టీవీల్లో కొన్ని క్షణాల పాటు కనిపించే ప్రకటనలు మనపై చూపించే ప్రభావం అంతా ఇంతా కాదు. మనకు అది కొన్ని క్షణాలే కనిపించ వచ్చు కానీ దాని వెనుక పెద్ద పెద్ద వ్యూహాలు, కోట్ల రూపాయల ఖర్చు, అంత కన్నా ఎన్నో రేట్ల ఆదాయ వ్యూహాలు ఉంటాయి.
భారతీయుల్లో సగటున దాదాపు 30శాతం పొదుపు ఉంటుంది. అమెరికాలో ఇది చాలా తక్కువ. ఇంత పెద్ద మొత్తంలో మన పొదుపు శాతం ఉండడం అమెరికా కంపెనీలకు ఏ మాత్రం నచ్చలేదు. మనకు చిత్రంగా అనిపించవచ్చు కానీ మన పొదుపు శాతం తగ్గించాలి అంటే ఏం చేయాలని అమెరికాలో కంపెనీలు సదస్సులు నిర్వహించారు.
తమ ఆదాయం కోసం ఆయా దేశాల్లో అలవాట్లను సైతం మార్చేయగల శక్తి సామర్థ్యాలు బహుళ జాతి కంపెనీలకు ఉంటాయి. కొంత వరకు అవి తమ ప్రభావం చూపించాయి కూడా! మనకే తెలియకుండా మన మీద ప్రభావం చూపిస్తారు. మనకు తెలియకుండానే మన జేబులు ఖాళీ చేయగలరు.
టీవీలో వచ్చే ఈ ప్రకటన చూసే ఉంటారు.
ఒక అమ్మాయి అబ్బాయి ఓ మాల్‌లో వస్తువులు కొనేందుకు వెళతారు. ఒకరినొకరు కొంటె చూపులు చూసుకుంటారు. ఇద్దరూ వరుసగా ఒకే రకమైన వస్తువులు కొంటారు. బిల్లు చెల్లించేందుకు కౌంటర్ వద్దకు వచ్చినప్పుడు యువకుడు తన జేబుల్లో నుంచి డబ్బులు తీస్తాడు. చిల్లర నాణాలు, నోట్లు అన్ని జేబుల్లో నుంచి తీసి ఇస్తాడు. అప్పటి వరకు అతన్ని ప్రేమగా చూసిన ఆ యువతి దీంతో అతన్ని చిరాగ్గా చూస్తుంది. తాను మాత్రం స్టైల్‌గా కార్డు ద్వారా బిల్లు చెల్లిస్తుంది. నగదు చెల్లించడం అసహ్యకరం అన్నట్టుగా ఉంటుంది ఈ ప్రకటన.
ఆ సంస్థ తమ కార్డుల అమ్మకాలు పెంచడం కోసం ఇప్పటి వరకు మనకున్న నగదు చెల్లించే అలవాటును అసహ్యకరం అని మనకే అనిపించేట్టు ఇలాంటి ప్రకటనల ద్వారా చేస్తారు.
డబ్బు విలువ తెలియాలి అంటే కార్డుతో చెల్లించడం కన్నా కష్టపడి సంపాదించిన ఆ డబ్బును చేతితో తడిమి ఇవ్వడం మంచిది. ఇతర మార్గాల ద్వారా లెక్కలేనంత ధనం సంపాదించిన వారి సంగతి వేరు. కష్టపడి సంపాదించే మధ్యతరగతి, దిగువ తరగతి వారు, నెల నెలా జీతంపై బతికే వారు ఆర్థిక క్రమశిక్షణ అలవాటు ఉన్న వారు కార్డుపై చెల్లించడం కన్నా నగదు చెల్లించడం వల్ల ఎక్కువ ప్రయోజనాలు ఉన్నాయి.
దీని కోసం యూనివర్సిటీలు పెద్ద పెద్ద ప్రయోగాలు చేసి చెప్పాల్సిన అవసరం లేదు. మీకు మీరే తేడా తెలుసుకుంటారు. ఇంట్లోకి అవసరం అయిన ఒక నెల వస్తువులను షాపునకు వెళ్లినగదు చెల్లించి తీసుకోండి ఎంత బిల్లు అవుతుందో చూడండి. అదే పెద్ద మాల్‌కు వెళ్లి కార్డు ద్వారా చెల్లించి చూడండి తేడా తెలుస్తుంది.
డబ్బు లెక్క పెట్టి చెల్లించడం ద్వారా ఇంత డబ్బు ఖర్చు పెట్టడం అవసరమా? ఖరీదైన ఈ వస్తువు కొనడం అనివార్యమా? అనే అనేక ఆలోచనలు వస్తాయి. కార్డు ద్వారా అయితే డబ్బుకు సంబంధించిన ఆలోచనే రాదు. కార్డు ఇస్తున్నాం తప్ప డబ్బు ఇవ్వడం లేదు కదా? అనే ఆలోచన ఉంటుంది. ఇలాంటి ఆలోచన పెద్ద వారి కన్నా యువతకు ఎక్కువ. కార్డు ద్వారా చెల్లించడం వల్ల డబ్బు విలువ తెలియదు. ఖర్చుపై అదుపు ఉండదు.
వేల రూపాయలు పెట్టి ఈజీగా కార్డుపైనో, ఇఎంఐలతోనో ఖరీదైన టీవిలు కొనేస్తాం కానీ నగదు చెల్లించి కొనాలంటే నాలుగుసార్లు ఆలోచిస్తాం. ఇది అవసరమా? అని ప్రశ్న మొదట ఉదయిస్తుంది.
ఆఫీసుకు వెళ్లే హడావుడిలో విద్యుత్ కార్యాలయానికి వెళ్లి గంటల తరబడి క్యూలో నిలబడి విద్యుత్ బిల్లు కట్టడం వంటి వాటి విషయం వేరు. బిల్లులు చెల్లించేందుకు ఆన్‌లైన్ సౌకర్యాన్ని ఉపయోగించుకోవచ్చు. కానీ ఖరీదైన వస్తువులు కార్డు ద్వారానో, ఆన్‌లైన్‌లోనో, ఇఎంఐల ద్వారానో కొనేప్పుడు డబ్బుకు విలువ ఇచ్చే వారు ఒకటికి పది సార్లు ఆలోచించాలి. ఇది కొనడం అవసరమా? ఇప్పుడే కొనడం అవసరమా? అనే ప్రశ్నను మీకు మీరే వేసుకోవాలి. డబ్బు విలువ తెలియాలి అంటే వాటిని చేతితో సృజించి చెల్లించడమే మంచిది. నగదు ద్వారా అయితే బేరం ఆడే శక్తి ఉంటుంది. కార్డుకు ఆ సౌలభ్యం ఉండదు. ధరను కూడా సరిగా చూడరు. మనలోని ఈ అలవాటునే ఉపయోగించుకుని ప్రతి దానికి కార్డును ఉపయోగించే అలవాటు చేస్తున్నారు.
డిజిటల్ ఇండియా, టెక్నాలజీ, కాలం మారింది , నగదు రహిత చెల్లింపులు అంటూ పాలకులు చేసే ప్రచారం ఎలా ఉన్నా మీ డబ్బు విలువ మీకు తెలియాలంటే డబ్బును వ్యయం చేసేప్పుడు వాటిని చేతితో ముట్టుకోవడం అవసరం. యువతకు కార్డుల ఉపయోగం ఒక వ్యసనంగా మారింది.
అనివార్యం, అత్యవసరం అయితేనే క్రెడిట్ కార్డుల వంటివి ఉపయోగించాలి. క్రెడిట్ కార్డులు వచ్చిన కొత్తలో ఆటో డ్రైవర్లు, చిన్న చిన్న ఉద్యోగులకు కూడా ఎడా పెడా ఇచ్చేశారు. కార్డును ఉపయోగించి వస్తువులను కొన్న వాళ్లు తీర్చలేక జీవితాలను దుర్భరంగా మార్చుకున్నారు. కార్డు డబ్బులు చెల్లించలేక ఆత్మహత్యలు చేసుకున్న సంఘటనలు కూడా చాలా జరిగాయి. ప్రతినెలా కార్డునే ఉపయోగించే అలవాటు మీకు ఉంటే ఒక్క నెల నగదు చెల్లించి చూడండి ఆ నెల మీ ఖర్చులో తేడా మీకే తెలుస్తుంది.
క్రెడిట్ కార్డులను ఎక్కువగా ఉపయోగించడం వల్ల ఆర్థిక క్రమ శిక్షణ లోపిస్తుంది. పది శాతం చెల్లించి మిగిలిన డబ్బును నెలనెలా కిస్తుల్లో చెల్లించవచ్చు ఆనే ఆకర్షణీయమైన ఆఫర్‌కు లొంగిపోతే వడ్డీల ఉచ్చులో కూరుకపోతారు. క్రెడిట్ కార్డుపై దాదాపు 36శాతం వరకు వడ్డీ విధిస్తారు. కార్డుల ఉపయోగం టీవీ ప్రకటనల్లో కనిపించేంత అందంగా ఉండదు. ఆ అందం వెనుక మనల్ని అప్పుల్లో ముంచెత్తే వ్యూహాలు ఉంటాయి. కష్టపడి సంపాదించిన డబ్బు కార్డుల పాలు కానివ్వకండి.
ప్లాస్టిక్ కరెన్సీకి మీ సంపాదనను దోచుకునే అవకాశం ఇవ్వకండి.
పొదుపు అంటే మనం సంపాదించే దానిలో కొంత మిగులు. ఇఎంఐ అంటే మనం సంపాదించే డబ్బును కూడా ముందే ఖర్చు చేయడం. సంపాదించిన దాని కన్నా ఎంతో కొంత తక్కువగా ఖర్చు చేయడం భారతీయుల లక్షణం. దానికి భిన్నంగా సంపాదించబోయేది కూడా ఖర్చు చేస్తే మీ భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారుతుంది.