18, జనవరి 2012, బుధవారం

లాజిక్ లేని లాజిక్... బిజినెస్ మేన్ సినిమాలోని లాజిక్ .. రామారావును దించడానికి బాబు చెప్పినలాజిక్‌ ఇదే .... రాజకీయ వ్యంగ్యం




మా దూరపు బంధువు ఉన్నాడు కదా! పాపం వాడికి ఇంకా పెళ్లి సంబంధం కుదరలేదోయ్ అని హాస్యరచయిత మునిమాణిక్యం వాళ్లవిడ కాంతంతో అంటే సిలోన్ వెళ్లొచ్చిన వాడికి పెళ్లి కాదని నేను ముందే అనుకున్నాను అంటూ కాంతం చెబుతుంది. మునిమాణిక్యానికి ఆశ్చర్యం వేస్తుంది. పెళ్లి కాకపోవడానికి, సిలోన్ వెళ్లి రావడానికి సంబంధం ఏమిటో అస్సలు అర్ధం కాదు. అదే విషయం అడిగితే ఆమె అంతే లేండి నేను చెప్పిన మాట మీకు ఎప్పుడు నచ్చిందని, నా మాట మీరు ఎప్పుడు విన్నారని సాగదీస్తుంది. ఆ గొడవ అలా సాగుతూనే ఉంటుంది. అంతే తప్ప సిలోన్ వెళ్లి రావడానికి పెళ్లి కాకపోవడానికి సంబంధం ఏమిటో మాత్రం ఆమె చెప్పదు. కొన్ని వాదనలు అంతే తెలుగు సినిమాల్లో మాదిరిగానే అస్సలు లాజిక్‌కు చిక్కవు. వాళ్ల తండ్రిని చంపిన వానిపై పగ తీర్చుకోవడానికి హీరో మహేష్ బాబు బిజినెన్ మ్యాన్ అంటూ ముంబై వెళ్లి ఉచ్చపోయిస్తానంటూ మాఫియా అవతారం ఎత్తుతాడు. పగ తీర్చుకోవడానికి బిజినెస్‌కు మాఫియాకు, హత్యలకు సంబంధం ఏమిటయ్యా అంటే లాజిక్‌లతో తెలుగు సినిమాలు చూస్తే మడికట్టుకుని ఇరానీ హోటల్‌కు వెళ్లినట్టే అంటాడు మహేష్ అభిమాని. రెండువేల థియేటర్లలో సినిమా విడుదల చేశారు. రెండు రోజులు నడిస్తే చాలదా.. నిర్మాతకు రెట్టింపు లాభాలు సంపాదించిపెట్టడానికి. సినిమా వ్యాపారానికి ఇంతకు మించిన లాజిక్ ఏముంటుంది. అసలే సినిమా పేరు బిజినెస్ మేన్. చూసే ప్రేక్షకుడికి, రివ్యూ రాసే సమీక్షకుడికి లాజిక్కుతో పని. సినిమా తీసే నిర్మాతకు పెట్టిన పెట్టుబడికి రెట్టింపు లాభం రావడమే లాజిక్ కదా? నిర్మాత కోణంలో ఆలోచిస్తే బిజినెస్ మేన్‌లో బోలెడు లాజిక్ ఉంది. అనుమానం ఉంటే నిర్మాత ఇంటికి ఆదాయం పన్ను శాఖవారిని పంపి అడిగించండి. ఇదొక్కటే కాదు ఈ మధ్య వచ్చే సినిమాలు ఎక్కువ థియేటర్లలో విడుదలయ్యే లాజిక్‌కు కారణం ఇదే.


 లాజిక్ లేదు అని వాదించే దానిలో సైతం లాజిక్కు ఉంటుంది. ముంతాజ్ పెద్ద అందగెత్త కాదంటారు. ముంతాజ్‌ను షాజహాన్ కళ్లతో చూస్తే ఆమె ఎంత అందగత్తెనో తెలుస్తుంది. సినిమా ప్రేమలో మాత్రం లాజిక్ అస్సలు అర్ధం కాదు. ప్రేమించిన అమ్మాయి కోసం రాజ్యాలను వదలుకోవడం ఏమిటో? రాజకుమారి తోటరాముడ్ని ప్రేమించడం ఏమిటో ? ప్రేమ, లెక్కలకు అస్సలు చిక్కదు.


కొందరు మనుషులను ప్రాంతీయ పార్టీ, జాతీయ పార్టీ అని రెండుగా విభజించేస్తారు. నువ్వు ప్రాంతీయ పార్టీని విమర్శించావు కాబట్టి జాతీయ పార్టీ తొత్తువు అనేస్తారు. జాతీయ పార్టీని విమర్శిస్తే, ప్రాంతీయ చెంచా అంటారు. ఇదే లాజిక్‌తో ప్రపంచంలో మనుషులను రెండుగా విభజించే కాంట్రాక్టు మీకెవడిచ్చాడురా! బాబు అని ప్రశ్నిస్తే, వారి సమాధానంలో లాజిక్కు ఉండదు. భారీ వర్షానికి చెరువు నుండి వచ్చి బావిలో పడిన కప్ప, అప్పటి వరకు బావిలో తిష్టవేసుకున్న కప్పతో సంభాషణ జరుపుతూ ఎక్కడి నుండి వచ్చావు అంటే చెరువు నుండి అని చెప్పిందట! మీ చెరువు ఎంత పెద్దగా ఉంటుంది అని రెండు చేతులు చాపి చూపితే అంత కన్నా పెద్దగా ఉంటుందని చెప్పిందట! చివరకు బావిలో ఒకవైపు నుండి ఇంకో వైపుకు దూకి ఇంత పెద్దగా ఉంటుందా?అని విజయగర్వంతో అడిగిందట బావిలోని కప్ప. బాబోయ్ దీనికి చెప్పడం నా వల్ల కాదు దీని జీవితంలో చూసిన అత్యంత పెద్దది బావి మాత్రమే..! చెరువు అంత కన్నా పెద్దగా ఉంటుందని దీనికి నేను ఎలా చెప్పను? అని చెరువు నుండి వచ్చిన కప్ప తల పట్టుకొంది. వీళ్ల ప్రపంచం రెండు పార్టీల లోపే కుదించుకుపోతుంది. ప్రపంచం అంత కన్నా విశాలమైంది అంటే బావి కన్నా పెద్దది ఉండడానికి వీలే లేదని వాదనకు వస్తారు. వీరి లాజిక్కు అంతే.


ఆ మధ్య ఒక యువకుడు కేంద్ర మంత్రి శరద్‌పవార్‌ను చెంప దెబ్బ కొట్టాడు. కొన్ని వందల మంది అతనికి భారత రత్న ఇవ్వాలని సామాజిక సైట్స్‌లో యువత డిమాండ్ చేశారు. చివరకు ఆ యువకుడు తనకు మతి భ్రమించిందని, ఏం చేస్తున్నానో తనకు తెలియకుండా చేశానని పోలీసు విచారణలో చెప్పాడు. చెంపదెబ్బ కొడితే భారత రత్న కోసం డిమాండ్ చేయడం ఏమిటో? అస్సలు అంతు చిక్కని లాజిక్ .
బిఎస్‌పి గుర్తు ఏనుగు కాబట్టి అది కనిపించకుండా ఎలక్షన్ కమిషన్ వాళ్లు గుడ్డ కప్పమన్నారు. మరి చేయి గుర్తు కనిపించకుండా ఏం చేస్తారు. కొన్ని ఆదేశాలకు లాజిక్ ఉండదు..అంతే! రాందేవ్ బాబాపై సిద్దిఖీ అనే ఒకాయన కోపం వచ్చి ఇంకు చల్లాడు. ఎందుకయ్యా ఇంకు చల్లావు అంటే ఎన్‌కౌంటర్‌పై ప్రశ్నిస్తే ఆయన సమాధానం చెప్పలేదు. అందుకనే ఇంకు చల్లానని చెప్పుకొచ్చాడు. అంటే నువ్వు జర్నలిస్టువా? అని ప్రశ్నిస్తే రాజకీయ నాయకులను ప్రశ్నించే అధికారం 
జర్నలిస్టులకేనా? మా లాంటి వాళ్లు ప్రశ్నించవద్దా? అంటూ వాదనకు దిగాడు.


ఎండా కాలం గాలిలో తేమ శాతం మాదిరిగా బాబు మాటల్లో లాజిక్కు శాతం తక్కువగానే ఉంటుంది. కానీ ఎన్టీఆర్‌ను దించేయడానికి ఆయన చెప్పిన మాటల్లోని లాజిక్ ఎప్పటికీ గుర్తుండిపోతుంది. ఎన్టీఆర్‌ను ఎందుకు దించేశారు? అంటే విధానాలు అమలు చేయడంలో, ఎన్టీఆర్ విఫలమయ్యారు. ఎన్టీఆర్ విధానాలు అమలు చేయడానికే, ఎన్టీఆర్‌ను అధికారం నుంచి దించేశామని బాబు చక్కని లాజిక్ తో మాట్లాడారు.

12 కామెంట్‌లు:

  1. హహ చంద్రబాబు లాజిక్ బాగుందండీ...
    నిజం చెప్పాలంటే ఎవరి లాజిక్ వారికి ఉంటుందండీ.. చాలా సార్లు ఏం జరుగుతుందంటే ఎదుటివాడి లాజిక్ మన లాజిక్ కి అందనపుడు వాడికి లాజిక్ లేదనేస్తాం. ఉదా: బిజినెస్ మాన్ విషయమే తీసుకున్నాం అనుకోండి. ఆ సినిమా చివర్లో ప్రకాష్ రాజ్ ఇంత పగపట్టావేంట్రా అని అడిగితే మహేష్ “నీమీద పగతోనే బతుకుతున్నానుకున్నావా.. నీలాంటోళ్ళు నా జీవితంలో చాలామంది. ఒక్కో స్టేజ్ లో ఒక్కొక్కడు.. నువ్వు మళ్ళీ ఎదురుపడ్డావ్ అంతే” అని చెప్తాడు అలాగే తన అమ్మానాన్న చనిపోయాక తన పరిస్థితి గురించి చెప్తూ “రోడ్లమీద పడుకున్నాను ఒక కుక్కను తన్నినట్లు తన్నారు. అసహ్యం వేసింది మనుషులమీద వ్యవస్థమీద ఈ దేశమ్మీద, వందకోట్ల మంది ఒకవైపూ నేనొక్కడ్ని ఒకవైపు అయిపోయాను. ఆ వందకోట్లమందితో ఆడుకోవాలనిపించింది... కనపడట్లేదు కానీ ఆ దేవుడిమీద కూడా పగ తీర్చుకోవాలనిపిస్తుంది” అని చెప్తాడు. అందుకే వాడలా తయారయ్యాడు తప్ప ఒక్కడి మీద పగ తీర్చుకోడానికి కాదు, తన తల్లిదండ్రులని చంపినవాడి మీద పగతీర్చుకోడానికి వాడ్ని చిన్నప్పుడే పొడిచాడు గన్ తో షూట్ కూడా చేశాడు.

    రిప్లయితొలగించండి
  2. @కృష్ణప్రియ@వేణూ శ్రీకాంత్@raf raafsunస్పందించినందుకు థాంక్స్ .

    జర్నలిస్ట్లు కానీ ఆసక్తి ఉన్నవారు కానీ పరిశీలించి చూడండి . రామారావును ఎందుకు దించాల్సి వచ్చిందో ? రామ రావు చేసిన తప్పు ఏమిటో బాబు ఇప్పటి వరకు బహిరంగంగా కారణాలు చెప్పలేదు . మీడియా తన సొంత కథనాలుగా రాసుకోండి కానీ బాబు అధికారికంగా నూరు మెదపలేదు . ఆసక్తి ఉన్నవారు ౧౯౯౫ ఆగస్ట్, సెప్టెంబర్ పత్రికలు గ్రందాలయంలో చూస్తే తెలుస్తుంది . ఒక్క ముక్క కూడా బాబు బహిరంగంగా చెప్పలేదు . బాబు తరపున మిదియనే రాసుకొంది

    రిప్లయితొలగించండి
  3. హహహ్హ్.. భలే చెప్పారు.. లాజికల్ గా.. :)

    రిప్లయితొలగించండి
  4. హహహ ఎక్కడినుండి ఎక్కడికి ముడిపెట్టారండీ బాబు!
    చంద్రబాబు లాజిక్ మాత్రం కేక!

    రిప్లయితొలగించండి
  5. యన్.టి.రామారావుని దించడానికి గల కారణాలు అప్పటి కాలపు ప్రజలందరికీ మంచి అవగాహనే ఉన్నది. 1984లో నాదేండ్ల యన్.టి.ఆర్‌ని పదవి నుండి దించినప్పుడూ..రాష్ట్రమంతటా అగ్నిగుండంలా మారింది.దేశం యావత్తు యన్.టి.ఆర్‌కి మద్దతు ఇచ్చింది..! మరదే యన్.టి.ఆర్‌ని 1995 లో చంద్రబాబు మీరనుకొంటున్న వెన్నుపోటు పోడిస్తే..ఒక్క తెలుగు ప్రజ కూడ స్పందించలేదు..యన్.టి.ఆర్ మీద సానుభూతితో..! యన్.టి.ఆరే స్వయంగ తనను పదవి నుండి దించిన కుట్రకు నిరశనగా నలుపు బట్టలు తొడుక్కొని మరీ ప్రజల్లోకి వెళ్ళారు కాని ఎక్కడ ఆయన సభలకు ప్రజలు హాజరు కాలేదు... ఎందుకంటారు...? ఒక్క సారి ఈ విషయం మీద థింకండి..ఎవరైనా..??

    రిప్లయితొలగించండి
  6. కమల్ గారు మీ వాదన బాగుందండి ఇది జగన్ చదివితే బాగుండు. రెండు మూడు వందల రూపాయలున్న జేబును కొట్టేస్తేనే చితగ్గొడతారు .అలాంటిది జగన్ లక్ష కోట్లు సంపాదించాడని అంటున్నారు పది షాతం నిజాం అనుకున్నా పదివేల కోట్లు సంపదిన్చాదనుకుండం మరీ జనం హహ కారాలు చేయలేదేమిక్తి కాబట్టి జగన్ అవినీతికి పాల్పడలేదు . అనవసరంగా కేసుల పరిష్కారానికి ఏంటో సమయం, డబ్బు వరుడ చేస్తున్నారు . మీ కోణం లో ఆలోచిస్తే ఎన్నో కేసులను క్షణాల్లో పరిష్కరించవచ్చు ( సరదాగానే)

    రిప్లయితొలగించండి
  7. బుద్ద మురళి గారు..! హ..హ..హ.. బాగుందండి మీ వాదన..! ఇలా కూడ అంటే మాటల గారడితో ఈ విషయాన్ని చర్చ కన్న వాదించొచ్చు అనిపిస్తున్నది మీ వ్యాక్య చూస్తుంటే.
    జగన్ ఆర్థుల్ని సంపాదించుకొన్నాడన్న విషయం తెలుగుప్రజలలొ చాలా మందికే అవగాహన వున్నది కాని హా హా కారాలు ఎందుకు చేస్తారు..? దానికి..యన్.టి.ఆర్ వెన్నుపోటు సందర్భానికి లింకేంటి..? జగన్ తను అవినీతికి పాల్పడలేదంటు.. తను సచ్చీలడంటూ నిరూపించుకోవడానికి సభలు జరపట్లలేదు కదా..? తన అవినీతిలో మీకింత భాగస్వామ్యం ఇస్తానంటూ తిరుగుతున్నారు.కాబట్టి..ఈ పోలిక అంతగా కుదరలేదండి..మరొకటి ఏదన్న ఉంటే తీసుకురండి అప్పుడు చర్చించుకొందాము.

    రిప్లయితొలగించండి
  8. సంపాదించినా దానిలో కొంత ఇస్తానంటే అంతకన్నా ఇంకేం .సంతోషం మొత్తం తిని నైతిక విలువల గురించి మాట్లాడే వారి కన్నా కొంత ఇస్తానని చెప్పడం సంతోషం ఈ సారి కలిస్తే నా అడ్రెస్స్ చెప్పడం మరవకండి అసలే పెరిగిన ధరలతో సతమతమవుతున్నాం

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం