20, జూన్ 2012, బుధవారం

చీమ తల - నాయకుల మెదడు

చీమ తల ఎంతుంటుంది? అందులో మెదడు సైజు ఎంత? రాజవౌళి ఈగ హిట్టయితే తరువాత చీమ వంతు రావచ్చు. టాలీవుడ్‌లో ఇప్పుడున్న హీరోలను నమ్ముకోవడం కన్నా ఈగ, చీమ, దోమలను నమ్ముకోవడం బెటర్ అని కృష్ణానగర్‌లో వినిపిస్తున్న టాక్. సరే ఉప ఎన్నికలతో రాష్ట్రం భవిష్యత్తు ఏమిటా? అని టెన్షన్ పడుతుంటే చీమ తల గురించి ఆలోచిస్తున్నావు అంటారా? ఎన్నికల ఫలితాల గురించి ఆలోచిస్తుంటేనే చీమ సంగతి గుర్తొచ్చింది. చీమా చీమా నువ్వు ఎందుకు కుట్టావు? అంటే పుట్టలో వేలెడితే కుట్టనా అని సమాధానం చెబుతుంది. తన పుట్టలో వేలు పెడితే కుట్టాలి అనే జ్ఞానమే కాదు, ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పే తెలివి కూడా ఉంది. అదే నాయకులను ఓ ప్రశ్న అడిగితే ఇలా చెబుతారా? చెప్పనే చెప్పరు ఎందుకంటే వారి మెదడు చీమ తల కన్నా చాలా పెద్దది కాబట్టి. ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడారు? అనడిగితే?
***
నర్సరావుపేట ఎంపి నేత మోదుగుల వేణుగోపాల్‌రెడ్డిని మీ ప్రత్తిపాడు, మాచర్లలో టిడిపి ఎందుకు ఓడిపోయింది? అని ప్రశ్నిస్తే, నియోజక వర్గం ప్రజల్లో సగం మందికి జనగణమన జాతీయ గీతం రాదు. దాంతో డబ్బుకు, మద్యంకు ఓటు అమ్ముకున్నారు. అందుకే ఓడాం అని చెప్పారు. పోనీ మిగిలిన సగం మందికి జనగణమన వచ్చినా ఓటు వేసే సమయంలో మరిచిపోయినట్టున్నారు. బాబుగారూ ఇప్పుడు మీరు అర్జంట్‌గా ఓటర్లకు జనగణ మన జాతీయ గీతాన్ని నేర్పించండి.
**
పిసిసి బొత్స గారూ ఏంటండి ఉప ఎన్నికల్లో ఇలా జరిగింది. రెండు సీట్లకే పరిమితం అయ్యారు? అని ప్రశ్నిస్తే, ఎండల వల్ల ఓడిపోయాం అని చల్లగా చెప్పారు. బాబుగారి పాలనలో ఐదారేళ్లపాటు వర్షాలు లేక వానదేవుడి వల్ల ఓడిపోయినప్పుడు కాంగ్రెస్ పాలనలో ఎండల వేడికి ఓడిపోయామని చెబితే నమ్మాలి మరి. బొత్స మాటలపై టీవీలో చర్చ నిర్వహిస్తే, టీవీ ప్రేక్షకుడొకరు ఫోన్ చేసి అలాగా అయితే వర్షాల్లో ఎన్నికలు నిర్వహిస్తే మొత్తం 18 సీట్లు గెలిచేవారా ? అని ఎకసెక్కాలాడాడు. మరొకాయనేమో! జగన్ అరెస్టు వల్ల సానుభూతితో గెలిచాడని టీవీలో నేతలు మాట్లాడుతుంటే, ఐతే బాబు తన కోర్టు కేసుల నుండి స్టే తెచ్చుకోవడం ఎందుకు, అధికారంలో ఉన్నప్పుడు తన వాళ్ల కోసం చేసినవన్నీ సిబిఐకి చెప్పి అరెస్టయి మొత్తం 294 సీట్లు గెలవ వచ్చు కదా? అని సలహా ఇచ్చారు. 

కిరణ్ కుమార్‌రెడ్డి సంతోషంగా స్వీట్లు పంచుతున్నారు. ఏం సార్ ఎందుకు ఓడిపోయారు? అంటే ఓడిపోవడం ఏమిటి? రెండు సీట్లు గెలిచాం అని అనువాదం అవసరం లేని తెలుగులో చెప్పాడు. ఆశ్చర్యం నుంచి తేరుకోక ముందే టేబుల్‌పైన 30 రోజుల్లో తెలుగు పుస్తకం కనిపించింది. సరే చెప్పండి అంటే? మా పై మాకూ, హై కమాండ్‌కు, మీకు, మా అభ్యర్థులకు ఎవరికీ నమ్మకం లేకపోయినా నర్సాపురం, రామచంద్రాపురం తెలుగు తమ్ముళ్లకు పూర్తి నమ్మకం ఉంది, అందుకే వాళ్లు మద్దతిచ్చారు, మా వాళ్లు గెలిచారు అని చెప్పుకొచ్చారు. ఆ రెండు కాదండి మిగిలిన వాటి సంగతి చెప్పండి ? అని అడిగితే ఎవరో ఒకరు గెలిపించాలి కానీ ఓడించడానికి మాత్రం మా శక్తి మాకు సరిపోతుందని నవ్వాడు. ఏ విషయంపైనైనా అంకెలతో సహా చక్కగా విశే్లషించి చెప్పే చంద్రబాబు వద్దకు స్పష్టంగా చెబుతాడని వెళితే....
***
టేబుల్ నిండా ఫైళ్లు ఉన్నాయి. వాటిని పక్కకు జరిపి చూస్తే చంద్రబాబు కనిపించారు. ఏంటిసార్ సెక్రటేరియట్‌లో ఒక్క ఫైల్ కూడా కదలడం లేదట కిరణ్ కుమార్ మొత్తం ఫైళ్లు మీకే పంపిస్తున్నట్టున్నారు? అని జోకేస్తే, ఇవి మా పార్టీకి సంబంధించిన ఫైళ్లు అని చిన్నబుచ్చుకున్నారు. ఓహో మొత్తం రాష్ట్రంలోని ప్రజలందరి వివరాలు ఉన్నట్టున్నాయి. రాష్ట్రం కాదు ఒక్క నియోజక వర్గంవే మా వద్ద పూర్తి వివరాలు ఉంటాయి. చదువుతా వినండి అని ఇంటి నంబర్ 1-2.12 తింగరి వీధి, ఓటరు పేరు నాలేశ్వర్ వయసు 50. ఎత్తు 5.5 అడుగులు, బరువు 65 కేజీలు, పలానా కులం. వారానికి ఒకసారి భార్యాభర్తలు సినిమాకు వెళతారు. మహేష్‌బాబు, ఇలియానా అభిమాని. తాగి వస్తే భార్యను చితగ్గొడతాడు, తాగకుండా వచ్చినప్పుడు భార్య చితగ్గొడుతుంది. 1980లో పెళ్లి....
సార్ ... ఆగండి సార్ ఉప ఎన్నికల్లో ఎందుకు ఓడిపోయారో తెలిసిపోయింది. ఇక చాలు. మీ వద్ద అవసరమైన సమాచారం కన్నా అనవసర సమాచారం ఎక్కువగా ఉంటుంది. అంకెలను నమ్ముకుని బోర్లా పడుతున్నారు. మీ వద్ద రాష్ట్ర ప్రజల జీవిత చరిత్ర ఉంది కానీ ప్రజలేమనుకుంటున్నారో మీకు తెలియదు..


***
సరే మేధావి గారు ఎన్నికల ఫలితాల పై మీరేమంటారు ?
ప్రజల్లో నిజాయితీ, మంచితనం లోపించింది. ప్రజలంతా అవినీతి పరులయ్యారు ?
 డబ్బులు అన్ని పార్టీల వాళ్ళు పంచారని వార్తలు వచ్చాయి కదా ?
 నేను అదే చెబుతున్నాను. ప్రజలు ఒక పార్టీ కి ఓటు వేయాలని నిర్ణయించుకున్నప్పుడు ఇతర పార్టీ వారి నుంచి డబ్బు తీసుకోవడం తప్పు కదా 
మా సామాజిక వర్గాన్ని గెలిపించని ఈ ప్రజలన్నా, వీళ్ళ తీర్పు నాకు కంపరమేస్తోంది ? అయితే నేను ఆశావాదిని 2014 లో మా సామాజిక వర్గం విజయం సాదిస్తుంది . కుల రహిత సమాజాన్ని నిర్మిస్తుంది .
***
నేను ఎక్కడికెళితే అక్కడికి నా వెంటే పరిగెత్తుకొస్తున్నావు? ఇంతకూ నువ్వు ఎవరు బాబు? అని అడిగితే, నన్ను ఓటరు అంటారు. ఓడించేది, గెలిపించేది నేనే? నన్ను తప్ప అందరినీ ఫలితాలపై అడుగుతున్నావు అని ఓటరు కోపంగా చూశాడు.

8 కామెంట్‌లు:

  1. నేను ఆ ఓటరునే అడుగుతున్నాను ఎందుకు YSR congress party ని గెలిపించావు అని.

    రిప్లయితొలగించండి
  2. గెల్లి ఫణీంద్ర విశ్వనాధ ప్రసాదుగారు ఈ క్రింది పోస్ట్ ఓ సారి చూడండి .పాపం ఓటరు మాత్రం ఏం చేస్తారండి

    ముగ్గురు మరుగుజ్జులు
    http://amruthamathanam.blogspot.in/2011/03/blog-post_4950.html

    రిప్లయితొలగించండి
  3. @PHANI GAARU

    yenduku gelipinchaarante......gatha 2 yrs gaa JANAM lone vunna JAGAN leadership chusi......YSR legacy vooorike theesesukundaamani kaakundaa...YSR laagaane PRAJALA tho prathyaksha sambandhaalu yerparachukovadam valana.....

    రిప్లయితొలగించండి
  4. ఎప్పుడూ చెప్పేదే! టపా చాలా బాగుంది. ఓడిపోయినప్పుడు పార్టీలు చెప్పే సాకులు వినోదాత్మకంగా ఉంటాయి. వాటిని మీరు మరింత సానబెట్టారు. నాకయితే ఎన్నికల ఫలితాలు ఆశ్చర్యాన్ని కలిగించ లేదు.

    రిప్లయితొలగించండి
  5. రమణ గారు నాకు అంతే ఫలితాలు ఆశ్చర్యం కలిగించలేదు .పరకాలలో టిఆర్ యస్ స్వల్ప మెజారిటితో గెలుస్తుందని అనుకున్నాను కానీ ౫ వేళ మెజారిటి అన్న వస్తుందనుకున్న, కాంగ్రెస్స్ కు ఒకటి వస్తుందనుకుంటే రెండు వచ్చాయి.

    రిప్లయితొలగించండి
  6. @MURALI GARU

    Congress ki vachina aaa 2 seats lo kudaaa voting trend chusthe....TDP ki mareee 6000.....8000 voting vachindi.......it clearly shows the MATCH FIXING between TDP-INC thr......

    actual gaaa CBN gaari ki USE&THROW meeda PATENT vundedi...but ippudu CONGRESS vaallu BABU gaarin USE&THROW chesaaru....TDP ki votes transfer cheyyaledu congress...but...TDP maatram...2 places lo votes transfer chesindi.....

    :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. బాగా చెప్పారు. చంద్రబాబు 2009 ఎన్నికల్లో కూడా use and throw policy వాడబోయి అసలుకే మోసం తెచ్చుకున్నారు. సీపీఐ, సీపీఎం, టీఆరెస్ పార్టీలు పాపం అమాయకంగా టీడీపీకి ఓట్లు వేసి గెలిపిస్తే, చంద్రబాబు మాత్రం ఒకేసారి ముగ్గురికీ hand ఇచ్చాడు. తాడి తన్నేవాడుంటే vvavaavaadvaadiవాడి తల తన్నేవాడు ఉంటాడన్నట్టు, చంద్రబాబు trademark అస్త్రాన్ని చంద్రబాబు మీదే ప్రయోగించగలిగింది కాంగ్రెస్!! ఈ ఒక్క విషయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీని మెచ్చుకోవాల్సిందే!! కాంగ్రెస్ లెక్కలు కాంగ్రెస్ కి ఉన్నాయి కదా మరి!! రేపు సీఎం పదవి ఇస్తామంటే జగన్ పార్టీ కాంగ్రెస్ లో కచ్చితంగా కలిసిపోతుంది!!

      తొలగించండి
  7. @avinash....

    KEVALAM CM padavi maatrame oka ISSUE laagaa kanipinchadam ledu....CM padavi anedi CONGRESS HIGH COMMAND vese BHIKSHAM kaaadu....manam...ante JANAM mechi ichedi.......

    SONIA....YSR family ni avamaninchindi....anedi suspashtam...anduke YSR CONGRESS puttindi.....

    JAGAN malli congress tho kalavadam anedi just impossible......alaa kalise vudhesame vunte.....asalu eee CBI CASE lu vundevaaa?????

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం