22, మే 2011, ఆదివారం

అంట్లు తోముకుంటున్న అక్కినేనినాగేశ్వర రావు........ మా సికింద్రాబాద్ కథలు 1

.. హీరో నాగార్జున తన మేనల్లుడిని హీరో గా పరిచయం చేస్తూ అక్కినేని కుటుంబం  నుంచి మరో హీరో వచాడు. అతన్ని మీకు అప్పగిస్తున్నాను మీ భుజాల మీద మోయండి అని చెప్పగానే అభిమానులు కేరింతలు కొట్టారు. ఇది టివి లో ఆందరూ చూసిందే నేను కొత్తగా చెప్పాల్సింది లేదు.  ఇలాంటివి చూసి నవ్వుకునే నన్ను బాగా కదిలించిన సంఘటన మీతో పంచుకోవాలని.. 
*********
  .....  
   పాతికేళ్ళ క్రితం సికింద్రాబాద్ మోండా మార్కెట్ వద్ద మా అన్నయ్య  హోల్ సెల్  షాప్ ప్రారంభించాడు. సహాయంగా నేను వెళ్ళే వాడిని కాలేజి కి వెళ్ళే వరకు అక్కడే ఉండే వాడిని. అన్నయ్య షాప్ లో  ఒకతను చేరాడు అతని వాలకం కొంచం చిత్రంగా అనిపించేది. వీళ్ళంతా సామాన్యులు, నేను చాల గొప్పవాడిని అన్నట్టు ఉండేది అతని వాలకం. అంటే గంధర్వుడు శాప వశాన మానవుడిగా ఉన్నట్టు అన్న మాట. . 
 అచ్చం అక్కినేని లా హెయిర్ స్టైల్ ఉండేది. కొద్ది రోజుల తరువాత నన్ను కరుణించి మాట్లాడడం మొదలు పెట్టాడు. ఆతను జూనియర్ అక్కినేని అట. రికార్డింగ్ డాన్సు లు చేస్తాడు. ముషిరా బాద్ లో కొంచం డబ్బు ఉన్న వల్ల అమ్మాయినే ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఇతన్ని కొద్ది రోజుల పాటు వాళ్ళు భరించారు. ఆ రికార్డింగ్ డాన్సులు వదిలేసి బుద్దిగా ఏదైనా పని చేసుకోమని చాల సార్లు నచ్చ చెప్పారు.
 కళామతల్లి నెత్తికి ఎక్కడం వల్ల వారి మాటలు అతనిపై పని చేయలేదు. రికార్డింగ్ డాన్సులు కావాలో బార్య కావాలో తేల్చుకో అని మామ పరీక్ష పెట్టాడు. కళ ముందు కళావతి తరువాత అనుకున్న ఆతను బార్యను, అప్పటి వరకు ఉన్న మామ ఇంటిని వదిలేసి బయటకు వచ్చాడు. సరే ఇప్పటికి మీ ఆన్న షాప్ లో పని చేస్తున్న తరువాత వెళ్లి పోతాను అని చెప్పాడు. అతని రికార్డింగ్ డాన్సులు యెంత అద్బుతంగా ఉంటాయో, అమ్మాయిలు  అతని డాన్సు కు ఎలా పడిపోతారో కథలు కథలుగా చెప్పే వాడు. 


 ఆ రోజుల్లో యంటి ఆర్ అభిమానులు , కృష్ణ , నాగేశ్వర్ రావు అభిమానులు అనే స్పష్టమైన విబజన  ఉండేది . అప్పటి నుంచే నాకు మాత్రం అలంటి పట్టింపులు ఉండేవి కాదు. ఎవడైతే  మన కేంటి సినిమా బాగుంటే చుద్దాం అనుకునే వాడిని. ఒక సారి ఆతను( నిజంగా నాకు అతని పేరు తెలియదు. అక్కినేని అనే పిలిచే వాడిని.) తన అనుభవాలు చెబుతూ  కోస్తాలో ఏదో గ్రామం లో రికార్డింగ్ డాన్సు చేసి తిరిగి వస్తున్నాడట . దారిలో ఏదో షూటింగ్ కు పోయా అక్కినేని నాగేశ్వర్ రావు వస్తున్నారు. రైల్ గేటు పాడడం వల్ల ఒకరిని ఒకరు చూసుకున్నారు. అంతే ఒక్క సారిగా అక్కినేని నాగేశ్వర్ రావు ముక   కవళికలు మారి పోయాయి . అని చెప్పగానే ఎందుకు అని నేను ఆశ్చర్యంగా అడిగాను. ఒకరు చెప్పే విషయం నమ్మినా, నమ్మక పోయినా  ఆసక్తిగా వినడం నా అలవాటు. నేను అచ్చం అక్కినేనిలానే ఉన్నాను కదా నన్ను , నా హెయిర్ స్టైల్ చూసి ముకం మాడ్చుకున్నాడు అని మా అక్కినేని చెప్పాడు. ఆ వయసులో కుడా అది నాకు నమ్మ బుద్ది  కాలేదు. కొద్ది రోజుల తరువాత ఆతను వెళ్లి పోయాడు. నా చదువు , ఉద్యోగం లో పడి పోయాక ఆతను నాకు ఎప్పుడూ గుర్తుకు రాలేదు.

 ****** 
 ఇటీవల మా కొలీగ్ కూతురు పెళ్లి జూబ్లి బస్డిపో సమీపం లోని మ్యారేజి హలో జరిగింది  ఆఫీసులో అందరం వెళ్ళాం . జర్నలిస్ట్ కావడం వల్ల చాలామంది ప్రముక రాజకీయ నాయకులో వచ్చారు. ఫ్రెండ్స్ తో జోకులేస్తూ భోజనం చేస్తున్నాము. వాష్ బేసిన్ ఎక్కడుందో కనిపించడం లేదు . ఆందరూ తిన్న ప్లేట్లు ఉన్న పెద్ద ( దాన్ని ఏమంటారు గుర్తు రావడం లేదు ) దాన్ని ఇద్దరు వ్యక్తులు చెరో వైపు పట్టుకేలుతున్నారు. ప్లేట్లు  కడిగే వాడికి వాష్ బేసిన్ ఎక్కడుంటుందో తెలుస్తుంది కదా అని బాబు వాష్ బేసిన్ ఎక్కడుంది అని అడిగాను . ఆతను చూపించాడు. అతని నడక , హెయిర్ స్టైల్ కొంత తేడాగా అనిపించింది . ముందు వాష్ బేసిన్ ముక్యం అనుకోని వెళ్లి పోయాను. అప్పుడు గుర్తుకు వచ్చింది. అది పాతికేళ్ళ క్రితం అక్కినేని నాగేశ్వర్ రావు  హెయిర్ స్టైల్ అని. అతని నడక అక్కినేనిల ఉందని. ఆతను మా అక్కినేని అని గుర్తుకు వచ్చింది పాపం అనిపించింది . ఎక్కడికో వెళ్లి పోతాను అని చెప్పిన ఆతను చివరకు ఎంగిలి ప్లేట్లకు అంకితం కావడం మనసును కలచి వేసింది. నేను కనీసం వెనక్కి తిరిగి కూడా చూడలేదు. ఆతను నన్ను గుర్తు పట్టి ఉండక పోవచ్చు కానీ నేను మాత్రం అతన్ని గుర్తుపట్టాను. తరువాత అనిపించింది. అతన్ని పలకరించి ఉండాల్సింది అని . విజయం సాదించిన వాడి కన్నా పరాజయం సాదించిన వాడి అనుభవాలు బాగా ఉపయోగ పడతాయి. తన జీవితాన్ని తన చేతులతో తానె పాడు చేసుకున్నానని ఆతను యిప్పటి కైనా తెలుసుకున్నాడో లేదో ? ఆ రోజు అక్కినేని తను చూసింది జేలసితో కాదు చిరాకుతో అని ఇప్పటికైనా తెలుసుకున్నాడో లేదో ? అక్కినేని కొడుకు, మనవడు, అక్క కొడుకు, చెల్లెలి కొడుకు సమస్త బందు గణం నుంచి హీరోలు వచ్చారు. అదివారి ఇష్టం  . కాని అభిమానం అంటూ జీవితాన్ని వృదా చేసుకుంటే    త రు వాత ఏడ్చినా ప్రయోజనం ఉండడు.  ఈ కాలం లో అంతగా కనిపించడం లేదు కాని గతం లో హీరోల కోసం జీవితాలను నాశనం చేసుకునే వారు .  చిరంజీవి పార్టీ పెట్టాలని ఆ మద్య ఖమ్మం   లో ఒక వ్యక్తీ ఆత్మా హత్య చేసుకున్నాడు. చిరంజీవి పార్టీ పెట్టాడు ఏమైంది. నటించడం వారి వ్రిత్తి అలానే, చదువు, ఉద్యోగం ఎవరి వ్రుత్తి వారు చేసుకోవాలి. ఎవరి కోసమో జీవితాలు వృదా చేసుకోవడం ఎందుకు. నిజానికి అక్కినేని ఐన ఎవరైనా అభిమానం పేరుతో జీవితాలు నాశనం చేసుకూమని చెప్పారు. వారికి అలంటి పిచ్చి అభిమానం నచ్చదు  కుడా . సికింద్రాబాద్ కథలు పేరుతొ  అప్పుడప్పుడు ఇలాంటి అనుభవాలు  రాయాలని అనుకుంటున్నా .........

12 కామెంట్‌లు:

  1. సినీ మాయా జాలం చిక్కుకున్న మరో అభాగ్య జీవి వ్యధ బాగా రాసారు.

    రిప్లయితొలగించండి
  2. కదిలించే కథనం. టైటిలు మాత్రం అదోలా ఉంది - ఏదన్నా మార్చి పెట్టలేరా??

    రిప్లయితొలగించండి
  3. మరెందుండీ ఆలస్యం??? వెయిటింగ్ ఇక్కడ

    రిప్లయితొలగించండి
  4. @కొత్త పాళీ గారు మీరు చెప్పింది నిజమేనండి . రాసేప్పుడు నాకు అలానేఅనిపించింది కానీ నిజం చెప్పండి ఆ టైటిల్ చూసే కదా మీరు చదివింది .
    @షాడో గారు నచ్చినందుకు థాంక్స్
    @రాజేంద్ర గారు థాంక్స్ వారనికోటైన రాయాలని ఉందండి

    రిప్లయితొలగించండి
  5. ప్చ్, పాపం..మనసు కదిలించింది అతని వ్యధ....ఇలా ఎంతమందో! :(

    రిప్లయితొలగించండి
  6. కొత్తపాళీ గారు బహుశా అన్నీ చదువుతారనుకుంటాను కానీ నేను నిజంగానే ఆ శీర్షిక చూసి చదివాను ఇది. ఇంకో అక్కినేని నాగేశ్వర రావు గూర్చి వ్రాసి ఉంటారనుకున్నాను.

    చాలా బాగుంది. మా చిన్నప్పుడు NTR, ANR అభిమానుల కధలు చాలానే విన్నాము. హీరో లు బాగానే ఉన్నారు. చెడింది కొంత మంది అభిమానులే.

    రిప్లయితొలగించండి
  7. superb!hope u write more in the title of "maa secundrabad kathalu".
    mrityunjayచే 5/23/11న

    రిప్లయితొలగించండి
  8. విజయం సాధించిన వాడికన్నా పరాజయం పొందిన వాడి అనుభవాలు ఎక్కువ ఉపయోగపడతాయి. నిజం. పరాజయాన్ని మనం సాధించడానికి ప్రయత్నం చెయ్యకపోయినా ఒక్కోసారి అది మనని వరిస్తుంది. మీరు అతన్ని గుర్తుపట్టినట్టుగా అతనికి తెలియపరచవలసింది అతనేమనేవాడో. అతని జీవితంలో వైఫల్యానికి కారణాలు ఏవో చెప్పేవాడేమో.
    అప్పట్లో హీరోల అభిమాన సంఘాలుండేవి. వారిమధ్య దొమ్మీలు జరిగేవి. అక్కినేని అభిమాన సంఘం కార్యదర్శి మా మామయ్య అర్థరాత్రి ముసుగేసుకొని..వేషం మార్చి వేరే హీరో సినిమాలు చూడడం మాకు తెలుసు మా చిన్నతనంలో. అంత భయభక్తులుండేవి ...హీరోలంటే :-))
    ప్రస్తుతం ట్రెండ్ సినీ హీరోలకి కాక రాజకీయనాయకులకి వీరాభిమానులుగా ఉండడం...హీరోలకి అభిమానులైతే కేవలం డబ్బుఖర్చే గాని రాజకీయులకైతే డబ్బు చేసుకోవచ్చన్న సత్యాన్ని కొందరు గ్రహించారు.

    రిప్లయితొలగించండి
  9. నిజమే నండి నాకు అలానే అనిపించింది మాట్లాడి ఉండాల్సిందని , బహుశ అక్కడ ఉన్న ప్రముకులు నాకు జర్నలిస్ట్ గా పరిచయం. వారి ముందు ఒక అంట్లు తోమే వాడితో మాట్లాడడం బాగోదని అనుకున్ననేమో

    రిప్లయితొలగించండి
  10. Very nice post. but వారి ముందు ఒక అంట్లు తోమే వాడితో మాట్లాడడం బాగోదని అనుకున్ననేమో....this is paining me.

    madhuri.

    రిప్లయితొలగించండి
  11. నిజమే నండి మనం మామూలు మనుషులం మహానుభావులం కాదు ఆ సమయం లో మాట్లాడ లేదు కాని తరువాత మాట్లాడక తప్పు చేశానని అనిపించింది.

    రిప్లయితొలగించండి
  12. meeru ippudu velte kanabadutademo kada..try cheyyandi..

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం