మనం బల్లిని చూసినా భయంతో కేకలు పెడతాం. దోమలు కూడా మనల్ని ఆటాడుకుంటాయి. కంటికి కనిపించని చిన్నచిన్న సూక్ష్మ జీవులు కూడా కొన్ని విషయాల్లో మన కన్నా శక్తివంతమైనవి. ఇక సింహం, పులి వంటి కూృర జంతువులను చూస్తే మనం వణికిపోవలసిందే. మన కన్నా ఎన్నో రెట్లు పెద్దదైన ఏనుగు, అడవికి రాజైన పులి వంటి జంతువులు. అనేక విషయాల్లో జంతువులు మనకన్నా ఎన్నో రెట్లు బలవంతమైనవి. ఇంతటి శక్తివంతమైన జంతువులు సైతం తమ ఆహారాన్ని ఏ రోజుకు ఆ రోజు సంపాదించుకోవలసిందే. అంతే తప్ప నేను పులి రాజును నెల రోజులకు అవసరం ఐన ఆహార పదార్థాలు ఒకే రోజు తెచ్చిపెట్టుకుంటాను అంటే కుదరదు.
ఈ విషయంలో ఒక్క మనిషికి మాత్రమే అద్భుతమైన అవకాశం ఉంది. కానీ చాలా మంది మనుషులకు ఈ విషయం తెలియదు. తెలిసిన రోజు, అర్థం చేసుకున్న రోజు అదృష్టవంతునిగా మారుతాడు.
చిన్నా పెద్దా అనే తేడా లేదు ఏ జంతువైనా ఎప్పటి ఆహారాన్ని అప్పుడే సంపాదించుకోవాలి. కానీ మనిషి మాత్రం జీవిత కాలం మొత్తానికి కావలసింది కొద్ది కాలంలో సంపాదించుకోవచ్చు.
ఒక వ్యక్తికి నెల రోజుల ఇంటి ఖర్చు పాతిక వేల రూపాయలు అనుకుందాం. పక్షులు, జంతువుల తరహాలో ఎప్పటికప్పుడు వీటిని సంపాదించాల్సిందే. చాలా మంది చేసేది అదే. కానీ కొద్ది శాతం మంది మాత్రమే దీనికి భిన్నంగా ఆలోచించి, మనుషులకు ఉండే వరాన్ని ఉపయోగించుకుంటారు.
మనిషి తనకు శక్తిసామర్థ్యాలు ఉన్నంత వరకు ఏదో ఒక పని చేస్తూ ఉండాల్సిందే. చేయాలి కూడా. కానీ ఇల్లు గడవడం కోసం చేసే పనికి ఆసక్తితో చేసే పనికి తేడా ఉంటుంది.
ఇరవై ఐదు వేల రూపాయలు నెలకు ఇంటి ఖర్చు అనుకున్నప్పుడు ఎంత త్వరగా మనం పని చేయకపోయినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు మనం చేసుకుంటామో అప్పుడు మనకు ఆర్థిక స్వేచ్ఛ లభించినట్టు. ఒకవైపు పదవీ విరమణ వయసు పెంచాలనే డిమాండ్ వినిపిస్తుండగా, కొంత మంది యువత అదే సమయంలో ఎర్ల్రీ రిటైర్‌మెంట్ కోసం ప్లాన్ చేసుకుంటున్నారు. అంటే ఇల్లు గడవడానికి నెలకు పాతిక వేలు అవసరం అయితే అప్పటి వరకు తాను చేస్తున్న ఉద్యోగం మానేసినా నెలకు 25వేల రూపాయలు వచ్చే ఏర్పాటు చేసుకుంటారు. అప్పుడు జీవించడం కోసం ఉద్యోగం అనే అవసరం తీరిపోతుంది. అప్పుడు తనకు నచ్చిన విధంగా ఆ వ్యక్తి బతక వచ్చు. అంటే దాని అర్థం పనీ పాటా లేకుండా జులాయిగా తిరగడం అని కాదు. కొందరికి నటన ఇష్టం కావచ్చు, రాయడం ఇష్టం కావచ్చు, సినిమాలు తీయడం, షార్ట్ ఫిల్మ్‌లు తీయడం, ఏదో ఒక కళలో ఆసక్తి ఉండవచ్చు. ఆసక్తిని చంపుకుని జీతం కోసం ఉద్యోగం చేస్తారు. సంపాదించిన జీతం నుంచి క్రమ పద్ధతిలో పొదుపు చేసి దానిని ఆదాయం వచ్చే వాటిలో ఇనె్వస్ట్ చేస్తే కొంత కాలానికి జీతానికి మించి ఈ పెట్టుబడిపై ఆదాయం వస్తుంది. ఐతే దీని కోసం రిటైర్‌మెంట్ దశలో ఆలోచించడం వల్ల ప్రయోజనం ఉండదు. ఉద్యోగం, వృత్తి, వ్యాపారం ఏదైనా కావచ్చు. సంపాదన మొదలు పెట్టిన ప్రారంభం నుంచే పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్ ప్రారంభిస్తే కొంత కాలానికి జీతాన్ని మించిన ఆదాయం పొందవచ్చు. అప్పుడు జీవితాన్ని తమకు నచ్చిన విధంగా జీవించవచ్చు.
జంతువులు, పక్షులకు లేనిది మనకున్న అద్భుతమైన వరం ఇదే. ఎంత బలవంతమైన జంతువు కూడా జీవిత కాలం మొత్తానికి కావలసింది సంపాదించుకోలేదు. మనిషి అలా చేయగలడు. తొందరగా రిటైర్ కావడం అంటే ఇంట్లో విశ్రాంతి తీసుకోవడం అని కాదు. తనకు నచ్చిన పని చేస్తూ సంపాదించడం. చాలా మంది విషయంలో ఇలా తమ జీతానికి మించి సంపాదించిన వాళ్లు, సంపాదిస్తున్న వాళ్లు ఉన్నారు. ఉద్యోగం వదిలి బయటకు వెళ్లి నచ్చిన పని చేద్దాం అంటే ఆ పనిలో సక్సెస్ కాకపోతే ఎలా అనే అనుమానం మనల్ని వెంటాడుతుంది. కానీ జీతానికి సరిపోయే ఆదాయం సమకూర్చుకున్న తరువాత ఉత్సాహంగా నచ్చిన పని చేస్తూ గతంలో కన్నా ఎక్కువ సంపాదిస్తున్న వాళ్లు, జీవితాన్ని నచ్చిన విధంగా జీవిస్తున్న వాళ్లు చాలా మంది ఉన్నారు. అమెరికా వంటి దేశాల్లో ఇటీవల ఎర్ల్రీ రిటైర్‌మెంట్ అనే భావన చాలా బలంగా వినిపిస్తోంది. మన దేశంలో ఇప్పుడిప్పుడే ఈ కోణంలో యువత ఆలోచిస్తోంది.
ఉత్తరాదిలో ఇటీవల ఒక ఐఎఎస్ తన ఉద్యోగాన్ని వదిలిపెట్టారు. సివిల్ సర్వీస్‌లో ఉన్న వాళ్లు ఇలా మధ్యలోనే ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెడుతున్నారు. అని కోరాలో ఒకరు ప్రశ్నించగా, తన సొంత కారణంతో పాటు తనకు పరిచయం ఉన్న పలువురు అధికారులు ఉద్యోగాన్ని ఎందుకు వదిలిపెట్టారో వివరించారు.
రాజకీయ వత్తిడి అనే కారణం ప్రచారం జరుగుతున్నా అది నిజం కాదని, ప్రారంభంలో ఉద్యోగం సంపాదించడమే ముఖ్యం అనే భావన ఉంటుందని కానీ కొంత కాలం తరువాత తమకు నచ్చిన పని చేయాలనే ఆలోచన వల్ల మధ్యలోనే ఉద్యోగాన్ని వదిలివేస్తున్నారని తన మిత్రులు కొందరి గురించి వివరించారు. సీనియర్ ఐఎఎస్ అధికారి ఒకరికి రచనలు చేయడం ఇష్టం. జీతం లేకపోయినా బతికే ఆర్థిక స్థోమత వచ్చిన తరువాత అతను కేవలం రాయడం కోసమే ఉద్యోగం వదిలిపెట్టారు.
అఖిలభారత స్థాయిలో లక్షలాది మందితో పోటీ పడి సంపాదించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీస్‌లో ఉన్నవాళ్లు సైతం తమకు నచ్చిన పని చేసేందుకు ఉద్యోగాలు వదిలివేయగలుగుతుండడాన్ని గమనించాలి. జీవితం ఒకటే . జీవితమంతా ఇష్టం లేని పనిని కేవలం జీతం కోసం చేస్తూ జీవితాన్ని ముగించే బదులు ఉద్యోగంలో చేరిన మొదట్లోనే కనీసం పది శాతం జీతాన్ని దీర్ఘకాలిక ఇనె్వస్ట్‌మెంట్ కోసం పక్కన పెడితే, అలా పక్కన పెట్టిన డబ్బే కోరుకున్న విధంగా జీవించేందుకు పెట్టుబడిగా ఉపయోగపడుతుంది.
ఐటి కంపెనీల్లో పెద్ద జీతంతో చేరిన యువతకు డబ్బుకు సంబంధించి ఇలాంటి అవగాహన ఉన్నప్పుడు దాదాపు పదేళ్ల పొదుపు + పెట్టుబడితో స్వతంత్ర జీవితం గడపవచ్చు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం