ఎన్నాళ్లకెన్నాళ్లకు వచ్చావ్.. నీ అమెరికా యాత్ర విశేషాలు వినేందుకు మూడు వారాల నుంచి ఎదురు చూస్తున్నాను..’’
‘‘అక్కడున్నా- మన విప్లవకవుల గ్రూపులో రోజూ విప్లవ కవిత్వంతో అందరినీ పలకరిస్తూనే ఉన్నాను కదా?’’
‘‘కవిత్వంతో పలకరించడం, కాఫీ తాగుతూ ఎదురెదురుగా కూర్చుని పలకరించడం వేరు వేరు. చెల్లెమ్మా.. నీ చేత్తో ఇచ్చిన కాఫీ తాగి ఎన్ని రోజులు అవుతుందో.. కాఫీ ఇవ్వమ్మా!’’
‘‘బాగున్నారా.. అన్నయ్య గారూ.. అమెరికాలో అబ్బాయి ఇంట్లో ఉన్నామన్న మాటే కానీ ఆయన స్మార్ట్ఫోన్‌కు అతుక్కుపోయి నిరంతరం కవితా లోకంలోనే ఉండేవారు.’’
‘‘అంత దూరంలో ఉండి- విప్లవ కవిత్వంతో నువ్వు కురిపించిన అగ్ని జ్వాలలు చాలా ఆలోచింపజేసే విధంగా ఉన్నాయి. నువ్వు అగ్ని పునీతుడివి.. అమెరికా సామ్రాజ్యవాద ప్రభావం పడకుండా స్వచ్ఛమైన అగ్ని గోళాలను కురిపించావ్.. నువ్వు గ్రేట్ రా!’’
‘‘అభ్యుదయం అనే కవితా వాయువును శ్వాసించే మనలాంటి విప్లవ కవులు ఎక్కడున్నా అంతే. స్టార్ హోటల్‌లో కూర్చున్నా పేదరికంపై కన్నీళ్లు పెట్టించేలా రాయగలం.’’
‘‘తెలుగులో రాస్తున్నావు.. అదే కవిత్వాన్ని ఇంగ్లీష్‌లో రాసి ఉంటే అమెరికా యువత కూడ సామ్రాజ్యావాదానికి వ్యతిరేకంగా అడవి బాట పట్టేది. ఏరా.. అమెరికాలో అచ్చం ఇక్కడున్నట్టే అడవులు ఉంటాయా? అడవుల్లో అన్నలుంటారా?’’
‘‘మనకు రికార్డుల్లో అడవులుంటాయి. అక్కడ అడుగడుగునా అడవిలానే ఉంటుంది. నిజమైన అడవులుంటాయి. కానీ ఏం లాభం.. అడవుల్లో అన్నలుండరు. చెట్లే ఉంటాయి.’’
‘‘నువ్వు ఎటువైపు..? అంటూ మన అప్పారావు కవులను ప్రశ్నిస్తూ రాసిన విప్లవ కవిత్వంపై నువ్వేమంటావ్?’’
‘‘చాలా కష్టమైన ప్రశ్న. ఎటూ తేల్చుకోలేం. ప్రతి జిల్లాలో అడవులున్నాయి. ప్రతి అడవిని ఆధారం చేసుకుని నాలుగైదు విప్లవ గ్రూపులున్నాయి. మల్లారెడ్డి స్వీట్స్ సక్సెస్ కాగానే- గల్లీకో రెడ్డి స్వీట్స్ షాప్‌లు ఏర్పడ్డాయి. ’’
‘‘ఔను.. మల్లారెడ్డి స్వీట్స్ తరువాత నాకంతగా నచ్చింది సహోదర్‌రెడ్డి స్వీట్స్. చాలామంది రెడ్డేతరులు కూడా వేరువేరు పేర్లతో స్వీట్స్‌షాప్‌లు పెట్టారనుకో. ’’
‘‘ఇక్కడ చర్చ స్వీట్స్ గురించి కాదు. ఒక్కో అడవిలో కనీసం నాలుగైదు విప్లవ గ్రూపులు ఉన్నాయి కదా? వీటిలో ఏ గ్రూపునకు మద్దతుగా విప్లవ కవిత్వం రాయాలో తేల్చుకోలేక పోతున్నాను. విప్లవ గ్రూపుల జేఏసీ ఏర్పాటు చేసి దానికి మనం కన్వీనర్‌గా ఉంటే ఎలా ఉంటుందంటావ్’’
‘‘అంటే నువ్వు కూడా అడవిలోకి వెళతావా?’’
‘‘్ఛ..్ఛ.. ఆ ఖర్మ నాకేం పట్టింది? బయటే ఉండి అడవిలోని వారికి మార్గదర్శనం చేస్తాను. ’’
‘‘ అది సరే- మీ అబ్బాయిని పంపినట్టే అమ్మాయిని కూడా అమెరికా పంపిస్తానన్నావు ఎంత వరకు వచ్చింది?’’
‘‘ట్రంప్ అధికారంలోకి రావడానికి కన్నా ముందు అబ్బాయి అమెరికా వెళ్లాడు. ఇప్పుడు ట్రంప్ రో జుకో రూల్ తెస్తున్నాడు. అమెరికా పంపించాలా? కెన డా పంపించాలా? ఎటూ తేల డం లేదు. రెండు దేశాల్లో చ దువుకేమో ఖర్చు ఒకటే, కానీ చదువు పూర్తయ్యాక వారి సంపాదన కూడా చూడాలి కదా? అమెరికా డాలర్‌కైతే మన కరెన్సీలో 74 రూపాయలు వస్తాయి. అదే కెనడా డాలర్ ఐతే 53 రూపాయలు మాత్రమే అంటే- వారి సంపాదనలో ఒక్కో రూపాయికి 21 రూపాయల తేడా ఉంటుంది. ఎటూ తేల్చుకోలేక పోతున్నా..’’
‘‘నిజమేరా! ఇదంత ఈజీగా తేల్చుకునే విషయం కాదు. అమెరికా వాడేమో రావద్దని, వచ్చిన వాళ్లు ఉండొద్దని మొకాళ్లు అడ్డంగా పెడుతున్నాడు. కెనడా వాడేమో రెడ్ కార్పెట్ వేసి మరీ స్వాగతం పలుకుతున్నాడు.. ఐతే మాత్రం 21 రూపాయల తేడా మాటేంది? ’’
‘‘దాని గురించే ఆలోచిస్తూ ఏ నిర్ణయం తీసుకోలేక కవిత్వం కూడా రాయలేక పోతున్నాను.’’
‘‘మనిషి జీవితంలో ఇలాంటి సమస్య వస్తూనే ఉంటుంది. ఉడిపి శ్రీకృష్ణ భవన్‌లో అటు చూస్తే బాదం హల్వా, ఇంటు చూస్తే సేమ్యా ఇడ్లీ అంటూ శ్రీశ్రీ లాంటి వారు అటా? ఇటా? అని ఎటూ తేల్చుకోలేక పోయారు. ’’
‘‘బాగా చెప్పావు.. చూడడానికి చిన్న సమస్యలానే అనిపిస్తుంది. రెండింటిలో ఏదో ఒకటి ఎన్నుకోవచ్చు కదా? అంటారు కానీ అదెంత కష్టమో నిర్ణయం తీసుకునేవాడికి తెలుస్తుంది. బాదం హల్వా తెప్పించుకున్నాక పక్కనోడు ఇడ్లీ తెప్పించుకుంటే అరె- తప్పు చేశాం మనమూ ఇడ్లీ తెప్పించుకోవాల్సింది అనిపిస్తుంది’’
‘‘ప్రపంచానికి, దేశాలకే ఇలాంటి సమస్య వచ్చినప్పుడు నువ్వు, నేను ఎంత ? అమెరికా వైపా? రష్యా వైపా? తేల్చుకోమంటే నెహ్రూ లాంటి వారే ఎటూ తేల్చుకోలేక అలీన విధానం అంటూ మూడోది ఎన్నుకున్నారు.’’
‘‘్భ మండలంపైనే నివాసానికి అవకాశం ఉంది కాబట్టి బతికి పోయాం. ఇప్పుడు మరో గ్రహంపై కూడా మానవ నివాసానికి అవకాశాలు ఉంటాయంటున్నారు. రెండింటిలో ఏదో ఒకటి నిర్ణయించుకోవాలంటే ఎంత కష్టమో?’’
‘‘నీ కవిత్వం చదివితే ఈ వయసులో నాక్కూడా అడవి బాట పట్టాలనిపిస్తుంది. అలాంటిది యువకుల్లో ఎంత ప్రభావం ఉంటుందో చెప్పలేం. నీ కవిత్వం చదివి మీ పిల్లలేమంటారు?’’
‘‘వాళ్లకు తెలుగు రాదు..’’
‘‘ఇంగ్లీష్‌లోకి అనువాదం చేసి వినిపిస్తే అమెరికా, కెనడాలో ఏదో ఒకటి ఎంపిక చేసుకోవడం కాదు కచ్చితంగా అడవి బాట ఎంపిక చేసుకుంటారు. నీ అడవి బాట కవితా సంకలంనలో యువత ఎటు పోవాలో చక్కగా చెప్పావు. ఆ కవిత్వం వింటే మీ పిల్లలు కూడా అడవి బాట పడతారు. నీ వారసత్వాన్ని నిలబెడతారు.’’
‘‘ఆ మాటలు అనడానికి నీకు నోరెలా వచ్చిందిరా? బంగారు భవిష్యత్తు ఉన్న నా పిల్లలు అడవిబాట పట్టాలంటావా? నువ్వసలు మనిషివేనా?’’
‘‘అన్నయ్యా.. అని మిమ్ములను ఎంత గౌరవంగా పిలిచాను. నువ్వసలు మనిషివేనా? మనిషి రూపంలో ఉన్న రాక్షసుడివా? ఇంత కాలం అన్నయ్యా అని ఆప్యాయంగా అనిపిలిచాను కాబట్టి క్షమించి వదిలేస్తున్నా, అదే మరొకడు ఈ మాట అనుంటే రోకలి బండతో కొట్టేదాన్ని’’
‘‘నేను తప్పు మాటేమన్నానురా! మీ దంపతులు నన్నలా చూస్తున్నారు. నీ విప్లవ కవిత్వం విని ఎంతోమంది అడవి బాట పట్టారని నువ్వే ఎన్నో సభల్లో గర్వంగా చెప్పుకున్నావ్! నీ కవిత్వం ప్రభావం మీ పిల్లలపై ఉంటుందంటే తప్పా?’’
‘‘ఇంకో మాట మాట్లాడావంటే నేనేం చెస్తానో నాకే తెలియదు. గెటౌట్!. పైన తథాస్తు దేవతలు ఉంటారు . ఏమేవ్ పిల్లలకు దిష్టి తీయి . మన పిల్లల మీద వీడి కన్ను పడుతుంది అని కలలో కూడా అనుకోలేదు ’’
బుద్దా మురళి (జనాంతికం 2-11-2018)
*

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం