‘‘మూస కథలతో ఊపిరి ఆగిపోయే దశలో ఉన్న తెలుగు సినిమాకు ఊపిరి పోసిందట కదా ? ఊపిరి సినిమా’’
‘‘రాజకీయ తెరపై కామెడీ, సస్పెన్స్ థ్రిల్లర్, ప్యామిలీ సెంటిమెంట్ కలగలిసిన సినిమాలు వరుసగా కనిపిస్తుంటే.. ఉపిరి దాకా ఎక్కడ ? ’’
‘‘ నాకైతే రాజకీయాలు బోర్ అనిపిస్తున్నాయి. ’’
‘‘అంతరించి పోతున్న కమ్యూనిస్టులకు, బక్కి చిక్కి పోతున్న కాంగ్రెస్‌కు కన్నయ్య అనే కాలేజీ కుర్రాడు దొరికడం సినిమా కథలానే ఉంది.’’
‘‘మాంత్రికుడు రాజకుమారిని ఎత్తుకెళ్లినప్పుడు నిస్సహాయంగా చూస్తూ ఉండిపోయిన రాజుగారికి తోటమాలి ఎన్టీఆర్ దేవుడిలా కనిపించినట్టు ఈ రెండు పార్టీల వారికి దూరమైన సింహాసనాన్ని తీసుకు వచ్చి అప్పగించే తోటమాలిలా కన్నయ్య కనిపిస్తున్నాడా? ’’
‘‘ ముందు నన్ను చెప్పనివ్వు. రాజనాల, ముక్కమాల సినిమా మొదట్లో కనిపించినా చివర్లో కనిపించినా విలన్ అని ఈజీగా గుర్తుపట్టేస్తాం. కానీ ఎప్పుడూ దగ్గుతూ ఉండే గుమ్మడి విలన్ అని చివర్లో కానీ తెలియదు. అందుకే తొందర పడి ఎవరు తోటమాలో, ఎవరు రాజనాలనో ముందే నిర్ణయానికి రావద్దు. ’’
‘‘ అంటే హీరో కాదంటావా? ’’
‘‘ నేనింకా ఏమీ అనలేదు. దసరా బుల్లోడులో కన్నయ్య కోసం వాణిశ్రీ, చంద్రకళ నల్లవాడే అల్లరి పిల్లవాడే అంటూ నల్లనయ్య నా వాడు నా వాడు అని పాడుతారు. ఒకరి కోసం ఒకరు త్యాగం చేసేందుకు సిద్ధపడుతూ కాదు నీ వాడు అంటారు. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో కనిపిస్తాయి చూడు అచ్చం అలాంటి గుట్టల మధ్య త్యాగం పాట పాడుతుంటారు గుర్తుందా? ’’
‘‘అవును ఐతే’’
‘‘నవయువ నేత రాహుల్‌బాబును, వృద్ధ ఎర్రన్నలను చూస్తుంటే ఎందుకో వాణిశ్రీ, చంద్రకళ పాట గుర్తుకొచ్చింది. నాగేశ్వర్‌రావేమో ఇద్దరితో సరసాలాడుతుంటారు. ఎవరికి వారు కృష్ణయ్య నా వాడే అనుకుంటారు. ఇప్పుడు అచ్చం మన కాలేజీ కన్నయ్యలానే. చచ్చీ చెడి కన్నయ్యను కమ్యూనిస్టులు పైకి తీసుకు వచ్చారు. సిపిఐ జాతీయ నాయకులు నారాయణ తన హోదాను కూడా మరిచి కాలేజీ కుర్రాడికి విమానాశ్రయంలో స్వాగతం పలికేందుకు గంటల తరబడి నిరీక్షించారు. కమ్యూనిస్టు నాయకులు వస్తున్నారంటే చంద్రబాబు, వైఎస్‌ఆర్ లాంటి వారు లేచి ఎదురెళ్లి స్వాగతం పలికేవారు. తనను తాను దైవంగా భావించే ఎన్టీఆర్ సైతం ఎంతో గౌరవించేవారు. అలాంటి కమ్యూనిస్టులు కన్నయ్యను భుజానికి ఎత్తుకుని తమకు పునర్జన్మ ప్రసాదించేందుకు వచ్చిన దేవదూతలా చూస్తున్నారు. సభలు ఏర్పాటు చేస్తున్నారు. సత్కారాలు చేస్తున్నారు. శ్రీకృష్ణుడు నా మిత్రుడు అని కుచేలుడు గర్వంగా చెప్పుకున్నట్టు కన్నయ్య మా నాయకుడు అంటున్నారు. ఎన్నికలకు ఉపయోగపడే చిన్ని కన్నయ్య అని మురిసిపోతున్నారు. కన్నయ్యనేమో ఇంట్లో ఇల్లాలు వంటింట్లో ప్రియురాలు సినిమాలో వెంకటేశ్ సౌందర్యకు తెలియకుండా నేపాలీ అమ్మాయిని ప్రేమించినట్టు, కమ్యూనిస్టులను, కాంగ్రెస్ నాయకులను కన్నయ్య ఒకేసారి కలుస్తున్నారు. కష్టపడి కమ్యూనిస్టులు సభ ఏర్పాటు చేస్తే వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్‌దే గెలుపు అని కన్నయ్య చెబుతున్నాడు. ’’
‘‘ నిజమే ఎందుకలా అంటావు?’’
‘‘ చూడోయ్ కన్నయ్య చదువుకునేది ఎంత ఆఫ్రికన్ స్టడీ అయినా అతనికీ సైన్స్ తెలుసు. లెక్కలు వస్తాయి కదా? రాజకీయ జీవితం కోరుకునే వాడు భవిష్యత్తు ఉన్న పార్టీ వైపు చూస్తాడు కానీ ఊపిరి ఆగిపోయే పార్టీని నమ్ముకుంటాడా? కోమాలో ఉన్న పార్టీల కన్నా పదేళ్లపాటు తిండి ఎక్కువై, రెండేళ్ల నుంచి తిండి లేక నీరసించిన కాంగ్రెస్ బెటర్ అనే లెక్క తెలియనంత అమాయకుడేం కాదు. అందుకే రాహుల్‌బాబుతో టచ్‌లో ఉన్నారు.’’
‘‘ మంచిదే కదా ? ’’
‘‘ తలకు బలమైన గాయం తగలగానే అప్పటి వరకు జరిగిన విషయాలన్ని మరిచిపోవడం, మరోసారి దెబ్బతగలగానే గుర్తుకు వచ్చే సీన్లు గుర్తున్నాయా? అలానే మన కమ్యూనిస్టులకు తప్పులు చేయడం సరిగ్గా మూడు దశాబ్దాల తరువాత అవి తప్పులు అని గుర్తుకు రావడం గుర్తొచ్చింది అంతే. ఇప్పటి తప్పులను వాళ్లు మూడు దశాబ్దాల తరువాత ఒప్పుకుంటారేమోనని. 95 నాటి వెన్నుపోటుకు చేయూత నివ్వడం చారిత్రక తప్పిదం అని ప్రకటించేందుకే ఇంకా తొమ్మిదేళ్ల గడువు ఉంది.’’
‘‘ఇంతకూ కన్నయ్య కథ సూపర్ హిట్టా కాదా? కన్నయ్య హీరోనా కాదా? ఏదీ తేల్చవు’’
‘‘ కొన్ని విషయాలు కాలం తేల్చేంత వరకు వేచి చూడాలి. ‘వైదిస్ కొలవెరి కొలవెరి డీ’ పాట వినిపించిన కొత్తలో భారతీయ ప్రపంచం ఊగిపోయింది. వీళ్ల ఊపు చూసి బయ్యర్లు కోట్లు గుమ్మరించారు. తీరా సినిమా వచ్చాక రోడ్డున పడ్డారు. పాట మరుగున పడింది. బయ్యర్లు ఇల్లు వాకిలి అమ్ముకున్నారు.
అన్నా హజారే అవినీతిపై ఉద్యమించినప్పుడు బాబు అన్నా కన్న పెద్ద జాతీయ జెండా భుజాన తగిలించుకుని పాదయాత్ర చేశారు. చివరకు హాజారే సైతం పార్లమెంటు కన్నా తానే ఉన్నతున్ని అనుకున్నారు. తాను ఎంపిక చేసిన పౌర సమాజం సభ్యులు పార్లమెంటు కన్నా ఉన్నతం అని ప్రకటించారు. ఆయన్ని బిజెపి వదిలేసింది ప్రజలు మరిచిపోయారు. నెల తరువాత సికిందరాబాద్‌లో భారీ బహిరంగ సభ పెడితే 50 మంది మీడియా బృందాన్ని కలిపితే మొత్తం 300 మంది వచ్చారు. ’’
‘‘దసరా బుల్లోడు సూపర్ హిట్ సినిమా. కన్నయ్య సూపర్ హిట్ అని ఒప్పుకున్నట్టే కదా? ’’
‘‘ బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్‌కు ఢిల్లీ నుంచి విపి సింగ్ వంటి హేమీ హేమీలెందరో వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మేనక పాత్రధారి మీనాక్షి శేషాద్రి వీపుమీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. ఈ సినిమాతో మా పని ఐపోయిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు సైతం బెంబేలెత్తిపోయారు. కానీ సినిమా ఊహించని స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ స్వయంగా ఓడిపోయారు. కన్నయ్య సినిమా కథ దసరా బుల్లోడును పోలి ఉన్నా బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా ఫలితం గుర్తుకు వస్తోంది. ’’
బుద్దా మురళి (జనాంతికం 27. 3. 2016)

well said hats off
రిప్లయితొలగించండి"బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమా షూటింగ్‌కు ఢిల్లీ నుంచి విపి సింగ్ వంటి హేమీ హేమీలెందరో వచ్చారు. ముఖ్యమంత్రిగా ఎన్టీఆర్ మేనక పాత్రధారి మీనాక్షి శేషాద్రి వీపుమీద ఫైళ్లు పెట్టి సంతకం చేశారు. ఈ సినిమాతో మా పని ఐపోయిందని ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు సైతం బెంబేలెత్తిపోయారు. కానీ సినిమా ఊహించని స్థాయిలో అట్టర్ ఫ్లాప్ అయింది. ఎన్టీఆర్ స్వయంగా ఓడిపోయారు"
రిప్లయితొలగించండిఎన్టీఆర్ 1989 ఎన్నికలలో మట్టి కరిచారు & బ్రహ్మర్షి విశ్వామిత్ర అట్టర్ ఫ్లాప్ అయింది, రెండూ కరెక్టే. అయితే సినిమా ఎన్నికల ముందు విడుదల కాలేదు. ఎన్టీఆర్ ముఖ్యమంత్రి పదవిని తదునబంధ బాధ్యతలను గాలికి వదిలేసి అట్టహాసంగా మొదలెట్టిన సినిమా ఆయన గారి పదవి ఊడ్చుకుపోయిన ఎన్నో నెలలకు గానీ రిలీజ్ కాలేదు.
సినిమా విడుదల కాలేదు కానీ ఎన్నికల ప్రచారం కోసం అప్పటి వరకు షూటింగ్ పూర్తి అయిన సినిమా ముక్కలు జిల్లాలకు పంపించారు 89 ఎన్నికల ప్రచారం లో ఆ సినిమా దృశ్యాలు ఎన్నికల ప్రచారం లో సంగారెడ్డి లో చూశాను
రిప్లయితొలగించండిOK. What a megalomaniac!
తొలగించండి