‘‘రండి.. అన్నయ్య గారూ రండి.. భోజనాల సమయానికి వచ్చారు. భోజనం చేసి వెళ్లండి’’
‘‘వద్దులేమ్మా ఉదయం ఇంట్లోంటి బయటకు వచ్చేప్పుడే కడుపునిండా తినే వ చ్చాను’’
‘‘అదేంటోయ్ చెల్లెమ్మ ఇప్పుడే ఫోన్ చేసి చేసింది. కనీసం పచ్చి మంచి నీళ్లు కూడా ముట్టకుండా ఉదయమే రోడ్డున పడ్డావని చెప్పింది.’’
‘‘అలా చెప్పి తగలడిందా? అదంతేలేవోయ్.. నేను బకాసురుడిలా రోజుకు నాలుగైదు సార్లు తింటాను అనుకుంటుంది. నీమీదొట్టు.. తినే వచ్చాను’’
‘‘ఒట్టు నా మీదెందుకులే? ’’
‘‘భోజనం చేయక పోతే వేడివేడి ఎగ్ ఆమ్లేట్ వేస్తాను తినండి అన్నయ్య గారూ...’’
‘‘అయ్యో.. నీకీ విషయం ఇప్పటి వరకు తెలియదా? నేను గండర గండ స్వామి దీక్ష పట్టాను. ఈ దీక్షలో ఉన్న వాళ్లు గుడ్డును దూరం నుంచి కూడా చూడకూడదు. ’’
‘‘మనిషి మాంసం తప్ప అన్నీ తింటావు అంటారు.. నీ గురించి తెలిసిన వాళ్లు.. అదేంటిరా.. గుడ్డు కూడా తినకుండా ఎలా ఉంటావు?’’
‘‘మంచి నీళ్లయినా తాగుతావా? ఇదిగో ప్లాస్టిక్..’’
‘‘ఏంటీ.. ప్లాస్టిక్ నీళ్లు కూడా వచ్చేశాయా? ’’
‘‘నీ భయం పాడుగానూ.. ప్లాస్టిక్ బాటిల్‌లో నీళ్లు అని పూర్తిగా చెప్పక ముందే అలా ఉలిక్కి పడుతున్నావ్. ప్లాస్టిక్ గుడ్లు వచ్చాయనే భయమే కదా.. ఏదీ ముట్టడం లేదు’’

‘‘ప్లాస్టిక్ సర్జరీ నిజం అయినప్పుడు ప్లాస్టిక్ బియ్యం నిజం ఎందుకు కాదు?’’
‘‘వెనకటికొకడు దేవుడ్ని ప్రార్థించి తాను ఏది ముట్టుకున్నా బంగారం కావాలని వరం కోరుకున్నాడు. దాంతో వాడు ఏది ముట్టుకున్నా బంగారం అయింది. చివరకు తిందామని అన్నాన్ని ముట్టుకున్నా, తాగుదామని మంచినీళ్లు ముట్టుకున్నా బంగారం అయింది. దేవుడు వరాలు ఇస్తాడు కానీ తీసుకోడు కదా? ఈ వరం నాకు వద్దు దేవుడా? అని ఎంత మొత్తుకున్నా లాభం లేకపోయింది. అన్నం, నీళ్లు లేక బంగారంతోనే కన్ను మూశాడు’’
‘‘నువ్వే కాదు.. చిన్నప్పుడు ఈ కథ నేనూ చదివాను. నాకెందుకు చెబుతున్నావు?’’
‘‘నిన్ను చూస్తే వాడు బంగారంతో చచ్చిపోయినట్టు, ప్లాస్టిక్ నీ ప్రాణం తీస్తుందేమో అనిపిస్తోందిరా! మా ఇంట్లో ప్లాస్టిక్ బియ్యంతో వండిన అన్నమే అనుకుందాం. మరి మీ ఇంట్లో అన్నం ప్లాస్టిక్ బియ్యంది కాదని నమ్మకమేంటి? చివరకు ఎక్కడ అన్నం చూసినా నీకు ప్లాస్టిక్ కనిపిస్తుంది. తినలేవు, తినకుండా ఉండలేవు. ప్లాస్టిక్‌ను తిన్నాననే భావనతో కుంగి కృశిస్తావు. తిన్నా , తినకున్నా బతకలేవు’’
‘‘చూసిందాన్ని కూడా నమ్మవా? వీడియోలు చూపిస్తా చూడు’’
‘‘అదేదో సినిమాలో జూనియర్ ఎన్టీఆర్, సీనియర్ ఎన్టీఆర్ కలిసి డ్యాన్స్ చేశారు తెలుసా?’’
‘‘ఎలా సాధ్యం? సీనియర్ ఎన్టీఆర్ చనిపోయిన చాలా కాలానికి జూనియర్ హీరో అయ్యాడు కదా? ఐనా మనం మాట్లాడుకునే దానికి దీనికి సంబంధం ఏంటోయ్ ’’
‘‘చిన్నప్పుడు చక్కరను భూమిలో పాతి పెడితే చక్కెర పండుతుందని, విరిగిపోయిన పన్ను పాతిపెడితే బంగారం అవుతుందని అందరం గట్టిగా నమ్మేవాళ్లం ’’
‘‘అంటే అసలు కల్తీనే లేదంటావా? ’’
‘‘అవేం అపశకునపు మాటలు. కల్తీ లేని వస్తువే లేదు. కాలుష్యం, కల్తీ లేని జీవితమే లేదు.’’
‘‘అంటే వీడియో కూడా నమ్మవా? ’’

‘‘మరి నేను ఏకంగా జూనియర్, సీనియర్ ఎన్టీఆర్‌లు కలిసి డ్యాన్స్ చేసింది చూపిస్తా అన్నా నమ్మడం లేదు’’
‘‘ఆమ్లేట్ తినను అన్నందుకు ఇంత క్లాస్ తీసుకుంటావా?’’
‘‘సరే కోడిగుడ్డు గురించే మాట్లాడుకుందాం. హోల్‌సేల్ మార్కెట్‌లో కోడిగుడ్డు ధర మూడున్నర రూపాయలు’’
‘‘చైనా వాళ్లను నమ్మేందుకు వీలు లేదు. వాళ్లు ప్లాస్టిక్ గుడ్లను ఇండియాకు పంపిస్తున్నారు. ఇది ముమ్మాటికీ నిజం. వీడియోలు ఉన్నాయి. నువ్వు చైనాకు ఏజెంట్‌వేమో అని నా అనుమానం. పూర్వం సోవియట్ రష్యాలో ప్రతి ఒక్కరూ ఏజెంట్లుగా ఉండేవారట! రష్యా పతనం తరువాత ఇప్పుడు చైనా వాడిదే పెత్తనం పెరిగింది కదా? ఎవరు ఏజంటో, ఎవరు దేశద్రోహినో తెలియడం లేదు. ’’
‘‘ఔను.. చైనావాళ్లు పిల్లికళ్లతో ఉంటారు. వాళ్లు ఏమైనా చేయగలిగిన వాళ్లు.. గుడ్లు ఎందుకు పెట్టరు. ఒలింపిక్స్‌లో స్వర్ణ పతకాల కోసం పిల్లలను మర మనుషులుగా, బొమ్మలుగా మార్చి శిక్షణ ఇచ్చే వాళ్లు వ్యాపారం కోసం గుడ్లు పెట్టినా పెడతారు. వాళ్లే స్వయంగా రోజూ కొన్ని వందల గుడ్డు పెడుతున్నారు అనుకుందాం. ఆ గుడ్లను ఇండియాకు రహస్యంగా ఎలా తెస్తారు?’’
‘‘చైనా వాళ్లు గుడ్లు పెడతారు అని నేను అనడం లేదు. ప్లాస్టిక్ గుడ్డను పరిశ్రమల్లో తయారు చేసి పంపిస్తారు అంటున్నాను’’
‘‘ఏదైనా ఒకటే. మూడున్నర రూపాయలకు హోల్‌సేల్ మార్కెట్‌లో గుడ్డు దొరికితే, చైనావాడికి ఒక ప్లాస్టిక్ గుడ్డు తయారు చేసేందుకు ఎంత ఖర్చవుతుంది. దానిని ఇండియాకు దొంగచాటుగా ఎలా తెస్తారు? తేవడానికి ఎంత ఖర్చు. ప్లాస్టిక్ గుడ్లు చైనా నుంచి మన కంచం వరకు చేరాలి అంటే ఎంత మంది సహకరించాలి’’
‘‘నీకు ఇండియా కన్నా చైనాపైనే ప్రేమ ఎక్కువ కనిపిస్తోంది’’
‘‘నా ప్రేమ సంగతి తరువాత.. మన దేశ సరిహద్దులు దాటి ప్లాస్టిక్ బియ్యం, ప్లాస్టిక్ గుడ్లు , ప్లాస్టిక్ క్యాబేజీలు, ప్లాస్టిక్ మంచి నీళ్లు, చివరకు మనం పీల్చే ప్లాస్టిక్ గాలి చైనా నుంచి దేశంలోకి వస్తోంది అంటే మన దేశ ప్రజల కన్నా చైనా ఏజెంట్లే ఎక్కువ మంది ఉండాలి.’’
‘‘ ఇంతకూ ఏమంటావు?’’
‘‘ నువ్వనుకునేది నిజం.. అయితే ఈ దేశభద్రత ప్రమాదంలో పడినట్టు నేను అనుకున్నది నిజం అయితే మనిషి మనుగడ ప్రమాదంలో పడ్డట్టు..’’
‘‘అర్థం కాలేదు’’
‘‘డజను మంది టెర్రరిస్టులు వస్తేనే దేశం అల్లకల్లోలం అవుతుంది. కోట్లాది మంది తినే బియ్యం, గుడ్లు ప్లాస్టిక్‌వి యథేచ్ఛగా వస్తున్నాయంటే దేశ భద్రత ప్రమాదంలో పడ్డట్టే.. ప్లాస్టిక్ బియ్యం అబద్ధం అని టీవీ చానల్ వారికి తెలుసు.. సంచలనం కోసం ప్రసారం చేస్తున్నారు అని అనుకుంటే ఒక వార్త కోసం దేశాన్ని కూడా తాకట్టు పెడతారేమో అని భయం వేస్తోంది. ’’
‘‘అంతా కనూఫ్యూజ్డ్‌గా ఉంది. నిజం చెప్పండి.. మీ భార్యాభర్తలు ఇద్దరు నిజంగా మనుషులా? ప్లాస్టిక్ మనుషులా? ’’

‘‘మీ సంబరాన్ని నేనెందుకు కాదనా లి .. స్కై లాబ్ పడితే తో భూమి పై ఉన్న వారంతా పైకి పోతా రని మన చిన్నప్పుడు కూడా నమ్మి ఓ నెల రోజులు ఇవే చివరి రోజులు అని సంతోషంగా గడిపాం. 1999 లో యుగాంతం అని గట్టిగా వినిపించింది .. తరువాత తోక చుక్క అటు ఇటూ తోక ఊపుతుంది ఆ తోక తాకితే అంతే అని తెగ ప్రచారం జరిగింది 2000 సంవత్సరం రాగానే 2 కె సమస్యతో విమానాలు ఆకాశం లో నిలిచి పోతాయి. ఆస్పత్రుల్లో ఆపరేషన్ లు ఆగి పోతాయి కంప్యూటర్ తో పాటు మన గుండె ఆగిపోతుంది అంటే నమ్మలేదా ? అబద్దం అయినా నమ్మామ్ . నమ్మకమే జీవితం నమ్మితే కాస్త మజానే కానీ పోయేదేముంది నమ్ముదాం ’’*