22, డిసెంబర్ 2011, గురువారం

భగవద్గీత..టెర్రరిజం..గాంధీ..!!.....వేదాలనూ నిషేధించాలి

చందమామపై అడుగుపెట్టి ప్రపంచాన్ని సంభ్రమాశ్చర్యంలో ముంచెత్తిన సోవియట్ రష్యా పతనంతో పరిశోధనలు మందగించాయనిపించింది. కమ్యూనిజం ప్రయోగం విఫలమై, సోవియట్ రష్యా ముక్కచెక్కలైన తరువాత రష్యా, భగవద్గీతపై బాగానే పరిశోధన జరిపినట్టుగా ఉంది. వాళ్ల పరిశోధనల్లో ప్రపంచంలో టెర్రరిజానికి మూలం భగవద్గీత అని తేలిపోయింది. దాన్ని నిషేధించాలని కోర్టు నిర్ణయించేసింది, తీర్పువెలువడడమే తరువాయి. భగవద్గీత మనదే అయినా టెర్రరిజానికి మూలం అదే అని మనం కనిపెట్టలేకపోయాం.


గాంధీజీ మన వాడు అనే విషయం పక్కన పెట్టి నిజాయితీగా ఆలోచిద్దాం. ఆయనలో నిలువెత్తు టెర్రరిస్టు కనిపించడం లేదూ? చొక్కాకు ఒక్క గుండే లేకపోతేనే వాడు చూడు రౌడీలా అని తిట్టుకుంటాం. మరి ఆయన ఏకంగా చొక్కానే లేకుండా కనిపిస్తున్నాడంటే టెర్రరిస్టు కాకుంటే మరేమిటి? పైగా చేతిలో ఒక కర్ర. కర్ర హింసకు నిదర్శనం కాదా? నడుము దగ్గర ఒక వాచీ. ఏ టైంలో టైంబాం బు పేల్చాలో నిర్ధారించుకోవడానికి కాకపోతే ఆ వాచీ ఎందుకు? ఒక చెంపమీద కొడితే మరో చెంప చూపమనడం హింసను ప్రేరేపించడమే? మరో చెంప చూపడం అంటే కొట్టిన వ్యక్తిలో హింసాత్మక ధోరణిని అలా పెంచి పోషించడమే కదా? హింసను ప్రేరేపించే వారు టెర్రరిస్టులే కదా? ఇవి సరిపోవంటారా?


 బాధల్లో ఉన్నప్పుడు తల్లి ఒడిలో సేదతీరినట్టుగా నేను భగవద్గీతతో స్వాంతన పొందుతాను అని స్వయంగా మహాత్ముడే చెప్పుకున్నాడు. బగవద్గీత టెర్రరిజాన్ని పెంచి పోషించే సాహిత్యం కాబట్టి టెర్రిరిస్టు సాహిత్యాన్ని తల్లిగా భావించే వ్యక్తి టెర్రరిస్టు కాకుంటే మరేమవుతారు. ఆసియా దేశాల వారే కాదు చివరకు యూరప్ దేశానికి చెందిన ఎంతో మంది స్వాతంత్య్ర సమర యోధులు మహాత్ముని బోధనలే మాకు ఆదర్శం, ఆయన స్ఫూర్తితోనే మేం మా దేశ స్వాతంత్య్రం కోసం ఉద్యమించామని ప్రకటించారు. అంటే ఆయన ఒక్క దేశానికే పరిమితం అయిన టెర్రరిస్టు కాదు అంతర్జాతీయ టెర్రరిస్టు. నొబెల్ శాంతి బహుమతి కమిటీ వాళ్లు మహాత్మాగాంధీకి నొబెల్ శాంతి అవార్డుకు ఎందుకు ఎంపిక చేయలేదో ఇప్పుడు తెలిసిందా? శాంతి బహుమతిని టెర్రరిస్టుకు ఎలా ఎంపిక చేస్తారు?


మన లౌకిక వాదులు నిజంగా సిగ్గుపడాల్సిన విషయం. మనకు రాని ఆలోచన ఇతరులను వచ్చినప్పుడు మనస్ఫూర్తిగా అభినందించాలి. హిందూ మతాన్ని ఎన్నో విధాలుగా విమర్శించిన మన లౌకిక వాదులకు ఒక్క సారన్నా ఈ ఆలోచన వచ్చిందా? మరి అలా రానందుకు సిగ్గుపడి తీరాలి. రష్యాలో వర్షం పడితే ఇక్కడ గొడుగు పట్టుకోవడం మనకు ఎలాగూ అలవాటే కాబట్టి ఇప్పుడైనా రష్యావాడికి కలిగిన జ్ఞానోదయం నుండి మన వాళ్లు నేర్చుకోవాలి. సోవియట్ యూనియన్ పతనం తరువాత కల్లోల రష్యాలో ఇటీవల హరేరామ హరేకృష్ణ అంటూ కొంత మంది తీవ్రవాదులు, తీవ్రవాద సాహిత్యం భగవద్గీతను చేతపట్టుకుని పట్టపగలు రోడ్లమీద టెర్రరిజం భజన చేస్తున్నారు. బాంబులు పట్టుకొని తిరిగే వారుంటే మనం పెద్దగా ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. ఆ బాంబు పేలితే పక్కనున్న కొద్ది మంది మాత్రమే పోతారు. కానీ అదే భగవద్గీత లాంటి టెర్రరిస్టు సాహిత్యాన్ని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? ప్రజల మెదళ్లలో చేరి అహింస అనే తీవ్రమైన హింసను వ్యాపింపజేస్తుంది.
 బహుశా ఈ ప్రమాదాన్ని మన పాలకులు కూడా గుర్తించినట్టుగా ఉన్నారు. అందుకనే ఎవ్వరూ ఏమీ మాట్లాడటం లేదు.
విస్తృతమైన పరిశోధన చేసి భగవద్గీతలో టెర్రరిజంను కనుగొన్న రష్యాను మనస్ఫూర్తిగా మెచ్చుకుందాం. అదే కోణంతో ఆలోచిస్తే మనకు మహాత్ముడే కాదు ఇంకెంతో మంది తీవ్రవాదులు కనిపిస్తారు. ఆయనెవరో విల్లు విరిచాడు, ఎప్పుడు చూసినా చేతిలో విల్లు పట్టుకుని ఉంటాడు. అదే నండి శ్రీరాముడు. చేతిలో ఆయుధం ఉంది కాబట్టి ఆయనా తీవ్రవాదే కదా? ఏదో రావణాసురుడు ముచ్చటపడి కిడ్నాప్ చేస్తే ఆయన దేశంపై దండెత్తి చంపేయడమేనా? టెర్రరిజానికి ఇంత కన్నా నిదర్శనం ఏం కావాలి. ఇంకొక దేవుడు శ్రీకృష్ణుడు చేతిలో చక్రంతో తప్ప విడిగా కనిపించడు. ఆ చక్రానికి లైసెన్స్ ఉందా? ఆ చక్రంతో ఆయన చంపిన వారు ఎంత మంది? దేవుళ్ల సంగతి పక్కన పెడదాం ఆ తరువాత వచ్చిన బుద్ధుడి సంగతి రష్యా మెదడుతో 



జాగ్రత్తగా ఆలోచిస్తే బుద్ధుడిలోనూ అంతర్జాతీయ టెర్రరిస్టు కనిపిస్తున్నాడు. బౌద్ధమతాన్ని ప్రపంచంలో అనేక దేశీయులు ఆచరిస్తున్నారు. అంటే యుద్ధం వద్దని శాంతిని బోధించడం అంటే దాని వెనుక పెద్ద టెర్రరిజం కుట్ర ఉంది. బౌద్ధమతాన్ని ఆచరించిన వారు శాంతియుతంగా ఉంటారు, దాంతో ఇతర దేశం దాడి చేసి స్వాధీనం చేసుకుంటుంది. రక్తపాతం లేకుండా లొంగదీసుకోవడం అన్నమాట! కాబట్టి చైనా, జపాన్‌లకు ఓ మాట చెప్పి బౌద్ధమతాన్ని కూడా టెర్రరిస్టు జాబితాలో చేర్చే విషయం రష్యా సీరియస్‌గా ఆలోచించాలి. అసలు హిందూ మతమే టెర్రరిజంగా కనిపిస్తోంది. ఇక వేదాలను కూడా ఓ చూపు చూడు రష్యా!

19 కామెంట్‌లు:

  1. మీరు సూపర్ అండి ....మీ టైపు లో బాగా విమర్శించారు ....మన భారతీయ గ్రంధాన్ని నిషేదించడానికి వాళ్ళెవరు ? తల్లి కి చెల్లి కి తేడ తెలియని ఎర్ర తోలు ఎదవలు ......ఏదేమైనా ఇరోజు భగవత్గీత రేపు వేదాలు తరువాతా మరోటి మరోటి ...we should raise our voice strongly....

    రిప్లయితొలగించండి
  2. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  3. ఫణింద్ర గారు కామెంట్ చేసినందుకు థాంక్స్ .. శీర్షిక మాత్రమే కాకుండా వ్యాసం చదివి కామెంట్ చేస్తే మరింత సంతోషం

    రిప్లయితొలగించండి
  4. raf raafsun garu థాంక్స్ .. అన్ని మతాలను గౌరవించాలి .. ఒక మత గ్రంధాన్ని రద్దు చేయాలనీ మరో మతం వారు కోరడం ... దానిక మనవారి నుండి స్పందన లేకపోవడం బాధా కరం

    రిప్లయితొలగించండి
  5. ఈ కామెంట్‌ను రచయిత తీసివేశారు.

    రిప్లయితొలగించండి
  6. మహా మేధావి గారికి థాంక్స్ ... వ్యంగ్యం అని ఒకటి ఉంటుంది . ఒక విషయాన్ని నేరుగా చెప్పడం ఒక పద్దతి వ్యంగ్యం ద్వారా చెప్పడం ఒక పద్దతి .

    రిప్లయితొలగించండి
  7. మొదటిది నేను మేధావిని కాదు.
    రెండు వ్యంగ్యం చివర ఉంటుంది, కానీ మీ వ్యంగ్యం మీకే తిప్పి కొట్టింది.

    కానీ అదే భగవద్గీత లాంటి టెర్రరిస్టు సాహిత్యాన్ని అలా వదిలేస్తే ఇంకేమైనా ఉందా? ప్రజల మెదళ్లలో చేరి అహింస అనే తీవ్రమైన హింసను వ్యాపింపజేస్తుంది.

    అసలు హిందూ మతమే టెర్రరిజంగా కనిపిస్తోంది. ఇక వేదాలను కూడా ఓ చూపు చూడు రష్యా!

    ఈ రెండూ నాకు మీ భావం మరచి పోయేటట్టు చేసాయి.

    రిప్లయితొలగించండి
  8. ఇంకో విషయం వేదాలను అంతం చెయ్యరు ఎందుకంటే వేదాలే వాళ్ళ జీవనానికి ఆధారాలు.

    రిప్లయితొలగించండి
  9. మనకి భగవద్గీత ఆదర్శం కనుక మనం చదువుతాము. రష్యా వాళ్ళు బలవంతంగా ఎందుకు చదవాలి ??

    ఇండియా లో భగవద్గీత మానేసి బైబిల్ చదవమని అన్నట్లుగా ఫీలవుతున్నారు ఎందుకు ? హిందువులలో ఆలోచనా శక్తి తగ్గిపోతుందనడానికి ఇదొక మంచి ఉదాహరణ.

    రిప్లయితొలగించండి
  10. నిహారిక గారు రష్యా వారిని భగవద్ గీత చదవమని ఎవరూ బ్రతిమాలడం లేదు వత్తిడి తేవడం లేదు . ఉచితంగా పంపిణి చేయడం లేదు . ఇక్కడ వివాదం వేరు . గీత తీవ్రవాదాన్ని ప్రేరేపిస్తోందని నిషేదించాలని వాళ్ళు కోర్టుకు vellaru . విషయం అది ...ఆలోచన శక్తి తగ్గిపోవడం పై మీ అభిప్రాయం మీ ఇష్టం

    రిప్లయితొలగించండి
  11. అది వాళ్ళ దేశం వాళ్ళిష్టం మనకు ఏమిటి బాధ ??
    మనదేశం లో అయితే మనం అడగొచ్చు !! నిజంగా బి జె పి కి పనిలేక ఈ గొడవ మొదలుపెట్టిందేమో ???

    రిప్లయితొలగించండి
  12. ఈ విషయం గురించి విశదీకరించవలసివున్నది.రష్యాలొ ఒకప్రాంతం సైబీరియాలొ ఒక కోర్టులో చర్చి అధికార్లు ఈ కేసు పెట్టారు.బహుశా ISKCON ప్రభావం ప్రజల్లో వ్యాపిస్తూ ఉండడం వలన వాళ్ళు ఆపని చేసి ఉండొచ్చు.అంతమాత్రం చేత రష్యన్ ప్రజలు ,ప్రభుత్వం మన దేశానికి, మతానికి వ్యతిరేకం అనుకో కూడదు.రష్యాలో మతస్వాతంత్రం ఉంది.వారిది కూడా సెకులర్ రాజ్యాంగం.కోర్టు తీర్పు ఇంకా రాలేదు.అప్పీలు కోర్టులు కూడ ఉన్నాయి. ఈలోగా మన ప్రభుత్వం రష్యన్ ప్రభుత్వనికి నిరసన తెలిపింది.మనదేశంలో రష్యన్ రాయబారి ,మన విదేశాంగ మంత్రి చర్య తీసుకొంటామని ప్రకటించారు.కంగారుపడక వేచుచూద్దాము.ఏ గ్రంధాన్ని నిషేధించడం కూడదు.దాని మీద పాఠకులు చదివి స్వంత అభిప్రాయాలు ఏర్పరుచుకొనే స్వేచ్చ ఉండాలి.మనదేశంలో కూడా హేతువాదులు, వామపక్ష అభి మానులు భగవద్గీతను విమర్శిస్తారు.కాని విమర్శించడం వేరు,నిషేధించడం వేరు.ఈలోగా మన నిరసనలను ప్రజలు.ప్రభుత్వం ,రష్యా ప్రభుత్వానికి,ప్రజలకు గట్టిగా తెలియజేయాలి.

    రిప్లయితొలగించండి
  13. బాగుంది. అలా అనుకుంటే ప్రతి మనిషి కూడా టెర్రరిష్టే. ఎందుకంటే వాడు బతకటానికి ఇతర జీవుల్ని చంపి తింటున్నాడుగా? జంతువుల్ని మరియు చెట్లు, మొక్కల్ని. దేన్నీ చంపకుడా మనషి బతికేలా చెయ్యమని కోర్టులో వాదిస్తే సరి...తిండి మానేసి జడ్జి తీర్పు ఇస్తాడు..

    బురదలో తిరిగే పందికి గంథము వాసన నచ్చదట. వాళ్ళూ అంతే. కలి ప్రభావము. మేము వెధవలము అని వాళ్ళని వాళ్ళు నిరూపించుకుంటున్నారు.

    ఖురాన్నో, బైబిల్ నో ఎవరైనా అలా చెస్తే ఈపాటికి ఎన్ని గొడవలు జరిగివుండేవో! మనదగ్గర వున్న జబ్బు ఏమిటంటే మన పవిత్ర గంథాలని ఎవరైనా ఎమైనా అంటే వాళ్ళిష్టం తిట్టుకోనివ్వండి అంటారు. అలా మన చాతకాని తనాన్ని మనం ఎత్తి చూపుకుంటాం... అబ్బ ఎంత గొప్పవాళ్ళం మనం... సిగ్గుతో తలదించుకోవాలి.

    రిప్లయితొలగించండి
  14. MURALI GAARU....EXCELLENT gaa PRSENT chesaaru...

    ikkada kondaru mitrula ku MATTER lo vunna seriousness ardham kaaledu anukunta.......

    రిప్లయితొలగించండి
  15. http://endukoemo.blogspot.com/2011/12/non-terrerism-non-githaism.html

    Pleas treat the above link info as my comment.

    After Reading your post I just written & posted that.

    thanks
    ?!

    రిప్లయితొలగించండి
  16. better late than never :)

    నిషేదము, భగవత్ గీతా అను పదములను జోడించుట వలన జనించిన తీవ్రవాదము

    http://endukoemo.blogspot.com/2011/12/non-terrerism-non-githaism.html


    ?!

    రిప్లయితొలగించండి
  17. ఇంత మంది మాట్లాడుతున్నారు కాస్తంత విలువను ఇస్తున్నందులకు సంతోషం,
    గీత అద్దం వంటిది ఎలా చూస్తే అలా కనిపిస్తుంది
    వెయ్య కాదు కోటి రకాలుగా వ్యాఖ్యానాలు వ్రాయొచ్చు

    http://endukoemo.blogspot.com/2011/12/non-terrerism-non-githaism.html

    ?!

    రిప్లయితొలగించండి
  18. స్పందించి నందుకు థాంక్స్ కమనీయం గారు వీలుంటే ఈ క్రింది లింక్ చూడండి .

    ‘గీత’కు వాతా?!

    http://www.andhrabhoomi.net/weakpoint/-913

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం