హాలంతా కేరింతలతో, విజిల్స్‌తో ఊగిపోతోంది. వారి ఆనందాన్ని చూసి తెలుగు నాయకుడి కళ్లు చెమ్మగిల్లాయి. వారిలో ఇంతటి ఉత్సాహాన్ని చూడడం అదే మొదటి సారి. ఆనందంతో గొంతు బొంగురు పోయింది. ఈలోపు పాట అయిపోయింది. నాయకులంతా వన్స్‌మోర్ ... వన్స్‌మోర్ అని అరవసాగారు. తెలుగునేత తల ఊపడంతో పాట మళ్లీ వినిపించారు. ఓలమీ తిక్కరేగిందా.... ఒళ్లంతా తిమ్మిరెక్కిందా? మైకులో పాట పెద్దగా వినిపిస్తోంది. పదేళ్ల నుంచి రాజకీయాల్లో ఒక్క హిట్టు కూడా లేక చతికిలపడిపోవడంతో సినిమా శ్రేయోభిలాషులు కొందరు ఇచ్చిన సలహా మేరకు తెలుగునేత హిట్ చిత్రాల దర్శకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు.
ఒక్కో దృశ్యం రక్తి కట్టడానికి ఏంతో కృషి చేసే దర్శకులు పడిపోయిన పార్టీ పైకి లేవాలంటే పవర్ ఫుల్ సీన్స్ ఉండాలని సూచించారు. ఒకదాని తరువాత ఒకటి అమలు చేయాలని నిర్ణయించారు. మొదటగా సమావేశాల ప్రారంభ సూచనగా ఒలమీ తిక్కరేగిందా? ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా? పాటను వినిపించాలని నిర్ణయించారు. ఆ పాటకు నాయకులంతా ఊగిపోతున్నారు. రాష్టమ్రంతా మీలానే చైతన్యంతో రగిలిపోవడానికి మనం అధికారంలోకి రాగానే ఒలమీ తిక్కరేగిందా? పాటను తెలుగు జాతీయ గీతం చేస్తామని ప్రకటిస్తున్నాను అని తెలుగు నేత చెప్పగానే అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు.
సార్ రగులుతుంది మొగలి పొద పాటను రెండవ తెలుగు జాతీయ గీతంగా ప్రకటించండి.సామాజిక న్యాయాన్ని పాటించినట్టు అవుతుంది అని సినిమా రాజ్యం పార్టీలోకి వెళ్లి వెనక్కి వచ్చిన సీనియర్ నాయకుడొకరు సూచించాడు. అతని సలహాను ఎవరూ పట్టించుకోలేదు. పక్కనున్న నేత సానుభూతిగా సినిమా రాజ్యం నేతకు ఇవ్వాల్సిన సలహాలు తెలుగు నేతకు ఇస్తున్నావు.ఇలా చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు అని మెల్లగా చెవిలో చెప్పారు.
హాలులో రాజ మౌళి ని చూసి తెలుగు పార్టీ నేత ఒకరు ఈగను హీరోను చేసిన దర్శకుడు మా నేతను హీరో ను చేస్తాడు చేసి తీరుతాడు అని ధీమాగా పక్కనున్న నేతతో చెప్పాడు.
గడ్డం రాఘవేంద్రరావు వెనక అతని సహాయకులు ఆపిల్ పళ్లు, బత్తాయి పళ్ల బుట్టలు పట్టుకుని కూర్చున్నారు. రాఘవేంద్రరావు ఉత్సాహాన్ని ఆపుకోలేక బత్తాయి పళ్ల బుట్టను తీసుకుని ఆడవారివైపు చూడగానే విషయాన్ని గ్రహించిన పుసపాటి రాజావారు కొంప తీశారండి
పాదయాత్ర ప్రారంభమైంది... తెలుగు నేత ఎండకు, చలికి, వర్షానికి, తుఫానుకు భయపడకుండా పాదయాత్ర ప్రారంభించారు అంటూ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.
యాత్ర సాగుతుండగా, వికలాంగుల గుంపు వచ్చింది. అన్నయ్యా మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఒక వికలాంగుడు తెలుగు నేత కాళ్లపై పడ్డాడు. అతన్ని పక్కకి తీసుకెళ్లి ఏరా ఠాగూర్ సినిమా డైలాగు ఇంకా మరిచిపోలేదా? రాజకీయాల్లోకి రావడం ఏమిటి? వచ్చి నాలుగు దశాబ్దాలవుతుంది.
డైలాగు సరి చేసుకుని ఆ బృందం మళ్లీ వచ్చింది. అన్నయ్యా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కాళ్లు లేకున్నా పరిగెత్తే వాళ్లం. ఇప్పుడు ట్రై సైకిల్ ఉన్నా ముందుకెళ్లడం లేదన్నా నువ్వు అధికారంలోకి రావాలి అని ఏడ్చాడు. అన్నయ్య నా భుజంపై చేయి వేయగానే నాకు కళ్లు వచ్చాయి అని మరో వికలాంగుడు సంతోషంగా గెంతులేశాడు.
అన్నయ్యా మేం ఐటి ఉద్యోగులం ... చెయ్యోళ్ల ప్రభుత్వంలో మా నాన్న ఐఎఎస్ పాసై నిరుద్యోగిగా దుర్భరమైన జీవితం గడిపాడు.
నువ్వు అధికారంలో ఉన్నప్పుడు నేను మా అమ్మకడుపులో ఉండగానే ఐటి కంపెనీ నుంచి నాకు అపాయింట్‌మెంట్ ఆర్డర్ వచ్చింది. ఇప్పుడు మా తమ్ముడు ఐఐటి చదివినా పాన్‌షాప్‌లో కూడా ఉద్యోగం దొరకడం లేదు. మళ్లీ నువ్వు రావాలన్నా రావాలి అంటూ కంటనీరు పెట్టుకున్నాడు.
రైతుల బృందం వచ్చి మీరు అధికారంలో ఉన్నప్పుడు వ్యవసాయానికి మాకు ఎరువులు, విత్తనాలు, కరెంటు అవసరమే పడలేదు. ఇప్పుడు వాటి కోసం క్యూలో నిల్చుంటే లాఠీచార్జీలు అంటూ భోరుమన్నారు. దృశ్యాలన్నీ తాము అనుకున్నట్టుగానే వస్తుండడంతో దర్శకులు సంతోషించారు. తెలుగునేత మాత్రం మనసులో... లక్ష కోట్లు సంపాదించిన నేత అధికారం నాదే అని ధీమాగా జైలులో విశ్రాంతి తీసుకుంటుంటే, నేనేమో రోడ్డున పడి నడుస్తున్నా గిట్టుబాటు అవుతుందా? అని అనుకున్నారు. దర్శకులు మనసు పెట్టి రాసిన సీన్లు ,జూనియర్ ఆర్టిస్తులంతా తలపండిన వారు కావడం వల్ల సీన్స్ బాగా వచ్చాయని అంతా అనుకున్నారు .
యాత్రలో అవి బాగా పండి, రజనీకాంత్ సినిమాలను మించిన ప్రచారం జరిగింది. యాత్ర ముగిసింది. ఎన్నికలు వచ్చాయి. జనం తండోప తండాలుగా పోలింగ్ బూత్ లకు తరలి వచ్చారు .
***
అర్ధరాత్రి వరకు మీటింగ్‌లంటూ తిరిగి బారెడు పొద్దెక్కినా మంచం మీది నుంచి లేచేది లేదు అంటూ భార్య దుమ్ము దులపడంతో తెలుగు కార్యకర్త ఉలిక్కి పడి లేచి కూర్చున్నాడు. బంగారం లాంటి కల పాడు చేశావు ఇంతకూ కౌంటింగ్‌లో ఏం జరిగిందో అని మదనపడ్డాడు. ఔను కౌంటింగ్‌లో ఏం జరిగింది!తెలియాలంటే
2014 వరకు వేచి చూడాల్సిందే కదా!
ఒక్కో దృశ్యం రక్తి కట్టడానికి ఏంతో కృషి చేసే దర్శకులు పడిపోయిన పార్టీ పైకి లేవాలంటే పవర్ ఫుల్ సీన్స్ ఉండాలని సూచించారు. ఒకదాని తరువాత ఒకటి అమలు చేయాలని నిర్ణయించారు. మొదటగా సమావేశాల ప్రారంభ సూచనగా ఒలమీ తిక్కరేగిందా? ఒళ్ళంతా తిమ్మిరెక్కిందా? పాటను వినిపించాలని నిర్ణయించారు. ఆ పాటకు నాయకులంతా ఊగిపోతున్నారు. రాష్టమ్రంతా మీలానే చైతన్యంతో రగిలిపోవడానికి మనం అధికారంలోకి రాగానే ఒలమీ తిక్కరేగిందా? పాటను తెలుగు జాతీయ గీతం చేస్తామని ప్రకటిస్తున్నాను అని తెలుగు నేత చెప్పగానే అంతా చప్పట్లతో ఆమోదం తెలిపారు.
సార్ రగులుతుంది మొగలి పొద పాటను రెండవ తెలుగు జాతీయ గీతంగా ప్రకటించండి.సామాజిక న్యాయాన్ని పాటించినట్టు అవుతుంది అని సినిమా రాజ్యం పార్టీలోకి వెళ్లి వెనక్కి వచ్చిన సీనియర్ నాయకుడొకరు సూచించాడు. అతని సలహాను ఎవరూ పట్టించుకోలేదు. పక్కనున్న నేత సానుభూతిగా సినిమా రాజ్యం నేతకు ఇవ్వాల్సిన సలహాలు తెలుగు నేతకు ఇస్తున్నావు.ఇలా చేస్తే నీకు భవిష్యత్తు ఉండదు అని మెల్లగా చెవిలో చెప్పారు.
హాలులో రాజ మౌళి ని చూసి తెలుగు పార్టీ నేత ఒకరు ఈగను హీరోను చేసిన దర్శకుడు మా నేతను హీరో ను చేస్తాడు చేసి తీరుతాడు అని ధీమాగా పక్కనున్న నేతతో చెప్పాడు.
గడ్డం రాఘవేంద్రరావు వెనక అతని సహాయకులు ఆపిల్ పళ్లు, బత్తాయి పళ్ల బుట్టలు పట్టుకుని కూర్చున్నారు. రాఘవేంద్రరావు ఉత్సాహాన్ని ఆపుకోలేక బత్తాయి పళ్ల బుట్టను తీసుకుని ఆడవారివైపు చూడగానే విషయాన్ని గ్రహించిన పుసపాటి రాజావారు కొంప తీశారండి
మీ కళా ప్రదర్శన ఇక్కడొద్దు అని అడ్డుకున్నారు.
దర్శకుల వైపు తెలుగునేత కృతజ్ఞతా పూర్వకంగా చూసి సరే ఇక త్వరలో చేపట్టే అధికార ప్రాప్తి పాదయాత్ర గురించి మీ మీ అభిప్రాయాలు చెప్పండి అని అడిగారు. ఒక్కోక్కరు వంద రోజుల సినిమా తీసిన హిట్ దర్శకులు అలాంటిది డజను మంది హిట్ దర్శకులు రాసిచ్చిన సీన్స్‌తో ప్రారంభించే పాదయాత్ర సూపర్ హిట్టయి తీరుతుందని తెలుగునేత గట్టి విశ్వాసంతో ఉన్నాడు. పాదయాత్ర హిట్టు కావాలంటే కామెడీ ట్రాక్ బాగుండాలని శ్రీనువైట్ల మరీ మరీ చెప్పాడు.
****పాదయాత్ర ప్రారంభమైంది... తెలుగు నేత ఎండకు, చలికి, వర్షానికి, తుఫానుకు భయపడకుండా పాదయాత్ర ప్రారంభించారు అంటూ చానల్స్‌లో బ్రేకింగ్ న్యూస్ వచ్చింది.
యాత్ర సాగుతుండగా, వికలాంగుల గుంపు వచ్చింది. అన్నయ్యా మీరు రాజకీయాల్లోకి రావాలి అని ఒక వికలాంగుడు తెలుగు నేత కాళ్లపై పడ్డాడు. అతన్ని పక్కకి తీసుకెళ్లి ఏరా ఠాగూర్ సినిమా డైలాగు ఇంకా మరిచిపోలేదా? రాజకీయాల్లోకి రావడం ఏమిటి? వచ్చి నాలుగు దశాబ్దాలవుతుంది.
భవిష్యత్తు ఏమిటా ? అని దశాబ్ధం నుంచి కలవరపడుతున్నాడు .
అని తిట్టారు.డైలాగు సరి చేసుకుని ఆ బృందం మళ్లీ వచ్చింది. అన్నయ్యా నువ్వు అధికారంలో ఉన్నప్పుడు మేం కాళ్లు లేకున్నా పరిగెత్తే వాళ్లం. ఇప్పుడు ట్రై సైకిల్ ఉన్నా ముందుకెళ్లడం లేదన్నా నువ్వు అధికారంలోకి రావాలి అని ఏడ్చాడు. అన్నయ్య నా భుజంపై చేయి వేయగానే నాకు కళ్లు వచ్చాయి అని మరో వికలాంగుడు సంతోషంగా గెంతులేశాడు.