‘‘నా జీవితం అన్యాయం అయిపోయింది. ఆ నూజివీడు సంబంధం ఒప్పుకున్నా జీవితం బాగుండేది. బందరు సంబంధం నా కొంప కూల్చింది ’’ అంటూ ఆమె బిగ్గరగా ఏడుస్తోంది. ఏంటీ అంతా అయిపోయిందా? అని వీరేశం కంగారుగా అడిగాడు. ‘‘మీ బావ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతున్నాడు. ఒక్క మాటకు పొంతన ఉండడం లేదు. అప్పుడే ఒక నాయకుడిని ఆకాశానికెత్తేస్తాడు, మరుక్షణమే వాడంత అధ్వాన్నమైన నాయకుడు భూ ప్రపంచంలో లేడంటాడు. రాజకీయ నాయకుడు కనీసం తానన్న మాటకు ఒక పూటైనా కట్టుబడి ఉంటాడు. కానీ బావ మాత్రం కనీసం ఒక నిమిషం కూడా కట్టుబడి ఉండడం లేదు. ఏం పాడురోగమో ఏమో అర్ధం కావడం లేదు’’ అని అక్క వాపోయింది.
‘‘ఏరా వీరేశం ఇప్పుడేనా రాక. రా.. రా.. మీ అక్క ఒట్టి అమాయకపు మా లోకం. ఏదేదో ఊహించుకుని కంగారు పడుతున్నది. లోపలికి రా! ’’ అని బావ ఆహ్వానిస్తే విస్తుపోవడం వీరేశం వంతయింది.
చక్కగా ఉన్న వీరేశాన్ని చూశాక, కొంపదీసి అక్కకే ఏమైనా అయిందా అని వీరేశం అనుమానించాడు. కొద్దిసేపు ఆగు మీ బావ రోగం నీకే అర్ధమవుతుంది అని అక్క చెప్పింది.
వీరేశం బావనే నిశితంగా గమనిస్తూ, ‘‘ఏం బావా రాజకీయాలు ఎలా ఉన్నాయి? ఏ పార్టీ గెలుస్తుందేమిటి?’’ అంటూ టీవి అన్ చేశాడు.
‘‘సంజీవిని పర్వతాన్ని హనుమంతుడు ఒంటి చేత్తో మోసుకెళ్లినట్టు ఈ రాష్ట్రాన్ని ఒంటి చేత్తో మోసే సత్తా మా తెలుగు నాయకుడు ఒక్కడికే ఉంది. ఈ రాష్ట్రానికి తెలుగునేతే దిక్కు’’ ఈ మాటలు వినగానే వీరేశం ఆశ్చర్యపోయాడు. బావ బిజెపి అభిమాని కదా ఇలా అయిపోయాడేమిటని అనుకుంటుండగానే ... ‘‘సింహాన్ని బోనులో బంధించి చిట్టెలుకలు హీరోల్లా ఫోజు పెడుతున్నాయి. దమ్ముం టే జైలు నుంచి విడుదల చేసి అప్పుడు చూడండి. జైలులో ఉన్నా బయట ఉన్నా సింహం సింహమే. ఓదార్పు స్పెషలిస్టును ఓదార్పుకు దూరం చేయడానికి కాంగ్రెస్, టిడిపి కలిసి కుట్ర పన్నాయి. జగనన్న రాజ్యం వస్తుంది’’ అంటూ బావ ఆవేశంగా ఊగిపోసాగాడు. వీరేశం కంగారు పడి బావా బావా అంటూ భుజం చరిచాడు.
బావ ఒక్క క్షణం ఆగి ‘‘వంద అసెంబ్లీ, 15 పార్లమెంటు సీట్లు గెలుస్తాం, తెలంగాణ సాధిస్తాం. ఆంధ్ర పార్టీలు, ఆంధ్ర నాయకుల అవసరం ఇక మాకు లేదు... లేనే లేదు.. జై తెలంగాణ’’ అంటూ అరిచాడు. ‘‘అదేంటి బావా కొందరు మతం మార్చుకున్నట్టు నువ్వు ప్రాంతం మార్చుకున్నావా? ఏమిటి? ’’అని వీరేశం చమత్కరించాడు. ‘‘ఇంకెక్కడి తెలంగాణ ... కొందరు రాజకీయ నిరుద్యోగులు పదవుల కోసమే తెలంగాణ అంటున్నారు. జై సమైక్యాంధ్ర!’’ అంటూ బావ ఆవేశంగా ప్రారంభించే సరికి అక్క చెప్పినట్టు బావకు ఏదో అయింది అనే నిర్ణయానికి వచ్చిన వీరేశం బావను ఎంతో మంది డాక్టర్లకు చూపించాడు.
బావకున్న పది లక్షల హెల్త్ ఇన్సూరెన్స్ ఆస్పత్రులను ఆకర్షిస్తోంది కానీ రోగం ఏమిటో అంతు చిక్కడం లేదు. అన్ని రకాల టెస్ట్‌లు చేయించినా ఏమీ లేదనే తేలుతోంది.
***
ఇంటికి వచ్చిన తరువాత కూడా డాక్టర్ యోగేష్‌కు బావ జబ్బు ఆలోచనే పట్టిపీడిస్తోంది. టెస్టుల్లో తేలకుండా డాక్టర్లకు టెస్ట్ పెడుతున్న పేషంట్‌గా బావ మిగిలిపోయాడు. ఆలోచనల్లో మార్పు కోసం టీవి ఆన్ చేయగానే చిన్న పిల్ల ఐ న్యూస్ చానల్‌లో ‘చల్లని కిరణాలు, మా పాలిట ఆశాకిరణాలు అంటూ పెద్ద కవిత చదువుతోంది. ముఖ్యమంత్రి ముసిముసినవ్వులు నవ్వుతున్నా యోగేష్‌కు మాత్రం చిర్రెత్తుకొచ్చింది. చానల్ మార్చగానే ఓ చానల్‌లో ‘ఇదే రోజు’ పత్రిక కనిపించింది. ఈరోజు పత్రిక వల్ల ఈ తెలుగు భక్తుడు చార్‌ధామ్ వరదల నుంచి బయట పడ్డాడు. వసుదేవుడు చిన్నికృష్ణున్ని తలపై బుట్టలో మోస్తుంటే యమునా నది దారి ఇచ్చినట్టుగా తెలుగు భక్తుడి చేతిలో ఉన్న ఇదే రోజు పత్రికను చూసి మందాకిని నది దారి ఇచ్చింది ’’ అంటూ ఆ చానల్ వాళ్లు చెబుతున్నారు.
యోగేష్ మరో రెండు మూడు చానల్స్ మార్చి చివరకు కోపం వచ్చి టీవి ఆఫ్ చేసినప్పుడు చిన్న మెరుపుకనిపించింది. , యూరేకా అని గట్టిగా అరిచాడు.
***
బావకొచ్చిన విచిత్రమైన జబ్బు ఏంటో తెలియక ప్రపంచం అంతా బుర్ర గోక్కుంటుంటే డాక్టర్ యోగేష్ ఆ వ్యాధిని కనుక్కోవడమే కాకుండా దానికి చికిత్స జరిపి బావ జీవితాన్ని కాపాడారు అని పివిఆర్ హెల్త్ చానల్‌లో వస్తోంది.
***
ఈ పరిశోధనతో మీకు నోబెల్ వస్తుంది. ఈ అవార్డు మా ఆవిడకే అంకితం అని చెబుతారు కదూ అని యోగేష్‌ను వాళ్ల ఆవిడ గోముగా అడిగింది. ‘‘బావకే కాదు ఈ జబ్బు చాలా మందికి ఉంది. బావకు ముదిరింది. ఒకే చానల్ ఉన్న రోజులు కావివి. పార్టీకో చానల్ వచ్చింది. తమతమ పార్టీలకు అనుకూలంగా ఒకే విషయాన్ని ఒక్కో చానల్ ఒక్కో రకంగా చెబుతోంది. జబ్బుకు అదే కారణం ’’ అని యోగేష్ చెబుతుంటే ‘‘అలా అయితే బావకొచ్చిన జబ్బే అందరికీ రావాలి కదా? ’’ అని భార్య అడిగింది. చానల్స్‌లో వచ్చే వార్తలన్నీ నిజమే అని నమ్మే అమాయకుడు బావ. బావ అన్ని చానల్స్ చూస్తాడు . అన్ని నిజాలే చెబుతున్నాయని నమ్ముతాడు . దాంతో పరస్పర విరుద్ధమైన అంశాలు అతని మెదడుతో ఆడుకున్నాయి . మిగతా వారు అలా కాదు. కొద్ది రోజుల పాటు అన్ని చానల్స్‌ను చూడడం మానేయమని చెప్పాను ఈ చికిత్స బాగా పని చేసింది.
కొన్ని వ్యాదులు రాకుండా ముందే వ్యాక్సిన్ వేస్తారు కదా అలానే ఈ వ్యాదికి వ్యాక్సిన్ ఉందా ? అని ఆందోళనగా అడిగింది .
లేకేం. ఉంది . ఏ చానల్ ఏ పార్టీ వారిదో తెలుసుకొని వార్తలు చూస్తే అది జబ్బు నివారణ వ్యాక్సిన్ గా పని చేస్తుంది. అసలే ఎన్నికల కాలం సకాలంలో చికిత్స అందింది కాబట్టి సరిపోయింది లేకపోతే’’ అని యోగేష్ అంటుండగానే వాళ్ల ఆవిడ చేతిలోని రిమోట్ జారి కింద పడింది.
నీతి: వార్తలన్నీ నిజాలు కావు. నిజాలన్నీ వార్తలు కావు. సినిమాలను చూసినట్టుగానే వార్తలను కాలక్షేపం కోసం చూస్తే ఏ జబ్బురాదు.