8, సెప్టెంబర్ 2014, సోమవారం

మేనేజ్‌మెంట్ గురు చింతామణి!

‘ఏమి రామయ్యా దీర్ఘంగా ఆలోచిస్తున్నావు’’ అంటూ భాస్కరం నవ్వుతూ అడిగాడు.
‘‘నా చింత చింతామణి గురించి ’’అని కుటుంబరావు బదులిచ్చాడు. ‘‘ఎవరన్నా వింటే నవ్వుతారు. ఇంట్లో వాళ్లు విన్నారా? అంటే తన్ని బయటకు తగలేస్తారు? సిగ్గులేకపోతే సరి ఈ వయసులో చింతామణి గురించా ఆ రోజుల్లో అయితే వేరు’’ అంటూ భాస్కరం ఊహల్లోకి వెళ్లిపోయాడు. ‘‘తప్పులో కాలేశావోయ్ భాస్కరం నువ్వు ఆలోచిస్తున్న దాని గురించి కాదు నేను ఆలోచిస్తున్నది. నా ఆలోచన సూపర్ హిట్టయిందంటే నాకు డబ్బే డబ్బు, నీతో ఇలా కబుర్లు చెప్పడానికి సైతం సమయం ఉండదు’’ అంటూ కుటుంబరావు చెప్పుకుపోతున్నాడు.


‘‘అబ్బో చింతామణి గురించి మాకు తెలియదనుకోకు ఆ నాటకంలో ప్రతి డైలాగు నాకు కంఠతా వచ్చు, వదలమంటావా? ఎప్పుడో మంచి వయసులో ఉన్నప్పుడు విన్న నాటకం. చింతామణిని చూడకపోయినా చింతామణి అబ్బలాంటి వారి గురించి నాకు తెలుసు. ఒకరా ఇద్దరా ఇంత మందిని చూసుంటాను అని తలవెంట్రుకలు చూపించాడు భాస్కరం. ‘‘ఇదిగో కటుంబరావు అనుభవంతో చెబుతున్నాను విను, ఈ వయసులో నీకు చింతామణి మీద మనసు పడడం మంచిది కాదు. అయినా వాళ్లు జేబులు ఖాళీ చేస్తారు కానీ వాళ్లతో నీకు డబ్బులు రావడం ఏమిటోయ్. గోడకు కొట్టిన సున్నం తిరిగి వస్తుందంటే నమ్మేంత అమాయకుడిననుకున్నావా?’’ అంటూ భాస్కరం అడిగాడు. ‘‘నేనసలు విషయం చెప్పక ముందు నువ్విలా తీర్పులిచ్చేయడం ఏమీ బాగాలేదోయ్.. చింతామణి గురించి ఆలోచిస్తున్నాను అంటే డబ్బంతా ఆమెకు తగలబెట్టాలని కాదు. ఆమె జీవితంపై ఓ పుస్తకం రాయాలని ఆలోచిస్తున్నాను’’ అంటూ కుటుంబరావు చెప్పాడు.


‘‘హవ్వ నవ్విపోతారు. చింతామణిని తలుచుకోవడమే తప్పు అంటే ఆమె జీవిత కథ రాస్తావా? ఇంకెవరూ దొరకలేదా ? ఏమిటి? జీవిత కథ రాసి చింతామణి జీవితంలోకి ప్రవేశించి ఆమె సొమ్ము కాజేయాలనుకుంటున్నావేమో, నీలాంటి వాళ్లను చింతామణి ఎంత మందిని చూసి ఉంటుంది. కస్టమర్ల జేబులు ఖాళీ చేయడమే కానీ ఆమె నుంచి సంపద ఆశించేవాడిని నినే్న చూస్తున్నాను’’ అని భాస్కరం అనుమానంగా ముఖం పెట్టాడు.


‘‘హమ్మయ్య ఇప్పుడు కొంత దారిలోకి వచ్చావు. చూశావా? నువ్వు కూడా చింతామణి శక్తిసామర్ధ్యాలను కథలు కథలుగా చెబుతున్నావు. నాకు కావలసింది అదే... చింతామణి సామ ర్ధ్యం పై చింతామణి మేనేజ్‌మెంట్ గురు అంటూ ఇంగ్లీష్‌లో ఓ బుక్ రాయాలనుకుంటున్నాను’’ అని కుటుంబరావు చెప్పాడు. ‘‘ఏంటో ఏమీ అర్ధం కావడం లేదు. వివరంగా చెప్పు’’ అని భాస్కరం అడుగడంతో అప్పుడు కుటుంబరావు మనసులోని ఆలోచన బయటపెట్టాడు.


‘‘ఇదిగో ఇటు రా ఇంటర్‌నెట్‌లో చూడు’’ అంటూ గూగుల్‌లో క్లిక్ చేయగానే కొన్ని వందల మహాభారత పుస్తకాలు కనిపించాయి. ‘‘చూశావా? మహాభారతంలో మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయంటూ వాటిని వెలికి తీసి ఈ నాటి కార్పొరేట్ కంపెనీలకు మేనేజ్‌మెంట్ పాఠాలు చెబుతూ వందల పుస్తకాలు వచ్చాయి. ఆ గ్రంథాలను చూసి భాస్కరం విస్తుపోయాడు. ‘‘బహుశా మహాభారతాన్ని రచించినప్పుడు వ్యాస మహర్షికి కూడా మహాభారతంలో మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయని తెలిసి ఉండకపోవచ్చు. మహాభారతంలో అన్నీ ఉంటే ఉండొచ్చు కానీ రాజ్యాధికారం కోసం రాజకుటుంబాల మధ్య సాగిన యుద్ధం నేటి కార్పొరేట్ కంపెనీలకు మేనేజ్‌మెంట్ పాఠాల రూపంలో చూపడం విడ్డూరమే’’ అనుకున్నాడు భాస్కరం.


అంతేనా ఇది చూడు అని కుటుంబరావు గూగుల్ సెర్చ్‌ను మళ్లీ క్లిక్ చేయగానే కార్పొరేట్ కంపెనీ నాయకత్వ లక్షణాలు- రామాయణం అంటూ బోలెడు పుస్తకాలు దర్శనమిచ్చాయి. కుటుంబరావు వాటిని చూపిస్తూ, ‘‘్భర్యాభర్తల అనుబంధం, అన్నా తమ్ముళ్ల అనుబంధం, స్నేహ ధర్మం, పర స్ర్తి వ్యామోహం ఎలా పతనం చేస్తుందో జీవిత విలువల కోణంలోనే రామాయణం కొన్ని శతాబ్దాల నుంచి ప్రపంచాన్ని ముఖ్యంగా భారతీయుల హృదయాల్లో నిలిచింది. కానీ రామాయణంలో సైతం నేటి కార్పొరేట్ కంపెనీలకు అవసరమైన మేనేజ్‌మెంట్ పాఠాలు ఉన్నాయట! రామాయణం రచయిత, రామాయణంలో ఓ పాత్ర ధారి అయిన వాల్మీకి కూడా ఈ ఆలోచన వచ్చి ఉండదు. ఎందుకంటే అది సత్య కాలమే కానీ వ్యాపార కాలం కాదు కదా? ఇది ఫక్తు వ్యాపార కాలం కాబట్టి ధర్మాన్ని, సత్యాన్ని, భార్యాభర్తల అనుబంధాన్ని సైతం వ్యాపార కోణంలోనే చూస్తున్నారు ’’ అని కుటుంబరావు చెప్పుకొచ్చాడు. వీళ్లని చూసి మేమేమన్నా తక్కువ తిన్నామా? అని మేనేజ్‌మెంట్ గురు చాణక్య అంటూ పుస్తకాలు వెల్లువలా వచ్చిపడ్డాయి. మేమేమన్నా తక్కువనా అని స్వామి వివేకానందుణ్ణి రంగంలోకి దించారు. తన జీవితాన్ని విలువల బోధనకు, హిందూమతానికే అంకితం చేసిన వివేకానందుణ్ణి కార్పొరేట్ వ్యాపారంలోకి లాక్కొచ్చి వివేకానంద కార్పొరేట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అంటూ ప్రచారం చేస్తున్నారు. లాభాలే ధ్యేయంగా పని చేసే కంపెనీలకు విలువలు బోధించే మహాభారతం, రామాయణం, వివేకానందుని బోధనల కన్నా చింతామణి సూక్తులే సరిగ్గా సరిపోతాయి. 

అందుకే చింతామణి కార్పొరేట్ మేనేజ్‌మెంట్ స్కిల్స్ అని ఓ పుస్తకం రాయాలనిపిస్తోంది. దాని గురించే ఆలోచిస్తున్నాను. కస్టమర్‌ను ఎలా బోల్తా కొట్టించాలో, ఎలా నమ్మించాలో, ఉన్నదంతా ఏలా ఊడ్చేయాలో చింతామణి తల్లి ఎంతో చక్కగా చెబుతుంది ఈ నాటకంలో. మద్యం, ధూమపానం శరీరాన్ని గుల్ల చేస్తుందని తెలిసినా కోకా కోలా మరుగుదొడ్లను చక్కగా కడిగేందుకు ఉపయోగపడుతుందని ఎవరెంత ప్రచారం చేసినా, బర్గర్లు, పిజ్జాలు ఆరోగ్యానికి హాని కరం తినొద్దు అంటూ స్వయంగా వాటి ఉత్పత్తి దారులే ఉద్యోగులకు చెప్పినా, వాటిని ఎగబడి కొంటున్నారంటే కారణం ఏమిటి? కార్పొరేట్ కంపెనీల మార్కెటింగ్ టెక్నిక్. చింతామణి టెక్నిక్ కూడా ఇదే. కస్టమర్‌ను ఆకట్టుకోవడానికి కార్పొరేట్ కంపెనీల కన్నా ముందు ఆ టెక్నిక్‌ను అమలు చేసింది చింతామణి కుటుంబమే కదా? ఇక్కడ బిల్వమంగళుడు అయితే అక్కడ కస్టమర్ అంతే కదా? అందుకే నేను చింతామణి పాఠాలను కార్పొరేట్ లీడర్లకు పరిచయం చేయాలనకుంటున్నాను ’’ అని కుటుంబరావు చెప్పాడు. మేనేజ్‌మెంట్ గురు చింతామణి కార్పొరేట్ ప్రపంచంలో సంచలనం సృష్టిస్తుందేమో!

5 కామెంట్‌లు:

  1. ఈ కామెంట్‌ను బ్లాగ్ నిర్వాహకులు తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  2. అన్ని రంగాల్లో సినిమా , రాజకీయం ,మీడియాలో విస్తరించిన ఇప్పుడున్న వాళ్ళు చేసేది అదే కదా .. వాళ్ళు ఎవరో నేని గారికి వేరే వారు చెప్పాలా ? vaarini chuse rashanu idi

    రిప్లయితొలగించండి
  3. అందుకే చెప్పని కదా ఇప్పుడు అన్ని రంగాలలో తార చౌదరి సేవలను ఉపయోజించుకొని ఎదిగిన నేని వారి గురించి

    రిప్లయితొలగించండి
  4. మీరు యే విధమయిన దురభిప్రాయమూ, చెత్త మాతలూ లేని నా వ్యాఖ్యల్ని పబ్లిష్ చెయ్యకుండా జవాబులు మాతరం, అదీ నేని అని సంబోధిస్తూ రాయడంలో మీ వుద్దేశ మేమిటి?

    నేను బాబు & కో అభిమానిని అనా, లేక ఆ తారా చౌదరితో సంబంధాలు పెట్టుకున్న వాళ్లలో నేను కూడా వున్నాననా? మీరు అలా అనుకుంటే నేను చెయ్యగలిగింది లేదు.

    ఆంధ్రాలో వున్న వాళ్ళంతా తెలంగాణా ద్రోహులే అని మీ ముఖ్యమంత్రి లాగే మీరూ అనుకుంటూ వున్నారా? ఒక పోష్టు బాగా రాశారు అని మెచ్చుకోవదం కూడా ఆంధ్రా వాడిగానే చేశానని మీరు భావిస్తున్నారా? నేను రెండు కళ్ళ సిధ్ధాంతికి కళ్ళు మసకలు గమ్మినట్టున్నాయి అనే పోష్టు వేస్తే మీరు మన నాయకుణ్ణి మరీ తీవ్రంగా విమర్శిస్తున్నారేమో అని ఆక్షేపించినా లెక్క చెయ్యలేదు.నేను యెటువైపుకీ వంగి లేను.

    ఇప్పుడే కాదు, విడిపోవటానికి మీకున్న హక్కుని పూర్తిగా సమర్ధించాను, అప్పుడెప్పుడో ఆంధ్రా ఆకాసరామన్న బ్లాగులో ఆంధ్రా వళ్లనే కట్టడి చెయ్యడానికి ట్రై చేసాను, చాలా మటుకు గట్టిగానే నిలబడ్డాను, చెత్త మాటలు మాట్లాడనివ్వ లేదు.సకల జనుల సర్వే ని మనస్పూర్తిగా మెచ్చుకున్నాను. నాకు లేని ద్వేషాన్నీ, పరాయి భావాన్నె అంటగట్టకుండా వుంటే బాగుంటుంది!

    మీరు పని గట్తుకుని నేని అంటూ మీ కామెంటులో విదమరిచి చెప్తే తప్ప మీరు కేవలం ఒక వర్గాన్నే గురి పెట్టిన విధంగా పోష్టులో యెక్కడా లేదు, ద్వని పరంగా కూడా.స్పష్టంగా తెలిసేటట్టు రాసి వుండాల్సింది.

    మీకు నాపట్ల వున్న దురభిప్రాయాలై నేను బాధ్యుణ్ణి కాదు గదా!నా వంతు నా ప్రయత్నం నేను చేశాను, ఇక మీ ఇష్టం!?

    రిప్లయితొలగించండి
  5. మీరు మొదటి కామెంట్ లో ఒక కులాన్ని ప్రస్తావించారు .. nenu raasindi aa kulam gurinchi kaadu .. నేను ఏ కులం గురించి రాయలేదు ... ఒక వేళ రాయాల్సి వస్తే సమాచారానికి కొదవేమి లేదు

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం