16, జూన్ 2013, ఆదివారం

ఒక్క మన దేశం తప్ప అన్నీ మనవే గొప్పరూపాయి పతనం అంటూ ntv లో రాత్రి ప్రత్యేక కథనం వచ్చింది .. బాగుంది ..  ఈ పతనానికి కారణాల్లో మనం ఉన్నాం అనేది కథనం  సారాంశం .. మనం రోజూ  వాడే అనేక  వస్తువులు బహుళ జాతి కంపెనిలవే .. దీంతో మన కంపెనీలు ముత  పడుతూ బహుళ జాతి కంపెనీలు బాగుపడుతున్నాయని చెప్పారు .  అంతా నిజమే .. అయితే ఈ ప్రత్యెక కథనం మధ్యలో వచ్చిన ప్రకటనలు ఎక్కువగా బహుళ జాతి కంపెనిలవే ... 
 బానిసత్వం మన నరనరాన జిర్నించుకు పోవడమే. విదేశీ కంపెనీలపై  మోజుకు కారణం .. 

మనది మహోన్నత కులం ... ఇతర కులాలు అద్వాన్నం 
మంది మహోన్నత మతం ఇతర కులాలు చెత్త 
మన ప్రాంతం గొప్పది ఇతర ప్రాంతాల వారు  అనాగరికులు

మన కుల పొడి పార్టీ మహోన్నతమయింది -  ఇతర పార్టీ లు చెత్త 
ఆగండాగండి అన్ని విషయాల్లో మనదే  గొప్ప .. దేశం విషయం లో మాత్రం ????
మన దేశ సరుకు చెత్త .. విదేశియిడైతే అపూర్వం .. అమెరికాదే కానవసరం లేదు చివరకు నేపాల్ దైనా సరే అద్భుతం ... ఎంత రేటు కైనా కొంటాం 
ఎందుకంటె మన జీన్స్ లోనే బానిసత్వం ఉంది ... ఒకటా రెండా కొన్ని వందల సంవత్సరాల పాటు మనను విదేశీయులు పాలించారు ..( తొలుత ముస్లిం పాలకులు, తరువాత  బ్రిటిష్ వాడు ) 

2 కామెంట్‌లు:

  1. :) బాగా చెప్పారు , ఆలొచింప జేశారు నా ముందు lenovo ఉంది చేతిలో iPhone ఉంది . ఏం చేయను ? మన దేశపు తయారీ ఏమున్నాయో!

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం