9, ఏప్రిల్ 2012, సోమవారం

ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలా ?

^^ప్రజలు పిచ్చివాళ్ళు .. గొర్రెల మందలు ^^
^^ మీరేంటి ?
..............
నేనడిగింది మీ ఉద్యోగం గురించి కాదు ... మీరేంటి ?
.........
అయ్యో నేను మీ కులం గురించి అడగడం లేదండి ..
ప్రజలు గొర్రెలు, వెర్రి వాళ్ళు అని మీరు  అంటున్నారు . మీరు  ప్రజలు కాక పొతే మరేమిటి  దయ్యాలు, రాక్షసులా ? తెలుసుకుందామని 
ప్రజలు గొర్రెల మందలా  తయారయ్యారు. ఏ పార్టీ మంచిదో , ఎవరు మంచి నాయకుడో ఆలోచించడం లేదు ?
అలాగా మరీ మీ కులం వాళ్ళకు ఓటు వేసి గెలిపించినప్పుడు ప్రజలు మంచి వాళ్ళే కదా 
అంటే మిమ్ములను గెలిపించిన పాపానికి ప్రజలను మీ పాలనలో గొర్రెలు , వెర్రి వాళ్ల లా మార్చేశారా ? 
మీ కులం వాళ్ళు గెలిచినప్పుడయినా? మీ ప్రత్యర్ధి కులం వాళ్ళను గెలిపించి నప్పుడు అయినా ప్రజలు సహేతుక మయిన తీర్పునే ఇస్తున్నారు .. మన కులం వాడు గెలిచినప్పుడు ప్రపంచం ప్రశాంతంగా ఉన్నట్టు, మన కులం వాడు ఓడిపోతే ప్రపంచం తల క్రిందులయినట్టు బాధ పడుతున్నాం . రాత్రికి రాత్రి ప్రజలంతా కూర్చొని మాట్లాడుకున్నట్టు ఒకే రకంగా తీర్పును ఇస్తునట్టు మన ౬౦ ఏళ్ళ ప్రజా స్వామ్యం లో ప్రతి సారి నిరూపితం అయింది . మళ్లీ మళ్లీ నిరూపితం అవుతుంది .. ఎవరయినా గెలవ నివ్వండి నా అభిప్రాయం ప్రజలు పిచ్చి వాళ్ళు కాదు . భారతీయ ఓటరు పరిణితి చెందిన వాడు . 

3 కామెంట్‌లు:

  1. చాలా మంది అలోచించకుండా నాకేంటి ఈ నాయకుడిని ఎన్నుకుంటే అన్న ఒక్క స్వార్ధం తోనే వోటు వేస్తున్నారని అనిపిస్తుంది.

    రిప్లయితొలగించు
  2. జలతారువెన్నెల గారు ముగ్గురు వెదవల్లో ఏ వెదవను ఎన్ను కుంటావు అంటే ఎవరో ఒకరిని ఎన్ను కోక తప్పని పరిస్థితి . ఏళ్ళ కాలం ఇలానే ఉండదు . మార్పువస్తుందండీ

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం