‘‘నీ వెనక కోట్ల రూపాయల ఆస్తి, సారా వ్యాపారం, వడ్డీ వ్యాపారం లేక బాగా ఆదాయం తెచ్చి పెట్టే ఎన్‌జివో ఏమన్నా ఉందా? మరేముందని పోజులు కొడుతున్నావ్’’
‘‘నా వెనుక అణగారిన జనం ఉన్నారు. నా మెదడులో విప్లవ భావాలు ఉన్నాయి? మా ఇంట్లో గుట్టలు గుట్టలుగా ఎర్ర పుస్తకాలున్నాయి?’’
‘‘ఓ జెండా ఉంది, దాన్ని మోసేందుకు ఓ కర్ర ఉంది. అది కూడా చెప్పు’’
‘‘ఔను! నేను ఎస్‌ఎస్‌సి చదివేప్పుడు మా సీనియర్ ఇచ్చిన కర్ర ఇప్పటికీ కాపాడుకున్నా. జెండా మాత్రం చీకిపోవడం వల్ల నాలుగైదు సార్లు మార్చాను.’’
‘‘నీకు కర్ర అప్పగించిన ఆ సీనియర్ ఆ మెడికల్ కాలేజీ ఓనరా? వడ్డీ వ్యాపారా? ఉమ్మడి రాజధాని జూబ్లీహిల్స్‌లో ప్లాట్లు, భవనాలు, సాంస్కృతిక రాజధానిలో వ్యాపారాలు చేసే సీనియరా? ఆయన చేతి నుంచి కర్ర అందుకోవడం ఎంతైనా నీ అదృష్టం.’’
‘‘నీకెలా తెలుసు?’’
‘‘ తెలిసిన వాళ్లు సీటు కోసం ప్రయత్నిస్తే ఒక్కో సీటు కోటిన్నర ఖరీదు అని తెలిసింది.’’

‘‘చివరకు సొంత కొడుక్కు కూడా ఆ కర్ర ఇవ్వకుండా నన్ను నమ్మి నాకే ఇచ్చాడు.. నాకు ఇంకేం కావాలి? ’’
‘‘ఔను.. కర్ర నీకిచ్చి మెడికల్ కాలేజీ కొడుక్కు ఇచ్చిన ఆయన త్యాగాన్ని- శరీరాన్ని ఒలిచి దానం చేసిన శిబి చక్రవర్తితో కూడా పోల్చలేం.’’
‘‘నీ మాటల్లో ఏదో వెటకారం ఉంది? విప్లవ భావాలు, విప్లవ త్యాగాలు అర్థం కావాలంటే నెల జీతంపై బతికే నీలాంటి వాడి వల్ల కాదు. జీతాలు, ఇంక్రిమెంట్లే మీలాంటి కుటుంబరావులకు అర్థమవుతాయి. ఎప్పటికైనా విప్లవ శక్తులదే విజయం.. మీలాంటి విప్లవ ప్రతిఘాతక శక్తుల గురించి మావో ఎప్పుడో చెప్పాడు’’
‘‘నేనెప్పుడూ సికిందరాబాద్ దాటి వెళ్లలేదు. నా గురించి కూడా మీ మామ చెప్పాడా? ఏం చెప్పాడురా? ’’
‘‘మరదే.. మామ కాదు మావో’’
‘‘అంత ఆప్యాయంగా పలికితే మీ మేనమామ అనుకున్నా. నా గురించి మావోకు కూడా తెలియడం చిత్రంగా ఉందిరా! ’’
‘‘వెటకారం అర్థం అవుతోంది. మేమూ అనగలం. ఆ ముఖ్యమంత్రి ఫాం హౌస్ గురించి చెప్పమంటావా? ’’

‘‘అక్కడ ఎకరా ఐదు లక్షలట! అంటే మొత్తం ఫాం హౌజ్‌లోని 60 ఎకరాలు అమ్ముకుంటే మీ ఎర్ర గురువు మెడికల్ కాలేజీలో రెండు సీట్లు రావు.’’
‘‘మేధావులు సిద్ధాంతాల గురించి మాట్లాడతారు. వ్యక్తిగత విషయాలు వద్దు. గతి తార్కిక భౌతిక వాదం... మానవ జాతి.. విప్లవాలు.... ’’
‘‘ఆగాగు.. నేను సామాన్యున్ని ఏదో గవర్నమెంట్ స్కూల్‌లో వానా కాలం చదువులు. చూసి చదవడం కూడా రాని పేర్లు చెప్పి భయపెడితే ఎలా? పూర్వం పండితులు ఇలానే సంస్కృత శ్లోకాలు చెప్పి సామాన్యులను భయపెట్టేవాళ్లు. సంస్కృతాన్ని వ్యతిరేకించినా మీ విప్లవ వీరులు నాలాంటి సామాన్యులను భయపెట్టడానికి, భ్రమల్లో ఉంచేందుకు అదే టెక్నిక్ వాడుకుంటున్నారు. అచ్చం సంస్కృతంలో నోరుతిరగని పేర్లు చెప్పి భయపెట్టినట్టే నువ్వు నాకు నేను వినని ప్రపంచంలోని దేశాల పేర్లు నాయకుల పేర్లు చెప్పి భయపెడితే ఎలా? సింపుల్‌గా చెప్పు ? ’’
‘‘వా..! నన్నిలా ఇబ్బంది పెట్టడం న్యాయమా? స్కూల్‌లో చదువుకున్నప్పటి నంచి నాకు మా సీనియర్లు ఇలానే చెప్పేవాళ్లు. వాటినే వల్లెవేయడం అలవాటైంది. నువ్వేమో ఆ పేర్లు, సిద్ధాంతాలు లేకుండా మాట్లాడమంటున్నావ్.. నేనేం మాట్లాడాలి.?’’

‘‘నాకు అర్థం అయ్యేంత సింపుల్‌గా చెప్పు ’’
‘‘ ప్రపంచంలో ఇలా ఎందుకు ఉంది? అని ముందు మనను మనం ప్రశ్నించుకోవాలి. కొందరు పేదలుగా, కొందరు సంపన్నులుగా ఎందుకు ఉన్నారో బాగా ఆలోచించాలి. దోపిడీ వల్లనే ఆర్థిక అసమానతలు ఏర్పడ్డాయి. ఇది అర్థం చేసుకున్న తరువాత విప్లవం వస్తుంది. విప్లవం వచ్చిన తరువాత అందరూ సమానం అవుతారు?’’
‘‘ అంటే అప్పుడు స్కూల్‌కెళ్లే పిల్లలు వేసుకునే యూనిఫామ్‌లా అంతా ఒకేలా కనిపిస్తారా?’’
‘‘ఆ వెటకారమే వద్దు .. అంతా సమానం అవుతారంటే ఒకే యూనిఫాం వేసుకుంటారని కాదు. ఆర్థిక అసమానతల గురించి అర్థం అయ్యాక విప్లవం వస్తుంది. అప్పుడు అంతా సమానం అవుతారు?’’
‘‘ఇంతేనా.. నాకు తెలుసులే ఆర్.నారాయణ మూర్తి సినిమాలా విప్లవం వచ్చాక అంతా పాట పాడి వెళ్లి పోతారు అంతే కదా? ’’
‘‘అది కాదు శ్రమ దోపిడీ గురించి ఆర్థం చేసుకున్నాక విప్లవం వచ్చి అంతాసమానం అవుతారు’’
‘‘నువ్వు అర్థం చేసుకున్నావా? ’’
‘‘ఇంట్లో గుట్టల కొద్దీ పుస్తకాలు ఉన్నాయని ఇప్పుడే చెప్పాను కదా? ’’
‘‘పుస్తకాలను నమిలి మింగేసి జీర్ణం చేసుకున్న నీకు ఎప్పుడైనా అనుమానం వచ్చిందా? నాయకులకు కోట్ల రూపాయల ఆస్తులు, నాకేమో జెండా కర్ర ఎందుకిలా? అనే ప్రశ్న వేసుకున్నావా? ’’
‘‘ఇదే పుస్తకంలో ఉంది?’’
‘‘ఇది పుస్తకాల్లో ఉండదు. జీవితంలో ఉంటుంది. నీ ఏడుపు నువ్వే ఏడవాలి. నీ తిండి నువ్వే తినాలి. నీ తిండి గింజలు నువ్వే సంపాదించుకోవాలి. ప్రపంచంలోని ఆర్థిక అసమానతల గురించి ఆలోచించే దానిలో ఒక్క నిమిషం నీ ఆర్థిక కోణం గురించి నువ్వు ఆలోచించుకుంటే నువ్వు బాగుపడేవాడివేమో? విప్లవాల సినిమాకైనా ఎవడో ఒకడు పెట్టుబడి పెట్టాలి. విప్లవాల సినిమా కూడా వ్యాపారమే. తీసేవాడు పెట్టుబడి దారు, చూసేవాడు వినియోగ దారుడు. సినిమాలో కూర్చున్న రెండు గంటలు విప్లవం వచ్చేసినట్టే ఉంటుంది. బయటకు వెళ్లాక వాస్తవ జీవితం వేరుగా ఉంటుంది. రెండు గంటల సినిమా వాస్తవం అనే భ్రమలో ఉంటే పరవాలేదు. జీవితమంతా భ్రమలో ఉంటే విప్లవం రాదు, జీవితం పనికి రాకుండా పోతుంది. విప్లవాన్ని, నాస్తిక వాదాన్ని ఊరురా బోధించిన ఎంతో మంది చివరి రోజుల్లో మహాభక్తులయ్యారు. రుద్రాక్షలు ధరిస్తే ఆదృష్టం వరిస్తుందని ఒకాయన ఆథ్యాత్మిక చానల్‌లో అమ్ముతుంటారు. ఒకప్పుడు ఆయన ఏలూరులో పేరు మోసిన నాస్తికుడు. విప్లవ పాఠాలు చెప్పినంత స్పీడ్‌గా రుద్రాక్షలూ అమ్ముతున్నారు. కాళ్లకు వేసుకొనే చెప్పుల వ్యాపారం నుంచి మెదడు ను ప్రభావితం మీడియా వ్యాపారం వరకు టాప్‌లో ఉన్న వారంతా ఒకప్పటి విప్లవ కారులే. నాస్తిక బ్రహ్మలే . భ్రమల్లోంచి ఎంత త్వరగా వాస్తవిక జీవితంలోకి వస్తామనే దానిపైనే జీవితం ఆధారపడుతుంది. వాస్తవంలో జీవించు, నిన్ను నువ్వు తెలుసుకో, వాస్తవిక వాదానికి మించిన సిద్ధాంతం లేదు, విప్లవం లేదు. ’’
*బుద్ధా మురళి (జనాంతికం 24. 2. 2017)