సతీ సక్కుబాయి, సతీ అనసూయ, సంతోషీమాతా సినిమా పేర్లు ఏదైతేనేం కానీ పతివ్రతల కథల సినిమాల్లో ఓ దృశ్యం తప్పనిసరిగా కనిపిస్తుంది. భక్తురాలిని వేధించేందుకు ఇంట్లో పాత్రలను, బట్టల మూటను ఆమె ముందు వేస్తారు. గుట్టల్లా పేరుకుపోయిన ఆ పాత్రలు, బట్టలు చూడగానే సినిమా చూసే ప్రేక్షకులు జాలితో కరిగిపోతారు. పాపం ఆమె ఒక్కత్తె ఆ పని ఎలా చేస్తుందా? అని బాధపడతారు. ఇంతలోనే ఆ భక్తురాలిని కాపాడేందుకు ఏ దేవతో తన మంత్రశక్తితో ఆ పాత్రలను కడిగేస్తుంది. బట్టలు ఉతికేస్తుంది. సినిమా చూస్తున్న ప్రేక్షకులు ఊపిరి పీల్చుకుంటారు.
కోరుకుంటే అలాంటి మాయలు మంత్రాలు మనకూ సాధ్యమే. అంటే మనం మహాభక్తులం కాబట్టి ఏ దేవుడో మన కోసం ఆ పని చేస్తాడని కాదు అర్థం. మనం ఇతరుల సమయాన్ని కొనుక్కోని ఆ పని చేయించవచ్చు.
సమయాన్ని కొనుక్కోవచ్చు. డబ్బుతో పని చేయించవచ్చు. ఈ రెండూ తెలిసిన వారు సంపన్నులు అవుతారు. కోట్ల రూపాయలు ఖర్చు పెట్టినా ఒక్క క్షణాన్ని కూడా కొనలేం అంటారు. ఇలాంటి మాటలు కథలు, కవితల వరకు నిజమే కాని సంపద మొత్తం సమయాన్ని ఖరీదు చేసుకొనే వారి వద్దనే ఉంటుంది.
సమయాన్ని కొనుక్కోవచ్చు. సమయాన్ని కొనుక్కొనే టెక్నిక్ తెలియడం వల్లనే కొందరు సంపన్నులు అవుతున్నారు. కొందరు గానుగెద్దుల్లా ఎక్కడ ఉన్నవారు అక్కడే ఉండిపోతున్నారు.
ఉదాహరణకు మీ నెల జీతాన్ని గంటల్లోకి మారిస్తే మీరు గంటకు మూడు వందల రూపాయలు సంపాదిస్తారు. మీ ఇంటి పనికి పనిమనిషి గంట సంపాదన వంద రూపాయలు అనుకుందాం. మీ ఇంటి పని మీరు చేయడంకన్నా ఇతరులకు వంద రూపాయలు ఇచ్చి ఆ పని చేయించినప్పుడు మీ వద్ద గంట సమయం ఉంటుంది. వంద రూపాయలతో మీరు గంట సమయాన్ని కొనుక్కున్నారు. ఆ సమయాన్ని మీరు మూడు వందల రూపాయలు సంపాదించేందుకు ఉపయోగించవచ్చు. ఎందుకంటే మీ సంపాదన విలువ గంటకు మూడు వందలు. ఇదో ఉదాహరణ మాత్రమే కచ్చితమైన లెక్క కాదు. తెలియని వారు జీవితమంతా బతకడానికే కష్టపడుతుంటారు. సమయాన్ని కొనుక్కోవడం వల్ల మనకు రెండు ప్రయోజనాలు ఉన్నాయి. మన సమయం విలువను ఎప్పటికప్పుడు పెంచుకొనే ఆలోచన చేయవచ్చు. సంపన్నులను సంపన్నులుగా మార్చేది ఇతరుల సమయాన్ని కొనుక్కొనే విధానమే.
ఒక ఐటి కంపెనీలో ఓ పది మంది పని చేస్తున్నారని అనుకుందాం. ఒక్కొక్కరి నెల జీతం 50 వేల రూపాయలు అనుకుంటే నెలకు వీరికి చెల్లించే జీతం ఐదు లక్షలు. పది మంది ఉద్యోగుల నెల సమయాన్ని కొనుక్కునే యజమాని వీరి పని ద్వారా నెలకు పది లక్షలు గడించవచ్చు.
అంటే ఐదు లక్షలకు కొనుక్కున్న సమయాన్ని పది లక్షలకు అమ్ముకుంటాడు. ఉద్యోగులతో పది లక్షల రూపాయల విలువైన పని చేయిస్తారు. ఒక్కో ఉద్యోగి చేసే పనిని మదింపు చేసి ఉద్యోగికి చెల్లించే జీతాన్ని మించి పని చేసినప్పుడే కొనసాగిస్తారు. లేకపోతే ఇంటికి పంపిస్తారు. ఏ ప్రైవేటు సంస్థలోనైనా జరిగేది అదే.
సమయాన్ని కొనుక్కోవడం అనేది ఏ ఐటి కంపెనీకో వేలాది మంది పనిచేసే సంస్థకో పరిమితం కాదు. ఇంట్లో పనిమనిషి కావచ్చు, రచయితలు, టెక్నీషియన్లు కావచ్చు. కిరాణా షాపు కావచ్చు. ఇంటింటికి వెళ్లి వస్తువులు విక్రయించే సేల్స్‌మెన్, సేల్స్ ఉమెన్ ఎవరైనా కావచ్చు. ఏదో ఓ రంగం నుంచి డబ్బు సంపాదించడానికి మనకు అవగాహన ఉంటే ఇతరుల సమయాన్ని తక్కువ ధరకు కొనుక్కుని, మన తెలివి జోడించి ఎక్కువ ధరకు అమ్ముకోవచ్చు.
డబ్బుతో పని చేయించడం...
మనం ఇంట్లో హాయిగా విశ్రాంతి తీసుకొంటే మన తరఫున ఎవరైనా పని చేసి డబ్బు సంపాదిస్తే ఎంత బాగుంటుంది. మనం ఇంట్లో మనకు నచ్చిన ‘మాయాబజార్’ సినిమానో ‘పోకిరీ’ సినిమానో చూస్తూ గడిపేస్తుంటే మన తరఫున ఎవరైనా పని చేస్తూ మనకు నెల నెలకు కావలసిన డబ్బులు ఇస్తే ఎంత బాగుంటుంది. కవితలు రాయడం, కథలు రాయడం మనకు ఆసక్తి. మిత్రులతో కవితా గోష్ఠులు, కథా పఠనాల్లో మనం జీవితాన్ని అనుభవిస్తుంటే నెలనెల మన ఖర్చులు వాటంతట అవే వచ్చి పడితే ఎంత బాగుంటుంది. కలలు కనడానికి బాగానే ఉంది. ఇది సాధ్యమా? అంటే ఎందుకు సాధ్యం కాదు. సాధ్యమే.
చాలా మంది రాజకీయ నాయకులు నిరంతరం ప్రజాసేవలో, రాజకీయాల్లో మునిగి పోతారు. ఇలాంటి వారికి డబ్బులు ఎలా అంటే డబ్బులతో పని చేయించడం వారికి తెలుసు కాబట్టి. రాజకీయ నాయకులు అక్రమాలు అక్రమ సంపాదన అనే విమర్శల సంగతి పక్కనపెడితే చాలామంది రాజకీయ నాయకులు నెలనెలా తమ ఖర్చులకు సరిపడా ఆదాయం కోసం ముందుగానే ఏర్పాటు చేసుకుంటారు. డబ్బు సంపాదించేందుకు మనమే కష్టపడాల్సిన అవసరం లేదు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది. ముందు నుంచే ఒక క్రమపద్ధతిలో మన కోసం సంపాదించేందుకు కొంత డబ్బు సమకూర్చుకోవాలి. కోట్లాది రూపాయల ఆస్తులు ఉన్న సంపన్నులే కాదు, చిరుద్యోగులు సైతం ఉద్యోగంలో చేరిన మొదటి నుంచే సంపాదన కోసం తాము కష్టపడటమే కాదు, తమ తరఫున తమ డబ్బు పని చేసే విధంగా పొదుపు, ఇనె్వస్ట్‌మెంట్‌పై దృష్టి సారించాలి. నెలకు లక్ష రూపాయలు సంపాదించే ఉద్యోగి ఓ 30 శాతం జీతం అనుకొంటే ఓ భవనంపై నెలకు లక్ష అద్దె రూపంలో సంపాదించేవారు ఉన్నారు. ఎప్పుడో ఇంటిపై పెట్టిన పెట్టుబడి నెలకు లక్ష రూపాయలు జీతంలా సంపాదించి పెడుతుంది. చాలామంది రాజకీయ నాయకులు ఇలా భారీ ఎత్తున కమర్షియల్ భవనాలపై పెట్టుబడి పెట్టి అద్దెలతో జీవించేస్తున్నారు. రిటైర్డ్ ఉద్యోగులు చాలామంది మంచి అద్దెలు వచ్చే ఇళ్లను నిర్మించి రిటైర్మెంట్ జీవితాన్ని ప్రశాంతంగా గడుపుతున్నారు. పెన్షన్ మొత్తాన్ని మించి అద్దె సంపాదిస్తున్న వారు చాలామంది ఉన్నారు. డబ్బు డబ్బును సంపాదిస్తుంది అనే విషయం ఎంత త్వరగా గుర్తిస్తే భవిష్యత్తు ప్రశాంత జీవనానికి అంత ముఖ్యం.
మరెందుకాలస్యం? మీ డబ్బుకు డబ్బును సంపాదించే పనిని వెంటనే అప్పగించండి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం