18, సెప్టెంబర్ 2013, బుధవారం

కొలంబస్ ను మరిపించే నారా బాబు .. అగస్త్య మహాముని లాంటి జగన్ బాబు‘‘ఏంటి సుబ్బారావు దీర్ఘంగా ఆలోచిస్తున్నావు?’’
‘‘హైదరాబాద్‌ను తలుచుకుని యాదగిరి ’’
‘‘నిజమే ఒక్కసారి హైదరాబాద్‌కు వస్తే వదిలిపెట్టలేరు.
హైదరాబాద్ చాయ్, బిర్యాని మహత్యం అలాంటిది. ’’
‘‘నేను చాయ్ తాగను. కాఫీ తాగుతా ’’
‘‘మరి దేనికి బాధ. భవగద్గీత విన్నావా? ఘంటసాల ఏమన్నాడు
నీవు తీసుకు వచ్చింది ఏమీ లేదు.. నీవు తీసుకువెళ్లేది ఏమీ లేదని అన్నాడా? మరెందుకు బాధ’’
‘‘నా బాధ నీకు అర్ధం కావడం లేదు యాదగిరి’’


‘‘కూకట్‌పల్లిలోని నీ ఫ్లాట్ నీకే ఉంటుంది. హెటెక్ సిటీలోని మీ అబ్బాయి ఉద్యోగం మీ అబ్బాయికే ఉంటుంది. ఎఎస్‌రావునగర్‌లోని నీ రెండు ప్లాట్లు నీకే ఉంటాయి. ఇంక బాధెందుకు? సుబ్బారావు’’
‘‘నువ్వెన్నయినా చెప్పు హైదరాబాద్‌ను త్యాగం చేయాలంటే మనసొప్పడం లేదు’’
‘‘ఒక్క హైదరాబాద్‌కే ఇంత బాధపడితే... ప్రపంచ వ్యాప్తంగా హిందువుల ఆరాధ్య దైవం వెంకన్న కొలువైన తిరుపతి, కనకదుర్గమ్మ, శ్రీశైలం మల్లన్న , సింహాచలం అప్పన్న ఇలా పేర్లు చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? విశాలమైన సముద్ర తీరాన్ని, రాజకీయ రాజధాని విజయవాడను, సాంస్కృతిక రాజధాని రాజమండ్రిని, మహానగరం విశాఖను వదులుకోవాలంటే నీ సోదరులకు మాత్రం బాధగా ఉండదా? చెప్పు ’’
సీమాంధ్ర సభలో ఆవిడెవరో సీమాంధ్రులను పాండవులుగా, తెలంగాణ వారిని కౌరవులుగా పోలుస్తూ బాగామాట్లాడారట! విన్నా వా? సుబ్బారావు’’


‘‘నిజమే యాదగిరి చాలా బాగా మాట్లాడింది. నా బాధకు ఆ మాటలతో కొంత ఉప శమనం లభించింది’’
‘‘మహాభారతం గురించి నీకు తెలుసు కదా? ఆమె చెప్పినట్టే సీమాంధ్రులు  తెలంగాణ వాళ్లు 
పాండవులు, కౌరవులు అనుకుందాం.
మహాభారత యుద్ధానికి ముందు దుర్యోధనుడు, అర్జునుడు శ్రీకృష్ణుడి సహాయం కోరడానికి వెళ్లినప్పుడు శ్రీకృష్ణుడేమన్నాడు? మీరిద్దరూ నాకు కావలసిన వాళ్లే ఇద్దరికీ సహాయం చేస్తాను అని సమ న్యాయం పాటించాడు కదా? ఆయుధం చేపట్టకుండా తానొక్కడిని ఒకవైపు, తన సైన్యం మొత్తం ఒక వైపు ఉంటుంది ఏది కావాలో తేల్చుకోమన్నాడు కదా? ఆయుధం చేపట్టని శ్రీకృష్ణుడిని పాండవులకు వదిలేసి మహాబల సంపన్నులైన సైన్యాన్ని దుర్యోధనుడు కోరుకుంటాడు.’’


‘‘ఐతే’’
‘‘అలానే ఈ యుద్ధంలో వారికి ఒక్క హైదరాబాద్ దక్కితే.. మీకు అబ్బో చెప్పాలంటే రోజులు సరిపోవు ఒక్కోక్కటి చెప్పమంటావా?’’


‘‘వద్దన్నా చెబుతావు కదా? చెప్పు యాదగిరి వింటాను’’
అప్పుడెప్పుడో 1493లో క్రిస్ట్ఫర్ కొలంబస్ అమెరికా ఉనికిని ప్రపంచానికి చాటి చెప్పాడు. ఐదువందల సంవత్సరాల తరువాత నారా బాబు... హైదరాబాద్‌ను కనుగొని వరల్డ్ మ్యాప్‌లో చోటు కల్పించాడు కదా? అమెరికా తరువాత అంత గొప్ప ఆవిష్కరణ ఇదే కదా? కాదంటావా?
జీవితంలో ఒక్క అబద్ధం కూడా చెప్పకుండా ఉండడం ఎంత కష్టమో, ఒక్క నిజం కూడా చెప్పకుండా ఉండడం అంత కన్నా కష్టం. మొదటి దానికి హరిశ్చంద్రుడు ప్రతినిధి, రెండోదానికి బాబు. అలాంటి బాబు మీ కోసం నడుస్తుంటే ఇంకేం కావాలి. చెప్పు సుబ్బారావు చెప్పు అలా మౌ నంగా ఉన్నావేమిటి?’’
‘‘నువ్వు చెప్పాల్సింది ముగిశాక చెబుతా?’’


‘‘అంతేనా త్రేతాయుగం నాటి అగస్త్యుడి తరువాత దేన్నయినా జీర్ణం చేసుకోగల శక్తిసంపన్నుడి  అండ మీకుంది కదా? ’’
‘‘ఎవరో ఆ మహనీయుడు? ’’


‘‘రామాయణంలో వాతాపి, ఇల్వకుడు అనే ఇద్దరు రాక్షసులున్నారు. ఇల్వకుడికి మృత సంజీవని విద్య, వాతాపికి కోరిన రూపం ధరించే శక్తి ఉంది. వాతాపి మేకగా మారిపోతే ఇల్వకుడు శ్రాద్ధ కర్మకు భోక్తలకు మేక మాంసం వడ్డించేవాడు. తరువాత మృత సంజీవని విద్యతో వాతాపి భోక్త కడుపు చీల్చుకుని బయటకు వచ్చేవాడు. భోక్తను ఇద్దరూ భుజించే వారు. ఓసారి అగస్త్యుడికి కూడా అలానే వడ్డిస్తే, విషయం తెలిసిన ఆయన తన తపోశక్తితో జీర్ణం.. జీర్ణం వాతాపి జీర్ణం అంటాడు. దాంతో వాతాపి అగస్త్యుడి కడుపులోనే జీర్ణం అయిపోతాడు. తరువాత ఇల్వకుడ్ని కూడా భస్మం చేస్తాడు’’
‘‘కథతెలుసు....ఇప్పుడు సందర్భమేంటి?’’
అదే చెబుతున్నా జీర్ణం జీర్ణం లక్ష కోట్లు జీర్ణం అంటూ అంత పెద్ద మొత్తాన్ని జీర్ణం చేసుకుని చిరునవ్వులు చిందిస్తూ చిద్విలాసంగా కోర్టు విచారణకు హాజరవుతున్న జగన్‌బాబు అండ మీకుందని చెబుతున్నా. ఇంకా దేన్నయినా జీర్ణం చేసుకోవడానికి సిద్ధంగా ఉన్నట్టు అనిపించదు సన్నగా ఉన్న అతన్ని చూస్తే ..  లక్ష కాదు అందులో పది శాతమే నిజం అనుకున్నా పదివేల కోట్లను జీర్ణం చేసుకోవడం అంటే మాటలా?


‘‘మరదే మండుకొస్తుంది... నేనేదో బాధల్లో ఉంటే రామాయణ, భారతాలు చెబుతావు నా బాధ నీకు అర్ధం కావడం లేదు యాదగిరి’’
‘‘అక్కడికే వస్తున్నాను. ఎప్పుడూ ఫాం హౌస్‌లోనే ఉండే కెసిఆర్ తప్ప వారికెవరున్నారు. చారిత్రక పురుషులు బాబు,జగన్‌లున్నారు. స్టార్ బ్యాట్మెన్ కిరణ్, మెగా స్టార్లు, లగడపాటి, మేకపాటి, రాయపాటి లాంటి కుభేరులు   వీరి తర్వాత వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి కంటిచూపుతో చంపేసే, అడుగు పెట్టగానే సుమోలను గాలిలో లేచేట్టు చేసే మహా మహా హీరోలున్నారు కదా! ఇంకెందుకు బాధ సుబ్బారావు.
’’


‘‘యాదగిరి ఒక విషయం అడగనా? వీరందరినీ మీరు తీసుకుని హైదరాబాద్ మాకిచ్చేస్తారా?’’


‘‘ఆ...’’
‘‘హైదరాబాద్ పోవడం కన్నా వీరందరినీ భరించాల్సి రావడమే మా అసలు సమస్య యాదిగిరి. ఈమాట అంటేనే మీకు మండుతుంది .. మరి వారందరినీ భరించాలంటే  మాకెంత మండాలి. ఇంత కాలం వీళ్ళను ఇద్దరం కలిసి మోశాం ..ఇప్పుడు  మేమోక్కరమే భరించా లంటే?  ’’


ఆరవై ఏళ్లయినా మన మిద్దరం ఒకరినొకరం అర్ధం చేసుకోలేక పోయాం ఇది మాత్రం నిజం.

30 కామెంట్‌లు:

 1. i am from kakinada...mee blogs regularga chaduvuthaanu....nijamaga excellent.....telangana raavalani manaspoorthiga koruthunna vaadilo nenokadini...

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. Gangadhar గారు పోస్ట్ నచ్చినందుకు ధన్యవాదాలు .......... తెలంగాణా కు మీ లాంటి వారు సంపూర్ణ మద్దతు ప్రకటిస్తున్నందుకు ధన్యవాదాలు

   తొలగించు
 2. i am from kakinada....mee blogs regular ga chaduvuthaanu....really excellent.......

  రిప్లయితొలగించు
 3. బాగుంది. వీల్లందరినీ మించి బాలయ్య బావ కూడా ఉన్నాడు.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. విశ్వరూప్ గారు కంటి చూపుతో చంపడం , సుమోలు ఆకాశం లోకి ఎగిరే హీరోల జాబితాలో వచ్చేస్తాడని బాలయ్య బాబు పేరు ప్రత్యేకంగా ప్రస్తావించలేదు .

   తొలగించు
 4. హ.. హ.. హా..

  నేనిన్నాళ్ళూ మన 'అసలు' సమస్య గూర్చి ఆలోచించలేదు సుమండి!

  మీ పోస్ట్ చదివాక మనసంతా దిగులుగా అయిపోయింది!

  సూపర్ పోస్ట్!

  రిప్లయితొలగించు
 5. telangaana lo unna ma sankaranna,danam,surve,kk,jana taditara yodhanu yodhulanu vismariste yela sir.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. లక్ష కోట్ల కుంభకోణం ... రెండెకరాల నుంచి రెండు వేల కోట్ల కుంభకోణం ముందు వీళ్ళు ఏపాటి ..

   తొలగించు
 6. నేను మీ బ్లాగ్ రెగ్యులర్ రీడర్.....సరదాగ బాగానే వుంది... కానీ ఇక్కడ ఒక విషయం మర్చిపోయారు..... శ్రీ కృష్ణుడిని తీసొకొని పాండవలు యుద్దంలో గెలిచారు కానీ కౌరవులు కాదు కదా! మరి అక్కడ కౌరువులు మిగతా వాటిని తీసుకున్నారు మరి మీరు చెప్పినట్టు మీరు కౌరువులు కాబట్టి మిగతా వాటిని తీసుకొంటారా ? అయినా మహా భారత యుద్ధం అయిన తర్వాత ఎవరు బాగు పడ్డారు? అందరు నాశనం తప్ప.... ఇప్పుడు విడిపోతే జరిగేది కూడా ఆదే.

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. మహా భారతం శాంతి పర్వం లో యుద్ధం వాళ్ళ కలిగిన నష్టం పై ధర్మరాజు ఆవేదన ... అతని ఆలోచన తప్పు అని పాండవులలో మిగిలిన నలుగురి వాదన ,, ద్రౌపది వాదన చాలా బాగుంది మీ సందేహలన్నితికి సమాధానం లభిస్తుంది .. వీలుంటే చుడండి దాదాపు 20-30 పేజీల్లో ఈ వాదన ఉంది ...

   తొలగించు
 7. hai మహా భారత యుద్ధం లో ఆంధ్రులు కౌరవుల పక్షాన యుద్ధం చేశారట .. ముదిగొండ శివప్రసాద్ గారు గతం లో ఒక వ్యాసం లో రాశారు .. ఎవరికైనా వివరాలు తెలిస్తే చెప్పగలరు ... bharatha deshaniki swatantram isthe aakalitho chastharu ani charchil annarata ....

  రిప్లయితొలగించు
  రిప్లయిలు
  1. sir, mahabharatha kalam naati andrulu antey rendu pranthala vaaru kalipi anukunta...

   తొలగించు
  2. అజయ్ గారు, ఆ వ్యాసం చదివండి. అందులో ఆంధ్రులు, తెలంగాణా వాళ్ళు అని సేపరేటుగా రాసారు.

   తొలగించు
  3. నేను అడిగిన దానికి సమాదానం చెప్పలా !.... వాళ్ళు అన్నారు వీళ్ళు అన్నారు కాదు జరిగిందేమిటి. అది ఇంపార్టెంట్. చాలా మంది చాలా చెప్తారు కానీ జరిగింది మనకు కావాల్సింది ఏమిటి? మహా భారత యుద్ధం తర్వాత అందరు నాశనం అయ్యారు. అలా జరిగితే పరిస్థితి ఏంటి ? దానికి ఎవరు బాద్యులు?

   తొలగించు
  4. కౌరువులు కాబట్టి మిగతా వాటిని తీసుకొంటారా ? అయినా మహా భారత యుద్ధం అయిన తర్వాత ఎవరు బాగు పడ్డారు?
   ...............
   అడిగిన వాటిలో ఈ రెండు ప్రశ్నలు
   మహాభారత యుద్ధం నిజంగా జరిగిందా ? లేదా అనేది నాకు తెలియదు .. ఒక వేళ నిజంగా జరిగింది అనుకున్నా ... మన కళ్ళ ముందు జరుగుతున్నా దానినే ఎవరిష్టం వచ్చినట్టు వారు చెబుతున్నారు .. ఇక జరిగిందో తెలియంది ఎలా జరిగిందో? ఏం జరిగిందో ఎవరు చెప్పిన దాన్ని నమ్ముదాం .. యుద్ధం తరువాత ఎవరు బాగు పడ్డారు అంటే ఆ యుద్దన్న్ని చూసిన వారు చెప్పాలి ...

   తొలగించు
  5. >>మహా భారత యుద్ధం తర్వాత అందరు నాశనం అయ్యారు. అలా జరిగితే పరిస్థితి ఏంటి ?దానికి ఎవరు బాద్యులు?

   కౌరవులు పాండవులకు అన్యాయం చెయ్యకుండా కాస్త వివేకంగా ఆలోచిస్తే ఆ మహా నాశనం తప్పేది. సాక్షాత్తు కృష్ణ భగవానులె ఆ మహా నాశనాన్ని ఊహించి కూడా ఆ పరిస్తితులలో యుద్దాన్నే ఎందుకు సమర్ధించారొ అర్థం చేసుకోవాలి.

   తొలగించు
  6. మరి మీరు ఒక పోస్ట్ లో Y S రాజశేఖర్ రెడ్డి గారు 2014 లో తెలంగానని ఎవ్వరు ఆపలేరు అని మీరు రాసారు. కానీ ఆ విషయం అయన ఎక్కడ చెప్పలేదు కేవలం పుకార్ల ఆధారంగా మీరు రాసారు. మరి అప్పుడు ఎలా రాసారు? దానికి ఏమైనా ఆదారాలు ఉన్నాయా లేదా మీరు చూసారా ? నిజంగా ఆయన వుండి వుంటే అసలు తెలంగాణా ప్రాబ్లం ఉండేదా? ఆ విషయం మీకు తెలియదా ?

   తొలగించు
 8. భలే రాశారండీ! నైస్ హ్యూమర్ అండ్ సెటైర్. చివర్లో పంచ్ పేలింది. మీరన్నట్టు, ఈ రాజకీయ చీడ పురుగుల పీడ విరగడ చేసుకునే విధంగా ఆ నడుస్తున్న ఉద్యమాలు ఎక్కుపెట్టబడుంటే, ఎంత బావుండేదో. ఆ శుభ గడియలెప్పుడాగమిస్తాయో? ప్చ్..!!

  రిప్లయితొలగించు
 9. hai gaaru వృత్తిరిత్యా కొన్ని తెలుస్తుంటాయి .. ( నేను జర్నలిస్ట్ ను ) మీరు ప్రస్తావించిన ఆ అంశంగురించి ఆ నేత చెప్పినప్పుడు అక్కడ ఉన్న ఇద్దరిలో ఒకరు నాకు తెలుసు .. అయితే సాధారణంగా పరిచయంతో మాట్లాడినప్పుడు కొన్ని విషయాలు ప్రస్తావిస్తే వాటిని రాయకుండా ఉండడం వృత్తి ధర్మమ్ ( రాస్తే ఏమవుతుంది అంటే మరో సారి అంతర్గత వ్యవహారాలు మాట్లాడరు అంతే ) ఈ అంశాన్ని జూలై 30న దిగ్విజయ్ సింగ్ ప్రకటన తో పాటు ఈనాడులో కొద్దిగా రాశరు. ఇదే అంశాన్ని దాదాపు 1-2 ఏళ్ళ క్రితం ఒక వ్యాసం లో రాశాను ... ఈ బ్లాగ్ లో రాజకీయం, లేదా తెలంగాణా శిర్షిక క్రింద ఉన్న వ్యాసాల్లో ఉంటుంది చుడండి

  రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం