1, జనవరి 2014, బుధవారం

జర్నలిస్టులకు ఓపెన్ చాలెంజ్!

‘‘అంతా కట్టకట్టుకుని వచ్చారు న్యూ ఇయర్ గ్రీటింగ్స్ చెప్పడానికా? ’’ అంటూ బాస్ అడిగితే, కుర్ర జర్నలిస్టు మధ్యలో బ్రేక్ వేసి జీతం పెంచి ఎంత కాలమైంది? ఇవీ మా డిమాండ్లు’’ అని కాగితం ఇచ్చారు.

 ‘‘సర్లేవోయ్ తెగ కష్టపడిపోతున్నారు. మేమంతా పెద్ద పోటుగాళ్లమని మీపై మీకు బాగా నమ్మకం ఉంది కదా. మీకో పరీక్ష మీరో ఇంట ర్వ్యూ చే యాలి. రెండు డజన్ల ప్రశ్నలు ... ఒక్కదానికైనా సరైన సమాధానం రాబట్టాలి. మీ తరఫున మరో డజను ప్రశ్నలు రాసుకోండి అభ్యంతరం లేదు. సరైన సమాధానం రాబట్టాలి. ఇది షరతు ఈ పరీక్షలో మీరు విజయం సాధిస్తే మీ డిమాండ్లను ఈ రోజు నుంచే ఆమోదిస్తాను సరేనా?’’ అని బాస్ అనగానే అంతా ఎగిరి గంతేశారు. ‘‘ఇదో పరీక్షనా దానికి మేమంతా వెళ్లాలా? కెమెరామెన్ గంగతో రాంబాబు వెళితే చాలు’’ అన్నారు.
రాంబాబు అందరిలో  జూనియర్.. బాబంటే మహాఅభిమానం.
***
సాయంత్రం ఆరు గంటలు కాగానే గంగతో కలిసి రాంబాబు తెలుగునేత ఇంటికి వెళ్లారు.
‘‘ఇంటర్వ్యూ చేయడానికి వచ్చారా? సరే అడుక్కోండి ’’ అన్నాడు తెలుగు నేత.
రాంబాబు:సార్ నూతన సంవత్సర శుభాకాంక్షలు
తెలుగునేత : ఉల్లిగడ్డల ధర వింటేనే కళ్లల్లో నీళ్లు వస్తున్నాయి బ్రదర్ ఇంతకు మించిన కష్టం ఇంకోటి ఉంటుందా?
రాం: మీ డేట్ ఆఫ్ బర్త్ చెబుతారా?
తెలుగునేత : ఎప్పుడు పుట్టామని కాదు.. ఎంత కాలం అధికారంలో ఉన్నాం, మళ్లీ ఎంత కాలంలో అధికారంలోకి రానున్నాం అనేది ము ఖ్యం. ఈ కాంగ్రెస్‌కు ఒక్క రోజు కూడా అధికారంలో ఉండే హక్కు లేదు.
ప్ర: అంటే కాంగ్రెస్‌పై అవిశ్వాస తీర్మానం పెట్టేందుకు సిద్ధమవుతున్నారా?
జ: అవిశ్వాసం పెడితే యువనేతకు లాభం, పెట్టక పోతే కాంగ్రెస్‌కు, మరి మాకేమిటి? ప్రజ లు ఈ కష్టాలు ఇంకెంత కాలం భరించాలి.
ప్ర: సార్ మీరు నరేంద్ర మోడీ పాపులారిటీ చూశాక బిజెపితో పొత్తు పెట్టుకోవాలని అనుకుంటున్నారా?
జ: బాగా గుర్తు చేశావు బ్రదర్.. తెలుగునాట నేను సాధించిన అభివృద్ధితో ప్రేరణ పొంది మోడీ నా మార్గంలో పయనిస్తున్నాడు. మంచి ఎక్కడున్నా అనుసరించాలి. నా సామర్ధ్యాన్ని సరిగ్గా అంచనా వేసి మోడీ నన్ను అనుసరించాడు. ఇప్పుడు దేశం మొత్తంలో మంచి గుర్తిం పు తెచ్చుకున్నాడు. ఇది చూసైనా కాంగ్రెస్ వాళ్లు సిగ్గుపడాలి.
ప్ర:మీ అబ్బాయిని రాజకీయాల్లోకి తీసుకు వస్తున్నారా?
జ:బ్రదర్ పదవ తరగతిలో మా వాడు ప్రపంచంలోనే నంబర్‌వన్‌గా నిలిచాడు.
ప్ర: మీవాడికి ఇంటర్‌లో 70%మార్కులే వచ్చాయి కదా?
జ: ఏడో తరగతిలో మా వాడి ప్రతిభను చూసి సీటిస్తామని ప్రపంచంలోనే అత్యంత గొ ప్ప యూనివర్సిటీలు ఏడు ముందుకు వచ్చాయి.
ప్ర: సత్యం లింగయ్య మీ వాడి చదువు ఖర్చు భరించాడటంటారు.
జ: సరిగ్గా గుర్తు చేశావు. నేను అధికారంలో ఉన్నప్పుడు సత్యం లింగయ్య బిల్‌గేట్స్ పక్కన కూర్చున్నాడు. తరువాతేమైంది అందరికీ తెలిసిందే కదా?
ప్ర: మీ నెల జీతం రూపాయే కదా? దాంతో అంత పెద్ద పార్టీ భవనాన్ని ఎలా నిర్వహిస్తున్నారు. అక్కడేమైనా అక్షయ పాత్ర ఉందా? నిత్యాన్నదానం ఎలా జరుపుతున్నారు.
జ:నా దృష్టిలో అది పవిత్ర ఆలయం. అందు కే అక్కడ ఓన్లీ వెజిటేరియన్.


ప్ర: సార్ నాకిది చావు బతుకుల సమస్య కనీసం ఒక్క ప్రశ్నకు సూటిగా సమాధానం చెప్పండి. ఇంతకూ మీరు రాష్టవ్రిభజన కోరుతున్నారా? సమైక్యంగా ఉండాలంటున్నారా?
జ: నీ రెండు చేతుల్లో ఏ చేతిని నువ్వు కోరుకుంటున్నావు. రెండు చేతులు కలిస్తేనే చప్పట్లు. రెండుకాళ్లు ఉంటేనే ప్రయాణం. ఉల్లిగడ్డ కోసినా రెండు ముక్కలవుతుంది. కొబ్బరికాయ కొట్టిన రెండే అవుతుంది. ఒకటి పూజారి తీసుకుని ఇంకొటి మనకిస్తారు. ఈ మాత్రం జ్ఞానం కూడా ఢిల్లీ పెద్దలకు లేకుండా పోయింది.
రాంబాబుకు కళ్లు తిరిగినట్టు అనిపించింది. ‘‘సార్ కాస్త మంచినీళ్లు తెప్పిస్తారా? ’’ అని అడిగాడు.
‘‘మేం అధికారంలో ఉండగా ఇంకుడు గుంతలు తవ్వి, భూగర్భ జలాలు పెంచాం. మేం అధికారం నుంచి దిగిపోయాక నీళ్లు కూడా కన్నీళ్లు కార్చి ఆవిరైపోయాయి.’’ అంటూ తెలుగునేత ఇంకా ఏదో చెబుతూనే ఉండగా, రాంబాబు పక్కకు ఒరిగిపోయాడు. కెమెరామెన్ గంగ పక్కకు వెళ్లి నీళ్లు తెచ్చి రాంబాబు ముఖంపై చల్లింది.
బ్రదర్ పర్లేదు కదా?


సార్ చివరగా ఒక్క ప్రశ్న. ఈసారి బాలకృష్ణ ఎన్నికల్లో పోటీ చేస్తారా?
జ: ప్రజలు ఫ్యాక్షనిజాన్ని వ్యతిరేకిస్తున్నారు. అందుకే మా బాలయ్య బాబు నటించిన ఫ్యాక్ష న్ సినిమాలన్నీ హిట్టయ్యాయి.
ప్ర: అరవింద్ కేజ్రీవాల్......
జ: బాగా చెప్పావు. నేను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సాగించిన పాలనను ఆ మధ్య యూ ట్యూబ్‌లో చూసిన అరవింద్‌కేజ్రీవాల్ రాజకీయాల్లోకి వచ్చారు. నన్ను ఆదర్శంగా తీసుకుని ప్రజలకు మేలు చేయాలనుకుంటున్నారు.
ప్ర: సార్ మీ రాజకీయ జీవితం అంతా మచ్చలే అని విమర్శలు ఉన్నాయి కదా?
జ: నేను అధికారంలో ఉన్నప్పుడు ఉదయం లేవగానే చక్రం తిప్పేవాడిని. అలా చక్రం తిప్పుతున్నప్పుడు పడిన గాట్లు అవి.
రాంబాబు నిరాశగా గంగతో కలిసి బయటకు వచ్చాడు.
‘‘్థర్టీ ఇయర్   ఇండస్ట్రి పిల్ల వెధవలు నా ముందు తమాషాలా’’అని తెలుగునేత నవ్వుకుంటూ ఇంకెవరైనా ఇంటర్వ్యూకు వస్తే పంపించండి అని చెప్పి లోనికి వెళ్లాడు.


రాంబాబు గుక్కపెట్టి ఏడుస్తూ చిన్నపిల్లాడిని చేసి మీరంతా నా జీవితంతో ఆడుకుంటారా? అని భోరుమన్నాడు.
విషయం తెలిసి బాస్ వికటాట్టహాసం చేస్తూ ఓపెన్ చాలెంజ్. కొమ్ములు తిరిగిన జర్నలిస్టు, సొమ్ములు మరిగిన జర్నలిస్టులు ఎవరైనా సరే. కనీసం ఒక్క ప్రశ్నకు సమాధానం చెప్పిస్తే దేనికైనా రెడీ అంటూ ఓపెన్ చాలెంజ్ చేశాడు.


 ‘డాన్‌కో పకడ్‌నా ముష్కిల్ హీ నహీ నా మున్కీన్‌హై’ అని టీవిలోఏదో సినిమా డైలాగు వినిపిస్తోంది.

30 కామెంట్‌లు:

  1. సూపరండీ.
    తెలుగుబాబు గారు తలాతోకా లేని జవాబులతో నవ్వుల పూవులు పూయించారు :-)

    రిప్లయితొలగించండి
  2. జోడు గుర్రాలపై స్వారీ చేస్తున్న బాబు ఆ రెండూ సమవేగంతో ప్రయాణించినంత వరకు బాగానే ఉంటాడు. వాటి వేగంలో ఏమాత్రం తేడా వచ్చినా ఏమౌతాడో ఊహించాల్సిందే! ఇలాంటి బాబుతో ఇంటర్వూ అంటే...జర్నలిస్టులకు కత్తిమీద సామే మరి.

    రిప్లయితొలగించండి
  3. పాపం ఏం చెప్పాలో తెలియక బాబు గారు చెప్పిన మాటలనే మళ్ళీ మళ్ళీ చెపుతున్నారు.

    కాని మొన్న ఒంగోలు సభలో అనుకుంటాను, ఒక విషయం సరిగ్గానే చెప్పారు.
    అదేమిటంటే, "తెలంగాణా విభజన జరగాలంటే సీమాంధ్రుల అంగీకారం కావాలి, రాష్ట్రం సమైక్యంగా ఉండాలంటే తెలంగాణా ప్రజల అంగీకారం కావాలి."
    ఈ విషయం ముందుగా రెండువైపులవాళ్ళు ఒప్పుకుంటేనే సమస్యకి పరిష్కారం దొరుకుతుంది.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. అది సరైన విషయమెలా అవుతుంది? నరం లేని నాలుక బాబుది. ఎన్ని ప్రేలాపనలైనా ప్రేలుతుంది.
      పిల్లులు ఎలుకలతో కలిసుంటామనే అంటాయి! ఎలుకలను తమనుండి విడిపోవడానికి ఒప్పుకుంటాయా? పిల్లి కలిసుందామంటుంది. ఎలుక విడిపోతానంటుంది.
      దోచుకునేవాడు దోపిడీకే ఇష్టపడతాడు. దోపిడీ కాబడ్డవాడు విడిపోతానంటాడు.
      దోపిడీకి దోహదం చేద్దామా, దోపిడీని అరికడదామా?
      బాబు మాటలు దోపిడీకే వత్తాసుపలుకుతున్నాయి! ఎంతైనా సీమాంధ్రుడు కదా!
      ఏది ఏమైనా తెలంగాణ రాష్ట్రమేర్పడడం ఖాయం. దీనికి ఒకరి (దోపిడీదార్ల) ఒప్పుకోలుతో పనిలేదని తెలుసుకోండి!

      జై తెలంగాణ! జై జై తెలంగాణ!

      తొలగించండి
    2. మధుసూదన్ గారు,
      కలిపి ఉంచుతామంటే ముందుగా ఇక్కడ వారే తన్నేలా ఉన్నారు. కాబట్టి తెలంగాణా ఏర్పాటు విషయంలో మీరు ఎటువంటి సంశయాలు పెట్టుకోవద్దు....
      ఇంతకీ జై అంధ్ర ఉద్యమం వచ్చినప్పుడూ ఈ సీమాంధ్రులు( దోపిడిదారులతో) కల్సి ఉండడానికి మీరు (దోపిడి కాబడ్డవారు) ఎందుకు ఊబలటపడ్డారో కూడా చెపితే బాగుండేది.....
      మీరు తెలంగాణా కావాలనుకుంటే మనస్పూర్తిగా కోరుకొండి... తప్పు లేదు... దాని కోసం వేరేకరి (సీమాంధ్రులు) మీద నిందలు వేయడం మానుకొండి.. అది సరయిన విధానం కాదు...

      తొలగించండి
    3. "ఇంతకీ జై అంధ్ర ఉద్యమం వచ్చినప్పుడూ ఈ సీమాంధ్రులు( దోపిడిదారులతో) కల్సి ఉండడానికి మీరు (దోపిడి కాబడ్డవారు) ఎందుకు ఊబలటపడ్డారో కూడా చెపితే బాగుండేది"

      Dr. Parakala Prabhakar made a similar claim on his blog. My response to Parakala will answer your question too:

      “కోస్తా రాయలసీమల్లో విభజన వాదం తలెత్తి నపుడు అంతకు మూడు సంవత్సరాల మునుపు ఆందోళన చేసిన తెలంగాణ వేర్పాటవాద నాయకులు మిన్నకుండడం చూస్తే, రాష్ట్ర విభజన వాంఛనీయత పట్ల వారికి ఏమాత్రం నిబద్ధత లేదని ఇట్టే అవగతమవుతుంది.”

      ఛా నిజమా! ముల్కీ వ్యతిరేకులు జై ఆంధ్రా జెండా ఎత్తినప్పుడు తెలంగాణా వాదులు మిన్నుకున్నారనే మీ ఆక్షేపణ అసత్యం. మచ్చుకు ఈ క్రింది వార్త చదవండి.

      “రాష్ట విభజనే అన్ని సమస్యలకు శాశ్వతమయిన పరిష్కార మార్గం: తెలంగాణా కాంగ్రెస్ వాదుల సదస్సు తీర్మానం” (ఆంద్ర పత్రిక; 22-01-1973; 1వ & 5వ పేజీ ).

      56 మంది ప్రజాప్రతినిధులతో సహా షుమారు 150 నాయకులు ఈ సదస్సులో పాల్గొన్నారు. సమావేశానికి హాజరయిన వారిలో చెన్నారెడ్డి, కేశవులు, నారాయణ రెడ్డి, జీవీ సుధాకర్ రావు, చొక్కారావు, రాజనరసింహ (ప్రస్తుత ఉపముఖ్యమంత్రి తండ్రి), రోడా మిస్త్రీ, పాలవాయి గోవర్ధన్ రెడ్డి, పురుషోత్తం రెడ్డి, ఎస్. జైపాల్ రెడ్డి (ప్రస్తుత కేంద్రమంత్రి), కల్యాణి రామచంద్రరావు, ప్రేమలతాదేవి, కరణం రామచంద్రరావు (తెదేపా హయాములో మంత్రి) ప్రభ్రుతులు ఉన్నారు. ఇబ్రహీం అలీ అన్సారీ (మహబూబ్ నగర్), శీలం సిద్దారెడ్డి గార్లతో సహా మరికొందరు సమావేశానికి రాకపోయినా తమ మద్దతు తెలిపారు.

      అదే పత్రికలో (5వ పేజీ) “ప్రత్యెక తెలంగాణా సాధనకు మొదటి మెట్టు) అనే వార్త కూడా చూడండి.

      ఇవి చాలా ఇంకొన్ని లంకెలు కావాలా?

      తొలగించండి
    4. rajiv raghav gaaru అప్పుడు తెలంగాణా వాళ్ళు మౌనంగా ఉన్నారు అని చెప్పడానికి ఏదైనా ఆధారం చూపండి . లేదా www.appressacademy.org వెబ్ సైట్ లో ఆనాటి పాత పత్రికలూ అన్ని ఉన్నాయి ..ఒక్క సారి వారిని చదవండి అప్పుడు తెలంగాణా వారు మౌనంగా ఉన్నారా ? లేదా తెలుస్తుంది

      తొలగించండి
    5. Jai Gottimukkala గారు మీరు ఎన్ని లింకులు ఇచ్చినా లేదు మేం వీటిని పట్టించుకోం . ఆంద్ర ఉద్యమ సమయం లో తెలంగాణా వాళ్ళు మౌనంగా ఉన్నారనే మేం చెబుతాం, తెలంగాను ఆంధ్రలో కలపండి అని తొలుత ఉద్యమించింది తెలంగాణా వారే అని ఇంకా ఇప్పటికీ అంటారు ఏమి చేయలేం .. మరో రెండు నెలలు ఇలాంటి వాదనలు తప్పవు ... వాదనలో పస లేకపోయినా ప్రచార బలం బాగుంటుంది .. పొట్టి శ్రీ రాములు ఆంద్ర ప్రదేశ్ కోసం పోరాడాడు అని ఇప్పుడు రాష్ట్రం లో చాలా మంది నమ్ము తారు . ప్రచార బలానికి నిదర్శనం అది

      తొలగించండి
  4. మై డియర్ రమణ,
    చాలా చాలా బాగున్నది. వాస్తవానికి ప్రస్తుత రాజకీయ - జర్నలిస్టుల పాత్రను చక్కగా విస్లేషించావు.

    రిప్లయితొలగించండి
  5. sriramdavuluruగారు ధన్యవాదాలు నా పేరు బుద్దా మురళి

    రిప్లయితొలగించండి
  6. తెలుగు బాబును కుమ్మేసారండి. ధన్యవాదాలు.

    రిప్లయితొలగించండి
  7. మురళి గారు,
    చాలా బాగా రాసారు సార్... నేను గమనించిన పలు సందర్బాల్లో బాబు గారు ఏ ఒక్క ప్రశ్నకు సరయిన సమాధానం చెప్పగా వినలేదు.. దానిని మీరు వ్రాసిన విధానం చివరి వరకు పెదాలపై నవ్వు రాకుండా ఉండలేకపోయాను.... పాపం రాంబాబు లాంటి వారు ఎంత మంది బలయి ఉంటారో...

    రిప్లయితొలగించండి
  8. సూపర్ మురళి గారు. చాలా ఫన్నీగా రాశారు. నిజంగా బాబు గారిని చూస్తేనే అర్థమవుతుంది దొంగకోళ్లు పట్టే మొహమని. భయం భయంగా బెరుకు బెరుకుగా చుట్టూ చూస్తుంటారు. ఎందుకో...
    ఇక ఆయన మాట్లాడితే అస్సలు వినబుద్ది కాదు. అసలు ప్రశ్నకు, సమాధానానికి పొంతన లేకుండా మాట్లాడే రాజకీయ నాయకుడ్ని ఎక్కడా చూడలేదు.

    రిప్లయితొలగించండి
  9. Quite hilarious. Really enjoy reading your blog.

    Can we also expect a post on KCR's agricultural productivity? Looks like farmers can make decent (??) money, if they follow his innovative agri practices !!
    Or it will not be right to expect such blog post from a TG supporter??

    రిప్లయితొలగించండి
  10. ur articles very nice.But ur also same like other telangana leaders such as claim telangana support is key for their life.as a journo u should talk neutral or u can claim ur one sided

    రిప్లయితొలగించండి
  11. కొద్ది రోజులు సమన్యాయం అని తరువాత సమైక్యంద్ర అనడం , ముందు తెలంగాణా అని తరువాత రెండు కళ్ళ సిద్ధాంతం అనడం కన్నా ఇదే బెటరేమో

    రిప్లయితొలగించండి
  12. very good article. utta ra pratyuttaraalu excellent. manamandaram five years bathike untaamu kaabatti, rashtram vidipovatam valana laabha nashtaalu spashtam ga pratyaksham gaa chusthaamu. anubhavishthaamu. thina bothu ruchi yenduku>?

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం