24, జులై 2011, ఆదివారం

తెలుగు వారికి భారత రత్న అవార్డు పొందే అర్హత ఉందా ? పివి నరసింహారావు, ఎన్టీఆర్ లకు దక్కేనా?




ఎన్టీఆర్‌కు భారతరత్న అవార్డు కోసం ఆయన అభిమానులు కొందరు ఉద్యమానికి సన్నాహాలు చేస్తున్నారు. ఈసందర్భంగా భారతరత్నల అవార్డు చరిత్ర చూస్తే ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ ఆ గౌరవం దక్కకపోవడం విడ్డూరమనిపించింది.

 కానీ, ఇప్పటి వరకు అవార్డు పొందిన వారిని పరిశీలిస్తే అంతటి సామర్థ్యం తెలుగువారికి లేదా? అనే ప్రశ్న ఉదయిస్తుంది.

1956లో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడింది. ఇప్పటి వరకు ఈ విశాల రాష్ట్రం నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. ఔను నిజం. భారతరత్న అవార్డులను ఏర్పాటు చేసిన ఏడాదే తమిళనాడుకు (మద్రాస్ రాష్ట్రంగా ఉన్నప్పుడు) ముగ్గురికి లభించాయి.
ఇంతకాలం తరువాత కూడా తెలుగు మూలాలు ఉన్న ముగ్గురికి భారతరత్నలు లభించాయని అనుకోవలసిందే తప్ప, ఆంధ్రప్రదేశ్ నుండి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. మోక్షగుండం విశ్వేశ్వరయ్య    పూర్వీకులు తెలుగువారు. మూడు వందల సంవత్సరాల క్రితం వారి పూర్వీకులు మైసూరు రాష్ట్రానికి వలస వెళ్లారు. ఆయన ఇంటిపేరును బట్టి ప్రకాశం జిల్లా గిద్దలూరు మండలంలోని మోక్షగుండం వారి ఊరని, వారి పూర్వీకులు తెలుగువారని తేలింది. మోక్షగుండంకు 55లో భారతరత్న అవార్డు లభించింది. ఇక సర్వేపల్లి రాధాకృష్ణ తమిళనాడుకు చెందిన తెలుగు కుటుంబంలో పుట్టారు. ఆయనకు 54లో లభించింది. రాధాకృష్ణ పుట్టింది మద్రాసు ప్రెసిడెన్సిలోని తిరుత్తనిలో తెలుగు కుటుంబంలో. ప్రస్తుతం ఈ ప్రాంతం తమిళనాడులోని తిరువత్తూరు జిల్లాలో ఉంది.
వివి గిరికి భారతరత్న లభించింది. అప్పటి మద్రాసు ప్రెసిడెన్సిలోని బర్హం పురంలో ఆయన జన్మించారు. ప్రస్తుతం బరంపురం ఒరిస్సా రాష్ట్రంలో ఉంది. సర్వేపల్లి రాధాకృష్ణది తెలుగు కుటుంబమే అయినా భారతరత్న మాత్రం తమిళనాడు లెక్కల్లో చూసుకోవలసిందే. ఏతావాతా ఇప్పటివరకు ఆంధ్రప్రదేశ్ నుంచి ఒక్కరికీ భారతరత్న లభించలేదు. 1954లో భారతరత్న అవార్డును ఏర్పాటు చేశారు. ఇప్పటి వరకు 41 మందికి అవార్డు ఇచ్చారు. ఇందులో సింహ భాగం పొరుగున ఉన్న తమిళనాడుదే. తొలిసంవత్సరం అవార్డు పొందిన చక్రవర్తుల రాజగోపాలాచారి మొదలుకుని మొన్న మొన్నటి అవార్డు గ్రహిత ఎంఎస్ సుబ్బలక్ష్మి, ఎపిజె అబ్దుల్ కలాం వరకు అంతా తమిళనాడు వారే. 

తెలుగువారికి భారతరత్న అవార్డు పొందేంత సత్తా లేదా? అంటే? ఇప్పటి వరకు భారతరత్న అవార్డులు పొందిన వారి కన్న ఏమాత్రం తీసిపోని వారిని తెలుగుతల్లి కనలేదా? ఏమో !
ఇక ప్రస్తుతానికి వద్దాం. ఎన్టీఆర్‌కు భారత రత్న కోసం భారీ ఉద్యమాన్ని నిర్వహించాలని కొందరు ప్రయత్నిస్తున్నారు. ఎన్నికల్లో ఎప్పుడు ఏది మహా ఆయుధం అవుతుందో చెప్పలేం. ఒక్కోసారి ఆత్మవిశ్వాసం అనే మాటే ఎన్నికల ఆయుధం కావచ్చు. మరోసారి మద్య నిషేధం అన్న పిలుపే ఎన్నికల్లో ఓట్ల వర్షం కురిపించవచ్చు. అన్ని ఆయుధాల తరువాత కొందరు ఇప్పుడు హఠాత్తుగా ఎన్టీఆర్‌కు భారతరత్న కోసం ఎన్నికల నాటికి ఒక ఉద్యమంగా సాగించాలనే ఆలోచనలో ఉన్నారు. ప్రస్తుత కాలానికి తెలుగువారిలో గుర్తున్న ప్రముఖుల్లో భారతరత్న అవార్డు ఇవ్వాలి అని ఎవరైనా కోరేస్థాయిలో కనిపించే ప్రముఖుల్లో ఎన్టీ రామారావు, పివి నరసింహారావు కనిపిస్తున్నారు.
1988లో భారతరత్న అవార్డు పొందిన ఎంజి రామచంద్రన్ ప్రాంతీయ పార్టీని నడిపించారు. తమిళనాడు ముఖ్యమంత్రిగా సేవ చేశారు. ప్రముఖ సినీనటుడు. అచ్చంగా ఎన్టీఆర్‌కు సైతం ఈ అర్హతలన్నీ ఉన్నాయి. అయితే కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్‌తో మిత్రత్వం మినహాయిస్తే అన్నింటిలో ఎంజిఆర్‌కు ఎన్టీఆర్‌కు తేడా లేదు. కేంద్రంలో చంద్రబాబు చక్రం తిప్పినప్పుడు భారతరత్న కోసం ప్రశ్నించని నాయకులు, ఇప్పుడు భారతరత్న కోసం మురళీమోహన్ ఆధ్వర్యంలో ఉద్యమించడానికి సన్నాహాలు చేస్తున్నారు.
 ఎన్టీఆర్, పివి నరసింహారావుల్లో ఎవరికైనా భారతరత్న వస్తుందా? అంటే వస్తుంది అని కచ్చితంగా చెప్పేవారైతే లేరు. చంద్రబాబు కేంద్రంలో చక్రం తిప్పిన కాలంలో ఎన్టీఆర్‌కు లభించే అవకాశం ఉండేది మిస్సయింది. దీంతో ఇప్పట్లో తెలుగువారికి అవార్డు ఎండమావే అని చెప్పక తప్పదు.
ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా, సినిమా నటునిగా తెలుగువారిపై చూపిన ప్రభావం సామన్యమైనదేమీ కాదు. తెలుగులో ఆయన గొప్ప నటుడు. ఈ విషయం కాదనేవారుండరు.
 ఎన్టీఆర్‌ను దించేసిన సమయంలో ఇటు వైస్రాయ్ హోటల్, అటు ఎన్టీఆర్ నివాసం మధ్య రాయబారాలు నడిపిన మురళీమోహన్ అవార్డు కోసం ఉద్యమించే ముందు, ఎన్టీఆర్ ఏం తప్పు చేశారని ఆరోజు అధికారం నుండి దించేశారో చెప్పాలి. ఎన్టీఆర్ మహనీయుడు, సామాజిక ఉద్యమకారుడు, కులాలకు అతీతంగా సమాజం ఉండాలని కోరుకున్న వ్యక్తి అంటూ ఎన్టీఆర్ నటించిన కొన్ని సినిమాల్లోని దృశ్యాలతో ఎన్టీఆర్‌పై ఫిల్మ్ రూపొందించిన పెద్దలు అవార్డు గురించి డిమాండ్ చేసే ముందు అంతటి గొప్ప వ్యక్తిత్వం గల నాయకుడిని ఎందుకు దించేశారో చెప్పాల్సిన బాధ్యత ఉంది.
ఇంటి పంటి డాక్టర్‌కు, కంటి డాక్టరుకు  పద్మశ్రీలు ఇప్పించుకుంటున్న కాలమిది. ఇప్పించుకుంటున్న తీరులోనే అవార్డులకు గౌరవం ఉంటుంది. కానీ పొరుగున ఉన్న తమిళ సోదరుడికి డజన్లకొద్దీ భారతరత్నలు వచ్చినప్పుడు, మనవారికి ఒక్కటీ రాలేదేమిటా? అనిపించకుండా ఉంటుందా?. బాబు చక్రం తిప్పినప్పుడే రాని భారతరత్న ఎన్టీఆర్‌కు ఇప్పుడొస్తుందా? ఏ కారణాలు చూపి ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశారో, అలాంటి కారణాలు అవార్డుకు అడ్డం కావా? ఉద్యమించే వారే సమాధానం చెప్పాలి.
ఇక మిగిలింది పివి నరసింహారావు. నిజానికి భారత రత్న అవార్డుల్లో ఎన్టీఆరే కాదు, అవార్డు పొందిన ఎంతో మంది కన్నా పివి నరసింహారావుకు ఎక్కువ అర్హత ఉంది. పివి నరసింహారావు ఒక రాష్ట్రంపైనే కాదు, మొత్తం దేశంపైనే గణనీయమైన ప్రభావం చూపారు. స్వాతంత్య్రం తరువాత ఆర్థిక రంగంపై పివి చూపినంత ప్రభావాన్ని మరే నాయకుడు చూపలేదు. ఆయన ప్రధానిగా బాధ్యతలు చేపట్టడానికి ముందు ఈ దేశం ఏమవుతుందనే భయం ఉండేది. బంగారాన్ని వి దేశాల్లో తాకట్టుపెట్టిన కాలమది  అలాంటిది ఇప్పుడు మరో పది పదిహేనేళ్లలో ప్రపంచంలోని నాలుగు అగ్ర రాజ్యాల్లో భారత్ ఒకటిగా నిలుస్తుందని సగర్వంగా ప్రకటించుకుంటున్నారు. ఈ పరిస్థితికి పివి తీసుకు వచ్చిన ఆర్థిక సంస్కరణలు కారణం. ఆర్థిక సంస్కరణల్లో మంచి చెడుల ప్రభావం గురించి చర్చ కాదు. కానీ ఆయన ప్రవేశపెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశాన్ని సమూలంగా మార్చేశాయి. తీవ్రమైన ప్రభావం చూపించాయి.
ఇప్పటి వరకు భారత రత్న అవార్డులు పొందిన వారు వారివారి రంగాల్లో ప్రముఖులే, ప్రభావం చూపిన వారే. కానీ పివి మాత్రం దేశ ఆర్థిక వ్యవస్థను సమూలంగా మార్చేశారు. అలాంటి పివి నరసింహారావుకు భారతరత్న కోసం డిమాండ్ చేసే గొంతే లేదు. కనీసం ఎన్టీఆర్ కోసం డిమాండ్ చేసే బలమైన వర్గం ఉంది. పివికి అదీలేదు. భారతరత్న అవార్డు మాట అలా ఉంచండి, ఆర్థిక సంస్కరణలు అమలు చేసి దేశాన్ని గట్టెక్కించిన తరువాత కనీసం ఆయనకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు టికెట్ దక్కలేదు. ఇక భారత రత్న ఏం దక్కుతుంది.

 ఇటు పివికి భారతరత్న అడిగేవారు లేరు, అటు ఎన్టీఆర్‌కు అవకాశం లేదు.
ఏతావాతా భారత రత్న తెలుగువారికి ఇప్పట్లో అందని పండే. అవార్డు తేగల ప్రభావశీలి ఇంకా పుట్టాలేమో..!

26 కామెంట్‌లు:

  1. తమిళనాడు లో కాంగ్రెస్ కు దిక్కులేకున్నా, అక్కడ ఏ ప్రాంతీయ పార్టీ వచ్చినా వాళ్ళకు(అర్హతలున్నపుడు, లేనపుడు కూడా) కావలసిన నిధులు, అవార్డ్ లు ముక్కు పిండి వసూలు చేసుకుంటారు.
    ఆంధ్రానుంచి ఎన్నిసార్లు మొత్తం కాంగ్రెస్ ఎమ్పీ లున్నా, రాష్ట్రంలో ఎన్ని సార్లు రాజ్యమేలినా డిల్లీకి పోయి బిచ్చమెత్తినా ఏం సాధించుకోలేరు.
    మన ఖర్మ.

    రిప్లయితొలగించండి
  2. మీరేందుకు భారతరత్న కోసం ఆలోచిస్తారు. పివి గారికి భారతరత్న ఇవ్వాలని తమిళుడైన సుబ్రమణ్య స్వామి అడిగారు. తెలుగువారు ఎవ్వరు అడగలేదు. కేంద్రం లో మంత్రి పదవులు సంపాదించటం చేతకాని వారు, ఇటువంటి వారు ఎన్ని మీటీంగులు పెట్టినా ఎమీతేలేరు. కాని వారి దగ్గర డబ్బులు ఇబ్బడిముబ్బడి గా పడి మూలుగుతున్నాది కనుక వారి గొప్పతనాన్ని చాటుకోవటానికి ఒక నరసిమ్హ నాయుడో లేక సమరసిమ్హా రేడ్డి అని వారి వర్గం పేరు వచ్చేట్టట్టు ఒక సినేమా తీసుకొని వారిని వారు కీర్తించుకొని త్రుప్తి చెందాల్సిందే. మనుషుల విలువ ,వారిలోని ప్రత్యేకతలను గుర్తించటం అనేది తెలుగు వారి స్వభావం లోనే లేదు.

    SRR

    రిప్లయితొలగించండి
  3. ntr, pv veellu matrame enduku gurtuku vastaru andariki? mangalampalli balamuralikrishna,srisri, bapu, pingali venkayya, dasarathi, veellakai enduku ivvaru? bahusha veelu rajakiya nayakulu kadanemo?

    రిప్లయితొలగించండి
  4. అయ్యో... అన్నగారికి ఆయన ప్రతిభవల్ల కాక తమ ప్రయత్నం వల్ల తెచ్చే భారతరత్న వస్తుందేమోనని ఆశపడుతున్న తమ్ముళ్ళ ఉత్సాహపు పొంగుమీద నీళ్ళు చల్లేసారు కదండీ....పాపం. ఉన్నవాళ్ళలో ఆముదపు చెట్టు మన ఎన్టీఆర్...ఎన్టీఆర్ కన్నా పీవీఎన్నే బెటర్ ఆప్షన్ నా ఉద్దేశంలో.... అయినా ఇద్దరూ తెలుగువాళ్ళే కనుక..ఇద్దరికీ బెబ్బెబ్బే....

    రిప్లయితొలగించండి
  5. పివికి భారతరత్న అడిగేవారు లేరు. అవును. పివికి భారతరత్న అడిగేవారు తెలుగువారిలో అసలు లేరు.

    రిప్లయితొలగించండి
  6. NTR reached great heights(pinnacle or zenith)in multiple fields. Few of them are as follows

    1) Performing Arts (Movies)
    2) Politics
    3) Social Reformer
    4) Entrepreneur

    Many people can't imagine NTR in Social Reformer's role. For the first time in AP State, he single-handedly empowered SC, ST and Women in politics. He shattered traditional caste based power structures (Munsab, Karnam, Patel system). And allowed lower castes to assume power at gross roots level.

    To this day, people belong to Castes that lost Munsab, Karnam and Patel hereditary positions hates NTR.

    As a Entrepreneur he setup Studios and produced movies and provided employment to thousands of people.

    In the last 60 years he has greatly impacted the fields of Politics, Performing Arts, Social equations, economy in AP state.

    It is sad that some caste bigots sling mud on his character and trivialize his contributions.

    He was like a great Banyan tree.

    రిప్లయితొలగించండి
  7. అజ్ఞాత గారు యన్టిఆర్ దళితులకు అధికారం ఇచ్చారని ఏదో చెప్పారు బహుశా మీకు తెలియక పోవచ్చు లేదా ఆసక్తి లేక పోవచ్చు . రామారావు రాజకీయాల్లోకి రావడాని కన్నా రెండు దశాబ్దాల ముందు రాష్ట్రానికి దళిత ముఖ్యమంత్రి ఉండేవారు . దామోదరం సంజీవయ్య . టిడిపి నాయకత్వం లో దళిత ముఖ్యమంత్రిని ఉహించాగలమా ? దేశానికి స్వతంత్రం రావదనికన్న ముందే దళితులకు రిజర్వేషనులు ఉన్నాయి. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చాక దేశంలో దళిత రిజర్వేషన్లు పెంచారు . రామారావు తెలుగులో గొప్ప నటుడు దీన్ని ఎవరూ కాదనరు సంఘ సంస్కర్త కాదేమో . సహజంగా కొత్త పార్టీ పెట్టినప్పుడు కొత్త వారికీ అవకాశాలు ఉంటాయి . అలానే పార్టీ పెట్టినప్పుడు కొత్తవారికి అవకాశం ఇచ్చారు . ౧౯౨౦ లోనే అప్పటి మద్రాస్ అసెంబ్లీ లో ౪౬ మంది న్యాయవాదులు ఉండేవారు. ఎక్కువ మంది విద్యావంతులే ఉండే వారు . దాశరథి ఆస్థాన కవిగా ఉంటే తొలగించారు. తెలుగు పేర్తో అధికారంలోకి వచ్చిన రామారావు అలా చేయడం ఏమిటో

    రిప్లయితొలగించండి
  8. Dear Buddaa Murali,

    You missed my point completely. Please re-read my comment. Before 1983 Dalits were used by Congress party to win elections (by chance one or two Dalits benefited), where as after 1983 for the first time they enjoyed mass gross roots political power.

    I repeat "mass gross roots political power".

    In AP, after that, the power dynamics at gross roots level (village) changed for ever.

    Before 1983, a Dalit can not draw water from upper caste wells, he can not enter the Temples, he can not attend the same School meant for upper castes, he can enter the poling booths, he can not drink tea or coffee in village hotels, he can not marry upper caste girls, and more.

    Note: The situation was not same every where. Don't argue by saying that, in my village that was not the case. I am not talking about your village. It was the general situation. If you have a Dalit friend ask him/her to learn more.

    Don't show me one or two exceptions here and there. I am taking about mass transformation in the fields of politics, social interactions, education and economy.

    So if he remove దాశరథి (one person), then where is the justification for hating him by the whole caste?

    And the same caste vote en-mass to YSR, who was a known Christian Missionary, and converting Hindus with the help of his Daughter and Son-in-law.

    Come on, be rational thinking prevail for all the times. We all have to keep our minds open for new ideas.

    Have a good day.

    రిప్లయితొలగించండి
  9. అజ్ఞాత గారు మీ ఊరు ఏదో నాకు తెలియదు కానీ నా బాల్యం నుండి హైదరాబాద్లోనే ఉన్నాను అయితే తొలి ఉద్యోగం జిల్లాలో చేశాను. మెదక్ జిల్లా ( ౧౯౮౭) . ఆ జిల్లాలో పని చేసినప్పడు దళిత సంగాలతో నాకు మంచి సంబందాలు ఉండేవు. వెట్టి చాకిరీ గురించి, రెండు గ్లాసుల విదానం పై చాలా వార్తలు రాశాను .( రామారావు దళితులకు చేసిన సేవ మీరు బహుశా ఏదో పుస్తకాల్లో చదివారు తప్ప మీకు అనుభవంగా తెలియదని మీ రాతలు బట్టి నాకు అర్థమవుతుంది ) నేను దళిత సమస్యల పై ఎక్కువగా స్పందించడం వల్ల నేను దళితుడినేమో అని సహచరులు అనుకునే వారు . రామారావు వచ్చి దళితులకు ఆలయ ప్రవేశం కల్పించారు అని మీరు మరీ సినిమా కథలు చెబుతున్నారు. రెండేళ్ళ క్రితం సిపిఎం నాయకులు రాఘవులు దళితులకు ఆలయ ప్రవేశం గురించి రాష్ట్ర వ్యాప్తంగా సైకిల్ యాత్ర నిర్వహించారు. దళితులకు ఆలయ ప్రవేశం సమస్య రామారావు వల్ల వచ్చింది కాదు, ఆయన వల్ల పోలేదు. రామారావు ఈ సమస్య లేకుండా చేస్తే రెండేళ్ళ క్రితం రాఘవులు యాత్ర జరపాల్సిన అవసరం ఏమిటి ? కొంత మార్పు వచ్చింది కానీ ఇంకా చాలా గ్రామాల్లో ఈ సమష్య ఉంది . కారంచేడు, పదిరి కుప్పం లాంటి సంఘటనల గురించి మీకు తెలుసా ? దళితులను నరికి చంపి గోనే సంచుల్లో పారేశారు . ఈ సంఘటన వల్లనే కదా దగ్గుపాటి తండ్రిని హత్య చేశారు . రామారావు కచ్చితంగా గొప్పనటుడు . అన్నీ రకాల పాత్రలను మెప్పించాడు . ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఇతరులు అవినీతికి పాల్పడ్డారు కానీ ఆయన నిజాయితీగానే ఉన్నారు దానిని ఎవరూ కాదనరు. ఒక చిన్న విషయం చెప్పి ఈ అంశం పై ఇక నేను రాయను ౧౯౪౦ సమయంలో దేశం లో స్వతంత్ర పోరాటం ఉదృతంగా సాగుతున్నప్పుడు ఆయన సినిమా అవకాశాల కోసం మద్రాస్ లో ప్రయత్నించారు కానీ దేశం కోసం .............. . ఆందరూ పోరాడాలని కాదు కానీ ...... ౬౦ ఏళ్ళ వయసులో హీరో పాత్రను వదిలి వచ్చాడు కానీ అది త్యాగం కాదు. తమిళనాడులో మాదిరిగా పలు సంక్షేమ పథకాలు అమలు చేశారు

    రిప్లయితొలగించండి
  10. మురళి గారు, చాలా మంచి టాపిక్.. నేను కూడా చాలా సార్లు ఆలోచనల్లో పడ్డ సంగతి..
    పీవీ, ఎన్టీఆర్ ఇద్దరికీ 'భారత రత్న' అవార్డు కి అర్హత ఉన్నా ఒకే కారణానికి రాలేదు, ఇప్పట్లో వచ్చే సూచనలు లేవు..
    ఆ కారణం పేరు 'రాజకీయం' ..కేవలం ఇందుకోసమే చంద్రబాబు చక్రం తిప్పే రోజుల్లో భారత రత్న కోసం ప్రయత్నించ లేదేమో అనిపిస్తుంది..
    చంద్రబాబు సొంత ఇమేజిని పెంచుకోవడం ద్వారా ఎన్టీఆర్ ని మరిపించే ప్రయత్నాలు చేస్తున్నారంటూ కొన్ని పత్రికల్లో వార్తలు వచ్చాయి కూడా..
    పీవీ కి రాకపోవడానికి కారణం ఆటను కాంగ్రెస్ మనిషి కావడం.. కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో వచ్చినా కాంగ్రెస్ వాడు కాబట్టి ఇవ్వరు..
    కాంగ్రెస్ ప్రభుత్వమే వచ్చినా కాంగ్రెస్ వాడు కాబట్టే ఇవ్వరు.. వారి దృష్టిలో కాంగ్రెస్ అంటే నెహ్రూ కుటుంబం మాత్రమే కదా..

    రిప్లయితొలగించండి
  11. రామారావు గారు గొప్ప నటుడా? ఎవరైనా వింటే నవ్వి పోతారు. ఆయన విజయవంతమైన హీరో మాత్రమే. నటుడు అని చెప్పుకోదగ్గ పాత్రలు ఆయన జీవితంలో వేళ్ల మీద లెక్కించదగినవి మాత్రమే మంచి పాత్రలు చేశారు. మిగతా చిత్రాలన్ని అతి నటన. శివాజీగనేషన్ గారి నటనని కాపి కొట్టేవాడు. ఇది అన్ని భాషా చిత్రాలు చూసేవారికి తెలిసిన విషయమే. ఆయన శ్రీనాథుడి సినేమాలో ప్రశంసనీయమైన నటన చేశాడు. మొదట్లో నటి0చిన మిస్సమ్మా, మాయాబాజార్ మొదలైన చిత్రాల తరువాత. కొండవీటి సిమ్హం అనే సినేమా శివాజిగనేషన్ నటిచించిన బంగారు పతాకం సినేమా కాపి పేస్ట్. ఆయన కి పేరు తెచ్చిన సినేమాలలో చాలా వరకు శివాజిగనేషన్ గారివే! 60 సం|| వయసు వచ్చిన ఆయన 18సం|| శ్రీదేవి తో ఎగురుతూ ఉంటే ఎంతో జుగుప్సకరంగా ఉండేది. ఆ రోజులలో సినేమా ఒక్కటే వినోద కాబట్టి భరించారు. ఈ తరవారికి ఆయన సినేమాలు చూపిస్తే పారి పోతారు.

    Sri

    రిప్లయితొలగించండి
  12. Dear Buddaa Murali,

    I wrote 10-15 points, but you have taken one least important point and insists that I don't know anything.

    It looks like we are thinking at two different wavelengths. Through this medium it is difficult to come to some conclusion.


    All the best. Have a good Day.

    రిప్లయితొలగించండి
  13. రామారావు గారి పాలనలో విజయవాడలో జరిగిన వంగవీటి మరణం, తరువాత గలభాలు ప్రజల మనసులో చెరగని ముద్ర వేశాయి. పింగళి దశరథ రాం అనే ఒక పత్రికా విలేఖరి హత్య ఇలా చేప్పుకొంట్టూ పోతే ఎన్నో వస్తాయి. ఉద్యోగస్తులు దాదాపు రెండు నేలలు సమ్మే చేశారు. ఆయన వారినీ గోతికాడ పందికొక్కులు అని దూషించారు.
    -----------------------------------------
    To this day, people belong to Castes that lost Munsab, Karnam and Patel hereditary positions hates NTR.
    ఇతనికి తెలియని విషయమేమిటంటే రామారావు ని పదవి నుంచి దించినపుడు అరుణ్ శౌరిలాంటి బ్రాహ్మణ మేధావులు ఇతని మద్దతుగా ఇందిరాగాంధి తో పోరాడి తిరిగి పదవి రావటానికి కారణమైనారు. శంకరదయళ్ శర్మ గారు గవర్నర్గా ఎంతో సహకరించారు. ఆయ్నకు నచ్చిన వ్యక్తులలో శంకరదయళ్ శర్మగారు ఒకరు. ఇక ఇతని పాలన సినేమా పక్కిలో జరిగేది అన్ని పథకాలు తమిళ నాడు నుంచి కాపి పేస్ట్. తెలుగు గంగ పథకం ద్వారా తమిళులకు నీళ్ళు ఎంతో కష్టపడి ఇతను ఇప్పిస్తే, వారు ఇతను చేసిన సేవలని కనీసం గుర్తు పెట్టుకోలేదు. రామారావు చనిపోయినపుడు ఒక సంతాప సభ కూడా జరిపినట్టునట్టు గుర్తు లేదు.
    ఉపాధ్యాయులు ప్రైవేట్ చెప్పకుడదని ఒక నిబందన పెట్టి వారి ఉసూ పోసుకొన్నారు. అసలికి ఆనాటి సంఘం లో ఇంటికి ఒకరు పని చేస్తే పది మంది తినే వారు ఉండేవారు. టిచర్లకు ఎదో కొంత పై ఆదాయం కొరకు ప్రైవేట్లు చెపితే వారేదో లంచాలు తీసుకొనే ఉద్యోగులలా ట్రీట్ చేశాడు. ఇక ఆరోజులలో అల్లుళ మీద అవినితి ఆరోపణలు వస్తే ఎప్పుడు, ఎక్కడా చర్యలు తీసుకోలేదు. వారు అప్రహతిగతం గా చక్రం తిప్పేవారు. మంత్రులందరిని ఒక్కసారిగా తోలగించటం, నా బొమ్మవలననే అందరు గెలిచారు అని అహంకారంగా ప్రజాస్వామ్య విలువలు లేకుండా ప్రవర్తించటం లో వారికి వారే సాటి. రెండు రూపాయలు కిలో బియ్యం పథకం కొనసాగించాటని కొరకు తెలుగు వారుణి వాహిని అనే పథకం ప్రవేశ పెట్టారు. అది రూపాంతరం చెంది ఇప్పుడు బెల్ట్టు షాపులవరకు వచ్చింది. ఒక్కసారి రామారావు గారి పాలన ను గుర్తుకు తెచ్చుకొంటే ఒక్క నిముషం లో గుర్తుకు వచ్చినవి.

    SrIRam

    రిప్లయితొలగించండి
  14. భారత దేశం గర్వించదగ్గ తెలుగు ప్రధాని, ఆర్థికసంస్కరణలను తెచ్చి దేశాన్ని ఓ మలుపు తిప్పిన, నంద్యాల(రాయలసీమ) నుంచి ఎన్నికైన పార్లమెంటు సభ్యులు పి.వి.నరసింహారావు గారు భారతరత్నకు అర్హుడు. పోతే...NTR... నటరత్న, పద్మశ్రీ, డాక్టరేట్ ఇచ్చారుగా, అది చాలనుకుంటా.

    రిప్లయితొలగించండి
  15. మురళి గారు నిజమే నండి . బాబు ముఖ్యమంత్రి పదవి చేపట్టిన తరువాత తొలి సమావేశం ఒకటి ఎగ్జిబిషన్ గ్రౌండ్ లో నిర్వహించారు . అందులో జాతీయ మీడియా కోసం బాబు జీవిత విశేషాలను వివరిస్తూ ఒక నోట్ ఇచ్చారు బాబు గొప్పతనం చెప్పారు బాగానే ఉంది కానీ రామారావును అందులో బాబు మామగా పరిచయం చేస్తూ ఆయన ఒక నటుడు అని పేర్కొన్నారు . బాబు పేరుతో రామారావును పరిచయం చేయడం పై ఆ రోజు బాధ వేసింది . ఆ నోట్ భద్రపరచనందుకు ఇప్పటికీ బాధగానే ఉంటుంది .
    @ అజ్ఞాత గారు బ్లాక్ అండ్ వైట్ సినిమాల వరకు రామారావు నటన నాకు బాగా నచ్చింది

    రిప్లయితొలగించండి
  16. part 1
    అజ్ఞాత గారు ఇష్టం లేకపోయినా మళ్లీ స్పందించక తప్పడం లేదు .మీరు ౧౫ పైంత్స్ చెబితే నేను సమాధానం చెప్పలేక తప్పించుకున్నట్టు ఉంటుందని మళ్లీ స్పందిస్తున్నాను.
    దళితులను కాంగ్రెస్ వోట్ బ్యాంకు గానే చూసింది రామారావు మాత్రం అలా కాదు
    ఉద్దరించారు అని మీ అభిప్రాయం . కాంగ్రెస్ , టిడిపి మాత్రమే కాదు ఏ పార్టీ ఐనా అలానే చూస్తుంది. దళితులూ రామారావు ( టిడిపి ) వైపు ఎప్పుడూ లేరు వారు అప్పుడు యిప్పుడు కాంగ్రెస్ వోట్ బ్యాంకు . దేశానికి స్వతంత్రం వచ్చిన కొత్తలో కాంగ్రెస్ కు పోటి లేదు అప్పుడే వాళ్ళు దళితులకు రిజర్వేషన్లు అమలు చేశారు . మార్కెట్ లో ఒక కొత్త ప్రోడక్ట్ వచ్చినప్పుడు అది నిలబడడానికి వారు అనుసరించే వుయ్హలనే టిడిపి తో సహా ఏ కొత్త పార్టీ ఐనా అనుసరిస్తుంది అలానే టిడిపి తన మార్కెట్ కోసం ఆలోచించింది . దళితులూ కాంగ్రెస్ వైపు ఉన్నారు కాబట్టి బిసిలపై దృష్టి సారించింది. కొంత వరకు విజయం సాదించింది. ఇక దళిత వోట్ బ్యాంకు చీలికకు రామారావు కొద్దిగా కృషి చేస్తే చంద్రబాబు బాగానే ప్రయత్నించారు. దళితుల్లో మాదిగ వారి పరిస్తితి మరీ ఇబ్బంది కరం రిజర్వేషన్ లా వర్గీకరణ న్యాయమైన దిమంది. కానీ బాబు వారిపై సానుభూతి తో కాకుండా . దళిత వోట్ లలో సగం మన వైపు తిప్పుకున్దామని వర్గీకరణకు ఒప్పుకున్నారు.
    * వై యస్ ఆర్ ముస్లిం లకు ౫ శతం రిజర్వేషన్లు అమలు చేసింది కూడా వోట్ బ్యాంకు రాజకీయాల్లో బాగమే .
    * ఇక దళితులూ రమా రావు పాలన కన్నా ముందు ఇతరులతో కలిసి ఒకే స్కూల్ లో చదువుకునే వారు కాదు , రామ రావు వచ్చాక అన్నీ కులాల వాళ్ళు ఒకే స్కూల్ లో చదివే అవకాశం వచ్చింది అని రాశారు. . ఇంత గొప్ప విషయాని మీరు ఎక్కడైనా చుశ్ర, చదివార నాకు తెలిపితే సంతోషిస్తాను . అంబేద్కర్ స్కూల్ కు వెళ్ళే కాలం లోనే అన్నీ కులాల వారు కలిసి చదువుకునే కాలం వచ్చిందండి. ఐతే దళితులను అక్కడ అవమానించే వారు .Before 1983, a Dalit can not draw water from upper caste wells, he can not enter the Temples, he can not attend the same School meant for upper castes,( ఆలాంటి స్చూల్స్ ఎక్కడ ఉండేవో చెబితే తెలుసుకుంటాను )
    * కొన్ని స్కూల్ కు ఇప్పటికీ మన పిల్లలను పంపలేము కులం వల్ల కాదు అంతేసి ఫీసు కట్టలేక ...

    రిప్లయితొలగించండి
  17. part 2
    * ఇక దాశరథి నీ ఆస్థాన కవిఅగా తొలగించినందుకు ఆ కులం వాళ్ళు వ్యతిరేకిన్చాలా అని అడిగారు ? ఆ మాట నేను అనలేదు పైగా కరణాలు, మునసబులును తొలగించడం గొప్ప పని అని మీరు అన్నారు . తెలుగు పేరు తో పార్టీ పెట్టి , తెలుగు సంస్కృతి గురించి మాట్లాడిన వారు ఆ పేరుతో వోట్లు పొందిన వారు మన సంస్కృతికి ప్రతీకగా ఉన్న ఆ పదవిని రద్దు చేయడం ఏమిటి అనేదే నా బాద . దాశరథి నచ్చక పొతే ఆ పదవిలో రామారావు తనకు నచ్చిన వారిని నియమించుకున్నా బాగుండేది.
    @ కరణం, మునసబులనే కాదు అప్పటి వరకు పాతుకు పోయిన లిక్కర్ కన్త్రక్తులను కూడా రమా రావు తొలగించరండి. ఇది సంస్కరణల్లో బాగం కదండి వారంతా కాంగ్రెస్ వాళ్ళు కాంగ్రెస్ పునాదులు కదిలించాలంటే వారిని తొలగించాలి. అంతే తప్ప ఒక కులం పై వ్యతిరేకత కాదు , సంస్కరణ కాదు.
    త్యాగం, సంస్కరణ , అభ్యుదయం అంతే ఏమిటో పాత తరం కమ్యునిస్ట్ నాయకుల జీవితాలను చదవండి తెలుస్తుంది.
    * నాకు తెలిసినంత వరకు రామారావు దళితులకు ఆలయ ప్రవేశం గురించి ఎలాంటి చట్టాలు తెచ్చినట్టు తెలియదు . ఆ చట్టాలన్నీ బ్రిటిష్ కాలం లో వచ్చినవే . ఇక లోకల్ బాడీ లో బిసిలకు, మహిళలకు రామారావు ౯ శతం రిజర్వేషన్లు తెస్తే , రాజీవ్ గాంధీ ౩౩ శతం వరకు తెచ్చారు .
    బివి రాఘవులు కులం, మతం గురించి ఏం చెప్పారో అది ఆచరించి చూపారు. రామారావు ౭౪ ఏళ్ళ వయసులో కూడా సొంత కులం శ్రిమతినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అది ఆయన వ్యక్తి గతం నేను దాన్ని వ్యతిరేకించడం లేదు. కానీ కుల రహిత సమాజం గురించి నాయకులు చెప్పేదానికి వ్యక్తీ గత జీవితం లో ఆచరణకు సంబడం ఉండడం లేదు అనడానికి మాత్రమే ఉదహరించాను .
    * నేను మీ గ్రామం గురించి చెప్పడం లేదు అని ఏదో అన్నారు మొదటే చెప్పాను నది హైదరాబాద్ అని ఈ రోజు మీకోసం చెప్పడం లేదు వీలుంటే పాత పోస్ట్లు చదవండి నాకు గ్రామం లేదు అనే బసద నాలో ఉంది ఓ పోస్ట్ లో అది రాశాను కూడా ఐతే ౧౫ ఏళ్ళ పాటు ఆరు జిల్లాలలో పని చేశాను నాకు గ్రామాలూ, రాజకీయాలు, కులాల పై కొంత అవగాహనా ఉంది.
    * ఉత్తర ప్రదేశ్ దేశానికి బ్రామ్హన ప్రదనులను, నేతలను అందించిన రాష్ట్రం. అక్కడ రామారావు లేదు కానీ అక్కడి దళితుల్లో చైతన్యం వల్ల ఇప్పుడు అక్కడ దళిత పార్టీ లోనే ౫౪ మంది బ్రాహ్మణ యం యల్ ఏ లు ఉన్నారు . దేశం మొత్తం లో మార్పు ఉంది అది సహజం . రామారావు పాలించిన రాష్ట్రం లో నైన రామ రావు తన జీవిత కాలం లో వెళ్ళని రాష్ట్రం లో నైన ఇలాంటి మార్పు సహజం. ఇప్పుడు మన రాష్ట్రం లో తెలంగాణ ఉద్యమం లేక పోయి ఉంటే ఆ స్తానం లో దళిత, బిసి ఉద్యమం ఉదృతంగా ఉంది ఉండేది

    రిప్లయితొలగించండి
  18. ) :) సరి కొత్త విషయాలు తెలుస్తున్నాయి.. హి హి ..ఎన్ టి ర్ కి స్వయానా వియ్యంకుడు అయిన చెంచు రామయ్య దళితులని నరికి పోగులు పెట్టాడు. తరువాత నక్స లైట్లు అతని తల నరికి తీసుక పోయారు. ఇప్పటికీ అతని తల దొరక లేదు. దాని గురించి ఎన్ టి ర్ నోరు కూడా ఎత్తలేదు. అతిశయోక్తులకి కూడా హద్దు ఉంటుంది. .....
    ganga sani garu

    చెంచు రామయ్య దళితులను నరికి పోగులు పెట్టారు అని మీరు అన్నారు కానీ నేను రాసిన దానిలో ఎక్కడ లేదండి. రామారావు దళితుల్లో చైతన్యం తెచ్చేశారు అంటూ మీది ఏ ప్రాంతమో అని మీరు ప్రస్తావించినప్పుడు నేను మెదక్ జిల్లా లోని నా అనుభవం చెప్పాను అదే విధంగా అన్నీ ప్రాంతాలలోను ఇదే పరిస్తితి ఇదే అని కారం చెడు ప్రస్తావించాను. ఆ సంఘటన తరువాతనే నకల్స్ అతన్ని చంపారు . గత ఏడాది దగ్గుబాటి తన తండ్రిని చంపినా నక్సల్తో మాట్లాడారు, ఎందుకు చంపారు అని అడిగాడు. అతనికి కేసు నుండి విముక్తి కూడా కలిగించాడు

    రిప్లయితొలగించండి
  19. బుద్దా మురళీ గారు,
    మీకు ఎప్పుడైనా వీలైతే రామారావు గారి పథకాలు, వాటి ప్రభావం, ప్రస్తుతం అవి ఎలా నడుస్తున్నాయి అనేదాని మీద ఒక టపా రాయండి.

    Sri

    రిప్లయితొలగించండి
  20. @NTR ABHIMAANI....

    YSR is cristian.....we all know that....but....YSR is the CM who passed a GO thru which anybody who is canvassing other religion stuff at HINDU HOLI PLACES can be arrested......

    YSR is the CM who granted 300crs of FUND and consolidated that amount to use DHUPA DEEPA NYVEDHYAS in HINDU TEMPLES and for giving SALARIES to ARCHAKAS......

    YSR is the CM who started the program called KALYANAMASTHU in which anybody can marriage with the help of TTD......

    plzz don't propagate yellow jernoulism on YSR as he is preaching cristianity to all.....

    what is the reason U braught YSr in this topic??????

    రిప్లయితొలగించండి
  21. @topic...

    Prakasam Panthulu gaaru.....Puchalapalli Sundarayya gaaru.....VAAVILAALA.......PV....these r deserved candidates for BHARATHA RATHNA in my opinion.......

    రిప్లయితొలగించండి
  22. $VSR ji

    #YSR is the CM who granted 300crs of FUND and consolidated that amount to use DHUPA DEEPA NYVEDHYAS in HINDU TEMPLES and for giving SALARIES to ARCHAKAS......

    I second with your opinion. There is no doubt. It is very unfortunate labelling YSR ji as christian-leaning and hindu-basher just for their caste-based political benifit. This is utter self-exploitation of hindu's inner feelings. Moreover, pulling YSR ji into unrelated issues and maltreating him is a shameless act and such hatemongers should be punished.

    @NTR ABHIMAANI....

    Everybody here knows what truth is but you still dreaming in lies and caught with yellow fever..Get a life sir.. :)

    రిప్లయితొలగించండి
  23. తెలుగు వాడి పౌరుషం రామారావు గారితోనే పోయింది,,, ఇప్పుడున్నది చేవ చచ్చిన నేతలు పివి నరసింహారావు కి మన రామారావు గారి భారతరత్న ఇవ్వడం సముచితం... ఇంకా ఆశ చావటం లేదు వస్తాదనే కోరిక.........

    రిప్లయితొలగించండి
  24. Budda murali garu ....miru Rama Rao gariki Chandra Babu Naidu gariki vyathireki ani matram naku artham ayendhi ...me posts motham e roju chadivanu andi ..me saili bavundhi... kani me vyathirekata chupatam me istam ...me blog me istam nenu naku anipinchindhi cheppanu ante....meku vallu chesina manchi panulu lo kuda cheddda vishyalu kani pisthunnayi ... any how baga rasthunnaru meru nammina vishyanni ....

    రిప్లయితొలగించండి
  25. ఆలపాటి గారుస్పందించినందుకు థాంక్స్ .. నా శైలి నచ్చినందుకు మరీ మరీ థాంక్స్ ... బాబు గారిని ప్రపంచం మెచ్చిన నాయకుడిగా చూపిన, చూపేందుకు పెద్ద పెద్ద పత్రికల వాళ్ళే పోటి పడ్డారు, పడుతున్నారు. చిన్న ప్రాణి నేను ఏం రాస్తే బాబు గారికి ఏమవుతుంది లెండి .

    రిప్లయితొలగించండి
  26. అవార్డులకోసం పైరవీలు చేయడం హేయం - అది తమిళులు చేసినా, తెలుగువాళ్లు చేసినా తప్పే. ఎన్‌..టీఆర్‌లో గానీ, పి.వి.లోగానీ భారతరత్న కాదగినంత గొప్ప వ్యక్తిత్వం లేదు. సర్వేపల్లి రాధాక్రిష్ణ తమిళనాడు ఖాతాలోనే అనడం బుద్ధితక్కువ. ఆయన పూర్తిగా తెలుగువాడు; పైగా మద్రాసు ఆంధ్ర మహాసభకు అధ్యక్షుడుగాకూడ కొంతకాలం వున్నాడు. మద్రాసుం నగరం తెలుగువాళ్లదే అని చాటిన, డిమాండు చేసిన నాయకుల్లో ఆయనకూడ ఒకడు. అలాగే బరంపురం తెలుగు పట్టణమే. బళ్లారి ఎలాగో అదీ అలాగే, పరాయి రాష్ట్రాల్లో వున్నంతమాత్రాన అక్కడి తెలుగు వాళ్లు తెలుగువాళ్లు కాక పోతారా? ఒక్క విశ్వేశ్వరయ్యగారు మాత్రమే తెలుగు పుట్టుకవాడైనా, కన్నడదేశానికీ ప్రియమైన వ్యక్తిగా భావించబడ్డాడు. 2-3 వందల ఏళ్ల క్రితమే కన్నడ దేశానికి వలసపోయిన తెలుగు కుటుంబం మోక్షగుండం విశ్వేశ్వరయ్యగారిది.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం