20, మార్చి 2012, మంగళవారం

రాకోయి అనుకోని అతిది మా ఇంటికొచ్చిన పిచ్చుక గారుహైదరా బాద్  మహా నగరం లో అతిధులు వస్తే ఎలా ఉంటుందో తెలుసు కదా ? మేం మొన్న ఒక అతిధి అలా వస్తే ముందు సంతోష పడి  తరువాత  బాధ పడ్డాం   కంగారు పడ్డాం  రాత్రి సరిగా నిద్ర కూడా పోకుండా అప్పుడప్పుడు లేచి అతిధి ఉన్నాడా, వెళ్లి పోయాడా అని చూసుకోవలసి వచ్చింది . నాకంత ఇబ్బందేమీ లేదు కానీ పిల్లలే ఎలా గయినా అతిదిని బయటకు పంపు అని ఒకటే పోరు .. అతిధులు  మనం రమ్మంటే వచ్చారా అలా పొమ్మంటే పోరు .. వాళ్ళిష్ట మున్నప్పుడు పోతారు అని చెబితే వినరు ..
ఎప్పుడు వెళ్లి పోయారో తెలియదు కానీ ఉదయం లేచి చూస్తే లేరు అమ్మయ్యా అని ఉపిరి పిల్చుకున్నం. పిల్లలు తెగ సంతోష పడ్డారు  .
ఆ విషయం ఇప్పుడెందుకు గుర్తుకొచ్చింది అంటారా ? ఈ రోజు అంతర్జాతీయ పిచ్చుకల దినోత్సవం కదా రెండు వారాల క్రితం ఇంటికొచ్చిన అతిధి గుర్తుకొచ్చారు 
గత సంవత్సరం ఇల్లాలి ముచ్చట్లు లో సుధా గారు ఈ రోజు గురించి రాశారు . అంతకు ముందు అయిదారేళ్ళ క్రితం ముంబాయికి చెందిన పత్రికలో పని చేసే మిత్రుడు వీటి గురించి రాశాడు . చాలా మంది తమ బాల్యం లో పిచ్చుకలతో ఉన్న అనుబందాలను గుర్తు చేసుకున్నారు, ఇప్పుడు కనిపించడం లేవని బాధ పడ్డారు . చిన్నప్పుడు పిచ్చుక గూళ్ళ గురించి జ్ఞాపకాలు గుర్తుకు రావడం లేదు కానీ ఇప్పుడు మాత్రం నేను ఉదయం లేవగానే వాటి గ్రూప్ డిస్కషన్ వింటాను ....  గ్రూప్ డిస్కషన్ అంటే  అసెంబ్లీ  లో  తిట్టుకున్నట్టు కాదండీ . ఎంత ఆహ్లాదంగా ఉంటుందో ఒకేసారి అయిదారు డజన్ల పిచ్చుకలు ఎవరి కథలు వాళ్ళు  చెప్పుకుంటాయి  ఆ కథలన్నీ కలిసి మనకు మాత్రం చక్కని  సంగీతం లా  వినిపిస్తుంది ...
ఎక్కడి నుంచో ఎక్కడికో వెళ్లి పోతున్నానని అనుకుంటున్నారా? లేదు మా ఇంటి కొచ్చిన అతిధి గురించే చెబుతున్నాను ...
మా ఇంటి ఎదురుగా ఖాళీ స్థలం బాగానే ఉంది . పిల్లలు ఇష్ట పడడం తో వెదురు మొక్కలు కూడా నాటం. మంచి బూం పిరియడ్ లో స్టాక్ మార్కెట్ లో షేర్ల ధరలు పెరిగినట్టు వెదురు మొక్క ఏపుగా పెరిగింది. మేం ఒక్కటి నాటితే కనీసం డజను వెదురు చెట్లు అయ్యాయి  .. వాటి పైన కనీసం అయిదారు డజన్ల పిట్టలు అవే నండి పిచ్చుకలు చేరాయి . వెదురు చెట్ల వైపే మా ఇంటి వంట గది ఉంది . కిటికీ తెరిచి ఉండడం తో ఒక పిచ్చుక గారు ఎలానో దారి తప్పి వంట గది లోకి వచ్చేసింది . దాన్ని చూడ గానే పిల్లలు తెగ సంతోష పది హడావుడిగా ఫోటో తీశారు ( ఇటు చూడు నవ్వు అని యెంత చిప్పిన పిచ్చుకలు వినవు అనే పాఠం ఆ రోజే నేర్చుకున్నాను ..పిల్లలు చెప్పినట్టు వినడానికి అవేమన్న పిచ్చి పెరెంట్సా? తెలివయిన పిట్టలు )  
ఫోటో తీసుకోగానే ఇక బయటికి పంపు పాపం వాళ్ల గుంపు వాళ్ళు ఎదురు చూస్తుంటారు కదా అని ఒకటే గోల ... మేం బయటకు పంపించాలని చూస్తే వెళ్ళే ప్రసక్తే లేదని అటు ఇటు పరిగెత్తింది. ట్రేస్ పాస్ చట్టం పిట్టలకు వర్తిస్తుందో లేదో తెలియదు . అన్ని రకాలుగా ప్రయత్నించాను . యెంత మంది నాయకులను చూశాం .. ఓ ఆలోచన వచ్చింది  ఇలాంటి సమయం లో  వ్యూహాత్మక  మౌనం పాటించడమే మంచిది అనుకున్నాను. కొన్ని సమస్యలకు కాలమే పరిష్కారం చెబుతుందని సలహా ఇచ్చాను . ఇక చేసేది కూడా ఎమీ లేక అంతా సరే అన్నారు . మధ్య మధ్యలో లేచి చూశాను . వంటింట్ లో తీగ మీద పడుకుంది .. కొన్ని ఆఫీసులలో కొందరు కూర్చొనే పాడుకుంటారు అదేమీ పెద్ద వింతగా అనిపించలేదు కానీ తీగ మీద పిచ్చుక పడుకోవడం వింతగానే అనిపించింది .
తెల్ల వారు జమున మళ్లీ కిటికీలు తెరిచి అటువైపు వెళ్ళలేదు ఎప్పుడూ బయటకు వెళ్లిందో కానీ అది కనిపించక పోయే సరిక హమ్మయ్య అని అంతా ఉపిరి పిల్చుకున్నం. ఏంటో అందరికీ చిన్నప్పుడు పిచ్చుకలతో అనుబందం ఏర్పడితే నాకు ఇప్పుడు ..... అలా వచ్చి అలా వెళ్ళరు అనుకోని అతిధి మా యింటికి. అప్పుడు అనుకున్నాం రకోయి అనుకోని అతిది ఎదురుగా వెదురు చెట్లు మీ కోసమే . పిట్టగోడపై బియ్యపు గింజలు కూడా మీ కోసమే దయ చేసి ఇంట్లోకి వచ్చి  మీరు బాధ పది మమ్ములను బాధ పెట్ట వద్దు కావాలంటే మేడ పైనా ,, ఇంటి ముందు ఇష్టం వచ్చినంత సేపు ఆడుకోండి  వద్దం టమా .
( జూబ్లి బస్ డిపోకు ఏడు కిలోమీటర్ల దూరం కూడా లేదు ..కానీ  మా వైపు పచ్చని చెట్లు ఉన్నాయి , వాటి పై పిచ్చుకలు ఉన్నాయి .. కేరళను దేవుడి సొంత ప్రాంతం అని చెప్పుకున్నట్టుగా మా ప్రాంతాన్ని పిచ్చుకల సొంత ప్రాంతంఅని   ప్రకటిస్తే బాగుండు ) 

8 కామెంట్‌లు:

 1. ఆహా.. హైదరాబాదు మహా నగరంలో పిచ్చుకలు ఉండగలిగే ప్రదేశాలు కూడా ఉన్నాయన్నమాట.. నిజంగా గొప్ప విషయం.. మీ అతిథిని మాక్కూడా పరిచయం చేసినందుకు థాంక్స్. :)

  రిప్లయితొలగించండి
 2. @రాజేంద్ర గారు థాంక్స్
  @మధురవాణి గారు నిజంగానే ఉన్నాయండీఎక్కువగా మిలటరీ వాళ్ల భూములు ఉన్నాయి కాబట్టి చెట్లు , పిచ్చుకలు బతికాయి .. పిట్ట గోడ మీద అవి వరుసగా కూర్చోవడం చూస్తే.... చిన్నప్పుడు స్కూల్ లో పాల బాటిల్ ఇచ్చే వాళ్ళు .. ఆ పాల కోసం అంతా అలానే కూర్చునే వాళ్ళం వరుసగా . అది గుర్తుకొచ్చింది ఫోటో సరిగా తీయడం రాదు కానీ .. పిట్టగోడ మీద వరుసగా ఉన్నప్పటి ఫోటో తీయడానికి ప్రయత్నిస్తాను.

  రిప్లయితొలగించండి
 3. పిచ్చుకల గూడు..మీ ఇల్లు అన్నమాట.బావుందండీ! ఇక్కడ రోజు సందడి చేస్తాయి. రేపు.. చాయాచిత్రం గా బంధించి తెస్తాను.

  రిప్లయితొలగించండి
 4. మేము హైదరాబాద్ లోనే వుంటాము ఆల్వాల్ దగ్గర, మా ఇంటిలో కూడా వస్తూంటాయి పిచ్చుకలు మేము వాటికి వరి కంకులు బాల్కనీ లో కట్టి తినిపిస్తూ ఉంటాం. ఇంట్లోకి వచ్చి సందడి చేస్తూ ఉంటవి.

  రిప్లయితొలగించండి
 5. @వనజవనమాలి గారు
  @అవినేని భాస్కర్ గారు @ గిరిజా కృష్ణ సూర్యదేవర గారు థాంక్స్ .. చిన్నప్పుడు పిచ్చుకలను పట్టించుకోలేదు కానీ వాటి సందడి చూసి పిల్లలు సంతోషపడుతుంటే మనిషి సంతోషించడానికి ఏనుగంత పెద్దవె కాదు పిట్టంత పిచ్చుకలు కూడా చాలు అనిపించింది ... అంత చిన్న పిచ్చుకలను కూడా మాంసం కోసం చంపే వారిని చూస్తే దేవుడు ఉన్నాడో లేడో కానీ రాక్షసులు మాత్రం ఉన్నారనిపించింది.
  గిరిజ గారు అందుకేనండి ఆల్వాల్ ప్రాంతాన్ని పిచ్చుకల సొంత ప్రాంతంగా ప్రకటించాలి

  రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం