12, జూన్ 2011, ఆదివారం

అత్తవారింటిలో ప్రభ అందం .. స్కూల్ పిల్ల కాయల సాహసం అను ప్రహసనం ... సికింద్రాబాద్ కథలు 5

  

వాళ్ళు స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్లారట తెలుసా ? ఆ మాటలు మా బ్యాచ్ పౌరుషాన్ని తట్టి లేపాయి. ఇతర స్కూల్స్ లో చదువుతున్న వారి మాటలు, మా స్కూల్ లో చదివే  వారి అన్నోతమ్ముడో మరో  స్కూల్ లో చదువుతుంటాడు కదా వారి నుంచి రోజుకో విశ్వసనీయ సమాచారం తెలిసేది. అదేదో సినిమాలో       షావు కారు జానకి నాగేశ్వర్ రావు తో కలిసి పాడుతుంది కదా పాండవులు పాండవులు తుమ్మెదా....కన్నెగానే బ్రతుకు గడిచిపోతుంది... అంటూ  తన జీవితం అలానే ముగిసి పోతుందని  బాధ  పడినట్టు గానే స్కూల్ లో మా గ్యాంగ్ అంతా చింతాక్రాన్తుల మై పోయాం . స్కూల్ ఎగ్గొట్టి సినిమాకువెల్ల  కుండానే స్కూల్  జీవితం ముగిసి పోతుందేమో అనే బెంగ పట్టుకుంది . 
***
ఆరు నూరైనా పన్నెండో ఎక్కం రాక పోయినా , అటు సూర్యుడు ఇటు పొడిచినా . స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాలని నిర్ణయించుకున్నాం. సూపర్ స్టార్ కృష్ణ ఏజెంట్ ౧౧౬ లో మాదిరిగా మెల్లగా మాట్లాడుకుంటూ ప్లాన్ తయారు చేశాం . మా స్కూల్ సికింద్రాబాద్ నాలా బజార్ స్కూల్ .. సినిమా హాల్ స్కూల్ కు దగ్గరగా ఉండాలి, స్కూల్ వదిలే సమయానికి  తిరిగి రావాలి. సినిమా హాల్ లో మనకు తెలిసిన వాళ్ళు యెవరూ ఉండకూడదు . మన బడ్జెట్ కు సరి పోయే విధంగా సినిమా హాల్ ఉండాలి. ఎవరెవరు వస్తున్నారు, ఎవరేం చేయాలి అంత ప్లాన్ తయారు చేసుకున్నాం . లాడెన్ ను చంపడానికి ఆమెరికా వోడు ౪౦ నిమిషాల్లో పని ముగించు కొని వెళ్లి పోయాడు కదా అలా అన్న మాట . 
*** 
చిలకల గూడా క్రాస్ రోడ్ దగ్గరలో అమర్ అనే సినిమా హాల్ ఉంది . మా ప్లాన్ కు సరిగ్గా సరిపోయే సినిమా హాల్ అని నిర్ణయం చేశాం. స్కూల్ కు దాదాపు రెండు కిలోమిటర్లోపే ఉంటుంది . కాని సికింద్రాబాద్ వాళ్ళు ఎవరూ అటువైపు రారు . ఆనుకున్న రోజు రానే వచ్చింది .  ఏడెనిమిది మందిమి స్కూల్ ఎగ్గొట్టి సినిమాకు వెళ్ళాం 
***
తొలి సారిగా  మన దేశం లో  సినిమాను తెరపై చుసిన వారు భయంతో పరుగులు తీసారట . కొంత మంది సాహసం చేసినట్టిగా సినిమా చుశారటా.  క్లాసు డుమ్మా కొట్టి సినిమా చూడడం సాహసంగానే  భావించినా  , మేం అలా పారిపోలేదు, భయపడలేదు కాని గొప్ప పని చేస్తున్నామన్న భావన మాత్రం బలంగా కలిగింది. అది అత్తవారిల్లు సినిమా అందం వల్ల ప్రభ , ఇంటి పేరు వల్ల వంకాయల సత్యనారాయణ పేరు గుర్తుంది. సినిమా కథేంటో, మిగిలిన నటులు ఎవరో గుర్తు లేదు .  అది అమర్ లోడైరెక్ట్ గా విడుదల అయిన  సినిమానో లేక విడుదల అయ్యాక కొంత కాలానికి వేసిన సినిమానో కూడా తెలియదు. సినీతారల చర్మ సౌందర్యానికి కారణ మైన లక్సు సబ్బును ప్రభ వాడినట్టు చూడలేదు . కాని ఆమె మాత్రం ఇప్పటికీ అంత అందంగా ఎలా ఉన్నారో. మొన్న మొన్నటి హిరోయిన్ లు రాశి, బాపు పెళ్లి పుస్తకం లో అందంఅంటే  ఇది అనిపించిన దివ్యవాణి  లాంటి వారు అంత లావుగా ఐపోతే ప్రభ మాత్రం ఇంకా అందంగా ఉన్నారు. ఈ మద్యనే ప్రభ దూరదర్శన్ లో మువ్వల సవ్వడి కార్యక్రమం నిర్వహించారు .  అంతే   అందంగా కనిపించారు.  ప్రభ అందాన్నిచూడాలంటే దానవీర  శూర  కర్ణ చూడాలి. 

****
విజయవంతంగా సినిమా చూసి ఏమి ఎరగా నట్టుగానే మరుసటి రోజు క్లాస్ కు వెళ్ళాం. మొదటి పీరియడు, రెండో పీరియడు గడిచిపోయింది. దాంతో మేం కుడా మా సాహసాన్ని మరిచిపోయం . మూడో పిరియడ్ లో సైన్స్ టిచర్ వచ్చి  అందరిని ఒక సారి చూసి మా వైపు చూపుతూ లేచి నిలబడమంది. చిత్రం మేం ఎనిమిది మందిమి సినిమాకు వెళితే సైన్స్ టీచర్ సరిగ్గా వారిని నిలబడమంది.  అంతకు ముందు వచ్చిన సోషల్ టిచర్ కు సోషల్ రెస్పాన్సిబులిటి లేకున్నా సైన్స్ టీచర్ కు మాత్రం  సోషల్ రెస్పాన్సిబులిటి కాస్త ఎక్కువే .. డొంక తిరుగుడు లేకుండా సూటిగా నిన్న మీరు ఏ సినిమాకు వెళ్లారు అని అడిగారు . మా పని అయిపోయిందని అనుకున్నాం . మెల్లగా పేరు చెప్పాం. అన్నిటికి సిద్దపడే సినిమాకు వెళ్ళాం . ఎన్నేసి దెబ్బలు పడతాయో అని అనుకుంటుంటే .. సినిమా పేరు వినగానే నవ్వు ఆపుకోలేక పోయింది.పడిపడి నవ్వుతూనే ఉన్నారు. మగాళ్ళు అంత వీరోచితంగా అత్తవారిల్లు సినిమాకు వెళ్ళడం ఏమిటి అని నవ్వింది. అసలే టిచర్ అందంగా ఉంటుంది. అంత అందమైన టిచర్ మా సాహసాన్ని నవ్వుల పాలు చేయడం తట్టుకోలేక పోయాం. అంతటితో ఊరుకోకుండా మిగిలిన టిచర్ లందరికి చెప్పేశారు. మా సాహసం అల ప్రహసనగా మిగిలిపోయింది ఇప్పుడు ఆ సినిమా హాల్ గేటు ఉంది కాని సినిమా హాల్ లేదు పెద్ద అపార్ట్ మెంట్ ఆ స్థానం లో ప్రత్యక్షమైంది 
****
సరే మేం కనీసం ఓ ప్రయత్నమన్నా చేశాం. ఇప్పటి పిల్లలకు ఆ అవకాశం కుడా లేదు కదా? యల్ కేజీ నుంచి టెన్త్ వరకు  పిల్లలను స్కూల్ లో తండ్రి డ్రాప్ చేసి వెళితే, తల్లి తీసుకొస్తుంది . ఇంటర్ లో నారాయణ, చైతన్య వాళ్ళ  రెండేళ్ళ కఠిన కారాగార శిక్ష తో సరి ఇంకెక్కడి మధుర స్మృతులు . ఐతే చిన్న వయసులోనే యాసిడ్ ప్రేమలు, లేదంటే జైలు శిక్షలాంటి చదువు . పాపం పిల్లలు .

7 కామెంట్‌లు:

  1. సికిందరాబాద్ కథలు -స్కూలు పిల్లకాయల సాహసం చదివానండి.
    మీకు పోలికలు భలే తడతాయండి...కన్నెగానే బ్రతుకు గడిచిపోతుంది...లైన్ ని గుర్తుచేసి రాసారు చూసారా...భలే నవ్వొచ్చింది...ఆ వచ్చిన నవ్వు...వ్యాసం చివరి వరకు కంటిన్యూ అయింది.
    అలాగే అమెరికావాడు లాడెన్ ని కొట్టి వెంటనే పనిముగించుకొని వెళ్ళడం, పెళ్ళిపుస్తకంలో దివ్యవాణి లాంటివి మీకు భలే తడతాయే..పోలికలు....అన్నట్టు దివ్యవాణి మళ్ళీ లావు తగ్గి గ్లామరస్ గా మారిపోయింది...చూసారోలేదో మరి..

    ప్రభ, భారతి మరీ పురాతన శాస్త్రవేత్తలాగా ఏమిటండీ...ఆమధ్య ఐశ్వర్యరాయ్ అభిమాని అన్నారే...:))

    రిప్లయితొలగించండి
  2. సుధా గారు నచ్చినందుకు థాంక్స్ ప్రభ, భారతి మా చిన్నప్పటి ఐశ్వర్యా రాయ్ లండి. ఈ మధ్య ఓ ఫ్రెండ్ తో ఏదో అంశం పై చర్చిస్తూ ఐశ్వర్యా రాయ్ కన్నా నీతో మాట్లాడటానికే ప్రాదాన్యత ఇస్తానని చెప్పా .. సంతోషపడి కారణం తెలుసుకోవచ్చా అంది. నువ్వు వాస్తవం, ఐష్ ఉహ . నేను వాస్తవిక వాదిని అని చెప్పా . దివ్యవాణిని ఈ మధ్య చూడలేదండి ( వాళ్ళు మన గురించి పట్టించు కోనప్పుడు మనమెందుకు పట్టించుకోవాలనే ఆలోచన కూడా వస్తుందండీ.

    రిప్లయితొలగించండి
  3. blog is wonderful murali garu.. i think janantikam has transformed into new title. chala cha bagndi.. mee satirical eliments inka konasaginchandi.

    రిప్లయితొలగించండి
  4. @సంతోష్ నచ్చినందుకు థాంక్స్ . జనాంతికం వారం వారం వస్తుంది. సికింద్రాబాద్ కథల పేరుతో సికింద్రాబాద్ ప్రాంతానికి సంబందించిన ముచ్చట్లు రాయాలని ప్రయత్నిస్తున్నాను

    రిప్లయితొలగించండి
  5. very nice. enjoyed.
    ఆమె తారగా వెలిగినరోజుల్లో గమనించలేదు గాని, ఈ మధ్యన పాత సినిమాలు కొన్ని చూస్తూ అనుకున్నాను, ప్రభ అందంగా ఉండేదని.

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం