17, అక్టోబర్ 2009, శనివారం

miiru yelanti vaaru

మీరు ఎలాంటివారో మీకు మీరే నిర్ణయించు కోవడానికి ఒక చిన్న కథ. ఇది చైనా కు చెందినా జానపద కథ . ఒక వృద్ధురాలు ఎప్పుడు చూసినా ఏడుస్తూ కనిపించేది. ఒక యువకుడు ఆమెను ఏడవడానికి కారణం అడిగాడు. నాకు ఇద్దరు కుమార్తెలు వారికి పెళ్ళిళ్ళు అయ్యాయి. పెద్ద అమ్మాయి మొగుడు గొడుగులు అమ్ముతాడు. రెండవ అమ్మాయి మొగుడు నూడుల్స్ తాయారు చేసి అమ్ముతాడు. వర్షా కాలం రాగానే రెండవ కూతురు గుర్తుకు వస్తుంది. వర్షం లో నూడుల్స్ చేయలేరు . దాంతో ఆ కూతురు ఇంట్లో ఎలా గడుస్తుందో, పిల్లలను ఎలా పోసిస్తున్నారో అని తలచుకుంటేనే ఏడుపు ఆగడం లేదు. అని చెప్పింది నిజామే కూతురు ఇబ్బందుల్లో ఉంటే ఏ తల్లి కై న యిలాగే ఉంటుంది. అది సరే మరి ఎండ కాలం లో కూడా మీరు ఏడుస్తూనే ఉంటారు కదా అని మళ్లీ అడిగాడు. మరి ఏడుపు రాకుండా ఎలా ఉంటుంది అంటు ఆ వృద్ధురాలు చెప్ప సాగింది. పెద్ద కూతురు మొగుడు గొడుగులు తాయారు చేసి అమ్ముతాడు. ఎండా కాలం లో గొడుగులు అమ్ముడు పోవు దాంతో పెద్ద కూతురు కుటుంబం ఎలా గడుస్తుందో , ఏం తింటున్నారో, పిల్లలకు ఏం పెడుతున్నారో అనే ఆలోచన రాగానే ఏడుపు వస్తుంది అని చెప్పి ఏడవసాగింది. ఆ యువకుడు నీ సమస్య చాల న్యాయమైనదే రేపు పరిష్కారం చెబుతాను అని వెళ్లి పోయాడు. మరుసటి రోజు వచ్చి వర్హకాలం రాగానే పెద్ద కూతురును గుర్తు చేసుకో వర్షాల వల్ల గొడుగులు బాగా అమ్ముడు పోయి పెద్దకూతురు కుటుంబం యెంత సంతోషంగా ఉందొ కదా అని అనుకుంటే అంతకు మించిన ఆనందం ఉండదు. ఇక ఎండా కాలం రాగానే చిన్న కూతురు కుటుంబాన్ని గుర్తు చేసుకో నూడుల్స్ అమ్ముతూ వారెంత సంతోషంగా ఉన్నారో కదా అని గుర్తు చేసుకుంటే అంతకు మించిన ఆనడం ఉండదు. అని సలహాఇచ్చి వెళ్ళాడు. మనం సంతోషంగా ఉండాలా బాద పడాల అనేది మా ఆలోచన విదానం పై ఆదర పది ఉంటుంది.కొందరు నిరంతరం మధన పడుతుంటారు దేనికి బాద పడదామా అని ఆలోచిస్తుంటారు . ఆ వృద్దురాలి పై సలహా చేసిందా లేదా అనే సందేహం వద్దు. వృద్దురాలి మాదిరిగా నిరంతరం మదమదన పడదామా , సంతోషంగా ఉందామా అని ఎవరికి వారేనిర్ణయించుకోవాలి. సంతోషంగా ఉండాలని నిర్ణయం తీసుకున్న మనలో చాలమంది ఆ వృద్దురాలి మాదిరిగానే ఆలోచిస్తుంటారు. మనలో చాల మంది ఆ వృద్దురాలి మాదిరిగానే ఉంటారు.

2 కామెంట్‌లు:

  1. ఆ వృద్దురాలు అమ్మండి. అమ్మ తన ఆనందం గురించి ఆలోచించదు. బిడ్డల కష్టం గురించే ఆలోచిస్తుంది కదండి!

    రిప్లయితొలగించు
  2. అమ్మ గారు అమ్మ ఆలోచనలపై మీ అభిప్రాయం అక్షరసత్యం. ఐతే నా ఉద్దేశం సానుకూలంగా ఆలోచించడం గురించే కాని తల్లి ఆలోచనను తప్పుపట్టడం కాదు .

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం