‘‘అపూర్వసహోదరుల్లా ఎప్పుడు చూసినా ఇద్దరూ కలిసే ఉండేవారు అదేంటి ఈ రోజు చిత్రంగా ఒకే చోట ఇద్దరు ఒకరికొకరు దూరంగా కూర్చున్నారు’’
‘‘నువ్వు నాతో మాట్లాడాలనుకుంటే మాట్లాడు. లేదంటే వాడి దగ్గరకు పో.. అంతే కానీ ఆ దేశ ద్రోహి గురించి నన్ను అడగొద్దు. వాడి పేరు వినాలంటేనే నాకు చిరాగ్గా ఉంది. ఇలాంటి దేశ ద్రోహులు ఈ భూమి మీద ఎందుకుంటారో? నేను దేన్నయినా భరించగలను కానీ దేశ భక్తి లేనోడ్ని భరించలేను’’
‘‘ఏం జరిగింది నాకు నిజంగా తెలియదు. వాడేమైనా కాశ్మీర్‌లో పాకిస్తాన్ జెండాలు ఎగర వేశాడా? ’’
‘‘అది కామన్ కాశ్మీర్‌లో ఎప్పుడూ పాకిస్తాన్ జెండాలు ఎగురుతూనే ఉంటాయి. అందులో నాకేమీ పెద్ద తప్పు కూడా కనిపించలేదు’’
‘‘కొంపదీసి ఐఎస్‌ఐ ఏజెంటా ? ’’
‘‘దేశంలో ఐఎస్‌ఐ ఏజెంట్లకు కొదవుందా? జనాభా లెక్కల సేకరణలా కొన్ని ప్రాంతాల్లో ఐఎస్‌ఐ ఏజెంట్ల లెక్కలు సేకరించాల్సిన పరిస్థితి ఉంది.’’
‘‘అంటే ఇస్లామిక్ దేశం కోసం కొట్లాడుతున్నారు కదా వీడు కూడా అందులో చేరిపోయాడా? ఏమిటి? అలా అయితే ఇలాంటి వారిని అస్సలు క్షమించవద్దు’’
‘‘ఎవరి సిద్ధాంతాలు వారివి ఇస్లామిక్ దేశం కోసం పోరాడితే అది వారిష్టం. మనకేం? ’’
‘‘లాడెన్ బృందం అమెరికా టవర్స్‌ను కూల్చినట్టు వీడేమైనా కూల్చాలని ప్లాన్ వేస్తున్నాడా? పార్లమెంటుపై దాడి చేయాలనుకుంటున్నాడా? అయితే ఇప్పుడు చెప్పు నిజమైన దేశభక్తుల్లా మనం వీడి సంగతి పోలీసులకు చెప్పాల్సిందే’’
‘‘అది కాదులే... ఎవరి సిద్ధాంతాలు వారివి వారి సిద్ధాంతాల ప్రచారం కోసం టవర్స్‌ను కూలుస్తుంటారు. పార్లమెంటుపై దాడి చేస్తుంటారు. దానికి మనమెలా తప్పు పడతాం. చెప్పాను కదా ఆ దేశ ద్రోహి గురించి నాలాంటి దేశ భక్తులు మాట్లాడడం తప్పు’’
‘‘మరి? ’’
‘‘ఆ ద్రోహి గురించి తప్ప ఇంకేమైనా మాట్లాడు వింటాను, అడుగు చెబుతాను’’
‘‘వాడి గురించి వదిలేద్దాం. నీ గురించి చెప్పు. నీలో ఇంత దేశభక్తి ఉందని ఎప్పుడూ అనుకోలేదు. పనికి రాని విషయాల గురించే తప్ప దేశం గురించి నువ్వు ఆలోచిస్తావని అస్సలు అనుకోలేదు. ఏంటీ సైన్యంలో చేరుతున్నావా? ఏంటి? ’’
‘‘ ఓయ్ ఏం మాట్లాడుతున్నావ్? నేను సైన్యంలో చేరడమేంటి ? నీకెలా కనిపిస్తున్నాను. అమలాపురం ‘దేశం’ ఎంపి మొన్న సైన్యం గురించి ఏమన్నాడో తెలియదా? ఉచితంగా మద్యం, మాంసం దొరుకుతుందనే సైన్యంలోకి వెళతారని చెప్పాడా? లేదా? మా బాబాయ్‌కే మందు షాపుంది. సైన్యంలో చేరాల్సిన అవసరం నాకేముంది? ’’
‘‘మొన్నటి దాకా నీ ప్రాణమిత్రుడిగా ఉన్నాడేమో ఇప్పుడు దేశ ద్రోహి అంటావు. సైన్యం అంటే ఇంత చిన్న చూపున్నోడివి నువ్వు దేశ భక్తుడివేంటిరాబాబూ’’
‘‘అంటే సైన్యం గొప్పతనాన్ని అంగీకరిస్తేనే దేశభక్తి ఉన్నట్టా? దేశభక్తికి ఇంకేమీ కొలమానాలు లేవా? ’’
‘‘నాకు తెలిసింది అంతే కాబట్టి అలా అన్నాను. నీ దృష్టిలో దేశభక్తి అంటే ఏమిటో చెప్పు వింటాను. ’’
‘‘ నేను 15 ఆగస్టు రోజున బార్‌కు వెళ్లి దేశభక్తితోనే మందు కొడతాను. నా షర్ట్ జేబుకు త్రివర్ణ పతాకం స్టిక్కర్ ఉంటుంది. చివరకు అక్కడ బేరర్లు కూడా త్రివర్ణ పతాకం స్టిక్కర్లు ధరించే మందు సర్వ్ చేస్తారు. కావాలంటే ఇంటికి రా ఫోటో చూపిస్తాను. ఇది కాదా దేశభక్తి ’’
‘‘సరే ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటి? నీలాంటి దేశభక్తుడి కోపానికి కారణం ఏమిటి? అది చెప్పు ?’’
‘‘సినిమాలపై నీ అభిప్రాయం’’
‘‘ నేను సినిమాలు చూడడం తక్కువే కానీ ఇప్పటికే అదే పెద్ద వినోద సాధనం అని నమ్ముతాను. దేశ ద్రోహి గురించి చెప్పమంటే హఠాత్తుగా సినిమాల్లోకి వచ్చావు’’
‘‘ ముందు నేను అడిగిన దానికి సమాధానం చెప్పు. తరువాత నీ ప్రశ్నకు సమాధానం చెబుతాను. గర్వంగా చెప్పుకునే సినిమా పేరు చెప్పు’’
‘‘ ఒకటెందుకు.. చాలా సినిమాలు ఉన్నాయి. నర్తనశాలలో ఎస్వీఆర్ నటనకు తాష్కెంట్‌లో సైతం జనం జేజేలు పలికారు. నిండైన విగ్రహంతో ఎస్వీఆర్ నటన నభూతో న భవిష్యత్తు. దేవదాసులో అక్కినేని జీవించేశారు. లవకుశలో ఎన్టీఆర్, అంజలి పూజలందుకున్నారు. దానవీర శూరకర్ణలో ఎన్టీఆర్ డైలాగులతో అదరగొట్టారు. ఎన్టీఆర్, కాంతారావు, రాజనాల అబ్బో ఒకటా రెండు ఒక్కో జానపద సినిమా ఒక్కో కళాఖండం కదా? ఇప్పుడు చూసినా ఊహాలోకంలోకి వెళ్లిపోతాం.’’
‘‘ అవి కాదు’’
‘‘అలా అంటావా? శంకరాభరణంను మించిన సినిమా ఏముంటుంది? ఆ సినిమా విడుదలయ్యాక తల్లిదండ్రులు తమ పిల్లలకు సంగీతమో, నాట్యమో నేర్పించడానికి ముందుకొచ్చారు. ఇప్పుడు నాట్యప్రదర్శనలు ఇస్తున్నారంటే, పాటలు పాడుతున్నారంటే ఆ సినిమా సమాజంపై చూపిన ప్రభావమే కారణం. ’’
‘‘మరీ శంకర శాస్ర్తీలా ఉపన్యాసాలివ్వకు... అలాంటి సినిమాల పేర్లు వినడం కూడా నాకు పెద్దగా ఇష్టం ఉండదు. ’’
‘‘ దేశం గర్వించదగ్గ సినిమా పేరు చెప్పు ’’
‘‘ షోలేను మించిన సినిమా రాలేదు. దశాబ్దాల తరబడి ముంబైలో నడిచిన సినిమా ’’
‘‘మీరింకా అప్‌డెట్ కావాలి లేదంటే నిన్ను కూడా దేశ ద్రోహుల జాబితాలో కలిపేస్తాను ’’
‘‘సర్లే సినిమాల సంగతి వదిలేయ్ ఇంతకూ వాడు చేసిన దేశ ద్రోహం ఏమిటో, నీ దేశభక్తి ఏమిటో చెబితే వినాలని ఉంది’’
‘‘ ప్రైడ్ ఆఫ్ ఇండియా సినిమాను వాడింత వరకు చూడలేదట! చూసే ఉద్దేశం కూడా లేదట. ప్రపంచంలో భారత దేశ కీర్తిపతాకాన్ని ఎగురవేసిన బాహుబలి సినిమాను చూసే టైమ్ లేదంటున్నాడు. మొదటి రోజు మొదటి ఆట చూసిన నాలాంటి దేశ భక్తుడు అలాంటి దేశ ద్రోహికి దూరంగా ఉండాలనుకోవడం తప్పా? ’’‘‘వాడే కాదు బాహుబలి చూడని నువ్వు, చూసి విమర్శించే వాళ్లు, పైరసీ సీడిల్లో చూసే వాళ్లు కూడా దేశ ద్రోహులే. మీలాంటి వారిని శిక్షించేలా తక్షణం చట్టాలను తేవాలి. పార్లమెంటుకు ఇంతకు మించిన పని ఏముంటుంది?. ఈ చట్టం తేకపోతే పార్లమెంట్ కూడా దేశ ద్రోహే. ఈ వర్షా కాల సమావేశాల్లో పార్లమెంట్ తన దేశ భక్తి నిరూపించు కొంటుందా ?దేశ ద్రోహిగా ముద్ర వేసుకుంటుందా ?చూడాలి . ఇది పార్లమెంట్ కు పరీక్షా సమయం ’’
ఆ ????

కామెంట్‌లు లేవు:
కామెంట్‌ను పోస్ట్ చేయండి
మీ అభిప్రాయానికి స్వాగతం