8, ఏప్రిల్ 2011, శుక్రవారం

అన్నా హజారే ప్రమాదం నుంచి కేద్రాన్ని రక్షించాలంటే ఒకటే మార్గం

అన్నా హజారే దీక్ష దేశాన్నే కదిలించింది. అన్నాను అలానే వదిలేస్త్తే దేశం లోని రాజకీయపక్షాలు ప్రమాదం లో పడతాయి. ఈ రోజు ప్రమాదం కాంగ్రెస్ కు అనుకుంటే రేపు యిదే ప్రమాదం బిజెపి కి తప్పదు . అన్నా ప్రమాదం నుచి రాజకీయ పక్షాలు బయట పడాలంటే ఒకటే మార్గం మన రాష్ట్రం లోని ప్రముఖ రాజ కీయ నాయకులను డిల్లి తీసుకు వెళ్ళాలి వారు కాసేపు హజారేతో గుసగుస లాడితే చాలు . కేంద్ర ప్రభుత్వానికి సమష్య తిరి పోతుంది మన నాయకుల ప్రభావం అలాంటిది మరి . హజారే దిక్షనుంచి రాజకీయ ప్రయోజానం కోసం ఒక పార్టీ అప్పుడే రంగం లోకి దిగింది కడపలో హజారే ఉద్యమం పైనే ప్రచారం చేస్తారట. ఇక టీవీ తొమ్మిది ఓవర్ యాక్షన్ తక్కువేమీ లేదు. హజారే దీక్ష పై తొలుత జాతీయ చానల్స్ ప్రాముక్యత నిచాయి ఆ తరువాత రెండవ రోజు ప్రజాలు స్పందించాక తెలుగు చానల్స్ స్పందించాయి . కానీ తొమ్మిది టీవీ మాత్రం హజారే దీక్ష పై తమ పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాలు స్పందించారని ప్రచారం చేసుకొంటోంది . ప్రతి సంగటన నుండి ప్రయోజానం పొందాలని రాజకీయ పక్షాలు ఆలోచించినట్టుగానే చానల్స్ కూడా ఆలోచిస్తున్నాయి . కానీ రాష్ట్ర వ్యాప్తంగా ప్రజాలు స్పిందించిన తరువాత స్పందించిన చానల్స్ తమ పిలుపు మేరకే ప్రజాలు స్పందించారని ప్రకటించడం చిత్రంగా ఉంది.

కామెంట్‌లు లేవు:

కామెంట్‌ను పోస్ట్ చేయండి

మీ అభిప్రాయానికి స్వాగతం