టీవీలో జబర్దస్త్ చూస్తున్నావా?’’
‘‘ ఇవాళ పంచమి.. అలాంటివి చూస్తామా? ’’
‘‘బడ్జెట్ వార్తలు వింటున్నట్టున్నా వా! జన్‌ధన్ ఖాతాల్లో వేస్తానన్న 15 లక్షల గురించి ఏమైనా చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘ఇంతకీ జన్‌ధన్ ఖాతాల్లో ఎంత వేస్తారట!’’
‘‘లేదు’’
‘‘పెద్దనోట్ల రద్దుతో ఎంత నల్లధనం బయటపడిందో చెప్పాడా? ’’
‘‘లేదు’’
‘‘మరేం వింటున్నావ్ ?’’
‘‘ జైట్లీ మాటకోసారి చక్కని హిందీ కవిత చదువుతున్నాడు. వాటి కోసమే వింటున్నా. కవితా పఠనం అయిపోయేంత వరకు ఏమైనా పనుంటే చూసుకోని మళ్లీ రా!’ ’
***
‘‘ఏరా.. అంత తీక్షణంగా నన్ను పైకి, కిందికి చూస్తున్నావ్? జుట్టుకు రంగేశా.. హీరోలా ఉన్నా కదూ? మా పక్కింటావిడ నవ్వుతూ ఎప్పుడూ లేనట్టు చూసింది.’’
‘‘ఆ జుట్టు తీసేసి విగ్గు పెట్టుకుంటే అచ్చం 60 ఏళ్ల వయసులో ఉన్న తెలుగు సినిమా హీరోలా కనిపిస్తావ్! పోయే వయసులో ఈ వేషాలేంటి? అని మీ పక్కింటావిడ నవ్వుకుందేమో! నేను తీక్షణంగా చూస్తున్నది నిన్ను కాదు? పైనున్న సూర్యుడిని, కిందున్న భూమిని’’
‘‘ఎందుకు?’’
‘‘సూర్యుడిని భూమిపైకి తీసుకు రావాలనుకుంటున్నా? ఎలా ఉంది ఆలోచన?’’
‘‘నీకేమైనా పిచ్చా..? సూర్యుడ్ని భూమిపైకి తీసుకు రావడం ఏంటిరా! 107 రూట్ బస్సును వారాసిగూడకు తీసుకు వస్తానని అన్నంత ఈజీగా చెప్పేస్తున్నావ్’’
‘‘అలా ఆశ్చర్యపోకు.. మేధావులను అంతా ముందు పిచ్చివాళ్లనే అనుకుంటారు’’
‘‘నిజమే.. ప్రతి పిచ్చివాడు మేధావి కాదు. మేధావులందరూ పిచ్చి వాళ్లు కాదు’’
‘‘రైట్ సోదరులు ఆకాశంలో ప్రయాణించే విమానాన్ని తయారు చేస్తున్నామని అన్నప్పుడు ప్రపంచం ఇలానే పిచ్చి వాళ్లను చూసినట్టు చూసింది. నా ఆలోచన నీకు అర్థం కావాలంటే చాలా కాలం పడుతుంది.’’
‘‘ఎంత కాలం పడుతుంది? ’’
‘‘పరిశోధనకా?’’
‘‘కాదు.. నువ్వు పిచ్చాసుపత్రికి వెళ్లడానికి. సూర్యుడ్ని భూమిపైకి తేవడం ఏంటి? అక్కడికెళ్లే చానే్స లేదు.. వెళితే భస్మవౌతారు’’
‘‘అచ్చం ఇలానే గాలిలో నిలబడలేం, కింద పడిపోతారని కొం దరు రైట్ సోదరులకు చెప్పారు’’
‘‘ సూర్యుడ్ని భూమిపైకి దించడం ఎందుకు?’’
‘‘విద్యుత్ ఖర్చు ఎంతవుతుందో నీకేమన్నా తెలుసా? ఇంట్లో చేదబావి ఉంటే కావలసినన్న నీళ్లు కావలసినప్పుడు తోడుకోవచ్చు. సూర్యుడు భూమిపై ఉంటే అంతే.. కావలసినంత వెలుగు, విద్యుత్, వేడి కావలసినప్పుడు వాడుకోవచ్చు. ఒక్క వ్యవసాయానికే కాదు.. అన్నింటికీ విద్యుత్ ఫ్రీ.. ఫ్రీ... ’’
‘‘నీ ఆలోచన సరికాదేమో? సొలార్ పవర్ గురించి ఆలోచించినా ఫర్వాలేదు, కానీ సూర్యుడ్నే...’’
‘‘చూడోయ్ అబ్దుల్ కలాం ఏమన్నారు? థింక్ బిగ్ అని చెప్పారు. సొలార్ పలకలు చిన్న ఆలోచన.. సూర్యుడ్నే కొట్టుకు రావడం బిగ్ థింకింగ్’’
‘‘పెద్దగా ఆలోచించమన్నారు. కానీ పిచ్చిగా ఆలోచించమని అనలేదు’’
‘‘కుంతీదేవి రమ్మంటే వచ్చినప్పుడు మనం ప్రయత్నిస్తే సూర్యుడు కిందికి రాడా? హనుమంతుడు సూర్యుడ్ని మింగబోయాడు. మనం అతిథిలా ఆహ్వానిస్తున్నాం. ’’
‘‘అవన్నీ పురాణాలు..’’
‘‘పుష్పక విమానం , అణ్వయుధం ఇవన్నీ ముందు పురాణాల్లోనే పుట్టాయి. వాణిశ్రీ వయసులో ఉన్నప్పుడు కృష్ణం రాజు ఆకాశం దించాలా? నెలవంకా తుంచాలా?- అంటే ఎంత సిగ్గుపడిందో గుర్తుందా? ’’
‘‘అది సినిమా..’’
‘‘సృష్టికి ప్రతిసృష్టి చేసిన విశ్వామిత్రుడు నరుడే- అని సినీకవి చెప్పాడు కదా? విశ్వామిత్రుడి ప్రతిసృష్టిలో సూర్యుడు కూడా ఉండే ఉంటాడు కదా?’’
‘‘నీతో వాదించలేను. సూర్యుడితో పెట్టుకోకు.. బహుశా ఆయన కుమారులు శని నీ నెత్తిన కూర్చోని, తన సోదరుడు యముడి వద్దకు నిన్ను పంపాలని అనుకుంటున్నాడేమో.. అందుకే నీకీ ఆలోచనలు’’
‘‘చరిత్ర సృష్టిస్తే నమ్మారు. పురాణాలు సృష్టిస్తే ఆదరించారు. మనం ఈ రెండింటినీ కలిపి పురాణాల చరిత్ర సృష్టిస్తాం’’
‘‘ఆ.. ఇప్పుడర్థమైంది ఆయన దావోస్‌ను అమరావతికి తీసుకు వస్తాను అన్నప్పటి నుంచి నీకిలాంటి ఆలోచలు వస్తున్నాయి కదూ?.’’
‘‘మేధావులంతా ఒకే రకంగా ఆలోచిస్తారనేది నిజమే కానీ ఈ ఆలోచన నా సొంతం. ఇతర రాష్ట్రాల వాళ్లు పోటి పడక ముందే దావోస్‌ను అమరావతికి తీసుకురావడం ఖాయం. పాపం ‘బాబు’గారే స్వయంగా వెళ్లి అమరావతికి దావోస్‌ను మోసుకు రావాలి.. కెసిఆర్ కైతే కనీసం పంపించడానికి కెటిఆర్ ఉన్నాడు.’’
‘‘హనుమంతుడు సంజీవిని పర్వతాన్ని ఒంటి చేత్తే తీసుకువచ్చినప్పుడు, శ్రీకృష్ణుడు గోవర్ధన గిరిని చిటికెన వేలితో లేపినప్పుడు- ఇదీ సాధ్యమేనేమో అనిపిస్తోంది. ఆయన ఉపన్యాసం మొన్న నేనూ విన్నాను. ప్రపంచ దేశాలన్నింటినీ రాజధానికి మళ్లీస్తానని, దావోస్‌ను రాష్ట్ర రాజధానికి తీసుకు వస్తానని ఈ ధైర్యంతోనే చెప్పారేమో! విజయవాడ- అమరావతి అనుసంధానం ఇంకా పూర్తి కాకున్నా, ఈ లోపు ప్రపంచాన్ని అనుసంధానం చేస్తానని చాలా ఆత్మవిశ్వాసంతో ప్రకటించడం నాకు బాగా నచ్చింది.’’
‘‘మొదట ఏదైనా నమ్మశక్యం కాకుండానే ఉంటుంది. ఆచరణకు వచ్చేంత వరకు ఎక్కడైనా ఇంతే.’’
‘‘నీతో మాట్లాడిన తర్వాత నాకు పూర్తి క్లారిటీ వచ్చింది. నాదో రిక్వెస్ట్. పనిలో పనిగా ఈ భూగోళాన్ని కూడా అనుసంధానం చేయి. ఇప్పుడున్న దేశాలు అడ్డదిడ్డంగా ఉన్నాయి. ఇండియాకు పాకిస్తాన్ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గు మంటుంది. అమెరికాలో వర్షం పడ్డా మనం తుమ్ముతాం. ఇండియా- అమెరికా సుదూర దేశాలు’’
‘‘ఐతే ’’
‘‘దేశాలను మార్చేయ్ మన పక్కన పాకిస్తాన్, చైనా, శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్ కాకుండా ఇండియా పక్కన అమెరికా, కెనడా, ఆస్ట్రేలియా దేశాలు ఉండేట్టు చూడు. అసలే ట్రంప్ అదేదో వీసాలకు కొత్త ఆంక్షలు అంటూ మన వాళ్లను భయపెడుతున్నాడు. ఇరుగు పొరుగు దేశాలు ఐతే ఎంచక్కా మెట్రో రైలు ఎక్కి మనం అమెరికాకు వెళ్లి రావచ్చు. పాకిస్తాన్‌ను మాత్రం ఆఫ్రికాలో పడేయ్. ఆకలితో చస్తే పీడాపోతుంది.’’
‘‘ఆ’’
‘‘నీతో సాధ్యం కాకపోతే చెప్పు.. ఈ ఐడియాను ఆయనకు చెప్పేస్తాను. దావోస్‌ను అమరావతికి తెచ్చినప్పుడు దేశం కోసం ఈ మాత్రం చేయలేడా? ప్రపంచంలో నేటి అశాంతికి కారణం వాస్తు సరిగాలేకే. ఈసారి వాస్తును చూసి మరీ దేశాలను మార్చు. దక్షిణాదికి అన్యాయం జరుగుతోంది. ఆ హిమాలయాలను దక్షిణాదికి మార్చు వాస్తు మారి దశ మారుతుంది .’’

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం