‘‘తెలియదు అంటే- తెలివి లేదని నిందిస్తావా? నాగం జనార్దన రెడ్డి ఇప్పుడు ఏ పార్టీలో ఉన్నాడు? ఆయన స్థాపించిన పార్టీ ఏమైంది? బిజెపి నుంచి ఎప్పుడు బయటకు వచ్చాడు? కాంగ్రెస్‌లో రేవంత్‌రెడ్డి పదవేంటి? టీవీ చర్చల్లో రోజూ కనిపించే ఫలానా నాయకురాలు ఈ రోజు ఏ పార్టీ తరఫున మాట్లాడారు? అనడిగితే ,తెలియదు అన్నందుకు - రాజకీయాల గురించి నాకేమీ తెలియదా? నువ్వడిగిన ప్రశ్నలకు నాగంకే సమాధానం తెలియదు. విలేఖరుల సమావేశంలో అవినీతి కాంగ్రెస్ అంటూ చీల్చి చెండాడాడు. సార్.. ఇప్పుడు మీరు కాంగ్రెస్‌లోనే ఉన్నారని ఆయనకు గుర్తు చేయాల్సి వచ్చింది.’‘‘ఎవరితో మాటలు..? ఫోన్‌లో అంతగా ఊగిపోతున్నావ్?’
‘‘పక్కింటి పిల్లాడికి హోంవర్క్‌లో రాజకీయాల గురించి ప్రశ్నలు అడిగారట! వాళ్ల నాన్న నన్ను అడిగితే తెలియదని నిజాయితీగా చెప్పాను. ఇవి కూడా తెలియదు కానీ అన్నీ తెలిసినట్టు పెద్ద పోజు అని ఎత్తిపొడుపు మాటలకు చిర్రెత్తుకొచ్చింది. మీరు చెప్పండిరా! తెలంగాణ వస్తుందని ముందే చెప్పానా? లేదా? దేశ రాజకీయాలు ఎలా ఉంటాయి? 2019 ఎన్నికల అంచనాలు కూడా చెప్పాను కదా? మరి నాకేమీ తెలియదని ఎంతేసి మాటలంటున్నాడు.’’
‘‘బాధపడకు.. మాలో ఎవరికి సందేహం వచ్చినా నిన్నే అడుగుతాం కదా? రాజకుమారి ఎప్పుడు ఏ పార్టీలో ఉన్నారని వారి పిల్లలను అడిగినా చెప్పలేరు. ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డాక పొట్టి శ్రీరాములు ఆమరణ దీక్ష విరమించారని దేశంలో కెల్లా సీనియర్ రాజకీయ నాయకుడు సృష్టించిన చరిత్ర, ఆయన కనిపెట్టిన పురాణాల ప్రకారం పోతన రాసిన రామాయణం పేరేమిటి? చినబాబు కనిపెట్టిన తెలుగు పదాలు ఏవి? వంటి ప్రశ్నలు అడిగితే ఠక్కున సమాధానం చెప్పడం ‘గూగుల్’కు కూడా సాధ్యం కాదు. ఇలాంటి వాటితో మూడ్ పాడు చేసుకోవద్దు.’’
‘‘సర్లే.. పొత్తికడుపుపట్టుకుని అంతగా మెలికలు తిరిగిపోతున్నావ్? ఏంటి విషయం? గ్యాసేమో.. టీ తాగడం తగ్గించు’’
‘‘కడుపులో నుంచి తన్నుకొస్తున్న ఈ గ్యాస్ వేరు’’
‘‘అలా మెలికలు తిరగకు. ఫర్వాలేదు సిగ్గుపడకు.. అంతా మన ఫ్రెండ్సే కదా? ఎవరూ ఏమీ అనుకోరు చెప్పు’’
‘‘కడుపులో నుంచి దేశభక్తి తన్నుకొస్తోంది.. దేశం కోసం ఏదో ఒకటి చేసి తీరాల్సిందే అనిపిస్తోంది. అలా అని నా అలవాట్లు మానుకోను. జేబులో నుంచి ఒక్క రూపాయి తీయను’’
‘‘దురద పుట్టినప్పుడు గోక్కోవాలని అనిపించడం ఎంత సహజమో మనిషన్నాక ఈ వయసులో ఏదో ఒకటి చేయాలనిపించడం అంతే సహజం. ఖర్చు లేని మార్గాలు బోలెడు ఉన్నాయి. సెల్ ఫోన్ ఉంది కదా? అదొక్కటి చాలు. ప్రతి బ్యాంకు అకౌంట్ నుంచి ఒక రూపాయి కోత విధించి సరిహద్దుల్లో యుద్ధంలో మరణించే సైనికుడి ఖాతాలో జమ చేయమని ఒక సందేశం తయా రు చేసి వాట్సాప్‌లో పం పించు.. నీకు పైసా ఖర్చు లేదు. నీ దేశభక్తికి బోలెడు గుర్తింపు’’‘‘భలే ఉంది. ఆగాగు.. ముందు వాట్సాప్‌లో ఈ మెసేజ్ అందరికీ పంపిస్తా..’’
‘‘అప్పుడే రంగంలోకి దిగావంటే నీలో దేశభక్తి ప్రవాహం మామూలుగా లేదు. ఇలాంటి దేశభక్తి సందేశాలు నీ శక్తిమేరకు తయారు చేసి వాట్సాప్ గ్రూపుల్లో నింపేయ్.’’
‘‘ఏరోయ్.. నువ్వేదో చెప్పడానికి ప్రయత్నిస్తున్నట్టున్నావ్. వాడికిచ్చినట్టే నీకూ సలహా ఇస్తా చెప్పు ’’
‘‘రోజూ ఇలాంటివి వంద దేశభక్తి మెసేజ్‌లు వస్తాయి. అంతమందిలో ఒక బోడిగుండులా ఉండడం నాకు నచ్చదు. నేనసలే మేధావిని’’
‘‘ఓ పని చేయ్! అంతా రాముణ్ణి మొక్కితే, నేను నాస్తికుణ్ణి దేవునిపై నమ్మకం లేదు. రాముడు అబద్ధం, రావణుడు నిజం అని చెప్పు. రావణుడే నిజమైన దేవుడు అని వాదించు. నీ ఇంటి ముందు టీవీ వాళ్లు క్యూ కట్టక పోతే ఓట్టు’’
‘‘రాముడు లేడని, రావణుడు ఉన్నాడని పరస్పర విరుద్ధంగా ఎలా చెప్పాలి?’’
‘‘ఇలా ఆలోచిస్తే నీకు మేధావిగా గుర్తింపు లభించడం కష్టమోయ్.’’
‘‘దీంట్లో రిస్క్ లేదంటావా? ’’
‘‘స్టాక్ మార్కెట్, పూల దుకాణం.. ఏ వ్యాపారంలోనైనా రిస్క్‌ను బట్టే ఆదాయం ఉంటుంది. పాల ప్యాకెట్టు అమ్మితే రూపాయి కమీషన్ వస్తుంది. అదే హెరాయిన్ ప్యాకెట్ అమ్మితే అబ్బో బోలెడు ఆదాయం. రిస్క్ భరించేందుకు సిద్ధపడితేనే పబ్లిసిటీ, మీడియా గుర్తింపు..
‘‘ప్రాణాలు ప్రమాదంలో పడేంత రిస్క్ ఉంటే...’’
‘‘ప్రపంచ పటంలో భూతద్దం పెట్టి వెతికితే కనిపించీ కనిపించకుండా ఉండే చిన్న దేశంలో మతంపై కార్టూన్ వేస్తే మన దేశంతో పాటు అనేక దేశాలు భగ్గుమన్నాయి. ఎంతోమంది ప్రాణాలు గాలిలో కలిసిపోయాయి. అలాంటి వాటి జోలికెళ్లవద్దు. వంద కోట్ల జనాభా ఉన్న హిందువుల ఆరాధ్య దైవాలపై కార్టూన్లు వేసినా, కామెంట్ చేసినా గుర్తింపు తప్ప ఎలాంటి రిస్క్ లేదు. ’’
‘‘మీ చర్చలో జోక్యం చేసుకుంటున్నాను. నువ్వేదో వెటకారంగా చెబుతున్నట్టున్నావ్. మా బామ్మ రంగనాయకమ్మ ఈ అంశంపై చాలా చక్కగా వివరణ ఇచ్చారు. నేను హిందువుగా పుట్టాను, ఆ మతంలో పెరిగాను కాబట్టి హిందుమతం గురించి విమర్శిస్తూ రాస్తున్నాను. తెలియని మతాల గురించి రాయడం లేదని చెప్పారు. నువ్వు చదవలేదా?’’
‘‘అంటే ఆమె పుట్టినప్పుడే ఉగ్గుపాలకు బదులు క్యాపిటల్ పుస్తకం చదువుతూ పెరిగారా? పాలపీకలో మార్క్సిజాన్ని కలుపుకొని తాగుతూ పెరిగారా? క్యాపిటల్ గురించి, మార్క్సిజాన్ని గురించి ఎలా రాశారు? వీటి గురించి తెలుసుకుని రాశారు అంతే కదా? అలానే ఇతర మతాల గురించి తెలుసుకుని రాయవచ్చు కదా? రాస్తే ఏమవుతుందో బామ్మకు బాగా తెలుసు. ఆమె సంగతి మనకెందుకు కానీ మన సంగతి మనం చూసుకుందాం.’’
‘‘ఉద్రిక్తతలు కలిగిస్తున్న చానల్స్, సంస్థల సంగతి తేల్చకుండా.. .’’
‘‘పిచ్చోడా! పార్టీ శ్రేణులు కూడా చేయని మేలును టీవీ చానల్స్ చేస్తుంటే తెలివైన వాడెవడూ వద్దనడు..లోకల్ గుర్తింపునకు ఇది సరిపోతుంది .. అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు కావాలంటే .. తన శైలిలో ప్రపంచ శాంతి కోసం తపించిన లాడెన్ కు నోబెల్ శాంతి అవార్డు ప్రకటించాలి అని డిమాండ్ చేయి . మన దేశం లో జైళ్లలో ఉన్న టెర్రరిస్ట్ లను విడుదల చేసి ... రావణున్ని చంపిన రామునిపై హత్యా నేరం , గృహ హింస కేసు , నిర్భయ కేసు పెట్టాలని రామాయణం లో జరిగిన మరణాలన్నింటిపై న్యాయ విచారణ జరిపించాలని డిమాండ్ చేయి .. అసలు విషయం మరిచిపోయా బంగారు లేడిని చంపినందుకు అటవీజంతువుల సంరక్షణ చట్టం కింద కఠిన చర్యలు తీసుకో మని డిమాండ్ చేస్తే తిరుగుండదు. శ్రీ రాముని దయతో నీ కోరిక నెరవేరి అంతర్జాతీయ మేధావిగా గుర్తింపు పొందాలని కోరుకుంటున్నాను . బచ్చన్న పేట లో ఉండే అతనెవరో ట్రంప్ ఫొటోకు పూజ చేసి ట్రంప్ దృష్టిలో పడ్డప్పుడు మహానగరం లో ఉండే నువ్వు లాడెన్ కు శాంతి దూత అవార్డు ఇవ్వాలని డిమాండ్ చేస్తే ప్రపంచం దృష్టిలో పడకుండా ఉంటావా ? ’’
‘‘అర్థం అయినట్టు, కాకుండా మాట్లాడుతున్నావు’’
‘‘మోదీ విజయంలో హిందుత్వ శక్తుల ప్రయత్నాల కన్నా, హిందూ వ్యతిరేక శక్తుల కృషి ఎక్కువ ఉంది’’
‘‘అర్థం కాలేదు..’’
‘‘తుంటిమీద కొడితే పళ్లు రాలాయనే సామెత తెలుసు కదా? తుంటికి, పళ్లకు సంబంధం ఉండదు. కానీ రాజకీయాల్లో ఉంటుంది.’’
*-బుద్దా మురళి (జనాంతికం 6-7-2018)

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం