8, జులై 2011, శుక్రవారం

బ్లాగుల గొంతు నులిమి చంపకండి ... ప్రోత్సహించండి ..

 చిన్న సలహా కావాలి  ?అతను అడిగిన విధానం పూర్తిగా సంతృప్తి పరిచింది నీ పతి ప్రాణం తప్ప ఏదైనా అడుగు అని యముడు చెప్పిన తరహాలో ఆతను అడుక్కో అని అభయమిచ్చాడు. ఓ కవిత రాశాను చదివి ఎలా ఉందో చెబుతారని అని మెల్లగా చెప్పాడు. ఆ మాట వినగానే ఆయన గట్టిగా నవ్వకుండా ఉండలేక పోయాడు. ఏంటి నువ్వుకుడా కవిత్వం రాయడమే అని అందరికీ వినబడేట్టుగా గట్టిగా చెప్పి మళ్లీ నవ్వాడు. అంతా వారివైపు చూశారు. అతను అదేవిధంగా మళ్లీ అడిగాడు. తన జేబులోని కవితను తీసి చూపించాడు. అతను గట్టిగా నవ్వుతూనే కవిత చదివాడు. ఇదిగో మనోడు కవిత రాశాడు.. కవిత  అంటూ వ్యంగ్యంగా నవ్వాడు. అయినా అతను అలానే ఉన్నాడు సరే నీ పట్టుదల నచ్చిన్దోయ్ ... కానీ కవిత్వం అంటే ఇది కాదోయ్ అంటూ  ఆ కవితలోని ఒక్కో అక్షరాన్ని పీకి పాకం పెట్టాడు . థాంక్స్ సార్ అని ఆ కవితను తీసుకోని మరో వ్యక్తి వద్దకు వెళ్ళాడు మీడియా   ఆఫీసు కాబట్టి పెద్దవారికి కొదవేమి లేదు . 
***
.మా మిత్రుడుమీడియాలో   పని చేస్తాడు ఓ సారి ఆతను ఒక కవిత తీసుకు వెళ్లి ఆఫీసులో ఉన్న అందరికీ చూపించాడు . అంతా నవ్వారు. ఆతను ఏ మాత్రం పట్టించుకోకుండా అందరి వద్దకు తిరిగాడు. ఒకరు ఓహో మీరు కూడా కవిత్వం రాయడమే అన్నారు. చదివి ఏమేం తప్పులు ఉన్నాయో చెప్పారు. దాదాపు గంట సేపు అంతా నవ్వుతూనే ఉన్నారు . కవిత్వం అంటే ఏమిటో ఒకరు చెబితే , ఆతను చూపిన దానిలో ఎన్ని తప్పులు ఉన్నాయో ఒకరు ఇలా గంట సేపు అంతా అతనితో ఆడుకున్నారు. గంట తరువాత ఆతను కవిత చదివి వేళా కోలం చేసిన అందరిని పిలిచి . కవితను మరోసారి చదివాడు అంతా నవ్వారు. ఆతను అప్పుడు చెప్పాడు కవిత చదివి మీ విలువైన అభిప్రాయాలు చెప్పిన వారందరికీ థాంక్స్ .  కానీ ఇంత సేపు మీరు చీల్చి చెండాడి, అదసలు కవితనే కాదు అని చెప్పిన కవిత నాది కాదు . సి నారాయణ రెడ్డి గారిది. కవిత్వంలో నారాయణ రెడ్డి గారికి  జ్ఞాన piita అవార్డు వచ్చింది. కవిత్వమే రాయలేని అతనికి అంత పెద్ద అవార్డు రావడం అన్యాయం కదూ అంటూ మిత్రుడు ముసిముసి నవ్వులతో చెప్పగానే అందరికీ నోటిమాట రాలేదు .  సి నారాయణ రెడ్డి  కవితల బుక్ చూపించాడు. మీ అమూల్యమైన అభిప్రాయాలూ ఆయనకు చెబుతాను అనగానే అంతా అవాక్కయ్యారు .ఒక వేళ ఆకవితలో తప్పు ఉంది అనుకుంటే అది నారాయణరెడ్డి కవిత అయినా తప్పని చెప్పాలి, శ్రీశ్రీ కవిత అయినా చెప్పాలి. అప్పటి వరకు అది కవితనే కాదు అని వ్యంగ్యంగా మాట్లాడిన వారు నారాయణ రెడ్డి కవిత అని చెప్పగానే మాట్లాడలేక పోయారు  
******
ఇది నేను కొంత బాధతో ,  హడావుడిగా రాశాను. విషయం ఏమంటే .. గూగుల్ తెలుగు గ్రూప్ లో ఒక మెయిల్ వచ్చింది . ఒకరు రామేశ్వరం వెళ్లి తన అనుభవాలను బ్లాగ్లో రాశారు . అతను రాసిన దానిలో తప్పులు ఎత్తిచూపుతూ ఒకరు  రాసిన లేఖ అందరికీ బాధ కలిగించేట్టుగా ఉంది.  ఆ సందర్భంలోనే నేను గూగుల్ గ్రూపుకు మిత్రునుని కవిత వ్యవహారాన్ని పంపాను . 
 జి మెయిల్ వంటి వాటిలో కంపోస్ చేయడం చాలా కష్టం . నేను ఈ మధ్యనే బ్లాగ్స్, బుజజ్ వంటివి చూస్తున్న. తప్పులు ఉంటే మంచి ఉద్దేశ్యంతో సవరించడానికి ప్రయత్నిస్తే మంచిదే కానీ ఇక జీవితం లో బ్లాగ్ వైపు చూడ వద్దు అనేట్టుగా ప్రవర్తించడం మంచిది కాదు. ఇంగ్లీష్ విషయంలో ఇలానే నవ్వడం వల్ల చదువుకే దూరం ఐనా వారు చాలా మండి ఉన్నారు. ఇంగ్లిష్ నేర్చుకునేప్పుడు చాలామంది చెప్పే మొదటి మాట నవ్వుతున్నారని పట్టించుకోకండి. నేర్చుకోండి అనే. బ్లాగ్ ప్రారంభించి నా వారిని ప్రోత్సహించండి. మాటలతో నిరాశపరచ వద్దు. మీరు బ్లాగ్ లో రాయడం నిలిపి వేస్తె ఇంకా చాలా మందిని నిరాశలో పడేసిన వారు అవుతారు. మీరో అలానే రాయండి. ఐతే తప్పులను చూపడం తప్పు అని నేను వాదించడం లేదు. సున్నితంగా ప్రోత్సహించే విధంగా ఉండాలి.
నేను మూడేళ్ళ క్రితమే బ్లాగ్ ప్రారంభించినా కంపోస్ చేయడం చాలా ఇబ్బంది అనిపించి అటువైపు చూడడం మానేశాను. ఆఫీసులో జెట్ స్పీడ్ లో కంపోస్ చేసే చేతులో జి మెయిల్ లో ఎడ్లబండి లాంటి స్పీడ్తో కంపోస్ చేయడం కష్టం అనిపించి బ్లాగ్ వైపు చూడడం మానేశాను. ఇప్పుడు కాస్తా పరవాలేదుజి మెయిల్ బాగానే ఉందనిపించి మళ్లీ నాలుగు నెలలనుంచి బ్లాగ్ ను వీడడం లేదు. కొంత నిర్లక్షం కావచ్చు, కొంత తెలియని తనం కావచ్చు, మరి కొంత వేగం వల్ల కావచ్చు తప్పులు తప్పడం లేదు. బ్లాగ్ మిత్రులు తప్పులను సరి చేసుకోమని చెప్పినప్పుడు ఒక టిచర్ మాదిరిగా సున్నితంగా చెప్పారు కానీ బ్లాగ్ అంటేనే విముఖత కలిగేట్టు చెప్పలేదు. భయపెట్టి బ్లాగుల వైపు రాకుండా చేయడం కాదు . ప్రతి ఒక్కరు మరో మిత్రుడిని బ్లాగ్ లోకానికి పరిచయం చేయాలనీ, ప్రోత్సహించాలని కోరుకుంటూ ........

******
ఇక తెలుగు గ్రూప్ లో చర్చ కొంత బాగాన్ని చూడండి . ఆసక్తి కరంగా ఉంది 
***
రాజాచంద్రగారు, పాపం రామేశ్వరం వెళ్లి, తమ ఆనందానుభూతుల్ని
తెలుగు గ్రూప్ సభ్యులతో పంచుకొందామనుకొని,
వ్రాసిన ఉత్తరం మీద చెలరేగిన వాదోపవాదాల్ని చదివాక, బండి
సుబ్రహ్మణ్య శ్రీనివాస శర్మ గారికి ( సుబ్రమణ్య కాదు, సుబ్రహ్మణ్య
అని వ్రాసుకోవాలి.) కొన్ని విషయాలు వ్రాయాలనిపించింది.
అయ్యా!  నమస్కారం.
తప్పులు ఎంచడం వరకు మంచిదే.
కానీ సున్నితంగా ఎంచడం మంచి పద్ధతి అని నా అభిప్రాయం.
మీకు తెలియనిది కాదు.
మీరు వ్రాసిన ఉత్తరాల్లో అనేక భాషాదోషాలు ఉన్నాయి.
తప్పులు                           ఒప్పులు
భాధ                               బాధ
రాస్తున్న                          వ్రాస్తున్న 
లెస్సా                             లెస్స
శతదా                             శతధా  
తప్పులెరుగలేరయా             తప్పులెఱుగరు
గ్రాంధీకము                       గ్రాంథికము
మాండలీకాలు                   మాండలికాలు
వాదేరో                            వాడేరో
ఇలా ఎన్నో తప్పులున్నాయి.
మీ పేరే మీరు తప్పు వ్రాసుకొన్నారు.
భావదోషాలు కూడా ఉన్నాయి.
"ఇక ఆంగ్ల పద సంపర్కం ఎందుకంటారా? సామాన్యంగా తెలుగును  1 ప్ర్రాకృతము, 2 వ్యావహారికము, 3 గ్రాంధీకము అని చెప్పుకో వచ్చు."
ఎవరు చెప్పారు మీకు...?
ఆంగ్ల పద సంపర్కం వేరు. మీరు చెప్పింది వేరు.
ప్రాకృతం అనేది ఒక భాష.
ఇక వ్యావహారికం , గ్రాంథికం అనేవి భాషకున్న రెండు రూపాలు.
గ్రంథస్థ భాష గ్రాంథికం. ఇది పండితుల చేత వ్యవహరింపబడుతుంది.
సామాన్య ప్రజలు (పండితేతరులు) వ్యవహరించే భాష వ్యావహారికం.
ఈ విషయంగా మళ్లీ భాషలు రెండు రకాలు 1. ఆదానభాషలు .2. ప్రదానభాషలు.
ఆదానభాషలు ఇతర భాషలనుండి పదాలను స్వీకరించి, తమలో
కలుపుకొంటాయి.
ప్రదానభాషలు ఇతర భాషలకు పదాలను దానం చేస్తాయి.
తెలుగు ప్రధానంగా ఆదానభాష. పదాలను తీసుకొని తనపదాలు
అన్నంతగా తనలో కలిపివేసుకోగలదు.
సంస్కృతం ప్రదానభాష.  పదాలను ఇవ్వడమే తప్ప తీసుకోవడం తెలియని భాష ఇది. 
మీరు తెలుగు తెలుగు అని వ్రాసిన భాష అంతా సంస్కృతమే.
ఈ దురవస్థ నన్నయ వల్ల వచ్చింది.(నన్నయ భక్తులు క్షమింతురు గాక!)
ఆయన సంస్కృతపదాలకు  డు-ము-వు-లు చేర్చి, ఒక రకమైన
తెలుగు భాషను తయారుచేశారు. 
నన్నయను అభిమానించే చిన్నయసూరి దానికి తత్సమభాష అని,
పేరు కూడా పెట్టారు.
అచ్చతెనుగు భాషకు "దేశ్యభాష"  అని పేరు పెట్టారు.
ఈ మన అచ్చ/జాను తెనుగును బ్రతికిద్దామని, నన్నయ తరువాత
శివకవులు ( నన్నెచోడుడు, పాల్కురికి సోమనాథుడు మొదలైనవారు ) ప్రయతించారు. తెలుగుసాహిత్యచరిత్రలో " శివకవి
యుగం" అని ప్రత్యేకించి విభాగంకూడా చేశారు.
మళ్లీ తిక్కన ఆ ప్రయత్నం చేశాడు.
అన్నమయ్య కూడా అచ్చతెనుగు పదాలను మనకు తన
సంకీర్తనలద్వారా అందించాడు. నిజానికి మనం స్వచ్ఛమైన తెనుగును మర్చిపోయి చాల కాలమైంది. మాట్లాడినా అర్థం కాదు కూడా.
99 శాతం సంస్కృత , ప్రాకృత, ఆంగ్ల , హిందుస్థానీ మొదలైన పదాలతో కలిసిపోయి, ఒక్క శాతంగా మిగిలిపోయి,
తనకంటూ ఒక ప్రత్యేక రూపులేని తెలుగును మనం
మాట్లాడుతున్నాం అంటే కళ్లు చెమరించకమానవు.
ఇదీ నేటి తెలుగు దౌర్భాగ్యస్థితి.
మరి ఇంగ్లీషుమీడియం మీది అభిమానంతో అన్ని విషయాలు ఇంగ్లీషులో చదివినవారికి తెలుగు ఏం వస్తుంది..?
వారినీ తప్పుపట్టలేం.
ఇంతకీ సారాంశం ఏమిటంటే తప్పులు తెలియజేయడం అన్నది
చాల మంచిది. తెలియజేయాలి కూడా. కానీ అది సున్నితంగా
జరిగితే ఉత్తమమని నా అభిప్రాయం అని తెలియజేసుకొంటూ,
ఈ ఉత్తరం ద్వారా ఏమైనా మీ మనసును నొప్పిస్తే క్షమించండి.
అని కోరుతూ,
నాగస్వరం.
సూచన: కొలది ఆవేశంతో వ్రాయడం వల్ల నా ఉత్తరంలో కూడా
           తప్పులుండవచ్చు.
 పెద్దలకు నమస్కారం
నేను వాడిన ఇసుకంత అనే పదానికి ఇంత చర్చకు దారితీస్తుందని నేను
ఉహించలేదు. నావల్ల మీ అమూల్యమైన సమయాన్ని వృదా చేయించినందుకు నన్ను
క్షమించండి. నేను చేసిన ఆ తప్పును  నాకే తెలియపరుస్తూ  మెయిల్ చేసిఉంటే
బాగుందేమో .. నేను మీకు చెప్పతగిన వాడిని కాకపోయవచ్చు .. తప్పు నాది
కాబట్టి మీరు నాకే  మెయిల్ చేయవల్సింది. ఈ చర్చ చూస్తుంటే నేను 10th
క్లాస్స్ చదువు తున్నప్పుడు మా తెలుగు మాస్టర్ గారు అందరిలోనూ నేను రాసిన
తెలుగు పేపర్ చూపించిన సంఘంటన గుర్తుకు వస్తుంది --.raja chandra 
-

13 కామెంట్‌లు:

  1. తప్పులెన్ను వారు తమ తప్పులెరుగరు అంటారు. నిజమే కదా. పొరపాటున ఒకటి రెండు తప్పులు దొర్లితే ఎత్తి చూపించ నవసరం లేదనుకుంటాను. అదే మళ్ళీ మళ్ళీ చేస్తే, చెప్పే విధం గా చెప్పాలి.

    ఈ చర్చ వల్ల కొన్ని ఇదివరలో నాకు తెలియని విషయాలు కొన్ని తెలుసుకున్నాను. మీరు టపాలో మా అందరి అభిప్రాయం బహు చక్కగా చెప్పారు. చిన

    రిప్లయితొలగించండి
  2. సుబ్రమణ్యం గారి రాతల్ని చూసాక కొంచెం "భాదే" కలిగింది. ఈరకంగా తెలుగులో కంప్యూటర్ మీద రాయటం వల్ల దొర్లినవీ, తెలీకపోవటం వలన రాసిన తప్పులూ తెలుస్తూనే ఉంటాయి. చూ: వాదేరో - భాద . ఐనా, ఆయన పేరునే తప్పుగా రాసుకొన్నారనటం సబబుకాదు.
    పోతే నేను గమనించిందేమంటే, తెలుగు తెలుగు అని కొట్టుకుంటూనే, ఆఅబ్బాయి వాడిన "లాస్ట్ వీక్", "మార్నింగ్ మల్లి మేము మిగిలిన ప్లేస్.." లాటి పదాలగురించి ఎవరూ 'కామెంట'లేదు. కొన్ని బ్లాగుల్లో రాసే తెంగిలీసుతో పోలిస్తే ఇతను చాలా నయం లెండి.
    ఇంతకీ నేచెప్పొచ్చేమంటే - ప్రతాప్ గారు చెప్పినట్లుగా చిన్న చిన్న లోపాలను పక్కన పెట్టి రాసే వారి ప్రయత్నాల్ని ప్రోత్సహిద్దాం.

    రిప్లయితొలగించండి
  3. నేనయితే తప్పులెత్తిచూపించినంతమాత్రాన్నే/వేళాకోళమాడినంతమాత్రాన్నే పనివదిలేసి పారిపోయేవాళ్ళందే తప్పంటాను. ఈ గోడవ పూర్వాపరాలు నాకు తెలియవుగానీ general గా చెబుతున్నానండీ కొందరికి తాము పుడింగులమని నిరూపించుకోవాలంటే మిగతావారిని చిన్నబుచ్చాలనే ఒక అభిప్రాయముంటుంది. నిజానికి వీళ్ళకే inferiority complex వుంటుంది. ఇలాంటివాళ్ళను కాలేజ్‌లో ఐతే ఒకాట ఆడుకుంటారు. ఇక్కడ బ్లాగుల్లో కుదరకపోవచ్చు. వాళ్ళువీళ్ళు అన్నారని అణాకాణీ సంబంధంకూడాలేని వాళ్ళేదో అన్నారని చిన్నబుచ్చుకోవడం నిజంగానే మనచిన్నతనం.

    రిప్లయితొలగించండి
  4. తెలుగువాడికి "నీకు తెలుగు రాదు" అంటే ఉక్రోషం :), తప్పులేదు, తెలుగు'వాడి' కి ఆమాత్రం (వేడి) ఉండాలి ;)

    రిప్లయితొలగించండి
  5. మురళిగారికి
    నా ఉత్తరాన్ని మీ బ్లాగ్ లో ప్రచురించినందుకు ధన్యవాదాలు.
    నాగస్వరం.
    http://www.nagaswaram.blogspot.com

    రిప్లయితొలగించండి
  6. మీ అభిప్రాయం చాల నచ్చింది. బ్లాగులు రాసే వాళ్ళు భాష లక్షణాలు తెలియక కాదు..అభిప్రాయలు తెలిపేవారు అవగాహన లేక కాదు.. Give respect and take respect always works. Especially people we dont know at all...

    రిప్లయితొలగించండి
  7. బాగా చెప్పారు. విమర్శ తమలపాకు తో కొట్టినట్టుండాలే కానీ తలుపుచెక్క తో కాదు కదా!
    జీ మైల్ లో కంపొస్ చేసుకోవడం,తెలుగు లిపిలోకి మార్చుకోవడం, బ్లాగర్ లో పబ్లిష్ చెయ్యడం.. ఈ సందట్లో ముద్రా రాక్షసాలు తప్పనిసరి. పైసలు ఖర్చు పెట్టి కొనే పత్రికలో అచ్చుతప్పుల్నే చూసీ చూడనట్టు ఊరుకుంటున్నాం. తప్పితే నవ్వుకుంటున్నాం. బ్లాగుల్లో కూడా ఇంత రచ్చా? మరీ దారుణం.

    రిప్లయితొలగించండి
  8. where can I find the details about our Telugu language? after reading this only I cam to understand that We have a complete different Telugu Language.....can somebody help me...

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం