22, అక్టోబర్ 2009, గురువారం

సికింద్రాబాద్ లో చవక ధరలో జీవిత అనుభవం

సికిందరాబాద్ రైల్వేస్టేషన్ వద్ద అన్ని తక్కువ ధరకే లబిఇస్తాయి చివరకు జివిత పాఠాలు కుడా. నిన్న సికందరాబాద్ వెళితే ఏదో దూర ప్రాంతం నుంచి వచ్చిన దంపతులో కనిపించారు వాళ్లు ఆపిల్స్ కొన్నారు బండిమీద ఉన్నవాటిలో చాల చక్కగా ఉన్నవాటిని కొన్నాం కదా ఇప్పుడు చుస్తే అందులో మూడు చెడిపోయినవి ఉన్నాయ్. ఇది ఎలజారిగింది. తప్పు ఎవరిది అని వారిలో వారు వాదూలడుకుంటున్నారు . మీరు కూడా సికిందరాబాద్ వెళితే ప్రయత్నించి చూడండి ఇలాంటి అనుబవమే కలుగుతుంది. కొద్దిసేపటి తరువాత జోక్యం చేసుకొని చెప్పాను. మీ యిద్దరిలో ఎవరి తప్పు కాదు . ఇక్కడి పళ్ళు అమ్మే వారి మాయాజాలం అది అని చెప్పను. మీరు మంచివి వెతికి తీసుకున్న వాటిని కవర్ లో వేస్తున్నట్టు చేసి అవి పక్కన పెట్టి అప్పటికే కవర్ లో ఆటను కొన్ని మంచివి, చెడ్డవి కలిపి ఉంచిన కవర్ ఇస్తాడు. ఆ విషయం చెబితే వాళ్లు మరీ ఇంత అన్యాయమా అంటు వాపోయారు. ఆలా ఎందుకు అనుకుతారు కేవలం యాబై రూపాయల కర్చుతో గొప్ప జీవిత నేర్పించాడు అనుకూవచు కదా . లక్షల రూపాయలు పెట్టి ప్లాట్ కొంటె అది అప్పటికే ఎవడు కొన్నాడని మోసపోయామని తెలిసి వస్తుంది. అప్పటినుంచి జాగ్రతగా ఉంటాం. కాని ఇక్కడ కేవలం యాభై రూపాయలతో నిరంతరం మనం అప్రమత్తంగా ఉండాలని,ఒక పాఠాన్ని నేర్చుకున్నాం కదా అని చెపితే అప్పటి వరకు కిచులడుకున్న వాళ్లు ఇలా అలూచించడం బాగుంది అని నవ్వుకున్నారు. ఇది నిజాంగ చాల గక్కువ ధరకు లభిఇస్తున్న అనుబవం అంటే ఒప్పుకుంటారా లేదా .. బాధపడే కంటే ప్రతి అనుభవాన్ని పాటంగా తీసుకుందాం. మన అమాయకత్వానికి మనమే నవ్వుకుందాం. అప్పుడు జీవితమ్ హప్పిగా ఉంటుంది .

3 కామెంట్‌లు:

  1. మీ ఆలోచన తీరు చాలా బాగుంది!

    రిప్లయితొలగించు
  2. మీ బ్లాగ్ పేరు చూసి ముందు పురాణకాలం నాటి పేరెందుకు పెట్టారా అనుకున్నా ! మీరిచ్చిన విశ్లేషణ చదివాక .....మీ తర్వాతి పోస్ట్ లు చూశాక మీ బ్లాగ్ కు మీరుపెట్టిన పేరు ఎంత సరైనదో అర్ధమైందండీ .....మీ సానుకూల దృక్పధం నలుగురికీ పంచాలనే మీ ఆలోచన అభినందనీయం ఆల్ ది బెస్ట్ !

    రిప్లయితొలగించు
  3. :)) మంచి ఆలోచనా విధానం. పాజిటివ్ థింకింగ్ కు ఇది ఉపయోగపడుతుంది.

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం