అమ్మాయి పుట్టినప్పటి నుంచి అత్తవారింటికి వెళ్లేంత వరకు ఎలా ఉండాలో? అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో మనకెన్నో పాఠాలు ఉన్నాయి. పిల్లల పెంపకానికి సంబంధించి సూత్రాలున్నాయి. తెలియకపోతే చెప్పే పెద్దలు ఉన్నారు. మరి జీవితంలో ప్రతి క్షణం అవసరం అయిన డబ్బుకు సంబంధించి మనకు పాఠాలు లేవు. చెప్పే వారు ఉండరు. కాళ్లు కడిగినప్పుడే కాపురం చేసే విధానం తెలిసింది అనే సామెత ద్వారా కాళ్లు కడిగే విధానం గురించి కూడా బోధిస్తారు. పెళ్లి సంప్రదాయానికి సంబంధించి మనకెన్నో పాటలున్నాయి. సంప్రదాయాల గురించి చెప్పే పెద్దలుంటారు. నడవడికకు సంబంధించి, పిల్లల పెంపకానికి సంబంధించి చెప్పే పాఠాల మాదిరిగానే సంపద, డబ్బుకు సంబంధించిన పాఠాలు చెబితే మన జీవితం కచ్చితంగా మెరుగ్గా ఉంటుంది.
కొత్త పెళ్లి కూతురు అత్తవారింట్లో ఎలా మసలుకోవాలో పూర్వం చెప్పేవారు. ఇప్పుడు ఉమ్మడి కుటుంబాలు లేవు. వాటి సంగతి ఎలా ఉన్నా అమ్మాయి అయినా అబ్బాయి అయినా డబ్బుకు సంబంధించి కనీస అవగాహన లేకుంటే జీవితం కష్టాల మయం అవుతుంది.
ఉద్యోగంలో కొత్తగా చేరారు. ఇప్పుడేం చేస్తారు?
జీవితమంతా కార్పొరేట్ స్కూల్‌లోనే బందీలుగా బతికాం. కానె్వంట్ స్కూల్ నుంచి కార్పొరేట్ కాలేజీ వరకు మార్కుల పరుగు పందెంలోనే జీవితం గడిచిపోయింది. ఎంసెట్ ర్యాంకులు, ఇంజనీరింగ్ కాలేజీలు, క్యాంపస్ సెలక్షన్‌ల తరువాత ఇప్పుడే ఉద్యోగంలో చేరాం. ఇప్పుడైనా ప్రశాంతంగా ఉండనివ్వరా? జీవితమే ఒక పోటీ అనుకున్నప్పుడు ఏ దశలోనైనా పోటీ అనివార్యం. ఉద్యోగం రాగానే మార్కుల పోటీ ముగిసిపోయిందను కోవద్దు. ఉద్యోగంలో చేరిన తరువాత కూడా పరీక్షలకు ప్రిపేర్ కావలసిందే. ఐతే ఈ పరీక్షలు వేరుగా ఉంటాయి.
గతంలో ఎప్పుడూ లేనంత సంక్లిష్టంగా ఇప్పుడు జీవితం మారిపోయింది. ఆ రోజుల్లో ఉద్యోగంలో చేరడం అంటే పదవీ విరమణ చేసేంత వరకు ఢోకా ఉండేది కాదు. ఇప్పుడలా కాదు. ఉద్యోగం లభించినా, ఎప్పుడు ఏ మార్పుతో ఏమవుతుందో తెలియదు. మరలాంటప్పుడు నిరంతరం విద్యార్థిగా నేర్చుకోవలసిందే.
ఆర్థిక అంశాలకు సంబంధించి ప్రతి వారికి ఎనిమిది లక్షణాలు తప్పని సరి అంటున్నారు ఆర్థిక రంగ నిపుణులు.
1.నో క్రెడిట్: అప్పు అత్యంత ప్రమాదకరమైన అలవాటు. వచ్చిన జీతాన్ని రెండు వారాల్లోని ఖర్చు చేసి ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ అప్పులు చేసేవాళ్లు మన చుట్టూ కనిపిస్తూనే ఉంటారు. క్రెడిట్ కార్డు, పర్సనల్ లోన్లు, చివరకు సహ ఉద్యోగులు, స్నేహితుల వద్ద చేబదుళ్లు కొందరికి అలవాటు. అప్పు అన్నా, ఇఎంఐ అన్నా భవిష్యత్తులో సంపాదించేదాన్ని ఇప్పుడే ఖర్చు చేయడం. ఒకసారి అప్పుల ఊబిలో చిక్కుకుంటే బయటకు రారు. ఇంటి నిర్మాణం కోసం అప్పు, వ్యాపారం కోసం చేసే అప్పులు వేరు. కేవలం ఖర్చు కోసం అప్పు చేయడం మంచిది కాదు. ఇలాంటి అలవాటు మీకుంటే దాని నుంచి బయటపడిండి.
2.లెక్కలు: ఎంసెట్‌లో లెక్కల్లో టాప్‌లో నిలిచిన వారు కూడా జీవితానికి సంబంధించిన లెక్కల్లో చాలా బలహీనంగా ఉంటారు. నెలకు ఇంట్లో దేనికి ఎంత ఖర్చు అవుతుంది అని లెక్కలు రాసుకోవాలి. ఇలా అన్ని ఖర్చులు లెక్కలు రాస్తే, దేనిపై వృథా అవుతుంది అనేది తెలుస్తుంది.
3.దురలవాట్లు: మనిషిని ఆర్థికంగా దెబ్బతీసేవి ప్రధానంగా దురలవాట్లు. రోజుకు సిగరేట్ల ఖర్చు రోజుకు 50 రూపాయలు అనుకున్నా నెలకు పదిహేను వందలు, ఏడాదికి పద్దెనిమిది వేలు. అదే డబ్బును నెల నెలా మ్యూచువల్ ఫండ్స్‌లో పెట్టుబడి పెట్టినా, చిట్టీ వేసినా చక్రవడ్డీతో కొంత కాలానికి పెద్ద మొత్తం అవుతుంది. అదే సిగరెట్లు అలా తాగుతూనే పోతుంటే కొంత కాలానికి క్యాన్సర్ వంటి రోగాల బారిన పడవచ్చు. ఎక్కువగా టీ తాగడం, మద్యం సేవించడం, హోటల్ తిండి, ఇలా ఏదైనా ఇలాంటి అతి అలవాట్లు ఆర్థికంగా దెబ్బతీస్తాయి.
4.రికార్డ్: వాహనాల బీమా, ఆరోగ్య బీమా, ఎలక్ట్రానిక్ వస్తువుల గ్యారంటీ కార్డు, ఆస్తులకు సంబంధించిన రికార్డు. బ్యాంకు డిపాజిట్లు, మ్యూచువల్ ఫండ్స్, పెట్టుబడులకు సంబంధించి ముఖ్యమైన రికార్డు అన్నీ ఒక ఫైల్‌లో భద్రపరచాలి. అంశాల వారిగా ఈ రికార్డులను ఒకే చోట భద్రపరిస్తే, అవసరానికి ఉపయోగపడతాయి.
5.పొదుపు- పెట్టుబడి: ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే పొదుపు, పెట్టుబడి ఒక అలవాటుగా మారాలి. ఉద్యోగం చేసేవారు కావచ్చు, ఏదైనా వృత్తిలో ఉన్న వారు కావచ్చు. సంపాదన మొదలైన నెల నుంచే పొదుపు- పెట్టుబడి అలవాటుగా మారాలి. పొదుపు చేయడమే కాక దానిని సరైన రీతిలో ఇనె్వస్ట్ చేస్తే, భవిష్యత్తుకు భరోసా ఇస్తుంది. ఇనె్వస్ట్‌మెంట్ అనేది రిటైర్‌కావడానికి ముందు చేసే ఆలోచన కాదు. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే అలవాటు కావాలి. ఉద్యోగంలో చేరిన మొదటి నెల నుంచే ఇనె్వస్ట్ చేయడం వల్ల చిన్నమొత్తంలో ఇనె్వస్ట్ చేసినా అది చక్రవడ్డీ వల్ల భారీ మొత్తం అవుతుంది.
6.ఒకేసారి కొనుగోలు: ఇంటికి అవసరం అయిన వస్తువులను ఒకేసారి నెల మొత్తానికి కొనడం వల్ల పదినుంచి పదిహేను శాతం వరకు తక్కువ ధరకు లభించే అవకాశం ఉంది. ఆ మొత్తాన్ని పొదుపుకిందకు మార్చుకోవచ్చు.
7.ఆరోగ్యంపై దృష్టి: జిమ్‌కు వెళ్లడం కావచ్చు, యోగ, నడక ఏదైనా కావచ్చు. ముందు నుంచే ఆరోగ్యంపై ఇనె్వస్ట్ చేయాలి. ఇప్పుడు నెలకు వెయ్యి రూపాయలు జిమ్‌కు ఖర్చు అవసరమా? అనిపించవచ్చు. కానీ వయసు మీరాక అనారోగ్యంపై చికిత్సకు లక్షల్లో ఖర్చు చేయడం కన్నా ఆరోగ్యంపై ముందుగానే చిన్న మొత్తాల ఖర్చు లాభసాటి నిర్ణయమే అవుతుంది.
8.నిత్య విద్యార్థి:: అన్నింటికన్నా ముఖ్యమైనది నిరంతరం నేర్చుకోవడం. ఇప్పుడు సాంకేతికంగా ప్రపంచం చాలా వేగంగా మారుతోంది. ఉద్యోగంలో చేరేప్పుడు ఉపయోగపడిన సాంకేతిక విద్య కొంత కాలానికి పనికి రాకుండా పోవచ్చు. ఎప్పటికప్పుడు సాంకేతిక నైపుణ్యాన్ని నేర్చుకుని అప్‌డేట్ అయితే పోటీని తట్టుకొని నిలబడగలరు. సాంకేతికంగా అప్‌డేట్ అయితే ఈ కంపెనీ కాకుంటే మరో కంపెనీ అని ఎప్పుడూ సిద్థంగా ఉండవచ్చు. ఒకసారి నేర్చుకున్నాం, ఉద్యోగం వచ్చింది ఇక నేర్చుకోవడం చాలు అంటే కుదిరే కాలం కాదిది. ఈ కాలంలో ప్రతి ఒక్కరూ నిత్య విద్యార్థిగా ఉండాల్సిందే. ఆన్‌లైన్‌లో తక్కువ ఖర్చుతో, ఉచితంగా బోధించే సంస్థలు కూడా ఉన్నాయి. వాటిపై దృష్టిసారించాలి. వృత్తికి సంబంధించి నైపుణ్యాన్ని ఎప్పటికప్పుడు పెంచుకోవాలి.

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం