కార్లు పుట్టిన కొత్తలో ఇండియాకు వచ్చిన కారులా ఉన్నఆ కారు కనిపించగానే అంతా అటువైపు ఆసక్తిగా చూస్తున్నారు. కారును మించి పాతగా కనిపిస్తున్న ఒక వృద్ధుడు కారులోంచి దిగి. బాబూ ఇక్కడ యూత్ కాంగ్రెస్ మీటింగ్ జరుగుతుందట ఎక్కడా? అని అడిగాడు. అదిగో అక్కడున్న జూబ్లీ హాలులో తాతయ్యా! అని అటువైపు చూపించాడు. అయినా ఈ వయసులో యూత్ కాంగ్రెస్‌తో మీకేం పని తాతయ్యా అంటూ నవ్వాడా? యువకుడు.
1952లో యూత్ కాంగ్రెస్‌లో ఉన్న యూత్‌ను రాష్ట్ర రాజకీయాలపై మేధోమథనం జరపడానికి హనుమంతరావు అనే యువకుడు పిలిచాడు బాబు అని నెమ్మదిగా చెప్పాడు ఆ వృద్ధుడు. వాడు చీమిడి ముక్కుతో చెడ్డి కూడా సరిగా వేసుకోకుండా స్కూల్ ఎగ్గొట్టి సినిమా హాళ్ల చుట్టూ తిరిగే వాడు. యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడు. కాలం ఎంత వేగంగా పరిగెడుతుంది. చీమిడి ముక్కు పోరగాడు ఇంత పెద్ద రాష్ట్రానికి అంత పెద్ద పదవి చేపట్టే యువకుడయ్యాడంటే సంతోషమే కదా? బాబు...అనుకుంటూ జూబ్లీ హాల్‌వైపు వెళ్లాడా! వృద్ధుడు.
అప్పటికే అక్కడికి రెండు వందల మంది వరకు వృద్ధులు చేరారు. అతన్ని చూడగానే ఓరి...ఓరి.. వీరిగా నిన్ను చూసి ఎన్నాళయిందా? ఇంత కాలం ఎక్కడున్నావు... పిల్లలేం చేస్తున్నారు? అంటూ మరో వృద్ధుడు ఆప్యాయంగా భుజంపై చేయి వేసి ప్రశ్నల వర్షం కురిపించాడు. ఎవరూ.. క్షమించాలి బాబు గుర్తు పట్టకలేకపోతున్నాను అని వృద్ధుడు అద్దాలను సరి చేసుకున్నాడు. నేనురా యూత్ కాంగ్రెస్‌లో మనమిద్దరం క్యాంపుల కెళ్లినప్పుడు గోడలు దూకి నానా అల్లరి చేసేవాళ్లం పండరిని అని కొత్త వృద్ధుడు చెప్పాడు. ఓరి పండరిగా నువ్వారా! నువ్వు పోయావన్నారు ? ఇంకా పోలేదా? అని అడిగాడు. రెండు సార్లు గుండెపోటు వచ్చింది పోయింది నేను కాదు మన బ్యాచ్‌లో కర్రిగాడు ఉండేవాడు కదా? వాడు పోయాడు అని చెప్పాడు. మన హనిమిగాడు యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ అయ్యాడట కదా! రమ్మని లేఖ పంపాడు అందరినీ చూసినట్టు ఉంటుంది అని వచ్చాను అని వీరిగాడు అనబడే ఆ వృద్ధ వీరేశం చెప్పుకుపోతున్నాడు.
హనిమి యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ కాదురా! వాడి మనవడికి కూడా యూత్ కాంగ్రెస్ ప్రెసిడెంట్ వయసు దాటి పోయింది. ఐనా అదేం చిత్రమో రాష్ట్రంలో యూత్ కాంగ్రెస్ అంటే ఇప్పటికీ మన హనుమంతే గుర్తుకొస్తాడు అని పండరి గర్వంగా చెప్పుకొచ్చాడు. ఓహో అలాగా! భడవ మంచి పని చేశాడురా! ఖండ ఖండాల్లో ఉన్న మనమంతా కనీసం ఈ విధంగానైనా కలుసుకున్నాం అన్నాడు వీరి.
వీరు మాట్లాడుకుంటుండగానే చిరంజీవి వచ్చాడు. ఎవరూ ఆయన్ని పట్టించుకోలేదు. అక్కడున్న వృద్దుల్లో ఒక్కరికీ చిరంజీవి తెలియదు, చిరంజీవికి ఒక్కరూ తెలియదు. దాంతో ఆయన పెద్దలను గౌరవించుకుంటూ ఒక పక్కకు వెళ్లి కూర్చున్నాడు.
***
వృద్ధులంతా గుంపులు గుంపులుగా చేరి ముచ్చట్లు పెట్టుకుంటున్నారు. ఆ గ్రూప్ డిస్కషన్ సారాంశం ఇలా ఉంది.
‘‘బైపాస్ సర్జరీ జరిగింది ఇప్పుడు పరవా లేదు.
రోజుకు అరగంట నడువు చాలు నీ రోగాలన్నీ కనిపించకుండా పోతాయి.
కీళ్ల నొప్పులు, కళ్లు సరిగా కనిపించవు, చెవులు వినిపించవు. మతిమరుపు పెరిగింది.
ఈ ముసలోడు ఎప్పుడు పోతాడా! ఇంటిని అమ్మేద్దామా? అని చూస్తున్నారురా!
మధుమేహం, బిపి, ఇంకెంత కాలం బతుకుతావు అని ననే్న నేరుగా అడిగేశారు.
నాకు తెలిసిన మంచి డాక్టర్ ఉన్నాడు . ఈ వయసులో పార్టీ నాయకుల నంబర్లు కాదురా! డాక్టర్ల ఫోన్ నంబర్లు ముఖ్యం’’
***
హనుమంతరావుకు కోపం వచ్చింది. ఇదిగో 1952 నుంచి కూడా మీలో ఏ మార్పు రాలేదు. అప్పుడు కూడా యూత్ కాంగ్రెస్‌లో గ్రూపులు మేయింటెన్ చేసేవాళ్లు. ఇక్కడికొచ్చినా అదే చేస్తున్నారు. మేధోమథనంలో రాష్ట్ర కాంగ్రెస్‌ను రక్షించడానికి ఏం చేయాలో ఆలోచిద్దామని మీ అందరినీ పిలిస్తే మీరంతా మీ మీ రోగాల గురించి చర్చించుకోవడం ఏమీ బాగా లేదు. ‘‘ఓరి భడవా అక్కడికొచ్చానంటే రెండు ఇచ్చుకుంటాను. ఒక్క రోజైనా క్లాస్‌లో సరిగా పాఠం విన్నావురా! మీ నాన్న మాకు చెప్పుకొని ఏడ్చేవాడు, పిల్లాడు ఏమైపోతాడో అని ఏమీ కాదు యూత్ కాంగ్రెస్‌లో చేర్పించు అని నేను చెబితేనే కదరా! చేర్పించింది ఇప్పుడు మాకే చెబుతున్నావా? ’’అని కోటేశ్వరరావు వణికిపోతూ కడిగి పారేశాడు.
అది కాదు తాత మీరంతా కాంగ్రెస్‌ను బతికించుకోవడానికి మంచి సలహాలు ఇస్తారని అని హనుమంతరావు నసిగాడు.
పిచ్చి కుంక కాంగ్రెస్‌ను ఒకరు బతికించలేరు... చంపేయలేదు.... కాంగ్రెస్ తనంతట తానే బతుకుతుంది.. తనంతట తానే చస్తుంది.... నువ్వు నేను, హై కమాండ్ అంతా నిమిత్తమాత్రులం. భీష్ముడికి తాను కోరుకున్నప్పుడు మరణించే వరం ఉన్నట్టుగానే .. ఎవరు ప్రయత్నించక పోయినా తనంతట తానే చచ్చే శాపం కాంగ్రెస్స్, తనకు తానే సంపాదించుకుంది .. అని చెప్పాడు కోటి.
***
కొద్దిసేపటి తరువాత వేదిక మీద ఒక మూల నుంచి వా! వా!! అని ఏడుపు వినిపించింది. చిరంజీవి కన్నీళ్లు పెడుతున్నాడు. ఎవరా కుర్రాడు ఎందుకేడుస్తున్నాడు అనే ప్రశ్నలు వినిపించాయి. ‘‘రాజకీయాలపైనే ఆశలు పెట్టుకొని బతుకుతున్నాను. సొంత పార్టీతో వర్కవుట్ కాలేదు. మీ ఉపన్యాసాలు వింటే ఈ పార్టీ కూడా బతికి బట్టకట్టేట్టు కనిపించడం లేదు. ఇప్పుడు నేనేం చేయాలి. పార్టీ రోగాలు మీ రోగాల జాబితా విన్నాక జీవితం మీదనే విరక్తి కలుగుతోంది’’ .. వా! వా! అని మళ్లీ ఏడుపు మొదలు పెట్టాడు చిరంజీవి.
మేధోమథనానికి ముగింపు ఉండదు. అలా సాగుతూనే ఉంటుంది.

రిప్లయితొలగించండిమేధోమథనానికి ముగింపు ఉండదు. అలా సాగుతూనే ఉంటుంది.
పచ్చి నిజాలు చెప్పేసేరు :)