16, అక్టోబర్ 2013, బుధవారం

రామన్న ఇంట్లో అరడజను మంది రాజన్న ఇంట్లో పావుడజను మంది ముఖ్యమంత్రి అభ్యర్థులు

‘‘కలికాలం కాకపోతే... ఉల్లిపాయలు దొరకడం లేదు కానీ రాజకీయ మార్కెట్‌లో ఇంటికో అరడజను,పావుడజను మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు కనిపిస్తున్నారు’’ అంటూ సుబ్బారావు ఉపన్యాసం మొదలుపెట్టాడు. మార్నింగ్ వాక్‌లో ఏదో ఒక అంశంపై చర్చ జరుపుకోవడం వారికి అలవాటు.


‘‘ఐనా ఇదేం చిత్రమైన పోలికరా! ఉల్లికి ముఖ్యమంత్రి క్యాండిడేట్లకు సంబంధం ఏమిటి? అని కుటుంబరావు ఆశ్చర్యపోయాడు.
‘‘ఉల్లి మనకు మేలు చేస్తుంది, ముఖ్యమంత్రి అభ్యర్థులు తమకు తాము మేలు చేసుకుంటారు’’అని సుబ్బారావు నవ్వాడు.
‘‘ఐనా ఉల్లిపాయలంటే అవేమన్నా ఇంజనీరింగ్ సీట్లనుకున్నావా అవసరం అయిన వాటికన్నా ఎక్కువ అందుబాటులో ఉండడానికి’’ అని కుటుంబరావు తన వంతు జోకేశాడు.


మహా అయితే కొత్త రాష్ట్రానికి ఇంకో కొత్త ముఖ్యమంత్రి అవసరం అవుతాడు కానీ అరటిపండ్లలా ముఖ్యమంత్రి అభ్యర్థులకు డజన్ల కథా కమామిషేమిటి? ’’ అని కుటుంబరావు అడిగాడు.
‘‘చెబుతా కానీ, కొత్త రాష్ట్రంలో ముఖ్యమంత్రి ఎవరవుతారనుకుంటున్నావు? అని సు బ్బారావు అడిగాడు.
‘‘తెలంగాణ కోసం ఉద్యమించిన వారు కా రు. ఉద్యమ కాలంలో పదవిని అంటిపెట్టుకున్నవారే అవుతారు’’ అని కుటుంబరావు చెప్పాడు.
‘‘ఇది స్వాతంత్య్ర పోరాట కాలం నుంచి వస్తున్న సంప్రదాయమే!స్వాతంత్య్ర పోరాట యోధులు అలానే ఉండిపోయారు, బ్రిటిష్ పాలన కొనసాగాలని కోరుకున్న వారు ఆ తదనంతరం అధికారంలోకి వచ్చారు. ముఖ్యమంత్రి ఎవరు కావచ్చునంటావు’’ అని సుబ్బారావు అడిగాడు.


‘‘హఠాత్తుగా ఈ మధ్య భాగ్యనగరంలో ఎక్కడ చూసినా భారీ హోర్డింగులు కనిపిస్తున్నాయి. తెలంగాణ ఇచ్చినందుకు కృతజ్ఞత చెబుతూ ఒకవైపు సోనియా బొమ్మమరోవైపు మంత్రి అరుణమ్మ బొమ్మ కనిపిస్తోంది. విష యం ఏమని విచారిస్తే ఏం నాకేం తక్కువ ముఖ్యమంత్రిని నేనెందుకు కాకూడదని ఆమె అంటున్నారట! సమాచార మంత్రి కాబట్టి హోర్డింగ్‌లు పెద్ద కష్టమేమీ కాదనుకో? ఇక ఉద్యమ కాలమంతా మౌ నంగా ఉండి సిడబ్ల్యుసి నిర్ణయం ప్రకటించే ముందు హఠాత్తుగా వీర తెలంగాణ వాదిగా ముందుకొచ్చిన ఉప ముఖ్యమంత్రి ఉండనే ఉన్నారు. ఉప తొలగిస్తే చాలు.. 30 రోజుల్లో ఏ భాషనైనా నేర్పించే పుస్తకాలున్నట్టు 60 రోజుల్లో ఆయన ఉద్యమ పాఠాలు బాగానే నేర్చుకున్నారు. జనారెడ్డి, జైపాల్‌రెడ్డి క్యూలో ఉండనే ఉన్నారు’’ అని కుటుంబరావు చెప్పాడు.

‘‘అంతా కాంగ్రెస్ వారి పేర్లే చెబుతున్నావు, ఇతర పార్టీల్లో ఎవరూ లేరా? ’’సుబ్బారావు అడిగాడు.
‘‘తెలంగాణ వస్తే దళితుడే సిఎం అని చెప్పడం ద్వారా మొదట్లోనే కెసిఆర్ ముఖ్యమంత్రి పదవిపై ఆశలేదని చెప్పేశారు కదా? రామన్న , రాజన్న ఇంట్లోలా తన ఇంట్లోనూ  క్యూ పెరుగుతున్దనుకొని ముందు జాగ్రతగా అలా చెప్పారేమో .. ఆయనేం చెప్పినా
ఈ ఒక్కసారికి మాత్రం సోనియాగాంధీ ఎవరి పేరు సూచిస్తే వారే తెలంగాణకు ముఖ్యమంత్రి అవుతారు’’ అని కుటుంబరావు చెప్పాడు. ‘‘సరే ఇంతకూ డజన్ల కొద్ది ముఖ్యమంత్రి అభ్యర్థుల కథేమిటని ’’ మళ్లీ అడిగాడు కుటుంబరావు

‘‘అక్కడికే వస్తున్నా వారసత్వ రాజకీయాలకు, కాంగ్రెస్‌కు వ్యతిరేకంగా అన్నగారు తెలుగుదేశం పార్టీ ఏర్పాటు చేశారు కదా? చిత్రంగా ఆయన కుటుంబీకులే ఇప్పుడు కనీసం అరడజను మంది ముఖ్యమంత్రి పదవి కోసం టిడిపి తరఫున క్యూలో ఉన్నారు. కాలం కలిసొస్తే కాంగ్రెస్ ద్వారా ముఖ్యమంత్రి కావడానికి అన్నగారి కూతురు పురంధ్రీశ్వరి సిద్ధంగా ఉన్నారు. చంద్రబాబు మళ్లీ సిఎం పదవి కోసం చేయని దీక్ష లేదు.ఇంట్లో, ఎన్టీఆర్ భవన్‌లో మార్చని వాస్తు లేదు. నాన్నా నేను అని లోకేశ్ అంటుంటే గెలిచే చాన్స్ లేకపోతే నీకోసం త్యాగం చేస్తాను అంటున్నాడు. ఇక బాలయ్య బాబు సిద్ధంగానే ఉన్నాడు. ప్రమాణస్వీకార పత్రాన్ని సింపుల్‌గా మారిస్తే ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయడం హరికృష్ణకు పెద్ద కష్టమేమీ కాదు. జూనియర్ ఎన్టీఆర్ ప్రాక్టికల్‌గా ఆలోచిస్తూ ఇప్పుడు కాదు ఇంకో ఐదేళ్లయినా నిరీక్షిస్తాను అంటున్నాడు.


వైఎస్ కుటుంబంలో ఎంత లేదన్నా పావుడజను మంది ముఖ్యమంత్రి క్యాండిడేట్లు ఉన్నా రు. అంతా అనుకున్నట్టు జరిగితే జగన్ బాబు, లేదంటే అమ్మానో, చెల్లినో ఆ పదవి చేపట్టేందుకు సిద్ధంగా ఉన్నారు. సువార్తలు వినిపిస్తున్న అల్లుడి గారికి ముఖ్యమంత్రి అనే మంచి వార్త వినే యోగం ఉందో లేదో?
పవర్ ప్రాజెక్టుల ద్వారా బోలెడు సంపాదించిన లగడపాటికి కొత్త పార్టీ పెట్టి నిజమైన పవర్ పొందాలని చాలా కాలం నుంచి ఉంది. రాయపాటి, కిరణ్‌కుమార్‌రెడ్డిలు సైతం కొత్త పార్టీ అంటున్నారు. కొత్త పార్టీ పెట్టి విజయం సాధిస్తే మహా అయితే ముఖ్యమంత్రిని అవుతాను, నేనిప్పుడు అదే పదవిలో ఉన్నాను కదా? అంటూ కిరణ్ కుమార్‌రెడ్డి ఈ మధ్య చెప్పారు కదా? చిరంజీవి ముఖ్యమంత్రి పదవి కోసం సినిమా లో రిహార్సల్స్ కూడా పూర్తి చేశాడు. ఆనం, బొ త్స బాబు ఎలాగూ క్యూలో ఉండనే ఉంటారు.
తండ్రి మరణించినప్పుడు కారుణ్య నియామకం కింద ఉద్యోగం పొందిన ఉద్యమ నేత అశోక్‌బాబుకు సైతం మనసులో ఎక్కడో ఇలాంటి ఆలోచన ఉన్నట్టుంది. ‘‘కొత్త పార్టీ పెట్టి ముఖ్యమంత్రి అయ్యేంతగా ప్రజల్లో అభిమానం ఉంది కానీ నిధులు లేవు అని ఆయన చెప్పినట్టు పత్రికల్లో వచ్చింది.
 మార్కెట్ ఉంది అనుకుంటే పెట్టుబడి పెట్టె వారు ఎంత మంది లేరు  ’’ అని కుటుంబరావు చెప్పాడు. ఒక్క ముక్కలో చెప్పాలంటే సీమాంధ్రలో ఒక్కో నియోజక వర్గానికి కనీసం ముగ్గురు ముఖ్యమంత్రి అభ్యర్థులు కనిపిస్తారు అని కుటుంబరావు చెప్పాడు.

వీరి సంభాషణ వింటున్న మూడో వ్యక్తి ‘‘ముఖ్యమంత్రి అభ్యర్థులకు కొరత లేదు. కానీ జనం కోసం తపించే నాయకులే లేరు. అదే అసలైన కొరత ’’ అని చెప్పి వెళ్లిపోయాడు.

14 కామెంట్‌లు:

 1. ముఖ్యమంత్రి అభ్యర్థులు చాలా మందే దొరుకుతారు కాని అందులో ఒక్క వావిలాల గోపాలకృష్ణయ్య కూడా లేడు!

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. surya prakash apkar గారు మీది మరీ అత్యాశ వావిలాల గోపాల క్రిష్ణయ్య గారిని మనం అసెంబ్లీ కే ఎన్నిక కాకుండా విజయం సాధించాం ఇక ముఖ్యమంత్రి వరకా ( వావిలాల ఓడినప్పుడే నన్నపనేని గెలిచారు )

   తొలగించు
 2. మీ అభిమాన నాయుకుడు ముఖ్య మంత్రి అయ్యేట్టు లేదని తెగ బాధ పడుతున్నట్టున్నారు

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మీకెలా తెలిసింది ? తొమ్మిదేళ్ళ నుంచి నిద్ర కుడా పట్టడం లేదు ఈ ఆలోచన రాగానే

   తొలగించు
 3. నాకు తెలిసి 13 సంవత్సరాలుగా CM పదవి కోసం ఏం చేయడానికైనా వెనకాడని వ్యక్తి కోసం అనుకుంటా ...?

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. నా గురించి నాకన్నా మీకే ఎక్కువ తెలుసా ? సంతోషం

   తొలగించు
 4. బక్కన్న ఇంట్లో వాళ్ళ నేతలను ??అలాగే బక్కన్న పార్టీలో చేరిన నేతలను మర్చిపోతే ఎలా ??

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం