3, ఏప్రిల్ 2014, గురువారం

లెక్కల్ల్లో జగన్

  

ఎ క్కడ రాణించాలన్నా -ముందు ఓ లెక్కుండాలి. అంటే -లెక్కల్లో పట్టుండాలి. అది వ్యాపారం కావొచ్చు. జీవితమో.. రాజకీయమో కావొచ్చు. వైఎస్ జగన్మోహన్‌రెడ్డి వయసు లెక్కకు -చిన్నది. రాజకీయ వయసు -అంతకన్నా చిన్నది. పొలిటికల్ అకౌంటెన్సీలో మాత్రం -ఆయనది వయసుకు మించిన పరిణతి. ఆ ఆసక్తితోనే బికాం చదివారు. తరువాత ఎంబిఏ కోసం విదేశాలకి వెళ్లారు. పొరుగు దేశంలో ఎంబీయే చేయడంకంటే సొంతూళ్లో వ్యాపారం లాభసాటి అని లెక్కలేసుకున్నారు. అందుకే విదేశాల నంచి -మధ్యలోనే తిరిగొచ్చేశారు. జగన్ తండ్రి -వైఎస్ రాజశేఖర్‌రెడ్డి 60ఏళ్ల వయసులో రాజకీయాల నుంచి రిటైర్‌కావాలంటూ పదే పదే చెప్పేవారు. (ఆయనదో లెక్క).

బాబాయ్‌తో రాజీనామా చేయించి కడప నుంచి పార్లమెంటుకు పోటీ చేసేందుకు జగన్ సిద్ధమయ్యారు. కానీ -సోనియా నుంచి గ్రీన్‌సిగ్నల్ రాలేదు. 2009 పార్లమెంటు ఎన్నికల్లో కడప నుంచి పోటీ చేసి వైఎస్సార్‌కు వారసునిగా సన్నద్ధమవుతున్న సమయంలో హెలికాఫ్టర్ ప్రమాదంలో వైఎస్సార్ మరణించడంతో జగన్ రాజకీయ జీవితం ప్రశ్నార్ధకమైంది. అధికార పక్షం మంత్రులు, ఎమ్మెల్యేలంతా జగన్‌ను ముఖ్యమంత్రిని చేయాలని సంతకాలు చేశారు. ఎవరు చేశారో.. ఇంకెవరు చేయించారోనన్న విషయం పక్కనపెడితే -మొత్తంమీద మెజారిటీ ఎమ్మెల్యేలు సంతకాలు చేసేశారు. జగన్ స్పీడ్‌కు హైకమాండ్ మాత్రం బ్రేకేసేసింది.

స్క్రీన్ మీదకు -రోశయ్యను ముఖ్యమంత్రిగా తెచ్చింది. రోశయ్య కాలం దీర్ఘంగా నడిచిపోతుంటే -కుర్రాడు జగన్ వౌనంగా ఉండలేక పోయాడు. పీఠం దక్కని తనని -సంతకాలు పెట్టిన ఎమ్మెల్యేలే ఓదార్చకపోడంతో తానే జనాన్ని ఓదార్చేందుకు బయలుదేరారు. అక్కడే -్భవిష్యత్ ప్రణాళికకు బ్లూప్రింట్ తయారు చేసుకున్నారు.

ముసుగులో గుద్దులాటకు ఫుల్‌స్టాప్ పెట్టారు. హైకమాండ్‌ను కలిసి లెక్కలు తేల్చుకుందామన్న నిర్ణయానికి వచ్చారు. లాభసాటి అయితే కొనసాగటం. లేదంటే -కొత్త దారి చూసుకోవటం. ఇదీ అప్పటి ఆయన నిర్ణయం.
కుటుంబ సమేతంగా -పార్టీ చీఫ్ సోనియాను కలిశారు. ‘నీ భవిష్యత్ నాకొదిలెయ్’ అన్న ఒక్క మాటొస్తే చాలనుకున్నారు. కనీసం కేంద్రంలో మంత్రి పదవి దక్కుతుందని ఆశించారు. కానీ -్ఢల్లీలో ఉన్నది హై’కమాండ్. తీపి కబుర్లు వినడమే తప్ప, వినిపించాలని అనుకోదు. అదే జరిగింది. జగన్ లెక్క కరెక్టయ్యింది. ఒక్కసారి మాజీ సిఎంల సంతానాన్ని మనసులోనే పరీక్షించారు. మర్రి చెన్నారెడ్డి, కోట్ల విజయభాస్కర రెడ్డి.. ఇలా ఎందరో మాజీ సిఎంల సంతానం భవిష్యత్ పార్టీలో ఎలా ఉందో లెక్కలేశారు. లేట్ చేస్తే లెక్క తప్పే ప్రమాదం ఉందని, చాలామందిలాగే తానూ ప్రవాహంలో పుడకలా మిగిలిపోతానని అంచనా వేసుకున్నారు.
భవిష్యత్ అయోమయమైన పార్టీలో ఉండేకంటే -పార్టీ పెట్టి భవిష్యత్ చూసుకోవడం బెటరనుకున్నారు. అంతే -కాంగ్రెస్ నుంచి జగన్ వేరుపడ్డారు. అప్పటికి రాష్ట్రంలో వైఎస్సార్ అంటే కాంగ్రెస్, కాంగ్రెస్ అంటే వైఎస్సార్ కనుక -వైఎస్సార్ కాంగ్రెస్ పేరిట కొత్త పార్టీకి పురుడు పోశారు. కొత్త పార్టీని భుజనేసుకుని -జనంలోకి వెళ్లారు. వైఎస్సార్ సంక్షేమ పథకాల ప్రభావం ప్రజల్లో ఎంతబలంగా ఉందో ఓదార్పులో తిరుగుతూ ఒడుపుగా పసిగట్టారు.
వైఎస్సార్ అధికారాన్ని పుత్రుడు దుర్వినియోగపర్చి కోట్లు స్వాహా చేశారని కేసులు పుట్టుకొచ్చాయి. జగన్ సహా మంత్రులు, ఐఏఎస్ అధికారులు జైలుపాలయ్యారు. అయితే ఇదంతా ఒక కుటుంబంపై అందరూ కలిసి సాధిస్తున్న కక్షగానే సామాన్యులు భావించి, ఉప ఎన్నికల్లో ఘన విజయం చేకూర్చి పెట్టారు.

కెరీర్ విషయంలో జగన్ -లెక్క తప్పలేదు. అందుకే కాంగ్రెస్‌ను వదిలేశారు. కొత్త పార్టీ పెట్టారు. లెక్కను సరిగ్గా నిర్దేశించుకోలేక మరో మార్గంలో వెళ్లివుంటే ఇప్పటికి -జగన్ చాలామంది మాజీ సిఎంల పుత్రరత్నంలాగే ఉండి ఉండేవాడు.
ఎంతోమంది హేమాహేమీలు కాంగ్రెస్‌కు రాజీనామా చేసి మనసు చంపుకుని అప్పటి వరకు తిట్టిన బాబును ఆకాశానికెత్తుతున్నారు. ఆంధ్ర రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చంద్రబాబుకు మాత్రమే సాధ్యమనే డైలాగును అరగదీస్తున్నారు. లెక్కల్లో విఫలమైవుంటే -అలాంటివాళ్ల జాబితాలో జగన్ కూడా ఉండిఉండేవాడే. లెక్క తప్పలేదు కనుకే -క్యూలో ఉండాల్సిన జగన్ ముందు ఇప్పుడు క్యూ ఉంటోంది. 16 నెలలు జైలులోవున్నా పార్టీని ఉప ఎన్నికల్లో పరిగెత్తించారు. సార్వత్రిక ఎన్నికల్లో సర్వేలన్నీ -ఆంధ్రలో అధికారం జగన్ పార్టీకేనని చెప్పే స్థితికి తెచ్చారు. ఇంతా చేస్తే జగన్ వయసు -42 ఏళ్లు. రాజకీయం వయసు ఐదేళ్లు. అందులో 16 నెలల కాలం జైలు జీవితం. కానీ  
ర్టీ ఇయర్స్ పాలి’ట్రిక్స్‌లో ఉన్నవాళ్లకు చమటలు పట్టిస్తున్నారు. రాజకీయాల్లో నిలదొక్కుకోవాలంటే సొంత మీడియా ఎంతో అవసరమని చిన్నతనంలోనే గ్రహించిన నేత. 

తెలంగాణ, సమన్యాయం, సమైక్యం అంటూ ఎప్పటికప్పుడు మాట మార్చినా అన్నీంటిలో -ఆయనకు ఉండే లెక్కలు ఆయనకున్నాయి. అవే -జగన్‌ను కాపాడుతున్నాయి.

2 కామెంట్‌లు:

  1. అన్ని లెక్కల్లోనూ ఆఖరి ఈక్వేషన్ ఒకటుంటుంది. అదే లెక్క పూర్తయ్యాక మనక్కావల్సిన రిజల్టు నిస్తుంది.ఆ ఆఖరి ఈక్వేషన్ ఇప్పుడు ప్రజల చేతుల్లో ఉంది, దాన్ని బట్తి జ"గన్" పేలుడు ఉంటుంది.

    రిప్లయితొలగించు
  2. సర్వేలు యెంతవరకూ నిజమవుతాయో తెలీదు గానీ అన్ని సర్వేలూ తెదేపా తో పోటాపోటీగా ఉన్నా డంటున్నాయి. మన |లోకి| ఆశిస్తున్నట్టు ముఖ్యమంత్రి స్థానం కాక ప్రధాన ప్రతిపక్షం మాత్రమే దక్కుతుంద నంటున్నాయి.కానీ మానిఫెస్టోలో ఫైళ్ళన్నీ ముందే హైకోర్తుకీ కాగ్ కీ పంపిస్తాననడం, తర్వాత యేకితే మాత్రం పత్రికల్ని జెయిల్లో పెడతాననటం చూసి గురుడు నిజంగా చదుకున్నోడేనా లేక అది కూడా అడ్దగోలుగా దాటేసి వచ్చిన నిశానీయా అనిపించింది.

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం