‘‘మా రోజులే వేరు. మా కాలంలో ఇంట్లోకి నాన్న వస్తున్నాడంటే గజగజ వణకిపోయేవాళ్లం. చిన్న తప్పు చేసినా తొడపాశం పెడతాడని భయపడేవాళ్లం. కలికాలం. ఈ రోజుల్లో తల్లిదండ్రులను పిల్లలు పేరుపెట్టి పిలుస్తున్నారు. మొన్న ఓ ఫంక్షన్‌లో వాయ్ పంకజ్ అని అమ్మాయి పిలుస్తుంటే ఎవరా అని విచారించా, వాళ్ల అమ్మాయి అట. ఏదో బాయ్‌ఫ్రెండ్‌ను పిలిచినట్లు ఆ పిలుపులేమిటి? మా కాలంలో స్కూల్‌లో టీచర్‌గా తొడపాశం పెట్టి ఎక్కాలు నేర్పించేవాళ్లు. పిదపకాలం పిదప బుద్ధులు. అదేదో చట్టం ఉందిట! విద్యార్థులను కొట్టకూడదట! కలికాలం’’
‘‘ఔను మీ వయసువాడే సుబ్బారావు అని పాపం చెవిటివాడు. చిన్నప్పుడు ఎక్కాలు సరిగా రాకపోతే పంతులు గూబగుయ్యిమనేట్టు చెంపదెబ్బ కొట్టాడట! ఆ రోజు నుంచి సుబ్బారావు స్కూల్‌కు వెళ్లలేదు. వాడి చెవి పనిచేయడం లేదు. వృద్ధాప్యంలో ఒకరి పంచన బతుకుతున్నందుకు వారేం తిట్టుకుంటున్నారో వినపడదు హాయిగా ఉంది అని సంతోషంగా చెబుతుంటాడు. అడగడం మరిచాను మీ అమ్మానాన్నలను ఓల్డ్ ఏజ్ హోంలో వేశావట?’’
‘‘నేను వేయడం ఏంటి? తల్లిదండ్రుల కోరిక తీర్చడం నా ధర్మం. విశాలమైన వృద్ధాశ్రమంలో ఉంటామని పోరి వెళ్లారు. తమ వయసువారితో కబుర్లు చెబుతూ ఉండాలని ఎవరికి మాత్రం అనిపించదు. మా అమ్మానాన్నల కోరిక తీర్చినందుకు నాకెంత సంతోషంగా ఉందో చెప్పలేను’’
‘‘ఔను చెప్పలేవు. తెలిసిపోతుంది. చెప్పడం కష్టం. నువ్వేమో మీ అమ్మానాన్నల కోరిక తీర్చాను అంటావు. అందరేమో! మీ ఆవిడ కోరిక తీర్చడానికి ఈ వయసులో అమ్మానాన్నలను ఎవరూలేని అనాధల్లా వృద్ధాశ్రమంలో వదిలావు అంటున్నారు’’
‘‘శ్రీరాముణ్ణి అనుమానించిన లోకం ఇది. లోక కల్యాణం కోసం శ్రీరాముడు సీతమ్మను అడవిలో వదిలాడు. అలానే అమ్మానాన్నల కోసమే వృద్ధాశ్రమంలో వదిలాను’’
‘‘నీ పాపం శ్రీరామునికి అంటగట్టడం ఎందుకులే? నువ్వన్నట్లు ఆ రోజులు అద్భుతం, ఆ రోజుల్లో పుట్టిన మీలాంటివారు తల్లిదండ్రులను పుణ్యంకోసం బొందితో కైలాసానికి పంపే సాహసాలు కూడా చేస్తున్నారు. ఈ కాలం వారికి అంత ఓపిక ఎక్కడిది.’’
‘‘ఏంటి మీ ఫ్లాట్ ఎదురింటి వాళ్లు లింగులిటుకు మంటు ఇద్దరే ఉంటారు. పిల్లలు వీరిని పట్టించుకోరా?’’
‘‘అవును పట్టించుకోరు. వాళ్లు మనలాంటి పుణ్యకాలం మనుషులు కాదు. ఈ కాలం పాపాత్ములు. పిల్లలు అమెరికాలో ఉంటారు. ఒకే ఇంట్లో ఉన్నా పలకరించుకోలేని, మాట్లాడుకోలేని పుణ్యకాలం మనుషులం మనం. ఖండాంతరాల్లో ఉన్నా తమ తల్లిదండ్రుల బాగోగులను అక్కడినుంచే చూస్తూ, తమకోసం కష్టపడ్డ తల్లిదండ్రులకు మంచి జీవితాన్ని ఇవ్వాలని అక్కడి నుంచే ఏర్పాటు చేసే కలికాలం మనుషులు వాళ్లు’’
‘‘ఏంటో చెప్పావ్! అస్సలు అర్థం కాలేదు. కానీ ఏదో అర్థం మాత్రం ఉందనిపిస్తోంది!’’
‘‘ఆ సంగతి వదిలెయ్. అతీతశక్తులు ఉన్నాయంటావా?’’
‘‘నీకెందుకలా అనిపిస్తోంది’’
‘‘మొన్న నదిలో పడవ మునిగి 21మంది మరణించారుకదా? అతీతశక్తుల పనే అని చెప్పగలను’’
‘‘మంచి ఐడియా ఫలానా వారు కారణం అని తేల్చితే వారిని శిక్షించాలి. ఏ సామాజిక వర్గం వారు, ఎవరికి కోపం వస్తుందో, ఎవరి తెరవెనుక ఏ మంత్రి ఉన్నారో ఇవన్నీ తేల్చాలి. అతీతశక్తులపని, అంటే ఏ సమస్యా ఉండదు’’
‘‘నేను చెప్పాలనుకున్నది అది కాదు. ఆధారం లేనిదే ఏదీ మాట్లాడను. అతీతశక్తి ఉంది. ముమ్మాటికీ నిజం. ఉదాహరణ చెబితే నువ్వు ఒప్పుకుంటావ్’’

‘‘నిజమే. ఒక్కోసారి నాకూ అలానే అనిపిస్తుంది. మొన్న ఓ యువమంత్రి ప్రతిపక్షం లేని అసెంబ్లీలో అద్భుతంగా మాట్లాడారట! ప్రతిపక్షం గజగజ వణికిపోయిందట! అది చూశాక నిజంగా అతీతశక్తులు ఉండే ఉంటాయి అనిపించింది. మొన్న రాంగోపాల్ వర్మతో ఎన్టీఆర్ ఆత్మ మాట్లాడిన వీడియో వాట్సప్‌లో, ఫేస్‌బుక్‌లో వర్మనే షేర్ చేశాడు. సూపర్ హిట్ సినిమా తీసిన వర్మనే అతీతశక్తులకు ఆధారం చూపించినప్పుడు నమ్మకుండా ఎలా ఉంటాం. ఏవో అతీతశక్తులే ఆ యువమంత్రితో అద్భుతంగా మాట్లాడించి ఉంటాయి!!
‘‘అది కూడా అతీతశక్తుల పనే కావచ్చు. కానీ నేను చెప్పాలనుకున్న అతీతశక్తి పని అదికాదు. లాంచీని నదిలో ముంచింది అతీతశక్తులే’’
‘‘ఇందులో నువ్వు కనిపెట్టిందేముంది. ప్రతి వ్యాపారం వెనుక అతీత శక్తి ఉంటుంది’’
‘‘అబ్బా అదికాదు. మానవ ఊహాశక్తికి అందని ఏదో ఒక అతీత శక్తి ఉంది అంటారుకదా! అలాంటి అతీతశక్తి గురించి నేను చెబుతున్నది. బెర్ముడా రహస్యం ఇంకా బయటపడలేదుకదా? ఏ పడవ అటు వెళ్లినా తనలోకి లాక్కొంటుంది. అలాంటి అతీతశక్తి గురించి చెబుతున్నాను’’

‘‘అంటే కృష్ణనదికి బెర్ముడా ట్రయాంగిల్‌కు సొరంగ మార్గం ఉందంటావు. ఓ గుంత చూసి గోల్కొండ కోట నుంచి వరంగల్‌కు సొరంగ మార్గం ఉందని ఆ మధ్య ఓ వార్త వచ్చింది. తీరా తవ్వి చూస్తే అది డ్రైనేజి మార్గమని తేలింది.’’
‘‘డ్రైనేజి మార్గం కాదు. కచ్చితంగా ఇది అతీతశక్తి పనే అతీతశక్తులు ఉన్నాయని మనం రుజువు చేస్తే ప్రపంచంలో కొత్త ఆవిష్కరణలకు నాంది పలికినవారం అవుతాం’’
‘‘సరే, ఆ అతీతశక్తులు ఏమిటి? ఆధారలేమిటో చెప్పు’’
‘‘పడవ మునిగిన తరువాత వచ్చిన వీడియోలు చూశావా? పడవను నదిలోకి వదిలే ప్రసక్తే లేదని అధికారి ఒకరు అడ్డుకున్నాడు. వెళ్లనిచ్చే ప్రసక్తేలేదని అతను అడ్డుకున్నా, పడవ నదిలోకి వెళ్లింది. నాకేపాపం తెలియదు, నాకు ఐదు పడవలు ఉన్నాయి. నదిలోకి వెళ్లడానికి అనుమతి లేదు కాబట్ట్డి నేను పంపించలేదు. దేవునిమీద ఒట్టు. నేను ఒట్టి అమాయకుడిని అని పడవల యజమానికి కొండలరావు హృదయవిదారకంగా చెబుతున్నాడు. కావాలంటే చూడు. పత్రికల్లో వచ్చింది.’’
‘‘పడవ వెళ్లకుండా అధికారి అడ్డుకున్నాడు, యజమాని పడవను పంపలేదు. అంటే ఏదో ఒక అతీతశక్తి పడవను నీటిలోకి లాక్కొంది. అలానే ప్రయాణీకులను పడవలోకి లాక్కొని, నదిలోకి తీసుకువెళ్లింది. వీరిలో ఆయువుతీరిన 21మంది మాత్రమే మరణించారు. అంటే ఏదో అతీతశక్తి పనే అని స్పష్టం కావడం లేదా?’’
‘‘బెర్ముడా ట్రయాంగిల్ వద్దకు వెళ్లిన పడవలు మాత్రమే మాయం అయ్యాయి కానీ ఇక్కడ మాత్రం ఎక్కడో బెడ్‌రూంలో ఘంటసాల భక్తి గేయాలు వింటూ విశ్రాంతి తీసుకుంటున్న పడవలు ఎవరూ చూడకుండా తమంతట తాము నదిలోకి వెళ్లాయి అంటే అతీతశక్తుల పని కాకుండా మరేమిటి?’’
‘‘నువ్వు చెబుతుంటే నిజమే అనిపిస్తోంది. కాశీమజిలీ కథలో ఓ కథ. రాజుగారు మంచపై నిద్రపోయాక మంచం కోళ్లు తమలో తామే మాట్లాడుకుంటాయి. రాజుగారికి గండం ఉందని, మంచం కోళ్లు మాట్లాడుకోవడం అనే ఆలోచన వింతగా అనిపించింది. ఈ కాలంలోనే అతీతశక్తులు పడవను, ప్రయాణికులను నదిలోకి లాక్కోవడం ప్రత్యక్షంగా చూశాం. కాశీమజిలీ కథల కాలంలో మంచం కోళ్లు మాట్లాడుకోవడంలో ఆశ్చర్యం ఏముంది’’
‘‘మీ కాలం, మా కాలం అని కాదు కానీ అతీతశక్తులు ఏ కాలంలోనైనా ఉన్నాయనిపిస్తోంది’’

‘‘ప్రపంచంలోని ప్రతి సమస్యకు కారణం అతీతశక్తులు, ప్రతి కేసులో దోషి అతీతశక్తి అనుకుంటే కేసులు ఉండవు. విచారణ ఉండదు. ఇంతకుమించి పరిష్కారం ఉండదు. ఏమంటావు’’
బుద్ధా మురళి (17-11-2017 జనాంతికం )
:)
రిప్లయితొలగించండి