడు. ఆ పుస్తకం ఇప్పటికీ నా దగ్గర ఉంది. గోర్బచేవ్ పెట్టుబడిదారులకి ఎలా ఆరాధ్య దైవం అయ్యాడో మార్క్సిజంని వ్యతిరేకించేవాళ్ళు వ్రాసే పుస్తకాలు చదివినా తెలిసిపోతుంది. నువ్వు ఎలాగూ మార్క్సిస్ట్ పుస్తకాలు చదవలేదు, ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళ పుస్తకాలు కూడా చదవలేదు. తెలియనిది తెలిసినట్టు చెప్పుకోవడం ఎందుకు?

   తొలగించండి
  5. "శంకర్, 1991లో నేను మూడో తరగతి చదివే రోజులలోనే గోర్బచేవ్ గురించి టివి వార్తలలో విన్నాను."

   బాబూ ప్రవీణూ ఆ టైంకి నీ అంత కాకపోయినా నేనేదో జస్ట్ పదో తరగతిలో ఉన్నానంతే.

   "నువ్వు ఎలాగూ మార్క్సిస్ట్ పుస్తకాలు చదవలేదు, ఆ సిద్ధాంతాన్ని వ్యతిరేకించేవాళ్ళ పుస్తకాలు కూడా చదవలేదు. "

   తస్సదియ్యా నేనేం పుస్తకాలు చదివానో, చదవలేదో కూడా నువ్వే డిసైడ్ చేసేస్తావా? నువ్వు సూపరెహే. ఇది నీకు మాత్రమే సాధ్యమైన విషయం తెలుసా? :)))))))))

   తొలగించండి
 28. వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికో వెళ్ళింది . ఇప్పుడేం చేయాలి ?

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. @ఇప్పుడేం చేయాలి ?

   వ్యవహారం ఎక్కడి నుంచి ఎక్కడికో ఎందుకు వెళ్ళిందో వివరించండి :)

   తొలగించండి
 29. అజ్ఞాతంగా ఉన్న అంశం కాదు, కాని అ౦తే తరహాలో ప్రాశిస్త్యం కలిగిన అంశము కాదు,
  ఒక వ్యక్తి ఆ వ్యక్తికి కొన్ని భావాలు, తన చుట్టూ ఉన్న పరిస్థితులపై తను పెరిగిన వాతావరణం తనకు ఏదైతే ఆలోచనావిధానాన్ని ఇచ్చిందో
  అవే ఆలోచనలను అక్షరబద్ధం చేసింది కొందరు ఆభావలలో విశిష్ట అర్థాలను చూడ బోయారు,
  మరి కొందరు పిచ్చి రాతలుగా కొట్టి పారేస్తున్నారు.
  ఏది ఏమైనప్పటికీ
  మనిషి మదిలో మెదిలే ఆలోచనలు అతని మాటల వల్లనో చేతల వల్లనో ఇలా రాతల వల్లనో
  బహిర్గతం అవుతున్నాయి,
  మరి ఆ ఆలోచనలను ఆ మస్తిష్కం లో ప్రేరేపించిన శక్తి ఏది?
  ఆవ్యక్తి అనుభవాల? ఆనాటి సామాజిక స్థితి గతుల? లేక చూట్టూ ఉన్న సమాజం లో పేరుకు పోయిన గతం తాలూకు భావ సంపద?
  ఏది ఎలా ఉన్నా, ఒక వ్యక్తి తన కలం శక్తిని ఉపయోగించింది...
  మంచో చెడో ఏదో ఒకటి జరిగింది,
  ఇలా అసంపూర్ణ భావాలను ప్రకటించక పోతే అవి పూర్నత్వానికి చేరుకోలేవు,
  పూర్ణత్వం పొందిన వారి నుండీ ఈ స్థాయిలో మాటలు రావు.
  అజ్ఞాని 60 వేల మాటలు మాట్లాడిసమస్యను సమస్య గా మిగిల్చితే
  జ్ఞాని ఒక్క మాటతో శాశ్వత బదులు చెప్తాడు....
  భావంలోనిది భాషగా మరే తరుణం లో చాల జాగ్రత్త వహించాలి,
  అక్షరానికి అక్షరకాలం ఉండే శక్తి ఉంది,
  సమ కాలంలో ప్రశంశల జల్లు కురిపించినా
  భవిష్యత్తులో విమర్సల కు గురికాకూదనేదేమి లేదు.
  అందుకే మూడుకాలల్లో చెల్లె అంశాన్ని ఎంచుకుంటే...ఏ పేచీ ఉండదు.
  కొన్ని వేల మెదడులను కదిలించే శక్తి ఉన్న కలం power ని
  సరైన సత్యాన్ని చూపే అస్త్రం గా వినియోగించాలి కాని,
  గతాన్ని తవ్వుకుని ఊహా జనిత అంశాలను ప్రతిపాదన చేసి వాదులాడు కోవటానికి ఆస్కారం ఇవ్వటం తగదు.

  వాదన లో అటో ఇటో ఎటో ఒక వైపే ఉండాల్సిన స్థితి వస్తుంది,
  అలాంటప్పుడు ఆ వాదన ఉన్నవారంతా ఏదో ఒకే కోణం లో చూడటం చేస్తారు?
  మరి ఇలా చేస్తే పరిష్కారం అవుతుందా సమష్య?

  అంచేత సత్య దృష్టి తో
  conclude చెయ్యండి !

  ?!

  రిప్లయితొలగించండి
 30. *అంచేత సత్య దృష్టి తో conclude చెయ్యండి !*

  జరుగుతున్న చరిత్రకు కంక్లుషన్ ఉండదు. గతాన్ని గుర్తించుకొని భవిషత్లో ఆ తప్పులు చేయకుండటం తప్ప.

  రిప్లయితొలగించండి
  రిప్లయిలు
  1. sir, జయహో గారు మీ పేరు లోనే సత్యానికి చెందిన జయ జయ ధ్వానాలు వినిపిస్తున్నాయి, ((slum dog millionaire movie లో ar rehman bgm తో))
   "సత్యమేవ జయతే " మరి సత్యమే ఏనాటికైనా జయిస్తుంది కదండీ !!
   సమస్యకు పరిష్కారం ఉన్నదని వెళ్ళటమే సాధకుని లక్షణం
   పోరాటపటిమతోనే సైనికుడు యుద్ధానికి వెళ్తాడు,
   మనము ఆ బాట లోనే
   అఆగాక సాగితే ఏదో ఒక solution దొరుకుతుందనే ఆశాభావం తో వెళ్దాము,
   ఇన్ని comments వచ్చినా ఎవరికీ వారు చక్కగా subject మీదనే ఉన్నారు కాదా! personal గా తీసుకోకుండా!
   so మనం continue చేద్దాం final result వచ్చేదాకా !!

   ఇప్పుడు రంగనాయకమ్మ గారు అంటే కొన్ని అసంపూర్ణ౦గా అస్పష్ట౦ గా సశేషం గా మిగిలిన అంశాల తాలూకు icon అంతే కానే వారిని వ్యక్తిగతం గా వేలెత్తి చెప్పటం నా అభిమత౦ ఎంత మాత్రం కాదు.
   సమాజం లో ఏదో ఒక నాటికి ఈ అసంపూర్ణ భావలపైన ఎక్కడో ఒకచోట ఇలాంటి చర్చకు అవకాసం ఎప్పుడూ ఉంటూనే ఉంటుంది.
   అద్దానికి ఇదే వేదిక అనుకుందాం
   మన మురళి గారికి విసుగు రానంత వరకు, వాద ప్రతివాదాలు సాగించే వారు వ్యక్తి గతం గా తీసుకోక పై విధంగానే సభ్యతగా వాదనలు ప్రేతిపాదిన్చినంత వరకు
   చర్చ సవ్యంగానే సాగున్తుంది,
   మరో comment తో కలుస్తాను
   ?!

   తొలగించండి
  2. పురోభి వృద్ధిని కోరు వారు పూర్వ వృత్తాంతమును మరువరాదు అని ఒక proverb ఉన్నది మీ comment అక్షరాల ఆ సిద్దాంతాన్ని సూచిస్తున్నది.

   తొలగించండి
 31. @ బుధ్ధా మురళి గారు,
  ఇక్కడ మీ ద్వార వ్యక్తం అయిన post ఒక చక్కని అంశానికి గూర్చిన విషయాలు తెలుసుకునే దశ గా పయనిస్తుందని నాకు అనిపిస్తుంది,
  ఇక్కడ రంగానాయకమ్మ అనే వ్యక్తి నేపథ్యం తో సాగినప్పట్టికి, ఆమె అంటే ఆమెభావాలు, ఆమె ప్రతిపాది౦చిన సిద్దంతాలూనూ,
  ఇక్కడ వ్యక్తి మరుగున పడి, వ్యక్తి తాలూకు భావ జాలంపై అందరు మనసుపెట్టారు, ఇది శుభ పరిణామం.
  మీరు మీ post starting లోనే ఇలా అన్నారు
  " బాగుంటే చదవడం లేదంటే లేదు అంతే తప్ప అభిమాన రచయిత , అభిమాన నటుడు అంటూముద్రలు వేసే అలవాటు నాకు లేదు"
  అని నాకు ఆ విధమైన చూచే గుణం నచ్చినది, అది సత్యత్వ పరిశీలనకు దగ్గరగా ఉన్నది.
  అయితే ఇక్కడ కొన్ని అంశాల పట్ల అందరికి వారి వారి స్థాయిలో ఒక పరిపూర్ణ అవగాహనా ఉన్నట్లుగానే ఉన్నది,
  ఒక్కొక్క comment వచ్చినప్పుడల్లా ఒకటికి రెండు సార్లు చదివాను,
  వ్యక్తి పరంగా కాదు, ఇందులో మీరు తప్ప మిగితా వారితో నాకు అట్టే పరిచయమునూ లేదు,
  so ఇక్కడ మనకు యథార్థం అయిన నిర్వచానాలు సార్వ జనీన మైన నిర్వచనాలను తెలిస్తేనే తప్ప
  ఏది right ఏది wrong అని నిర్దారించలేము.
  అయితే ఇక్కడ చేయాల్సింది ప్రస్తుతానికి
  అందరి అభిప్రాయాలను ఉద్దేశ్యలాను గౌరవిస్తూ
  ఎవరికీ వారిని వారి అవగాహన మేరకు అనుభవం తాలుకూ స్థాయిలో
  ఈ క్రింది అంశాల పట్ల వారి వారి నిర్వచనాలను తెలుప కోరండీ..

  మనం స్త్రీ వాదం అంటే ?
  మార్క్సిసం అంటే?
  నాస్తికత్వం అంటే?
  ఆస్తికత్వం అంటే?
  ఇలా ఇంకేమన్నా ఉంటె అవీను
  అలా
  అప్పుడు
  వచ్చిన నిర్వచనాల ప్రకారం బేరీజు వేసి అందరి సమక్షం లో
  సార్వ జనీన మైన నిర్వచానానలను ప్రతిపాదన చేద్దాం
  అప్పుడు వాస్తవం (అది అంతర్లీనంగా ఉన్నా అజ్ఞాతం గా ఉన్నా తప్పించుకోలేక)
  బహిర్గతం ఆవుతుంది.
  అని నా ఉద్దేశ్యం
  ఇంతకూ ఈ వాద ప్రతివాదాల పట్ల మీ ఉద్దేశ్యం ఏమిటి?
  నాకు మీలో ఉన్న professionalism నచ్చింది.
  త్వరగా మీ ఉద్దేశ్యం తెలియ చేయండి,
  sunday monday మారడానికి ఇంకా అట్టే సమయం లేదు.

  ?!

  రిప్లయితొలగించండి
 32. మురళిగారూ నేను మీ టపాపైన మాత్రమే స్పందిస్తున్నాను. అన్ని వ్యాఖ్యలనీ చదవలేదు.
  .........బాగుంటే చదవడం లేదంటే లేదు ........

  మురళిగారూ,
  నిజమే కానీ ఏది బాగుందో లేదో అని నిర్ణయించడానికి ముందు మనం ఆ పుస్తకం చదవాలి కదా! సామాన్యంగా మనం ఒక రెండు పుస్తకాలని చదివిని తరువాత మాత్రమే" సరే ఈ ఆథర్ ఎవరో కానీ చదివించేలా ఉన్నారు" అని అనుకునే మిగతా పుస్తకాలని కూడా చదువుతాం.
  ఈ అభిమాన నటులు కానీ రచయిత/రచయిత్రులు కానీ తమ క్వాలిటీ ఎప్పుడూ మైంటైన్ చేయడం అనేది కష్టమే. అందుకే కొన్ని సినిమాలు మాత్రమే హిట్టవతాయి, కొన్ని పుస్తకాలు ఎక్కువగా అమ్ముడుపోతాయి. కానీ అన్నీ కాదు మరి. కంటెంట్, ఎంచుకున్న సెంట్రల్ థీమ్ మాత్రమే కాక రాసే శైలి బట్టి కూడా అవి మనలని చదివిస్తాయో లేదో అన్న ఫాక్టర్ మీద ప్రభావాన్ని చూపిస్తాయి. కాకపోతే పాత రచనలని బట్టి మన expectations పెరుగుతాయి. కొన్నిసార్లు అదే ఆథర్ మనలని నిరాశ పరచవచ్చు కూడా.
  ఒక రచన ఎంత చక్కగా ఉన్నాకానీ దానిలో సారం లేకపోతే చదవలేము. ఎంత సారం ఉన్నాకానీ రాసే శైలే మనలని ఆకట్టుకోలేకపోతే అదీ బోర్ కొడుతుంది. రెండూ ఉండి కూడా అదే థీమ్ తో పది పుస్తకాలు రాసినా అవీ బోర్ కొడతాయి. అది అనవసరంగా trying to drive the point home లా అనిపించి ఇక ఆ థీమే బోర్ కొట్టడం ప్రారంభిస్తుంది.

  ....... తన భార్య గురించి పరాయి వ్యక్తి ముందు అంతా చులకనగా మాట్లాడే వ్యక్తి నాకయితే దిగజారిన వ్యక్తిగా అనిపించాడు. అతన్ని రంగనాయకమ్మ మాత్రం గొప్ప వ్యక్తిగా పరిచయం చేశారు .......
  దిగజారిని వ్యక్తిలా కాదు. స్పష్టంగా దిగజారిన వ్యక్తే అయి ఉండాలి. మరి సమర్థించిన ఆథర్ దేని ఆధారంమీద సమర్థించినా దాన్ని justify చేసుకోలేరు. క్షమించాలి. మీ టపాకన్నా నా కామెంటే పెద్దగా అయినట్టుంది.
  క్రిష్ణవేణి

  రిప్లయితొలగించండి
 33. క్రిష్ణవేణి గారు ఎందుకో ఏమో గారు నాకు ఎలాంటి విసుగు లేదండి. చర్చ జరుగుతున్నందుకు సంతోషం. ఎవరయినా అభ్యంతర కరమైన మాటలతో కామెంట్ రాస్తారేమో అనే అనుమానం మొదట కలిగింది . కానీ ఆలాంటి కామెంట్స్ లేవు. వచ్చిన కామెంట్స్ లో ఒక్కటి మినహా అన్ని పబ్లిష్ అయ్యాయి . ఒక్క కామెంట్ బహుశా తెలియకనో, మరేమిటో కానీ ఒక కులాన్ని కించపరిచే సామెత తో ఒక వ్యక్తిని విమర్శిస్తూ కామెంట్ రాశారు ... పాడిందే ............ సామెత ... అదొక్కటి తప్ప అన్ని పబ్లిష్ అయ్యాయి. చర్చ ద్వారానే తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది.

  రిప్లయితొలగించండి
 34. ఎందుకో ఏమో గారు మీరు అడిగిన ఆ అంశాల గురించి శాస్త్రీయంగా వివరించేంత జ్ఞానం నాకు లేదు కానీ ఒక చిన్న మాట చెప్పగలను. ఒక వ్యక్తి నాస్తికుడిగా సంతోషంగా ఉండగలిగితే అతను నాస్తికుడిగానే ఉండాలి. భగవంతుని పై భక్తి వల్ల నేను సంతోషంగా ఉండగలుగు తున్నాను అనుకుంటే అతన్ని అలానే ఉండ నివ్వాలి. ఇతరులకు, సమాజానికి కీడు చేయకుండా మనం సంతోషంగా ఉండగలిగే మార్గం ఏదయినా మంచిదే
  ఈ మధ్య ఒక మిత్రుడితో ఇదే అంశం పై చర్చ జరిగింది . ఆతను చదువుకునేప్పటి నుంచే మార్క్సిస్ట్ . ఉద్యమాల్లో పాల్గొన్నాడు . ఇప్పుడు అతనికి మంచి ఉద్యోగం, మంచి జీతం , ఆర్ధిక పరిస్థితి బాగా ఉంది . ఆతను ఇలా అన్నాడు- నేను మానసిక ఒత్తిడిలో ఉన్నప్పుడు ఆలయానికి వెళితే ప్రశాంతంగా ఉండగలుగు తున్నాను . మా ఉరికి దగ్గరలో చిన్న గుడి ఉంది జీవితం లో ఆ గుడికి ఎప్పుడూ వెళ్ళ లేదు . కానీ ఈ మధ్య నీళ్ళ కోసం కారు అక్కడ ఆపినప్పుడు గుడికి వెళితే ప్రశాంతంగా అనిపించిది. ఇప్పుడు ఆ గుడి కోసమే అప్పుడప్పుడు వెళుతున్నాను అని చెప్పాడు . మనసు ఆందోళనగా ఉన్నప్పుడు, మానసిక ప్రశాంతత కోసం ఏం చేయాలో నాకు మార్క్సిజం చెప్పలేదు. దైవ భక్తి ఆ విషయం చెప్పింది అని ఆతను తన అభిప్రాయం చెప్పాడు . దేవుడు ఉన్నాడా లేడా? అనే చర్చ కన్నా అతనికి ఆలయం ప్రశాంతత కలిగించినప్పుడు ఎవరికీ అభ్యంతం ?

  రిప్లయితొలగించండి
 35. మురళి గారు,

  మీరిచ్చిన రెండవ లింక్ (నవ్య) కూడా ఇప్పుడే చూసాను, ఈ పేజిలో సుజాత అనే ఆమె తనతల్లి ని కించపరచడం , దిగజారిన వ్యక్తి గా మీరు తప్పకుండా భావించాలి :) అలా ఒకరినొకరు మోసం చేసుకొంటూ, ఆత్మవంచన తో దిగాజారోద్దని ఆమె చెప్పడం కూడా మీకు కనిపించి ఉండాలి.

  ఆమె కేవలం పాఠకులను పరిచయం చెయ్యడం కోసమే ఈ శీర్షిక వ్రాస్తున్నట్లు అనిపించడం లేదు.మీరు అన్నట్లు గా "వ్యక్తుల మనస్తత్వం గురించి తెలుసుకోవాలనుకునే వారు చదవాల్సిన ముచ్చట్లు" అని ఆమె కూడా వ్రాస్తున్నట్లు ఉంది. అంశాల వారి మద్దతుల పై ఆమెకు మోహం లేదు. దీనిని ఖచ్చితం గా అభినందిస్తున్నాను

  ఆమె చెపుతున్నటువంటి మనస్తత్వం కలవారు ఆమె పాఠకులలో ఎక్కువమందే ఉంటారు. అలాంటి వారి అభిమానం పై తన అనంగీకారాన్ని ఖచ్చితం గా చెపుతున్నట్లు అనుకోవచ్చు.ఒకవిధం గా ఆమెపుస్తాకాలు బాగున్నాయనే వారే ,లేక ఆమె అభిమానులం అనుకోనేవారినే ఆత్మ విమర్శ చేసికోమంటుంది. మీరు కూడా ఇలాంటి వారు అయితే దూరం ఉండండి అంటుంది :)

  హ్మం. ఇంక ఆమె వ్రాసే అభిమానుల రకాలు బోలెడు మంది మీ(మన) చుట్టూనే ఉన్నారు , తెలియనివి ఆమె చెపితే మాత్రం అర్ధం అవుతుందా (సిరివెన్నెల డైలాగ్ :) )

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం