12, జులై 2011, మంగళవారం

జూనియర్ ఎన్టీఆర్‌ , మహేష్ బాబులను గుర్తిస్తే రోజుకు లక్ష ఇస్తారు


మీరు జూనియర్ ఎన్టీఆర్‌ని గుర్తు పడతారా? పోనీ మహేశ్‌బాబును గుర్తు పడతారా? అంటే హెయిర్ స్టైల్‌నో, చేతి వేళ్లలో చూసి గుర్తు పట్టడం కాదండీ మొత్తం ముఖాన్ని మీరు కోరినంత సేపు చూసి మిత్రులు, కుటుంబ సభ్యుల సహకారం తీసుకుని చెప్పినా ఫరవాలేదు. గుర్తు పట్టగలరా?
 ఓ.. చాలా ఈజీగా అంటున్నారా? మరింకెందుకాలస్యం ఐతే మీరు రోజుకో లక్ష సంపాదించవచ్చు. కష్టమేమీ లేదు జూనియర్ ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, మహేశ్ బాబు, త్రిష వంటి చాలా పాపులర్ నటీనటుల ఫోటోలను టీవీ తెరపై చూపిస్తారు.

 వెంటనే మీరు వారు చూపించిన ఫోన్ నంబర్‌కు ఫోన్ చేస్తే మీరు ఇల్లు కదలకుండా లక్ష రూపాయలు మీ ఒళ్లో వచ్చి పడిపోతాయి. బాగుంది కదూ! ఇంతటి మహత్తరమైన పుణ్య కార్యానికి పూనుకున్నది మా మూవీ చానల్ వాళ్లు. వాళ్ల చానల్‌లో రోజంతా కష్టపడ్డవారికి నెలకు పాతిక వేలు ఇస్తారో లేదో కానీ పాపం వాళ్లు మనమీదున్న ప్రేమ కొద్దీ ఫోన్ చేసి పేరు చెబితే చాలు లక్ష ఇచ్చేస్తారు. గుడ్డివాళ్లు తప్ప ఎవరైనా చెప్పగలంత ఈజీ ప్రశ్నలతో లక్ష రూపాయలిచ్చేస్తారు దానకర్ణులు.
మా మూవీ చానల్‌లో రాత్రి పదకొండు గంటల సమయంలో కవ్వించే మాటలతో రా రా అని పిలుస్తున్నట్టుగా మాట్లాడే ఒక అమ్మాయి ఆలసించిన ఆశాభంగం మీ కోసమే ఎదురు చూస్తున్నాం.. వచ్చేయండి ఫోన్ చేయండి.. అంటూ రెచ్చగొడుతుంది.

 తెరపై హీరో బొమ్మ వారు చూపించే లక్ష రూపాయల అంకె చూడగానే ఆశ మొదలవుతుంది. అసలు వ్యవహారం అక్కడే ఉంది. ఇదో పెద్ద బోగస్ వ్యవహారం. ఒక్కసారి పొరపాటును ఎవరైనా ఫోన్ చేశారంటే దాదాపు వెయ్యి రూపాయల వరకు నెత్తిన బిల్లు పడ్డట్టే. 

లేదా ఒకవేళ మీ సెల్‌ఫోన్ ప్రీ పెయిడ్ అయితే మీరు కాస్తంత అదృష్టవంతులు. ఎందుకంటే సెల్‌ఫోన్‌లో ఉన్న వందో రెండు వందల రూపాయల బ్యాలెన్స్‌తోనే మీకు జ్ఞానోదయం అవుతుంది. పోస్ట్‌పెయిడ్ అయితే ఆరిపోతారు. అంత పాపులర్ హీరోలను ఎవరైనా గుర్తు పడతారు. నిమిషానికి అర్ధ రూపాయే కదా, అదృష్టాన్ని పరీక్షించుకుందామని ఫోన్ చేస్తే వారికి దొరికి పోతారు. నిజానికి నిమిషానికి 12  నుండి 15 రూపాయల వరకు వసూలు చేస్తారు. వెంటనే ప్రశ్నకు సమాధానం చెప్పనివ్వకుండా గంట గంటన్నర పాటు వెయిటింగ్‌లో ఉంచుతారు. టీవీలో- రండి ఫోన్ చేయండి అని అమ్మాయి పిలుస్తుంటుంది ఆ సమయంలో మాత్రం చాలా మంది వెయింటింగ్‌లో ఉంటారు. అలా ఉంటేనే ఆ కార్యక్రమ నిర్వాహకులకు గిట్టుబాటు అయ్యేది. రెచ్చగొట్టే విధంగా మాట్లాడడానికి ప్రత్యేకంగా శిక్షణ, ప్రత్యేక దుస్తులు ఉంటాయి.
మోసపోకుండా ప్రజలను చైతన్యపరచాల్సిన చానల్స్ ఇలాంటి కార్యక్రమాలు నిర్వహిస్తూ ప్రజలను మోసపుచ్చడం ఎంత వరకు సబబు. కనీసం ఈ కార్యక్రమానికి ఫోన్ చేస్తే చార్జీలు ప్రత్యేకంగా ఉంటాయి. నిమిషానికి ఎంతో చెప్పాల్సిన బాధ్యత లేదా?
ఈ కార్యక్రమంపై టీవీ 1 యెటకారం డాట్‌కాంలో హాస్యగుళిక చూపారు. ఒక వడను తెరపై చూపించి కొద్దిగా కనిపించకుండా చేసి అదేంటో చెప్పాలని అడిగారు. మనం టిఫిన్‌గా తింటాం, మధ్యలో చిల్లు ఉంటుంది. చెట్నీతో తింటాం అంటూ చెప్పుకు పోయారు. దానికి సమాధానంగా పూరి అని కొందరు, దోశ అని కొందరు చెప్పారు. మహేశ్‌బాబును గుర్తుపట్టని వారు, వడను గుర్తుపట్టని వారుంటారా?
ఇంకా చిత్రమైన విషయం ఏమంటే అదే సంస్థకు చెందిన మా చానల్‌లో ఈ కార్యక్రమంపై వ్యంగ్యోక్తులు విసిరారు. ఉదయం సినిమాల్లో హాస్య దృశ్యాలను చూపించే కార్యక్రమంలో ఇద్దరు వ్యాఖ్యాతల మధ్య హీరోలను గుర్తించే కార్యక్రమంలోని మోసాన్ని ఎండగట్టారు. కానీ చానల్ వారే ఆ మోసం ఇంకా గుర్తించనట్టుగా ఉంది. ఇదే విధంగా శనియంత్రం, హనుమాన్ యంత్రం ధరించడం వల్ల దరిద్రం అంతా పోతుందని, సమస్యలన్నీ తీరిపోతాయని ఊదరగొడుతున్నారు. ఇలాంటి ప్రచారం నియమనిబంధనలకు విరుద్ధం. అయితే వీటిపై ఫిర్యాదులు రావడం లేదో ఏమో కానీ అన్ని చానల్స్‌లోనూ ఇలాంటి కార్యక్రమాలు రోజంతా వస్తున్నాయి. ప్రజల్లో మూఢనమ్మకాలను పెంచే విధంగా ఉన్న ఇలాంటి ప్రకటనలపై కనీసం వినియోగ హక్కుల ఉద్యమకారులైనా దృష్టిసారించాలి. అన్ని చానల్స్ ఈ యంత్రాలు ధరిస్తే వారే నంబర్ వన్ అయిపోతారు కదా!
అది ఎవరి సొమ్ము?
ప్రపంచంలోకెల్లా సంపన్న ఆలయంగా పద్మనాభస్వామి ఆలయం గురించి అన్ని చానల్స్‌లోనే ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశారు. ఆ సంపదను పేదల సంక్షేమానికి ఉపయోగించాలని టీవీ9 ఉచిత సలహా పారేసింది. మంచిదే మనది కాదు కాబట్టి అలాంటి సలహాలిచ్చి పేద జనుల ఉద్ధరించిన తృప్తి పొందొచ్చు. లక్ష కోట్ల రూపాయల విలువైన ఆభరణాలు లభించాయి నిజమే. అంటే టీవీ 9 ఉద్దేశం అంత పురాతనమైన ఆ ఆభరణాలను కరిగించి బంగారం అమ్మాలా? లేక ఆ విగ్రహాలను, ఆభరణాలను అమ్మి వచ్చిన డబ్బును పేదల సంక్షేమానికి ఉపయోగించాలా? అది కాస్తా వివరంగా చెబితే మరింత బాగుండేది. ఏదో నోటికొచ్చిన ఒక మాట చెప్పేద్దాం అనుకుంటే ఎలా?
శుక్రవారం అన్ని చానల్స్‌లోనూ వైఎస్‌ఆర్ జయంతి దినోత్సవంపై ప్రత్యేక కార్యక్రమాలు ప్రసారం చేశాయి. ఇడుపుల పాయలో వైఎస్‌ఆర్ కాంగ్రెస్ ప్లీనరీ జరుగుతున్న ప్రాంతం నుండే సాక్షి చానల్ హెడ్‌లైన్ షో పేరుతో వార్త పత్రికల సమీక్ష ప్రసారం చేశారు. రోజూ స్టూడియోలో నిర్వహించే ఈ కార్యక్రమాన్ని ఒక పార్టీ వేదికపై నుండి నిర్వహించారు. రాష్ట్రంలో ఒక్కో చానల్ ఒక్కో పార్టీ ముద్దుబిడ్డలు అనే విషయం రహస్యమేమీ కాదు. కానీ ఒక పార్టీ వేదిక నుండి ఇలాంటివి నిర్వహించడం మాత్రం ఇదే తొలిసారి. పార్టీ వారినే కాకుండా సమీక్షలో పాల్గ్గొనే బయటి వారిని వేదికపైకి రప్పించడం ఏ విధంగా సమర్ధనీయం. అదే అంశంపై స్టూడియో నుండే కార్యక్రమాన్ని నిర్వహిస్తే బాగుండేది.

14 కామెంట్‌లు:

 1. టి.వి చూడటం ఎందుకు ? ఇలా బాదపడటం దేనికి ?

  రిప్లయితొలగించు
 2. http://www.consumercomplaints.in/complaints/please-ban-cinema-sandadi-in-maa-music-c481872.html

  రిప్లయితొలగించు
 3. అజ్ఞాత గారు అమ్మాయిలను ప్రేమించమని వెంటపడిప్రేమించకపోతే యాసిడ్ పోస్తున్నారు. ఇలాంటి సంఘటనలు చూసి మనం భాదపడే బదులు చూడకుండా వదిలేయడం బెటర్ అంటారు . అంతే కదా

  రిప్లయితొలగించు
 4. ఆ మా టీవీ ప్రోగ్రాం కి ఫోన్ చేసీ నేను తల బొప్పి కట్టించుకున్నానని చెప్పడానికి సిగ్గుపడుతున్నాను. అసలు ఈ ప్రోగ్రాం తమిళ్ పైత్యానికి అనుకరణ. మొదట తమిళ్ చానెల్ ( విజయ్ గానూ సన్ గానీ అవ్వొచ్చు) లో చాలాసార్లు చూసాను. తరువాత తెలుగుకి అంటింది ఈ రోగం. మా టీవీలో చాలాసార్లు చూసి పోనీలే ఓ సారి ట్రై చేద్దాం అని చేసా. 70 రూపాయలు వదిలాయి. మీరు లక్ష కి దగ్గరవుతున్నారు అవుతున్నారు అని చెబుతుందేగాని ఎంతకీ ఫోన్ ఎత్తరు. అందులో మనకి వినిపిస్తూ ఉంటాయి మాటలు...ఇంకాసేపు ఫోన్ పట్టుకుంటే లక్ష మీకే అంటుంటుంది ఫోన్లో ఎవరో. అసలు ఎప్పుడూ దేనికీ అంటే ఏ టీవీ ప్రోగ్రాం కి ఫోన్ చెయ్యలేదు. అలా వేలం వెర్రిగా sms లు, ఫోన్ లు చెయ్యడాలంటే చికాకు కూడా. మరి ఆ రోజు నాకేం బుద్ధి పుట్టిందో లేదా లక్ష రూపాయలు ఈజీగా వస్తాయని ఆశే పుట్టిందో ఫోన్ చేసి 70 రూపాయలతో తుప్పు వదలగొట్టుకున్నాను.

  నిముషానికి 10 రూపాయల చొప్పున వసూలు చేసారు. చాలా కోపమొచ్చింది. కనీసం ఆ ప్రోగ్రాం లో కింద స్క్రోలింగ్ లోనో, లేదా ప్రోగ్రాం మధ్య మధ్యలోనో నిముషానికి ఇంత అవుతుందని చెప్పి తగలడక్కర్లేదూ?...sheer cheating!

  రిప్లయితొలగించు
 5. ఎంత మంది గేలానికి చిక్కితే వీళ్ళకి అంత లాభం! తెలుగులోనే కాదు, హిందీలో కూడా ఈ ప్రోగ్రాంస్ వస్తున్నాయి. మన జాగ్రత్తలో మనం ఉండాలి.

  రిప్లయితొలగించు
 6. యంత్రాలు, రాళ్ళ గురించి ఓసారెప్పుడో మీర్రాసిన ఆర్టికల్ గుర్తొచ్చింది.. భర్త మరో స్త్రీతో సంబంధం పెట్టుకున్నాడని బంధువు సలహా అడిగితే, సన్నకారు నటీమణి ఫలానా రాయి వాడమని చెప్పడం ఉటంకిస్తూ "ఆ రెండో అమ్మాయి కూడా అదే రాయి ధరిస్తే?' అన్నారు మీరు! అన్నట్టు ఈ యంత్రాల మీద కూడా ఏబీఎన్ లో అనుకుంటా ఒక వ్యంగ్య ప్రోగ్రాం ప్రసారం చేశారు.. ప్రకటనలు ప్రసారం చేస్తూనే ఉన్నారు.. రెండు నాల్కల ధోరణి అంటే ఇదే కదండీ?

  రిప్లయితొలగించు
 7. .మా టీవీ లో వచ్చే ఆ దరిద్రగొట్టు ప్రోగ్రాం అంటే నాకు అసహ్యం .ఇలాంటి ప్రోగ్రాము లని స్ట్రిక్ట్ గా బాన్ చెయ్యాలి .అందులో అంతా మోసమే .

  రిప్లయితొలగించు
 8. @ మురళి గారు థాంక్స్ ఆ మంత్రాల రేకుల గురించి గతం లో జనాతికం లో రాశానండి@Praveen Sarma @kvsv
  @అప్పారావు శాస్త్రి @ శ్రీ @ geetha యశస్వి @అజ్ఞాత గారు అభిప్రాయం చెప్పినందుకు థాంక్స్ ..నేను రాసినంత మాత్రాన ఏదో ఐపోతుందని కాదు . కనీసం ఓపది మంది కైనా అందులోని మోసం తెలిసి దూరంగా ఉంటారనే ఆశ @అయ్యో ఆ సౌమ్య గారు 70 రూపాయలతోనే బయట పడ్డారా ? ఆ చానల్ వాడిని నిరాశపరిచారు

  రిప్లయితొలగించు
 9. ASCI (అదో టీవీ కార్యక్రమాల నియంత్రణ సంస్థ) అనే organization asci@vsnl.com ఉందండి. ఒకసారి హావేల్స్ వారి advertisement (ఒక యువకుణ్ణి చీకటిలో ఉరితియ్యడం కాన్సెప్ట్) గురించి ఫిర్యాదు చేస్తే అది అభ్యంతరకరం కాదంటూ సదరు organization వాళ్ళు ఇచ్చిన ప్రత్యుత్తరం ఈ క్రింద చూడండి

  Further to our e-mail of Xth AXXX 2XXX, the complaint under reference was considered by the Consumer Complaints Council (CCC) at their meeting held on XXth MXX 2XXX, at which time the CCC viewed the TVC.  As per their decision, the complaint HAS NOT BEEN UPHELD.

  The CCC concluded that the TVC does not portray the Hangman in poor light. Also, as the actual act of hanging is shown through a shadow, the TVC is not likely to offend the sensibilities of children.

  అంటే పూర్ లైట్ లో ఏమి చూపించినా పర్వాలేదేమో !?  Thank you for having referred this complaint to us.  Assuring you of our services in the pursuit of Self-Regulation in Advertising.

  Alan Collaco

  Secretary General

  A S C I

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. Sri gaaru, "TVC does not portray the Hangman in poor light." ante ardham thakkuva veluthuru lo chupichaledhu ani kaadhu. vetakaramga choopaledhu ani ardham.

   తొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం