కొడితే ఏనుగు కుంభస్థలాన్నే కొట్టాలంటారు. లక్ష్యం మంచిదే కానీ లక్ష్యాన్ని నిర్దేశించుకునేప్పుడు నీ శక్తిసామర్ధ్యాలను కూడా సరిగా అంచనా వేసుకోవాలి. లేకపోతే ఏనుగు కుంభస్థలాన్ని కొట్టాలని ప్రయత్నించిన వారే ఏనుగు చేతిలో కోలుకోలేని దెబ్బతినే ప్రమాదం ఉంది. అదే జరిగితే హీరో జీవితం కూడా తలక్రిందులవుతుంది. అచ్చం అలనాటి ఆంధ్రా కమల్ హాసన్‌లానే... నీడలేని ఆడది సూపర్ హిట్ సినిమాతో హీరోగా తెలుగు సినిమా రంగ ప్రవేశం చేసిన నరసింహరాజు చిన్న పొరపాటు వల్ల నీడలేని హీరోగా మారిపోయారు.
మీకు టీవి సీరియల్స్ చూసే అలవాటు ఉంటే నర్సింహరాజును చూడగానే గుర్తుపడతారు. వయసుకు మించిన వృద్ధుని పాత్రల్లో దర్శనమిస్తుంటారు. 60 ఏళ్ల వారు సినిమాల్లో హీరోలుగా పడుచు హీరోయిన్ల వెంట పడడం మామూలే. కానీ అదే సమయంలో నరసింహరాజు నాలుగు పదుల వయసులో ఏడుపదుల వయసుగల వృద్ధునిలా టీవీ సీరియల్స్‌లో నటిస్తూ గడిపారు.... గడుపుతున్నారు.
ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో జానపద హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో అతను అంటే నిజమా? అనే ప్రశ్న వస్తుంది.
ఒకప్పుడు తెలుగు సినిమా రంగంలో జానపద హీరోగా ఒక వెలుగు వెలిగిన హీరో అతను అంటే నిజమా? అనే ప్రశ్న వస్తుంది.
***
పోలీసు వాడు కొట్టే గుమ్కి దెబ్బలు అస్సలు కనిపించవు. అనుభవించిన వాడికి నొప్పి ఉంటుంది కానీ దెబ్బలు కొట్టినట్టు ఆనవాలు ఉండదు. కొందరు కడుపు మీద కొట్టే దెబ్బలకు మహా మహా హీరోలు సైతం గింగిరాలు తిరిగి పడిపోవాల్సిందే. బతుకు తెరువు కోసం హీరో నుంచి క్యారక్టర్ ఆర్టిస్ట్‌గా పెద్ద తెర నుంచి బుల్లి తెరకు మారాల్సిందే. ఎన్టీరామారావు, కాంతారావుల తరువాత జానపద సినిమాల హీరోగా నరసింహరాజు తిరుగులేని విధంగా చెలరేగిపోయారు.

34 ఏళ్ల క్రితం వచ్చిన జగన్మోహిని సినిమా తెలుగు సినిమాల చరిత్రలో ఒక రికార్డు. ఆ సినిమా నర్సింహరాజు జీవితంలో మైలురాయి. ఒకటికాదు రెండు కాదు డజన్ల కొద్ది సినిమాల్లో హీరోగా నటించారు. బోలెడు సినిమాలు సూపర్ హిట్ అయ్యాయి. 70-80ల ప్రాంతంలో తిరుగులేని హీరోగా నిలిచారు.
ఏం జరిగిందో, ఎక్కడ తేడా వచ్చిందో కానీ నరసింహరాజు ఎన్టీఆర్‌ను తీవ్రంగా వ్యతిరేకించారు. 82లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని ఏర్పాటు చేస్తే బహిరంగంగానే విమర్శించిన నరసింహరాజు తాను భారతదేశం పార్టీని ఏర్పాటు చేస్తున్నట్టు ప్రకటించారు. ఆ తరువాత ఏం జరిగిందో కానీ నరసింహరాజు భారతదేశం పార్టీని పెట్టలేదు, సినిమాల్లో కనిపించకుండా అదృశ్యం అయ్యారు.

హీరో ఒంటి చేత్తో విలన్లను చితగ్గొడతాడు సినిమాల్లో... సినిమా రంగంలో హీరో అయినా సరే తోక జాడిస్తే, ఎవరు కొట్టారో ఎందుకు కొట్టారో తెలియకుండా కడుపు మీద చావు దెబ్బలను కొడతారు. అలా తిన్న దెబ్బలు వారిని తిరిగి కోలుకోనివ్వకుండా చేస్తుంది.
సినిమాల్లో అవకాశాల మాట దేవుడెరుగు సినిమా జీవులందరూ ఆయనకు దూరమయ్యారు. నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే అయనా ఆర్థికంగా పరిస్థితి అంతంతమాత్రమే.
సినిమాల్లో అవకాశాల మాట దేవుడెరుగు సినిమా జీవులందరూ ఆయనకు దూరమయ్యారు. నటించిన సినిమాలన్నీ సూపర్ హిట్టే అయనా ఆర్థికంగా పరిస్థితి అంతంతమాత్రమే.
జానపద బ్రహ్మ విఠలాచార్య సినిమాల్లో రాజకుమారుడు ఎలుకగానో, చిలుకగానో మారిపోతాడు. విఠలాచార్య జానపద సినిమాల ద్వారా హీరోగా ఎంతో ఎత్తుకు ఎదిగిన నరసింహరాజు ఏం జరుగుతుందో తెలుసుకునే లోపే సినిమాలకు దూరం కావలసి వచ్చింది. సినిమా అయితే చిలుక రూపంలో ఉన్న రాజకుమారుడు తిరిగి హీరోగా మారుతాడు. కానీ జీవితం కాబట్టి నరసింహరాజుకు శాప విమోచనం కలగలేదు. దాంతో బతుకు తెరువు కోసం టీవీ సీరియల్స్‌లో క్యారక్టర్ నటునిగా నటిస్తున్నారు.
నరసింహరాజును ఆంధ్రా కమల్‌హాసన్ అని పిలిచేవారు. నీడలేని ఆడది, తూర్పు పడమర, కన్యాకుమారి, ఇదెక్కడ న్యాయం, జగన్మోహిని సినిమాలు ఆ రోజుల్లో నరసింహరాజు హీరోగా నటించిన సూపర్ హిట్ సినిమాలు. 1974లో నీడలేని ఆడది సినిమాలో హీరోగా చిత్ర రంగ ప్రవేశం చేశారు. ఆ సినిమా సూపర్ హిట్ కావడంతో నరసింహరాజు హీరోగా నిలదొక్కుకున్నారు. వరుసగా అవకాశాలు వచ్చాయి. ఈ సినిమా ప్రభ, నరసింహరాజులకు మంచి గుర్తింపు తెచ్చింది. ఇక 78లో వచ్చిన జగన్మోహిని విజయం నరసింహరాజును ఎక్కడికో తీసుకు వెళుతుంది అనుకున్నారు. 1974 నుంచి 1980 వరకు నరసింహరాజు కాలం అని చెప్పవచ్చు. ఆరేళ్ల కాలంలో నరసింహరాజు హీరోగా నటించిన దాదాపు 20 సినిమాలు సూపర్ హిట్టయ్యాయి.
నీడలేని ఆడది(74) అత్తవారిల్లు, తూర్పు పడమర( 76) కన్యాకుమారి, రంభ ఊర్వశి మేనక, అమ్మాయిలూ జాగ్రత్త, ఇదెక్కడి న్యాయం (77) జగన్మోహిని, ప్రయాణంలో పదనిసలు (78) వంటి హిట్ సినిమాల్లో నటించారు. వందకు పైగా సినిమాల్లో నటించిన నరసింహారావు దాదాపు 30కి పైగా హిట్ సినిమాల్లో నటించారు.
మూడు పదుల వయసులో సూపర్ హిట్ చిత్రాల హీరోగా నిలిచిన నరసింహరాజుకు ఆవేశం తప్ప సినిమా రాజకీయాలు అర్థం కాలేదు. కొండను ఢీకొనాలనుకున్నాడు.
మూడు పదుల వయసులో సూపర్ హిట్ చిత్రాల హీరోగా నిలిచిన నరసింహరాజుకు ఆవేశం తప్ప సినిమా రాజకీయాలు అర్థం కాలేదు. కొండను ఢీకొనాలనుకున్నాడు.
అంతే ఒక్కసారిగా అతని పరిస్థితి తలక్రిందులు అయింది. ఎవరు చేశారు, ఎందుకిలా జరిగింది అంటే ఎవరో ఒకరి పేరు చెప్పడానికి ఆధారాలు ఉండవు. నరసింహరాజు పరిస్థితి తలక్రిందులు అయింది అన్నది మాత్రం వాస్తవం. నరసింహరాజు ఆవేశం, ఆలోచనా లేకపోవడం వల్లనే ఈ పరిస్థితి తెచ్చిపెట్టుకున్నాడు అంటారు సినిమా రంగం గురించి తెలిసిన వారు. అప్పటి వరకు హీరోగా వెలుగొందుతున్న నరసింహరాజుకు ఒక్కసారిగా తలుపులు మూసుకు పోయాయి. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితి. కొంత కాలం చీకటి లోనే గడిపారు ..
మరి కొంత కాలం గడిచాక టీవీలో సీరియల్స్ ప్రారంభమయ్యాయి. సినిమా రంగానికి సంబంధం లేని వారు టీవీ సీరియల్స్ తీశారు. దాంతో మరో దారి లేక నరసింహరాజు టీవీ సీరియల్స్‌ను నమ్ముకున్నారు. దూరదర్శన్‌తో పాటు ప్రైవేటు చానల్స్‌లోని సీరియల్స్‌లో వయసులో ఉండగానే వయసు మీరిన పాత్రల్లో కనిపించడం మొదలు పెట్టారు.
యుద్ధ రంగంలో ఉన్నంత నిజాయితీ, సినిమా యుద్ధంలో ఉండదు. ఎవరైనా కావచ్చు ఫలానా నటునికి అవకాశాలు ఇవ్వవద్దని ఎవరికీ ప్రత్యేకంగా చెప్పకపోవచ్చు. కానీ అతను కొండను ఢీ కొనేందుకు ఉత్సాహంగా ముందుకు వస్తే, ఎవరికి వారు దూరంగా వెళ్లిపోతారు అది ఏ రంగంలోనైనా సహజమే. దీనే్న నరసింహరాజు ఊహించలేకపోయారు. అతని వయసు అలాంటిది. నరసింహరాజు ఎదుగుతున్న సమయం ఎన్టీఆర్, ఎఎన్‌ఆర్ లాంటి వారు హీరో వేషాలకు దూరం అవుతున్న కాలం.
దాన్ని ఆయన సరిగా అంచనా వేయగలిగి కొద్దిగా ఓపిక పట్టి ఉంటే నరసింహరాజు భవిష్యత్తు మరో రకంగా ఉండేది. ఒక స్టార్‌గా వెలిగిపోతూ ఉండే వారు. ఒక పొరపాటుకు యుగములు వగచేను అనే పాటలా నరసింహరాజు జీవితంలో సైతం ఒక పొరపాటు ఆయన జీవితాన్ని సంక్షోభంలోకి నెట్టింది. ఆవేశం కాదు ఆలోచన ముఖ్యం. ఎదుగుతున్న సమయంలో ముందుకే కాదు పక్కలకు కూడా చూసుకోవాలనే జీవిత పాఠాన్ని నేర్పిస్తుంది నరసింహరాజు జీవితం.
ఆ దెబ్బతరువాత నరసింహరాజు ఎక్కడా వివాదాస్పదం కాదు కదా కనీసం పిచ్చాపాటి మాట్లాడినట్టుగా కూడా రిపోర్ట్ కాలేదు. సూపర్ హిట్ హీరో వేషాల నుంచి ఒక్కసారిగా టీవీ సీరియల్స్‌లో చిన్న పాత్రలు సైతం వేసేందుకు తనను తాను మానసికంగా సిద్ధం చేసుకున్న నరసింహరాజును అభినందించాలి. కానీ యుక్తవయసులో ఆయనకు జీవిత రహస్యాలను ఎవరైనా విప్పి చెప్పి ఉంటే ఆ హీరో పరిస్థితి మరోలా ఉండేది.
*
*
మొన్న యుట్యూబ్‌లో "చిలకమ్మ చెప్పింది" అన్న సినిమా కొంత చూసాను. అందులో నారాయణరావు పేరు క్రింద రజనీకాంత్ పేరు వేసారు. ఇప్పుడు నారాయణరావు ఎవరో చాలామందికి తెలియదు. రజనీకాంత్ అంటే తెలియనివాళ్ళు ఉండరు.
రిప్లయితొలగించండిపున్నమినాగు సినిమాలో నరసింహరాజు హీరో, చిరంజీవి విలన్
రిప్లయితొలగించండి