‘‘హాయ్ రాధా.. నీకు నిండా నూరేళ్లు.. ఇప్పుడే నీ గురించి అనుకుంటున్నాను.. ఇంతలోనే నువ్వు కాల్ చేశావు’’
‘‘గోపీ.. నీకో అర్జంట్ విషయం చెప్పాలి. తొందరగా వచ్చేయ్!’’
‘‘ బిజీగా ఉన్నాను రాధా.. ఫరవాలేదు. ఫోన్‌లోనే చెప్పేయ్ విషయం ఏంటో?’’
‘‘నేను నెల తప్పాను గోపీ’’
‘‘పోనీ రాధా వందేళ్లలో ఓ నెల తగ్గితే పెద్ద తేడా ఏముంటుంది? ఇంతోటి దానికి ఫోన్ చేసి చెప్పాలా?’’
‘‘అబ్బా అది కాదండి.. నేను తల్లిని కాబోతున్నాను’’
‘‘టీవి సీరియలా? నాటకంలోనా?’’
‘‘కాదు గోపీ.. నీ బిడ్డకు తల్లిని కాబోతున్నాను’’
‘‘ఆలు లేదు చూలు లేదు కొడుకు పేరు సోమలింగం అని నాకింకా పెళ్లే కాలేదు నా బిడ్డకు నువ్వు తల్లివి కావడం ఏంటి రాధా?’’
‘‘మట్టి బుర్ర ఇంకెలా చెప్పాలి? మనమిద్దరం ప్రేమించుకున్నాం కదా? నేను కాలు జారాను ’’
‘‘కాలు జారితే ఫాక్చర్ అవుతుంది కానీ తల్లివి కావడమేంటి?’’
‘‘అబ్బా.. మనం ప్రేమించుకుని చెట్టా పట్టాలేసుకుని తిరిగాం కదా? వర్షం కురిసిన ఆ రాత్రి హద్దులు దాటాం.. ఇప్పుడు నెల తప్పాను... అదీ విషయం’’

‘‘ఓహో ఇదా.. ఇంత సింపుల్ విషయాన్ని ఎంత కాంప్లికేట్ చేశావ్ రాధా? నువ్వేప్పుడూ ఇంతే?’’
‘‘అంటే నేనేం టెన్షన్ పడాల్సిన అవసరం లేదు కదా? మీ అమ్మానాన్నలను ఒప్పిస్తావు కదా?’’
‘‘చూడు రాధా.. నేనసలే నైతిక విలువలకు ప్రాధాన్యత ఇచ్చే వాడిని.. ఇంట్లో వాళ్లను ఒప్పించాల్సిన అవసరం లేదు. నువ్వు తల్లివి కావడానికి నైతిక బాధ్యత వహిస్తున్నాను’’
‘‘మరి మన పెళ్లెప్పుడు?’’
‘‘ పెళ్లికి, దీనికి సంబంధం ఏంటి రాధా? నైతిక బాధ్యత వహిస్తూ ‘రాధా ప్రియుడు’ అనే నా హోదాకు రాజీనామా చేస్తున్నాను. ఇప్పటి నుంచి నీకూ నాకూ ఎలాంటి సంబంధం లేదు’’
‘‘గోపీ’’
‘‘ప్రియుడి హోదాకు రాజీనామా చేసిన తరువాత నువ్విలా పరాయి మగవాడితో మాట్లాడడం అనైతికం. నైతిక బాధ్యత వహిస్తూ కాల్ కట్ చేస్తున్నాను’’

***
‘‘ఏరా బుడంకాయ్.. హోంవర్క్ చేసుకు రాకపోతే క్లాస్‌లోకి రానివ్వను అని చెప్పాను కదా? ఐనా ఎందుకు చేయలేదు?’’
‘‘కార్టూన్ నెట్‌వర్క్ చూస్తూ రాత్రంతా మేలుకున్నా టీచర్. హోంవర్క్ చేయనందుకు నైతిక బాధ్యత వహిస్తూ క్లాస్ నుంచి వెళ్లి పోతా’’. ‘‘ఏరా తిక్క తిక్కగా ఉందా?’’
‘‘మీకు పిల్లలంటే చిన్న చూపు టీచర్. నాలాంటి పిల్లకాయలు నైతిక బాధ్యత వహిస్తే ఓర్వలేరు. మీకు కుళ్లు’’
***
‘‘ఏంటండీ.. అంతగా సంతోష పడుతున్నారు.. మాకు చెబితే మేమూ సంతోషిస్తాం కదా?’’
‘‘చూడోయ్.. ఈ కాలంలో వార్డు మెంబర్‌గా గెలిచినోడు కూడా పదవి పట్టుకుని వేలాడుతాడు. పదవి తోనే పైకి పోవాలనుకుంటాడు కానీ ప్రపంచంలో కెల్లా అత్యంత పెద్దదైన భారతీయ రైల్వేకు మంత్రిగా ఉండి నైతిక బాధ్యత వహించి పదవి వదులు కోవడం అంటే మాటలా? మా కాలంలో లాల్ బహుద్దూర్ శాస్ర్తీ ఇలా చేశాడని మా నాన్న ప్రతి సారీ చెప్పేవాడు. సురేష్ ప్రభు అని మన జనరేషన్ గర్వంగా కాలరెత్తుకునేట్టు చేశాడు. ఈ కాలంలోనూ అంత గొప్ప నాయకుడు ఉన్నందుకు ఆనందంతో నా కళ్లు చెమ్మగిల్లాయి. సంతోషంతో ఆకాశంలో తేలిపోతున్నాను.’’
‘‘తెలియక అడుగుతున్నాను. మొన్న మనం ఫ్లైట్ ఎక్కాం కదా? ఎయిర్ హోస్టేస్ తన బాధ్యత సరిగా నిర్వర్తించలేదునుకో, పైలట్ నైతిక బాధ్యత వహించి విమానాన్ని మధ్యలోనే వదిలేసి తాను మాత్రం ప్యారాచూట్‌తో కిందికి దిగిపోతే ఎలా ఉంటుంది? ’’
‘‘ఇదేం తలతిక్క ప్రశ్న? ప్రయాణీకులను సురక్షితంగా గమ్యస్థానానికి చేర్చడం పైలట్ బాధ్యత. మధ్యలో వదిలేసి దూకేయడం నైతిక బాధ్యత ఎలా అవుతుంది? ’’
‘‘మరి ఇది కూడా అంతే కదా? రైల్వే మంత్రిగా రైల్వేను సమర్ధవంతంగా నడపడం బాధ్యత అవుతుంది కానీ ప్రమాదాలు జరగ్గానే రాజీనామా చేయడం నైతిక బాధ్యత ఎలా అవుతుంది?’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. లాల్ బహద్దూర్ శాస్ర్తీ కాలం నుంచి వచ్చిన సంప్రదాయం తెలియకుండా మాట్లాడకు’’
‘‘తెలియకపోవడం వల్లే కదా? మిమ్ములను అడుగుతున్నది. లాల్‌బహుద్దూర్ శాస్ర్తీ రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేశాక రైలు ప్రమాదాలు నిలిచిపోయాయా? ’’
‘‘అలా ఎందుకు నిలిచిపోతాయి. ప్రయాణం అన్నాక ప్రమాదాలు సహజం’’
‘‘మరి రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు రోడ్ల శాఖ మంత్రి, బస్సు ప్రమాదాలు జరిగినప్పుడు రవాణా శాఖ మంత్రి ఇలా రోజూ మంత్రులంతా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేస్తే భలే ఉంటుంది కదా? దేశం మొత్తం నైతిక పరిమళాలు గుబాళిస్తాయి ’’

‘‘తలతిక్కగా మాట్లాడకు.. రైలు ప్రమాదాలు చాలా తక్కువగా జరుగుతాయి కాబట్టి నైతిక బాధ్యతగా రైల్వే మంత్రిని రాజీనామా చేయమంటారు. అదే బస్సు ప్రమాదం జరిగితే రవాణా మంత్రి నైతిక బాధ్యత వహించాలి అంటే రోజుకు ఆరుసార్లు రాజీనామా చేయాలి.’’
‘‘నా ప్రశ్నకు సమాధానం చెప్పలేదు. రైల్వే మంత్రి రాజీనామా చేస్తే రైల్వే ప్రమాదాలు ఆగిపోతాయా? నెహ్రూ కాలం నుంచి మోదీ కాలం వరకు రైల్వే మంత్రులంతా ఇలా నైతిక బాధ్యత వహించి రాజీనామాలు చేశారు కదా? ప్రమాదాలు ఎందుకు నిలిచిపోలేదు?’’
‘‘తెలియకుండా మాట్లాడకు.. నైతిక బాధ్యత అనేది చాలా బాధ్యతతో కూడిన వ్యవహారం.. అల్లాటప్పా వాళ్లకు అర్థం కాదు’’
‘‘రైల్వే మంత్రిగా రాజీనామా చేశాక లాల్ బహద్దూర్ శాస్ర్తీ ఏకంగా ప్రధాని అయ్యారు. రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసిన నితీష్ కుమార్, మమతా బెనర్జీ ఏకంగా ముఖ్యమంత్రులు అయ్యారు. అందుకేనేమో సురేష్ ప్రభు రాజీనామా చేస్తానంటే మోదీ వద్దే వద్దు అన్నారు.’’
‘‘నైతిక బాధ్యత వహించి రాజీనామా చేసినా తప్పేనా?’’
‘‘బాధ్యతను సక్రమంగా నిర్వహించడం నైతిక బాధ్యత అవుతుంది కానీ తప్పించుకోవడం కాదు. ప్రేమించి తప్పించుకున్నవాడికి, బాధ్యతను మధ్యలో వదిలేసినోడికి తేడా లేదు. రైల్వేలో కింది నుంచి పైస్థాయి వరకు పేరుకు పోయిన నిర్లక్ష్యాన్ని చాలెంజ్‌గా తీసుకుని శుభ్రం చేయడం నైతిక బాధ్యత అవుతుంది కానీ పారిపోయి మరో పదవి తీసుకోవడం నైతిక బాధ్యత అనిపించుకోదు.’’ *