‘‘సారీ రాణి మనం పెళ్లి చేసుకోవడం సాధ్యం కాదు... మా ఇంట్లో వాళ్లు ఒప్పుకోడం లేదు. మన ఇద్దరి కులాలు ఒకటే, ప్రాంతాలు ఒకటే .. మా ఇంట్లో వాళ్లకు నువ్వు నచ్చిన విషయం కూడా నిజమే కానీ మారిన పరిస్థితుల వల్ల కొన్ని సాంకేతిక కారణాలతో ఈ నిర్ణయం తీసుకోవలసి వచ్చింది ..వద్దంటే వద్దంటున్నారు నన్ను మరిచిపో...’’
‘‘రాజా నవ్వు జోక్ చేస్తున్నావా? ’’
‘‘నా ముఖం చూస్తే జోక్ చేస్తున్నట్టు ఉందా? జోక్ చేసినా నవ్వే స్థితిలో నేను లేను.. నువ్వు నన్ను మరిచిపోవలసిందే రాణి. ఒకే దారిలో పయనిస్తున్నా రైలు పట్టాలు ఎప్పుడూ కలువవు.. ఉల్లిగడ్డ రేట్లు ఎప్పుడూ తగ్గవు నువ్వూ నేను ఎప్పుడూ కలవం ఇది నిజం అర్ధం చేసుకో రాణి’’
‘‘అంత మాటనకు రాజా! మనం ఎన్నిసార్లు చూడలేదు. వంద రూపాయలకు కిలో పలికిన టమోటా ఒక్కో సారి రూపాయి ధర కూడా పలకక మదనపల్లి మార్కెట్‌లో రోడ్డుపై రైతులు కుప్పలుగా పారబోయడం చూడలేదా? ఆకాశంలోకి వెళ్లిన రాకెట్ కూడా ఏదో ఒక నాడు కిందికి దిగాల్సిందే... ఉల్లిగడ్డ కూడా అలా ఏదో ఒక రోజు కింద పడిపోతుంది రాజా! ఉల్లిగడ్డ ధర పెరిగిందని మన ప్రేమకు అన్యాయం చేయడం నీకు న్యాయం కాదు రాజా’’
‘‘ఉల్లిధర తగ్గొచ్చు, సమన్యాయం అంటే ఏంటో ఏదో ఒక రోజు బాబు చెప్పొచ్చు.. ఉండవల్లి తక్కువ మాట్లాడవచ్చు. కానీ మన పెళ్లి సాధ్యం కాని విషయం అర్ధం చేసుకో రాణి. దేశంలో ఎన్నడైనా ఏ రైలైనా సమయానికి రావడం నువ్వు చూశావా? ’’
‘‘రాజా నువ్వు కాదంటే నేను బతక లేను.. మనం ఒకటవుతాం .. నాకా నమ్మకం ఉంది. ’’
‘‘ దిల్‌సుఖ్‌నగర్ నుంచి సాయంత్రం కూకట్‌పల్లికి వెళ్లాలనుకోవడం తప్పు కాదు... కానీ అరగంటలో చేరుతాననుకోవడం అజ్ఞానం, చేరాలనుకోవడం అత్యాశే. చేరి తీరుతానని ప్రతిజ్ఞ చేయడం మూర్ఖత్వం. ఇది కూడా అంతే రాణి’’
‘‘రాజా! ఈ లోకంలో ఏదీ శాశ్వతం కాదు. అలానే ఏదీ అసాధ్యం కూడా కాదు. నువ్వు చెప్పింది ఈరోజు సాధ్యం కాకపోవచ్చు కానీ ఏదో ఒక రోజు సాధ్యం అవుతుంది రాజా! హయత్‌నగర్ నుంచి కూకట్‌పల్లికి వెళ్లడం ఇప్పుడు మార్స్ గ్రహాన్ని చేరుకోవడం అంత కష్టం కావచ్చు కానీ ఏనాటికీ సాధ్యం కాదని ఎందుకనుకుంటావు రాజా! ’’
‘‘కలలు కనడం మంచిదే కానీ నువ్వు పగటి కలలు కంటున్నావు రాణి’’
‘‘నావి పగటి కలలు కాదు రాజా! మెట్రో రైలు ముందు మీడియా ఎంత గట్టిగా తుమ్మినా పనులు ఆగలేదు. వచ్చే ఏడాది మెట్రో రైలు పూర్తవుతుంది అప్పుడు దిల్‌సుఖ్‌నగర్ నుంచి అరగంటలో కూకట్‌పల్లికి వెళ్లి చూపిస్తాను అప్పుడు ఒప్పుకుంటావా? రాజా మన పెళ్లికి’’
‘‘చూడు రాణి ఎపి ఎక్స్‌ప్రెస్ పేరు తెలంగాణ ఎక్స్‌ప్రెస్ అని మార్చవచ్చు కానీ మా ఇంట్లో వాళ్లు ఒకసారి నిర్ణయం తీసుకున్నారంటే అంతే దానికి తిరుగుండదు’’
‘‘నాకు అర్ధమైంది రాజా! నువ్వు నా స్నేహితురాలిని ప్రేమిస్తున్నావు కదూ’’
‘‘నిన్ను ఎంతగా ప్రేమించానో నీ స్నేహితురాలిని అంతే గట్టిగా ప్రేమించాను. నిజానికి నీ దగ్గర చెప్పిన ప్రేమ కబుర్లు అన్నీ నీ స్నేహితురాలికి కూడా చెప్పాను. ఒకే ప్రేమ లేఖను పేర్లు మార్చి ఇద్దరికీ ఇచ్చాను. ఇవన్నీ నిజమే కానీ నేను మీ ఇద్దరినీ చేసుకోలేను. ప్రస్తుతానికి మా పెద్దలు బిహార్ సంబధం చూశారు. వాళ్ల మనసు ఎప్పుడు మారుతుందో తెలియదు. నేను వాళ్ల మాట గౌరవించాల్సిందే.
‘‘ఎన్ని సాయంత్రాలు మనం వెన్నెల్లో ఊసు లాడుకున్నాం . నువ్వు లేనిదే నేను లేనని ఎన్ని కబుర్లు చెప్పావు రాజా! నీ కోసం ప్రాణాలిస్తానన్నావు, నా హృదయంలో నీకు ప్రత్యేక హోదా ఉంటుందన్నావు.. ఈ సూర్యచంద్రులే దానికి సాక్షం అన్నావు’’
‘‘ఆ సమయానికి తగ్గట్టు ఏదో చెబితే దానే్న పట్టుకుని పాకులాడితే ఎలా డియర్.. ఎక్కడో దూరంగా ఉన్న సూర్యచంద్రులు కాదు పార్లమెంటు సాక్షిగా పాలకులు ఇచ్చే హామీలకే దిక్కు లేదు. నీకింకో షాకింగ్ న్యూస్ చెప్పనా? ప్రత్యేక హామీ నీ ఒక్కదానికే కాదు నీ ప్రెండ్ రాగిణిక్కుడా సరిగ్గా ఇదే మాట చెప్పాను.. రాత్ గయి బాత్ గయి అనే మాట తెలియదా? ’’
‘‘రాజా ఇప్పటి వరకు బతిమిలాడాను. నువ్వు వినక పోతే మన ప్రేమ కథను ఆధారాలతో సహా బయటపెడతాను.. ఏమనుకుంటున్నావో’’
‘‘నా ఆధారాలు నువ్వు బయటపెడితే నీ ఆధారాలు నేను బయటపెడతాను. గొడవెందుకు కానీ ఇద్దరం రాజీకొద్దాం. నీకు నా హృదయంలో ప్రత్యేక హోదా ఎప్పుడూ ఉంటుంది. బాబు మనసులో ఎన్టీఆర్‌కు, కెసిఆర్ మనసులో చంద్రబాబుకు, తెలుగు హీరోల మనసులో అభిమానులకు ప్రత్యేక హోదా ఉన్నట్టే నా మనసులో నీకు ఎప్పుడూ ప్రత్యేక స్థానం ఉంటుంది.’’
‘‘ప్రత్యేక హోదా అంటే పెళ్లి చేసుకుంటావా రాజా!’’
‘‘మళ్లీ అదే మాట అంత కన్నా ఎక్కువే అంటున్నాను కదా’’
‘‘ఎప్పుడు? ’’
‘‘కెసిఆర్ దళితులందరికీ మూడెకరాల భూమి , బాబు ఇంటికో జాబు ఇవ్వగానే, జగన్ ఓదార్చడం ఆపివేయగానే, విదేశీ బ్యాంకుల్లో దాచిన నల్ల డబ్బును మోదీ ఇంటికి 15లక్షలు పంచగానే, వెంకయ్యనాయుడు ప్రాస రహితంగా మాట్లాడగానే, పాకిస్తాన్ దావుద్‌ను మన దేశానికి అప్పగించగానే,ఆంధ్ర ప్రదేశ్ మత్తయ్యను తెలంగాణకు అప్పగించగానే మాట నిలబెట్టుకుంటా రాణి ’’
‘‘స్పష్టంగా డేట్ చెప్పు రాజా!’’
‘‘2019 వరకు ఆగు చెబుతాను’’
‘‘అంత మాటన్నావు చాలు రాజా!’’
‘‘ఇంతకూ నీ హృదయంలో ప్రత్యేక హోదా కన్నా విలువైన స్పెషల్ అంటున్నావు అది ఏంటి రాజా!’’
‘‘చిదంబరం వెళ్లావా?’’
‘‘వెళ్లలేదు...’’
‘‘అక్కడే దేవుడు ఉంటాడో తెలుసా? చిదంబరంలోని దేవుడ్ని చూస్తే మీ ఇద్దరికీ నేనివ్వబోయే ప్రత్యేక హోదా ఏమిటో అందులోనే కనిపిస్తుంది. ’’
‘‘చిదంబరం ఆలయంలో ఉండేది శూన్యమే అంటారు కదా రాజా?’’
‘‘నేను కాదన్నానా?’’
‘‘అంటే నువ్వు గాఢంగా ప్రేమించిన మా ఇద్దరికీ నువ్విచ్చే స్పెషల్ ???’’
-బుద్దా మురళి (జనాంతికం 30-8-2015)