24, ఏప్రిల్ 2013, బుధవారం

ఫేస్‌బుక్ నమో...నమో...!

‘‘ఏమ్మా వాడు లేడా? అని మిత్రులు అడిగితే, తన గదిలో కంప్యూటర్ ముందు కూర్చున్నారు. ఆయన ఎక్కువగా బయటకు రారు అని సురేష్ భార్య చెప్పింది.

 ‘‘అస్సలు క్లాస్‌లో కూర్చునే వాడు కాదూ. అల్లరి చిల్లరగా తిరిగే వాడు. మహానగరంలో కుదురుగా ఉన్నాడంటే చాలా సంతోషంగా ఉంద మ్మా!’’ అంటూ మిత్రులు లోనికి అడుగుపెట్టారు. 

పెద్దింటి కోడలు సీరియల్‌లో పూర్తిగా లీనమై పోయిన ఆమెకు వీరి రాక ఏ మాత్రం సంతోషం కలిగించలేదు. హీరోను చెంప దెబ్బ కొట్టడానికి హీరోయిన్ చెయ్యి పైకి లేపింది. రెండు వారాలైనా ఆ చేయ్యి హీరో చెంపపై పడుతుందా? లేదా? అనేది తేలలేదు. సస్పెన్స్‌కు ఈరోజు తెర పడుతుందని ఆమెకు విశ్వసనీయ వర్గాల నుంచి బోగట్టా అందింది. ఆమె కంగారుగా టీవి ముందుకు పరిగెత్తింది. అపురూపమైన ఆ దృశ్యాన్ని చూసేందుకు.


‘‘ఏరా ఫ్రెండ్స్ అంత దూరం నుంచి ఎండలో పడొస్తే, ఆ కంప్యూటర్‌కు అతుక్కుపోయావేంటి?’’ అని వినయ్ విసుక్కున్నాడు.
‘‘ఒక్క నిమిషం ఆగండిరా! ఫేస్‌బుక్ చూస్తున్నాను’’ అంటూ సురేష్ కొద్ది సేపటి తరువాత ముఖం ఇటు తిప్పి, ఎలా ఉన్నారని అడిగాడు.
వాళ్లు సొంత గ్రామంలో ప్రభుత్వ టీచర్లుగా ఉన్నారు.‘‘గ్రామంలో టీచర్ ఉద్యోగం, వ్యవసాయం అంటే బావిలో కప్ప లాంటి జీవితం. గ్రామాన్ని వదలండిరా! చైతన్యం కండి’’ అని సురేష్ హితబోధ మొదలు పెట్టాడు.
మన దగ్గర కాపీ కొట్టి బొటాబొటి మార్కులతో టెన్త్ పాసైన సురేష్ గాడేనా ఇలా మాట్లాడేది.. బాగా ఎదిగిపోయావురా! అని మిత్రులు అభినందించారు. అది సరే ఇంతకూ మహానగరంలో ఏం చేస్తున్నావురా! అని మిత్రులు అడిగారు.


ప్రజలను చైతన్య పరచే పనిలో బిజీగా ఉన్నాను. ఇప్పుడు నేను ఫేస్ బుక్ వ్రతం చేస్తున్నాను . అత్యదిక సందేశాలు పోస్ట్ చేసిన వ్యక్తిగా రికార్డ్ సృష్టిస్తా  అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు. అర్ధం కాలేదు అన్నట్టుగా మిత్రులు ఆయోమయంగా ముఖం పెట్టారు. ఢిల్లీలో అత్యాచారం జరిగిన సంగతి తెలుసు కదా? అని అడిగాడు.


తెలుసు? అది నువ్వే చేశావా? ఏంటి? అని మిత్రులు జోకారు.
ఇలాంటి సంఘటనలు జరిగినప్పుడు మీరేమో మీ పాఠాలు మీరు చెప్పుకుంటూ వ్యవసాయానికి వెళ్లిపోతారు. కానీ నేను అలా కాదు ప్రజలను చైతన్య పరచడానికి ఫెస్‌బుక్‌లో అద్భుమైన సందేశాలు ఇస్తుంటాను. అలాంటి సందేశాల వల్లనే కదా? క్యాండిల్స్ పట్టుకుని ర్యాలీలు తీసేది’’ అని సురేష్ చెప్పుకుపోతుంటే ..


 తెలిసింది లేరా! క్యాండిల్స్ అమ్మే వ్యాపారం మొదలు పెట్టావు. బాగానే గిట్టుబాటు అవుతున్నట్టుగా ఉంది కదా! ఎక్కడ చూసినా క్యాండిల్స్ ర్యాలీలు కనిపిస్తున్నాయి’’ అని మిత్రులు చెప్పా రు.


చీ...చీ... నేను క్యాండిల్స్ అమ్మడం ఏమిటి?
ఇదిగో ఫేస్‌బుక్‌లో సందేశాలు ఎంత అద్భుతంగా ఉంటాయో చూడండి అంటూ ఫేస్‌బుక్ పోస్టులన్నీ చూపించాడు.
అవన్నీ చదివాక మిత్రుల తల వెనుక సినిమాల్లో మాదిరిగా జ్ఞానజ్యోతి వెలుగుతున్నట్టు అనిపించింది సురేష్‌కు.


ఓటు వజ్రాయుధం. ఎన్నికల్లో ఆ వజ్రాయుధాన్ని ఉపయోగించండి. అవినీతి పరులను పారద్రోలండి. అంటూ పలు సందేశాలు అక్కడ కనిపించాయి.
ఇదంతా ప్రజలను చైతన్య పరచడమన్నమాట! అని చెప్పాడు.


అరే అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉన్నాడు అంటూ ఒక ఫోటో వద్ద మిత్రులు చూపును నిలిపారు. సల్మాన్ ఖాన్ కాదు నేనే అని సురేష్ నవ్వాడు. నువ్వెక్కడ సల్మాన్‌ఖాన్ ఎక్కడ అని మిత్రులు విస్తుపోయారు. మరదే నాది ఫోటో జెనిక్ ఫేస్.. ఫోటో తీసి ఫేస్‌బుక్‌లో అప్‌లోడ్ చేస్తే నేను అచ్చం సల్మాన్‌ఖాన్‌లానే ఉంటాను. నువ్వే కాదు  సల్మాన్ ఖాన్ ఈ ఫోటో చూసినా తనదే అనుకుంటాడు  కావాలంటే నన్ను ఫ్రెండ్స్‌గా యాడ్ చేసుకున్న వీరందరినీ అడగండి అని సురేష్ చెప్పాడు. మీకో రహస్యం చెప్పనా! మన క్లాస్‌మెట్ పంకజాక్షి కూడా నా ప్రెండ్ సర్కిల్‌లో ఉంది అని చూపించాడు. 

ఏరా మేం మరీ అంత అమాయకుళ్లా కనిపిస్తున్నామా? చీమిడి ముక్కుతో, బక్కగా, టిబి పేషెంట్‌లా ఉండే పంకజాక్షి మాకు తెలియదనుకున్నావా? రాణిముఖర్జీ ఫోటో చూపించి పంకజాక్షి అంటావేమిటి? అని నిలదీశారు. అదే మీకు తెలియదు ఫేస్‌బుక్ ఫోటో అలానే ఉంటుంది. ఇంకా నయం ఒక్కోసారి ఫేస్‌బుక్‌లో మగవారు అకౌంట్ ఓపెన్ చేస్తే ఆడవారిలా ఫోటో వస్తుంది తెలుసా? అని సురేష్ అడిగాడు.


ఆ మధ్య పత్రికల్లో వచ్చింది ఒక మరుగుజ్జు వాడు ఫేస్‌బుక్‌లో అందమైన అమ్మాయికి చా టింగ్‌లో కబుర్లు చెప్పి ప్రేమ పేరుతో డబ్బులు గుంజాడని తీరా చూస్తే వాడు మరుగుజ్జు కావడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసినట్టు వార్త చదివాను అని వినయ్, ముఖేష్ అమాయకంగా అడిగారు. అది వాడి తప్పు కాదు ఫేస్‌బుక్ ధర్మం. ఆ ఫిలాసఫీని ఆమె సరిగా అర్ధం చేసుకోక మోసపోయాననుకుంది. అని సురేష్ సీరియస్‌గా చెప్పాడు.
‘‘ఫేస్‌బుక్ జ్ఞానం ప్రకారం ఈ ఎన్నికల్లో ఆమ్‌ఆద్మీ పార్టీ అధ్యక్షుడు కెజ్రీవాల్ ప్రధాని అవుతారు. ఫేస్‌బుక్‌లో రాహుల్‌కు ఆరు శాతం మంది ఓటు వేస్తే, కెజ్రీవాల్‌కు 94 శాతం మంది వేశారు.


మిత్రులకు కోపం ఆగలేదు చాల్లేరా ‘‘
జైపూర్‌లో ప్రమాదంలో తల్లి మరణించింది, తండ్రీకొడుకులు రక్షించమని మొత్తుకున్నా ఒక్కడూ స్పందించలేదు... అది మేమూ చూశాము టివిలలో 
తెనాలిలో ఒక్కడు స్పందించినా మా అమ్మ బతికేది...’’ అంటూ మరో అమ్మాయి చెప్పిన మాటలు మనలోని మానవత్వపు నటన చెంపను చెళ్లు మనిపించాయి కదా! మన జీవితాన్ని, మానవత్వాన్ని కంప్యూటర్‌కే పరిమితం చేస్తున్నాం. మానవత్వం ఫేస్‌బుక్‌లో కాదు మన ఫేస్‌లో ఉండాలి. వీడింతే అని మిత్రులిద్దరు వెనుదిరిగారు.

17 కామెంట్‌లు:

  1. బాగుందండీ. నాకూ ఫేస్ బుక్ లో అకౌంట్ ఉన్నాది కానీ దానిని సరిగా చూడను. దాని వల్ల మంచి జరిగే అవకాశం ఎక్కువగానే ఉంది కానీ సద్వినియోగం కావడం లేదేమో నని నాఅనుమానం. ఇది నా అనుమానం మాత్రమే.

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. పంతుల గోపాల కృష్ణారావు
      .. ధన్యవాదాలు నా ఉద్దేశం కుడా అదేనండి ... చాలామంది ఎన్నో విషయాలు పంచుకుంటున్నారు అదే సమయం లో కొంత అతి పోకడలు కుడా ఉన్నాయి .. అందమైన పోటోకు ఆకర్షితులు కాగానే తనది అద్భుతమైన కవిత్వం అని బ్రమ పడుతున్న వారు, ఓటు వజ్రాయుధం, అణ్వా యుధం అంటూ భుజాన చైతన్య సంచులు మోస్తూ తిరిగే వారు .కుడా ఫేస్ బుక్ లో అక్కడక్కడ కనిపించారు

      తొలగించండి
  2. "మానవత్వం ఫేస్‌బుక్‌లో కాదు మన ఫేస్‌లో ఉండాలి."

    WELL SAID...

    రిప్లయితొలగించండి
  3. బ్లాగులు తప్పించి గూగుల్ ప్లస్,ఫేస్ బుక్,ట్విటర్ మొదలైన వాటి గురించి పెద్దగా అవగాహనే లేదు. అందువలన మీరు రాసిన ఈ టపా చదివితే చాలా సరదాగా అనిపించింది.
    ఈ మధ్య మీరు చాలా చాలా బాగా రాస్తున్నారు. ముఖ్యంగా తెలంగాణ పై కేంద్ర ప్రభుత్వ,రాష్ట్ర రాజకీయపార్టిల వైఖరిని సురభినాటకాలతో పోలుస్తూ రాసిన టపా చాలా బాగుంది.

    రిప్లయితొలగించండి
  4. ug శ్రీరామ్ గారు ధన్యవాదాలు . నేను పేస్ బుక్, గూగుల్+ బ్లాగ్స్ అన్ని చుస్థను. దేని మీదా వ్యతిరేకత లెదు. వితన్నిన్తిలో ఎన్నో చదివిచే విషయాలు ఉన్నయి. కొన్ని విషయాలు పత్రికల్లో రావు అలాంటి వాటిని సైతం వీటిలో చూడగలం కాని కొన్నింటి పై .... సరదాగానే

    రిప్లయితొలగించండి
  5. మానవత్వం ఫేస్‌బుక్‌లో కాదు మన ఫేస్‌లో ఉండాలి. వీడింతే అని మిత్రులిద్దరు వెనుదిరిగారు.
    totally agree...

    రిప్లయితొలగించండి
  6. ఉదయాన్నే పేపర్ లో చదివినట్లున్నానండి,..బాగుంది,..ఫేస్ బుక్ మీద మరంత అవగాహనతో రాస్తే బావుండు అనిపించింది,..

    రిప్లయితొలగించండి
    రిప్లయిలు
    1. ట్రీ గారు తప్పకుండా
      మరుగుజ్జ వాడు అమ్మాయిని దొంగ పోటోతో ప్రేమించి మోసం చేయడం,
      దొంగ ఫోటోలు, దొంగ కబుర్లు, గురించి, రాహుల్కు ఫేస్ బుక్ లో 6 % ఓట్లు, అం ఆద్మీ కేజ్రివాల్ కు 94 % ఓట్లు తదితర అంశాలు నేను ప్రస్తావించిన వాటిలో ఏమైనా తప్పులు ఉన్నాయా

      తొలగించండి
  7. ఫేస్ బుక్ ట్రెండ్‌ని కరెక్ట్‌గా క్యాచ్ చేశారు!

    రిప్లయితొలగించండి

మీ అభిప్రాయానికి స్వాగతం