14, ఏప్రిల్ 2011, గురువారం

కాంగ్రెస్స్, టి డిపి , వై యస్ ఆర్ కాంగ్రెస్స్ , టిఆర్యస్ , బిజెపి పార్టీలను స్టాక్ మార్కెట్ లో లిస్టు చేస్తే ?

ఇద్దరు వ్యాపారులు కలుసుకున్నప్పుడు వ్యాపారం ఎలా ఉంది? అని ఆప్యాయంగా పలకరించుకుంటారు. కానీ ఇరు పార్టీల నాయకులు కలుసుకున్నప్పుడు తాము చేసేది రాజకీయ వ్యాపారం అయినా వ్యాపారం ఎలా ఉంది అని మాటవరుసకైనా అనుకోరు.
 వర్షాకాలంలో గొడుగులమ్మిన వాడు చలికాలంలో దుప్పట్ల వ్యాపారంలోకి మారినట్టుగా, సినిమా వ్యాపారం చల్లబడ్డాక కొందరు ప్రజాసేవ వ్యాపారంలో దిగుతారు. కొందరు రాజకీయ వ్యాపారంలో తలపండాక, ఇతర వ్యాపారాల్లోకి దూకుతారు. వైఎస్‌ఆర్ వెలిగిపోతున్నప్పుడు జగన్‌కు వ్యాపారాన్ని అప్పగించారు. బాబు దిగిపోయాక ఎందుకైనా మంచిదని లోకేశ్‌కు వ్యాపారాన్ని అప్పగించారు. ఇద్దరు నాయకులు కూడా తమ వారసులకు ముందు వ్యాపారంలో తర్ఫీదు ఇచ్చి తరువాత రాజకీయాల్లో ప్రవేశపెట్టాలనుకున్నారు. రాజకీయం, వ్యాపారం వేరువేరు కాదు. ఒకదానిపై ఒకటి ఆధారపడి ఉన్నాయి. రెండింటి లక్ష్యం లాభమే.
 జగన్ పార్టీ పార్టీలో ఎంతమంది చేరుతారు అని ప్రశ్నిస్తే ?  అంటేఇన్వెస్ట్మెంట్  , రిటర్న్స్‌పై ఆధారపడి ఏ వ్యాపారానికైనా భవిష్యత్తు ఉంటుంది. లాభం అనుకుంటే జగన్ వెంట వెళతారు లేదంటే లేదు అని సమాధానం వచ్చింది.
టిడిపి అధికారంలో ఉన్నప్పుడు ఎన్నికల్లో డబ్బులు విచ్చలవిడిగా ఖర్చు చేస్తున్నారని విమర్శలు వినిపించాయి. దాంతో బాబు ఎన్నికలకు అయ్యే వ్యయాన్ని ప్రజలే భరించాలని అని విరాళాల సేకరణ పథకం ప్రకటించారు. ఈ పథకంపై నాయకులు అభిప్రాయ సేకరణ జరిపితే విరాళాల సేకరణ కన్నా పబ్లిక్ ఇష్యూకు వెళ్లడం మంచిదని సలహా ఇచ్చారు. ఓటర్లలో వ్యతిరేకత ఉంటే ఉండవచ్చు కానీఇన్వెస్ట్  చేసే వారిలో బ్రహ్మాండమైన ఆదరణ ఉందని చెప్పినా, ఎందుకో కానీ బాబు వినలేదు.


 చిన్న కంపెనీలను కూడా స్టాక్ మార్కెట్‌లో నమోదు చేస్తారు. కానీ వేల కోట్ల రూపాయల వ్యాపారం సాగించే రాజకీయ పక్షాలను చిన్నచూపు చూస్తున్నారు. స్టాక్ మార్కెట్ నిబంధనలు సడలించైనా రాజకీయ పక్షాలను కంపెనీలుగా గుర్తించి స్టాక్ మార్కెట్‌లో రిజిస్టర్ చేసుకునే అవకాశం కల్పించాలి. అప్పుడు ఎంచక్కా రాజకీయ పక్షాలకు ఎన్నికల్లో పోటీ చేసేందుకు బ్యాంకుల నుంచి రుణాలు సైతం లభిస్తాయి. రాజకీయ వ్యాపారం పారదర్శకంగా, మరింత లాభసాటిగా మారుతుంది. రాజకీయ పార్టీలు స్టాక్ మార్కెట్‌లో నమోదైతే, వివిధ పార్టీల గురించి మార్కెట్ విశే్లషకుల విశే్లషణ ఎలా ఉంటుంది అని ఆలోచిస్తే.....
కాంగ్రెస్ : షేరు స్టాక్ మార్కెట్‌లో మంచి ఊపుమీదుంది. దీర్ఘకాలిక మదుపరులు మూడేళ్ల వరకు ఇనె్వస్ట్ చేయవచ్చు. ఆ తరువాత పరిస్థితిని బట్టి నిర్ణయం తీసుకోవచ్చు. కంపెనీలో అనేక లొసుగులు ఉన్నప్పటికీ స్టాక్ మార్కెట్‌లో మాత్రం మంచి డిమాండ్ కనిపిస్తోంది. గత ఆరేళ్ల నుంచి పెట్టుబడి దారులకు మంచి డివిడెండ్స్ ఇస్తోంది. ఈ కంపెనీ షేర్లలో చిన్న ఇనె్వస్టర్లు ఎక్కువ. కొత్తగా ఇనె్వస్ట్ చేయదలుచుకున్న వారు ఈ షేరుకు దూరంగా ఉండడం మంచింది. 
.
వైయస్ ఆర్ కాంగ్రెస్ : ప్రస్తుతం ఈ షేరు మంచి ఉపు మిద ఉన్నట్టు అనిపిస్తోంది .కనీసం రెండేళ్ళ పాటు షేర్ కదలికలు గమనించాలి మూదెల్ల తరువాతనే షేర్ అసలు బలం తెలుస్తోంది కంపని వోనర్కు పాపులారిటీ , విశ్వసనియత ఉన్నా అనుభవం లేదు 

టిడిపి : కంపెనీ పరిస్థితి ఎంత దీనంగా ఉన్న స్టాక్ మార్కెట్‌లో మాత్రం మంచి ప్రచారం ఉన్న షేరు. విస్తృతమైన ప్రచార యంత్రాంగం కంపెనీకున్న పెద్ద అసెట్. ఈ కంపెనీ గురించి లీకేజీ వార్తలే ఎక్కువగా ఉన్నాయి. వాటిని ఎంత వరకు నమ్మవచ్చో? ఎంత వరకు నమ్మకూడదో మార్కెట్ విశే్లషకులకే అంతు చిక్కని వ్యవహారం. కంపెనీ షేరు ఏడాదిలో అతి తక్కువగా 47 రూపాయలకు అత్యధికంగా 92 రూపాయలకు అమ్ముడు పోతోంది. 92 నుంచి ఇప్పుడు 89కి చేరింది. ఏ క్షణంలోనైనా మధ్యంతర ఎన్నికలు వస్తాయి కంపెనీ షేరు రెట్టింపు ధర పలుకుందని కంపెనీ డైరెక్టర్లు ప్రచారం చేస్తున్నారు. 2014లో మంచి ఫలితాలు చూపకపోతే కంపెనీ ధర అధః పాతాళానికి పడిపోయే అవకాశం ఉంది. సంస్థాగత ఇనె్వస్టర్లే ఈ కంపెనీలో ఎక్కువగా ఉన్నారు. . పనితీరు గురించి చైర్మన్ చెప్పే ఉపన్యాసం, కంపెనీ బ్రోచర్ అద్భుతంగా కనిపిస్తున్నా వాస్తవాలు ఎన్ని అనేవి ఆలోచిస్తే అనేక అనుమానాలు. గతంలో తొమ్మిదేళ్ల పాటు సంస్థాగత ఇనె్వస్టర్లకు చక్కని డివిడెండ్లు చెల్లించింది.
పిఆర్‌పి : ఈ కంపెనీలో హడావుడి ఎక్కువ, ఫలితాలు తక్కువ అన్నట్టుగా ఉంది. రెండేళ్ల వయసు కూడా లేని ఈ కంపెనీ నూటాపాతికేళ్ల రికార్డు చరిత్ర గల మరో కంపెనీలో విలీనం 
కావాలని నిర్ణయం తీసుకుంది   ఈ కంపెనీ షేర్లకు ప్రత్యేకంగా విలువ ఉండదు. పాత కంపెనీలో విలీనం కావాలనుకుంటున్న వారు మాత్రమే ఈ కంపెనీ షేర్‌లో ఇనె్వస్ట్ చేయాలి.
టిఆర్‌ఎస్ : మరే కంపెనీ చరిత్రలో కనిపించనన్ని ఒడిదుడుకులు ఈ కంపెనీ షేర్‌లో కనిపిస్తునాయ. ఎప్పుడు పైకి లేస్తుందో? ఎప్పుడు కింద పడిపోతుందో ఎవరికీ అర్ధం కాదు. స్పల్పకాలిక పెట్టుబడి దారులు ఈ కంపెనీ షేర్‌పై ఇనె్వస్ట్ చేయవచ్చు.
సిపిఐ, సిపిఐఎమ్ : ఈ కంపెనీలు స్వతంత్రంగా పని చేసే స్థితిలో లేవు. ఏదో ఒక పెద్ద కంపెనీని పట్టుకుని బతుకీడుస్తున్న కంపెనీలివి. పెద్ద కంపెనీల్లో విలీనం చేయరు. వారి అండ లేనిదే బతకలేరు. ఈ కంపెనీ షేర్లు ఎప్పుడూ నేలపైనే ఉంటాయి. ఈ కంపెనీ హడావుడి మార్కెట్‌లో కనిపిస్తుంది కానీ ఫలితాల్లో మాత్రం శూన్యం. ఒక్కసారి కూడా డివిడెండ్లు ఇవ్వలేదు.
లోక్‌సత్తా : పేరుకు అంతర్జాతీయ కంపెనీ, కానీ ఒక నియోజక వర్గానికే పరిమితం అయిన కంపెనీ. ఈ కంపెనీ భవిష్యత్తు ఏమిటో కంపెనీ చైర్మన్‌కే తెలియదు. కంపెనీ చైర్మన్ చేతిలోనే వాటాలన్నీ ఉన్నాయి. ఈ కంపెనీ వాటల కోసం పెద్దగా ఇనె్వస్టర్లు ఎదురు చూడడం లేదు.
బిజెపి : కంపెనీకి పెద్దగా భవిష్యత్తు కనిపించడం లేదు. మార్కెట్‌లో విస్తరించడానికి ఒక సారి అవకాశం లభించినప్పుడు పెద్ద కంపెనీతో చేతులు కలిపి తన తలపై తానే చేతులు పెట్టుకుంది. ఈ కంపెనీ విస్తరణకు పెద్దగా అవకాశాలు లేవు. ఇప్పుడున్న ఇనె్వస్టర్లు షేర్లు అమ్ముకోరు, కొత్తవారు కొనరు.

4 కామెంట్‌లు:

  1. SENSEX ఒక్కరోజులోనే లక్ష పాయింట్లు దాటేస్తుంది . NIFTY కూడా అదే బాట పడుతుంది . ఆపరేటర్లంతా కొనుగోళ్లకు పాల్పడతారు. దలాల్ స్ట్రీట్ జన సముద్రంగా మారి తొక్కిసలాట జరుగుతుంది. రాజకీయ పార్టీల కౌంటర్లన్నీ కిటకిటలాడిపోతాయ్. వివిధ కంపెనీల కౌంటర్ల వద్ద అమ్మకాల వత్తిడి కొనసాగుతుంది . చివరకు భారతీయ స్టాక్ మార్కెట్ ప్రపంచంలోనే అతిపెద్ద స్టాక్ మార్కెట్ గా అవతరిస్తుంది .ప్రభుత్వం FDI ల పరిమితి 100 శాతానికి ఉదారంగా పెంచుతుంది . ఆ దెబ్బతో వివిధ దేశాలలోని పారిశ్రామిక వేత్తలంతా భారత రాజకీయ పార్టీలలో పెట్టుబడులు పెట్టడానికి భారతదేశం బయలుదేరతారు .దానితో విమానాశ్రయాలన్నీ కిటకిటలాడతాయి. రేండేళ్ళ వరకు ఈండియాకు వచ్చే ఫ్లైటన్నీ బుక్కయిపోతాయి. కింగ్ ఫిషర్ కంపెనీ ప్రత్యేక ఏర్పాట్లను చేస్తుంది . అది ప్రపంచంలోనే అతిపెద్ద విమానయాన కంపెనీగా అవతరిస్తుంది. ఎప్పటిలానే ప్రభుత్వ విమానయాన కంపెనీ AIR INDIA ప్రైవేట్ ఆపరేటర్లకు సహకరించడం కోసం తన సర్వీసులను నిలిపివేస్తుంది. ప్రపంచంలో బిలియనీర్లంతా తమకు తోచిన రీతిలో ఇండియా రావడానికి ప్రయత్నిస్తారు . కొంతమంది షిప్పులలోను . మరికొంతమంది నాటు పడవలలోనూ , మరికొంతమంది లైఫ్ బోట్లలోనూ , రబ్బరు టూబులతోనూ చివరికి మరికొంతమంది ఈదుకుంటూ ఇండియా గేటు వద్దకు చేరుకుంటారు ,

    రిప్లయితొలగించండి
  2. అనాలసిస్ gaaru
    మంచిదే కదండీ ఆ దెబ్బతో మన దేశం లో పెట్టుబడులు పెరుగుతాయి, మన నిరుద్యోగం మాయ మౌతుంది

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం