26, జులై 2023, బుధవారం

సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు .. తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80

సర్వేల రాజకీయం .... కోరిన వారికి కోరికలు తీర్చే సర్వేలు .. తెలంగాణ తో రాజకీయాలకు , సర్వేలకు లగడపాటి దూరం .. జర్నలిస్ట్ జ్ఞాపకాలు -80 ------------------------------------ కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి . సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు . 2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు . 2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే . ఈనాడులో అలా వచ్చింది . టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు . సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది . శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు . తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు . ***** ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి . ****** ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు . అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి . హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి .. - బుద్దా మురళి ------------------------------------ కొన్ని రాజకీయ పక్షాలు ఎన్నికల్లో విజయం సాధించక పోయినా సర్వేల్లో ఘన విజయం సాధిస్తుంటాయి . లగడపాటి సర్వేకు తిరుగులేదు అని అతన్ని ఆకాశానికి ఎత్తిన జ్యోతిని , లగడపాటిని నమ్మి తెలంగాణా ఎన్నికలపై పందెం కాసి రోడ్డున పడ్డ వాళ్ళు చాలా మంది ఉన్నారు . చివరకు కెసిఆర్ సైతం ఓడిపోతాడు అని ఓ సారి , జ్యోతి , మరోసారి లగడపాటి సర్వేల్లో కొన్ని పార్టీలను సంతృప్తి పరిచాయి . సర్వేలు నిజమవుతాయా ? అంతా అబద్ధమేనా ? అంటే .. సర్వేలు అన్నీ అబద్దాలే అని నేను రాయాలి అనుకుంటే ఘోరంగా దెబ్బ తిన్న సర్వేలు బోలెడు ఉన్నాయి . వాటిని ఉదహరిస్తూ సర్వేలు అన్నీ అబద్దాలే అని రాయవచ్చు . ఒక వేళ సర్వేలు నిజం అవుతాయి అని రాయాలి అనుకుంటే నిజం అయిన సర్వేలు ఎన్నో ఉన్నాయి , వాటిని ఉదాహరణలుగా తీసుకోని సర్వేలు అన్నీ నిజమే అని రాయవచ్చు . 2004 ఎన్నికల్లో మెజారిటీ సర్వేలు టీడీపీ ఓడిపోతుంది అని , కాంగ్రెస్ తెరాస కూటమి గెలుస్తుంది అని తేల్చాయి . జ్యోతికి ఇది ఎంత మాత్రం నచ్చలేదు . ఎన్నికల సందర్భంగా ప్రచురించే ప్రత్యేక పేజీల్లో గతంలో నిజం కానీ పలు సర్వేలు - వాస్తవ ఫలితాలు ఏ విధంగా వచ్చాయో పేర్కొంటూ సర్వేలను నమ్మవద్దు నిజం కావు అని తేల్చారు . 2004 ఎన్నికల్లో ఈ సర్వేల వ్యవహారంలో అప్పుడు సీఎంగా ఉన్న చంద్రబాబు చేయని ప్రయత్నం లేదు . 2004 లో రెండు దఫాలుగా పోలింగ్ జరిగింది . తొలి విడత పోలింగ్ జరిగే జిల్లాల రిపోర్టర్ ల నుంచి సమాచారం తీసుకోని ఆంధ్రభూమిలో టీడీపీ ఓడిపోతుంది అని పెద్ద వార్త వచ్చింది . ఆ తరువాత రెండవవిడత పోలింగ్ జరిగే జిల్లాల సమాచారం సరిగ్గా అదే విధంగా టీడీపీ ఓడిపోతుంది అని తేలింది . కానీ ఆశ్చర్యంగా ఆంధ్రభూమిలో మాత్రం రెండవ విడత పోలింగ్ జరిగే జియోజక వర్గాల్లో టీడీపీ దూసుకెళ్తుంది అని పెద్ద వార్త వచ్చింది . విషయం ఏమిటా ? అంటే యాజమాన్యానికి , బాబుకు మధ్య ఉన్న అనుబంధం అని తేలింది . మీడియాకు , బాబుకు ఉన్నంత ఘాడమైన అనుబంధం ఓటరుకు , బాబుకు మధ్య లేకపోవడం వల్ల ఏ పత్రిక సర్వేతో ఏం చెప్పించినా ఆ ఎన్నికల్లో టీడీపీ ఘోరంగా ఓడిపోయింది . ఉమ్మడి రాష్ట్రంలో టీడీపీకి అతి తక్కువ సీట్లు (47) వచ్చింది 2004 లోనే . ఈనాడులో అలా వచ్చింది . టీడీపీ ఓడిపోతున్నట్టు ఇంటలిజెన్స్ రిపోర్ట్ . అది ఈనాడులో బాగానే ప్రచురించారు . తరువాత ఏం జరిగిందో కానీ ఢిల్లీకి చెందిన జివి ఎల్ నరసింహారావు అనే వారి చిత్రమైన సర్వే ను మొదటి పేజీలో పెద్దగా ప్రచురించారు . తొలివిడత పోలింగ్ ముగిసిన తరువాత నరసింహారావు హడావుడిగా తమ సంస్థ సర్వే జరిపినట్టు హడావుడిగా ప్రెస్ క్లబ్ లో విలేకరుల సమావేశం లో ప్రకటించారు . ఒక దశ పోలింగ్ ముగిశాక , రెండో దశ కోసం సర్వే ఏమిటీ ? మొత్తం రాష్ట్రంలో సర్వే చేస్తారు కానీ సగం సర్వే ఎందుకు చేశారు ? ఎవరి కోసం చేశారు అని ప్రశ్నిస్తే , మా గత చరిత్ర బ్రహ్మాండంగా ఉంది . మేం చేసిన సర్వే నిజం అవుతుంది . టీడీపీ గెలుస్తుంది అని తేల్చి చెప్పారు . సాధారణంగా ఇలాంటి సంస్థల సర్వేలను పత్రికలు లోపలి పేజీలో చిన్నగా వేస్తారు . ఏ బంధం వల్లనో కానీ ఈనాడు లో మొదటి పేజీలో దాదాపు సగం పేజీ వచ్చింది . సర్వేల మతలబు తెలియని నాయకులకైతే అది చూస్తే గుండె గుభేలు మనేది . శ్రీనివాస్ రెడ్డి అని జర్నలిస్ట్ , తరువాత హోంమంత్రిగా ఉన్నప్పుడు మైసూరారెడ్డి వద్ద పిఎ గా చేశారు . వై యస్ ఆర్ ను కలిసి ఎన్ని సీట్లు వస్తాయో చెప్పబోతుంటే .. మనం గెలుస్తున్నాం వదిలేయ అని చెప్పింది కూడా వినలేదు . సర్వేలు , మీడియా ఏం చెప్పినా గెలుపు పై అప్పుడు వై యస్ ఆర్ పూర్తి ధీమాగా ఉన్నారు . తెలంగాణ ఏర్పాటు లగడపాటి రాజ్ గోపాల్ కు రాజకీయ సన్యాసం ఇప్పిస్తే .. తెలంగాణలో తెరాస విజయం లగడపాటికి సర్వేల బిజినెస్ కూడా లేకుండా చేసింది . అంతకు ముందు లగడపాటి సర్వేలను నమ్ముకొని పెద్ద ఎత్తున బెట్టింగ్ లు కాసేవారు . తెలంగాణ ఎన్నికల్లో లగడపాటి జోస్యం ఘోరంగా దెబ్బ తినడంతో ఆ తరువాత ఎన్నికల జోస్యం కూడా చెప్పడం లేదు . ***** ఎన్టీఆర్ భవన్ వద్ద 2004లో మీ ఇష్టం వచ్చినట్టు సర్వేలు అని రాస్తే మేం చూస్తూ ఉండాలా ? అని టీడీపీ లీగల్ సెల్ నాయకుడు కట్టా జనార్దన్ వార్త రిపోర్టర్ ను దాదాపు కొట్టినంత పని చేస్తూ బెదిరిస్తున్నాడు . 2004 ఎన్నికలకు సంబంధించి వార్త సర్వే ప్రచురించింది . కాంగ్రెస్ విజయం సాధిస్తుంది అని , టీడీపీకి 72 సీట్లు వస్తాయి అని సర్వే సారాంశం . కాంగ్రెస్ పత్రిక ఇష్టం వచ్చినట్టు రాస్తున్నారు ? అంటూ సంఘీని తిడుతూ కట్టా ఆగ్రహంతో వార్త రిపోర్టరును నిలదీస్తున్నాడు . నేను జోక్యం చేసుకొని వార్త సర్వే లో 72 సీట్లు అని రాశారు కదా ? 72 కూడా రావు . మీ అంచనా ప్రకారం టీడీపీకి సీట్లు వస్తే మీరు ఏం చేయమంటే అది చేస్తాను , 72 కూడా రాకపోతే ఏం చేస్తారు చెప్పండి అని అడగడంతో... ... ఎన్నికల సమయంలో ఇలా రాస్తే ఎలా అని తగ్గాడు . 72 కూడా రాలేదు . 47 మాత్రమే వచ్చాయి . ****** ఎన్నికలు సమీపిస్తున్నందున లెక్కకు మించిన సర్వేలు బయటకు వస్తుంటాయి . గతంలో పత్రికలు మాత్రమే సర్వేలు ప్రచురించేవి . ఇది సామాజిక మాధ్యమాల యుగం ఇప్పుడు లెక్కకు మించిన సర్వేలు వస్తుంటాయి . సర్వేలే కాదు కొన్ని యూ ట్యూబ్ ఛానల్స్ అభ్యర్థులను ఖరారు చేస్తుంటే , కొందరు మరో అడుగు ముందుకు వేసి వారం క్రితమే ఎన్నికల నోటిఫికేషన్ కూడా విడుదల చేశారు . ఎన్నికల సమయంలో బిబిసి మొదలుకొని నేషనల్ జియోగ్రాఫిక్ ఛానల్ వరకు అనేక ఛానల్స్ సర్వే అంటూ వాట్స్ ఆప్ యూనివర్సిటీ సర్వేలను ప్రచారం చేస్తుంటారు . ఆయా రాజకీయ పార్టీలు కోరుకున్నానని సీట్లు ఈ సర్వేల్లో లభిస్తుంటాయి . అడగని వారిదే పాపం ప్రధాన పార్టీలే కాదు శివసేనను సైతం గెలిపిస్తుంటారు . అన్ని రాజకీయ సర్వేలే అని చెప్పలేం కొన్ని ప్రముఖ సంస్థలు సీరియస్ గానే సర్వేలు జరుపుతాయి . గతం లో వారు చేసిన సర్వేలు , ఫలితాలు ఎంత దగ్గరగా ఉన్నాయి అనే దానిని బట్టి సర్వే సంస్థలకు విశ్వసనీయత ఉంటుంది . సరైన సర్వే నిర్వహిస్తే ఎంత కాలం అయినా ఆ సంస్థకు డిమాండ్ ఉంటుంది . బేరాల సర్వే ఐతే లగడ పాటి సర్వేలా ? ఒక్క దానికే షాప్ మూత పడుతుంది . సర్వే జరిపిన సంస్థ విశ్వసనీయతను బట్టి సర్వేను చూడాలి . కొన్ని సార్లు విశ్వసనీయ సంస్థ పేరుతో , లేదా ఆ సంస్థకు దగ్గరగా ఉండే పేరు పెట్టి నకిలీ సర్వేలు ప్రచారంలో పెట్టిన సందర్భాలు కూడా ఉన్నాయి . ఓటరు తాను ఎవరికి ఓటు వేయాలో నిర్ణయించుకున్న తరువాత ఏ సర్వేలు కూడా వారిని మార్చలేవు అని గతంలో జరిగిన ఎన్నికల ఫలితాలు నిరూపించాయి . హెచ్చరిక: సర్వే పేరుతో వాట్స్ ఆప్ లో అంకెలు కనిపిస్తే మురిసిపోకండి , కంగారు పడకండి . రోజూ వాట్స్ ఆప్ లో వచ్చే జోకుల్లో ఈ సర్వే అంకెలు కూడా ఒక జోక్ గా చూడండి .. - బుద్దా మురళి

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం