29, జనవరి 2013, మంగళవారం

ఫేస్ బుక్ వాల్ అంటే నగర కేంద్ర గ్రంథాలయం టాయ్‌లెట్‌ గోడ కాదు!





చిక్కడపల్లి లోని నగర కేంద్ర గ్రంథాలయం టాయ్‌లెట్‌లోని గోడలపై పచ్చి బూతు రాతలు  కనిపించేవి. అక్కడికి వచ్చే వారు చదువుకున్న వారే! వారు వచ్చేది చదువు కోవడానికే..! మరి ఈ రాతల సంగతేమిటి?


 ప్రతి మనిషిలో కనీసం ముగ్గురు మనుషులు ఉంటారంటారు రజనీష్. పైకి కనిపించని మనిషి అప్పుడప్పుడు అలా గోడలపై తన లోపలి రూపాన్ని ప్రదర్శిస్తాడు. టాయ్‌లెట్ గోడలవరకైతే ఈ పైత్యానికి వచ్చిన ప్రమాదం ఉండదు. ఎందుకంటే అవి రాసింది ఎవరో తెలియదు. కానీ ఫేస్‌బుక్ వాల్‌పై ఇలానే పిచ్చి రాతలు రాసిన కొందరు ప్రబుద్ధుల మెడకు ఇప్పుడు పోలీసు కేసు చుట్టుకుంది. ఫేస్‌బుక్, బ్లాగ్స్,  గూగుల్ ప్లస్ వంటి  సామాజిక సైట్స్‌లో ఇద్దరు తెలుగు వారిపై కేసులు నమోదు కావడం  తెలుగు గ్రూపుల్లో సంచలనం సృష్టిస్తున్నాయి. సామాజిక మాధ్యమాలకు సంబంధించి రాతలపై కేసులు నమోదైన వాటిలో తెలుగుకు సంబంధించి ఇదే మొదటిది కావచ్చు. మహిళలను కించ పరిచే విధంగా ఉన్న రాతలు రాసినందుకు ఇద్దరిపై ఆ చర్చలో పాల్గొన్న మరి కొందరిపై సాక్షులుగా కేసు నమోదైంది. గత నాలుగైదు ఏళ్లుగా కొందరు ఇదే విధంగా మహిళలను కించపరుస్తూ రాతలు రాసినా కొందరు కామెంట్స్ ద్వారా తప్పు అని హెచ్చరించారు. మరి కొందరు మనకెందుకులే ఇలాంటి వారితో వివాదం అని వౌనంగా ఉండిపోయారు. ఈసారి రాతలన్నింటిని రికార్డు చేసి సాక్ష్యంగా చూపించి మహిళా సంఘాలు నగర పోలీసు కమిషనర్‌కు ఫిర్యాదు చేశాయి .  సామాజిక మాధ్యమాల దాదాలుగా చెలామణి అయిన వారు ఊహించని ఈ దెబ్బతో కంగుతిని పోయారు. కేసుల్లో ఇరికి తంటాలు పడుతున్న వాళ్ళు  కొందరు .. ఇలాంటి కేసులు కుడా ఉంటాయా ? అని జాగ్రత్త పడుతున్న వాళ్ళు కొందరు.  తప్పయిపోయింది ఆత్మహత్యే శరణ్యం వదిలేయండి అని వేడుకున్న వారు కొందరైతే, మేం చెప్పిన విషయం కరెక్టే, చెప్పిన విధానం బాగాలేదు అని తలబిరుసుగా వ్యవహరించి కేసులో నిండా మునిగిన వారు మరికొందరు.


సామాజిక మాధ్యమాల్లో ఒక అంశంపై అభిప్రాయాలు చెప్పుకోవడమంటే రోడ్డుమీద నిలబడి ఇద్దరు వ్యక్తులు ఇష్టం వచ్చినట్టు మాట్లాడుకోవడం కాదు. బాధ్యతాయుతంగా ఉండాలని ఈ కేసుతో తెలిసి వచ్చింది. ఇంగ్లీష్‌లో పోలిస్తే, సామాజిక మాధ్యమాల్లో తెలుగు భాషలో సాగే చర్చల హడావుడి తక్కువే. ఉన్న ఈ కొద్ది సంఖ్యలో సైతం అభ్యంతరకరమైన చర్చలకు కొదవేమీ లేదు. పాత పాటలు, తెలుగు సినిమాలు, సాహిత్యం , రాజకీయం గురించి అంతో ఇంతో మంచి చర్చనే జరుగుతూనే ఉంది. అయితే ఇదే సమయంలో తమ అభిప్రాయాలే ఉన్నతమైనవని ఎదుటివారిపై ఆధిపత్యం చెలాయించాలనే ధోరణులు కూడా కనిపిస్తూనే ఉన్నాయి. తమకు నచ్చని వారిని పూర్వం సమాజం నుంచి వెలివేసినట్టు కొందరిని వెలివేసే పద్ధతి సైతం కనిపిస్తోంది. 

ఇక్కడ మనం ఏమైనా మాట్లాడుకోవచ్చు ఏమీ కాదు అనే ధోరణితో ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నారు. ఇప్పుడు మహిళా సంఘాలు పెట్టిన కేసును స్ఫూర్తిగా తీసుకుని, కించ పరిచే రాతలపై ఇతరులు సైతం కేసులు పెట్టే అవకాశం లేకపోలేదు. తమకు నచ్చని వ్యాఖ్య కనిపిస్తే అడ్డగాడిదలు అని ఒకరు రెచ్చగొడితే, వారిని సంకర జాతి అని వీళ్లు తిడుతున్నారు. గూగుల్ ప్లస్, ఫేస్‌బుక్ లాంటి వాటిలో చురుగ్గా ఉండే తెలుగు వాళ్లు మహా అయితే ఐదారు వందల మంది ఉంటారు. ఈ ఐదారువందల మంది తలుచుకుంటే రాష్ట్రంలో విప్లవం రాదు, వచ్చే విప్లవం ఆగిపోదు. కానీ ఫేస్‌బుక్‌ను ఒక సామ్రాజ్యంగా, తమను తాము సామ్రాజ్యాధిషులుగా భావించి ఇష్టం వచ్చినట్టు రాతలు రాయడం ద్వారా లేని పోని ఇబ్బందులు కొని తెచ్చుకోవద్దు. మహిళలను కించపరిచిన రాతలకు కేసు పెట్టారు, వారికి ఏ శిక్ష పడుతుంది అనేది తరువాత. అపర కీచకులు అంటూ లక్షలాది మంది చూసే టీవి చానల్స్‌లో వారి ఫోటోలు చూపించారు. అంతకు మించిన శిక్ష ఏముంటుంది. వారి కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని సామాజిక మాధ్యమాలను బాధ్యతాయుతంగా ఉపయోగించుకోవాలి.

44 కామెంట్‌లు:

  1. అపర కీచకులు అంటూ లక్షలాది మంది చూసే టీవి చానల్స్‌లో వారి ఫోటోలు చూపించారు. అంతకు మించిన శిక్ష ఏముంటుంది. వారి కుటుంబ సభ్యులు, తెలిసిన వారి పరిస్థితి ఏ విధంగా ఉంటుంది.

    నిజం. వారికి పడాల్సిన పెద్ద శిక్ష ఇది వరకే పడింది. మిగిలినవి కేవలం ఫార్మాలిటీలే.

    రిప్లయితొలగించండి
  2. టీవీల్లో ఫోటో లవల్ల వాళ్లకి పెద్దగా నష్టంలేదు,, ఇది కేవలం కక్ష సాధింపు, వారు మాట్లాడినవి కేవలం పచ్చ్చి నిజాలు అని కుటుంబ సభ్యులకి వాళ్ళు చెప్పుకోగలరు. అయినా అయ్యో పాపం అనిపించినా, ఈ జాలి మీద ఆధారపడి
    సామాజిక మాధ్యమాల దాదాలుగా చెలామణి అయిన/అవుతున్న వారికి ఏ సంకేతాలు పంపదలుచుకున్నారు అన్నది ముఖ్యం. స్త్రీలు కావచ్చ్చు, మరేదయినా సున్నిత అంశాలు కావఛ్చు , ఈ సంఘటన మార్గదర్సకం కావాలి ప్రతి ఒక్కరికి.

    కాదంటారా ?

    రిప్లయితొలగించండి
  3. మౌళి గారు కుటుంబ సభ్యులు అంత ఈజీగా తీసుకుంటారని నేను అనుకోవడం లేదు .. అత్యాచారానికి గురైన మహిళా పేరు మీడియాలో రాయకూడదు .. ఇది చాల మందికి తెలియదు . వనజ అని ఒక న్యాయవాది ఉండే వారు .. ఈ అంశం పై కోర్టులో కేసు వేస్తే ఈ టివి వాళ్ళు క్షమాపణ చెప్పడం తో పాటు తగిన శిక్ష అనుభవించారు .. ఆమె ఉద్దేశం ఈ టివి ని ఏదో చేయాలనీ కాదు . ఈ కేసు వాళ్ళ పేరు రాయకూడదు అని అందరికి తెలిసి వచ్చింది. జాగ్రత్త పడుతున్నారు .. పెట్టిన ఈ కేసు తో ఇష్టం వచ్చినట్టు రాయకూడదు. పద్దతులు పాటించాలని తెలిసి రావచ్చు కదా

    రిప్లయితొలగించండి
  4. వాళ్ళ ఇళ్ళల్లో చాలా ఈజీగా తీసికోనేలా ఈ నిందితులు మాట్లాడగలరు, అదీ కాక యెంత తప్పు చేస్తే మాత్రం ఎవరి వాళ్ళని వాళ్ళు పోగొట్టుకోవడం జరగదు. జరగాలని మనం కోరుకోము. కాబట్టి ఆ మహిళలని గురించి మనం మాట్లాడుకోకూడదు. అత్యాచారం ను ఇక్కడ ఎందుకు ప్రస్తావిస్తున్నారు? వీరికి ఇంకా అటువంటి పరిస్థితి రాలేదు అన్నది సత్యం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. నేను చెప్పింది అవగాహనా గురించి .. అంటే ఏమైనా రాయ వచ్చు అనుకునే వారికీ ఈ కేసు వల్ల జాగ్రతగా రాయాలని తెలిసి వస్తుంది .. అత్యాచారం కేసుల్లో వారి పేరు రాయకూడదు అనే అవగాహనా మీడియా వారికీ కుడా .. లేదు కేసు వల్ల తెలిసి వచ్చింది అని .. ఉదహరించాను .. artham tappuga anipisthondi anukunte tolagisthanu . atyacharam udaharanaku.. viri kesuku sambandam ledu

      తొలగించండి
    2. మురళిగారు అవగాహన వస్తే చాలు అనుకొంటే, డిల్లీ రేపిస్ట్లను కూడా ఒకటో రెండో సంవత్సరాలు శిక్షించి వదిలెయ్యొచ్చు. నాకు సానుభూతి వారి మీదా ఉంది, ఈ ఫేస్బుక్ నిందితుల మీదా ఉంది. కాని వారికి యావజ్జీవం మినిమమ్ శిక్ష కదా, అలాగే వీరికీ పరిమితి చట్టం నిర్ణయిస్తుంది. మీరుకూడా ఇద్దరికీ ఒకే విధమైన సానుభూతిని ప్రకటించండి.తప్పులేదు. చాలామంది రేపిస్ట్ లు దర్జాగా కేసులనుమ్ది బయటపడుతున్నారు. ఈ ఫేస్బుక్ వాళ్ళు కూడా అల్లా తప్పించుకుంటే ఏం చేస్తాం.

      తొలగించండి
  5. మురళి గారు,
    వెల్ సెడ్!
    ఈ సంఘటన నిజంగా చాలా దురదృష్టకరం. నిజంగా చెప్పాలంటే, చాలా చాలా మంది ఇంతకన్నా ఘోరమైన అభిప్రాయాలతో ఉండి ఉండవచ్చు. గోముఖ వ్యాఘ్రాల్లా ప్రవర్తించా వచ్చు. ఇంతకన్నా నిరంకుశ ధోరణి లో మాట్లాడా వచ్చు.
    మన ఇంటి లోపలి వైపు గోడల మీద ఏం రాసుకుంటామూ అనేది ఎవరికీ తెలియాల్సిన పని లేదు.
    కానీ పది మంది చదివేట్లు మన గోడల మీద ఈ విధంగా రాయడం తప్పే. నేను కూడా చదివి చాలా ఆగ్రహావేశాలకి లోనయ్యాను. వీరిలో ఒకరిద్దరు నా బ్లాగు లో వ్యాఖ్యలు రాసిన వారు కూడా. ఆకారణంగా వీరికి చదువుకున్న స్త్రీలంటే,కార్పోరేట్ సంస్థల్లో పని చేసే ఆడవారంటే, అసలు చివరికి ఏడేళ్ల పిల్లలందరంటే కూడా ఇంత తేలిక భావమా అని చాలా అవమానకరం గా అనిపించింది కూడా.
    ఇదంతా వారు, ఇంత పర్యవసానం ఊహించక చేసిన చర్య గా నేను భావిస్తున్నాను. అలాగే కొన్నేళ్లు గా ఎన్నో రకాలు గా వివిధ మాధ్యమాల్లో, వివిధ వేదికల మీద జాతి నేతలనీ, రాజకీయ నాయకులనీ, సినిమా స్టార్లనీ, రచయితల్నీ, వివిధ ఉద్యమ కారులనీ,భారత రాజ్యాంగాన్ని, కుల,మత, ప్రాంత, జాతి,వర్గాదుల ని ప్రాతిపదిక గా ఇంతకన్నా ఘోరమైన రాతలు ఎన్నోసార్లు స్వంత పేరుతో,లేదా ముసుగులోంచి ఎంతోమంది రాసినా, మాట్లాడినా ఎవరూ బహుశా ఇంత ఎత్తున ప్రతిఘటన ఎదుర్కోకపోవడం తో అవగాహనా రాహిత్యం తో పర్యావాసాన్ని తేలిగ్గా తీసుకోవడం తో బహుశా ఈ పని కి పాల్పడి ఉండవచ్చని నేను భావిస్తున్నాను.
    అలాగే ఒకరు ఒక మాట అన్నాకా, ఒకరి తర్వాత ఒకరు గొలుసు కట్టుగా కామెంట్లు రాస్తూ పోతూ, వారిలో కనీసం ఒకరిద్దరు యుక్తాయుక్త విచక్షణ మరిచి వ్యవహరించారని కూడా అనుకుంటున్నాను.
    ఇది డెఫినెట్ గా ఒక ఆన్లైన్ లో రాసే వారికి ఒక గుణపాఠం. అలాగే పైన చెప్పినట్లు మహిళా సంఘాల వారు వీరు ఇప్పటికే క్షమాపణలు అడగడం జరిగింది కాబట్టి, వారి భవిష్యత్తు ని దృష్టి లో పెట్టుకుని ఏమైనా షరతులతో కూడిన చర్చకి తావిచ్చి ఇంతటితో వదిలేసే వెసులుబాటు కోసం ప్రయత్నిస్తే బాగుంటుందని నా అభిప్రాయం.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. కృష్ణ ప్రియ గారు ధన్యవాదాలు .. అయితే కేసు పెట్టిన వారు క్షమిస్తారో లేదో అది వారిష్టం కానీ నా అభిప్రాయం కుడా అదే .. కులం, మతం, ప్రాంతం , వంటి అంశాల పై కుడా కొందరి వాఖ్యలు కేసు కు యోగ్య మైన స్థాయిలో ఉంటున్నాయి . అవగాహన లేకనే అలా రాస్తున్నారు

      తొలగించండి
    2. క్రిష్ణప్రియగారు,

      నా అభిప్రాయం కూడా అదే, తాడేపల్లి ఒక్కరే మాట్లాడుకొంటున్నవి ఎవరూ పట్టించుకోలేదు. అతనివ్రాతలు ని చూసి వదిలేస్తే ఇంత సీరియస్ అయ్యేది కాదు. మొదట మీలానే చాలా బాధనిపించింది , జైలుశిక్ష బ్లాగర్లకి ఊహించడం కష్టం.

      తాడేపల్లి ఒక్కడే బ్లాగులనుండి అక్కడికి వెళ్ళలేదు, ఇక్కడ మనచుట్టూ ఉన్న అజ్నాతలే అక్కడా ఉన్నారు. సమస్యను పెద్దది చేసినది ఇటువంటి వారు కూడా. ప్రత్యక్షంగా కొందరు, పరోక్షంగా ఇంకొందరు. మొదట మీలానే చాలా బాధనిపించింది , జైలుశిక్ష బ్లాగర్లకి చాలా ఊహించడం కష్టం అనిపించింది . మహేష్ గారి టపా చూసినపుడు ఆత ను నిజంగా అంత పెద్ద తప్పు చెసిఉన్దకపొవచ్చెమొ అని చిన్న ఆశ ఉండేది. అందుకే తాడేపల్లి ప్రొఫైల్ కోసం ఫేస్బుక్ లోను,అప్పటివరకు నాకు అకవుంట్ లేని గూగుల్ప్లాస్ లోను వెదికాను కూడా. ఏం కనిపించలేదు.
      ఇప్పుడు వదిలేస్తే, ఇకముందు చాలా మందిని ఎదుర్కోవాల్సి వస్తుంది. అది చాలామందికి ప్రోత్సాహం అవుతుంది. కావాలో లేదో నిర్ణయించుకోవచ్చు.

      ఇప్పుడు పోనిలేమ్మని చెప్పడానికి ముందుకు వస్తున్నా ఎవరికైనా ఒక చిన్న మాట, సిరిసిరిమువ్వ గారి బ్లాగులో ఆయన భర్త సంపాదనలో నుండి డబ్బు ఆశించే స్త్రీలంతా వెలయాళ్ళు తో సమానం అవుతారు అని మూర్ఖ వాదన చేసినపుడు , అదే బ్లాగరు అదే వాదన కాకపొతే అప్పుడు పెళ్ళయిన వారిగురించి మాట్లాడాడు, ఇప్పుడు పెళ్ళికాని వారు , పిల్లల గురించి మాట్లాడాడు. అప్పుడు ఉన్నట్లే మవునం గా ఉండండి. లేదా మీకు అభ్యంతరం లేకపోతె వారిని పట్టి ఇస్తున్న టీం కి మద్దతు ఇవ్వండి. ఇది రిక్వెస్టు మాత్రమె.

      అదీ బుద్దామురలి గారు వ్రాసారు కాబట్టి చెప్పడం , లేదంటే మనకి మాట్లాడడానికి కూడా అవకాసం లేదు.

      తొలగించండి
  6. Murali gaaru,

    I do want these people get what they deserve, and not get away. What they did, is just not acceptable and a proper punishment will stop more people from doing the same thing. I disagree with the thought and symapthy wave that they got carried away and did these comments. These thoughts are not acceptable over any medium, however visible it is or not, and a fear through punishment will send a stronger message to people who has these thoughts.

    రిప్లయితొలగించండి
  7. మౌళి గారు ఈ అంశం పై ( అభ్యంతర కర మైన రాతల పై ) చర్చ జరగాలనే కోరుకుంటున్నాను. అందుకే ఆ అంశం పై రాశాను. వారికి మద్దతు ఇస్తున్నట్టుగానో, కేసు పెట్టన వారిని వ్యతిరేకిస్తున్నట్టు గానో బావించవద్దు ... వివాదం లో ఉన్న వారిలో ఒక్కరి పేరు తప్ప మిగిలిన వారి గురించి తెలియదు ( అంటే వారి రాతలు ఎప్పుడు చూడ లేదు ) ఆ ఒక్క వ్యక్తి పోస్ట్ లు కొన్ని చూశాను నచ్చ లేదు చదవడం మానేశాను. మహిళలను కించ పరిచే చర్యలే కాదు ..కొందరు కులం పేరు తో, ప్రాంతం, మతం పేరు తో ఇతరులను చాలా కించ పరిచే విధంగా కామెంట్స్ రాస్తున్నారు ... బ్లాగ్స్ లో ఎవరి భావాలూ వారు వ్యక్తం చేసుకోవచ్చు .. కానీ ఆ భావాలూ నచ్చని వారు కామెంట్స్ మరి అభ్యంతర కరంగా రాస్తున్నారు. బహుశ బ్లాగర్స్ అందరికి ఇది అనుభవమే అనుకుంటా ... ఈ సమస్య నాకు ఎదు రాయింది .. నా అభిప్రాయం అందరికి నచ్చ్లని లేదు. నచ్చ్క్లేదు అని కామెంట్ రాయ వచ్చు కానీ అభ్యంతర కరంగా మాటలు ఉపయోగించ వద్దు .... ఈ వివాదం వల్ల కామెంట్స్ రాసే వారిలో , పోస్ట్ లు రాసే వారిలో కొంత మార్పు వచ్చిందని, వస్తుందని అనుకుంటున్నాను. మీరు ఎకిభావించక పోవచ్చు కానీ నేను ఇప్పటికి నమ్ముతున్నాను .. అపర కిచకులు అని వారి ఫోటోలు చానల్స్ లో రావడం వల్ల వారి కుటుంబాల పై తీవ్ర ప్రభావం పడుతుంది. ఎవరి కైనా అవకాశం ఉంటె వారి కుటుంబ సభ్యులను కలిసి వివాదం పై వారి అభిప్రాయం తెలుసుకుంటే బాగుండు

    రిప్లయితొలగించండి
  8. మురళిగారు,

    వాళ్ళ ఇళ్ళల్లో స్త్రీలను కలవాలనుకోవడం పొరపాటు. వారికి ఏ సంబంధం లేదు. వాళ్ళని తలుచుకోవడం కూడా వదిలెయ్యండి.అపర కీచకులు అని ఇక్కడ పేరు వచ్చిందో లేదో తెలియదు కాని, మన పట్టణాలలో పక్కింటి వాళ్ళకే భయపదము.
    నేను మిమ్మల్ని అడిగినది ఒకటే, డిల్లీ వారికి కూడా పెద్దపెరే వచ్చింది, వారిని కూడా వదిలెయ్యొచ్చు. బహుసా వారు కూడా ఇలా ఉన్నత కుటుంబాల నుండి వస్తే మన ఆలోచనలు ఇలానే ఉండేవా ??? ఇంకా వీరిలా వారు ఉద్దేశ్యపూర్వక గా చెయ్యలేదు, తాగిన మత్తు, ఇంకా కొన్ని పరిస్థితులు.కావాలంటే మీ సానుభూతి అక్కడి రేపిస్ట్ లతో సమానం గా వీరిపై చూపండి సంతోషిస్తాను.

    ఫేస్బుక్ కేసులో వాళ్లకి నిజంగా శిక్ష పడలేదు ఇంకా, ఇప్పుడే ఇలా మాట్లాడడం న్యాయం కాదు. తప్పించుకోడానికి దేనికైనా తెగించగలరు వీళ్ళు, వీళ్ళకి మీ జాలి అవసరమా?? తప్పించుకొని వచ్చాక అంతకి అంతా తీర్చుకొంటారు . బ్లాగ్స్లో అది మామూలే. బ్లాగ్స్లో పడ తిట్టిన్చుకున్నవాళ్ళు కూడా ఆ గ్రూప్ లో ఉన్నారు. వాళ్ళని అరెస్ట్ 'చేసి' ఉండకపోవచ్చు కూడా.(ఈ చివరి వాక్యం లో క్లూ ఉంది )

    శిక్షించినా లేకున్నా వారివల్ల ముందు ముందు ఉన్న ప్రమాదం దాటిపోలేదు, ఇప్పుడు భయపడుతున్నారు అని మీరు ఎవరిని అనుకొంతున్నారో అది తాత్కాలికమే, వీళ్ళు బయట పడేవరకే !అందుకే ఈ అంశం పై సీరియస్ గా మనసులో ఉన్నది చెప్పడానికి ఎవరైనా భయపడుతారు. మీరు ముందు ఈ టపా తీసెయ్యండి, లేకుంటే మాలాంటి వాళ్ళు బలి :)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. మౌళి గారు దిల్హి రేపిస్తులను ఉరి తీయాలని దేశం లోని కోట్లాది మంది నినదించారు .. క్కొన్ని లక్షల మది దేశ వ్యాప్తంగా ఆందోళన చేసిన అంశం ఇదే .. కోట్ల మది డిమాండ్ చేశారు కదా అని దానికి తగినట్టు శిక్ష వేయరు .. కొన్ని అత్యాచారాలపై పత్రికల్లో ఏదో ములకు కనిపించి కనిపించ కుడా వార్త వస్తుంది .. అయితే చట్టం ప్రకారం అత్యాచారానికి యంత శిక్ష వేయాలో అంతే వేస్తారు .. మీడియాలో హైలెట్ కానీ కేసునో తక్కువ, ఢిల్లీ కేసులో ఎక్కు వ శిక్ష అని ఉండదు .. మన సిమండ్ తో, మన సానుభూతి , మన వ్యతితెకతతో కోర్టుకు సంబంధం ఉండదు .. ఈ వివాదం లో కుడా అంతే మనం ఎలా స్పందిస్తున్నాము అనే దానితో కొరతకు సంబంధం లేదు .. చట్టం ఏ తప్పుకు ఏ శిక్ష విధించాలో అంతే చూస్తుంది . ika kesullu vari kulam yemiti ani kudaa chattam chudadu .

      తొలగించండి
  9. @ ఈ వివాదం వల్ల కామెంట్స్ రాసే వారిలో , పోస్ట్ లు రాసే వారిలో కొంత మార్పు వచ్చిందని, వస్తుందని అనుకుంటున్నాను.

    ఇలా జరుగలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ వ్యాఖ్య వ్రాయడం కి ముందే అజ్నాతలుగా వచ్చి ఇంకొక బ్లాగ్లో బెదిరించడం చూసాను. ఏది మారదు , ఇక్కడి వారెవరికి రిస్క్ తీసికోగలిగే టైం లేదు.
    నేను చెపుతున్నది కూడా అదేనండీ శిక్ష పడాలా లేదా అన్నది మనం జడ్జ్ చెయ్యకూడదు. లేదా కోరుకోకూడదు. నిజానికి తప్పించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చ్చు.

    రిప్లయితొలగించండి
  10. Two held for lewd FB posts

    http://www.thehindu.com/news/cities/Hyderabad/two-held-for-lewd-fb-posts/article4358164.ece

    రిప్లయితొలగించండి
  11. >> "నిజంగా చెప్పాలంటే, చాలా చాలా మంది ఇంతకన్నా ఘోరమైన అభిప్రాయాలతో ఉండి ఉండవచ్చు. గోముఖ వ్యాఘ్రాల్లా ప్రవర్తించావచ్చు. ఇంతకన్నా నిరంకుశ ధోరణి లో మాట్లాడా వచ్చు.
    మన ఇంటి లోపలి వైపు గోడల మీద ఏం రాసుకుంటామూ అనేది ఎవరికీ తెలియాల్సిన పని లేదు.
    కానీ పది మంది చదివేట్లు మన గోడల మీద ఈ విధంగా రాయడం తప్పే. ఇదంతా వారు, ఇంత పర్యవసానం ఊహించక చేసిన చర్య గా నేను భావిస్తున్నాను."

    I am surprised !!! What is intended to be conveyed here ??

    రిప్లయితొలగించండి
  12. క్రిష్ణప్రియగారు,

    >>"మన ఇంటి లోపలి వైపు గోడల మీద ఏం రాసుకుంటామూ అనేది ఎవరికీ తెలియాల్సిన పని లేదు. కానీ పది మంది చదివేట్లు మన గోడల మీద ఈ విధంగా రాయడం తప్పే."

    Your comment sounds as if being public about those offending thoughts is the only abhorring thing in this !!

    Your comment sounds as if its OK to have thoughts such as the ones pronounced by the individuals in question as long as they are on మన ఇంటి లోపలి వైపు గోడలు ?

    Can you please clarify whether their thoughts on different sections of the society are acceptable when they are written on ఇంటి లోపలి వైపు గోడలు ?

    I know you do not think it is OK to have such thoughts. That is the reason why I am making it more explicit here so that people won't misunderstand your comment.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. http://www.un.org/en/documents/udhr/index.shtml
      Article 19.

      Everyone has the right to freedom of opinion and expression; this right includes freedom to hold opinions without interference and to seek, receive and impart information and ideas through any media and regardless of frontiers.

      In My view,If its not publicly published Its OK to have that opinion. even if it is morally or legally wrong opinion in ACTION.

      తొలగించండి
    2. సాధారణ పౌరుడు,

      I am not advising any thought policing here. I am just clarifying a matter of taste. I totally agree with you that expression of opinions and actions there of which result in something are the ones that are subject to the Law. For what one thinks in his mind no body can police it and should not.

      I am actually expressing my concern about those opinions, when expressed and supported in a closed group even when they are not public. That legally can become an illegal group or association of people which is plotting against the state.

      తొలగించండి
    3. Since you mentioned Article 19, let me provide the reference to Clause 2 of Article 19 which specifies the reasonable restrictions on Freedom of Speech and Expression of clause 1 a:

      Nothing in sub-clause (a) of clause (1) shall affect
      the operation of any existing law, or prevent the State
      from making any law, in so far as such law imposes
      reasonable restrictions on the exercise of the right
      conferred by the said sub-clause in the interests of the
      sovereignty and integrity of India, the security of the
      State, friendly relations with foreign States, public order, decency or morality, or in relation to contempt of court, defamation or incitement to an offence.

      తొలగించండి
    4. its not our article 19, incidentally its 19 also in UN space. and India also one of the nation which agreed and signed on them. please check the link.
      http://www.un.org/en/documents/udhr/index.shtml

      తొలగించండి
    5. one more link from our NHRC, the same content its having from UN
      http://nhrc.nic.in/documents/UDHR_Eng.pdf

      తొలగించండి
    6. True India is a signatory to UDHR. Anyway, our Article 19 and UDHR 19 are not different.

      Please note that I am not saying that anybody is punishable for their thoughts. You can have your thoughts and can think on them as per your reason. You can only act as per the law of the land.

      What I was mentioning is, certain objectionable stuff are not permitted to be spread even if none of the audience object to them. As simple as we can not sit together in our home and plan a big crime. If we do that we can not claim immunity from the fact that we haven't acted on it. If the prosecution establishes the content of our discussion as objectionable then we got to be accountable.

      For your reference I a not talking about one of those orwellian horrors of thought policing :)

      తొలగించండి
    7. సాధారణ పౌరుడు,

      As an aside to the discussion, Even in the case of UDHR 19 and our 19 being contradictory, Our 19 takes precedence until we amend it in view of international commitment.

      తొలగించండి
    8. @WP,

      >>>>I know you do not think it is OK to have such thoughts. That is the reason why I am making it more explicit here so that people won't misunderstand your comment.

      Thanks. Probably I did not express myself well. Yes. I don't endorse their thoughts/comments, and I am not ok, if people write horrible things inside their home and pure 'ధర్మ పన్నాలు' on external walls.

      I thought in my next sentence I had clarified how I felt about the comments.

      నా ఉద్దేశ్యం ..మనసులో లేకపోయినా సభ్య సమాజం లో మాట్లాడుతున్నప్పుడు కనీస మర్యాద అవసరం అని మాత్రమే. మనసులో చెత్త ఉంటే పర్వాలేదు. పైకి మాత్రమే బాగుండాలని కాదు.

      Again,..Thanks for the comment

      తొలగించండి
    9. Hi, coming to 66a,

      http://deity.gov.in/sites/upload_files/dit/files/downloads/itact2000/it_amendment_act2008.pdf

      all those who are uploading the ACCUSED also punishable as they have uploaded for maligning him(not to praise him ;-)). every commenter of Malicious content on them is punishable. if the person feels offensive :-)

      66A(a) says "any information that is grossly offensive" is punishable

      interestingly 66E prohibits screen capture of private area :-)

      తొలగించండి
  13. In my personal opinion, I DO NOT prefer a punishment which will ruin their life. Since the message is out clearly and everyone is served with the notice to be responsible, other offenders from here can be punished as per the law.

    By being the first ones to be reached by the long arm of the law, I would prefer these guys to be let off in this case with a moderate warning and may be with whatever other acceptable forms of warnings.

    Not because of their future or because of their near and dear ones who might be already suffering for no fault of theirs. My heart goes out to them. But alas, those two reasons can be applied to any criminal in this world.

    But my reason for being lenient to these guys is different.

    We all (The general and Blog society) have a part in this along with the offenders. We are the ones who created them. We are the ones who are passively encouraging them just because they are doing dirty things in support of our causes sometimes. We the society has created an atmosphere so far that people started believing that these things are small and they can get away with these things. We all have a stake in this crime. No point in shifting the responsibility to those 6 guys only.

    My second reason is, I want realization in people. I want people to abide by the law out of respect and as a way of life. Not out of fear. Mind you NOT OUT of FEAR. Without thinking and driven by fear we all might actually end up being very cautious in public and cruel with in our walls (మన ఇంటి గోడలు). We want an active society online or real with disagreements and discussions with out disrespect or show of might numerical or whatever.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. @But alas, those two reasons can be applied to any criminal in this world.

      I feel the same.


      But can you be confident that non of them will not create different profile and come back. I have 100% trust on tadepally in this but others , I am not sure.


      @We are the ones who created them.

      Agree with this to an extent as many of us never bothered to object ( i know they never listened to us but still the opposed count was not enough to make feel to stop)

      so before excusing them, every one of us to confirm that we make sure to object any non-sence in the blogs or other social media.

      @I want people to abide by the law out of respect and as a way of life.

      sure, very sensitive point. but how can you makesure some of them will get the realisation (again I am not including tadepally here , but for the rest )


      @We want an active society online or real with disagreements and discussions with out disrespect or show of

      Agreed, actually I want to tell the same thing here, few bloggers are happy that they get good anonymous comments. that is fine, but they should question themselves why the anonymous is not sending those view by email (if available) or writing with actual profile. it is more related with specific blog owner than to topic, or commenter.


      @మన ఇంటి గోడలు

      this comment actually written with lot of compromise, as any one write the opinions in other way , they will be targeted here. every one thinks of their own children needs before disclosing their own views, so they tend to write some thing which is not really in their mind.

      who is going to give support, if the original commenter writes what they really think.

      తొలగించండి
    2. @Mauli,

      >>>>this comment actually written with lot of compromise, as any one write the opinions in other way , they will be targeted here. every one thinks of their own children needs before disclosing their own views, so they tend to write some thing which is not really in their mind.

      who is going to give support, if the original commenter writes what they really think.


      :) Thanks. పైన చెప్పినట్లు, 'మనసులో ఏమున్నా కనీసం పబ్లిక్ డొమెయిన్ లో మాట్లాడేటప్పుడు జాగ్రత్త గా మాట్లాడాలని. Yes. In a way, it was written with a lot of compromise. I did not want to address the content of their writings and judge the commenters further. We all already know who they are and what their thoughts are like.

      తొలగించండి
  14. One more point I want to tell the blog world is... The above comment and line of thinking is what has driven me to write the following post a while ago:

    http://weekend-politician.blogspot.in/2010/08/blog-post_31.html

    There were 10 posts ridiculing my post. There are very close and trusted friends whom I thought are sharing my thoughts who almost boycotted my blog for almost an year out of fear or their own desires to be nice and happy.

    Most of the people who tried to deflect the intent of the post and who tried to show their numerical strength on me can revisit the above post. Perhaps the post may help them realize things better now than at that time.

    రిప్లయితొలగించండి
  15. మళ్ళీ ఒక సారి మౌళి గారి వ్యాఖ్యలలో కొన్ని ముఖ్యమైన అభిప్రాయాలని అభినందించాలనిపిస్తోంది.
    బహుశా కృష్ణప్రియ మాటలలోని అర్థం ఇలా పైకి మాట్లాడే వారికన్నా తేనె పూసిన కత్తుల్లా వ్యవహరించే వారు ఉంటారు. దొరికిన వాళ్ళే దొంగ అని వీరి గురించి మాత్రం గొడవ చేసి విజయం సాధించినట్లు అనుకుంటే సరిపోదు అని అనుకుంటాను. నాకు అనిపించింది అది. తన ఉద్దేశ్యం తనే స్పష్టపరచగలదు.
    అసభ్యంగా వ్రాయడం అన్నది వ్యతిరేకించవలసిన విషయమే. కనీసం ప్రోత్సహించకూడని విషయం.
    బ్లాగు మొదలు పెట్టిన కొత్తల్లోనే నేను అజ్ఞాతల అసభ్య పదజాలానికి అదే భాషలో సమాధానం ఇవ్వడం పట్ల వ్యతిరేకతని తెలిపాను. అది కూడా ఒకటికి బదులు రెండు సార్లు చెప్పడం మంచిది కాదని అర్థమైపోయింది. అసలు జవాబివ్వకపోవడంకంటే ఉత్తమం ఇంకొకటి లేదు. నీహారిక అనే పేరుతో వ్రాసే బ్లాగరుని, ఆమె రాముడి గురించి సీతమ్మవారి గురించి అసభ్యంగా ఏదో అన్నారని చెప్పి ఇక చండాలమైన వ్యాఖ్యలతో నింపేశారు కదా అగ్రిగేటర్లని! ఆప్పుడూ బాధ వ్యక్తం చేశాను. ఒకరు చెడ్డ మాటన్నారు అని వంక పెట్టుకుని ఇక వర్సగా అసభ్యంగా వ్యాఖ్యలు వ్రాస్తుంటే దానిని ఏమనాలి?
    ఈనాడు ఫేస్‌బుక్‌లో ఏం జరిగిందో నాకు తెలియదు. కానీ దానికి సంబంధించిన టపాలు చదవడం వల్ల తెలిసినంత మటుకు ఆ ప్రవర్తనకి సరైన ప్రతిచర్యే జరిగిందని అనిపిస్తోంది. ఏ విషయం గురించైనా రెండు వైపులనుంచీ మాట్లాడే వాళ్ళూ ఉంటారు అన్నది బాగా అర్థమౌతోంది. ఢిల్లీ సంఘటననుంచీ ఈ గొడవ దాకా, ఒకరు పట్టుబడ్డారని శిక్షిస్తే ఏమిటి అనే వారు ఉంటున్నారు. పట్టుబడని వారి గురించి ఏమిటని ప్రశ్నించడం సబబే. ఐతే దొరికిన వారిని దండించవద్దు అంటారా? వీరిని దండిస్తున్నాం కనుక మిగిలిన విషయాలలోనూ ఉత్సాహం చూపించండి, ఇటువంటి విషాన్ని వెతికి పట్టుకుని ఖండించండి అనాలి అందరూ. తప్పు తప్పే. దండిస్తే మార్పు వస్తుందా అంటే చెప్పలేము. దండించకపోవడం మాత్రం తప్పు. ఖండించకపోవడం తప్పు. ప్రోత్సహించడం తప్పు. మౌళి గారి వ్యాఖ్యలలో కొన్ని మాటలు నాకు చాలా సరైనవిగా తోచాయి. అవి ఇక్కడ కోట్ చేస్తున్నాను.

    "టీవీల్లో ఫోటో లవల్ల వాళ్లకి పెద్దగా నష్టంలేదు,, ఇది కేవలం కక్ష సాధింపు, వారు మాట్లాడినవి కేవలం పచ్చ్చి నిజాలు అని కుటుంబ సభ్యులకి వాళ్ళు చెప్పుకోగలరు."
    "వాళ్ళ ఇళ్ళల్లో చాలా ఈజీగా తీసికోనేలా ఈ నిందితులు మాట్లాడగలరు, అదీ కాక యెంత తప్పు చేస్తే మాత్రం ఎవరి వాళ్ళని వాళ్ళు పోగొట్టుకోవడం జరగదు. జరగాలని మనం కోరుకోము. కాబట్టి ఆ మహిళలని గురించి మనం మాట్లాడుకోకూడదు."
    "@ ఈ వివాదం వల్ల కామెంట్స్ రాసే వారిలో , పోస్ట్ లు రాసే వారిలో కొంత మార్పు వచ్చిందని, వస్తుందని అనుకుంటున్నాను.

    ఇలా జరుగలేదు అని చెప్పడానికి విచారిస్తున్నాను. ఈ వ్యాఖ్య వ్రాయడం కి ముందే అజ్నాతలుగా వచ్చి ఇంకొక బ్లాగ్లో బెదిరించడం చూసాను. ఏది మారదు , ఇక్కడి వారెవరికి రిస్క్ తీసికోగలిగే టైం లేదు.
    నేను చెపుతున్నది కూడా అదేనండీ శిక్ష పడాలా లేదా అన్నది మనం జడ్జ్ చెయ్యకూడదు. లేదా కోరుకోకూడదు. నిజానికి తప్పించుకోవడం పెద్ద కష్టం కాకపోవచ్చ్చు."
    "వాళ్ళ ఇళ్ళల్లో స్త్రీలను కలవాలనుకోవడం పొరపాటు. వారికి ఏ సంబంధం లేదు. వాళ్ళని తలుచుకోవడం కూడా వదిలెయ్యండి."
    "ఫేస్బుక్ కేసులో వాళ్లకి నిజంగా శిక్ష పడలేదు ఇంకా, ఇప్పుడే ఇలా మాట్లాడడం న్యాయం కాదు. తప్పించుకోడానికి దేనికైనా తెగించగలరు వీళ్ళు, వీళ్ళకి మీ జాలి అవసరమా?? తప్పించుకొని వచ్చాక అంతకి అంతా తీర్చుకొంటారు . "
    "శిక్షించినా లేకున్నా వారివల్ల ముందు ముందు ఉన్న ప్రమాదం దాటిపోలేదు, ఇప్పుడు భయపడుతున్నారు అని మీరు ఎవరిని అనుకొంతున్నారో అది తాత్కాలికమే, వీళ్ళు బయట పడేవరకే !అందుకే ఈ అంశం పై సీరియస్ గా మనసులో ఉన్నది చెప్పడానికి ఎవరైనా భయపడుతారు."
    ఇవన్నీ ఆలోచించవలసిన విషయాలు. ఒకప్పుడు తెలిసేవి కాదు కానీ కొన్ని మనస్తత్వాలు ఇలానే ఉంటాయని తెలిశాక హెచ్చరించాలనిపిస్తుంది.
    ఇంట్లో కానీ బయట కానీ ఇటువంటి ధోరణి మంచిది కాదు.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు

    1. లలితా,

      >>>>బహుశా కృష్ణప్రియ మాటలలోని అర్థం ఇలా పైకి మాట్లాడే వారికన్నా తేనె పూసిన కత్తుల్లా వ్యవహరించే వారు ఉంటారు. దొరికిన వాళ్ళే దొంగ అని వీరి గురించి మాత్రం గొడవ చేసి విజయం సాధించినట్లు అనుకుంటే సరిపోదు అని అనుకుంటాను. నాకు అనిపించింది అది. తన ఉద్దేశ్యం తనే స్పష్టపరచగలదు>>>

      కరెక్ట్..

      >>>>ఇంట్లో కానీ బయట కానీ ఇటువంటి ధోరణి మంచిది కాదు.

      డబల్ కరెక్ట్..

      తొలగించండి
  16. లలిత గారు,


    ఫేస్బుక్ గురించిన ఈ టాపిక్ బ్లాగ్స్ లో మాట్లాడొద్దని ముందు అనుకొన్నాను. కాని ఆ గ్రూపులో ఒక వ్యక్తీ వ్యాఖ్యలు చూసి మాట్లాడక తప్పని సరి అయింది.

    ఇంతకు ముందు ఒకరు ఇదే వ్రాస్తే, హారం లో ఫిల్టర్ చేసి అడగడం వల్ల , అప్పటితో అలాంటివి ఆగిపోవాల్సినది, కాని ఇంకోసారి అలా పట్టుబడకుండా, ఇప్పుడు అభ్యంతరకరమైన వ్యాఖ్యలు అన్నీ అజ్ఞాత గానే వ్రాస్తూ క్రింద పేర్లు మాత్రమె వ్రాస్తున్నారు.

    అంటే విషం చిమ్మే వారి వ్యాఖ్యలు ఒకేవ్యక్తి వి అయినా ఫిల్టర్ కావు.

    అంటే వీరు కాని, మిగిలినవారు కాని ఈ సారి పట్టుబడకుండా మాట్లాడడానికి ప్రయత్నిస్తారు కాని ఆగరు. పైన వీకెండ్ గారు అన్నట్లు వారికే మారాలి అనిపిస్తే తప్ప మారరు. ఇది ఒక్కటే ఇబ్బంది పెడుతున్నది. దీనివల్లనే గత కొన్ని వారాలుగా అజ్ఞాత వ్యాఖ్యలు పై, అలా చేసే వీలు ఉన్న ఒక పెద్ద బ్లాగులోను కలిపి ప్రశ్నిస్తున్నాను. అది కాక అజ్నాతల మధ్య మాట్లాడి నేర్చుకోనేది సూన్యం కాబట్టి కూడా ఈ ప్రయత్నం.

    ఇప్పుడు మరల ఈ వ్యాఖ్య చూస్తున్న అందరినీ ఒకసారి రిక్వెస్ట్ చేస్తున్నాను, మీ బ్లాగు కు అజ్ఞాత వ్యాఖ్యలు అవసరమో లేదో సరి చూసుకోవాలని మనవి.ఇప్పటికే డాక్టర్. రమణ గారు అజ్ఞాత వ్యాఖ్యల ఆప్షన్ తీసివేసి ఒక మంచి మార్పుకు ఆహ్వానం పలికారు.

    మీరంతా ఇదే పని చెయ్యడం , ఇప్పుడు జరుగుతున్న సమస్యలను ఖండించడంతో సమానం అని భావిస్తున్నాను. ఆ పై మీ ఇష్టం.

    ముఖ్యంగా రోజుకు పది టపాలు ఉండే చోట ఇది మరీ పెద్ద సమస్య. ఇన్నాళ్ళు చాలా తక్కువ అజ్ఞాత వ్యాఖ్యలు ఉండేవి. ఎవరైనా వారి అభిప్రాయం మొహమాటపడకుండా చెప్పే విధంగా మీ బ్లాగు లేకపోతె పొరపాటు వ్యాఖ్యాతది కాదు, బ్లాగరుదే అవ్వాలి.

    రిప్లయితొలగించండి
  17. తాడేపల్లి లలితా బాలసుబ్రమణ్యం మరియు, అతడి గ్రూప్ పై ప్రస్తుతం తీసుకుంటున్న చర్యకు కొంత చరిత్ర ఉంది . వీరి ప్రమాదకర భావజాలాలకు ఒక స్త్ర్హి,దళిత,వ్యతిరేక భావజాల నేపధ్యం ఉంది. పోరాటం ఆ భావజాలంపైన.వ్యక్తుల పైన కాదు అని గుర్తుంచుకోవాలి .... స్త్రీలను, దళితులను,పేదలను, మైనారిటీలనూ అణగదొక్కాలి అనుకునే పురుషాహంకార ,కుల,మత దురహంకారాన్ని ఎవ్వరూ క్షమించ కూడదు ..ఇక్కడా వ్యక్తీ స్వాతంత్రం ,పౌర హక్కులు అని ఆలోచించాల్సిన అవసరం లేదు,ఎందుకు అంటే, ఇది ఒక వ్యక్తికి సంబంధించిన విషయం కాదు,...ఏదో తెలిసి తెలియని వయసులో ఉన్న వాళ్ళు మాట్లాడింది కాదు ..లేదా ఏదో ఆవేశం లో మాట్లాడింది కాదు ..ఒక ప్రమాదకరమైన భావజాలం ఇది ...నేను చూసాను,వాళ్ళ రాతల్లో అంబేత్కర్ పని పాటా లేకుండా రాసిన చిత్తు పుస్తకం మన రాజ్యాంగం అని వ్యాఖ్యానించటం.. ఇలాంటి కుసంస్కార మనస్తత్వం క్షమార్హం కాదు ....అసలు వీళ్ళు అసభ్యం గా మాట్లాదంది ఎవరిని అభ్యుదయ రచయతలను తిడతారు ,స్త్రీ వాదులను నీచం గా మాట్లాడేవాళ్ళు పేదలు మనుషులే కాదన్నట్టు వ్యాఖ్యలు చేస్తారు ... స్లమ్ ఏరియా లో బ్రతికే పేదల గురించి వీళ్ళ వ్యాఖ్యానాలు ఎవరికీ ఆమోదయోగ్యం కాదు, కాకూడదు ...ఈ గ్యాంగ్ భావజాలాన్నిఏ రాజకీయ పార్టీ కుడా సపోర్ట్ చెయ్యకూడదు...వీళ్ళతో ఉండి వీళ్ళని ఇన్ని రోజులూ ఎంకరేజ్ చేసిన వాళ్ళు కూడా ఒకసారి ఆలోచించుకోండి .....మంచి ఆలోచనలతో మంచి భావాలతో భారత దేశాన్ని నిలబెట్టాల్సిన భాద్యత మనందరి కి ఉంది .... చదువు ఉంటే సరి కాదు, మనిషికి సౌజన్యం ఉండాలి ...సాటి మనుషులను కనీసం మనుషులుగా చూడగలిగే సంస్కారం ఉండాలి ..తప్పుడు భావజాలం వ్యాప్తి చేస్తున్నారు వీళ్ళు క్షమార్హులు కాదు .

    రిప్లయితొలగించండి
  18. ఇక లలితా బాల సుబ్రహ్మణ్యం గ్యాంగ్ సంగతి చట్టం చూసుకుంటుంది ....
    మనం కాసేపు ఆ విషయం పక్కన పెట్టి, కొన్ని నిజాలు మాట్లాడుకుందాం ...

    నేను అడిగేవాటికి మీకు కోపం వచ్చినా ఆలోచించక తప్పదు ...

    మీలో చాలా మంది వాళ్ళ ఎఫ్ .బి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవాళ్ళే కదా !

    మనం వాళ్ళని ఇప్పుడు ఇన్ని తిడుతున్నాం కదా !

    ఎప్పుడు అయినా హద్దు మీరుతున్నారు అని వాళ్ళని హెచ్చరించారా ?

    కనీసం అభ్యంతరకర వ్యాఖ్యలు చేస్తుంటే అడ్డుకున్నారా ?

    పోనీ వాళ్ళ, రాతలు బాగా లేవని వాళ్ళని డిలిట్ చేసారా ?

    డిలిట్ చేసిన వాళ్ళు ,వాళ్ళ తప్పు ఏంటో అందరికి తెలిసేలా చెప్పారా?

    ఈ రోజు, చెంగు బిగించుకుని కాళిని, భద్రకాళిని అని కొంగు బిగించి కొడవళ్ళు పట్టుకుంటున్నకొంత మంది అమ్మలు చాలా మంది, నిన్న,మొన్నటి దాకా వాళ్ళతో చేరి సాటి ఆడవాళ్ళని వెటకరించిన వాళ్ళు కాదా ? అలా భజన చేసిన వాళ్ళూ దొంగలూ ,దొంగలూ అని అరుస్తున్నారే ?మీకు ఇలా ఈ రోజు తిట్టే హక్కు ఉందా ?

    వాళ్లకి చప్పట్లు కొట్టిన అమ్మలూ ,భజన చేసిన,భక్తిపరులూ లేరూ ?

    ముందే వారి స్నేహితులుగా వాళ్ళని ఇది తగదూ అని హెచ్చరించి ఉంటే,
    ఇప్పుడు ఇంతమంది కత్తులు నూరాల్సిన అవసరం వచ్చేది కాదేమో కదా ?

    మరి ఇన్ని సంవత్శరాల నుంచి ఈ సోషల్ నెట్ వర్క్ పవిత్రం గా ఉందా ?
    ఇలాంటి అసభ్య సంభాషణలు ఎప్పుడూ మీ దృష్టికి రాలేదా ?
    వచ్చే ఉంటాయి కదా ! మరి ఎందుకు తలలు తిప్పుకుని వెళ్ళిపోయారు ?

    వ్యక్తి గా మనం రేపు ఉండక పోవచ్చు....కానీ సంఘం శాశ్వితం..

    ఈ వ్యవస్థని ఆరోగ్యంకరంగా ఉంచుకోవలసిన బాధ్యత మన అందరిపైనా ఉంది ..కదా !

    (ఇన్ని ప్రశ్నలు వేశానని నన్ను తిట్టుకోకండి ఆలోచించండి)

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. Questions are good..

      మీలో చాలా మంది వాళ్ళ ఎఫ్ .బి ఫ్రెండ్స్ లిస్టు లో ఉన్నవాళ్ళే కదా !
      This is a completely uninformed assumption.

      తొలగించండి
    2. @ ప్రియ గారు,
      మీ ప్రశ్నలు బాగున్నాయి.
      బహుశా ముఖ్యం గా ఈ ప్రశ్నలు వేసింది తాడేపల్లి గారి ప్లస్, ఫేస్ బుక్ స్నేహితులని,ఆయన రాతలని ముందు నుంచీ చదివీ అభ్యంతరం పెట్టని వాళ్లని అననుకుంటున్నాను. ఈ చర్చ లో పాల్గొన్న వారు ఆయన రాతలని ముందు నుంచీ చదివి తల తిప్పుకుని పోయిన వారు అని అనుకుంటున్నారా?
      లేక జనరల్ గా ఈ బ్లాగు చదివే వారినందరినీ అడుగుతున్నారా?
      అలాగే ఈ క్రింది ప్రశ్నలు జెనరల్ గా అందర్నీ అడిగినట్లున్నారు.
      <<<>>>

      మంచిదే. ఒప్పుకుంటున్నాను.

      ఈ ప్రశ్నలు మాత్రం ఎవరినడిగారో కాంటెక్స్ట్ అస్సలూ అర్థం కాలేదు...
      <<<< ఈ రోజు, చెంగు బిగించుకుని కాళిని, భద్రకాళిని అని కొంగు బిగించి కొడవళ్ళు పట్టుకుంటున్నకొంత మంది అమ్మలు చాలా మంది, నిన్న,మొన్నటి దాకా వాళ్ళతో చేరి సాటి ఆడవాళ్ళని వెటకరించిన వాళ్ళు కాదా ? అలా భజన చేసిన వాళ్ళూ దొంగలూ ,దొంగలూ అని అరుస్తున్నారే ?మీకు ఇలా ఈ రోజు తిట్టే హక్కు ఉందా ?>>>>
      ఎవరు అలాగ కాళి..భద్రకాళి... అని కొడవళ్లు పట్టుకుని దొంగలు, దొంగలు అని అరుస్తున్నారు? తాడేపల్లి గారిని తిడుతున్న వాళ్ల గురించా? లేక..
      ఈ విధమైన నేరాలు (తక్కువో,ఎక్కువో డిగ్రీ ల్లో ఎంతోమంది ఎన్నో అంశాల మీద లూస్ టాక్) చేస్తున్నప్పటికీ మొదటి సారి చట్టం చేతికి చిక్కారు..కాబట్టి moderate punishment తో వదిలితే అందరికీ అదొక వార్నింగ్ గా ఉంటుంది అని అభిప్రాయం వెలిబుచ్చిన వారినా?
      ఈ బ్లాగు టపా కానీ, ఇక్క వ్యాఖ్యలు కానీ తిడుతున్నట్టు, అరుస్తున్నట్టు మీకు అనిపిస్తుందా?

      తొలగించండి
  19. ప్రియ కారుమంచి గారు,

    మీరు అసలు ఈ పోస్టు గానీ ఇందులో జరుగుతున్న చర్చను గానీ చదవకుండానే మీ ఊహల ఆధారంగా ప్రశ్నలు వేశారనిపిస్తుందండీ !

    మీరు అడిగినవి మంచి ప్రశ్నలే వాటికి సమాధానాలు ఆలోచించుకోవలసిన వాళ్ళు కొంతమంది ఉండొచ్చు. కానీ మీరు ఇక్కడ చర్చలో మీరు అని ఎవరిని అంటున్నారు ? ఇక్కడ చర్చలో పాల్గొన్న వాళ్ళ గురించి మీకు తెసుసా ?

    చాలాసార్లు మనమేదైనా ఒక మంచి పని చెయగానే ఎందుకనో ఆ ఉత్సాహంలో ఆవిషయం మీద మాట్లాడటానికి గానీ, లేదా విశ్లేషణ చెయ్యడానికి గానీ మనకి మాత్రమే హక్కు ఉన్నట్టూ, మిగిన వాళ్ళెవ్వరూ మనలా చెయ్యలేదు (????) కాబట్టి వారెవరికీ నైతికంగా ఆ హక్కు లేనట్టూ ఫీలయ్యే బలహీనతకి లోనవుతుంటాం.

    హద్దులు మీరుతున్న కుసంస్కారాన్ని మీరు ఎదిరించినందుకూ, శ్రమ తీసుకొని అందరి తరపునా పోరాడినందుకూ మిమ్మల్ని అభినందిస్తున్నాం.

    రిప్లయితొలగించండి
  20. అభ్యంతర కర మైన రాతలు రాసినదుకు పొలిసు కేసు .. వివాదం అంత వరకే నాకు తెలుసు .. సామజిక మాధ్యమాల్లో గ్రూపులు ఉన్నాయని తెలుసు కానీ ఎవరే గ్రూపు ? ఏ గ్రూపు లక్షలు, విధానాలు ఏమిటి వివరంగా తెలియదు తప్పుడు రాతలు ఎవరు రాసినా తప్పే .. బ్లాగ్స్ లో నాకు నచ్చని రాతలు ఎన్నో కనిపించాయి . వాటిని పట్టించుకోక పోవడమే నేను చేసే పని. ఏ వారైనా ఖండిస్తే సంతోషం .. అంతే తప్ప నేను ఖండించక నువ్వు వచ్చ్వేమిటి ... నా కన్నా ముందు నువ్వు ఎందుకు ఖండించలేదు అనే ప్రశ్న yem cheppagalam ... కొన్ని బ్లాగ్స్ కేవలం కుల అభిమానం తో, కుల వ్యతితెకతతో ఉన్నాయి .. అలానే ఒక ప్రాంతం అంటేనే చులకన భావం చూపుతూ దాని కోసమే బ్లాగ్స్ రాస్తున్న వారు ఉన్నారు ... నేను పేస్ బుక్ చూసేది తక్కువ. గూగుల్ + లో నేను ఆడ్ చేసుకున్న వాళ్ళు నన్ను యాడ్ చేసుకున్న వాళ్ళు 500 మంది వరకు ఉంటారు .వారి గుణ గనల గురించి నిరంతరం పరిశీలించే అవకాశం నాకు ఉండదు, నా గురించి పరిశీలించే అవకాశం వారికీ ఉండదు.జాబితాలో ఉన్నంత మాత్రాన వారి అభిప్రాయాలను మనం ఎకిభావిస్తున్నట్టు కాదు

    రిప్లయితొలగించండి
  21. @All

    నాకు తెలిసి ఈ ప్రశ్నలు ఈ టపాకు కాని, ఇక్కడి వ్యాఖ్యాతలకు కాని సంబందిన్చ్చినవి కాదు. ప్రియగారికి బ్లాగులు యెంత పరిచయమో నాకు తెలియదు.చాలా జెనెరిక్ ప్రశ్నలు. ముందు ఫేస్బుక్ లో వారి ప్రశ్నలు చూసి నేను ప్రజ లో ఉంచాను కూడా.

    రిప్లయితొలగించండి
  22. Mouli Gaaru,

    I do not think you are the spokes person for her. Are you speaking on her behalf and on her instructions ? OR are you just telling your opinion ?

    Its better to let her clarify.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. లేదండీ, కృష్ణప్రియ గారి వ్యాఖ్య చూసి ఇబ్బంది పడ్డారని చెప్పాను.

      తొలగించండి
  23. ప్రియగారు,

    ఫేస్ బుక్ లో లేదా ప్లస్సు లో మీరన్నట్లు ఉండి ఉండొచ్చు , కాని బ్లాగ్స్ లో వారి తో ఇంతకుముందు ఉన్నవారంతా మవునం గానే ఉన్నారు. వారిని ఇబ్బంది పెట్టాలని కూడా ఇక్కడ ఎవరు అనుకోవడం లేదు. వారి స్నేహితుడు/లు పై కేసు పెట్టబడడం వారికి తప్పకుండా బాధ కలిగిస్తుంది. జగన్ పై పెట్టిన కేసు వల్ల కూడా బాధ పడే అభిమానులు ఉంటారు.

    ఇక మీరన్న వారి భావజాలానికి సంబంధించిన వివరాలు కూడా ఆ చర్చలలో ముఖ్య విషయాలుగా నే ఉన్నాయి కాబట్టి, కాదని అనడం లేదు. ఫేస్బుక్ తో పోల్చితే, బ్లాగులు చాలా చిన్న గ్రూపు ఇక్కడ కొందరిని వదిలించుకోవాలి అని అనుకునేవారు తక్కువ. కాబట్టి కూడా శిక్ష పడాలి ఖచ్చితంగా కోరుకొనే వారు చాలా తక్కువ లేదా ఉండరు. నిజానికి ఇదే చర్చ బ్లాగుల్లో జరిగితే కేసు దాకా వెళ్ళేది కాదు. చదివి వదిలేసే వాళ్ళు.

    రిప్లయితొలగించండి
  24. ఇదే విషయం నిన్న నేను నా మిత్రునితో అంటే, ఆయన నిజమే ఇదే టెండెన్సీ (పోకడ) నేను మూడేళ్ళ ఆడదానిలో(సంస్కారులు 'పాప' అని చదువుకూగలరు) కూడా చూశాను అని అన్నాడు. నాకు మండుకొచ్చి "నీచెల్లికూతురుక్కూడా అదేవయసుకదా, ఆపిల్లకూడా ఇంతేనా?" అని అడిగాను.

    'దేవతలు పూజలందుకోవడంకోసం స్త్రీలను పూజించే' భారత పురుషులు తమనుతాము పుణ్యాత్ములుగానూ, తమ స్త్రీలను పవిత్రలుగానూ భావించుకుంటారు. దాంతో నాకు పెద్ద సమస్యలేదు సమస్యల్లా తమవికానివాటిని నీక్షంగా ఆవిష్కరించడంగురించే!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం