ఏంటోయ్.. అంత తన్మయత్వంగా కనిపిస్తున్నావ్? నీ కలల రాణి కనిపించిందా?ప్రమోషన్ వచ్చిందా?’’
‘‘కాదు..’’
‘‘తెలిసిందిలే! నీకే కాదు, ఇలాంటి పరిస్థితి వస్తే ఎవరికైనా కళ్లు చెమ్మగిల్లుతాయి. మరో ప్రపంచంలో విహరిస్తున్నట్టు అనిపిస్తుంది. మొన్న నీకొచ్చిన బోనస్ డబ్బులతో నువ్వు ప్రచురించిన కవితా సంకలనాన్ని ఎవరో అభిమాని డబ్బు పెట్టి కొని ఉంటాడు. ఉచితంగా పంచి పెడితేనే అదోలా చూసే ఈ రోజుల్లో కవితా సంకలనం డబ్బు పెట్టి కొనడం అంటే మామూలు విషయం కాదు. మొత్తం కవికుల ప్రపంచానికి ఇది శుభవార్త.’’
‘‘ఆగవోయ్.. ఏదేదో ఊహించుకుంటున్నావ్! ఈ ఏడాది మా కంపెనీకి లాభాలు లేకపోవడంతో బోనస్ ఇవ్వలేదని ఇంట్లో అబద్ధం చెప్పి, ఆ డబ్బుతో కవితా సంకలనం ప్రచురించాను. నువ్వు గట్టిగా అంటే- ఇంట్లో వాళ్లు విన్నారంటే లేని పోని సమస్య. కవితా సంకలనాలను డబ్బు పెట్టి కొనేవారు కూడా ఉంటారా? మరీ విచిత్రం కాకపోతే..’’
‘‘మరి.. నీ తన్మయత్వానికి కారణం ఏంటోయ్?’’
‘‘ఈరోజు టీవీ ఆన్ చేయగానే ఆనందంతో కళ్లు చెమ్మగిల్లాయి. నా జీవితం ధన్యమైందని అనిపించింది.’’
‘‘ ఓ టీవీ చానల్లో పోకిరీ, అర్జున్, బెండు అప్పారావు ఆర్ఎంపి లాంటి సినిమాలు రెండు రోజులకోసారి వేస్తూనే ఉంటారు కదా? వాటిని చూసి ఇంతోటి దానికి భావోద్వేగానికి గురి కావాలా?’’
‘‘అది కాదు..’’
‘‘మరేంటి? అదేదో చానల్లో శబ్ద ప్రధాన ‘నీలి’విప్లవం జబర్దస్త్ మరింత రంజుగా మారిందా? తప్పదు మరి.. విలువల గురించి బోధించేంత ఆస్తిపాస్తులు ఉండాలంటే ఇలాంటి సక్సెస్ఫుల్ ప్రోగ్రామ్స్ ప్రసారం చేయక తప్పదు’’
‘‘శబ్దనీలి ఏం ఖర్మ.. దృశ్య నీలి కూడా నాకో లెక్క కాదు. ఈ రోజుల్లో అవన్నీ కామన్’’
‘‘మరి నీ తన్మయత్వానికి కారణం.? ఆ తెలిసిందిలే- సిబిఐలో సిబిఐ అధికారుల తనిఖీలు.. ఆ సంస్థలో నెంబర్ వన్, నెంబర్ టూలే ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకోవడం.. సోదాలు, అరెస్టులు చూసి నవ్వాలో ఏడవాలో తెలియక చిత్ర విచిత్రంగా స్పందించి ఉంటావు అంతే కదా..?’’
‘‘ఏరా! నువ్వు నన్నింకా చిన్న పిల్లాడివనుకున్నావా? సిబిఐలో నెంబర్ వన్ నుంచి చిరుద్యోగి వరకు, అమెరికా అధ్యక్షుడి నుంచి అప్పాయపాలెం సర్పంచ్ వరకు, జన్మభూమి వార్డు మెంబరైనా, జిహెచ్ఎంసి కార్పొరేటర్ వరకు ఎవరైనా మనిషే.. మనిషికి మనిషి లక్షణాలే ఉంటాయి. కొందరి వ్యవహారాలు బయటపడతాయి. కొందరివి పడవు. దొరికితే తివారీ అంటాం, దొరక్క పోతే మేధావి అంటాం. ఇలాంటివన్నీ మామూలే. యువత పక్కదారి పట్టకుండా విలువలతో కూడిన జీవనం గడిపేందుకు ఏం చేయాలో కసబ్‌లు పాఠాలు చెప్పినా ఆశ్చర్యపోని దశకు చేరుకున్నాను.’’
‘‘మరి.. నిన్ను అంతగా భావోద్వేగానికి గురి చేసి కళ్లు చెమ్మగిల్లేట్టు చేసినదేంటో?’’
‘‘కొన్ని విషయాలు చెబితే అర్థం కావు.. ’’
‘‘గద్దర్ ఇంటింటికీ వెళ్లి ఎన్నికల్లో ఓటు హక్కు వినియోగించుకోవాలని ప్రచారం చేయడం చూశాక కళ్లు చెమ్మగిల్లడం సహజమే.’’
‘‘అదీ కాదు..’’
‘‘మరి ఇంకేంటి?.’’
‘‘అమరావతి పాలకుడి వల్లే తెలంగాణ కల సాకారం అయిందని ‘హస్తం’ పార్టీ వాళ్లు, ‘హస్తం’ వల్లనే ఈ దేశం మనుగడ సాధ్యం అవుతోందని సైకిల్ పార్టీ వాళ్లు ప్రచారం చేయడం. ఎన్టీఆర్ భవన్- గాంధీభవన్‌ల మధ్య షటిల్ రైలులా కార్లు పరుగులు తీయడం టీవీలో చూశావు కదా? నిజమే.. నాలుగు దశాబ్దాల నుంచి రాజకీయాలను గమనిస్తున్నా ఇలాంటి అపురూప దృశ్యాలు చూసినప్పుడు కళ్లు చెమ్మగిల్లడం సహజమే’’
‘‘కొంతవరకు ఇది కూడా కారణం కావచ్చు... కానీ పూర్తి కారణం ఇది కాకపోవచ్చు అని నా మనసు చెబుతోంది’’
‘‘అబ్బా.. కారణం ఏమిటో నీకూ తెలియదా? ’’
‘‘అసంకల్పిత ప్రతీకార చర్య అనే మాట మనం చిన్నప్పుడు పాఠ్య పుస్తకాల్లో చదివాం కదా? కొన్నింటికి మనకు తెలియకుండానే మనలో అలా స్పందనలు కలిగిస్తుంది. ఎందుకీ స్పందన అనేది తెలిసీ తెలియకుండా ఉంటుంది’’
‘‘నేను రాగానే టీవీలో రాహుల్ గాంధీ ఉపన్యాసం వింటున్నావ్! బహుశా ఆయన ఉపన్యాసం నీలో అలాంటి స్పందనలు కలిగించి ఉంటుంది.’’
‘‘కొంతవరకు అదీ కారణం కావచ్చు కానీ. అదే కారణం అనిపించడం లేదు. బాగా గుర్తు చేశావ్! రాజస్థాన్ ఎన్నికల ప్రచారంలో రాహుల్ ఉపన్యాసాన్ని తెలుగునాట టీవీలు లైవ్‌గా చూపించడం కొంత ఆశ్చర్యమే. ప్రపంచంలోని సమస్యలకు, ఈ దేశం అమెరికా కన్నా వెనుకబడి ఉండడానికి, పాకిస్తాన్లో తీవ్రవాదానికి, ఉగాండాలో ఆకలికి నికరగువాలో పెట్రోల్ కొరతకు, లాడెన్‌ను మట్టుపెట్టి సముద్రంలో పాతిపెట్టడానికి కాంగ్రెస్సే కారణం అని తెలుగునాట మీడియా బలమైన ముద్ర వేసింది. ఏం జరిగిందో కానీ.. హఠాత్తుగా రాహుల్ ఉపన్యాసాలను సైతం లైవ్‌గా చూపడంతో కొంత కారణం కావచ్చు కానీ నాలో తన్మయత్వానికి ఇంకేదో కారణం ఉందనిపిస్తోంది’’
‘‘నీ తన్మయత్వానికి కారణం నీకే తెలియక పోతే ఎలారా? నేను మాట్లాడుతూనే ఉన్నాను. ఏదో దీర్ఘాలోచన చేస్తున్నట్టు కళ్లు మూసుకున్నావేంటి?’’
‘‘యూరేకా..! ఇప్పుడర్థమైంది? ఒక మతం నుంచి మరో మతంలోకి మారినప్పుడు పవిత్రులను చేసేందుకు అన్ని మతాల్లోనూ ఏదో ఒక తతంగం ఉంటుంది కదా?’’
‘‘ఔను.. ఉంటుంది. ఆ తంతు పూర్తయితే అతను పవిత్రుడుగా మారినట్టు భావిస్తారు. హిందూ మతంలోకి కొత్తగా వచ్చే అవకాశం లేదు కాబట్టి మతం మారి మళ్లీ సొంత మతంలోకి వచ్చిన వారికి ఘర్ వాపసీ అని ఏదో నిర్వహించి పవిత్రులను చేస్తారు. దీనికీ నీ తన్మయత్వానికి సంబంధం ఏముంది’’
‘‘నలభై ఏళ్ల నుంచి పత్రికలు చదివే అలవాటుంది. ప్రపంచంలోని సమస్యలన్నింటికీ కాంగ్రెస్ కారణం అనే వార్తలను ఉగ్గుపాలతోనే రంగరించి మనకు మీడియా తాగించింది..’’
‘‘ఔను తెలుసు.. ఐతే ఏంటి?’’
‘‘మతం మార్చి పవిత్రులను చేసినట్టే పార్టీలను కూడా పవిత్రులను చేసే తతంగం గురించి తెలిశాక మనసు ఆనందంలో మునిగిపోయింది’’
‘‘పార్టీలను పవిత్రులుగా మార్చే మంత్రాలు ఉన్నాయా? ’’
‘‘నాలుగు దశాబ్దాల్లో అష్టావక్రునిగా కనిపించిన ‘హస్తం’ వారిని తెలుగు మీడియా అభిమానిస్తుందని కలలోనైనా అనుకున్నావా?’’
‘‘లేదు’’
‘‘కానీ.. ఇప్పుడు మీడియా ఆ అభిమాన పార్టీతో చేతులు కలిపిన తరువాత ‘హస్తం’ కూడా పవిత్రం అయింది. ఈ దృశ్యాలు చూసిన తరువాత బ్రహ్మం గారు కూడా చెప్పని అద్భుతాలు కళ్ల ముందే కనిపిస్తుంటే అంతకు మించి ఏముంటుంది? బహుశా నాలోని తన్మయత్వానికి కారణం ఇదే అనుకుంటా..
బుద్దామురళి (జనాంతికం 26-10-2018)