26, అక్టోబర్ 2009, సోమవారం

మీ పిల్లలతో చందమామ చదివిస్తున్నారా ..

మీ పిల్లలతో చందమామ చదివిస్తున్నారా? మా పిల్లలు చిన్న వాళ్ళు చదవలేరు అంటున్నారా మరీ మంచిది. చదవ లేక పొతే వింటారు కదా మిరే చదివి వినిపించండి. కాదు వాళ్ళు పెద్దవాళ్ళు అంటున్నారా యింకేం వారంతట వారే చదువుకుంటారు. అయినా ఈ కాలంలో పిల్లలు చందమామ చదవమంటే చదువుతారా అంటున్నారా అందుకే చదమామ చదివిస్తున్నర అని అడుగుతున్నాను. ఇదేమీ చందమామ వారి ప్రకటన కాదు. కొన్ని కార్పోరేట్ కంపనీలలో, పిజ్జా సెంటర్ లలో ఈ కాలం అమ్మయిలు సిగరెట్ తాగుతూ కని పిస్తున్నారు . వారిని చూస్తె బాద కలుగుతుంది. చెడిపోయే హక్కు మగవారికేనా ఆడవారికి వద్దా అనివాదిస్తారు కుడా . అమెరికాలో ఉన్నా అమ్మయిలు కూడా తెలుగుతనం కోసం పరితపిస్తుంటే వీల్లు ఇలా ఉన్నారని బాధగా ఉంటుంది. చిన్ననాటి నుంచే తలిదండ్రులు పిల్లల్లో విలువలు పెంపొందించడానికి కృషి చేస్తే ఇలాంటి పరిస్తితి ఏర్పడదు. అందుకే చిన్ననాటి నుంచే పిల్లలకు చందమామ చదివించే అలవాటు చేయాలి. పిల్లల కథలు అంటే కేవలం కాలక్షేపం కోసమే కాదు. ఆ కథల్లో చిన్ననాటి నుంచే విలువలు అలవాటు కాగలవు . ఈ కాలంలో వ్యక్తిగత ప్రయోజానం కుడా లభిస్తుంది. చిన్ననాటి నుంచే చందమామ చదివే అలవాటు ఉంటే, పరీక్షల్లో సమాధానాలు చక్కగా రాయడం అలవాటు అవుతుంది. విశ్లేషణ శక్తి అలవడుతుంది. ఏది మంచో, ఏది చెడో తెలుసుకునే జ్జానం అలవడుతుంది. ఐ ఏ యస్ , గ్రూప్ పరీక్షల్లో పాస్ ఐన చాలమంది తెలుగు వారు తమకు చిన్న నటి నుంచి చదివిన చందమామ ఉపయోగ పడిందని చెప్పారు. పురాణాల గురించి అవగాహన కలగడానికి చందమామ ఉపయోగ పడుతుంది. యిక చిన్ననాటి నుంచే ఇంగ్లిష్ బాష జ్జానం అలవడడానికి చందమామ చదవది, చదివించండి. రెండు పిజ్జాలతో యెంత ఆరోగ్యం పడవుతుందో తెలియదు కానీ రెండు పిజ్జాల డబ్బు తో ఏడాది కాలం చందమామ వస్తుంది. మీ పిల్లల పుట్టిన రోజు వచ్చిన, బందువులు , తెలిసిన వారి పిల్లల పుట్టిన రోజు కైనా పిల్లల కథల పుస్తకాలను బహుమతిగా అందించండి. వారికి వచ్చిన బహుమతుల్లో మీరు ఇచిన బహుమతి కరిదనది కాకపోవచు కానీ కచితంగా వారికీ వచ్చిన బహుమతులన్నిటికన్న మీ బహుమతి ప్రయోజానకరమైనది అవ్తుంది. పిల్లలకే కాదు పెద్దలకు కూడా పుస్తకాలనే బహుమతిగా ఇవ్వండి.

5 కామెంట్‌లు:

మీ అభిప్రాయానికి స్వాగతం