17, ఏప్రిల్ 2011, ఆదివారం

ఒడార్పునకు వేళాయెరా

వావ్... నిజమా! ఏవండోయ్-అంటూ సుశీల గట్టిగా అరిచింది. పట్టలేని సంతోషం వస్తే తప్ప సుశీ అలా పిలవదు ఏంటో ఆ శుభవార్త అనుకుంటూ భర్త చలపతి చదువుతున్న పేపర్ పక్కన పడేసి వరండా లోంచి ఒక్క గెంతులో గదిలోకి వచ్చి పడి ‘‘ఏంటీ’’ అని అడిగాడు.


 ‘‘మీ పిన్ని వాళ్ల అమ్మాయి పెళ్లికి బంధువులంతా బస్సులో వెళుతుంటే ప్రమాదం జరిగిందట! ఎవరూ పోలేదు కానీ తీవ్రంగానే గాయాలయ్యాయట! అది చెప్పడానికి పిలిచాను’’ అంది. ‘‘ పాపం ఎలా జరిగిందో, లీవు దొరక్క కానీ లేకపోతే మనమూ బస్సులోనే ఉండేవాళ్లం. అయినా ఏదో శుభవార్త లా అలా పిలిచావేం’’ అని చలపతి అడిగాడు.‘‘ మీ సందేహాలు తరువాత కానీ ముందు పదండి మీ బంధువులందరి ఇళ్లకు వెళ్లి ఓదార్చి వద్దాం’’ అని సుశి చిన్నపిల్లలా గోముగా అడిగింది.
‘‘సర్లే నేను వెళ్లొస్తా కానీ నువ్వెందుకులే’’అని చలపతి వెళ్లడానికి సిద్ధపడితే, ‘‘మీతో పాటు నేను వచ్చి తీరుతాను అంతే’’ అని సుశీల మొండికేసింది. ‘‘దీని వాలకం ఈ రోజు అస్సలు అర్ధం కావడం లేదు. శుభవార్త చెప్పినట్టుగా ప్రేమగా అరిచింది. ఇప్పుడేమో నేను వచ్చి తీరుతానంటోంది ఏంటో అంతా గందర గోళంగా ఉంది’’ అనుకుంటూ చలపతి ప్రశ్నార్ధకంగా మొఖం పెట్టాడు. ‘‘మీ సందేహం నాకర్ధమైంది కానీ నా సంతోషాన్ని అడ్డుకోకండి. ఆ రోజు మనం ప్రయాణిస్తున్న ఆటో బోల్తా పడి మనం గాయపడితే మన బంధువులు, మీ ఆఫీసు వాళ్లు ఎంత మంది వచ్చి ఓదార్చారు. ఆ రోజు మీ పిన్ని ఓదార్పు మాటలు విన్నాక, ఈ రోజు కోసమే ఎదురు చూశాను. ప్రతీకారంతో రగిలిపోయాను. అన్ని రోజులు వాళ్లవే కాదు.. నాకూ మంచి రోజులు రాకుండా పోతాయా? అని ఎన్ని రోజుల నుంచి ఎదురు చూస్తున్నాను. ఒకరి తరువాత ఒకరిని అందరినీ ఓదార్చే చాన్స్ నాకా భగవంతుడు ఇస్తాడండి.


 నేను నోచిన నోములు వృధా కావు ’’ అంటూ సుశీల ఏకధాటిగా చెప్పుకుపోతూనే ఉంది. మధ్యలో అడ్డుకుంటే ఏమవుతుందో చలపతికి బాగా తెలుసు కాబట్టి వౌనంగానే వింటూ ఉండిపోయాడు. ఎవరైనా బాధలో ఉంటే మేమున్నామని ధైర్యం చెప్పడానికి ఓదార్చడానికి వస్తారు దానికి ప్రతీకారం ఏంటే? ఈరోజు నువ్వేం మాట్లాడుతున్నావో నాకంతా కంగారుగా ఉందే సుశీ’’ అని చలపతి దీనంగా పలికాడు.
ఎప్పుడైనా ఓదార్చే వాళ్ల ముఖం నువ్వు చూశావా? అని సుశీల అడిగింది. చూశాను అన్నట్టు కాకుండా చూడలేదు అన్నట్టు కాకుండా చలపతి తల అటూ ఇటూ తిప్పాడు. ఓదార్చడానికి వచ్చిన వాళ్ల మాటలు మాత్రమే మీరు విన్నారేమో కానీ నేను మాత్రం వాళ్ల ముఖాలను చూసి వాళ్ల భావాలను చదివేశాను’’ అంది సుశీల. గాయపడిన వారింటికి వచ్చి ఓదార్చే వారి కళ్లల్లో చూడండి. ఏ పాపం చేశాడో వీడికి దెబ్బలు తగిలాయి అనుకునే వారు కొందరు, అమ్మయ్య దెబ్బలు తగిలితే ఇంత బాధపడతారా? థ్యాంక్ గాడ్ దేవుడు నాకీ శిక్ష విధించలేదు అనుకునే వాళ్లు కొందరు అని సుశీల చెబుతుంటే చలపతి అడ్డు తగిలి నువ్వన్నట్టు అలాంటి వారు కూడా కొందరుంటే ఉండొచ్చే కానీ ఎక్కువ మంది మాత్రం మేమున్నామని మద్దతు ప్రకటించడానికే ఓదార్పు కోసం వస్తారు అయినా ఓదార్పులో ఇంత రాజకీయం ఉంటుందటావే సుశీ !’’ అని చలపతి మెల్లగా అడిగాడు.
‘‘ఎందుకుండదండి ఆ మధ్య పత్రికల్లో చదివాను సీతారామమ్మ అనే ఒక మహిళా నాయకురాలు తమ నియోజక వర్గంలో ఎవరు చచ్చినా ఎవరింట్లో బిడ్డ పుట్టినా, ఎక్కడ శుభకార్యం జరిగినా ఠంచనుగా హాజరయ్యేదట! ఈ దెబ్బతో ఎన్నికల్లో ఆమె గెలిచిపోయింది. చనిపోతే ఇంటికెళ్లి ఓదారిస్తే ఊరికే పోదని ఆమె అనుభవపూర్వకంగా తెలుసుకుంది. నిజంగా చాలా మంది ఓదార్చే వారు వాస్తవానికి వారే ఓదార్పు పొందే స్థితిలో ఉంటారు.అప్పుడు జై తెలంగాణ , జై ఆంధ్ర ఉద్యమం జరుగుతున్నప్పుడు ఏమీ మాట్లడలేని చంద్రబాబు చివరకు ఓదార్పునే ఆశ్రయించాడు. ఆయన అదృష్టం కొద్ది రోజూ ఎక్కడో ఒక చోట ఎవరో ఒకరు మరణించే వారు, ప్రమాదాలు జరిగేవి. ఆ సమయంలో దాదాపు నెల పాటు బాబు ఇంటికే పరిమితం అయ్యారు. ఆయన పరిస్థితి చూసి పార్టీలోనే చాలా మందికి జాలేసి రోజూ వెళ్లి ఆయన్ని ఓదార్చేవారు. ఆ ఓదార్పు నుంచే ఆయనకో ఐడియా వచ్చింది. దాంతో ఆయన ఓదార్పు యాత్ర చేపట్టి వరుసగా నాలుగు రోజుల పాటు జిల్లాలు వెళ్లి ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలను పరామర్శించి వచ్చారు. పెద్దగా ఆత్మవిశ్వాసం లేని వాళ్లు ఆత్మవిశ్వాసంపై చక్కని ఉపన్యాసాలు ఇచ్చేస్తుంటారు.


 150 మంది ఎమ్మెల్యేలు సంతకాలు చేసినా జగన్‌కు సోనియా అనుగ్రహం దక్కనందుకు పాపం పిల్లాడికి అన్యాయం జరిగింది అని అంతా అనుకున్నారు. రోజూ ఆయన్ని ఎమ్మెల్యేలు వాళ్లింటికి వెళ్లి ఓదార్చేవారు. అందరి ఓదార్పుల తరువాత స్వయంగా ఆయనే ప్రజలందరినీనెలల తరబడి వోదర్చారు .  వోదార్పు లో జనం స్పందన చూసాకే కదా ఇప్పుడు ఆయన ఏకంగా ఒక పార్టీనే స్తాపించారు 
. ఇక చాలా ఇంకా చెప్పమంటావా? ’’అంటూ సుశీల గుక్క తిప్పుకోకుండా గడ గడా చెప్పడంతో చలపతికి కళ్లు తిరిగి పోయాయి. ఆయోమయంగా చూస్తూ కుర్చీలో కూలబడ్డాడు.‘‘మీకేమీ కాదండి నేనున్నాను అంటూ చలపతి గదవ పట్టుకుని సుశీల ఓదార్చింది .ఆల్ దీ  బెస్ట్ ఓడర్పుకు వెళ్ళు ని సంతోషాని నేనెందుకు అడ్డుకోవాలి అని సీతయ  పలికాడు .  

2 కామెంట్‌లు:

  1. yentha baagaa cheppaaru!! odhaarpu ane maataki ardham padipoyina ee rojullo.. aratipandu olichi pettinantha easygaa..chakkagaa churaka.. wow..

    రిప్లయితొలగించు
  2. థాంక్స్ అండీ వనజ వనమాలి గారు మీ ప్రోత్శాహానికి మరోసారి ధన్యవాదాలు

    రిప్లయితొలగించు

మీ అభిప్రాయానికి స్వాగతం