‘బ్రేకింగ్ న్యూస్.. నీకే ముందు చెబుతున్నా.. మా ఊరి పంచాయితీ వార్డ్ మెంబర్ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ విజయాన్ని గుర్తిస్తున్నట్టు ఇప్పుడే ప్రకటించాడు. పద్ధతులు మార్చుకుని అందరితో కలిసి పని చేయాలని, అమెరికా అభివృద్ధికి కృషి చేయాలని సూచించాడు’
‘‘ఏడ్చినట్టే ఉంది నీ బ్రేకింగ్ న్యూస్. పంచాయితీ వార్డు మెంబర్ ట్రంప్ గెలుపును గుర్తిస్తే ఎంత ? గుర్తించక పోతే ఎంత?’’
‘‘ఇదే మాట సిఎం అంటే మొదటి పేజీలో రాశారు. మరి ఆయన గుర్తిస్తే ఎంత? గుర్తించక పోతే ఎంత? సిఎం రాష్ట్రానికా? ప్రపంచానికా? ఇదే మాట నేనడిగితే పెద్దవాళ్ల మాటలు నీకెందుకు అంటావు?’’
‘‘ట్రంప్ ఇలా గెలిచేశాడేంటో? మనం ముందుగానే అనుకున్నట్టే మీడియా ప్రభావం తెలుగునాటనే కాదు అమెరికాలోనూ చాలానే ఉందిరా! మీడియా మొత్తం వ్యతిరేకిస్తే ప్రజలు సరిగ్గా దానికి భిన్నంగా తీర్పు చెబుతున్నారు.’’
‘‘ఏం జరిగినా మనం ఊహించినట్టే జరిగిందని చెప్పడం మామూలే కానీ, మోదీ పెద్దనోట్ల రద్దు నిర్ణయం , ట్రంప్ విజయం చూస్తే నీకేమనిపిస్తోంది?’’
‘‘నా అభిప్రాయం కన్నా ప్రముఖ జ్యోతిష్యులను, పండితులను అడిగితే బాగుండేది. జయలలిత మంచాన పడ్డా, కెసిఆర్ తుమ్మినా, చంద్రబాబు మనవడి బారసాల అయినా, చివరకు సోవియట్ రష్యా విచ్ఛిన్నం, జపాన్‌లో భూకంపం.. ప్రపంచంలో ఎక్కడేం జరిగినా- ఇలా జరుగుతుందని మేం ముందే చెప్పాం.. అని చాలా మంది జ్యోతిష్య పండితులు చెప్పుకుంటారు. అలానే తూర్పున సూర్యుడు ఉదయించి పశ్చిమాన అస్తమిస్తున్నందుకు, ఏడాదిలో 365 రోజులు ఉన్నందుకు, ఆదివారం ఎప్పుడూ ‘సండే’ నాడే వస్తున్నందుకు, శుక్రవారం నాడే ‘గుడ్ ఫ్రైడే’ వస్తున్నందుకు, ఆ నక్షత్రం అక్కడ, ఈ నక్షత్రం ఇక్కడ ఉన్నందుకు హిల్లరీ గెలుపు ఖాయం అని జ్యోతిష్యం చెప్పారు. తీరా ఇప్పుడు పండితుల జోస్యం, మీడియా జోస్యం తలకిందులై అమెరికా ఓటర్ల జోస్యం ఫలించి ట్రంప్ గెలిచాడు. తప్పిన జోస్యాల మాట ఎత్తకుండా, ఫలించిన జోస్యాల గురించి చెప్పుకుంటూ తమ మాటలకు తిరుగులేదని ప్రచారం చేసుకునే వారికి గడ్డు కాలమే. గ్రహిస్థితిని బట్టి చూస్తే ఫేస్‌బుక్ లాంటి సామాజిక మాధ్యమాలు జ్యోతిష్యుల పాలిట గండంగా మారాయని స్పష్టంగా తెలుస్తోంది. వాళ్లేం చెప్పారు, ఏం జరిగింది అని వీళ్లు అన్నీ తెరపైకి తీసుకు వస్తున్నారు.’’
‘‘ఇంతకూ వీటిపై నీకేమనిపిస్తోందో చెప్పు?’’
‘
‘నాకైతే జంబలకిడి పంబ సినిమాలో అడవారు మందుకొట్టి పేకాడుతుంటే మగాళ్లు మంగళసూత్రం ధరించి చీరకట్టి ముగ్గులు వేయడం, వింతంతుడి వింత వేషం గుర్తుందా? ’’
‘‘ దానికి, దీనికి సంబంధం ఏమిటి?’’
‘‘లోకధర్మానికి విరుద్ధంగా జరిగేదే- జంబలకిడి పంబ. ఎటిఎంలో మనం వందో,రెండు వందలో డ్రా చేసుకోవాలంటే- మనల్ని ఎవరైనా చూస్తున్నారా? అని సిగ్గుపడే వాళ్లం. జేబులో ఐదు వందలో వెయ్యో ఉంటే గర్వంగా ఫీలయ్యే వాళ్లం. ఒక్క దెబ్బతో సీన్ రివర్స్ అయింది. వెయ్యి నోటు పనికి రాదు, చేతిలో వంద నోటు లేదు. దీంతో హోటల్‌లో టిఫిన్ కూడా చేయలేక ఆకలితో గడిచిపోవడం .. డబ్బు లేనోడు రామ్‌రాజ్ లుంగీతో హీరోలా డ్యాన్స్ చేస్తుంటే, డబ్బున్నోడు ఎలా డిపాజిట్ చేయాలో తెలియక బిపి పెరిగి మంచాన పడుతుంటే లైవ్‌లో జంబలకిడి పంబ చూస్తున్నట్టుగా ఉంది. రెండు గంటల సినిమా కన్నా రోజుల తరబడి నడిచే ఈ లైవ్ సినిమా బాగుంది. హిల్లరీ తప్పక గెలుస్తుందని అమెరికా మీడియాను మించిపోయి- తెలుగు మీడియా హడావుడి చేస్తే తీరా ట్రంప్ సూపర్ మ్యాన్‌లా ఆకాశమంత ఎత్తులో కనిపిస్తుంటే మీడియా బిక్క చచ్చిపోవడం చూస్తుంటే అంతా రివర్స్‌లో అవుతోందని ఆ సినిమా గుర్తుకొచ్చింది.’’
‘‘ హిల్లరీ ఎందుకు ఓడిపోయిందంటావ్?’’
‘‘ ఇక్కడున్న మనకు మీడియా వార్తలే ఆధారం. బహుశా మనలానే ఆమె కూడా మీడియా మేనేజ్‌మెంట్‌పైనే ఎక్కువ దృష్టి పెట్టినట్టు ఉంది? ట్రంప్ మీడియాను పట్టించుకోకుండా అమెరికా ప్రజలను నమ్ముకుని గెలిచేశాడు.’’
‘‘ఇప్పుడు ట్రంప్ మీడియా సంగతి చూస్తాడా? ’’
‘‘అమెరికా- ప్రపంచానికి పెద్దన్న, అలాంటి దేశానికి ఎన్నికైన వాడు ఇలాంటివి అస్సలు పట్టించుకోడు. నా ప్రెస్ కాన్ఫరెన్స్‌కు రావద్దు, నీ సంగతి తేలుస్తా.. అంటూ సిల్లీగా మన నేతల్లా ఆలోచించే పదవి కాదు అమెరికా అధ్యక్షుడు అంటే. ’’
‘‘మన వాళ్లను ట్రంప్ అమెరికా నుంచి తిరిగి పంపించేస్తాడేమో! ఐనా మనం లేకపోతే అమెరికా కుప్పకూలిపోతుంది? ఆ సాహసం చేస్తాడా? ’’
‘‘ నా కోడి కూయకపోతే తెల్లవారదని అనుకుందట వెనకటికి నీలాంటి ముసలవ్వ. మనవాళ్లేదో అమెరికాను ఆదుకోవడానికి అక్కడికి వెళ్లలేదు. ఇక్కడి కన్నా అక్కడ బతుకు తెరువు బాగుంటుందని డాలర్ల సంపాదనకు వెళతారు. రైల్వే స్టేషన్‌లో ఒక కూలీ కాక పోతే ఇంకో కూలీని మాట్లాడుకుంటాం.. ఇదే అంతే. అంత ఉన్నత స్థాయిలో ఉన్న వాళ్లు ఉన్నత స్థాయిలోనే ఆలోచిస్తారు. వాళ్ల సమస్యల పరిష్కారం వాళ్లకు ముఖ్యం కానీ, మన కూలీలను ఉంచాలా? పంపించాలా? అని కాదు.’’
‘‘జేబులో ఏమైనా ఉందా? టిఫిన్ చేసొద్దాం’’
‘‘జేబులో ఏం లేకపోయినా పలుకుబడి ఉంది. మన వీధి టిఫిన్ సెంటర్‌లో అరువు ఉంటుంది లే! వాడి వద్ద ప్లాస్టిక్ కార్డుల సౌకర్యం లేకపోయినా మనిషిని నమ్మే బుద్ధి ఉంది. ఎంత పెద్ద తుఫాన్ వచ్చినా పెద్ద చెట్లు కూలిపోతాయేమో కానీ చిన్న మొక్కలు తాత్కాలికంగా తల వంచి అలానే నిలుస్తాయి. ‘హెరిటేజ్’ అమ్ముడు పోయింది కానీ ఇంటింటికి తిరిగి పాలు పోసే వాడు, కూరగాయలు అమ్మేవాడు అక్కడే ఉన్నారు. ఫరవాలేదు సార్ డబ్బులు వచ్చాక ఇవ్వండి అని మనం అడగక ముందే కిరాణా షాపు వాడు భరోసా ఇస్తే, వాడి నమ్మకం చూసి జేబులోని వెయ్యి నోటుతో చెంప మీద కొట్టినట్టు అనిపించింది. జీవితంలో అప్పుడప్పుడు ఇలా బలమైన దెబ్బలు తగిలితేనే మనం నేలపై ఉంటాం. జంబలకిడి పంబ కూడా ఒకందుకు మంచిదే.’’
‘
‘రాష్టప్రతి పాలన, రాష్ట్ర విభజన, పెద్దనోట్ల రద్దు ఇవన్నీ చూసిన తరం మాదేనని పిల్లలకు రేపు కథలు కథలుగా చెప్పుకోగలిగిన తరం మనదే అవుతుంది. ఇదీ మంచిదే.. ’’ *