‘‘ఈ రోజు ఏమిటి?’’
‘‘అది కూడా తెలియదా? పేపర్ చూడవా? ఈరోజు నవంబర్ 19’’
‘‘అంటే ఈ రోజు ప్రత్యేకత ఏమిటి? అని’’
‘‘ఏడవ తరగతి చదివేప్పుడు సరిగ్గా ఈరోజే నేను మా క్లాస్ మెట్ విజయలక్ష్మికి లవ్ లెటర్ రాశాను. కాస్త గంభీరంగా ఉంటుందని గంగాభాగీరథీ సమానురాలైన విజయలక్ష్మికి ప్రేమతో అని రాశాను. ఎక్కడో ఈ పదం విన్నప్పుడు ఇదేదో బాగుందని, ఉపయోగించుకున్నాను.
తెలుగులో ఇన్ని తప్పులు రాస్తావా? నీకు భాష రాదు, భావం తెలియదు అంటూ మా టీచర్ కొట్టిన చోటు కొట్టకుండా కొట్టారు. ఈ లేఖ ఎవరైనా చదివితే నీకు పాఠాలు చెప్పిన గాడిద ఎవడురా! అని నన్ను తిడతారురా! అడ్డగాడిద అంటూ చితక బాదేశారు. ఈ సంగతి మా నాన్న వరకు వెళ్లి, ఆయనో నాలుగు ఇచ్చుకున్నాడు. ఈ సంగతి సత్తిగాడికి తెలిసి తప్పులు లేకుండా ప్రేమ లేఖ రాయలేని వాడితో నీకేం ప్రేమ. తెలుగులో ఎప్పుడూ నేనే క్లాస్‌లో ఫస్ట్ పద మనం ప్రేమించుకుందాం అని విషయమంతా చెప్పి విజయలక్ష్మిని నా నుంచి దూరం చేసి, తాను దగ్గరయ్యాడు’’ అంటూ భారంగా చెప్పుకొచ్చాడు వీరేశం.
ఆ రోజు వాడు నాకు వెన్నుపోటు పొడిచినందుకు కాలమే వాడిని శిక్షించింది... విజయలక్ష్మిని పెళ్లి చేసుకుని గాడిద చాకిరి చేస్తున్నాడు వెదవ. మొన్న దీనంగా ఉన్న వాడిని చూసి చిన్ననాటి మిత్రుడని కూడా చూడకుండా బాగైందిరా నీకు అని అ నకుండా ఉండలేక పోయాను’’ అని వీరేశం చెప్పుకొచ్చాడు.
‘‘చాల్లేరా నీ చచ్చు ప్రేమ. రిటైర్‌మెంట్‌కు దగ్గరకొచ్చాక ఏడవ తరగతిలో ప్రేమ కథ నువ్వు చెప్పడం నేను వినడం’’ అని కామేశం చిరాకుపడ్డాడు.
‘‘ నా కవిత్వం నీకు గోలగా అనిపించొచ్చు నాకు మాత్రం మహదానందంగా ఉంటుంది. ఎవడి కవిత్వం వాడికి నచ్చినట్టే... ఎవడి దురద వాడు గోక్కుంటే సంతోషం కలిగినట్టే, లేత వయసు ప్రేమైనా లేటు వయసు ప్రేమైనా ఎవరి ప్రేమ వాడికి అద్భుతం, ఎవడికి వాడు షాజహానే, ఎవరి ప్రేయసి వారికి ముంతాజే’’ అని వీరేశం కాస్త గట్టిగానే చెప్పాడు.
‘‘సర్లే నీ ప్రేమ దురద సంగతి నాకెందుకు కానీ...ఈరోజు ఏమిటో నిజంగా తెలియదా?’’ అని కామేశం అడిగాడు.
‘‘ తెలుగు పార్టీ వాళ్ల వెబ్‌సైట్‌లో ఈ రోజు ప్రత్యేకత ఏమిటో చూసి చెబుతాను.
‘‘వాళ్లకు ప్రపంచం అంటే వాళ్ల పార్టీ, విశ్వం అంటే వాళ్ల విశ్వవిఖ్యాత నటుని కుటుంబమే. ఈరోజు మామ సినిమా విడుదలైందనో, అల్లుడు ఈరోజే హైదరాబాద్‌ను కనుగొన్నాడనో, ఇంకుడు గుంతలు తవ్వాడ నో ఏదో ఉంటుందని కానీ. నేనడిగింది దాని గురించి కాదు’’ అని కామేశం చెప్పాడు.
‘‘ఆడియెన్స్ పోల్ తీసుకోవచ్చా?’’అని వీరేశం అంటే...
‘‘ఇక్కడ ఆడియన్స్ ఎవరున్నారురా! నువ్వూ నేనే కదా? నేను అడుగుతున్నాను. ‘‘నువ్వు చెప్పు’’ అని కామేశం బదులిచ్చాడు.
ఒక్క నిమిషం ఉండూ అని సెల్‌ఫోన్‌లో ఏదో వెతికి ...‘‘ఆ తెలిసింది ఈ రోజు వరల్డ్ టాయ్‌లెట్ డే ’’అని గట్టిగా అరిచాడు వీరేశం.
‘‘ఈ దినాలు పెట్టేవాళ్లకు అస్సలు బుద్ధి ఉండదేమో! వరల్డ్ టాయ్‌లెట్ డే కూడా ఈరోజునే నిర్ణయించాలా? మగాళ్లంటే మరీ చులకనైపోతోంది’’ అని కామేశం అసంతృప్తి వ్యక్తం చేశాడు.
తెలిసింది.. దేశంలో తొలి మహిళా బ్యాంకు ఈరోజే ప్రారంభించారు. ఐనా మహిళా బ్యాంకు ప్రారంభిస్తే, మగాళ్లను చులకన చేసినట్లు ఎలా అవుతుంది’’ అని వీరేశం సందేహించాడు.
‘‘నీ వల్ల కాదు కానీ నేనే చెబుతాను.. ఈ రోజు పురుషుల దినోత్సవం ’’ అని కామేశం చెప్పుకొచ్చాడు.
ఆ మాట వినగానే వీరేశం ఉలిక్కి పడి.. ఇదిగో దీంతో నాకెలాంటి సంబంధం లేదు. ఈ మాట నువ్వే అన్నావు కానీ నేనలేదు. అసలే ఇంట్లో పరిస్థితి బాగాలేదు. మా ఆవిడకు తెలిస్తే...అంటూ వీరేశం వణికిపోయాడు.
అబ్బా నవంబర్ 19 ప్రపంచ పురుషుల దినోత్సవంరా బాబు ఈరోజును నిర్ణయించింది నువ్వు కాదు నేను కాదు ప్రపంచ వ్యాప్తంగా 60 దేశాల్లో దీన్ని జరుపుకుంటా రు.’’ అని కామేశం చెప్పాడు.
ప్రపంచం సంగతి నాకు తెలియదు కానీ మొన్న ఇందిరాపార్క్ వద్ద భార్యాబాధితుల సంఘం వాళ్లు ధర్నా చేసి నవంబర్ 19న పురుష దినోత్సవం అని గుర్తు చేశారు కదా? అంటే పురుష దినోత్సవం జరుపుకుంటున్నది భార్యా భాధితులే కదా? ఈ దినం పట్ల నేనూ ఆసక్తి చూపిస్తున్నాననే విషయం మా ఆవిడకు తెలిసిందంటే.. నేనూ ఇందిరాపార్క్ వద్ద పర్మనెంట్ శిబిరం వేసుకుని కూర్చోవలసిందే. ఎందుకొచ్చిన దినాలురా బాబూ!’’ అని వీరేశం వాపోయాడు. సర్లే నా గొడవ సంగతి పక్కన పెట్టు.. ఈరోజును పురుషుల దినోత్సవంగా ఎందుకు నిర్ణయించారంటావు? అని వీరేశం ఆసక్తిగా అడిగాడు.
‘‘నాకూ తెలియదురా! కానీ తెలిసి చేశారో తెలియక చేశారో కానీ ఈ నిర్ణయం సరైనదే అనిపిస్తోంది. ఎందుకంటే ఈ రోజే ఝాన్సీ లక్ష్మీబాయ జయంతి. ఇందిరాగాంధీ పుట్టిన రోజు కూడా.’’ అని కామేశం తెలిపాడు.
‘‘తలా తోకా లేకుండా చెబుతున్నావు. ఇందిరాగాంధీ జన్మదినం అంటావు, పురుషుల దినోత్సవం అంటావు. దానికీ దీనికీ, ఏమైనా సంబంధం ఉందా? ’’ అని వీరేశం అడిగాడు.
‘‘లేకేం ఉంది. భారత రాజకీయాల్లో ఏకైక మగాడు ఇందిరాగాంధీ!’’
ఒక చెంపపై కొడితే మరో చెంప చూపమని మహాత్ముడు చెప్పాడు, మరి రెండో చెంపపై కొడితే, ఏం చేయాలి అనే ప్రశ్నకు ఇందిరాగాంధీ మూడో కన్ను తెరిచి పాక్‌ను రెండు ముక్కలు చేయడం ద్వారా 71లో సమాధానం చెప్పారు. పాక్‌కు ఇలా సమాధానం చెప్పిన మరో పురుష ప్రధాని దేశ చరిత్రలో ఉన్నారా? ఇందిరాగాంధీ ప్రధానమంత్రి పదవి చేపట్టిన తొలి మహిళ, భారత రత్న పురస్కారం పొందిన తొలి మహిళ. పురుష దినోత్సవంగా ప్రకటించడానికి ఆమె జన్మదినం కన్నా గొప్ప రోజు ఇంకోటి ఉంటుందంటావా? ఇంత కన్నా గొప్ప పురుష నేత దేశ రాజకీయాల్లో ఇంకొకరు ఉన్నారంటావా?’’ అని కామేశం అడిగిన దానికి వీరేశం తలాడించడం ద్వారా తన ఆమోదం తెలిపాడు.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం