4, సెప్టెంబర్ 2018, మంగళవారం

జీవితమే ఇన్వెస్ట్ మెంట్

‘‘బాబాయ్ ఎక్కడైనా ఇన్వెస్ట్ మెంట్ చేశారా?’’
‘‘నన్ను చూస్తే బంగారం, పోలాలు, ఇళ్ల స్థలాలపై ఇన్వెస్ట్ మెంట్  చేసినట్టుగా కనిపిస్తుందా? జీతం రాళ్లు ఇంటి ఖర్చులకు, పిల్లల ఫీజులకే సరిపోతాయి. ఇంకా ఇన్వెస్ట్ మెంట్  కూడానా?’’
‘‘ఏరా అబ్బాయ్ ఏమైనాఇన్వెస్ట్ మెంట్  చేస్తున్నావా?లేదా?’’
‘‘నేనాఇన్వెస్ట్ మెం టా? కాలేజీకి వెళుతున్నాను. నేను ఇనె్వస్ట్‌మెంట్ చేయడం ఏంటి?’’
‘‘ఏమ్మా! మీరైనా ఏమైనా ఇన్వెస్ట్ మెంట్  చేశారా?’’
‘‘ఎక్కడన్నయ్యా? నేనేమైనా ఉద్యోగినా ఇంటి పట్టున ఉండే గృహిణిని నేనేంఇన్వెస్ట్ చేస్తాను.’’
***
ఇన్వెస్ట్ మెంట్  అంటే మన మదిలో మెదిలేది బంగారం, ఆస్తులు, ప్లాట్లు. మహా అయితే స్టాక్ మార్కెట్, షేర్లు, మూచువల్ ఫండ్స్ అంతే.
నిజమే ఇవన్నీ
ఇన్వెస్ట్ మెంట్  అద్భుతమైన అవకాశాలిచ్చేవే. అయితే ఇన్వెస్ట్ మెంట్  అంటే కేవలం ఇవేనా? ఒకరి ఆరోగ్యం అస్సలు బాగాలేదు. కానీ వారు భూములపై చేసినఇన్వెస్ట్ మెంట్   విలువ ఈ రోజు కోట్ల రూపాయలకు చేరుకుంది. ఐతే ఏం లాభం దాన్ని అతను అనుభవించలేడు.
అంతర్జాతీయ విమానాశ్రయం ఏర్పాటుతో భూముల విలువ కోట్ల రూపాయలకు చేరుకున్నాయి. ఆ భూములు అమ్ముకున్న వారికి ఆ డబ్బును లెక్కపెట్టడం కూడా రాదు.
చిన్నప్పటి నుంచి బాగా కష్టపడి
ఇన్వెస్ట్  చేశాడు. బోలెడు ఆస్తి కూడబెట్టాడు కానీ ఏం లాభం పిల్లలు దారి తప్పారు. వారికి చదువు అబ్బలేదు. తాను చెమటోడ్చి సంపాదించి ఇచ్చిన డబ్బును జాగ్రత్త చేస్తారనే నమ్మకం కూడా లేదు. పిల్లలు ఇలా అయ్యారేమిటనే ఆవేదనతో కుమిలి పోతున్నాడు. ఇంటి నిండా కోట్ల రూపాయల ఆస్తి ఉన్నా కంటి నిండా నిద్ర లేదు. ఇలాంటి వారు మన జీవితంలో చాలా మందే కనిపిస్తుంటారు. ఎందుకు జరుగుతుంది ఇలా?
ఇన్వెస్ట్ మెంట్  అంటే కేవలం డబ్బు రూపంలో విలువ మాత్రమే అనుకుంటే వచ్చే సమస్యలు ఇవి. జీవితానికి డబ్బు చాలా ముఖ్యం. సంపాదించే శక్తి, వయసు, తెలివి తేటలు ఉన్నప్పుడు అవకాశం ఉన్నంత కాలం సంపాదించాల్సిందే అది తప్పేమీ కాదు. కానీఇన్వెస్ట్ మెంట్  అంటే కేవలం బంగారం, భూములు అనుకోవడమే తప్పు. కేవలం ఇవే ఇనె్వస్ట్‌మెంట్ అనుకుంటే జీవిత చరమాంకంలో బాధలు తప్పవు.
ఒక పిల్లాడు స్కూల్‌కు వెళుతున్నాడు. అతనికి సంపాదన ఏమీ ఉండదు. మరి అతను ఇన్వెస్ట్ చేయవచ్చా? ఏలా చేయాలి ? ఏం చేయాలి. చదువుకునే విద్యార్థి వద్ద ఉండేది ప్రధానంగా సమయం.
చదువుకునే పిల్లాడు ప్రతి రోజును, ప్రతి నిమిషాన్ని ఇన్వెస్ట్  చేయవచ్చు. విద్యార్థి తన వద్ద ఉన్న సమయాన్ని జ్ఞానం మీద తన ఇన్వెస్ట్ చేయాలి. ప్రతి విషయం తెలుసుకోవాలి. పెద్ద వయసులో కొత్త భాషను నేర్చుకోవాలన్నా, కొత్త విషయాలు నేర్చుకోవాలన్నా కొంత కష్టంగానే ఉంటుంది. కానీ చదువుకునే వయసులో వీటిని ఎంతో ఈజీగా చేయవచ్చు. తన వద్ద ఉన్న సమయాన్ని ఎలాఇన్వెస్ట్  చేస్తున్నాడు అనే దానిపైనే ఆ విద్యార్థి భవిష్యత్తు జీవితం ఆధారపడి ఉంటుంది.
టీవిలో సీరియల్స్, క్రికెట్, సినిమాలు చూస్తూ గడిపేస్తుంటే ఒక అనామకుడిగానే జీవితం ముగిసిపోతుంది. చదువుపై సమయాన్నిఇన్వెస్ట్ మెంట్  చేస్తే ఉజ్వలమైన భవిష్యత్తుకు దారి చూపుతుంది. ఒక కొత్త భాష నేర్చుకుంటే ఉత్సాహంగా ఉండడమే కాదు. ఆ భాషలోనే అవకాశాలు లభించవచ్చు. చిన్న వయసులో జ్ఞానంపైఇన్వెస్ట్ మెంట్  చేయడానికి మించిన తెలివైన నిర్ణయం ఉండదు. సమయం విలువ తెలిసిన విద్యార్థికి దాన్ని ఎలా ఇనె్వస్ట్ చేయాలో కూడా తెలుసు. జ్ఞానంపై చేసినఇన్వెస్ట్ మెంట్ జీవితానికి కావలసినవన్నీ సమకూర్చుతుంది. పుట్టి బుద్దెరిగిన తగ్గర నుంచి జీవిత చరమాంకం వరకు మనం ఏదో ఒకదానిపైఇన్వెస్ట్ మెంట్  చేస్తూనే ఉండవచ్చు.
ఆరోగ్యంపై చేసే ఇన్వెస్ట్ మెంట్  జీవితమంతా అనారోగ్యానికి దూరంగా ఉంచుతుంది. జైనులు దేశంలోనే కాదు అమెరికాలో కూడా వ్యాపార రంగంలో దూసుకువెళుతున్నారు. వారి ఇన్వెస్ట్ మెంట్  పాఠాల్లో పరిశుభ్రత, ఆరోగ్యం కూడా ఉంటుంది. సాయంత్రం ఆరు గంటల తరువాత వారు తినరు. ఆరోగ్యంగా ఉంటేనే ఎక్కువ కాలం జీవిస్తాం. ఆరోగ్యంగా ఉన్నప్పుడు సంపాదించే శక్తి ఉంటుంది అని వారికి ఇళ్లలోనే ఆచరణ ద్వారా బోధిస్తారు. ఆరోగ్యంపై ఇన్వెస్ట్ మెంట్ చేయడం అంటే మన అలవాట్లు ఆరోగ్యకరంగా ఉండడం, అనారోగ్యకరమైన అలవాట్లకు దూరంగా ఉండడం. ఉదయమే లేవడం, వ్యాయామం, యోగా వంటివి ఆరోగ్యఇన్వెస్ట్ మెంట్ . ఆరోగ్యం బాగుంటేనే సంపాదించవచ్చు, సంపాదించింది అనుభవించవచ్చు. జీవితాన్ని జీవించాలి అంటే ఆరోగ్యం ఉండాలి. ఆరోగ్యంపై ఇన్వెస్ట్ మెంట్  జీవితంలో భాగం కావాలి. ఆరోగ్యం, చదువు, జ్ఞానం, మానవ సంబంధాలు వీటన్నింటిపైనా  చేయవచ్చు. నలుగురితో నఇన్వెస్ట్ మెంట్ డవమన్నారు. మనుషులెవరూ లేని దీవిలో బంగారు కొండలున్నా ఒక వ్యక్తి ఆనందాన్ని అనుభవించలేడు. మనుషులెవరూ లేకుండా మీ వద్ద బంగారు కొండలు ఉన్నట్టు ఊహించుకోండి. పెద్దగా సంతోషం కలగదు. మనిషితోనే మనిషి సంతోషాన్ని పొందగలడు. కొద్ది సమయం తనతో తాను గడపగలడేమో కానీ మనుషులెవరూ లేకుండా కొన్ని రోజులు గడపడం అసాధ్యం. అందుకే ఆరోగ్యకరమైన మానవ సంబంధాలు కొనసాగించడం కూడా జీవితానికి సంబంధించి గొప్పఇన్వెస్ట్ మెంట్  .
స్టాక్‌మార్కెట్‌లో ఇనె్వస్ట్‌మెంట్ చేసేవారు ఎప్పటికప్పుడు తమ ఇనె్వస్ట్‌మెంట్ ఫోర్ట్‌పోలియో ఎలా ఉందో సమీక్షించుకుంటారు. మార్పులు చేర్పులు చేస్తారు. జీవితానికి ఉపయోగపడే మనీ ఇనె్వస్ట్‌మెంట్ విషయంలో ఇలాంటి సమీక్ష అనివార్యం. అదే విధంగా జీవితమనే స్టాక్‌మార్కెట్‌లో మనం ఎప్పటికప్పుడు చదువు, జ్ఞానం, ఆరోగ్యం, సంబంధాలకు సంబంధించిన ఇన్వెస్ట్ మెంట్  ఎలా ఉందో సమీక్షించుకుని, అవసరమైన మార్పులు చేర్పులు చేసుకోవాలి.
-బి.మురళి(2-9-2018 భూమి )

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం